NaReN

NaReN

Monday, August 2, 2021

మీ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోండి

 మీ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోండి

*


గ్యాస్ సిలిండర్ ని పైకి లేపకుండామీ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోండి.. లోపల ఎంత వరకు గ్యాస్ ఉందో ఈ చిన్న ట్రిక్ తో తెలుసుకోండి*


గ్యాస్ సిలిండెర్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఇది మనకు నిత్యావసరాల్లో ముందుంటుంది. ఎందుకంటే వంట చేసుకోవడానికి ఎక్కువమంది గ్యాస్ పైనే ఆధారపడతాం కాబట్టి. మనం రెండు బండలు కొనుక్కుని ఒకటి స్పేర్ ఉంచుకుంటాం. ఒకటి అయిపోగానే మార్చుకుని.. రెండవ బండ బుక్ చేసుకుంటూ ఉంటాం. ఇది అందరు సహజం గా చేసే పనే.


అయితే.. చాలా మంది గ్యాస్ బండ ఎంత బరువు ఉందో చెప్పడానికి చిన్న పరికరాలు వాడతారు. అది అందరి ఇళ్లలోనూ ఉండకపోవచ్చు. కొందరు గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం బండను షేక్ చేసి చూడడం, లేదా పైకి ఎత్తి చూడడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది అన్ని సమయాల్లోనూ శ్రేయస్కరం కాదు. ఈ చిన్న ట్రిక్ తో మీ బండ లో గ్యాస్ ఎంత వరకు ఉందో తెలుసుకోవచ్చు.


ఒక బౌల్ లో వాటర్ తీసుకోండి. ఒక క్లాత్ ను తీసుకుని దానిని వాటర్ లో ముంచి.. పూర్తి గా తడిసిన తరువాత బయటకు తీయండి. దానిని పిండి.. ఆ తడి గా ఉన్న గుడ్డతో బండను తుడవండి. గదిలో ఫ్యాన్ ను ఆపేసి ఈ బండను తుడవండి. ఒక నాలుగైదు నిమిషాల పాటు దానిని గమనిస్తే.. గ్యాస్ లేని భాగం లో తొందరగా ఆరిపోతుంది. గ్యాస్ ఉన్న కింద భాగం మాత్రం ఎక్కువ సేపు తడిగా ఉంటుంది.



ఈ తడిగా ఉన్న ప్లేస్ ఎక్కడివరకు ఉందో.. అక్కడవరకు మీ బండలో గ్యాస్ ఉందని అర్ధం. 

బండ ని పైకి లేపడం, వెయిట్ చూడడానికి ఆన్ లైన్ లో దొరికే రకరకాల మెజరింగ్ పరికరాలను ఉపయోగించడం అంత సేఫ్ కూడా కాదు.. చాలా సింపుల్ గా.. ఒక క్లాత్, వాటర్ తో ఈ ఎక్స్పరిమెంట్ ట్రై చేయచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఉండే బండలో ఎంత వరకు గ్యాస్ ఉందో చెక్ చేసుకుని అవసరమైనపుడు కొత్త బండ బుక్ చేసుకోవచ్చు.

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE