NaReN

NaReN

Sunday, June 18, 2023

మనం తినేటప్పుడు నీరు తాగవచ్చా

 Health Tips: మనం తినేటప్పుడు నీరు తాగవచ్చా.. లేదా అనేది పెద్ద సందేహం.. 


సాధారణంగా అత్యవసరమైనప్పుడు.. ముద్ద గొంతులో దిగనప్పుడు నీరు తాగుతాం.

కాని జనరల్ గా తినేటప్పుడు నీరు తాగకూడదని, తిన్న తర్వాత తాగాలని చాలామంది సూచిస్తుంటారు. కాని ఈవిషయంలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ఆహారం తినే సమయంలో గానీ, తిన్న తర్వాత వెంటనే గానీ నీరు తాగడం మంచిది కాదనుకుంటారు. ఆహారం తింటూ నీరు తాగితే అది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందనే భావన చాలా మందిలో ఉంటుంది. కొంత మంది ఆయుర్వేద నిపుణులు కూడా భోజనం చేయటానికి ముందు, చేసిన తర్వాత నీళ్లు తాగటానికి కనీసం అరగంట వ్యవధి ఇవ్వాలని సూచిస్తారు. అసలు తినేటప్పుడు నీరు తాగడం మంచిదా కాదా అనేదానిపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. భోజనం చేస్తున్నప్పుడు కూడా నీరు తాగొచ్చు. వాస్తవానికి నీరు ఎప్పుడు తాగినా మంచిదేనని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి ముందు గానీ, భోజనం చేసేటపుడు గానీ, భోజనం తర్వాత గానీ నీరు తాగితే జీర్ణ ఎంజైమ్‌లను పలుచన చేస్తుంది. తద్వారా జీర్ణక్రియ నెమ్మదవుతుంది అనే అభిప్రాయానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు నిపుణులు. భోజన సమయంలో నీరు తాగడాన్ని నివారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

మనం ఆహారంలోనే చాలా నీరు ఉంటుంది. భారతీయులు సూప్‌లు, రసాలు వంటి పలుచని ఆహారం తింటారు వాటిలో నీరు ఉంటుంది. అలాగే సలాడ్లు తింటారు అందులోనూ నీరు ఉంటుంది. కూరగాయల్లో నీరు ఉంటుంది, పెరుగు, మజ్జిగల్లోనూ నీరే ఉంటుంది. అంతేకాదు మనం ఆహారాన్ని నమలడం ద్వారా ఉత్పత్తి అయ్యే లాలాజలంలోనూ నీరే ఉంటుంది. మనం తినే సాంప్రదాయ ఆహారంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, అది ఏ విధంగానూ జీర్ణక్రియను ప్రభావితం చేయదు. కాబట్టి నీరు తాగకూడదు అనే దానిలో అర్థం లేదని పోషకాహార నిపుణులు అంటున్నారు.

చాలా మంది భోజనంతో నీరు తాగకూడదనే విధానం అనుసరిస్తారు. కొంతమంది గంట, 2 గంటల వరకు కూడా చుక్క నీరు తీసుకోరు. అయితే దీనివల్ల నిర్జలీకరణానికి గురయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇలా డీహైడ్రేషన్ కు గురైనపుడు దీర్ఘకాలిక మలబద్ధకం, మూత్రపిండాల్లో రాళ్లు వంటి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందని ఇప్పటికే నిరూపితమైందని చెబుతున్నారు. సాధారణ వ్యక్తి ప్రతిరోజూ 3 లేదా 4 లీటర్ల నీటిని తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Saturday, June 17, 2023

చివరి సర్టిఫికేట్

            చివరి సర్టిఫికేట్                                                                                                            

                  

       ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది.


     ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు.

  

     “చూడు నాయనా! విద్యుత్ బల్బులు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో  ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను, నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా.

                                                                                                            అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.


     ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వేలో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న సింగ్ గారు ఆర్మీలో మేజర్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న మెహ్రా గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను"*

"మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ."* *ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటి కి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది  అయినా ఒకటే.


     అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే.

ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి.


       మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటికి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి.

చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము.


     ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు..

 

     మన జీవితంలో ఎన్ని సర్టిఫికెట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే..

 

అదే డెత్ సర్టిఫికేట్.


  

Tuesday, June 13, 2023

మంగళవారం రోజు మంగలి షాప్లు ఎందుకు మూసి ఉంటాయి ?

 మంగళవారం రోజు మంగలి షాప్లు ఎందుకు మూసి ఉంటాయి ?


జుట్టు కత్తిరించుకోడాన్ని ఆయుష్కర్మ అంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా పని చేయరాదు. ముందుగా గడ్డం, ఆపైన మీసం, ఆ తరువాత తలమీద ఉన్న జుట్టూ తీయించుకోవాలి. ఆపైన చేతిగోళ్లు, చివరగా కాలిగోళ్ళు తీయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వరుసను అతిక్రమించరాదు. కొన్ని రోజులలో ఈ ఆయుష్కర్మ నిషిద్ధం. ఏకాదశి, చతుర్దశి, అమావాస్య పౌర్ణమి తిధులు నిషిద్ధాలు. ప్రతినెలా వచ్చే సంక్రాంతి కూడా నిషిద్ధమే. వ్యతీపాత, విష్టి యోగ కరణాలలో, శ్రాద్ధ దినాలలో నిషిద్ధం. వ్రతదినాలైతే కూడా క్షవరము చేయించుకోరాదు. ఆయుష్కర్మ చేయించుకునే వారాన్ని బట్టి ఆయుష్షు పెరగడం కానీ తరగడం కానీ ఉంటుంది. శుక్ర వారమైతే పదకొండు నెలలు, బుధవారం అయితే ఐదు నెలలు, సోమవార మైతే ఎనిమిది నెలలు ఆయుష్షు పెరుగుతుంది. గురువారమైతే ఆయుష్షు పది నెలలు పెరుగుతుంది. ఆదివారం క్షవరము చేయించుకుంటే ఆయుష్షు నెల రోజులు తగ్గుతుంది. శనివారం అయితే ఏడు నెలలు తగ్గుతుంది. మంగళవారం అయితే ఎనిమిది నెలలు తగ్గుతుంది. పూర్వం షాపులు లేని రోజుల్లో ఇంటికి వచ్చే మంగలి పని చేసేవారు. (ఈ పదం వృత్తిరీత్యా వాడబడింది కానీ కులాన్ని సూచించేది కాదు.) ప్రతిరోజూ ఉద్యోగానికి వెడుతూ, గడ్డం, మీసం కావలసినంతగా కత్తిరించుకుని వెళ్లే అవసరం కూడా ఆ రోజుల్లో లేదు. మంగలి అతను వచ్చి క్షవరకర్మ చేసి వెళ్ళాక అతని భార్య వచ్చి ఇంట్లో వారిచ్చిన అన్నము, పదార్థాలు తీసుకుని వెళ్ళేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పంచాంగం చూసి తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం చూసి క్షవరకర్మ చేయించుకునే పరిస్థితి లేదు. క్షవర కర్మ వృత్తిలో ఉన్నవారు కూడా షాపు తెరిచి అక్కడకు వచ్చిన వారికే ఆయుష్కర్మ చేస్తున్నారు. కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంచితే వారికి కిట్టదు. గృహ్య సూత్రాలలో చెప్పినదాన్ని పూర్తిగా వదిలివేయడానికి భారతీయులు ఇష్టపడరు అందుకే క్షవరం చేయించుకుంటే ఆయుష్షు అతి ఎక్కువగా పోయే మంగళవారాన్ని మాత్రమే సెలవు దినంగా స్వీకరించడం జరిగింది.*

Sunday, June 4, 2023

అరుగుదలకు అయిదు పద్ధతులు

 🔥అరుగుదలకు అయిదు పద్ధతులు


*ఈ రోజుల్లో చాలామంది ఫిట్‌నెస్‌ లేమితో బాధపడుతున్నారు. అంతేనా... సరిపడినంత నిద్ర ఉండడం లేదని ఆందోళన చెందుతున్నారు. మరికొందరైతే మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఫాస్ట్‌ ఫుడ్స్‌, ప్రోసెస్డ్‌ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌కు అలవాటుపడ్డం వల్ల జీర్ణక్రియ బాగా దెబ్బతింటోంది. వ్యాయామాలు చేయడానికి ఎవరికీ సమయం ఉండడంలేదు. వీటన్నింటి వల్ల రకరకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలామందిలో జీర్ణసంబంధ సమస్యలు ఎక్కువయ్యాయి. ఇవి దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే జీర్ణక్రియపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇందుకు సహకరించే ముఖ్యమైన ఐదు ఔషధ మూలికలు ఉన్నాయి. అవి మన వంటింట్లోనే ఉన్నాయి. అవేమిటంటే...*

 

🥔అల్లం

*మన వంటకాల్లో అల్లం తప్పనిసరి. ఇది రెసిపీలకు అదనపు రుచిని ఇవ్వడమే కాదు జీర్ణశక్తిపై కూడా బాగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్‌ యాసిడ్స్‌, జీర్ణం చేసే ఎంజైములను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో గ్యాస్‌ సమస్య తగ్గుతుంది.*

 

🫐నల్లమిరియాలు

*నల్ల మిరియాలు మంచి మసాలా దినుసు. దీని పొడిని కొన్ని రెసిపీలపై అలంకరణగా కూడా వాడతారు. ఈ మిరియాల్లో పైపరైన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారంలోని పోషకవిలువలను గ్రహిస్తుంది. కడుపులోని ఆహారం బాగా అరిగేలా చేస్తుంది. కడుపులో గ్యాసు లేకుండా నివారించడంతో పాటు కలుషిత పదార్థాలు లేకుండా శుభ్రం చేస్తుంది.*

 

🍒త్రిఫల

*మూడు ఔషధ ఫల మూలికల మిశ్రమం ఇది. దీన్ని ఉసిరి, కరక్కాయ, తనిక్కాయలతో చేస్తారు. దీనినే త్రిఫల అంటారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. ఇది జీర్ణ వ్యవస్థలో గ్యాసు చేరకుండా నిరోధిస్తుంది. జీర్ణకోశ కండరాల కదిలికలను సులభతరం చేస్తుంది. ఆహారం బాగా జీర్ణమయ్యేట్టు సహాయపడుతుంది. అజీర్ణాన్ని తగ్గిస్తుంది.*

 

🫘సోంపు

*సోంపును చాలామంది మౌత్‌ ఫ్రెష్‌నర్‌గా వాడుతుంటారు. నిజానికి సోంపు గింజల్లో జీర్ణవ్యవస్థకు ఉపయోగపడే ఔషధగుణాలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్రేవుల కండరాల కదలికలకి సోంపు బాగా సహకరిస్తుంది. జీర్ణవ్యవస్థలో చేరిన గ్యాసును బయటకు పోయేట్టుచేస్తుంది.*

 

🐚శంఖ భస్మ

*ఇది ఆయుర్వేద మందు. శంఖం నుంచి ఈ మందును ఆయుర్వేద నిపుణులు తయారుచేస్తారు. శంఖ భస్మ వల్ల ఆకలి బాగా వేయడంతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. గ్యాస్ర్టైటీస్‌ లాంటి జీర్ణసంబంధిత సమస్యల నుంచి సాంత్వననిస్తుంది. అయితే దీనిని జీర్ణ సంబంధిత సమస్యల నివారణకు ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో వాడితే మంచిది.*

పిగ్గీ బ్యాంక్

 పిగ్గీ బ్యాంక్                                                                                    

ఒక చిన్నబాబు అతని పిగ్గీబ్యాంక్ పగలగొట్టి అందులోని డబ్బులు లెక్కపెడుతున్నాడు...

చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు...మూడుసార్లు లెక్కపెట్టాడు.


తప్పు ఉండకూడదు అని తనకు తాను చెప్పుకుంటున్నాడు..

ఆ డబ్బులు తీసుకుని నెమ్మదిగా 

తన ఇంటి వెనకాల తలుపు నుండీ వెళ్ళి ఒక మందుల షాప్ దగ్గర నుంచున్నాడు..


షాప్ లో ఆవిడ తనవేపు చూసేవరకు ఎదురుచూస్తూ నుంచున్నాడు...

షాప్ ఆవిడ బాబుని చూసి అడిగింది.. ఏమి కావాలి బాబు అని..బాబు చెప్పాడు..

నాకు ఒక అద్భుతం కావాలి అని..

షాప్ ఆవిడ అర్ధం కానట్టూ ఏంటి బాబు సరిగ్గా చెప్పవా అని అడిగింది..


నాకూ సరిగ్గా తెలీదు..కానీ చెల్లికి ఆరోగ్యం ఏమీ బాలేదు కదా..నాన్న అంటున్నారు ఒక అద్భుతం మాత్రమే చెల్లిని కాపాడగలదు అని..చెల్లి చాలా కష్టపడుతోంది..అందుకే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చాను అద్భుతం కొనుక్కుని వెళ్దామని..అది ఉంటే చెల్లికి నయం అయిపోతుంది..అని అడిగాడు బాబు...


ఆవిడకి ఏమి చెప్పాలో అర్ధం కాలేదు..

ఇక్కడ అద్భుతాలు అమ్మము బాబు అని షాప్ ఆవిడ బాధగా చెప్పింది..బాబు మాటలకి విషయం అర్ధం అయ్యి ఆవిడకి బాధేస్తోంది....


నా దగ్గర డబ్బులు ఉన్నాయి అద్భుతం కొనేందుకు..అవి చాలకపోతే నేనింకా డబ్బులు తెచ్చిస్తాను..అని బతిమలాడుతున్నట్టుగా అడుగుతున్నాడు బాబు...


ఇంతలో బాబు పక్కనే ఇదంతా వింటున్న 

పొడుగ్గా ఉన్న , మంచిగా తయారయ్యి ఉన్న , హుందాగా ఉన్న ఒకాయన బాబుని అడిగారు...


ఏమిటి నీ చెల్లి సమస్య, నీకు తెలుసా అని ...

బాబు చెప్తున్నాడు..చెల్లికి తలలో చెడుది ఏదో పెరుగుతోందంటా..

అది బాగవ్వాలంటే సరిపడా డబ్బులు లేవు, అద్భుతం ఉంటే చెల్లి తప్పక బాగవుతుంది.

 అని నాన్న అమ్మకి చెప్తుంటే విన్నాను...సరే అదేదో కొందామని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తెచ్చేసాను, కావాలంటే ఇంకా డబ్బులు పోగేసి తెస్తాను..

అని చెప్తుంటే బాబుకి తెలీకుండానే అతని చిట్టి చెంపల మీద కన్నీళ్ళు జారుతున్నాయి....


ఆ పొడుగు మనిషి కొంచెం కిందకు వంగి బాబుని అడిగారు నీ దగ్గర ఎంత డబ్బు ఉందీ అని..బాబు చెప్పాడు 83 రూపాయలు...అని...అదీ వినపడి వినపడనట్టు..


ఓ అవునా ...తమాషా చూడు నీ చెల్లికి కావాల్సిన అద్భుతం కూడా సరిగ్గా 83 రూపాయలే..ఏదీ పద నా దగ్గర ఉన్న అద్భుతం నీ చెల్లెలికి సాయపడగలదేమో చూద్దాం.. అని నెమ్మదిగా ఒక చేత్తో బాబు చెయ్యి పట్టుకుని ఇంకో చేత్తో బాబు అందించిన డబ్బులు తీసుకుని చొక్కా జేబులో పెట్టుకున్నారు బాబు తృప్తి కోసం..


ఆయన ఒక పేరు పొందిన పెద్ద హాస్పిటల్ కి డైరెక్టర్...ఆయన ఒక్కరే చిన్నిపాప సమస్యకు వైద్యం చెయ్యగలరు...


ఆయన దయ వల్ల పాపకు ఒక్క పైసా కూడా ఇవ్వనక్కరలేకుండానే ఆపరేషన్ జరిగింది...తొందరగానే పాప ఇల్లు చేరి మునుపటిలాగా ఆరోగ్యంగా బాబుతో సరదాగా ఉండగలుగుతోంది...తల్లి అంటోంది...

ఎంత అద్భుతం జరిగిందీ అది కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టనక్కరలేకుండానే అని తండ్రితో అంటోంది...


అది విన్న బాబు నవ్వుకుంటున్నాడు. వాడికి మాత్రమే తెలుసు.

..ఒక అద్భుతం ఖరీదు 83 రూపాయలు అని...

కానీ ఒక అద్భుతం విలువ 83 రూపాయలు ప్లస్ ఆ చిన్ని బాబు అపార విశ్వాసం...

కల్మషం లేని ప్రేమ, స్వార్ధం లేని ప్రయత్నం తప్పక ఫలిస్తాయి..దేవుడిని నమ్ముకున్నవారికి ఏదో ఒక రూపేణా తప్పక సాయం అందుతుంది..

అది ఒక అద్భుతం లాంటి ఒక మంచి మనిషి మానవత్వం రూపంలో...

మనిషికి మనిషి సాయం చెయ్యాలి, అని అనుకోవాలి, అంతే.....................

Saturday, June 3, 2023

తాతయ్య స్ఫూర్తి


     తాతయ్య స్ఫూర్తి


      సరిగ్గా 60 సంవత్సరాల క్రితం ఒక చిన్న బాలిక *ఒక మర్రిచెట్టు కింద* కూర్చున్న ఒక పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు అయినా తన తాతకు గ్రామంలో ప్రతి ఒక్కరు ఇస్తున్న *గౌరవ మర్యాదలను* చూసి ఏంటి తాతయ్య ఈ ఊర్లో ప్రతి ఒక్కరు మీకు ఎనలేని  గౌరవం ఇస్తున్నారు. చివరికి మన ఊరు జమీందారు కూడా మీరంటే అంత అభిమానం అని అడగగా అదేమీ లేదమ్మా..!  అని చెబుతూనే..!  గ్రంథాలయానికి తీసుకెళ్లి ఇగో ఇక్కడ ఉన్న వందల పుస్తకాలను నేను చదవడం వల్ల అందులో ఉన్న విషయ జ్ఞానమంతా నాకు తెలియడం వల్లే నాకు  వారంతా గౌరవిస్తున్నారని చెప్పారు... అప్పుడు ఆ అమ్మాయి అమాయకంగా అయితే నేను *ఈ పుస్తకాలు📚 చదివితే* నాకు గౌరవం లభిస్తుందా..! అని అడగగా తప్పకుండా అని సమాధానం ఇచ్చారు.  ఇక సీన్ కట్ చేస్తే *ప్రతిరోజు అమ్మాయి తాతయ్య వెంట వెళ్తూ గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడం* ప్రారంభించింది  ఎప్పటిలాగే రోజు తాతయ్య వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే ఒకరోజు *నీకు పక్షి లాగా రెక్కలు* ఉంటే ఏమి చేస్తావమ్మా అని తాతయ్య అడగగా ఇప్పట్లాగే ఇంద్రధనస్సు పైకి ఎగురుతాను పక్షిలాగా ఆకాశంలో విహరిస్తాను అని కాకుండా పక్కూర్లో ఉండే గ్రంథాలయానికి వెళ్లి అక్కడ పుస్తకాలు చదువుతాను తాతయ్య అని భిన్నమైన సమాధానం రావడం గమనించిన తాతయ్య తనలో వచ్చిన మార్పును చూసి సంతోషపడ్డాడు. అలా చెప్తూనే అమెరికాలో ఆండ్రు కార్నిగి అనే వ్యక్తి తన సంపాదనతో ఎన్నో గ్రంథాలయాలు ఏర్పాటు చేశాడు ఆ విధంగా నీవు పెద్దయ్యాక కనీసం ఒకటి రెండు గ్రంథాలయాలన్న ఏర్పాటు చేయాలని తాతయ్య తన కోరికగా చెబితే ఓ తప్పకుండా తాతయ్య అని సమాధానం ఇచ్చిన బాలిక పెద్దయ్యాక కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఎన్నో పుస్తకాలు రచించి వేల కోట్ల అధిపతిగా చేరి ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో వేల గ్రంథాలయాలు ఏర్పాటు చేసి అనేక ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు ఏర్పాటు చేసిన అమృతమూర్తి మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి విద్యావేత్త *డాక్టర్ సుధా మూర్తి గారు.* 

     చూడండి మిత్రులారా..!ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఒక మర్రి చెట్టు కింద కూర్చున్న ఒక మధ్య తరగతి ఉపాధ్యాయులు అయిన తాత గారు తను చేస్తున్న కార్యకలాపాలు తన మనవరాలి రూపంలో ఎంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడో చూడండి. అందుకే మనం ఎక్కడున్నామన్నది కాదు..! ఎలా జీవిస్తున్నామన్నది చాలా ముఖ్యం. మన చర్యలే వారి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని నిర్మిస్తాయని మర్చిపోవద్దు. మనం చేసే మంచి, చెడు మొత్తం ప్రపంచం చూస్తుంది... అనుకరిస్తుంది. మన పిల్లలు *కలాం..! సుధా మూర్తి..* లాగా కావాలని కలలు కంటున్న ప్రతి తల్లిదండ్రులు *కాలం ఎంతో విలువైనది* అలాంటి కాలం మనం *పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఫోన్ నొక్కుతూ.. టీవీ చూస్తూ* గడపడం ద్వారా *కాలం అంత విలువైనది కాదు..!* అని పరోక్షంగా మన పిల్లలకు నేర్పుతూ వారి పతనానికి కారణం  అవుతున్నాం..! కాబట్టి మన కార్యకలాపాలలో, సమయ పాలనలో మీరే వారికి ఆదర్శంగా లేకపోతే ఎలా...! 

*మీరే ఆలోచించండి.*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత

 

*🌳పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత...*
*🔥అలా లేకపోతే పెను విపత్తే....*
*📢మనము ఏమి చేయగలమో చేయాలి...*
*🙏🏻స్వార్ధ ప్రయోజనాలకు ధ్వంసం చేస్తే ఊరుకోకూడదు.....*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*✅పర్యా హననం... పర్యవసానం....*
   మనం బతకటానికి ఏవేవీ ముఖ్యమైన అవసరమో - అవన్నీ ప్రకృతిలో ఉచితంగా, ధారాళంగా లభిస్తాయి. యథేచ్ఛగా వాడేస్తూ, వాటి ప్రాధాన్యాన్ని మనం అంతగా గుర్తించం. ఏవేవీ మనకు అంతగా అవసరం కాదో వాటి గురించి ఎక్కువ తాపత్రయపడతాం, ఈ అవగాహనలో ఉన్న లోపం కారణంగానే ప్రకృతిని మనం సరిగ్గా పట్టించుకోవటం లేదు. ఆధునిక జీవితం మొదలైన దగ్గర నుంచి ఈ అగాధం మరింత పెరిగింది. అర్థం చేసుకోవటానికి ఆలస్యమైనకొద్దీ అది ప్రమాదకరంగా పరిణమిస్తోంది. కాలగతులు మారిపోతున్నాయి. తీవ్రమైన ఎండలు.. భయంకరమైన చలిగాలులు వెంటాడుతున్నాయి. మంచుతుపాన్లు ముంచుకొస్తున్నాయి. ధ్రువప్రాంతాలు కరిగిపోతున్నాయి. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఊహించని ఉత్పాతాలు ఆకస్మికంగా తలెత్తుతున్నాయి. గుర్తించేలోపునే విలయ విధ్వంసం సృష్టించి పోతున్నాయి.
   ప్రకృతిలో మనిషికి ఉన్న బలం, తెలివీ మరే జీవికీ లేవు. యుక్తితో కూడిన శక్తి ముందు ఎంతటి మహా శక్తి అయినా తల వొంచాల్సిందే! ఐదారడుగుల మనిషి ముందు అలాగే వొంచింది ప్రకృతిలోని సమస్తం. ఎలా ఆడిస్తే అలా ఆడాయి జంతువులు. అధిరోహిస్తే అణగి ఉన్నాయి పర్వతాలు. తవ్వేకొద్దీ దారిచ్చాయి గనులూ, వనులూ. వెతికేకొద్దీ బతకనిచ్చాయి సముద్ర జలాలు. అన్వేషించే కొద్దీ అర్థమయ్యాయి ఆకాశ రహస్యాలు. పట్టణాలు, నగరాలు, మహా నగరాలు నిర్మితమయ్యాయి. నదుల మీద ఆనకట్టలు, పర్వతాల మధ్య ఇనప వంతెనలు, కొండల మధ్య కొంగొత్త నగరాలు, గమ్యాల మధ్య అతివేగ వాహనాలూ, క్షణక్షణ కాలంలోనే సమాచార విస్ఫోటాలు... విలసిల్లాయి, విస్తరించాయి. ఆధునిక జీవితం, అత్యద్భుత శాస్త్ర సాంకేతిక సామర్థ్యం ... అని అనుకుంటుండగానే- వెనక నుంచి ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి.
   ఎండలు తీవ్రం...వానల పెడముఖం.. అకాల వరదల ఉధృతం.. సునామీల బీభత్సం... పెనుగాలుల భయానకం.. తాగునీరు కాలుష్యం.. సాగునీరూ విషతుల్యం.. రుతువులు గతి తప్పి.. రుతు ధర్మాలు వికటించి .. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని దారుణ స్థితి! ఇలాంటి ప్రకృతి ప్రకోపాలు అనేకం చవిచూశాక- ఓసారి వెనక్కి తిరిగి చూస్తే- ఇదంతా మానవ స్వార్థం విచక్షణా రహితంగా ప్రకృతిపై సాగిస్తున్న అత్యాచారపు పర్యవసానం అని అర్థమవుతోంది. కార్పొరేట్‌ శక్తుల విపరీత లాభాల విజృంభణ ఫలితమని తెలుసొస్తోంది.
   మన వెనకటి తరాల జనం ప్రకృతిని ఆరాధించారు. దానిని ఆధారంగా చేసుకున్నారు తప్ప అధ్వానంగా, అత్యాశాపూరితంగా వ్యవహరించలేదు. ఇప్పటికీ కొండల్లో నివసించే వారు అంతే జాగ్రత్తగా ఉంటారు. వంట చెరకుగా ఎండిన చెట్లనే నరుకుతారు. పచ్చని చెట్లను నరకటం తప్పుగా భావిస్తారు. లాభాలను సంపాదించే స్వార్థపరుల కన్ను అడవిపై పడినప్పటినుంచే - అటవీ విధ్వంసం ప్రారంభమైంది. ఏ దేశంలోనైనా ప్రకృతి సమతుల్యంగా ఉండాలంటే- అటవీప్రాంతం 33 శాతం ఉండాలి. మనదేశంలో ఇప్పుడు 21.54 శాతమే ఉంది. అత్యల్పంగా ఉన్నది గుజరాత్‌లో 7.5 శాతమైతే, హర్యానాలో 4 శాతమే! మన రాష్ట్రంలో అడవులు జాతీయ సగటు కన్నా తక్కువ (17.27 శాతం). ఈ లెక్కలను బట్టే మన బాధ్యత కూడా ఉంటుంది.
   దాదాపు 400 ఏళ్ల క్రితం అమెరికా, యూరప్‌ దేశాల్లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. ఈ భూమిని కాలుష్యమయం చేయటంలో, కర్బన ఉద్గారాలతో పర్యావరణానికి హాని చేయడంలో వారి పాత్ర అప్పటినుంచీ ఉంది. భూమ్మీద ఉష్ణోగ్రతలు ఇంతగా పెరగటంలో సంపన్న దేశాలదే పెద్ద పాత్ర. తరువాతి కాలంలో ఆ దేశాలు కాలుష్యాన్ని వెదజల్లే యంత్రాలను, వాటి పరిజ్ఞానాన్ని మన లాంటి తృతీయ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేశాయి. తాము ఇప్పుడు తక్కువ కాలుష్యం సృష్టించే యంత్ర పరిజ్ఞానం వినియోగిస్తున్నాయి. అయినంత మాత్రాన ఇప్పటిదాకా సాగిన విధ్వంసానికి బాధ్యత వహించనంటే కుదురుతుందా? తొలినుంచీ ఎవరు ఎంత కారణమైతే అంత బాధ్యత వహించటం న్యాయం. అందుచేత పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత సంపన్న దేశాలదే!
   *దేశాలకు, ప్రాంతాలకు సరిహద్దులు ఉంటాయి. గాలికి, నీటికి, ప్రకృతికి ఏ హద్దులూ ఉండవు. ఎవరి ఊపిరికైనా ఒకటే గాలి. ఎవరి దాహానికైనా ఒకటే నీరు. ఇటువంటి అమూల్యమైన ప్రాణావసరాలను కాపాడుకోవటం మనందరి బాధ్యత. 'బతుకు - బతకనివ్వు' అంటుంది ప్రకృతి. దానిని పాటిస్తే- అందరూ బాగుంటారు. ఆ అందరిలో మనమూ ఉంటాం.*

 

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE