NaReN

NaReN

Sunday, January 8, 2023

నీరు - మీరు

నీరు - మీరు


*తగినంత నీరు తాగితేనే ఆరోగ్యం*

  

*రోజుకు 2-3 లీటర్లు చాలు*


*పని, ప్రదేశాన్ని బట్టి మోతాదు మార్చుకోవాలి*


*ఎక్కువైనా, తక్కువైనా అనారోగ్యమే*


*అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అధ్యయనంలో వెల్లడి*




*రోజూ నీరు తాగుతాం.సాధారణంగా దాహమేసినప్పుడు.. అన్నం తిన్నప్పుడు తాగుతుంటాం. కొందరు నియమంగా లెక్క పెట్టుకుని మరీ లీటర్ల కొద్దీ తాగుతుంటారు. ఎన్ని విశ్లేషణలున్నా.. మంచి ఆరోగ్యంతో తొణికిసలాడాలంటే రోజుకు ఎన్ని నీరు తాగాలనేది ఎక్కువమందికి ప్రశ్నే. ఈ క్రమంలో సాధారణ వ్యక్తి రోజుకు 7 నుంచి 10 గ్లాసుల నీళ్లు.. అంటే 2-3 లీటర్ల నీటిని తాగడం ద్వారా దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుందని అమెరికా పరిశోధకులు అధ్యయనపూర్వకంగా తేల్చారు. ఎండలో, వేడి ప్రదేశాల్లో పనిచేసేవారు, ఎక్కువ శారీరక శ్రమ చేస్తున్నవారు.. ఈ మోతాదును కొంత మేర పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. మొత్తంగా తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు అని స్పష్టం చేస్తున్నారు. తగినంత నీటిని తాగడం ద్వారా దీర్ఘాయుష్షును సొంతం చేసుకోవచ్చనే కోణంలో ఆ దేశానికి చెందిన ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌’ 30 ఏళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించింది. ఈ పరిశోధనలో 11,255 మంది పాల్గొనగా.. 30-45 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వారి ఆరోగ్య వివరాలను నమోదు చేశారు. వారు 70-90 ఏళ్ల వయసుకు వచ్చాక మరోసారి పరిశీలించారు. ఈ వివరాలు ‘ఇ బయోమెడిసిన్‌’ వైద్య పత్రికలో తాజాగా ప్రచురితమయ్యాయి. ఆ నివేదిక వివరాలతో పాటు ఆరోగ్యకర జీవనానికి తాగునీటి ఆవశ్యకతపై కిమ్స్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అకడమిక్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మణిమాలరావు పలు అంశాలను వివరించారు.*



*దాహమేసిన వెంటనే తాగాలి..*


*శరీరంలో 60-65% వరకూ నీరే ఉంటుంది. చిన్న పిల్లల్లో అయితే 80% ఉంటుంది. పురుషులతో పోలిస్తే మహిళల శరీరంలో నీరు కొంత తక్కువగా ఉంటుంది. శరీరంలో జీవక్రియల్లో ఉత్పత్తి అయ్యే మలినాలను కిడ్నీల ద్వారా బయటకు పంపించడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.*


*శరీరంలోని అంతర్గత కణాల్లో తాజా నీరు ఉంటుంది. కణాల వెలుపల సోడియంతో కూడిన నీరు ఉంటుంది. ఈ రెండింటి మధ్య నిరంతరాయంగా ఇచ్చిపుచ్చుకోవడాలు కొనసాగుతుంటాయి. ఈ ప్రక్రియ సరిగ్గా జరగనప్పుడు వ్యాధులు చుట్టుముడతాయి.*


*నీరు ఎక్కువ తాగినా అవేమీ ఒంట్లో నిల్వ ఉండవు. బయటకు వెళ్లిపోతాయి. పైగా ఆ నీటిని వడబోయడానికి కిడ్నీలు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ సమస్య లేకుండా ఎప్పుడు దాహమేస్తే అప్పుడు మంచినీరు తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. కనీసం దాహమేసిన 15 నిమిషాల్లోపు తాగడం మంచిది.*


*అయితే రోజువారీ నీటిని ఒకేసారి తాగడం మంచిది కాదు. ఒకేసారి తాగితే.. శరీరం ఎక్కువ నీరుందని భావించి బయటకు పంపించేస్తుంది. మరీ కొంచెం తాగితే.. ఆ నీళ్లను దాచిపెడుతుంది. రెండూ మంచిది కాదు.*


*మనం నిత్యం తినే కూరగాయలు, పండ్లలోనూ నీరు ఉంటుంది. ముఖ్యంగా బత్తాయి, నారింజ వంటి పండ్లను తింటున్నప్పుడు ఎక్కువగా నీటిని తాగాల్సిన అవసరం ఉండదు.*


*వయసు పెరుగుతున్న కొద్దీ కూడా నీరును ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు 65-70 ఏళ్లు దాటిన వారు అధికంగా నీరు తాగితే.. వారి కిడ్నీలపై త్వరగా దుష్ప్రభావం పడే అవకాశాలున్నాయి.*


*మరీ ఎక్కువ తాగితే?*


*ఒంట్లో ఎక్కువగా నీరు చేరడం వల్ల అన్ని అవయవాల్లోని కణాల్లో నీటి శాతం ఎక్కువవుతుంది. కణాల బయట ఉండాల్సిన సోడియం.. కణాల లోపలకు చేరుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. తల తిరగడం, తలనొప్పి, అయోమయం, రక్తపోటు పెరుగుతుంది. గుండె లయ తప్పుతుంది. కిడ్నీలపై భారం పెరిగి మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది.*


*తక్కువ తాగితే?*


*డీహైడ్రేషన్‌కు లోనవుతారు. కిడ్నీల పనితీరు మందగిస్తుంది. రక్తపోటు పడిపోతుంది. కండరాలు పట్టేస్తాయి. ఈ సమస్య ముదిరితే అవయవాల పనితీరు, జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది. మలబద్ధకం, తలనొప్పి, చర్మం-నోరు ఎండిపోవడం, నిస్సత్తువ సమస్యలు తలెత్తుతాయి. మూత్రం పసుపు పచ్చ రంగులోకి వచ్చిందంటే.. ఒంట్లో నీటి శాతం తగ్గిందని అర్థం చేసుకోవాలి. ఈ దశలో వెంటనే తగినంత నీరు తాగాలి. ఈ సమస్య ఎండాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది.*


*వృద్ధాప్యాన్ని వాయిదా వేయవచ్చు...*


*రక్తంలో సోడియం మోతాదులు, వివిధ ఆరోగ్య సూచీల మధ్య సంబంధాలను ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ద్రవాహారాలు తక్కువగా తీసుకున్నప్పుడు రక్తంలో సోడియం మోతాదులు పెరిగినట్లు తేల్చారు. వీటి మోతాదులు సాధారణం కంటే ఎక్కువగా ఉన్న వారికి దీర్ఘకాల జబ్బులు తలెత్తే ముప్పు పెరుగుతోంది.  శారీరక వయసు (పుట్టిన తేదీతో వచ్చే వయసు కాదు) అధికంగా ఉంటున్నట్టు, చిన్నవయసులోనే మరణించే ముప్పు పెరుగుతున్నట్టు పరిశోధనలో తేలింది. రక్తంలో సోడియం మోతాదులు పెరిగితే.. గుండె వైఫల్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు గతంలో చేసిన అధ్యయనానికి కొనసాగింపుగా తాజా పరిశోధనలోనూ ధ్రువీకరించారు. ఈ సమస్య పరిష్కారానికి ద్రవాల ప్రాధాన్యాన్ని ఇక్కడ నొక్కి చెప్పారు. అలానే తగినంత ద్రవాలు తీసుకుంటే వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింప చేేసుకోవచ్చని, దీర్ఘకాలం జబ్బులు లేకుండా జీవించవచ్చని అధ్యయనం తెలిపింది.*


*సోడియం స్థాయులు నిర్దేశిత మోతాదులో నియంత్రణలో ఉన్న వారిలో గుండె, ఊపిరితిత్తుల పనితీరు 70-90 ఏళ్ల వయసులోనూ మెరుగ్గా ఉన్నట్లు తేలింది. రక్తనాళాల్లో వాపు(ఇన్‌ఫ్లమేషన్‌) సమస్య కూడా తక్కువగా ఉంది.*

అద్దం

 *ఒక ముసలాయన రోజు అద్దం తుడుస్తూ కనిపించాడు.*


*ఇది గమనించిన ఒక యువకుడు…“తాతయ్యా! ఈ అద్దంలో ఏం కనిపిస్తుంది?” అని అడిగాడు.*


*”నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది, నేను చూస్తే నన్ను చూపెడుతుంది!.” అన్నారు తాతయ్య.*


*”అయితే ప్రత్యేకమైన అద్దమైతే కాదుగా మరి ఎందుకు అంత జాగ్రత్త?”అన్నాడు.* 


*”అద్దం నీకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది తెలుసా!” అన్నారు తాతయ్య.* 


*”అవునా అవి ఏంటో చెప్పండి!” అని ఆతృతగా అడిగాడు ఆయువకుడు.*


*“నువ్వు అద్దంలో కి చూడగానే నీ ముఖం పైన ఉన్న మరకను ఎంత ఉంటే అంతే చూపెడుతుందిగా?”అన్నారు.*


*”అవును.” అన్నాడు ఆ యువకుడు.*


*“ఎక్కువగానో తక్కువగానే చూపదుగా?”అన్నారు.*


*”అవును తాతయ్యా!” అన్నాడు.*


*”అద్దం లాగ నువ్వు కూడా నీ స్నేహితులకు నీతోబుట్టువులకు ‘ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి!’ అని అర్థం. తప్పైతే తప్పని,  ఒప్పైతే ఒప్పని, అంతే కానీ ఎక్కువతక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు!” అన్నారు.*

**ఇది మొదటి పాఠం!*


*”అద్దం ముందు నువ్వు నిల్చుంటే నిన్ను చూపెడుతుంది! నువ్వు లేకపోతే నిన్ను చూపెట్టదు!*

*అలాగే ‘ఎవరి గురించైనా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి, వారి వెనుక మాట్లాడకూడదు!’ అని అర్థం.*

**ఇది రెండవ పాఠం అన్నారు.*


*అద్దం మన ముఖంపైన ఉన్న మరకను చూపెట్టిందని కోపంతో  ఆ అద్దాన్ని పగలకొట్టం కదా, అలా ఎవరైనా మన లోపాన్ని మనకు చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా,  ‘మనలోని లోపాన్ని  సరిచేసుకోవాలి!’ అని చెబుతుంది.*

**ఇది మూడవ పాఠం అన్నారు తాతయ్య .*


*”ఇంత చిన్న అద్దంతో ఇన్ని పాఠాలా చాలా మంచి విషయాలు నేర్పారు తాతయ్యా మీకు కృతజ్ఞతలు!” అంటూ ఆ యువకుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను అనే  ఆనందంతో అక్కడనుండి వెళ్ళాడు.*..........                    

----------------------------------------

Saturday, January 7, 2023

ఇండియాలో మాత్రమే కనిపించే 11 రకాల శాఖాహారులు

 ఇండియాలో మాత్రమే కనిపించే 11 రకాల శాఖాహారులు.


1 - సంపూర్ణ శాఖాహారి (Pure vegetarian).!. వీరు శాఖాహారం తప్ప ఇంకేమి తీసుకోరు.


2 - కేక్ తినొచ్చు. కానీ.. గుడ్డు తినరు.!.

(కేకీ శాఖాహారి😀)


3 - కొంతమంది గుడ్డు తింటారు, కానీ మాంసం ముట్టరు.!.

(గుడ్డు శాఖాహారి🤣)


4 - చికెన్ గ్రేవీ తింటారు.!.

కానీ.. ముక్కలు ముట్టరు.!. 

(గ్రేవీ శాఖాహారి😂)


5 - బయట మాత్రం తినొచ్చు. కానీ.. ఇంట్లో అస్సలు మాంసం ముట్టరు.!. 

(నిర్బంధ శాఖాహారి🙄)


6 - తాగినప్పుడు మాత్రమే మాంసాహరి. మిగతా సమయాల్లో మాత్రం శాఖాహారే.!. 

(మత్తు శాఖాహారి🙃)


7 - కొందరు జంతువుల ద్వారా వచ్చే పాలు, పెరుగు, పాల పదార్థాలు తీసుకుంటారు.!. 

(పాల శాఖాహారి😜)


8 -  కొంతమంది ఇంట్లో మాత్రం మాంసాహారం వండరు కానీ బయటి నుండి పార్సల్ తెప్పించుకోని తింటారు.! 

(పార్సల్ శాఖాహారి😜)


9 - ఎవరైనా బలవంతం చేస్తేనే తింటారు.!. 

(బలవంతపు శాఖాహారి😜)


10 - మంగళ, గురు, శని వారాలు స్వచ్ఛమైన శాఖాహారి. మిగతా రోజుల్లో ఏదైనా తినెయ్యొచ్చు.!. 

(కేలెండర్ శాఖాహారి)😂😂


11 - ప్రత్యేక రోజుల్లో అంటే కొన్ని నెలలు, వారాల పాటు మాత్రం వీరు మాంసాహారం తినరు.!. 

(సీజనల్ శాకాహారి😜)

యాపిల్ పండును తొక్కతో తినాలా ?

 Apple : యాపిల్ పండును తొక్కతో తినాలా? తొక్క లేకుండా తినాలా ? ఎలా తింటే మంచిదో నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకోగలరు.


యాపిల్ పండు.. ఔషధాలు మెండు.. నిజమేనండీ.. ఒక్క యాపిల్ లోనే మన శరీరానికి మంచి చేసే అనేక విటమిన్లు, వ్యాధి నిరోధక శక్తని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

అందుకే వైద్యులు ప్రతి రోజు ఒక యాపిల్ తినమని పదే పదే చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే రోజూ ఒక యాపిల్ తింటూ ఉంటే అసలు డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదట. అనేక రోగాల నుంచి రక్షణ లభిస్తుందట. యాపిల్ పండ్లను తినని వారి కన్నా.. తినే వారిలోనే రోగాలను ఎదుర్కొనే శక్తి బాగా ఉంటుందట. ఇది అతిశయోక్తి కాదండోయ్! ముమ్మాటికి వాస్తవం. వైద్యులే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు.

తేడా ఎక్కడ ఉంది..?

అయితే యాపిల్ తినే విధానంలో కొంత తేడా ఉంటున్నట్లు వారు చెబుతున్నారు. తినే విధానంలో తేడా ఎంటా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి కొంత మంది యాపిల్ పండు పైన పొట్టు తీసేసి తింటూ ఉంటారు. దీని వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలను నష్టపోతామని నిపుణులు సూచిస్తున్నారు. అసలు యాపిల్ లో ఉండే ఔషధాలు ఏంటి? దానిని ఎలా తినాలి? ఎలా తినకూడదు? వంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గుజ్జు కన్నా పొట్టులోనే పోషకాలు..

యాపిల్ పండు తినే సమయంలో చాలా మంది ఎంచక్కా ఓ చాకును తీసుకొని దాని పైన పొట్టునంతా ఊడబెరికి.. లోపలి గుజ్జుని తీసుకుని తింటుంటారు. అయితే యాపిల్ లో గుజ్జులో కన్నా దానిపై ఉండే పొట్టులోనే 4 నుంచి 6 రెట్ల ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పొట్టును తీసేసి తినడం వల్ల ఆ పోషకాలను కోల్పోయినట్లు అవుతుందని వివరిస్తున్నారు. సాధారణంగా యాపిల్ పై పొట్టు 0.3 ఎంఎం నుంచి 0.5ఎంఎం మందంతో ఉంటుంది. ఇది ఫైబర్‌ గుణాలను అధికంగా కలిగి ఉంటుంది.

పొట్టు పెద్ద ఇమ్యూనిటీ బూస్టర్..

యాపిల్ పై పొట్టు శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందివ్వడంలో సాయపడుతుంది. దీనిలో అధికంగా ఉండే పాలిఫినాల్స్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి మన శరీరంలోకి వెళ్తే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాక పొటాషియం, విటమిన్ ఈ కూడా పొట్టులోనే అధిక మోతాదులో ఉంటాయి. లోపలి గుజ్జుతో పోల్చుకుంటే పొట్టులో ఇవి 2 నుంచి 4 రెట్లు అధికంగా ఉంటాయి. పొట్టుతోనే యాపిల్ తీసుకోవడం ద్వారా వ్యాధులు దరిచేరే అవకాశం ఉండదు.

విటమిన్ ల సమ్మేళనం..

యాపిల్ పండు అనేక రకాల విటమిన్ల సమ్మేళనం అని నిపుణులు చెబుతుంటారు. పొట్టుతో పాటు తింటేనే అవి పుష్కలంగా శరీరానికి అందుతాయని వివరిస్తున్నారు. సాధారణంగా
ఒక మీడియం సైజ్ యాపిల్ లో విటమిన్ సీ 8.5 మిల్లీగ్రాములు.. విటమిన్ ఏ 100ఐయూ మేర ఉంటుంది. అయితే పొట్టు తీసేస్తే వీటి శాతం గణనీయంగా తగ్గిపోయి.. విటమిన్ సీ 6.5 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ 60 ఐయూ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ యాపిల్ పండును పొట్టుతోనే తినాలి. పండును లోపలి గుజ్జుతో మాత్రమే తింటే దాని నుంచి ప్రయోజనం అంతగా ఉండదు.

కుక్కర్లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిదేనా ?

కుక్కర్లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిదేనా ? 

ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో  తెలుసుకోండి.

సాధారణం చాలా మంది ఇళ్లలో కానీ రూంలలో అన్నం ప్రెషర్‌ కుక్కర్లో వండుతుంటారు. ప్రెషర్‌ కుక్కర్లు లేని సమయంలో కట్టెల పొయ్యిపై, ఆ తర్వాత గ్యాస్‌ సిలిండర్‌పై గిన్నెలోనే వండేవారు.

ఇప్పుడు కాలం మారుతున్నకొద్ది విధానాన్ని మార్చుకుంటున్నారు.

ప్రెషర్‌ కుక్కర్లలో వండే వారు చాలా మందే ఉన్నారు. దీని వల్ల గ్యాస్‌ ఆదా కావడమే కాకుండా అన్నం త్వరగా అవుతుంది. మన దేశంలో అన్నం ప్రధానమైనది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ఆహారంగా చాలా మంది తీసుకుంటారు. అయితే ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం వండితే ఆరోగ్యానికి మంచిదేనా..? కాదా అన్న సందేహం కలుగుతుంటుంది. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే?

ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం వండుకుని తినడం ఆరోగ్యానికి మంచిదేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రెషర్‌ కుక్కర్‌లో వండే అన్నం రుచిగా ఉండడమే కాకుండా కుక్కర్‌లో వండిన అన్నంలో పిండి పదార్థం తొలగిపోతుందట. అంతేకాకుండా ఫ్యాట్‌ కంటెంట్‌ కూడా తక్కువగా ఉంటుంది. కుక్కర్‌లో వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్‌ లాంటి నీటిలో కలిగే పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక కుక్కర్‌లో వండిన అన్నంతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు. అన్నం సులువగా జీర్ణమవుతుంది. ఈ అన్నంలో ప్రోటీన్స్‌, పిండి పదార్థాలు, ఫైబర్‌ కంటెంట్‌ లాంటి పోషకాలు కూడా ఉంటాయట. ప్రెషర్‌ కుక్కర్‌లో వండటం వల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హనికర బ్యాక్టీరియా నశించిపోతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

Friday, January 6, 2023

చదువంటే ఇలాగేనా ?

 💐 *చదువంటే ఇలాగేనా ?*               

🤔 *ఆలోచిద్దామా* 💐 

అందరికీ నమస్కారం 

చాలా పెద్ద వివరణ కానీ కొన్ని మాటల్లో కొన్ని ఉదాహరణలతో....

ఇప్పటి వరకు మనం చదువు గురించి

తప్పు చేశామా, 

చేస్తున్నామా, 

చేయబోతున్నామా. 

తెలుసుకునేందుకు ఈ చిన్న సమాచారం దయచేసి చదవండి.🙏🏼ధన్యవాదాలు🙏🏼

పసుపులేటి నరేంద్రస్వామి




```స్కూల్  పిల్లలు ఇంటి కొచ్చాక హోమ్ వర్క్ చేస్తారు . హోమ్ వర్క్ అంటే ఇంటి పని . 

నిజానికది ఇంటిపని కాదు . 

చదువుకు సంబంధించింది .. 

స్కూల్ పని . 


పిల్లలు ఇంట కొచ్చాక చదవాలి . రాయడం ప్రాక్టీస్ చేయాలి . నిజమే కానీ .. 


1 . యూకేజీ పిల్లాడు.. కొన్ని పదాలు ఇచ్చి ఒక్కో దాన్ని పదేసి సార్లు రాయ మన్నారు . ఇదే హోమ్ వర్క్ . మాంగో అనే పదం . MANGO  🥭అని  ఒక్కో సారి.. మొత్తం పది సార్లు  పదం రాయాలి . కానీ ఆ పిల్లాడు...  M , M  అంటూ కిందకు కిందకు పది సార్లు రాసాడు . తరువాత A , A అని M పక్కనే పది సార్లు. ఇలాగే మొత్తం MANGO  అనే పదాన్ని రాసాడు.

అలాగే మొత్తం పదాలు రాసాడు . హోమ్ వర్క్ పూర్తయ్యింది . ఇప్పుడు ఆ పిల్లాడు నేర్చుకొన్నదేంటి ? 

ఏమీ లేదు . 

జస్ట్ మెకానికల్ గా రాసేసాడు.

స్పెల్లింగ్ రాదు . 

రాయడం ప్రాక్టీస్ కాదు . 

హోమ్ వర్క్ తంతు .. పూర్తయ్యింది . 

ప్రయోజనం  సున్నా . 


2 . రెండో క్లాస్ అమ్మాయి . రాత్రి హోమ్ వర్క్ పూర్తి చెయ్యాలి . కానీ త్వరగా నిద్ర పోయింది . 

పొద్దునే స్కూల్ వాన్ టైం అవుతోంది . హోమ్ వర్క్ పూర్తి కాలేదు .. "స్కూల్ కు వెళితే టీచర్ కొడుతుంది  . నేను వెళ్ళను" అని ఏడుస్తోంది .  .. మమ్మీ హోమ్ వర్క్ నోట్ బుక్ తీసుకొని తన కూతురి హ్యాండ్ రైటింగ్ ని అనుకరిస్తూ హోమ్ వర్క్ పూర్తి చేసింది . పాప స్కూల్  కు వెళ్ళింది . టీచర్" గుడ్" అంది . అమ్మ హ్యాపీ .. టీచర్ హ్యాపీ .. అమ్మాయి హ్యాపీ . కానీ నష్టం జరిగింది ఎవరికి ? ఎందుకీ హోమ్ వర్క్ తంతు ?


3 . ఏడో క్లాస్ అబ్బాయి . తెలుగు సబ్జెక్టు .


 "పర్యావరణం" అనే పాఠం . పది అడవి జంతువుల ఫోటోలు , పది పెంపుడు జంతువుల ఫోటోలు నోట్ బుక్  లో అతికించాలి . అదీ హోమ్ వర్క్ . సెల్ ఫోన్ వీడియో గేమ్స్ ఆడుతూ హోమ్ వర్క్ చేయకుండా నిద్ర పోయాడు . డాడీ ఆఫీస్ నుంచి వచ్చాడు . హోమ్ వర్క్ చూసిన మమ్మీ పక్కన ఉన్న బుక్  స్టాల్ కు వెళ్లి జంతువుల ఫోటోలు ఉన్న పోస్టర్ కొనుక్కొని వచ్చింది . డాడీ దాన్ని కట్ చేసాడు . మమ్మీ హోమ్ వర్క్ బుక్ లో అతికించింది .అసలు తెలుగు పాఠం దేనికి ? తెలుగు విని అర్థం  చేసుకోవడం  మాట్లాడడం ..చదవడం  రాయడం . ఇదీ నేర్పాల్సింది . ఆ బొమ్మలు అతికిస్తే ఏమి వస్తుంది ? ఏడో క్లాస్ పిల్లాడికి పులి,  సింహం అడవి జంతువులు ఆవు,  మేక పెంపుడు జంతువులు అని తెలియవా ? అయితే గియితే ఇది సైన్స్ పాఠం కావాలి . తెలుగు లో సబ్జెక్టు లో ఈ పాఠం లో నెరపాల్సింది .. { ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో } వైల్డ్ అనిమల్ అంటే అడవి  జంతువు.. carnivore అంటే మాంసాహారి .. బయో డైవర్సిటీ అంటే జీవ వైవిధ్యము .. ఇలాంటి విషయాలు కదా ? 

ఆ పోస్టర్ ఏంటి ? 

దాన్ని అమ్మ నాన్న  కలిసి బుక్ లో అతికిస్తే వచ్చేదేంటి ? 

ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు ? 


ఇలాంటి హోమ్ వర్క్ ఇవ్వరేంటి ?


1 . జరిగిన పాఠాన్ని రెండు సార్లు చదవండి . 


2 . రేపు జరగ బొయ్యే పాఠాన్ని చదివి అర్థం చేసుకొని టీచర్ లాగా బోధించడానికి ప్రయత్నించండి { రేపటి క్లాసులో }.


3 . ప్రతి రోజు ఆ ఆరోజు మీరు చేసినదాన్ని{ దిన చర్య } డైరీ గా రాయండి . దీని వల్ల రైటింగ్ ప్రాక్టీస్ . అంతకు మించి  చక్కటి మెమరీ అవుతుంది ." నేను తొమ్మిదో క్లాస్ లో వున్నపుడు ఇదిగో ఇలా.." అని రేపు మీ కూతురికో కొడుకుకో చూపించ వచ్చు అని పిల్లలకు చెప్పరెందుకు ?


3 . మీరు చదువు తున్న క్లాస్ కంటే రెండు మూడు క్లాస్ లు కింద చదువు తున్న మీ పక్కింటి,  పై ఇంటి పిల్లలకు ముఖ్యంగా మీ ఇంటి లో పని చేసే ఆయమ్మ పిల్లలు డ్రైవర్ పిల్లలు ఇలాంటి వారికి ఉచితంగా ట్యూషన్ చెప్పండి . ఒక పాఠాన్ని బోధించడ మంటే  ఆ పాఠాన్ని పది సార్లు చదివి నట్టు లెక్క . ఆ కాన్సెప్ట్ బాగా అర్థం అయి పోతుంది . సమాజ సేవ గా ఉంటుంది అని చెప్పరెందుకు ?


💐ఇంటి పనికి .... 

మరో కోణం :💐


గుండీ ఊడి పోయింది . దాన్ని ఎలా కుట్టాలి ? షూ పోలిష్ ఎలా చెయ్యాలి ? బట్టలు ఎలా ఉతకాలి ? ఉతికిన బట్టలు ఎలా ఐరన్ చెయ్యాలి ? వంట ఎలా వండాలి ? ఇల్లు ఎలా శుభ్రం చెయ్యాలి ? ఫ్రిజ్ వాడకం అవసరమే . కానీ అతిగా ఫ్రిజ్ వాడితే నష్టం ఏంటి ? మైక్రో వేవ్ ఒవేన్ తో ఆరోగ్యానికి జరిగే నష్టం ఏంటి ? 


తల్లి సోదరుడు మామయ్య.. తండ్రి సోదరుడు బాబాయ్ లేదా పెద్ద నాన్న . ఇద్దరినీ అంకుల్ అని పిలవడ మేంటి ? పక్కింటి పై ఇంటి వారిని అంకుల్ .. ఆటో అంకుల్ డ్రైవర్ అంకుల్ .. స్విగ్గీ అంకుల్ .. ఇదేంటి ? ఇదేమి ఆచారం ? ఇంటికి వచ్చిన బంధువులకు కుటుంబ మిత్రులకు ఎలా గ్రీట్ చెయ్యాలి ? ఎలా మర్యాదలు చెయ్యాలి ? అసలు మర్యాద చేయడమంటే వారికీ స్వీట్ లు హాట్ లు పెట్టి ఆల్రెడీ ఊబకాయం తో షుగర్ తో బిపి తో బాధ పడుతున్న వారిని మొగమాట పెట్టి అతిగా తినిపించి  ఆరోగ్యాన్ని మరో అడుగు చెడగొట్టే దశలో తీసుకొని పోవడ మేనా ? పిజ్జా లు బర్గర్ లు .. కాఫీ లు టీ లు .. లడ్లు జాంగ్రీలూ .. మురుకు లు...


ఇవేనా అతిథి మర్యాద వంటకాలు ?  మజ్జిగ , కొబ్బరి నీరు కొబ్బరి ముక్కలు- బెల్లం ముక్కలు , వేరు శనిగ గింజలు దానితో  పాటు డేట్స్ ఇలా ఆరోగ్య కరమైన స్నాక్ ఎందుకు ఇవ్వ కూడదు . వీటిని ఎలా తయారు చెయ్యాలి ..ఇలాంటి వాటిని పిలల్లకు నేర్పేది ఎవరు ?


పిలల్లి ఇంటికి రావడం తోటే" రేయ్ హోమ్ వర్క్ చెయ్యి" అని తల్లి వెంట పడడం .. వాడేమో ఎం ఎం ఎం అని మాంగో పదం రాయడం  హోమ్ వర్క్ అయ్యాక  .. బోర్ .. టీవీ ముందు సెల్ ఫోన్ తో ఆటలు . ఇదీ నేటి సీన్ . 


ఇది చదువు కాదు . చట్ట బండలు . పోనీ ఇంటి పని అయినా వచ్చా  అంటే అదీ రాదు .  . 


💐బతకడం నేర్పలేని చదువెందుకు ?💐


ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని రా అని తల్లి చెబితే గుర్రున చూసే  పదో తరగతి కూతురు ! బంధువులు వస్తే పట్టించుకోని పిల్లలు .. వంట వార్పూ .. ఇంటి పని తోట పని .. పిల్లలు  చేయడ మేంటి ? మా ఇంట్లో పని మనుషులు లేరా అనుకొనే తల్లి తండ్రులు .. 


 ఇంటి పని . కుట్లు - అల్లికలు వంట -  వార్పూ,  హౌస్ కీపింగ్,  అతిథి మర్యాదలు , డబ్బు- దాని విలువ , పొదుపు , ఆదాయం- ఖర్చులు , సమాజం-  భాద్యత .. ఇవన్నీ  ఒక్కో క్లాసుల్లో పిల్లల ఏజ్ బట్టి నేర్పితే ?.. దీన్నే  హోమ్ వర్క్ గా ఇస్తే?  .. ఇంటి కెళ్లి ఇవన్నీ అవసరాన్ని/ సందర్భాన్ని  బట్టి చెయ్యండి . మీ పని తీరు బట్టి మీకు  మార్కులు ఇచ్చేది మీ అమ్మ నాన్న అని పాటశాల చెబితే .. తల్లి తండ్రుల్ని కూడా హోమ్ గురువులుగా మారిస్తే ? 


1 . పిల్లలు బోర్ అనే మాట మరిచి పోతారు . సెల్ ఫోన్ కు,  టీవీ కి బానిసలు కారు .


2 . తల్లి తండ్రులు- పిల్లల మధ్య సంబంధం మరింత బల పడుతుంది . అమ్మ నాన్న కష్టాన్ని పిల్లలు సరిగా అర్థం  చేసు కొంటారు . భాద్యత ఎరిగి పెరుగు తారు . మానసిక పరిణతి వస్తుంది .


3 . పిల్లలో ఊబ కాయం రాదు . శారీరిక ఆరోగ్యం దృఢ పడుతుంది .


4 . సేవా భావం , సామజిక భాద్యత , శ్రమ పట్ల , శ్రమ జీవుల పట్ల గౌరవం , సహాను భూతి మొదలయిన నాయకత్వ లక్షణాలు పిల్లల్లో  ఏర్పడుతుంది . వారి బంగారు భవిత కు బలమైన పునాది పడుతుంది. 


హోమ్ వర్క్ నిర్వచనం మారాలి.


తంతుగా హోమ్ వర్క్ ఇవ్వడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ.


హోమ్ వర్క్ అంటే  ఇంటి పని. దీన్ని శాస్త్రీయంగా స్కూల్ లో టీచర్ బోధించాలి. ఇంట్లో  ప్రాక్టీకల్స్. ప్రాక్టికల్  చూసి మార్కులు  ఇచ్చేది ఆమ్మ నాన్న.. ఇదే రావాల్సిన మార్పు.


చదువంటే....... 

మార్కులు ర్యాంకు లు కాదు . 

బట్టీ చదువుల వల్ల ప్రయోజనం సున్నా . 


చదువంటే బతకడం నేర్పేది. చదువంటే రేపటి సంతోషకర జీవనానికి విద్యార్థిని సన్నద్ధం చేసేది.

 

తల్లిదండ్రులారా..

       ఉపాధ్యాయులారా.....

                 విద్యార్థులారా..........

రండి.. మార్పును ఆహ్వానిద్దాం !```


మీ 

పసుపులేటి నరేంద్రస్వామి

Tuesday, January 3, 2023

ఒక తెలుగు టీచరు

 

ఒక తెలుగు టీచరు పేపర్లు దిద్దాల్సివచ్చింది ఐదో తరగతి పిల్లలవి! 


అసలే మన ఇంగ్లీష్ మీడియం పిల్లలకు తెలుగు సవ్యంగా  రాకూడదని కదా రూలు! కాబట్టి వచ్చీరాని తెలుగులో ముద్దుముద్దుగా రాసారు  పరీక్ష ! 


కరెక్షన్ ఒక ఎత్తయితే , ఆనక పేరెంట్స్ వచ్చి మార్కుల కోసం తగువులాడటం

మరీ రసవత్తర ఘట్టం ! 


ఇదీ ప్రశ్న : లంకాధిపతి రావణుని చంపినది ఎవరు? (3మార్కులు)


నా బోటి కుర్రాడు 

"భీముడు" అని వ్రాశాడు సమాధానం.


నే కొట్టేశా. మార్కులివ్వలేదు.

తరవాత ఆ బాబు వాళ్ల తల్లిదండ్రులు వచ్చి కనీసం రెండు మార్కులైన ఇవ్వాలి.. attempt చేసాడు కదా అని వాదిస్తారు.


అసలెలా ఇస్తామండి? ఒక పదం సమాధానం ..అది తప్పు పూర్తిగా అని నేనంటే...


ఆవిడ జవాబు : 

రాముడు అనే మూడక్షరాల పదానికి 3 మార్కులైతే , మా వాడు రాసింది భీముడు అంటే ఒకే అక్షరం తప్పు.  ము,డు రెండూ కరెక్టైనపుడు రెండక్షరాలకు రెండు మార్కులు ఎందుకివ్వరు? చేసిన తప్పే కనిపిస్తోంది కానీ-రాసిన ఒప్పును ఒప్పుకోలేని మీరూ ఓ టీచరేనా ???


నేటి కాలం తల్లిదండ్రులు ఇలా కూడా ఉంటారు అనేందుకు ఓ చిన్న కథ.

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE