NaReN

NaReN

Wednesday, June 4, 2025

తల్లి కొరకు సంకల్పయాత్ర

 తల్లి కొరకు సంకల్పయాత్ర

స్కూటర్‌పై 98వేల కిలోమీటర్ల సంకల్పయాత్ర



పాత బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ నడుపుతూ కొడుకు.. వెనుక సీటుపై అమ్మ.. ఒకటీ రెండూ కాదు, ఇలా 98వేల కిలోమీటర్లు తిరిగి తిరుమలకు వచ్చారు ఈ తల్లీకుమారులు.


ఉల్లాసంగా ఉత్సాహంగా దూసుకుపోతున్న వీరిని పలకరించినపుడు ఆసక్తికరమైన అనేక సంగతులు పంచుకున్నారు. స్కూటర్‌ నడుపుతున్న దక్షిణామూర్తి కృష్ణకుమార్‌ది మైసూరు. బెంగళూరులోని ఒక కార్పొరేట్‌ సంస్థలో టీం లీడర్‌గా ఉద్యోగం. 2015లో తండ్రి చనిపోవడంతో అమ్మను బెంగళూరుకు తీసుకువచ్చాడు. జీవన సహచరుడ్ని కోల్పోయిన దుఃఖంలోంచి అమ్మను బయటకు తీసుకురావడానికి రోజూ ఆఫీసు నుంచి వచ్చాక ఆలయాల గురించి చెప్పేవాడు. ఆమె ఎంతో ఆసక్తిగా వినేది. ఒకరోజు ఎందుకో.. ' అమ్మా.. నువ్వు ఇప్పటిదాకా ఏయే ఆలయాలు సందర్శించావు?' అని అడిగాడు. నోటితో కాకుండా తొణికిసలాడే కన్నీటితో అమ్మ సమాధానం చెప్పింది. తన సమీపంలో ఉండే ఒక్క ఆలయానికి కూడా ఆమె ఇప్పటిదాకా వెళ్లనేలేదు అని తెలుసుకుని తల్లడిల్లిపోయాడు. 68 ఏళ్ల వయసు వచ్చినా ఇల్లు తప్ప ఆమెకు మరో ప్రపంచం తెలీదు. 'నీకు దేశంలో ఉన్న అన్ని ఆలయాలూ చూపిస్తానమ్మా!' అని కృష్ణకుమార్‌ తల్లికి మాటిచ్చాడు. ఉద్యోగం చేస్తూ అమ్మకి ఆలయాలన్నీ చూపించడం సాధ్యం కాదని అతనికి అర్థమైంది. 2018లోనే రూ.60 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. 2018 జనవరి 16న తన బజాజ్‌ స్కూటర్‌ మీదే 'మాతృ సేవా సంకల్ప యాత్ర' ప్రారంభించాడు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, అస్సోం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌, మణిపుర్‌, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్‌.. ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ తల్లితో స్కూటర్‌పై తిరుగుతున్నాడు ఈ 45 ఏళ్ల కుమారుడు. నేపాల్‌, భూటాన్‌కూ తల్లితో స్కూటర్‌పైనే వెళ్లాడు. ఇప్పటికి 98,109 కిలోమీటర్లు ప్రయాణించాడు. గురువారం తిరుమలకు చేరుకుని తల్లి చూడరత్నమ్మతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నాడు. తన సంకల్పయాత్రకు అవరోధం కాకూడదని కృష్ణకుమార్‌ పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకీ త్యాగం? అని అడిగితే, 'చనిపోయాక శ్రాద్ధకర్మలు ఘనంగా చేయడం కాదు.. బతికి ఉన్నపుడు సంతోషపెట్టడమే కొడుకుగా నా బాధ్యత' అని సమాధానం ఇచ్చాడు. ఈ సంకల్ప యాత్రలో ప్రయాణిస్తున్నది ఇద్దరు కాదు, ముగ్గురు. అంటూ తన స్కూటర్‌ వైపు మురిపెంగా చూశాడు. 'నాకు 21 ఏళ్ల వయసులో నాన్న ఇచ్చిన కానుక ఇది. దీని మీద తిరుగుతూ ఉంటే నాన్న కూడా మాతోపాటే యాత్రలు చేస్తున్నట్టుగా ఉంది. ఈ యాత్రకు ముగింపు లేదు. అమ్మా నేనూ ఓపిక ఉన్నంతదాకా ఇలా తిరుగుతూనే ఉంటాం. ఒక్కో గుడినీ సందర్శిస్తూ ఉంటే అమ్మ గొప్ప ఆనందం పొందుతోంది. నాకు జన్మనిచ్చిన తల్లికి ఇంతకన్నా ఏవిధంగా రుణం తీర్చుకోగలను?' అని అమ్మను అల్లుకుపోయి ఆనందంగా చెప్పాడు కృష్ణకుమార్‌.

కేజీ కి 900 గ్రాములే

 కేజీ కి 900 గ్రాములే 


ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు.  పాలు, పెరుగు,నెయ్యి,అన్నీ అమ్ముకుంటూ, తన భార్యతో 

జీవనం సాగిస్తుండేవాడు. కొన్ని  పాలని ఊరిలో అమ్మి, 

ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి, వారానికి ఒకసారి మార్కెట్ కు వెళ్లి అమ్మేవాడు.

భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్

సంచిలో kg బ్యాగ్స్ లో వేసి ఇచ్చేది.ఒకరోజు మార్కెట్ కు వెళ్ళి రోజంతా అమ్మి,ఒక కొట్టుకు వెళ్ళి అక్కడి  యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు , పప్పు, బియ్యం అన్నీ సరుకులు ఇంటికి తీసుకొని బయలుదేరాడు. అప్పుడు కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ ను తూకం వేసి చూశాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది.. 1kg లేదు కేవలం 900 గ్రాములే ఉంది.యజమాని అన్నీ తూకం చేసి చూస్తే  అన్నీ 900gm బ్యాగులే ఉన్నాయి.ఆయనకు చాలా మనసుకు బాధ అనిపించింది

ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే.నన్ను మోసం చేశాడే అని అనుకున్నాడు..


 మళ్ళీ ఒక వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మటానికి వచ్చాడు.

అప్పుడు యజమాని చెప్పాడు.. నా కొట్టుకు ఇకపై కాలు పెట్టకు నీవు మోసగాడివి నమ్మకద్రోహివి..నెయ్యి 1kg అని 900gm ఇస్తావా.. ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు అని గొడవ చేశాడు...


అప్పుడు ఆ పెద్దాయన వినయంతో యజమానితో ఇలా చెప్పాడు, అయ్యా నేను బీదవాడినే కానీ మోసగాణ్ణి కాదు.. నా దగ్గర తక్కెడ కొనే అంత డబ్బు లేదు.మీ దగ్గర తీసుకెళ్లిన 1kg చక్కెర  ఆధారంగా ఇంట్లో తక్కెడ లా చేసుకొని తూకం చేస్తాను అని చెప్పాడు..

అందుకు యజమాని తల వంచుకుని తన తప్పు తనకు తెలిసి సిగ్గు పడ్డాడు..


   మనం వేరేవారికి ఏం చేస్తామో

తిరిగి అదే మళ్ళీ మనకు జరుగుతుంది. అది మంచి కానీ చెడు కానీ, .గౌరవం కాని అవమానం కానీ,  దుఃఖం కానీ సంతోషంకాని,  మోసగించటం కానీ మోసపోవటం కానీ,  తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది.



పాలను ఆశించి గోవును పోషిస్తాము. గోవు నుంచి మనకు పాలు వస్తాయి. అంతే కాదు పేడ కుడా వస్తుంది. పాలు ఇంట్లోకి తెచ్చుకుంటాం. కాని, పేడని మాత్రం ఇంటి బయట వేస్తాం. ఆవు నుండి పాలు మాత్రమే రావాలి, పేడ రాకూడదు అంటే వీలు కాదు.


కర్మలు కూడా ఇలానే ఉంటాయి. ఏ కర్మ చేసినా అది పూర్ణంగా అర్ధవంతంగా ఉంటుందని చెప్పలేము. కొంత అభ్యంతరకరంగా కూడా ఉండవచ్చు. సంబంధాలు కూడా ఇలానే ఉంటాయి. ఏ సంబంధం లేకుండా....  ఎవ్వరితోనూ సంబంధం లేకుండా జీవించడం సాధ్యపడదు. కాని సంబంధాలలో కేవలం సంతోషమే ఉంటుందని చెప్పలేము. విషాదం కూడా కలిసి ఉంటుంది.


తల్లిదండ్రులు కావచ్చు , అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనతో కలిసి జీవిస్తున్న ఎవరైనా కావచ్చు.. వారిలో మనకు అన్ని నచ్చిన గుణాలే ఉంటాయని చెప్పలేము. మనకు నచ్చనివి వారు మేచ్చేవి కూడా ఉంటాయి.. అలాంటివి ప్రేమకి, సౌఖ్యానికి ప్రతిబంధకాలే కావచ్చు.. కాని అవి లేకుండా సంబంధాలు లేవు.

గులాబీల మధ్య ముళ్ళు తప్పనట్లు సంబంధాలలో ఈ విధమైన సంఘర్షణలు తప్పవు.


మనిషి జీవితంలో ఎన్నటికైనా ఏ అవసరం లేని క్షణం ఒకటి వచ్చి తీరుతుంది. కాని, బ్రతికున్నంత కాలం అవసరాలతో పాటు అప్పుడప్పుడూ తొంగిచూసే అనవసరాలను కూడా పెద్ద మనసుతో అంగీకరించే శక్తిని పెంచుకుంటేనే జీవితాన్ని ప్రశాంతంగా, ఉల్లాసంగా ఆస్వాదించగలం..



Monday, June 2, 2025

ఉపాధ్యాయుల పై విద్యార్థుల ప్రభావాలు...

 

ఉపాధ్యాయుల పై విద్యార్థుల ప్రభావాలు...

ఒక ఉపాధ్యాయుడిగా ప్రయాణం మొదలుపెట్టిన సూర్యాపేట జిల్లా, మోతే మండలంలోని  రాయికుంట తండా ప్రాథమిక పాఠశాలలో చదివిన విద్యార్థులు క్రియేట్ చేసిన గ్రూపులో  వారు షేర్ చేసిన అనుభవాలు.....
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
మాకు  విద్యా బుద్దులు నేర్పించి మమ్మల్ని ఈ స్థాయికి చేర్చిన మా గురువులకు పాదాభివందనాలు...
👏👏👏👏👏👏
గుర్తుకొస్తున్నాయి....గుర్తుకొస్తున్నాయి....

అదొక మారుమూల గ్రామం...కాలినడకి కూడా సహకరించని బాటలు....వర్ష కాలానికి జల దిగ్బంధంలో ఆ ఊరు....అలాంటి ఊరికి రోడ్డు మార్గ సదుపాయం కల్పించిన కీ||శే  గౌరవనీయులు శ్రీ కొండా లక్ష్మా రెడ్డి గారు అంతే కాకుండా మాలాంటి మారుమూల తండకి రోడ్డు వేస్తేనే రాక పోకలు ఉంటాయి...తద్వారా అభివృద్ది చెందుతుంది అని గ్రహించిన మహనీయులు....అలాగే మా తండాలో పాఠశాల నిర్మాణానికి సహకరించిన అప్పటి MEO పెద్ద జానయ్య గారు, పాండురంగం గారు మరియు కీ||శే  మిట్టు గారు , ఖండ్యా నాయక్ గారు....వీరి సహకార కృషి ఫలితమే మన ఊరి పాఠశాల....

ఒక్కసారి దీనికి ముందు....సంఘటన
మా ఊరికి దారి  వేసిన పెద్దలు లక్ష్మా రెడ్డి గారు అయితే ....మా జీవితాల్లో అక్షర జ్యోతి నీ వెలిగించిన గురువార్యూలు... ఉపేందర్ సార్
అది నేను  మొదటి రోజు పశువులశాల (పాఠశాల) కీ వెళ్ళిన రోజు...నిజమే నా మొదటి అక్షరం అమర్ సింగ్ వాళ్ళ పశువుల కొట్టం లో నేర్చుకున్న...
పలక మీద నేను రాయించుకున్న అ అక్షరం ఇప్పటికీ గుర్తుకు ఉంది.... లలిత చెల్లి గోల చేసింది అనే ఈ పద్యం మా క్లాస్ లో సొమ్లా చంటి మధు అందరూ లేచి చదివారు కానీ నాకు చదవడం రాలేదు.. ఆ రోజు ఉపేందర్ సార్ చేతిలో తిన్న దెబ్బల గాయం  ఇప్పటికీ నా మదిలో మానలేదు.... మమ్మల్ని ఇంటింటికి తిరిగి పాఠశాలలో చేర్పించి హాజరు తీసుకున్న విధానం...అప్పట్లో మీరూ చదువుకొండి...చదువుకుంటే మీకు రిజర్వేషన్ తోపాటు నౌకరీలు వస్తాయి అని ప్రేరేపించిన మీకు జన్మతః రుణపడి ఉంటాము....సార్

అలాగే మా రెండవ గురువు...గిరిబాబు సార్
మేము చదివే రీతిని మార్చిన గురువు గారు...రోజంతా చదివిన సాయంత్రం అయ్యేసరికి అక్షర దోష (డిక్టేషన్) పరీక్ష పెట్టేవారు...అప్పుడు నేను గెల్చుకున్న చిన్న ప్యాన్ ఇప్పటికీ నా మదిలో తిరుగుతూనే ఉంది....

అలా సాగుతున్న మా చదువులు...అప్పుడే పెను ఉప్పెన లాగ వచ్చిన మా చొక్కా రావు సార్....మాకు వచ్చినా కొద్దీ చదువులకు కొత్త పుంతలు తొక్కి కాంపిటీటివ్  పరీక్షలను పరిచయం చేసిన ఘనుడు....మార్గదర్శకుడు...తన కష్టార్జితమే...నరేందర్ నవోదయ సీటు ... ఆ ప్రభంజనమే నన్ను గురుకుల సీటు సాధించే టట్టు చేసింది అనడంలో అతియోశక్తి లేదు....ఒకరోజు హాజరు తీస్తుంటే నేను yes sir  అనలేదు... నా వక్రబుద్ధి కీ సార్ చేతి దెబ్బలు తినక తప్పలేదు....

నేను ఇప్పుడు చెప్పబోయే గురుద్వయం పేరు.. భరత్ బాబు సార్ & బ్రహ్మయ్య సార్
కేవలం విద్యా ఒక్కటే కాదు...విద్యతోపాటు  క్రీడలు కూడా మానసిక ఆహ్లాదకరానికి అవసరం అని గుర్తించి మనల్ని ఆ దిశగా నడిపించిన ఈ ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పినా తక్కువే....

చివరిగా ఒక గురువు గురించి చెప్పుకోవాలి..వారే రవీందర్ సార్
మన పాఠశాలను అత్యధిక హాజరుతో కూడిన విద్యార్థులను చేర్పించి...వారికి ఏకలవ్య  గురుకులలో సీటు సాధించేటట్టు ప్రణాళికలు చేసి...మన చిన్న నాటి పాఠశాల స్మృతులు చెరిగిపోకుండా చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించి ...మన పాఠశాల సంరక్షకుడిగా ఉండి మన భావితరాలకి ఇచ్చి ఈ మధ్యనే బదిలీ అయిన రవీందర్ సార్ కి మనమందరం రుణపడి ఉండాలి...
మన పాఠశాలలో చదివి వెళ్ళిన స్టూడెంట్స్ తర్వాత ఉర్లుగొండ స్కూల్ లో  టాపర్స్... అది ఇప్పటికీ ఎప్పటికీ ట్రెండ్...అది కదా మన పాఠశాల విద్యా భీజ వంగడం....
ఆచార్య దేవో భవ...
గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై గురవే నమః

ఇట్లు
గురుభక్తితో
మీ శిష్యుడు
భూక్యా నాగరాజు
S/o సూర్య
Branch manager
Canara bank
Hanamkonda
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

ఇన్లాండ్ ఉత్తరం


*ఇన్లాండ్ ఉత్తరం* 
- ఒక తీపి జ్ఞాపకం

వెనుకటి రోజుల్లో పోస్టు కార్డు కన్నా కాస్త ఎక్కువ రాయాలని అనిపించినప్పుడల్లా అందరూ ఎంచుకునే ఉత్తరం – ఇన్లాండ్ లెటర్. ఆ నీలి రంగు కాగితం మీద చక్కటి దస్తూరితో రాసిన మాటలు – అది కేవలం ఉత్తరం కాదు, మనసులో మాటల్ని భద్రంగా మోసుకొచ్చే ఒక పల్లకి .

ఇన్లాండ్ లెటర్ ఇంటికి వస్తే, అక్షరం చెదరకుండా, ఎంతో శ్రద్ధగా చింపి తెరవడం ఒక కళే! అందులో రాసిన ప్రతి అక్షరం, ప్రతి పదం చదవడం ఒక అనుభూతి. ఎవరి నుండి వచ్చిందో తెలుసుకునే కుతూహలం, రాసినవారి భావోద్వేగాలు చదివే క్షణాలు – ఇవన్నీ ఇప్పుడు స్మృతులే అయ్యాయి.

ఈ “ఇన్లాండ్ లెటర్”లు నశించిన ఈ ఆధునిక కాలంలో, వాటి స్థానం వాట్సాప్ మెసేజులు, ఈమెయిళ్లు, నోటిఫికేషన్లు ఆక్రమించాయి. కానీ వాటిలో ఆ మనసుని తాకే భావం శూన్యం. మనుషుల మధ్య మనసుల మధ్య అనుబంధానికి సాక్ష్యంగా నిలిచిన ఆనాటి ఉత్తరాలు, ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయాయి.

Monday, May 26, 2025

తండ్రితో బ్యాంకులో

 తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి

కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.?

తండ్రి ఆన్సర్ హైలైట్.!



_కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో  వేచి ఉన్నాడు._

_తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు_


_“నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు?”_


_“ఎందుకు చేయించుకోవాలి” అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు._


_“ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు”._


_internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు._


_*తండ్రి :* “అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా?”_


_”ఆవును అవును”, అని కొడుకు జవాబిచ్చాడు._

_“ఇంకా,… ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన వస్తువులు…_

_ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి”, అంటూ వివరించే ప్రయత్నం చేశాడు._


_*అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుక్కు ఇంక మాటలే లేవ్ !!!*_


_“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను._

_ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను._


_నీకు తెలుసు నేను ఒంటరివాడిని._

_నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే._

_నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను._


_రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చాడు._

_నాకోసం బాధపడ్డాడు…, కన్నీళ్లు కార్చాడు.., నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు._


_కొన్ని రోజుల క్రితం…అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది._

_మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు._


_నువ్వన్నట్టు online లో shoppingలు అవీ చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా.?_

_పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా.??_

_కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా..???_


_ఒక computer లేదా mobile phoneతో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే... నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక electronic పరికరమా!!!_


_నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడటం నాకిష్టం._

_నువ్వనే ఆ amazon flipkartలో నాకు ఇవన్నీదొరుకుతాయా?_

_కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలూ బలపడతాయి._


_*టెక్నాలజీ ఉండాలి కానీ.,*_

_*అది మాత్రమే జీవితం కాకూడదు !*_

_*దానికి మనం బానిసలం కాకూడదు!*_


_*మనుషులతో జీవించండి…..*_

_*పరికరాలను వాడుకోండి…..*_


_*” ప్రేమించవలసిన మనుషులను వాడుకొని,*_

_*వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి “*_


*తెగిపోతున్న మానవ సంబంధాల గురించి ఒక్కసారైనా అలోచించండి*

ఈ కథ పై మీ స్పందనలు 9848696955 వాట్సాప్ లో పంచుకుంటే ఇక్కడ పోస్ట్ చేస్తాను

Saturday, May 24, 2025

చిన్న సాయం పెద్ద మార్పు

 చిన్న సాయం పెద్ద మార్పు


 

అది బెంగళూరుకు వెళ్తున్న రైలు. రద్దీగా ఉంది. సెకండ్ క్లాస్ బోగీలో టీసీ చెక్ చేస్తుండగా ఓ పదమూడేళ్ళమ్మాయి పట్టుబడింది. ఆ పిల్లను ఆనాల్సిన నాలుగు మాటలూ అని మరికాసేపట్లో వచ్చే స్టేషన్లో దిగిపొమ్మని కటువుగా చెప్పాడు టీసీ.

ఆ మాటలకు బిక్క మొహం వేసుకుందా పిల్ల.


ఇంతలో అదే బోగీలో ప్రయాణిస్తున్న సుధామూర్తి (ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తిగారి భార్య) ఈ సన్నివేశాన్ని చూశారు. ఆమె టీసీతో "అంతా చూస్తూనే ఉన్నానండి. ఉన్నట్టుండి ఇలా మధ్యలో ఆ పిల్లను దిగిపొమ్మంటే ఎలా చెప్పండి. ఈ రైలు ఎక్కడి వరకూ వెళ్తుందో అక్కడిదాకా ఈ పిల్లకు టిక్కెట్ ఇవ్వండి. జరిమానాతోపాటు డబ్బు

నేనిస్తాను" అన్నారు. 


"వద్దండి. ఇలాంటి వాళ్ళకు సాయం చేయకండి. ఇలా మీరు చేశారని తెలిస్తే మరొకరిలా టిక్కెట్ లేకుండా ఎక్కుతారండి. ఇలాంటి వాళ్ళ పట్ల జాలి , దయా వంటివి చూపకూడదు" అని టీసీ గట్టిగా అంటున్నాడు.


అయినా ఆమె అవన్నీ పట్టించుకోకుండా ఆ అమ్మాయికి టిక్కెట్ తీసిచ్చారు.


ఆ తర్వాత సుధామూర్తి ఆ పిల్లను చేరదీసి ఆడిగారు ఎక్కడి నుంచి వస్తున్నావని. ఎవరూ ఏమిటి అనే వివరాలు అడిగారు.


ఆ అమ్మాయి చెప్పడం మొదలు పెట్టింది. 


ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. ఆమె తండ్రి తన తల్లి చనిపోవడంతో మరో పెళ్ళి చేసుకున్నాడు. ఆయన కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. తండ్రి ఉన్నంత కాలం సవతి తల్లి ఈ అమ్మాయిని బాగానే చూసుకుంది. తండ్రి పోయిన తర్వాత ఆ సవతితల్లి నానా మాటలు అనడం, కొట్టడం చేస్తోంది. దాంతో ఆ నరకయాతన భరించలేక ఈ అమ్మాయి పారిపోయి ఈ రైలెక్కింది. లక్ష్యం లేని దారీ తెన్నూ తెలియని జీవన ప్రయాణం ఆమెది. 


సుధామూర్తి ఆమె చెప్పిందంతా విన్నాది. 


బెంగుళూరూ స్టేషన్లో రైలు ఆగింది. 


ప్రయాణికులు దిగిపోతున్నారు. సుధామూర్తి కూడా దిగిపోయారు. ఆమెకోసం కారు ఆగి ఉంది. ఆ కారులో ఎక్కబోతున్న సుధామూర్తి కళ్ళు ఆ అమ్మాయికోసం చూశాయి. ఆ పిల్ల అక్కడే ఓ మూల నిల్చునుంది. ఆమె దగ్గర ఏమీ లేదు. కట్టుబట్టలతో వచ్చిన పిల్ల. 


సుధామూర్తి దగ్గరకెళ్ళి ఆ పిల్లను చేయి పట్టుకుని తనతో కారులో ఎక్కించుకున్నారు.


దార్లో తన మిత్రుడు నడుపుతున్న అనాథాశ్రమానికి కారును మళ్ళించింది. అక్కడ మిత్రుడితో ఆమ్మాయి విషయం చెప్పారు సుధామూర్తి. 

ఆ తర్వాత ఆమె మిత్రుడికి థాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు.


ఆ మిత్రుడు ఆ అమ్మాయిని తన హోమ్ లో చేర్చుకున్నాడు. అమ్మాయికి చదివించారు. ఆమెకు ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం వస్తుంది. కంపెనీ వాళ్ళే ఆ పిల్లను అమెరికా పంపించారు. ఈ కాలమంతా గిర్రున తిరిగింది.


అమెరికాలో ఉన్న కన్నడం వాళ్ళు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుధామూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆమె ఆ కార్యక్రమం కోసం అమెరికా వెళ్ళారు. అక్కడ ఒక అమ్మాయి దగ్గరుండి సుధామూర్తికి అవసరమైన ఏర్పాట్లన్నీ చూసారు. అంతేకాదు ఆఖరిరోజు సుధామూర్తి లాడ్జింగుకి కట్టాల్సిన బిల్లు కోసం కౌంటర్ కి వెళ్ళారు. అయితే కౌంటర్లోని వారు "వద్దండి. మీ బిల్లంతా ఓ అమ్మాయి కట్టాశారండి" అన్నారు.


"ఎవరా అమ్మాయి? చెప్పగలరా? " అని సుధామూర్తి అడగ్గా ఓ రెండు మూడు అడుగులు వెనకే ఉన్న అమ్మాయిని చూపించారు.


"మీరెందుకమ్మా నా ఖర్చుకి pay చేశారు" అని అడగ్గా ఆ అమ్మాయి ఒక్కసారి రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి దొరికిపోయిన దగ్గర్నించి ఇప్పుడు బిల్లు పే చెయ్యడం దాకా తన జీవితంలో జరిగిన సంఘటనలను చెప్తూ ఆ పిల్ల తానేనని అంది. 


"మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కనీసం నాకు ఈ ఒక్క చిన్ని అవకాశమైనా కలిగింది....మీ బిల్లు నేను pay చెయ్యడం చాలా చిన్నది. నావల్ల అయిందిదే" అంటూ ఆ పిల్ల సుధామూర్తి కాళ్ళకు దణ్ణం పెడుతుంది. 


ఆ పిల్లను చూసి సుధామూర్తి ఆశ్చర్యపోయారు. ఆమెను గట్టిగా హత్తుకున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ అప్రమేయంగా కన్నీళ్ళు కారాయి..

అందుకే సహాయం చెయ్యాలి.. ఒక వేళ వారు మోసం చేస్తే వాళ్ళు ఏనాటికైనా ఖర్మ అనుభవిస్తారు.. నిజంగా వారి అవసరత నిజమైతే ఒక జీవితమే మన వల్ల ఆనందిస్తుంది.



Monday, May 19, 2025

Zoom

 *సమస్త మండల విద్యాధికారులకు మరియు Course Incharge లకు తెలియజేయునది ఏమనగా, రేపు అనగా తేదీ 20.05.2025 రోజున జిల్లాస్థాయి మరియు మండల స్థాయిలో ఉపాధ్యాయులకు 5 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమవుతున్న సందర్భంగా గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి గారు ZOOM MEETING ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని జిల్లాలో ఒకేసారి ఉదయం 9.00 గంటలకు ప్రారంభిస్తారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొనుటకుగాను జిల్లా, మండల స్థాయి శిక్షణ కేంద్రంలో IFP లలో ఉపాధ్యాయులందరూ వీక్షించుటకు /పాల్గొనుటకు అనుగుణంగా ఇంటర్నెట్,  వెబ్ కామ్ మరియు శిక్షణ నిర్వహణకు సంబంధించిన ఇతర  ఏర్పాట్లు పూర్తిచేసుకుని సిద్ధంగా ఉండగలరు.*


*క్రింది లింక్ ద్వారా IFP ప్యానెల్ లో జిల్లా స్థాయి ZOOM MEETING లో పాల్గొనగలరు.*



Click https://zoom.us/j/98301963009?pwd=UkkhCtahZbw3nyveirG9SkXaXDjkCV.1 to start or join a scheduled Zoom meeting.

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE