NaReN

NaReN

Thursday, October 31, 2024

అమ్మానాన్నల ఫోన్

 అమ్మానాన్నల ఫోన్


రాత్రి భోజనాల తర్వాత ఒకటీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది...


ఆమె పిల్లలు పడుకున్నారు!


భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు.


చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది.


ఆ  ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు!


"ఏమైంది? ఎందుకు  ఏడుస్తున్నావు? ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.


 నిన్న నా సెకండ్ క్లాస్  విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.


"అయితే...?"


"ఇదిగో! ఈ చివరి  పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు!!"


భర్త ఆసక్తిగా...."అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"


హెడ్డింగ్ ఇలా పెట్టాడు


💥నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక.💥


అమ్మానాన్నలు  స్మార్ట్ ఫోన్ ను చాలా ప్రేమిస్తారు!


వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా... శ్రద్ధగా... ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా...!!


నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు! ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు!


అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే... ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు.. ఫోన్  చేతిలోకి తీసుకుని  జవాబిస్తారు!


కానీ... నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు!!  ...

నేను  ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు!


వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడు కోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు!


వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు! 

అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే!


అదే ఒకవేళ నాతో  మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే  ఫోన్ కి జవాబిస్తారు!


అమ్మానాన్నలు

స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు!

ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు!

దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు!

దాన్ని చాలా ఇష్టపడుతారు!!

దానితో రిలాక్స్ అవుతుంటారు!!

దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు!!


దానిని ఎపుడు పనివాళ్ళకి అప్పగించరు


నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోన్ ఒక్కగంట పనిచేయకపోతే చాలా కంగారుపడతారు హడావిడి చేస్తారు 


రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు!!

ఉదయం లేవగానే దాన్నే  చేతిలోకి తీసుకుంటారు!!


కాబట్టి! నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్న  చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను!! 


భార్య చదువుతుంటే... విన్న  భర్తకు మనసంతా పిండేసినట్లైంది!! అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా...

"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.


"మన కొడుకు" అంది భార్య కన్నీరు కారుతుండగా!


వస్తువులను ఉపయోగించుకోవాలి!

బంధాలను ప్రేమించాలి!!


అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే... క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి!......


ఇది నిజంగా జరిగిన కథ.. 


కాబట్టి ఇలాంటి కథలో తల్లిదండ్రులు మీరు కాకండి ..🙏


🙏దయచేసి ప్రతిఒక్కరూ ఆలోచించండి 🙏


మీ గుండెను తాకితే ... మరికొన్ని గుండెలకు చేర్చండి ,,, కొంతమందైనా మారే అవకాశం కల్పించండి...

20కే భోజనం

 20కే భోజనం

విజయవాడ నడిబొడ్డున మొగల్రాజపురం.

శిఖామణి సెంటర్లో #మన_భోజనశాల.

ఇద్దరు మిత్రులు కలసి #ఈశ్వర్_ఛారిటీస్ పేరిట ఆ భోజనశాల నడిపిస్తున్నారు. 20 రూపాయలకే ఆరోగ్యకరమైన భోజనం పెడుతూ రోజుకు సుమారు 400 మంది కడుపు నింపుతున్నారు. పోటీ పరీక్షలకు వచ్చే యువత, నిరుద్యోగులు, విద్యార్థులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగుల బంధువులు, వ్యక్తిగత పనుల నిమిత్తం నగరానికి వచ్చేవారి ఆకలిని అతి తక్కువ ఖర్చుతో ఈ భోజనశాల తీరుస్తోంది. ఒక దాతకు సంబంధించిన సోదరి భోజనశాల నిర్వహణ మొత్తం చూసుకుంటున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు భోజనశాల తెరిచి ఉంటుంది.

***

#మేమూ_రుచి_చూశాం

మాటల సందర్భంలో మన భోజనశాల ప్రత్యేకతను సీనియర్ జర్నలిస్ట్, మా కొలీగ్ శ్రీ ఎం.గురువారెడ్డి చెప్పగా.. ఆశ్చర్యపోయాను."సార్.. మనమూ ఓసారి వెళ్దాం" అంటే.. ఓకే అన్నారు. ఇది జరిగి సుమారు నెల గడిచిపోయింది. ఈ రోజు ఉదయం ఆయనే ఫోన్ చేసి.. "వెళ్దామా" అనడిగారు. అడిగిందే తడువుగా క్షణాల్లో రెడీ అయిపోగా.. ఇద్దరం కలసి 12.07 సమయంలో వెళ్లాం. అక్కడి కౌంటరులో 40 రూపాయలు చెల్లించి రెండు టోకెన్లు తీసుకున్నాం. అప్పటికే సుమారు 20 మంది భోజనం చేస్తుండటం కనిపించింది. మరో కౌంటర్లో టోకెన్లు అందచేసి భోజనం ప్లేట్లు, కూర, మజ్జిగ తీసుకుని.. అక్కడే సుఖాశీనులమై భుజించాం. మాకైతే కడుపు నిండిపోయింది. ఎక్కువ భుజించే అలవాటున్న వారు ఇంకో 10 రూపాయలు అదనంగా చెల్లిస్తే మరో పెద్ద కప్పు నిండా అన్నం ఇస్తారు. ఎంత ఎక్కువ తినేవారైనా రెండో కప్పు అన్నంతో కచ్చితంగా కడుపు నిండిపోవాల్సిందే.

***

#నిర్వహణ_భేష్

ఉదయం 8 గంటల నుంచే వంట చేయటం ఆరంభించి.. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఆహారం అంతా సిద్ధం చేస్తారు. నిర్దేశించిన వేళల ప్రకారం.. ఏ సమయంలో వచ్చినా.. ఆహారం వేడివేడిగానే వడ్డిస్తుండటం వీరి ప్రత్యేకత. ప్రధానంగా భోజనంలో రెండు మూడు కూరగాయలతో వండే ఒక కూర, ఒక పెద్ద కప్పు నిండా అన్నం, సాంబారు, వాము, కొత్తిమీర వంటివి కలిపిన మజ్జిగ కూడా ఇస్తున్నారు. వీటితో పాటు రోజూ తప్పకుండా ఏదో ఒక  రోటి పచ్చడి తయారు చేసి పెడుతున్నారు. ఈ రోజు ఏం పెడతారనే మెనూ బోర్డు సైతం అక్కడ కనిపిస్తుంది. భోజనశాలలో శుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు. పనిచేసే వారి దగ్గర నుంచి వినియోగించే వస్తువుల వరకు అన్నింటినీ బాగా శుభ్రం చేసిన తరువాతే ఉపయోగిస్తారు. ప్లేట్‌లో అన్నం వడ్డించే ముందు వేడి నీటిలో కడిగి పెడుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యంత్రాన్ని కొనుగోలు చేశారు. భోజనం పూర్తయ్యాక.. ఎవరికి వారు ప్లేట్, కప్పులను వాష్ బేసిన్ పక్కనే ఉండే కన్వేయర్ బెల్ట్ పై ఉంచితే.. ఎప్పటికప్పుడు యంత్రంలో క్లీన్ అయ్యే ఏర్పాటు చేశారు. అక్కడ రోటి పచ్చడి చేయడానికి మిక్సీలు, గ్రైండర్లు వినియోగించడం లేదు. పాత పద్ధతిలోనే రోలులోనే తయారు చేస్తారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సేవాభావంతో ఆహారం అందిస్తున్నారని తెలిసి.. తిన్న వారంతా అభినందించి వెళుతున్నారు.

***

#అవసరార్థులు_తప్పక_వెళ్లండి 

సేవాభావంతో భోజనశాల నిర్వహిస్తున్న #ఈశ్వర్_చారిటీస్ ఇద్దరు మిత్రులకు లోలోపలే ప్రణామాలు అర్పించుకుంటూ అక్కడ నుంచి బయటకొచ్చాం. వచ్చిన వాళ్లు సామాన్యులా.. గొప్పవాళ్లా అనేది అక్కడెవరూ పట్టించుకోరు. అవసరార్థులు ఎవరైనా ఆ ప్రాంతానికి వెళితే.. మన భోజనశాలను సందర్శించాలని సూచన 🙏🙏      



కవి భార్య

 కవి భార్య


ఓ కవిని ఆతని భార్య, మురిపెంగా, అడిగిందిలా


"ఏమండీ ! మీరెపుడూ అమ్మ గురించే రాస్తారు, భార్య గురించి రాయరా?"


అంతే, అతని కలం పరుగులు తీసింది ఇలా .....


ఎవరో నీవు చందమామంత అందం లేదు కలువ భామంత సుకుమారం లేదు


సరస్వతీ దేవంత చదువు లేదు కనక మాలక్ష్మంత ధనం లేదు పార్వతీ దేవంత శౌర్యం లేదు


కన్నుల నిండా వెన్నెల మనసు నిండా కరుణ


మాటల్లో తేనెలా కమ్మదనం ఆకలైతే కడుపు నింపే అమ్మదనం


ప్రేమలో నాలో ఐక్యమయ్యే కనకాంబరం


ఆకాశమంత నీకు నా బతుకంతా నీవైన నీకు రెండు అక్షరాల 'భార్య' పదం చాలునా ?

గృహస్తాశ్రమ ధర్మాలు నీతోనే వానప్రస్తాశ్రమ ధర్మం నీతోనే ధర్మేన అర్థేన కామేన నాతిచరామి నీతోనే


మా అమ్మ నాతో చెప్పిన మాట ఆ చేయి పట్టుకోరా


మీ అమ్మ నీతో చెప్పిన మాట ఆ చేయి విడువకమ్మా


అలా నా దీపమైనావు నా ఇంటి మణిదీపమైనావు నా జీవితపు మణి ద్వీపమైనావు


పాలేవో నీరేవో తెలియనంతగ కలిసాం


వెన్నెలైనా చీకటైనా కలిసి ఒక్కటై సాగాం


నాలో నీవు ... నీలో నేను అమరమైన ఈ అద్వైతంలో వేలకొద్దీ తీయని గురుతులే ఎగిరే సీతాకోక చిలుకల్లా కమ్మని కవితలా .. మధుర గీతంలా మధు మాసంలా ..


అర క్షణంలో ఆవిరై పోయే కోపతాపాలు మరుక్షణంలో కలిసిపోయే అనుబంధాలు.

అదే అదే నీవు నేర్పిన భార్యాభర్తల బంధాలు


గొప్ప బహుమతులు వద్దంటివి ప్రేమతో ఇచ్చే చిన్ని జ్ఞాపకాలు చాలంటివి


భూతల్లి పిలిచేవరకు కష్టమైనా సుఖమైనా


నీతోనే నీతోనే


కన్నుల్లో నిలిచావు కంటిపాపలా


గుండెల్లో ఉన్నావు గుండె సవ్వడిలా


"మన జీవన లీల ఆనంద హేల"


ఋణం ఉండి కలిసామో ఋణం తీర్చుకోవడానికి కలిసామో తెలియదు కానీ


నీవో అద్భుతానివి నేనో నిమిత్ర మాత్రుడను


ప్రతి ఇంటిలో ప్రతి భర్తలో ఆకాశమంత 'ప్రేమైన' నీకు రెండక్షరాల 'భార్య' అను పదం చాలునా?

ఓ దేవతలారా ! ఓ కవి శ్రేష్ఠులారా !


ఈమెకో పేరు సూచించండి అమ్మలా .... తీయగా ఉండేలా !😊

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE