NaReN

NaReN

Friday, February 16, 2024

మైక్రోసాఫ్ట్‌లో స్వీపర్

 మైక్రోసాఫ్ట్‌లో స్వీపర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ముగించుకున్న సుబ్బారావుతో -


''మీ పనైపోయింది. మీ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇమెయిల్ లో పంపిస్తాం'' అన్నారు హెచ్.ఆర్.


'అయ్యో నాకు ఇమెయిల్ లేదే?'


'ఏంటీ, ఇమెయిల్ లేదా? మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోసం వచ్చి.. ఇమెయిల్ లేదా... అయితే మీకు నో ఉద్యోగం. యు కెన్ గో నౌ'


దిగాలుపడ్డ సుబ్బారావు... బయటకి నడిచాడు.


ఆకలి దంచేస్తోంది. జేబులో ఉన్న ఒకే ఒక్క రూపాయితో మరమరాలు కొన్నాడు. సగం తిన్నాడు. మిగతా సగం స్కూలు పిల్లలకు అమ్మాడు.


అయిదు రూపాయలు లాభం వచ్చింది. వ్యాపారం రుచి తెలిసి ఆ అయిదును పది... యిరవై... వంద... వెయ్యి... లక్ష... కోట్లు చేశాడు అయిదేళ్ళలో.


ఇపుడతను కోటీశ్వరుడు. భారతదేశం అంతా మరమరాలు సప్లై చేసే వ్యాపారి.


వందల కొద్ది స్వంత లారీలు ఉన్నాయి. ఉన్నట్టుండి యివన్నీ తగలబడిపొతే?


అమ్మో... అనుకుని ఇన్సూరెన్స్ ఏజెంట్ ని పిలిచాడు.


'పేపర్లన్నీ రెడీ చేసి ఇమెయిల్ చేస్తా, మీ ఐడీ యివ్వండి' అన్నాడు ఏజెంట్.


'అయ్యో నాకు ఇమెయిల్ లేదే?' అన్నాడు సుబ్బారావు


'ఏంటీ, ఇమెయిల్ లేదా? ఇమెయిల్ లేకుండానే ఇంత బిజినెస్ మాగ్నెట్ అయ్యారు అయిదేళ్ళలో. ఇమెయిల్ వుండివుంటే యిప్పటికి ఏమై వుండేవారో తెలుసా?' అడిగాడు ఏజెంట్.


మైక్రోసాఫ్ట్ లో అయిదేళ్ళ సీనియర్ స్వీపర్ గా ఉండి ఉండేవాడిని అన్నాడు సుబ్బారావు ! :

No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE