NaReN

NaReN

Friday, February 2, 2024

గీత మీ రాత

 గీత మీ రాత


*ధోతీ, శాలువా ధరించిన ఒక పెద్దమనిషి చెన్నై సముద్ర తీరంలో కూర్చుని భగవద్గీత చదువుతున్నాడు.* 


ఒక యువకుడు వచ్చి అతని దగ్గర కూర్చున్నాడు. చేతిలోని భగవద్గీతను చూసి ఇలా అన్నాడు: "ఈ సైన్స్ యుగంలో, ఈ రోజుల్లో, ఇంకా మీరు అలాంటి పుస్తకం చదువుతున్నారా? చూడండి, ప్రపంచం చంద్రునిపైకి చేరుకుంది, మీరు ఇంకా భగవద్గీతలోను, రామాయణంలోను కూరుకుపోయి ఉన్నారు."


ఆ పెద్దమనిషి యువకుడిని అడిగాడు: "భగవద్గీత గురించి నీకేం తెలుసు?"


ఆ ప్రశ్న కు సమాధానం చెప్పకుండా ఆ కుర్రాడు ఉద్వేగంగా అన్నాడు: "ఇదంతా చదివితే ఏం వస్తుంది? నేను విక్రమ్ సారాభాయ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థిని, నేను ఒక సైంటిస్టు .. గీత చదవడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు."


ఆ కుర్రాడి మాటలు విని పెద్దమనిషి నవ్వుకున్నాడు. 


అంతలోనే రెండు భారీ కార్లు వచ్చి అక్కడ ఆగాయి. ఒక కారులో నుంచి ఇద్దరు  కమాండోలు, మరో కారు నుంచి ఒక సైనికుడు దిగారు. సైనికుడు కారు వెనుక తలుపు తెరిచి, సెల్యూట్ చేసి కారు డోర్ దగ్గర నిలబడ్డాడు. గీత చదువుతున్న పెద్దమనిషి నెమ్మదిగా కారు ఎక్కి కూర్చున్నాడు.


ఇదంతా చూసి ఆ కుర్రాడు ఆశ్చర్యపోయాడు. ఈ మనిషి సామాన్యుడు కాడని, ఎవరో ప్రసిద్ధి చెందిన వారు అయ్యి ఉంటారని అతను గ్రహించాడు. ఆ పెద్దమనిషి గురించి తెలుసుకోవాలని కారు దగ్గరకు పరిగెత్తుకెళ్లి, "ఎవరు సార్ మీరు?" అని అడిగాడు.


ఆ పెద్దమనిషి చాలా ప్రశాంతమైన స్వరంతో ఇలా అన్నాడు: "నేను విక్రమ్ సారాభాయ్ ని."


ఆ కుర్రాడికి 220 వోల్ట్ ల షాక్ తగిలినట్లయ్యింది. 

ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో తెలుసా?

  

డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం!!


డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం, మిస్సైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్! రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి  పదకొండవ రాష్ట్రపతి!


ఆ తర్వాత డాక్టర్ అబ్దుల్ కలాం భగవద్గీతను చదవడమే కాకుండా దానిని జీవించారు. ఆయన రామాయణం, మహాభారతం, ఇతర వేద పుస్తకాలను కూడా చదివారు.


గీతా పఠన ఫలితంగా, డాక్టర్ కలాం తన జీవితాంతం మాంసాహారం తినకూడదని ప్రమాణం చేశారు.

  

ఆయన తన ఆత్మకథలో "భగవద్గీత ఒక సంపూర్ణమైన శాస్త్రం" అని రాశారు. మన వద్దనున్న ఈ సాంస్కృతిక వారసత్వం మనందరికీ ఎంతో గర్వకారణం అని ఆయన అభిప్రాయం.


*మీరు గీతను సరిగ్గా అర్థం చేసుకుంటే, అది మీ మనస్సును ఉన్నతమైన అవగాహనా స్థాయికి చేరుస్తుంది. అది మనల్ని జీవితాన్ని గొప్పగా జీవించడానికి సిద్ధం చేస్తుంది....* 💐

No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE