NaReN

NaReN

Wednesday, February 22, 2023

చాట్ జిపిటి అంటే ఏమిటి


*చాట్ జిపిటి అంటే ఏమిటి*

*(Technology revolution)*

         చాట్ జిపిటి అనేది ఒక చాట్ బోట్, దీనిని ఓపెన్ AI LP అనే ఫర్ – ప్రాఫిట్  (for-profit) 

          ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సంస్థ ద్వారా నవంబర్ 30, 2022 లో లాంచ్ చేయటం జరిగింది. 


       ఈ సంస్థ యొక్క పేరెంట్ కంపెనీ ఒక నాన్ – ప్రాఫిట్ (non-profit) ఓపెన్ AI inc.(OpenAI Inc.). ఈ సంస్థను 2015 లో సామ్ ఆల్ట్మాన్, ఎలోన్ మస్క్ మరియు ఇతరులు కలిసి స్థాపించారు. 2018 లో మస్క్ ఈ సంస్థ నుంచి రాజీనామా చేసారు.   


          చాట్ జిపిటి ఒక చాట్ బోట్ అయినప్పటికీ మనం ప్రశ్నలు అడిగినప్పుడు ఒక మనిషి లాగా జవాబులు ఇస్తుంది. ఈ చాట్ బోట్ వివిధ ఫీల్డ్స్ లలో ఉన్న సమాచారం పై ట్రైన్ అయ్యి ఉండటం వల్ల మనం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తుంది. 


*Table of Contents*

*ఎలా పనిచేస్తుంది:* 

1) Chatgpt ఎలా ఉపయోగించాలి :

 2)chatgpt మరియు గూగుల్ కి మధ్య తేడా ఏమిటి ?

3)chatgpt అపోహలు :

*ఎలా పనిచేస్తుంది:*

 *GPT (Generative Pre-training Transformer)*  

         అనేది ఒక రక మైన మెషీన్ లెర్నింగ్ మోడల్. ఈ చాట్ బోట్ లను ముందునుంచే వివిధ రకాల ఫీల్డ్ లకు చెందిన ఇన్ఫర్మేషన్ తో ట్రైన్ చేయటం జరుగుతుంది. ఈ చాట్ బోట్ లను ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ తో అప్ డేట్ చేయటం జరుగుతుంది. అందుకే మనం అడిగే ప్రశ్నలకు చాలా కరెక్ట్ గా జవాబు చెబుతాయి. 

          అంతకు ముందు నిర్మించిన చాట్ బోట్ లలో చాలా లోపాలు ఉండేవి. కానీ ఈ చాట్ బోట్ అలాంటి చాలా లోపాలను అధిగమించి చాలా వరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ను ఇస్తుంది. 

         ఉదాహరణకు ఏదైనా టాపిక్ గురించి చెప్పమన్నప్పుడు సింపుల్ వర్డ్స్ లో సమాచారాన్ని ఇస్తుంది. మీరు ఆ విషయాన్ని ఇంకా తెలుసుకోవాలి అన్నప్పుడు tell me more అని టైపు చేస్తే చాలు ఇంకా క్లుప్తంగా సమాచారాన్ని ఇస్తుంది.   

             మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ కోడ్ రాస్తున్నారు మధ్యలో ఎర్రర్ రావటం వల్ల దగ్గర ఆగిపోయారు. ఆ కోడ్ ను chatgpt కి ఇచ్చి ఎర్రర్ ను గుర్తించమని అడిగితే అది దానిని గుర్తించి సరి చేస్తుంది.   

              ఇవే కాకుండా ఒక యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ రాయమంటే కూడా రాస్తుంది. అలాగే ఒక ఆర్టికల్ రాయమంటే కూడా రాస్తుంది. 

          మనుషుల లాగే ఏదైనా పని చెప్పినప్పుడు చేసిపెడుతోంది. అందుకే ప్రస్తుతం చాలా ఫేమస్ అయ్యింది. 

        లాంచ్ చేసిన 5 రోజుల లోనే ఈ చాట్ బోట్ 1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకుంది. 

        సోషల్ మీడియా దిగ్గజాలకు 1 మిలియన్ యూసర్లను పూర్తి చేసుకోవడానికి కింద చూపిన విధంగా సమయం పట్టింది.  

         Netflix కి 1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి మూడు సంవత్సరాల అయిదు నెలలు పట్టింది 

         Twitter కి  1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి 24 నెలలు పట్టింది. 

        Facebook  కి  1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి 10 నెలల సమయం పట్టింది.  

          Spotify కి  1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి 5 నెలలు పట్టింది.   

         *Chatgpt మాత్రం కేవలం 5 రోజులలో  1 మిలియన్ యూసర్లను పూర్తి చేసుకొని రికార్డు  సృష్టించింది.*   *Chatgpt ఎలా ఉపయోగించాలి:*

      Chatgpt ను ఉపయోగించటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. అక్కడ మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసిన తరవాత OTP వస్తుంది. OTP ఎంటర్ చేసిన తరవాత మీకు ఒక interface కనిపిస్తుంది. 

           ఈ interface లో కొన్ని examples, capabilities మరియు chatgpt యొక్క limitations (హద్దులు) కూడా చూపిస్తుంది. 

         2021 తరవాత జరిగిన సంఘటనలపై ఈ చాట్ బోట్ అప్డేట్ అవ్వలేదు. అలాగే వారి పాలసీలకు వ్యతిరేకంగా ఉండే కంటెంట్ ను కూడా ఇది చూపించదు. ఉదాహరణకి డేంజరస్ మరియు అడల్ట్ కి సంబంధించిన సమాచారం.      

       ఉదాహరణకి నేను క్వాంటమ్ మెకానిక్స్ ఏంటి అని అడిగినప్పుడు chatgpt ఇలా దానికి answer ఇచ్చింది.  

         chatgpt మరియు గూగుల్ కి మధ్య తేడా ఏమిటి ?

సాధారణంగా మనం ఏదైనా సందేహం ఉన్నప్పుడు గూగుల్ ని అడుగుతాము. గూగుల్ మనకు ఆ సందేహానికి సమాధానం చేస్తున్న ఆర్టికల్ యొక్క లింక్ లను మనకు ఇస్తుంది. 

        మనము మనకు నచ్చిన లేదా అర్థమయ్యే భాషలో చెప్పిన ఆర్టికల్ ను చదివి మన సందేహాన్ని పూర్తి చేసుకుంటాము. 

       chatgpt మాత్రం మీరు ఏదైనా అడిగినప్పుడు తన వద్ద ముందు నుంచే ఉన్న సమాచారంలో మీరు అడిగిన సందేహానికి బెస్ట్ సూట్ అయ్యే సమాధానాన్ని ఇస్తుంది. 

         ఈ chatgpt మీరు ఇంతకు ముందు ఏ విషయాలపై మాట్లాడారో  కూడా గుర్తుపెట్టుకుంటుంది. 

      మీరు మీ స్నేహితులతో ఎలాగైతే తెలియని విషయాలను అడుగుతారో అలాగే chatgpt ను కూడా అడగవచ్చు. 

       మీకు కాశ్మీర్ టూర్ కి వెళ్ళాలి అని అనుకున్నారు. టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అక్కడికి ఎలాంటి సామాగ్రిని తీసుకువెళ్లాలి అని అడిగితె chatgpt టక్కున సమాధానం ఇస్తుంది.    

*chatgpt అపోహలు*

chatgpt ను లాంచ్ చేసిన తరవాత ఇది గూగుల్ ను రీప్లేస్ చేస్తుందని మరియు జాబ్స్ చేసేవారిని కూడా రీప్లేస్ చేస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. 

      వాస్తవానికి chatgpt కేవలం మనుషులకు సహాయం చేయటానికి మరియు రోజు వారి కార్యక్రమాలలో వచ్చే సమస్యలను పరిష్కారం తెలపడానికి మాత్రమే. 

      chatgpt కూడా ఒక రకంగా ఇంటర్నెట్ నుంచే సమాచారాన్ని తీసుకుంటుంది. కాబట్టి గూగుల్ లాంటి కంపెనీలకు ప్రస్తుతానికి ఇది  పోటీ కాదు అని చెప్పవచ్చు. 

     కానీ వచ్చే అప్డేటెడ్ వెర్షన్లలో ఎలాంటి మార్పులు చేస్తారన్నది ఆసక్తి కరమైన విషయం.

No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE