NaReN

NaReN

Wednesday, February 22, 2023

చాట్ జిపిటి అంటే ఏమిటి


*చాట్ జిపిటి అంటే ఏమిటి*

*(Technology revolution)*

         చాట్ జిపిటి అనేది ఒక చాట్ బోట్, దీనిని ఓపెన్ AI LP అనే ఫర్ – ప్రాఫిట్  (for-profit) 

          ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సంస్థ ద్వారా నవంబర్ 30, 2022 లో లాంచ్ చేయటం జరిగింది. 


       ఈ సంస్థ యొక్క పేరెంట్ కంపెనీ ఒక నాన్ – ప్రాఫిట్ (non-profit) ఓపెన్ AI inc.(OpenAI Inc.). ఈ సంస్థను 2015 లో సామ్ ఆల్ట్మాన్, ఎలోన్ మస్క్ మరియు ఇతరులు కలిసి స్థాపించారు. 2018 లో మస్క్ ఈ సంస్థ నుంచి రాజీనామా చేసారు.   


          చాట్ జిపిటి ఒక చాట్ బోట్ అయినప్పటికీ మనం ప్రశ్నలు అడిగినప్పుడు ఒక మనిషి లాగా జవాబులు ఇస్తుంది. ఈ చాట్ బోట్ వివిధ ఫీల్డ్స్ లలో ఉన్న సమాచారం పై ట్రైన్ అయ్యి ఉండటం వల్ల మనం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తుంది. 


*Table of Contents*

*ఎలా పనిచేస్తుంది:* 

1) Chatgpt ఎలా ఉపయోగించాలి :

 2)chatgpt మరియు గూగుల్ కి మధ్య తేడా ఏమిటి ?

3)chatgpt అపోహలు :

*ఎలా పనిచేస్తుంది:*

 *GPT (Generative Pre-training Transformer)*  

         అనేది ఒక రక మైన మెషీన్ లెర్నింగ్ మోడల్. ఈ చాట్ బోట్ లను ముందునుంచే వివిధ రకాల ఫీల్డ్ లకు చెందిన ఇన్ఫర్మేషన్ తో ట్రైన్ చేయటం జరుగుతుంది. ఈ చాట్ బోట్ లను ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ తో అప్ డేట్ చేయటం జరుగుతుంది. అందుకే మనం అడిగే ప్రశ్నలకు చాలా కరెక్ట్ గా జవాబు చెబుతాయి. 

          అంతకు ముందు నిర్మించిన చాట్ బోట్ లలో చాలా లోపాలు ఉండేవి. కానీ ఈ చాట్ బోట్ అలాంటి చాలా లోపాలను అధిగమించి చాలా వరకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ను ఇస్తుంది. 

         ఉదాహరణకు ఏదైనా టాపిక్ గురించి చెప్పమన్నప్పుడు సింపుల్ వర్డ్స్ లో సమాచారాన్ని ఇస్తుంది. మీరు ఆ విషయాన్ని ఇంకా తెలుసుకోవాలి అన్నప్పుడు tell me more అని టైపు చేస్తే చాలు ఇంకా క్లుప్తంగా సమాచారాన్ని ఇస్తుంది.   

             మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ కోడ్ రాస్తున్నారు మధ్యలో ఎర్రర్ రావటం వల్ల దగ్గర ఆగిపోయారు. ఆ కోడ్ ను chatgpt కి ఇచ్చి ఎర్రర్ ను గుర్తించమని అడిగితే అది దానిని గుర్తించి సరి చేస్తుంది.   

              ఇవే కాకుండా ఒక యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ రాయమంటే కూడా రాస్తుంది. అలాగే ఒక ఆర్టికల్ రాయమంటే కూడా రాస్తుంది. 

          మనుషుల లాగే ఏదైనా పని చెప్పినప్పుడు చేసిపెడుతోంది. అందుకే ప్రస్తుతం చాలా ఫేమస్ అయ్యింది. 

        లాంచ్ చేసిన 5 రోజుల లోనే ఈ చాట్ బోట్ 1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకుంది. 

        సోషల్ మీడియా దిగ్గజాలకు 1 మిలియన్ యూసర్లను పూర్తి చేసుకోవడానికి కింద చూపిన విధంగా సమయం పట్టింది.  

         Netflix కి 1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి మూడు సంవత్సరాల అయిదు నెలలు పట్టింది 

         Twitter కి  1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి 24 నెలలు పట్టింది. 

        Facebook  కి  1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి 10 నెలల సమయం పట్టింది.  

          Spotify కి  1 మిలియన్ యూజర్లను పూర్తి చేసుకోవడానికి 5 నెలలు పట్టింది.   

         *Chatgpt మాత్రం కేవలం 5 రోజులలో  1 మిలియన్ యూసర్లను పూర్తి చేసుకొని రికార్డు  సృష్టించింది.*   *Chatgpt ఎలా ఉపయోగించాలి:*

      Chatgpt ను ఉపయోగించటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. అక్కడ మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసిన తరవాత OTP వస్తుంది. OTP ఎంటర్ చేసిన తరవాత మీకు ఒక interface కనిపిస్తుంది. 

           ఈ interface లో కొన్ని examples, capabilities మరియు chatgpt యొక్క limitations (హద్దులు) కూడా చూపిస్తుంది. 

         2021 తరవాత జరిగిన సంఘటనలపై ఈ చాట్ బోట్ అప్డేట్ అవ్వలేదు. అలాగే వారి పాలసీలకు వ్యతిరేకంగా ఉండే కంటెంట్ ను కూడా ఇది చూపించదు. ఉదాహరణకి డేంజరస్ మరియు అడల్ట్ కి సంబంధించిన సమాచారం.      

       ఉదాహరణకి నేను క్వాంటమ్ మెకానిక్స్ ఏంటి అని అడిగినప్పుడు chatgpt ఇలా దానికి answer ఇచ్చింది.  

         chatgpt మరియు గూగుల్ కి మధ్య తేడా ఏమిటి ?

సాధారణంగా మనం ఏదైనా సందేహం ఉన్నప్పుడు గూగుల్ ని అడుగుతాము. గూగుల్ మనకు ఆ సందేహానికి సమాధానం చేస్తున్న ఆర్టికల్ యొక్క లింక్ లను మనకు ఇస్తుంది. 

        మనము మనకు నచ్చిన లేదా అర్థమయ్యే భాషలో చెప్పిన ఆర్టికల్ ను చదివి మన సందేహాన్ని పూర్తి చేసుకుంటాము. 

       chatgpt మాత్రం మీరు ఏదైనా అడిగినప్పుడు తన వద్ద ముందు నుంచే ఉన్న సమాచారంలో మీరు అడిగిన సందేహానికి బెస్ట్ సూట్ అయ్యే సమాధానాన్ని ఇస్తుంది. 

         ఈ chatgpt మీరు ఇంతకు ముందు ఏ విషయాలపై మాట్లాడారో  కూడా గుర్తుపెట్టుకుంటుంది. 

      మీరు మీ స్నేహితులతో ఎలాగైతే తెలియని విషయాలను అడుగుతారో అలాగే chatgpt ను కూడా అడగవచ్చు. 

       మీకు కాశ్మీర్ టూర్ కి వెళ్ళాలి అని అనుకున్నారు. టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అక్కడికి ఎలాంటి సామాగ్రిని తీసుకువెళ్లాలి అని అడిగితె chatgpt టక్కున సమాధానం ఇస్తుంది.    

*chatgpt అపోహలు*

chatgpt ను లాంచ్ చేసిన తరవాత ఇది గూగుల్ ను రీప్లేస్ చేస్తుందని మరియు జాబ్స్ చేసేవారిని కూడా రీప్లేస్ చేస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. 

      వాస్తవానికి chatgpt కేవలం మనుషులకు సహాయం చేయటానికి మరియు రోజు వారి కార్యక్రమాలలో వచ్చే సమస్యలను పరిష్కారం తెలపడానికి మాత్రమే. 

      chatgpt కూడా ఒక రకంగా ఇంటర్నెట్ నుంచే సమాచారాన్ని తీసుకుంటుంది. కాబట్టి గూగుల్ లాంటి కంపెనీలకు ప్రస్తుతానికి ఇది  పోటీ కాదు అని చెప్పవచ్చు. 

     కానీ వచ్చే అప్డేటెడ్ వెర్షన్లలో ఎలాంటి మార్పులు చేస్తారన్నది ఆసక్తి కరమైన విషయం.

Saturday, February 18, 2023

సార్

 👑👑👑👑 *_సార్_* 👑👑👑👑

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


 _ధనుష్ నటించిన, వెంకీ దర్శకత్వం లో విడుదలైన "సార్" మూవీ...... అత్యద్భుతం........_ 


 *_నేటి సమాజంలో ఉపాధ్యాయ పాత్ర ఎంత బలమైనదో, ఎంత ప్రభావమైనదో కళ్ళకు కట్టినట్లు చూపించారు....._* 


_విద్యార్థికి చదువు ఎంత కీలకమో, దానికి "కీ" ఉపాధ్యాయుడు ద్వారా ఇచ్చే ప్రత్యక్ష విద్య మాత్రమే... అని చూపించారు..... _*(ఉపాధ్యాయ విద్యకి ఎంత సాంకేతిక విద్య ఉన్నా ప్రత్యామ్నాయం లేదు రాదు.....)*_


_నేటి విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల ఎలా ఉండాలో హృదయాలను కట్టిపడేసి, థియేటర్లో కూర్చున్నామా! లేదా పాఠశాలలో కూర్చున్నామా! అన్న భావన కలుగుతుంది......_


_*సినిమాలలో ఉపాధ్యాయుడిని ఎలా చూపించకూడదో అలాంటి సినిమాలు ఇంతవరకు చూసాం.....*_

_*"బడిపంతులు"*_ _అనే సినిమా ద్వారా ఒక గొప్ప ఉపాధ్యాయ పాత్రని పాత తరం చూసినట్లే....._ _నేటి కొత్త తరం  _*సార్*_ _సినిమా కచ్చితంగా చూడాల్సిన అద్భుతమైన సినిమా కాదు_ *కళాకావ్యం.....* 


 _*ఉపాధ్యాయుడు నేటి సమాజానికి ఆదర్శంగా ఉండాలి......*_ 


 _*విద్యార్థి వారి దగ్గర నుంచి నైతిక విలువలతో కూడిన విద్య పొందాలి.....*_ 


_*నేటి సమాజం అత్యంత విలువ ఇవ్వాల్సిన వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే ఆ తర్వాతే ఎవరైనా............*_


 _*తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు పట్ల ఎంత గౌరవభావాన్ని కలిగి ఉంటే అంతటి చక్కని విద్య సాకారం....*_


_విద్యార్థుల పసితనాన్ని, ఉపాధ్యాయుడు యొక్క గొప్పతనాన్ని, అత్యద్భుతంగా చూపించిన వెంకీ అట్లూరి టీం కి హృదయపూర్వక ధన్యవాదాలు........._ 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి

Thursday, February 16, 2023

రామప్పగుడి ఇటుకలు నీటిలో వేసినా మునగవట ! ఎందువల్ల ?

 

*ప్రశ్న: రామప్పగుడి ఇటుకలు నీటిలో వేసినా మునగవట ! ఎందువల్ల ?*
"""""""""""""""""""""""""""'"'"""""""""""""""""""""""


జవాబు: రామప్ప దేవాలయాన్ని తయారు చేసిన ఇటుకలన్నీ తేలేవి కాదు. చాలా ఇటుకలు నీటిలో మునిగేవీ ఉన్నాయి. కానీ గోడలు, పైకప్పుల బరువు ఎక్కువ కాకుండా ఉండేలా రెండు మూడు వరుసల మేర ప్రత్యేకంగా తయారు చేసిన ఇటుకల్ని వాడారు. ఇందులో శాస్త్రీయబద్ధమైన ఆలోచన  కొన్ని శతాబ్దాల ముందే ఆనాటి రూపశిల్పికి, కార్మికులకు రావడమే ఆశ్చర్యం. ఇటుకలను చెరువు మట్టితో తయారుచేసే క్రమంలో ఆ మట్టిలో తేలికపాటి విత్తనాలు, రేగుపళ్ల గింజలు, రంపపు పొట్టు, వరిపొట్టు కలిపి భట్టీలో పెడతారు. లోపలున్న విత్తనాలు, పొట్టులాంటివి మండిపోయి ఆ లోపల ఖాళీ ప్రదేశాలు ఏర్పడతాయి. మిగతాచోట ఇటుక గట్టిగా ఉంటుంది. లోపల ఖాళీలు ఉండటం వల్ల ద్రవ్యరాశి తగ్గుతుంది. రూపం మాత్రం ఇటుకలానే ఉండటంతో ఘనపరిమాణంలో మార్పుండదు. సాంద్రత తగ్గుతుంది. ఇలా తగ్గిన సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండేలా చేస్తే అలాంటి ఇటుకలు తాత్కాలికంగా నీటిపై తేలుతాయి.

Sunday, February 12, 2023

PENSION LEKKALU GPF/CPS

PENSION LEKKALU GPF/CPS

GUARANTEED PENSION SCHEME or CONTRIBUTORY PENSION SCHEME

The Centre is reportedly curious in watching the implementation and application of the Guaranteed Pension Scheme being proposed to be offered to its employees.

2.Being a combination of old and new pension schemes, the GPS is set to guarantee 33% of last pay as  pension while continuing with the contribution of  employees of 10% of their pay as also the  govt. matching it. The govt.share has been raised to 14% from April,2019.

3.The officials in Central Govt. are expecting a situation that the contributions in the Contributory Pension Scheme,being invested in Stock Markets,were sure to grow at 9.5-10% over a period of  30-33 years,so that an employee in the CPS could be surely getting pension  at no less than 40% of last pay.


4.My opinion over the GPS is that when 10% of pay gives 50% last pay equivalent pension,  the  offer of 33% as guaranteed pension with continuing contribution of 20% or 24% of pay{ both of Govt. and employee} is literally and wholly unconvincing..In fact the guaranteed pension should have been equal to last pay. Hence, the employees are the losers.



4.My opinion over the GPS is that when 10% of pay gives 50% last pay equivalent pension,  the  offer of 33% as guaranteed pension with continuing contribution of 20% or 24% of pay{ both of Govt. and employee} is literally and wholly unconvincing..In fact the guaranteed pension should have been equal to last pay. Hence, the employees are the losers.



5.As shown in the following paras,I make out a case, with the aid of numerical examples and arithmetical formula, how the GPS is not beneficial to the employees.

6.(1). An employee in the time scale of pay of Rs 31460--84970.
(2).Average increment and average pay are adopted  for this purpose,at
Rs 1408 and Rs 32868 respectively only to eliminate complexities without change in the trend. Average increment is the difference between minimum and maximum of time scale divided by   the period in years of the scale of pay, while the average pay is minimum pay plus the amount of increment.
(3). Assuming---------------
x  stands for rate contributio
D  for pension equal to 50% last pay
r        for for the rate at which

contributions grow over time on compounding basis.

B  for the amount of average pay.

a       for a coefficient equal to (1+(r/100) .

And  n   stands for   number of years during which contributions are made.

7.When arranged in a carefully designed equation looks in the manner below.
*x= D (240000) / a (2400+r13) [ B { (a)n-1} ]*
After giving numerical values----
D= Rs 42485

r = 8 ( though Centre estimated at  9.5--10% ,I took at modest 8% )

B = Rs 32868
a = 1.08
n= 33
Therefore------------
*x =42485*240000 /1.08 (2400+8*13) (32868  [1.08]33-1 )*
*=10196400000 / 1.08*2504*32868*11.67604963504847*
*=10196400000 / 1037832557.8783*
*= 9.82*
*The required rate of contribution ( x) is 9.82% of pay to  get 50% of* last pay as pension.


8.How much Corpus develops over time of 33 years with 9.82% contribution is obtainable with the following equation.
*Corpus= [ (2400 +r13)/200] [xa/r] [B {(a)n-1} ]*
*= [(2400+8*13) /200] [9.82*1.08 /8 ] [32868 { (1.08)33-1} ]*
*= [ 12.52 ] [1.3257 ] [383768.40 ]*
*= Rs 6369697 or 64 Lakhs*
*The series of contributions at 9.82% are set to grow  to Rs 64 lakhs* over time of 33 years at modestly estimated 8% 0n yearly compounding basis.


9.Once after retirement, when the Corpus (6369697 )is invested in monthly income scheme at 8% , the employee gets Interest Income equal to 50% of last pay as noted below,

Simple Interest per month =Corpus*one month*interest rate/1200

= 6369697*1*8 /1200

= Rs 42465

Equal to 50% of last pay


10.Therefore from employees point of view, when a 9.82 or 10% contribution is bringing about pension equal to 50% of last pay, offer of 33%  under 20% contribution prima-facie appears unreasonable.


11.The Govt. may opt for investing its share of  10 or 14% in Stock markets and offer 50% of last pay as pension under old pension scheme while dispensing with the contribution of employees.


12.The Public Provident Fund scheme  readily comes to the rescue of the Govt.  With permission from the Centre, the Govt.  can invest their share in PPF which offers about 8% interest for bearing the pension burden under the old  pension scheme.


13.Details  of the exercises for arriving at 33% guaranteed pension are not available.  Also it is nor clear if the Guaranteed pension serves as a support when the Accumulated Pension Whealth  under CPS fails to yield  income less than 33% of last pay.


14.The employees Union may convince the Govt.  if they go with numerical examples as such,  since  all  exercises are done  in arithmetic formula alone by estimating future prospects with the past events.


Calculation may be sent to all GPF and CPS employees and all leaders to for a meaningful arguments before authorities and govt.





Wednesday, February 8, 2023

పూజ

 పూజ గదిలో - 30 నిమిషాలు

బయట - 23 గంటల 30 నిమిషాలు


1) ఏది పూజ? ఎంత సేపు పూజ?


2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి?


3) నిద్ర లేవగానే -

    

1 శ్రీహరి గుర్తుకు రావాలి

2 భూమికి నమస్కరించాలి*

3 అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి


4) స్నానం చేస్తుంటే గంగా/యమునా నదులు గుర్తుకు రావాలి.*


5) దేవుడి దీపం వెలిగించేటప్పుడు - జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి.


6) కూరగాయలు/పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి.


7) వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి.


8) అన్నం తింటుంటే ,కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి.


9) మంచి నీళ్ళు త్రాగెటప్పుడు,జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి.


10) ఊపిరి తీస్తుంటే,గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి.


11) పసి పిల్లలను, అందమైన స్త్రీలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి.


12) వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి.


13) కనిపించే ప్రతీ స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి.


14) విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి.


15) నిద్ర పోయేటప్పుడు,స్వల్ప కాలిక లయం చేసే పరమ శివుడు గుర్తుకు రావాలి.


అంతటా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.


పది మందికి - సహాయపడాలి అంటే డబ్భు అవసరమా


ఒకసారి ఒక చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు... ఇలా అడిగాడు..


నేను ఎందుకు పేదవాడను?


బుద్ధుడు సమాధానం చెప్పాడు:


మీరు ఎందుకు పేదవారు  అంటే మీరు  ఎటువంటి ఔదార్యము కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు, కాబట్టి మీరు పేదవారు అని అన్నారు,


నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది కనుక?అని ఆ పేదవాడు అడిగాడు..


అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు


మీరు ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను మీరు కలిగివున్నారు తెలుసా!!!...


మొదట మీ ముఖం ఉంది, మీరు ఇతరులతో మీ  ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు .. ఇది ఉచితం ...ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది ...

 

రెండవది మీ కళ్ళు మీకు ఉన్నాయి, మీరు ప్రేమ మరియు శ్రద్ధతో  ఇతరులను చూడవచ్చు .. 

ఇది నిజం... మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు ... వాటిని మంచి అనుభూతితో చేయండి...


మూడవది  మీకు భగవంతుడు ప్రసాదించిన నోరు ఉంది, ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించి, సత్సంగములో చేర్పించి ... వాటిని విలువైనదిగా భావించండి .. 

దానితో ఆనందము మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ...


నాలుగవది మీకు భగవంతుని ప్రసాదమైన గుండె ఉంది.... మీ దయగల హృదయంతో , భగవంతున్ని ప్రార్థిస్తూ ... మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు ... ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు... వారి జీవితాలను తాకవచ్చు...


మీరు కలిగి ఉన్న చివరి ఐదవ సంపద మీ శరీరం ....  ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు ... అవసరమైన వారికి చేతనైన సహాయం చేయవచ్చు....


సహాయం  చెయ్యడానికి  డబ్బు అవసరం లేదు ..


ఒక చిన్న శ్రద్ధ , సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు... భగవంతుడు మనకిచ్చిన జీవితం.. కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !


*మిత్రులారా! కావున ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి చేతనైన సహాయం చేస్తూ, మన జన్మను చరితార్థం చేసుకొని మానవ జన్మకు సార్థకత చేకూర్చుదాం...

.

.

Tuesday, February 7, 2023

శయన నియమాలు

 శయన నియమాలు


1. నిర్మానుష్యంగా, నిర్జన  గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం మరియు స్మశానవాటికలో కూడా పడుకోకూడదు ( మనుస్మృతి)


2పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు ( విష్ణుస్మృతి)


3. విద్యార్థి,నౌకరు,మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో,వీరిని మేల్కొలపవచ్చును ( చాణక్య నీతి)


4. ఆరోగ్యవంతులు  ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి( దేవీ భాగవతము).

పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు (పద్మ పురాణము)


5. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాల తో నిద్రించడం వలన లక్ష్మి (ధనం)ప్రాప్తిస్తుంది( అత్రి స్మృతి)

 విరిగిన పడకపై,ఎంగిలి మొహం తో పడుకోవడం నిషేధం ( మహాభారతం)


6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు( గౌతమ ధర్మ సూత్రం)


7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య,పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరము వైపు తల పెట్టి నిద్రించిన హాని,మృత్యువు.ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించిన చో ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది( ఆచార మయూఖ్ )


8. పగటిపూటఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసం లో  1 ముహూర్తం(48నిమిషాలు) నిద్రిస్తారు.పగటిపూట నిద్ర రోగహేతువు,మరియు ఆయుక్షీణత  కలుగచేస్తుంది.


9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి మరియు దరిద్రులు అవుతారు( బ్రహ్మా వైవర్తపురాణం)


10.సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు3 గంటల) తరువాత నే పడుకోవాలి.


11.ఎడమవైపు పడుకోవడం వలన  స్వస్థత లభిస్తుంది.


12.దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు యముడు మరియు దుష్ట గ్రహముల  నివాసము వుంటారు.దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.


13.గుండెపై చేయి వేసుకుని, చెట్టు యొక్క బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.


14.పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.


15. పడుకొని పుస్తక పఠనం  చేయడానికి వీల్లేదు. ( పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది.)


ఈ నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి,మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు

అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు

 

*మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మాత్రమే అని  మనము గ్రహించ గలము...*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*మనము బాల్యం లో ఉన్నప్పుడు, అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు మనతో సన్నిహితముగా ఆడుకున్న వారే.*

*ప్రతిరోజూ, మనము ఒకరిని ఒకరు వెంబడిస్తూ & సందడిగా ఉల్లాసంగా గడిపాము & కలిసి మంచి బాల్యాన్ని గడిపాము.*

*పెద్దయ్యాక, మనము మన స్వంత కుటుంబాలను కలిగిన తరువాత , మన స్వంత ప్రత్యేక జీవితాలను గడుపుతాము & సాధారణంగా అరుదుగా కలుసుకుంటాము. మనందరినీ కనెక్ట్ చేసే ఏకైక లింక్ మన తల్లిదండ్రులు.*

*మనం వృద్ధాప్యం సమీపించే సమయానికి  అప్పటికే మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి వెళ్తారు మరియు మన చుట్టూ ఉన్న బంధువుల సంఖ్య  తగ్గిపోతుంది, అప్పుడే మనకు క్రమంగా ఆప్యాయత విలువ తెలుస్తుంది.*

*నేను ఇటీవల ఇంటర్నెట్‌లో ఒక వీడియోను చూశాను, అందులో 101 ఏళ్ల అన్నయ్య తన దూరపు 96 ఏళ్ల చెల్లెల్ని చూడటానికి వెళ్లాడు.* *కొంత సమయం గడిపిన తర్వాత ఇద్దరూ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, చెల్లెలు తన అన్న కారుని వెంబడించి, తన సోదరుడికి 200 యువాన్లు ఇచ్చి, తినడానికి ఏదైనా మంచిది కొనుక్కోమని కోరింది. ఆమె మాటలు చెప్పడం పూర్తికాకముందే ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.*

*ఇంత వృద్ధాప్యంలో కూడా అన్నదమ్ములు మరియు అక్కాచెల్లెళ్లు ఉండటం నిజంగా చాలా అదృష్టమని అనేక నెటిజన్లు వ్యాఖ్యానించారు.*

*అవును, ఈ లోకంలో మనకు రక్తసంబంధం ఉన్న వ్యక్తిని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది.*

*మీరు పెద్దవారైనప్పుడు & మీ తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్లిపోయినప్పుడు, మీ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఈ ప్రపంచంలో మనకు అత్యంత సన్నిహితులవుతారు*

*స్నేహితులు దూరంగా వెళ్లిపోవచ్చు, పిల్లలు పెరిగి ఎగిరి పోవచ్చు కానీ మీ పక్కన మీ జీవితభాగస్వామి తప్ప, మీ జీవితపు చివరి అంకాన్ని పూర్తి చేయడానికి మీ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు మాత్రమే  వుంటారు*

*మనము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఒకచోట చేరడం చాలా ఆనందంగా వుంటుంది*

*వారితో కలిసిమేలిసి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా భయపడం. మనము వృద్ధాప్యానికి చేరుకున్న తరుణంలో దయచేసి మీ అన్నదమ్ములు అక్కాచెల్లెల్ల తో కరుణ మరియు దయతో ఉండండి.*

*గతంలో ఏది జరిగినప్పటికీ ఏది ఏమైనఅయినప్పటికీ, అన్నదమ్ములు అక్కాచెల్లెలళ్లు మరింత సహనంతో మరియు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి.*

*అన్నదమ్ముల అక్కాచెల్లెళ్ల మధ్య విడదీయలేని ముడి లేదు. తొలగించలేని కవచం లేదు.*
*ఎప్పుడూ పాత చేదు సంగతులజోలికి వెళ్లకూడదు లేదా పాత పగ ద్వేషం పెట్టుకోకూడదు. ఎక్కువగా పరస్పర ఆధారపడటం & పరస్పర ప్రేమతో, సంబంధాలు మెరుగవుతాయి* *ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు మన అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు*

*సరి అయిన గ్రహింపు తో సాగిపోదాము... కొన ఊపిరి ఉన్నంతవరకు.......*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Thursday, February 2, 2023

మంగళసూత్రంలో నల్లపూసల ప్రాదాన్యత

 *మంగళసూత్రంలో నల్లపూసల ప్రాదాన్యత*


స్త్రీ ఒక సంవత్సర కాలం సంతానాన్ని తన గర్బంలో మోసి మరిక ప్రాణికి జన్మనిస్తుంది. అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన పధార్ధాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు. వాటిల్లో నల్లపూసలు ఒకటి.ముతైదువులు ధరించే ఆభరణాలు వారి దేహం పై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగానూ ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి. సకలదేవతల సన్నిధానయుల్తమైన, సకలతీర్థాల సన్నిధానం కలిగిన, సౌభాగ్యాలనొసగే తాళి మాంగల్యం మతైదువకు ముఖ్యమైనది. వెనకటి కాలంలో నల్లపూసలను నల్లమట్టితో తయారు చేసేవారు. ఈ నల్లపూసలు ఛాతీమీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి. అదికాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం. ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువ. మనదేహంలోని ఉష్ణంతో బాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడిపెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమౌతోంది. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయమధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతుభాగంలో సుషుమ్న, మరియు మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతుభాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారమౌతాయి. ఇటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని భర్తకు తప్ప అన్యులకు కనిపించేలా పైన వేసుకోరాదు. వేరొకరి దృష్టి పడితే మంచిదికాదు. స్త్రీలు నల్లపూసలతాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది.

నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా పవిత్రమైనవిగా భావించడమనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది. ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ 'నలుపు రంగు' ను పక్కన పెడుతూ వచ్చిన వారు, సరాసరి నల్లపూసలను మంగళ సూత్రానికి అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు. వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళ సూత్రానికి వధూ వరులచే 'నీలలోహిత గౌరి' కి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలంపాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. నాకు వివాహమును, భాగ్యమును, ఆరోగ్యమునూ, పుత్రలాభామును, ప్రసాదించెదవు గాక! అని ప్రార్ధించి నీలలోహిత పూజను చేసి నీలలోహితే బధ్యతే అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతనూ, పగడముల చేతనూ, కూర్చబడిన సూత్రమును కట్టాలి. నీలలోహిత గౌరిని పూజించడం వలన ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. అందువలన నల్లపూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా, అవి మంగళ సూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది.

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE