NaReN

NaReN

Thursday, February 24, 2022

నడక మంచిదే కదా

 

నడక మంచిదే కదా..



శరీరం ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ వాకింగ్ చేయడం తప్పనిసరి. అయితే ఏ సమయంలో వాకింగ్ చేయాలి? ఎంతసేపు చేయాలి అనేది చాలా మందికి తెలియదు. కొంతమంది ఫిట్‌గా ఉండాలని ఎక్కువసేపు వాకింగ్ చేస్తుంటారు. అలా చేయడం కూడా ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మనం ఆకలి వేస్తే మన పొట్టకి ఎంత ఆహారం సరిపడితే అంత ఆహారం మాత్రమే తీసుకుంటాం.
అలాగే వాకింగ్ కూడా అంతే. శరీరం తీరును బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. సాధారణ ఆరోగ్యవంతులు అయితే ప్రతిరోజూ రెండు కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపు వాకింగ్ పూర్తి చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండటంతో పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువు మనకు లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు.
వాకింగ్ చేసే సమయంలో ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆలస్యంగా వాకింగ్ చేస్తే జనసంచారం ఎక్కువగా ఉండటంతో విషవాయువులు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు ఆరోగ్యం సంగతి అటుంచితే అనారోగ్యం బారిన పడే అవకాశముంది. శరీరంలో డి విటమిన్ తక్కువగా ఉండేవారు ఉదయం 8 గంటల లోపు ఎండలో నిలబడాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఎండలో ఉండటం వల్ల డి విటమిన్ లభిస్తుంది. ఉదయం కుదరని వారు సాయంత్రం 5 గంటల తర్వాత ఎండలో నిలబడొచ్చు. కొంతమంది కొన్ని ప్రయోజనాల కోసం వాకింగ్ చేస్తారు.
రోజూ నిర్ధారిత సమయంలో నడవడం వీలుకాకపోయినా.. వారంలో కనీసం 150 నిమిషాలు… అంటే సుమారు 2.5 గంటలు వాకింగ్ సమయం ఉండేలా ప్లాన్ చేసుకోండి. నడవమన్నారు కదా అని బద్దకంగా అడుగులు వేయకండి. వీలైనంత చురుగ్గా శరీరం మొత్తం కదిలేలా వేగంగా నడిస్తేనే ఫలితం ఉంటుంది. వాకింగ్ ప్రతిరోజూ చేయాలి. ఒకరోజు కంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. వర్షాల కారణంగా లేదా ఇతర కారణాల వల్ల బయట వాకింగ్ చేయడం కుదరకపోతే.. ఇంట్లోనే వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి.

Walking: వాకింక్ చేసేందుకు బద్ధకిస్తున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే వద్దన్నా ఆగరు..!
Health Tips: నడక ప్రాముఖ్యత గురించి మనం పెద్దగా ఆలోచించం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ప్రపంచంలోని అత్యుత్తమ వ్యాయామాలలో ఒకటి. నడక(Walking) మన శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా అధ్యయనాలు కనుగొన్నాయి. దీంతో మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. నడక వల్ల మన జీవితాన్ని సుదీర్ఘంగా, మెరుగ్గా మార్చే కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



1. నడక జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది..
నడక మెదడును ఉత్తేజపరుస్తుంది. ఇది మతిమరుపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా వారి పరిశోధన ప్రకారం, నడక పెద్దవారిలో డిమెన్షియా, అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
2. తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
నడక ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనితో పాటు మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు కూడా నడకకు దూరంగా ఉంటాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం, వారానికి కేవలం రెండున్నర గంటలు నడవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30 శాతం వరకు తగ్గుతుంది.
3. ఒత్తిడిని తగ్గిస్తుంది..
రోజుకు కొన్ని నిమిషాలు నడవడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గుతుంది. ప్రకృతిలో నడకకు వెళ్లినప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నడక మీ కండరాలు, ఎముకలను బలపరుస్తుంది. దీంతో ఒత్తిడి కూడా తక్కువే.
4. మంచి నిద్రకు మేలు చేస్తుంది..
నడక మన శక్తిని రెట్టింపు చేస్తుంది. దీనితో పాటు, ఇది నిద్ర సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం, 50 నుంచి 75 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు ప్రతిరోజూ కొంత సమయం పాటు నడవడం వల్ల నిద్రకు ఇబ్బంది ఉండదు.
5. నడక మంచి వ్యాయామం..
నడకను కేవలం చిన్న వ్యాయామంగా భావించడం తప్పు. బ్రిస్క్ వాకింగ్ మీ మొత్తం శరీరానికి చక్కని వ్యాయామాన్ని అందిస్తుంది. నడకను అధిక-తీవ్రత కలిగిన వ్యాయామంగా మార్చడానికి, మీరు భారీ బ్యాగ్‌తో నడవవచ్చు.
6. నడక సంబంధాలను మెరుగుపరుస్తుంది..
మీ భాగస్వామి లేదా పిల్లలతో కలిసి నడవడం వల్ల మీ సంక్లిష్ట సంబంధాలను పరిష్కరించుకోవచ్చు. కలిసి నడుస్తున్నప్పుడు, మీరు మీ మనసులో మాటలు మాట్లాడటం ద్వారా మీ సంబంధంలో కమ్యూనికేషన్‌ను పెంచుకోవచ్చు. ప్రతిరోజూ తమ ఇంటి చుట్టూ తిరిగే వ్యక్తులు, వారి సామాజిక సంబంధాలు కూడా చాలా మంచివని అనేక పరిశోధనలలో వెల్లడైంది.
7. ఎక్కడైనా, ఎప్పుడైనా నడివొచ్చు..
జిమ్ లాగా, నడవడానికి సభ్యత్వం అవసరం లేదు. మీరు ఎప్పుడైనా, ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ఒక రోజులో 30 నిమిషాల నడక చేయవచ్చు. ఉదాహరణకు, పని తర్వాత 10 నిమిషాల నడక, భోజనం తర్వాత 10 నిమిషాల నడక, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు 10 నిమిషాల నడక ఎంతో చక్కని వ్యాయామంగా మారుతుంది.
8. రోజుకు 10 వేల అడుగులు నడవాల్సిన అవసరం లేదు..
రోజుకు 10,000 అడుగులు వేయాలని చాలా మంది అంటుంటారు. కానీ, అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన పరిశోధన ప్రకారం, ఇదిిజహ అవసరం లేదు. 2019లో జరిగిన ఈ పరిశోధన ప్రకారం రోజూ 4-8 వేల అడుగులు నడవడం వల్ల మరణాల ముప్పు తగ్గుతుంది.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE