NaReN

NaReN

Sunday, February 27, 2022

చిట్టి కథ

 ✍️... నేటి చిట్టికథ


ఒక అడవిలో పెద్ద వేపచెట్టు🌳 మీద రకరకాల పక్షులు గూళ్లు కట్టుకొని వుండేవి.🐦🐤🦉🦅



 వాటిలో ఒక కాకి  🦅ఎప్పుడూ ఏదో ఒక పక్షితో గొడవ పడుతూ ఉండేది.


 చిన్నచిన్న పక్షులను ముక్కుతో పొడిచి, గోళ్లతో రక్కి ఏడిపించేది. దాంతో దాన్ని ఏవీ పలకరించేవి కాదు. మాటలు కలిపేవీ కాదు. 


వానాకాలం దగ్గర పడింది. పక్షులన్నీ తమ ఇళ్లను ఎంత గాలి వీచినా, ఎంత వాన పడినా చెక్కు చెదరకుండా బాగా గట్టిగా కట్టుకోసాగాయి. కానీ కాకి పెద్ద సోమరిపోతు. రేపు, ఎల్లుండి అనుకుంటూ రోజులు దాటేయసాగింది.


 ఒకరోజు పెద్ద గాలి వాన వచ్చింది. 


 పక్షులన్నీ భయంతో గబగబా వాటి గూళ్లలోనికి పోయి తలుపులు వేసుకొని గొళ్లెం పెట్టేసుకున్నాయి.


కాకిి పుల్లల ఇల్లు  ఆ గాలికి చెల్లాచెదరై పోయి కింద పడిపోయింది. దానికి రెండు చిన్న పిల్లలు వున్నాయి. వాటి మీద వాన పడకుండా రెక్కలు కప్పింది. 


కానీ వాన పెద్దదవుతూ వచ్చింది. పిల్లలు నెమ్మదిగా తడిసిపోతూ వున్నాయి. చలికి వణికిపోసాగాయి. 


ఇలాగే వుంటే పిల్లలకి ఏమన్నా అవుతుందేమోనని భయపడి చిలుక 🦜ఇంటికి పోయి ‘చిలుకా.. చిలుకా.. కొంచెం తలుపు తీయవా. నేనూ నా పిల్లలు గాలివానకు చచ్చిపోయేట్టు వున్నాం’ అని వేడుకొంది.


కానీ ఆ చిలుక లోపల నుంచే ‘మాకే ఈ ఇల్లు సరిపోవడం లేదు. ఇంక నీకు చోటెక్కడ పో... పోయి వేరే వాళ్లని అడుగు’ అంది.


కాకి పక్కనే వున్న పావురం🐦 ఇంటికి పోయి ‘పావురమా.. పావురమా.. ఈ ఒక్కరోజు నీ ఇంటిలో కొంచెం చోటియ్యవా.. నా పిల్లలు ఏమైపోతారోనని భయంగా ఉంది’ అంది ఏడుపుగొంతుతో.


దానికి ఆ పావురం ‘పోపో.. అనవసరంగా అందరితో గొడవపడే నీలాంటి వాళ్లతో ఒక్క పూట కాదు కదా.. ఒక్క నిమిషం కలిసి వున్నా తప్పే’ అంది తలుపు తీయకుండా.


కాకికి ఏ ఇంటి తలుపు తట్టినా ఇవే సమాధానాలు ఎదురు కాసాగాయి.


 ఒక్క పక్షి కూడా తలుపు తీయలేదు. దాంతో ఏం చేయాలో తోచక కళ్లనీళ్లు పెట్టుకుంది.


అంతలో ఒక గూటి తలుపు తెరచుకుంది. అందులోంచి ఒక చిన్న పిట్ట🕊️ బైటకు వచ్చింది.


 కాకి అంతకు ముందు అనేక సమయాల్లో అనవసరంగా దానితో గొడవ పడింది. 


అయితే పిట్ట చాలా మంచిది. అది చెల్లాచెదరైన కాకి గూడు చూసింది. వానకు వణికిపోతున్న కాకి పిల్లలను చూసింది. అయ్యో పాపం అనుకొని ‘కాకీ.. కాకీ.. అలా వానలో ఎక్కువసేపు వుంటే పిల్లలకు ఏమన్నా అవుతుంది. తొందరగా రా.. ఈ రోజు నా గూటిలో వెచ్చగా పడుకొందువుగాని’ అంది.


ఆ మాటలకు కాకి సిగ్గుతో మరింత ముడుచుకొని పోయింది. అది చూసి పిట్ట నవ్వి ‘ఆపదలో వున్నప్పుడు ఎదుటివాడు మనవాడా, పగవాడా అని ఆలోచించకుండా ముందు ఆదుకోవాలి అంటారు పెద్దలు. నీ మీద నాకు ఎలాంటి కోపమూ లేదు.. దా.. తొందరగా.. సాటి పక్షికి సాయం చేయలేని బతుకూ ఒక బతుకేనా’ అంది.కాకి 


వెంటనే తన పిల్లలను తీసుకొని ఆ ఇంటిలోకి వెళ్లింది. ఇల్లు చిన్నదైనా చాలా గట్టిగా, బలంగా ఉంది. పిట్ట తాను ఎక్కడెక్కడి నుంచో సేకరించి తెచ్చుకున్న గింజలు తెచ్చి, కాకికి, పిల్లలకు కడుపు నిండా పెట్టింది.


 అది చూసి కాకి 🦅 కళ్లనీళ్లు పెట్టుకొని ‘సోదరీ.. నిన్ను అనవసరంగా ఇంతకాలం బాధపెట్టాను. కానీ దాన్ని నువ్వు కొంచెం కూడా మనసులో పెట్టుకోకుండా సొంత బంధువులా ఆదుకున్నావు. నీ మేలు ఎప్పటికీ మరచిపోలేను’ అంది


.పిట్ట 🕊️కిచకిచా నవ్వి ‘అంత మాటలు వద్దు.. తప్పు చేయని వాళ్లు ఎవరుంటారు చెప్పు ఈ లోకంలో. కానీ ఆ తప్పు తెలుసుకొని సరిదిద్దుకున్న వాళ్లే గొప్పవాళ్లు అవుతారు. పదిమందితో కలిసి బతకడంలో వున్న ఆనందం ఒంటరిగా వుంటే ఎప్పటికీ రాదు. అది తెలుసుకో చాలు’ అంది.


ఆ తరువాత నుంచీ కాకి చాలా మారిపోయింది. కనపడిన వాటినల్లా పలకరించసాగింది. మాటలు కలపసాగింది. పనుల్లో సాయం చేయసాగింది.


🔹🔸🔹🔸🔹🔸



 ఉపకారికి నుపకారము

 విపరీతము గాదు సేయ వివరింపంగా ;

 నపకారికి నుపకారము

 నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ



మేలు చేసినవానికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి లోగడ వాడు చేసిన దోషములు లెక్క చేయక ఉపకారము చేయువాడే నేర్పుగలవాడు.


🔹🔸🔹🔸🔹🔸

తెలుగు పదాలు

 ఈ క్రింది చక్కటి పదాలు పూరించండి..



అన్నీ కృష్ణుడి నామాంతరాలే.... 

 మనం కూడా యీ రూపేణా కృష్ణ భగవానుణ్ణి స్మరించుకొందాం.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


1.  ఘ  _  _  మా (4)

2.  మా _ వా !  (3) 

3.  ము _ దా ! (3) 

4.  ము _ రీ ! (3) 

5.  రా _ మా _ వా !   (5)

6.  వా _   _  వా ! (4)

7.  య _   _   _   నా!   (5)

8.  గి  _   _   రీ ! (4)  

9.  పా  _  సా  _  థీ ! (5) 

10. నా _  _  ణా ! (4)

11. గో  _  దా ! (5)

12. బ  _  _  ద్రా ! (4)

13. ము  _  ళీ  _   రా !   (4)

14. మ  _  సూ _  నా !  (5)

15. గో  _  లా ! (3)

16.  నం _  _   _  నా ! (5) 

17. నం  _ కి  _  రా !   (5) 

18. నీ  _  _  ఘ _ మా !  (6) 

19. న  _  నీ  _   _  రా !  (6)

20. స  _  _  తీ ! (4) 

21. వ  _  _  లీ ! (4) 

22. చ  _  _  ణీ ! (4) 

23. శ్యా  _  సుం  _  రా ! (5) 

24. జ _ _ నా ! (4) 

25. _ రీ ! (2)


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Saturday, February 26, 2022

ఇంకా పిండాలా నాయనా....

 ఇంకా పిండాలా నాయనా....


బలప్రదర్శనలో అంశంగా 

ఒక వస్తాదు నిమ్మకాయ బద్దని పూర్తిగా రసం పిండివేసి, జనంకేసి చూసి క్రూరంగ నవ్వి, "మీలో ఎవరైన వచ్చి 

ఈ బద్దని పిండి ఇంకా *ఒక్క చుక్క రసం* తెప్పించినా వెయ్యి రూపాయిలిస్తా!" 

అని సవాల్ చేశాడు.

   చాలామంది ప్రయత్నించి వెనక్కి తప్పుకున్నారు. 


వస్తాదు మళ్ళీ నవ్వి ఇంకా సవాల్ చేశాడు. 


అప్పుడో బక్కచిక్కిన మధ్య వయసాయన వచ్చి ఆ పిండేసిన నిమ్మబద్ద డిప్పని పిండేసరికి జలజలా రసం కారింది. 

బిత్తరపోయిన వస్తాదు.

ఆయనకి పాదాభివందనం చేసి, 

కన్నీళ్ళతో వెయ్యి రూపాయలు ఆయనకిచ్చి, 

"స్వామీ మీరేం చేస్తుంటారు?" అని అడిగాడు.

..

....

....


*" ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ "*  

అన్నాడాయన.

😜😃

ఇంకా పిండాలా నాయనా...అని వెళ్లిపోయాడు

Friday, February 25, 2022

వారంలో 5 KGలు తగ్గండి లేకపోతే డబ్బు వాపస్

 వారంలో 5 KGలు తగ్గండి

 లేకపోతే డబ్బు వాపస్



😂😂😂😂😂😂😂


🙇ఒక లావాటి వ్యక్తి పేపర్ లో " వారంలో 5 KGలు తగ్గండి,

 లేకపోతే డబ్బు వాపస్" అనే ప్రకటన చూసి వాళ్ళకి ఫోన్ చేసాడు.🙇


🙋 ఒక అమ్మాయి ఫోన్ ఎత్తి, “రేపు ఉదయం ఆరు గంటలకు రెడీ గా 

వుండండి” అని చెప్పింది.🙋


💃తర్వాత రోజు ఉదయం 6 గంటలకు అతను తలుపు తెరవగానే, 

షార్ట్, షూ వేసుకున్న ఒక ఆందమైన అమ్మాయి "నన్ను పట్టుకోండి, ముద్దు పెట్టుకోండి" 

అని పరిగెట్టటం మొదలుపెట్టింది.

అతను బాగా కష్టపడి పరిగెట్టాడు, కాని పట్టుకోలేకపోయాడు.

మొత్తానికి వారంలో 5 KGలు మాత్రం తగ్గిపోయాడు.

.

.🕴️ఈ సారి అతను 10 KGల ప్రోగ్రామ్ తీసుకున్నాడు

తర్వాత రోజు ఉదయం 6 గంటలకు అతను తలుపు తెరవగానే, 🚶


💃షార్ట్, షూ వేసుకున్న ఇంతకు ముందుకన్నా అందమైన అమ్మాయి  

"నన్ను పట్టుకోండి, ముద్దు పెట్టుకోండి" అని పరిగెట్టటం మొదలుపెట్టింది.

అతను బాగా కష్టపడి పరిగెట్టాడు, కాని పట్టుకోలేకపోయాడు.

మొత్తానికి వారంలో 10 KGలు మాత్రం తగ్గిపోయాడు.🤷


.

.

👲అతనికి ఇది బాగా నచ్చి ఈ సారి అత్యాశకి పోయి

ఈ సారి అతను 25 KGల ప్రోగ్రామ్ అడిగాడు. 

కస్టమర్ కేర్ వాడు" నిజంగా 25KG ప్రోగ్రాం కావాలా మీకు?” అని అడిగాడు.

అతను "కావాలి పంపించండి"అన్నాడు.

తర్వాత రోజు ఉదయం 6 గంటలకు అతను తలుపు తెరవగానే, 

ఒక గొరిల్లా లా వున్న ఒక అమ్మాయి " నాకు దొరికావో,

ముద్దు పెట్టుకుంటా" అంది...


 పరుగు అందుకున్నాడు... యెంత తగ్గాడో తెలియదు, ఇంకా దొరకలేదు!!🏃

Thursday, February 24, 2022

నడక మంచిదే కదా

 

నడక మంచిదే కదా..



శరీరం ఫిట్‌గా ఉండాలంటే ప్రతిరోజూ వాకింగ్ చేయడం తప్పనిసరి. అయితే ఏ సమయంలో వాకింగ్ చేయాలి? ఎంతసేపు చేయాలి అనేది చాలా మందికి తెలియదు. కొంతమంది ఫిట్‌గా ఉండాలని ఎక్కువసేపు వాకింగ్ చేస్తుంటారు. అలా చేయడం కూడా ప్రమాదకరమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మనం ఆకలి వేస్తే మన పొట్టకి ఎంత ఆహారం సరిపడితే అంత ఆహారం మాత్రమే తీసుకుంటాం.
అలాగే వాకింగ్ కూడా అంతే. శరీరం తీరును బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాకింగ్ చేయాల్సి ఉంటుంది. సాధారణ ఆరోగ్యవంతులు అయితే ప్రతిరోజూ రెండు కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల లోపు వాకింగ్ పూర్తి చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండటంతో పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువు మనకు లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు.
వాకింగ్ చేసే సమయంలో ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆలస్యంగా వాకింగ్ చేస్తే జనసంచారం ఎక్కువగా ఉండటంతో విషవాయువులు శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు ఆరోగ్యం సంగతి అటుంచితే అనారోగ్యం బారిన పడే అవకాశముంది. శరీరంలో డి విటమిన్ తక్కువగా ఉండేవారు ఉదయం 8 గంటల లోపు ఎండలో నిలబడాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఎండలో ఉండటం వల్ల డి విటమిన్ లభిస్తుంది. ఉదయం కుదరని వారు సాయంత్రం 5 గంటల తర్వాత ఎండలో నిలబడొచ్చు. కొంతమంది కొన్ని ప్రయోజనాల కోసం వాకింగ్ చేస్తారు.
రోజూ నిర్ధారిత సమయంలో నడవడం వీలుకాకపోయినా.. వారంలో కనీసం 150 నిమిషాలు… అంటే సుమారు 2.5 గంటలు వాకింగ్ సమయం ఉండేలా ప్లాన్ చేసుకోండి. నడవమన్నారు కదా అని బద్దకంగా అడుగులు వేయకండి. వీలైనంత చురుగ్గా శరీరం మొత్తం కదిలేలా వేగంగా నడిస్తేనే ఫలితం ఉంటుంది. వాకింగ్ ప్రతిరోజూ చేయాలి. ఒకరోజు కంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వకండి. వర్షాల కారణంగా లేదా ఇతర కారణాల వల్ల బయట వాకింగ్ చేయడం కుదరకపోతే.. ఇంట్లోనే వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి.

Walking: వాకింక్ చేసేందుకు బద్ధకిస్తున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే వద్దన్నా ఆగరు..!
Health Tips: నడక ప్రాముఖ్యత గురించి మనం పెద్దగా ఆలోచించం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ప్రపంచంలోని అత్యుత్తమ వ్యాయామాలలో ఒకటి. నడక(Walking) మన శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా అధ్యయనాలు కనుగొన్నాయి. దీంతో మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. నడక వల్ల మన జీవితాన్ని సుదీర్ఘంగా, మెరుగ్గా మార్చే కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



1. నడక జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది..
నడక మెదడును ఉత్తేజపరుస్తుంది. ఇది మతిమరుపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా వారి పరిశోధన ప్రకారం, నడక పెద్దవారిలో డిమెన్షియా, అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
2. తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
నడక ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనితో పాటు మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు కూడా నడకకు దూరంగా ఉంటాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం, వారానికి కేవలం రెండున్నర గంటలు నడవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 30 శాతం వరకు తగ్గుతుంది.
3. ఒత్తిడిని తగ్గిస్తుంది..
రోజుకు కొన్ని నిమిషాలు నడవడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గుతుంది. ప్రకృతిలో నడకకు వెళ్లినప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నడక మీ కండరాలు, ఎముకలను బలపరుస్తుంది. దీంతో ఒత్తిడి కూడా తక్కువే.
4. మంచి నిద్రకు మేలు చేస్తుంది..
నడక మన శక్తిని రెట్టింపు చేస్తుంది. దీనితో పాటు, ఇది నిద్ర సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం, 50 నుంచి 75 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు ప్రతిరోజూ కొంత సమయం పాటు నడవడం వల్ల నిద్రకు ఇబ్బంది ఉండదు.
5. నడక మంచి వ్యాయామం..
నడకను కేవలం చిన్న వ్యాయామంగా భావించడం తప్పు. బ్రిస్క్ వాకింగ్ మీ మొత్తం శరీరానికి చక్కని వ్యాయామాన్ని అందిస్తుంది. నడకను అధిక-తీవ్రత కలిగిన వ్యాయామంగా మార్చడానికి, మీరు భారీ బ్యాగ్‌తో నడవవచ్చు.
6. నడక సంబంధాలను మెరుగుపరుస్తుంది..
మీ భాగస్వామి లేదా పిల్లలతో కలిసి నడవడం వల్ల మీ సంక్లిష్ట సంబంధాలను పరిష్కరించుకోవచ్చు. కలిసి నడుస్తున్నప్పుడు, మీరు మీ మనసులో మాటలు మాట్లాడటం ద్వారా మీ సంబంధంలో కమ్యూనికేషన్‌ను పెంచుకోవచ్చు. ప్రతిరోజూ తమ ఇంటి చుట్టూ తిరిగే వ్యక్తులు, వారి సామాజిక సంబంధాలు కూడా చాలా మంచివని అనేక పరిశోధనలలో వెల్లడైంది.
7. ఎక్కడైనా, ఎప్పుడైనా నడివొచ్చు..
జిమ్ లాగా, నడవడానికి సభ్యత్వం అవసరం లేదు. మీరు ఎప్పుడైనా, ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు ఒక రోజులో 30 నిమిషాల నడక చేయవచ్చు. ఉదాహరణకు, పని తర్వాత 10 నిమిషాల నడక, భోజనం తర్వాత 10 నిమిషాల నడక, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు 10 నిమిషాల నడక ఎంతో చక్కని వ్యాయామంగా మారుతుంది.
8. రోజుకు 10 వేల అడుగులు నడవాల్సిన అవసరం లేదు..
రోజుకు 10,000 అడుగులు వేయాలని చాలా మంది అంటుంటారు. కానీ, అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన పరిశోధన ప్రకారం, ఇదిిజహ అవసరం లేదు. 2019లో జరిగిన ఈ పరిశోధన ప్రకారం రోజూ 4-8 వేల అడుగులు నడవడం వల్ల మరణాల ముప్పు తగ్గుతుంది.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం

 వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం

—————————————-—————————



 *అ* - *అరుదైన* అమ్మాయి

 *ఆ* - *ఆకతాయి* అబ్బాయి

 *ఇ* - *ఇద్దరికి* 

 *ఈ* - *ఈడు* జోడి కుదిరి

 *ఉ* - ఉంగరాలను తొడిగి

 *ఊ* - ఊరంతా ఊరేగించారు

 *ఋ* - *ఋణాల* కోసం 

 *ఎ* - *ఎ* వరెవరినో అడుగుతూ ఉంటే

 *ఏ* - *ఏనుగు* లాంటి కుభేరుడితో అడిగి

 *ఐ* - *ఐశ్వర్యం* అనే కట్నం ఇచ్చి

 *ఒ* - *ఒకరికి* ఒకరు వియ్యంకులవారు

 *ఓ* - *ఓర్పుతో* ఒప్పందం చేసుకొని

 *ఔ* - *ఔదార్యాని* ఇరు కుటుంబాలకు

 *అం* - *అందించాలని* కోరుకుంటూ

 *అ* : - *అ* : అంటూ

 *క* - *కలపతో* తయారయిన పత్రికలపై 

కలంతో రాసిచ్చి

 *ఖ* - *ఖడ్గలతో* నరికిన పందిరి ఆకులను

 *గ* - *గడప* ముందుకు తీసుకొచ్చి

 *ఘ* - *ఘనమైన* ఏర్పాట్లు చేయించి

 *చ* - *చాపుల* (బట్టలు)నింటిని కొని

 *ఛ* - *ఛత్రం* (గొడుగు) పట్టి గండదీపాని

 *జ* - జరిపిస్తూ

 *ఝ* - *ఝాము* రాత్రి దాక

 *ట* - *ట* పకాయలను కాలుస్తూ

 *ఠ* - *ఠీవిగా* (వైభవంగా)

 *డ* - *డ* ప్పులతో

 *ఢ* - *ఢం* ఢం అని శబ్దాలతో సాగుతుంది

 *ణ* - కంక *ణా* లు చేతికి కట్టుకొని

 *త* - *తట్టలో* తమలపాకులు పట్టుకొని

 *థ* - థమన్(మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో

 *ద* - *దగ్గరి* బంధువులను పిలిచి

 *ధ* - *ధ* నవంతులను కూడా పిలిచి

 *న* - *న* అనే నలుగురిని పిలిచి

 *ప* - *పది* మందిని పలకరిస్తూ

 *ఫ* - *ఫంక్షన్* కి రావాలని చెప్తూ

 *బ* - *బ* లగాలతో బంగార దుకాణాలకు వెళ్లి

 *భ* - *భటువులని* (ఆభరణాలు) కొని

 *మ* - *మంగళ* స్నానాలు చేయించి, రాజసూయ

 *య* - *యాగం* లాంటి పెళ్లి కి 

 *ర* - *రా* రండోయ్ వేడుక చూద్దాం అని చెప్పి

 *ల* - *లక్షణమైన* 

 *వ* - *వధూవరులను* మీరు

 *శ* - *శతమానం* భవతి అని

 *ష* - *షరతులు* లేకుండా ఆశీర్వదించడానికి

 *స* - *సప్తపది* (పెళ్లి) వేడుకలో

 *హ* - *హంగు* ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో

 *ళ* - క *ళ* త్రం (భార్య) కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని

 *క్ష* - *క్షత్రియ* చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లి కి

 *ఱ* - *ఱరండి*,,, 

అక్షర దోషాలు  తెలియజేయండి.

భావం చూడండి,,,,

చదవండి, 

ఆనందించండి

తెలుగును ఆస్వాదించండి

వయస్సు దాటుతున్న వేళ

 వయస్సు దాటుతున్న వేళ

  

 *1. ఈ సమయం  ఇన్నాళ్ళూ  సంపాదించినదీ,  దాచుకున్నదీ  తీసి  ఖర్చు  పెట్టె  వయసు.తీసి  ఖర్చు  పెట్టి  జీవితాన్ని  ఎంజాయ్  చెయ్యండి.*  


 *దాన్ని  ఇంకా  దాచి  అలా  దాచడానికి  మీరు  పడిన  కష్టాన్ని,  కోల్పోయిన ఆనందాలనూ*  *మెచ్చుకునేవారు  ఎవరూ  ఉండరు  అనేది  గుర్తు పెట్టుకోండి* 


 *2. మీ  కొడుకులూ,  కోడళ్ళూ  మీరు  దాచిన  సొమ్ముకోసం  ఎటువంటి  ఆలోచనలు చేస్తున్నారో? ఈ  వయసులో  ఇంకా  సంపాదించి*  *సమస్యలనూ,  ఆందోళనలూ  కొని తెచ్చుకోవడం  అవుసరమా?* 

 *ప్రశాంతంగా  ఉన్నది  అనుభవిస్తూ జీవితం  గడిపితే  చాలదా?* 


 *3. మీ  పిల్లల  సంపాదనలూ,  వాళ్ళ  పిల్లల  సంపాదనల  గురించిన  చింత  మీకు  ఏల?*  *వాళ్ళ  గురించి  మీరు  ఎంత  వరకూ  చెయ్యాలో  అంతా  చేశారుగా?*  *వాళ్లకి  చదువు,  ఆహారం, నీడ మీకు  తోచిన  సహాయం  ఇచ్చారు.  ఇపుడు  వాళ్ళు  వాళ్ళ  కాళ్ళమీద  నిలబడ్డారు.ఇంకా  వాళ్ళకోసం  మీ  ఆలోచనలు  మానుకోండి. వాళ్ళ  గొడవలు  వాళ్ళను  పడనివ్వండి.* 


  *4. ఆరోగ్యవంతమైన  జీవితం  గడపండి.   అందుకోసం  అధిక  శ్రమ  పడకండి. తగిన  మోతాదులో  వ్యాయామం  చెయ్యండి. (నడక, యోగా   వంటివి  ఎంచుకోండి) తృప్తిగా  తినండి.  హాయిగా  నిద్రపోండి.*   *అనారోగ్య  పాలుకావడం  ఈ వయసులో  చాలా  సులభం,  ఆరోగ్యం  నిలబెట్టుకోవడం  కష్టం.  అందుకే  మీ  ఆరోగ్య  పరిస్థితిని  గమనించుకుంటూ  ఉండండి. మీ వైద్య  అవుసరాలూ,  ఆరోగ్య  అవుసరాలూ   చూసుకుంటూ  ఉండండి.  మీ డాక్టర్  తో  టచ్  లో  ఉండండి.  అవుసరం  అయిన  పరీక్షలు  చేయించుకుంటూ  ఉండండి.*  *(ఆరోగ్యం  బాగుంది  అని  టెస్ట్ లు  మానేయకండి)* 


 *5. మీ  భాగస్వామికోసం  ఖరీదైన  వస్తువులు  కొంటూ  ఉండండి.  మీ  సొమ్ము  మీ  భాగస్వామితో  కాక  ఇంకెవరితో  అనుభవిస్తారు?* *గుర్తుంచుకోండి ఒకరోజు  మీలో  ఎవరో  ఒకరు  రెండో  వారిని  వదిలిపెట్టవలసి  వస్తుంది.  మీ డబ్బు  అప్పుడు  మీకు  ఎటువంటి  ఆనందాన్నీ  ఇవ్వదు.  ఇద్దరూ  కలిసి  అనుభవించండి.* 


 *6. చిన్న  చిన్న  విషయాలకు  ఆందోళన  పడకండి. ఇప్పటివరకూ  జీవితం  లో  ఎన్నో  ఒత్తిడులను  ఎదుర్కొన్నారు.   ఎన్నో  ఆనందాలూ,  ఎన్నో  విషాదాలూ  చవి  చూశారు.  అవి  అన్నీ  గతం.* 

 *మీ  గత  అనుభవాలు మిమ్మల్ని  వెనక్కులాగేలా  తలచుకుంటూ  ఉండకండి,  మీ భవిష్యత్తును భయంకరంగా  ఊహిచుకోకండి.  ఆ  రెండిటివలన  మీ  ప్రస్తుత  స్థితిని   నరకప్రాయం  చేసుకోకండి. ఈరోజు  నేను  ఆనందంగా  ఉంటాను అనే  అభిప్రాయంతో  గడపండి.   చిన్నసమస్యలు  వాటంతట  అవే  తొలగిపోతాయి .* 


 *7. మీ  వయసు*  *అయిపొయింది  అనుకోకండి.  మీ  జీవిత  భాగస్వామిని  ఈ  వయసులో  ప్రేమిస్తూనే  ఉండండి. జీవితాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. కుటుంబాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. మీ  పొరుగువారిని  ప్రేమిస్తూ  ఉండండి.* 


  *"జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలూ  ఉన్నన్ని నాళ్ళూ   మీరు  ముసలివారు  అనుకోకండి.* *నేను  ఏమిచెయ్యగలనూ  అని  ఆలోచించండి.  నేను  ఏమీ  చెయ్యలేను  అనుకోకండి"* 


 *8. ఆత్మాభిమానం  తో  ఉండండి  (మనసులోనూ బయటా  కూడా) హెయిర్  కట్టింగ్  ఎందుకులే*  *అనుకోకండి.  గోళ్ళు  పెరగనియ్యిలే అనుకోకండి.  చర్మసౌందర్యం  మీద  శ్రద్ధ   పెట్టండి.  పళ్ళు  కట్టించుకోండి. ఇంట్లో  పెర్ఫ్యూమ్ లూ,  సెంట్లూ ఉంచుకోండి. బాహ్య  సౌందర్యం  మీలో అంతః సౌందర్యం  పెంచుతుంది అనే  విషయం  మరువకండి.  మీరు  శక్తివంతులే!* 

  

 *9. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయిన ఒక  స్టైల్స్ ఏర్పరచుకోండి.  వయసుకు  తగ్గ  దుస్తులు  చక్కటివి  ఎంచుకోండి. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయినట్టుగా  మీ  అలంకరణ ఉండాలి.  మీరు  ప్రత్యేకంగా  హుందాగా ఉండాలి.* 


 *10. ఎప్పటికప్పుడు  అప్ డేట్  గా  ఉండండి. న్యూస్ పేపర్లు  చదవండి. న్యూస్ చూడండి.  పేస్  బుక్ , వాట్సాప్ లలో  ఉండండి. మీ  పాత  స్నేహాలు  మీకు  దొరకవచ్చు.*  


 *11. యువతరం ఆలోచనలను  గౌరవించండి.* 

 *మీ  ఆదర్శాలూ  వారి  ఆదర్శాలూ  వేరు  వేరు  కావచ్చు. అంతమాత్రాన  వారిని  విమర్శించకండి* .


 *సలహాలు  ఇవ్వండి,* *అడ్డుకోకండి. మీ  అనుభవాలు  వారికి  ఉపయోగించేలా  మీ  సూచనలు  ఇస్తే  చాలు. వారు  వారికి  నచ్చితే  తీసుకుంటారు.  దేశాన్ని  నడిపించేది వారే!* 


 *12. మా  రోజుల్లో ...  అంటూ   అనకండి.  మీరోజులు  ఇవ్వే!* 

 *మీరు  బ్రతికి  ఉన్నన్ని  రోజులూ   " ఈరోజు నాదే"  అనుకోండి* 


 *అప్పటికాలం  స్వర్ణమయం  అంటూ  ఆరోజుల్లో   బ్రతకకండి.*  

 *తోటివారితో కఠినంగా  ఉండకండి.* 


 *జీవితకాలం  చాలా  తక్కువ.  పక్కవారితో కఠినంగా   ఉండి* *మీరు  సాధించేది  ఏమిటి?*  *పాజిటివ్  దృక్పధం,*  *సంతోషాన్ని  పంచే  స్నేహితులతో  ఉండండి.*  *దానివలన  మీ  జీవితం  సంతోషదాయకం  అవుతుంది.*  *కఠిన  మనస్కులతో  ఉంటె   మీరూ  కఠినాత్ములుగా  మారిపోతారు.*  *అది  మీకు  ఆనందాన్ని  ఇవ్వదు.  మీరు  త్వరగా  ముసలివారు  అవుతారు.* 


 *13. మీకు  ఆర్ధికశక్తి  ఉంటె,  ఆరోగ్యం  ఉంటె   మీ  పిల్లలతో  మనుమలతో  కలిసి ఉండకండి. కుటుంబ సభ్యులతో  కలిసి  ఉండడం  మంచిది  అని  అనిపించవచ్చు.  కానీ  అది  వారి  ప్రైవసీకి  మీ  ప్రైవసీకి కూడా  అవరోధం  అవుతుంది.వారి  జీవితాలు  వారివి.*  

 *మీ  జీవితం  మీది. వారికి  అవుసరం  అయినా,  మీకు  అవుసరం  అయినా  తప్పక  పిల్లలతో  కలిసి  ఉండండి.* 


 *14. మీ  హాబీలను  వదులుకోకండి.*  *ఉద్యోగజీవితం  లో  అంత  ఖాళీ  లేదు  అనుకుంటే  ఇప్పుడు  చేసుకోండి.* 

 *తీర్థ  యాత్రలు  చెయ్యడం,  పుస్తకపఠనం, డాన్స్, పిల్లినో, కుక్కనో  పెంచడం,  తోట పెంపకం, పెయింటింగ్ ...  రచనా  వ్యాసంగం   ...  ఏదో  ఒకటి  ఎంచుకోండి.* 


 *15. ఇంటిబయటకు  వెళ్ళడం  అలవాటు  చేసుకోండి.  కొత్త  పరిచయాలు  పెంచుకోండి.* *పార్కుకి  వెళ్లండి, గుడికి  వెళ్ళండి,  ఏదైనా  సభలకు  వెళ్ళండి.  ఇంటిబయట  గడపడం  కూడా  మీ  ఆరోగ్యానికి  మేలు  చేస్తుంది.* 


 *16. మర్యాదగా   మాట్లాడడం  అలవాటు  చేసుకోండి.  నోరు  మంచిది  అయితే  ఊరు  మంచిది  అవుతుంది.*  *పిర్యాదులు  చెయ్యకండి. లోపాలను  ఎత్తిచూపడం  అలవాటు  చేసుకోకండి. విమర్శించకండి. పరిస్థితులను  అర్ధం  చేసుకుని  ప్రవర్తించండి. సున్నితంగా  సమస్యలను  చెప్పడం  అలవాటు  చేసుకోండి.* 


 *17. వృద్ధాప్యం  లో  బాధలూ,  సంతోషాలూ  కలిసి  మెలసి  ఉంటాయి.  బాధలను  తవ్వి  తీసుకుంటూ ఉండకండి.* *అన్నీ  జీవితంలో  భాగాలే* 


 *18. మిమ్మల్ని  బాధపెట్టిన  వారిని  క్షమించండి* 

 

 *మీరు  బాధపెట్టిన  వారిని  క్షమాపణ  కోరండి* 


 *మీ తోపాటు  అసంతృప్తిని  వెంటబెట్టుకోకండి.* 


 *అది మిమ్మల్ని విచారకరం  గానూ,* 

 *కఠినం గానూ   మారుస్తుంది* 

 *ఎవరు  రైటు అన్నది  ఆలోచించకండి.* 


 *19. ఒకరిపై పగ  పెట్టుకోవద్దు* 

 *క్షమించు,  మర్చిపో,  జీవితం  సాగించు.* 


 *20. నవ్వండి నవ్వించండి. బాధలపై  నవ్వండి* 

 *ఎందరికన్నానో  మీరు  అదృష్టవంతులు.* 

 *దీర్ఘకాలం  హాయిగా  జీవించండి.* 


 *ఈ వయసు వరకు  కొందరు  రాలేరు  అని  గుర్తించండి.* 

 *మీరు  పూర్ణ  ఆయుర్దాయం  పొందినందుకు   ఆనందించండి.*


పెళ్లి సాధారణంగా జరగాలి - షష్టిపూర్తి ఘనంగా జరగాలి!!

 పెళ్లి సాధారణంగా జరగాలి - షష్టిపూర్తి ఘనంగా జరగాలి!!

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️






1. మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది.


2. 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి.


3. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో, 70 వ యేట భీమరథు డు అను పేరుతో, 78 వ యేట విజయరథు డు అను పేరుతో ఎదురుచూస్తుంటాడు.


4. ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.


5. బృహస్పతి, శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.


6. మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి.



7. షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము ఆయుష్కామనయజ్ఞము.


8. పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.


9. ‘’ తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీచి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు. వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం " అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు.


పక్షములను,తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము, భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు, నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతొ వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు. అపమృత్యు నివారణార్థం హోమాల్ని, జపాలని కుడా చేస్తారు.తదుపరి బ్రహ్మలను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు.


10. పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.


11. పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక.


12. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Thursday, February 17, 2022

భార్యే ఇంటికి ఆభరణం

 *భార్యే ఇంటికి💍 ఆభరణం!!*

అలాంటి భార్యకు ఎన్ని ఆభరణాలు కొనిచ్చినా తక్కువే.

(మీ వివాహ దినోత్సవం సందర్భంగా నా కవితా బహుమతి)

_____________________

పసుపులేటి నరేంద్రస్వామి


భరించేది భార్య,

బ్రతుకునిచ్చేది భార్య,

చెలిమినిచ్చేది భార్య 

చేరదీసేది భార్య,

ఆకాశాన ☀️సూర్యుడు   లేకపోయినా...


ఇంట్లో  భార్య లేకపోయినా...


అక్కడ జగతికి వెలుగుండదు.


ఇక్కడ ఇంటికి వెలుగుండదు


భర్త వంశానికి సృష్టికర్త,

మొగుడి అంశానికి మూలకర్త,


కొంగు తీసి ముందుకేగినా...

చెంగు తీసి మూతి తుడిచినా...

ముడిచినా

తనకు ఎవరూ సాటి లేరు ఇలలో...


తను లేని ఇల్లు... 

కలలో.... కూడా

ఊహకందని భావన


బిడ్డల నాదరించి...

పెద్దల సేవలో తరించి

భర్తని మురిపించి...మైమరపించి

బ్రతుకు మీద ఆశలు పెంచి... 

చెడు ఆలోచనలు త్రుంచి...

భ్రమరంలా ఎగురుతూ...

భర్తను భ్రమల నుండి క్రిందకు దించుతూ...

కళ్ళు కాయలు కాచేలా...వేచి చూస్తూ...

భర్త జీవితాన పువ్వులు పూచేలా చేస్తూ....

జీతం లేని పని మనిషి...

జీవితాన్ని అందించే మనసున్న మనిషి...

ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం,

ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప

అదే  భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం

కొసమెరుపు

ఆమెకు ఆమే సాటి అయినా చేయిద్దాం  ఓ చిన్న 💍ఆభరణం దానికి కూడా చేయాలా మీతో రణం🤼‍♀️

జీవితం 1



1➕ నిలబడి నీళ్ళు త్రాగే వారికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. నిలబడి నీళ్ళు త్రాగే వారి మోకాళ్ళ నొప్పిని ప్రపంచంలో ఏ డాక్టర్ బాగు చేయలేడు. కాబట్టి,  కూర్చుని త్రాగండి.


2➕ వేగంగా తిరిగే ఫ్యాన్ గాలి క్రింద లేదా A. C.లో పడుకుంటే శరీరం పెరిగి లావై పోతారు.           


3➕ 70% నొప్పులకు ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసే మేలు నొప్పి తగ్గించే మాత్రలు ఏవీ కూడా అంతగా చేయవు.


4➕ కుక్కర్లో పప్పు మెదుగు తుంది, ఉడకదు. అందుకే గ్యాస్ మరియు ఎసిడిటీ వస్తుంది.


5➕ అల్యుమినియం పాత్రల ప్రయోగం బ్రిటీష్ వాళ్ళు భారతీయ దేశభక్తులైన ఖైదీలని అనారోగ్యం పాలు చేయటానికి వాడేవారు.


6➕ షర్బతు మరియు కొబ్బరి నీళ్ళు ఉదయం 11 గం. లోపు త్రాగితే అమృతం వలే పనిచేస్తాయి.


7➕ పక్షవాతం వచ్చిన వెంటనే రోగి ముక్కు👃లో దేశవాళి ఆవు నెయ్యి వేస్తే 15 నిమిషాల్లో  బాగవుతారు.


8➕ దేశవాళి ఆవు శరీరం పైన చేతి✋ తో నిమిరితే 10 రోజుల్లో బ్లడ్ ప్రెషర్ నయమౌ తుంది. పక్షవాతం రాదు.

         ధన్యవాదములు🙏🙏

Tuesday, February 15, 2022

చదువు-ఆనందం-అభివృద్ది

 READ -ENJOY-DEVELOP

చదువు-ఆనందం-అభివృద్ది

         100% శీర్షికకు తగిన కథ

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

   

"ఏంటి రా వరుణ్, బడికి వెళ్లకుండా ఆవులు కాయటానికి వచ్చావ్"

అని అడిగింది ఆవులలో 

వెనకనున్న ఆవు.


"నాకు ఇక చదువు రాదని 

మానాన్న మరియు మా నరేంద్ర సార్

నిన్న ఓ నిర్ణయనికి వచ్చారు" 

బాధగా చెప్పాడు వరుణ్.


"చదువేముందిరా, నేను గడ్డి తిన్నంత సులువు"

అంది ఆవు.


 "అలనా ?... అలా ఎలా?" 

ఆశగా అడిగాడు వరుణ్. 

అప్పటికే పొలం వచ్చింది. 

"ముందు నన్ను కాస్త తిననివ్వు తరువాత చదువు మర్మం చెపుతా "అని మేత లో మునిగి పోయింది ఆవు. 


కాసేపు ఓపిక పట్టిన వరుణ్

"ఎం చేస్తున్నావ్? 

నాకు ఎదో చెపుతానని 

నీవు తింటూ ఉన్నావ్" 

అని అడిగాడు. 

నేను ఏకాగ్రతగా 

ఆంత్ర గ్రహణం చేస్తున్నా....  

కదిలించకు అంది ఆవు. 


అదేమిటి కొత్త గా ఉంది అని వరుణ్ అనగా "ఆహారాన్ని లోపలకు తీసుకోవడాన్ని *ఆంత్ర గ్రహణం*  అంటారు.

అంటే *తరగతిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు వినటం లాంటిది.* ఇక్కడ శ్రద్ధ అవసరం. 

అర్ధమైన కాకున్నా ముందు వినాలి.

ఇది చదువు యొక్క మొదటి లక్షణం.


ముందు నన్ను సరిపడినంత తిననివ్వు. 

మిగిలినది తరువాత చెపుతా" అంటూ తినటం కొనసాగించింది

వరుణ్ వైపు చూస్తూ.....


తినటం లో ఉన్న శ్రద్ధ వినటం లో ఉండాలన్నమాట

" అనుకున్నాడు.


కాసేపు గడిచాక  ఆవు , 

వరుణ్ ఇద్దరూ చెట్టు కిందకు చేరారు.

 "అదేంటి ఒట్టిగా నోరు చప్పరిస్తూ నములుతున్నావ్" 

వింత గా అడిగాడు వరుణ్. 

దానికి ఆవు నవ్వుతూ ..... 

దీనిని నెమరు వేయటం

అంటారు. 

ఇందాక  గబ గబ తిన్న ఆహారాన్ని తీరుబడిగా నోటిలోకి తెచ్చుకొని నమలటం. 

ఇది చాలా ముఖ్యం.


"ఎందుకలా" అడిగాడు వరుణ్. 

ఉపాధ్యాయుడు చెపుతున్న చాలా విషయాలు అప్పటికి బాగుంటాయి.

కానీ కాసేపటికి మర్చిపోతాం.

అందుకే ఇంటికి వచ్చాక తీరుబడి గా నెమరు వేసుకోవాలి.

ఎవరికైతే నేమరు వేసే అలవాటు ఉంటుందో వారికి చదువు బాగా జీర్ణమౌతుంది.


నిజానికి చదువు లోని మర్మం ఇదే.

అని రహస్యంగా చెప్పింది ఆవు.


 వరుణ్ కి తన పొరపాటు ఇప్పుడు అర్ధమైంది. 

తాను ఏనాడు ఇంటికొచ్చి 

పుస్తకం ముట్టింది లేదు.


సాయంత్రమయ్యింది. 

ఆవులు ఇంటికి మల్లాయి. 

వరుణ్ చూపు అంతా ఆవు మీదనే ఉంది. 

అది ఉదయం కన్నా హుషారుగా ఆనందగా ఉంది. 

ఏంటి విషయమని వరుణ్ అడిగాడు.


దీనిని స్వాంగీకరణ అంటారు. జీర్ణమైన ఆహారం రక్తంలో చేరి మనకు శక్తిని హుషారును ఇస్తుంది. జీర్ణం సరిగా జరిగితేనే ఈ ఆనందం అనుభవించగలం.


అంటే చదువు నీకు అర్థమై ఒంటపట్టటం. 

అది తెలిస్తే చదువు రుచికరంగా ఉంటుంది. 

నీకు ఒక పేరును గుర్తింపును తెస్తుంది. 

నీ ముఖం లో ఓ వెలుగు, 

నీ పేరుకు ఓ మెరుపు వస్తాయి అంది ఆవు. 


వరుణ్ గుండె పట్టుదలతో కొట్టుకోగా రక్తం వేగంగా పంతంగా పరిగెత్తింది.


అంతేనా ఇంకేమైనా ఉందా? ఆలోచనగా అడిగాడు వరుణ్.


ఇంకో విషయం ఉంది. 

పేడ తట్ట తీసుకొని రా చెపుతా అంది అవు. 

వరుణ్ కి విషయం అర్థమై తట్ట తెచ్చి పేడ పట్టి పక్కన పెట్టి చెప్పు అన్నాడు. 


చదువులో చివరి విషయం 

మల విసర్జన.  

అంటే పనికి మాలిన పనులు వదిలేయడం.  

కబుర్లు.... చరవాణి(సెల్ ఫోన్) ముచ్చట్లు ....దూరదర్శిని(టి.వి) ధారావాహికలు వంటి

వాటిని విసర్జించాలి.


అప్పుడు నీకు జీర్ణం చేసుకోవటానికి మరింత   సమయం దొరుకుద్ది. 

అని నవ్వుతూ చెప్పి ముగించింది ఆవు.

 ఆవుకు మేత పెట్టి వరుణ్ ఇంటికెళ్లాడు.


నెల గడిచింది. 

వరుణ్ కి సంగ్రహణాత్మక పరీక్ష-2 (SA-2) ప్రోగ్రెస్ కార్డు ఇస్తూ .... 

నరేంద్ర సార్ ఆశ్చర్యంగా మొదటి సారి మెచ్చుకోలుగా 

చూసాడు.


ఈ సారి వరుణ్ ఇంటికి వెళ్లకుండా నేరుగా ఆవుల వద్దకు బయలు దేరాడు. 

"ఆ " రోజు సాయంత్రం ఆవు నడిచిన నడకలోని శక్తి  వరుణ్ 👣అడుగులలో ఈ రోజు  కనిపిస్తుంది.....

చదువు అనేది ఆనందంగా ఉంటూ మరియు కాబోయే భావి భారత పౌరుడిలా...అభివృద్ది చెందడానికన్నట్లు ...సాగింది వరుణ్ నడక.


ఉదయం బడికి వచ్చే విద్యార్థి ఎంత ఆనందంగా వస్తాడో సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు కూడా అంతే ఆనందంగా పంపినపుడే ఉపాధ్యాయులు ఆ పాఠశాల విజయం సాధించినట్లు.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️



పసుపులేటి నరేంద్రస్వామి

9848696955

ఉపాధ్యాయులు,జి.ప.ఉ.పా మాసాయిపేట,యాదగిరిగుట్ట మండలం, యాదాద్రి జిల్లా


Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE