NaReN

NaReN

Monday, November 29, 2021

మనశ్శాంతిని పొందడం ఎలా?

 మనశ్శాంతిని పొందడం ఎలా?


🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


సముద్రం ఒడ్డున ఆగి ఉన్న ఓడపైన ఓ కాకి వచ్చి వాలింది...

అంతలో ఓడ ప్రయాణం ప్రారంభమై సముద్రం మధ్యలోకి చేరింది...*


కాకి ఓడపై భాగంలో ఎగిరింది. ఎటూచూసినా నీళ్లే ఉన్నాయి, వాలడానికి స్థలం లేదు, తిరిగి తిరిగి మళ్లీ ఓడపైనే వాలింది...


చంచలమైన మనస్సు కూడా ఆ కాకిలాంటిదే...


చాలాదూరం పరుగెత్తుతుంది, కానీ ఎక్కడా దానికి తృప్తి దొరకడం లేదు... గాలిలో దీపం లాగా ఎప్పుడూ కదులుతుంది, అందుకే మనసును కోతితో పోల్చారు, మన మనసు కూడా కోతిగా ఉంటేనే గెంతులేస్తుంది.


అలాంటిది ఆ కోతి కల్లు తాగిలే.. దాన్నితేలు కుడితే.. దానికి దెయ్యం పడితే.. ఆపై అది నిప్పులు తొక్కితే? ఇక ఆ కోతి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు...


అలాగే మనిషులం అనుకొనే అనే మన -  మనసు కూడా!


 ఈ రోజుల్లో ఏ మనిషిని కదిలించినా చాలా ‘బిజీ’గా ఉండడానికి కారణం మనసుకుండే ఈ కోతి స్వభావమే...


ఇవాళ మనుషులకు అన్నీ ఉన్నాయి కానీ అందరిదీ ‘సమయ ౼ పేదరికం


హద్దులు మీరిన ధనవ్యామోహం, తీవ్రమైన పదవీకాంక్ష, హద్దూ అదుపులేని కీర్తి కండూతి వల్ల మనిషి అనే మనం అశాంతిలో మునిగి తేలుతున్నాము.


ప్రతివారిలో ఆధ్యాత్మికత పెరిగినట్లు కనిపిస్తుంది...

కానీ ఎక్కువమందిమి అశాంతితో జీవిస్తున్నాము...

గుళ్లకు, గురువుల దగ్గరకు వెళ్లి   నాకు ఇళ్లూ, ధనం, పదవి కావాలని భౌతిక సుఖాన్ని యాచిస్తున్నాము...

అంతేతప్ప.. ‘నా మనసుకు శాంతి కావాలి’ అని ఎవరమూ అడగట్లేదు...

 

వెండి, రాగి మొదలైన లోహాలతో కలిసినప్పుడు బంగారం విలువ ఎలా తగ్గిపోతుందో....

అలాగే శుద్ధజ్ఞానం గల జీవుడు శివస్వరూపి అయినా గాని అహంకార, మమకార గుణాలతో మాయ ఆవరించి జీవత్వం పొందుతున్నాము...


స్ఫుటం అనే శుద్ధి ప్రక్రియ ద్వారా స్వర్ణకారులు బంగారాన్ని ఇతర లోహాల నుండి ఎలా వేరు చేస్తారో,

గురువు కూడా అలా తన యోగ విద్యా ప్రబోధం వల్ల మనోనాశనం చేస్తాడు.


సాధన వల్ల కలిగే సంస్కారాలతో జీవుని మనో మాలిన్యం తొలగిస్తే ‘శుద్ధ జ్ఞానైక శివస్వరూపుడు’ అవుతాడు.

అలాంటి సాధానానుష్ఠానం మనోనిశ్చలతను కలిగిస్తుంది

 మనసుకు శాంతిని కలిగించాలి.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳




.

Sunday, November 28, 2021

ఒక పరీక్ష

 ఒక పరీక్ష


స్కూల్లో క్లాస్ టీచర్ తన క్లాసులోని పిల్లలందరికీ కమ్మని మిఠాయి పంచి, ఒక విచిత్రమైన షరతు పెట్టాడు.


 "వినండి పిల్లలూ! మరో పది నిమిషాల వరకు మీరందరూ మీ మిఠాయి తినకూడదు" అని చెప్పి తరగతి గది నుండి వెళ్లిపోయాడు.


క్లాస్‌రూమ్‌లో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది. 


పిల్లలందరూ తమ ముందు ఉంచిన మిఠాయి  వైపు చూస్తున్నారు, గడిచే ప్రతి క్షణం వారి ఆతృతను అదుపులో ఉంచుకోవటం చాలా కష్టంగా ఉంది.


పది నిమిషాల తర్వాత టీచర్ ఆ క్లాస్ రూమ్ లోకి ప్రవేశించారు. 


అతను పరిస్థితిని సమీక్షించాడు. 


మొత్తం క్లాస్ లో మిఠాయిలు తిననివారు ఏడుగురు పిల్లలు ఉన్నారని కనుగొన్నాడు, మిగిలిన పిల్లలందరూ  మిఠాయి తినేసి, దాని రంగు, రుచి గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు.


ఉపాధ్యాయుడు తన డైరీలో ఈ ఏడుగురు పిల్లల పేర్లను రహస్యంగా నమోదు చేసి, బోధన ప్రారంభించాడు.


ఈ ఉపాధ్యాయుడి పేరు వాల్టర్ మిషెల్.


కొనేళ్ల తర్వాత వాల్టర్ తన డైరీని తెరిచి ఆ ఏడుగురు పిల్లల పేర్లను బయటకు తీసి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నాడు. 


ఈ ఏడుగురు చిన్నారులు తమ తమ రంగాల్లో మంచి విజయాలు సాధించారని తెలుసుకున్నాడు.


అదే తరగతికి చెందిన మిగిలిన విద్యార్థుల గురించి కూడా ఆరా తీశాడు. వారిలో ఎక్కువ మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారని, కొంతమంది ఆర్థికంగా, సామాజికంగా క్లిష్ట  పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నాడు.


వాల్టర్ తన పరిశోధనను ఈ ఒక్క వాక్యంలో ముగించాడు –


*" కేవలం ఒక్క పది నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి,  జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు."*


ఈ పరిశోధన ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందింది. 


ఉపాధ్యాయుడు వాల్టర్ పిల్లలకు ఇచ్చిన మిఠాయి, *"మార్ష్ మెల్లో"* అవడంవల్ల, ఇది *"మార్ష్ మెల్లో సిద్ధాంతం"* అని పిలువబడింది.


ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ అనేక ముఖ్యలక్షణాలతో పాటు ఓర్పుని కలిగి ఉంటారు. 


ఓర్పు ఒక వ్యక్తి యొక్క సహనశక్తిని  పెంచుతుంది కాబట్టి, అతను ప్రతికూల పరిస్థితులలో కూడా నిరుత్సాహపడడు. 

తనకు తానుగా ప్రేరేపించుకుంటూ, విజయవంతమైన వ్యక్తి అవుతాడు.

Friday, November 26, 2021

నిజం

 నిజం

                                 ***

ఏవండీ...మీకీ సంగతి తెలుసా...?   మన పక్క ఫ్లాట్ లో ఉండే  కరుణాకర్ గారూ, వసుంధర గారూ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లిపోతున్నారట...   

వాళ్ళుండే  ఫ్లాట్ అద్దెకి ఇస్తారట ప్రస్తుతం అంది భర్త తో..ప్రభావతి..  

అవునా...నీకెలా తెలుసు..నీకు చెప్పారా..?  అన్నారు ప్రభావతి భర్త ముకుంద రావు గారు..

.                              

*ఈ విషయం మన పనిమనిషి చెప్పింది అందామె'.*

"పోనీలే పాపం,  అక్కడ ఉంటే మంచి కాలక్షేపం, 

కనిపెట్టుకుని చూసే వాళ్ళు ఉంటారు...సేఫ్టీ కూడా...

అన్నారు"  ముకుందం గారు...

:ఏంటో... ఖర్మ కాకపోతే,  ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని దిక్కులేనట్టు... అక్కడ ఉండటం ఏంటో..అంది"  ఆవిడ దీర్ఘం తీస్తూ...

"చూడు..నువ్వు అలా మాట్లాడటం తప్పు...

ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు బ్రతుకుతారు అంతే గానీ ఇలానే బ్రతకాలి అని ఒక రూల్ పెట్టుకుని అందరం బ్రతకడం కష్టం...ఆ రూల్ ఎంత సహేతుకమైనా...

మనం విమర్శించడం మానేస్తే మంచిది"...అన్నారు ముకుందం గారు...

"సరే లెండి ఏదో పక్క వాళ్ళు చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకోవడం అంతే... నాకెందుకు...?

సాయంత్రం వంట పని చూసుకోవాలి అంది ఆవిడ తనలో తను మాట్లాడుకున్నట్లు గా పైకే..

ఆవిడ కొడుకూ కోడలు ఉద్యోగాలనుండి రాత్రి 7 దాటాక  వస్తారు...ఈవిడే వాళ్ళొచ్చే టైంకి వంట చేసి పెట్టాలి....

కోడలు చిన్న సాయం కూడా చేయదు...మనవలిద్దరినీ వీళ్లే చూసుకోవాలి.. ఒకడు స్కూల్ కి వెళ్తాడు... రెండో వాడు రెండేళ్ల వాడు....

ఈవిడ ఓపిక లేక,  పిల్లల్ని చూసుకోలేక... పని చేయలేకుండా ఉంటుంది...

'ఆవిడకి పక్కవాళ్ళ మీద అసూయ....చక్కగా ఇద్దరే ఉంటారు లింగు లిటుకు అంటూ...

పనేమీ ఉండదు ఆవిడకి అంతా రెస్ట్ అని ఆవిడ భావన'...

కొన్ని రోజులకే అందరికీ తెలిసింది...

కరుణాకర్ గారి విషయం...

ఫ్లాట్స్ లో ఉన్న అసోసియేషన్ వాళ్ళ ఫంక్షన్ హాల్ లోనే ఆయనకి చిన్న సెండ్ ఆఫ్ పార్టీ ఏర్పాటు చేశారు...

ఆ రోజు సాయంత్రం అందరూ వచ్చారు...చాలా మంది మాట్లాడారు...

కరుణాకర్ గురించి ఆయన భార్య గురించి...వాళ్ళు ఎంత మంచి వాళ్ళో...ఎంత హుందాగా ఉండేవారో...అని..

కొంతమంది సానుభూతి గా మాట్లాడారు...

పిల్లలుండీ ఈ పరిస్థితి రావడం మీద...ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోవడం లేదని..

ఇలాంటి తల్లి తండ్రుల ని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించడం బాధాకరమని...

ఇలా అనేక రకాలుగా...

కొంతమంది కి మాట్లాడే అవకాశం వచ్చినా...చేతికి మైకు ఇచ్చినా పట్టలేము...

అందరూ కరుణాకర్ గారి  జంట వంక సానుభూతి తో చూస్తున్నారు...

చివరిగా కరుణాకర్ గారి వంతు వచ్చింది...

ఆయన మాట్లాడేస్తే..అందరూ భోజనాలు చేసేసి వెళ్లిపోవచ్చని ఆత్రుత అందరిదీ...

ఆయన లేచి స్టేజి మీదకి వెళ్లి మైకు తీసుకున్నారు...

మాట్లాడటం ప్రారంభించారు...అందరికీ కృతజ్ఞతలు... మా మీద చాలా సానుభూతి చూపించారు..

మా లైఫ్ కూడా మీ అందరి సాన్నిధ్యంలో చాలా బాగా గడిచింది...

నేను ఒక్క అయిదు నిమిషాలు మాట్లాడతాను...దయచేసి వినండి...

మాకు ఇద్దరు అబ్బాయిలు...ఇద్దరికీ రెండేళ్ల తేడా...

మేము ఇద్దరం కూడా ఉద్యోగస్థులం...

పిల్లల్ని మంచి స్కూల్ లోనే చదివించాం...

ఆ రోజుల్లో అందరూ నడిచిన  దారిలోనే నడిచాం...

పిల్లల పదో తరగతి అవగానే ఒక కార్పొరేట్ కాలేజ్ లో  ఎం.పి. సి గ్రూప్ లో జాయిన్ చేయడం...

దానితో పాట ఎంసెట్ కోచింగ్ ఇప్పించాం...

డబ్బుకు చూసుకోలేదు...

పిల్లలకి దీని మీద ఆసక్తి ఉందా లేదా అని  అడగలేదు...

ఒకటే ధ్యేయం...

ప్రస్తుత ట్రెండ్ ని ఫాలో అవ్వాలి అంతే...

మా పిల్లలూ మేము ఏది చెప్తే అదే చేశారు..

ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాకపోయినా,  లక్షల్లో డొనేషన్ కట్టి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించాం....

ఇంజనీరింగ్ అయ్యాకా,  క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం వచ్చింది మా పెద్ద వాడికి...

మాకు అస్సలు ఆ ఉద్యోగం ఆనలేదు...

అందరిలాగే అమెరికా పంపించాలని ఆశ...

వాడిని జి.ఆర్.యి.  టోఫెల్ ఎక్జామ్స్ వ్రాయించాం...

ఏదో యావరేజ్ గా గట్టెక్కాడు...

అమెరికాలో అన్ని యూనివెర్సిటీస్ కి అప్లై చేయించాం...

ఇద్దరం ఉద్యోగస్థులం కదా...డబ్బుకి వెనకాడలేదు...

బాంక్ లోన్స్ పెట్టి మొత్తానికి అక్కడ యూనివర్సిటీస్ లో ఎయిడ్ రాకపోయినా మా డబ్బుతోనే పంపించేసాం...

అక్కడ చదువు అయ్యాకా అక్కడే ఉద్యోగం వచ్చింది...

మా ఆనందానికి అవధులు లేవు..గర్వంగా ఫీల్ అయ్యాము..

రెండో వాడిని కూడా అదే దారిలో పెట్టేసాము...

రెండో వాడు వెళ్లనన్నాడు..."ఇక్కడే చదువుకుంటాను నాన్నా  అని"  రిక్వెస్ట్ చేశాడు...

మేము ఒప్పుకోలేదు...ఇండియా లో ఏముందిరా...డెవలప్మెంట్ ఉండదు...ఎక్సపోజర్ ఉండదు అని వాడిని ఒప్పించి, ఇంచుమించు బలవంతంగా ఆస్ట్రేలియా పంపించేసాం పై చదువుకి....

మాకు ఎంత గర్వం గా ఉండేదో...మా ఇద్దరి పిల్లలు  విదేశాల్లో ఉన్నారని...

దానికి తోడు,  మా చుట్టాలు, ఆఫీస్ లో మా ఇద్దరి కోలీగ్స్,  మమ్మల్ని పొగుడుతుంటే...నా ఛాతీ గర్వంతో వెడల్పు అయ్యేది...

మీకేమండి... మీ ఇద్దరి పిల్లలూ విదేశాల్లో ఉన్నారు అనగానే మాకు గాలిలో తెలిపోతున్నట్టు ఉండేది...

అసలు మా పూజలు, మా మొక్కులు అన్నీ మా ఇద్దరి పిల్లలు ఇండియా దాటి వెళ్లాలనే...

అవన్నీ ఫలించి మా పిల్లలు అక్కడ ఉన్నారు అనుకునే వాళ్ళం...

ఇద్దరికీ ఉద్యోగాలు అక్కడే వచ్చాయి...

ఇంకా పండగ మాకు...

కొంత కాలానికి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్ అమ్మాయిలని భారత్ మెట్రిమోనియల్ డాట్ కాం లో చూసి పెళ్ళిళ్ళు కూడా చేసేసాం...

మరి ఇక్కడ అమ్మాయిని చేస్తే అక్కడికి వెళ్లడం...స్థిరపడటం టైం తీసుకుంటుంది అని...

మేము రెండు మూడేళ్ళ కోసారి అమెరికా, ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్లి వస్తూ ఉండేవాళ్ళం...మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు మావాడు, కోడలు మమ్మల్ని మొత్తం అంతా తిప్పి చూపించారు...

వాళ్ళ వైభోగం, ఆ దేశం చూడటానికి  మా కళ్ళు చాలలేదు...

మేమిద్దరమనుకున్నాం..మనం పిల్లల్ని ఇక్కడికి పంపించి మంచి పని చేశాం అని...మమ్మల్ని మేము మెచ్చుకోలుగా  భుజాలు తట్టుకున్నాం...

వాళ్ళు ఎప్పుడైనా ఇండియా వచ్చేవాళ్ళు...

వాళ్ళ హోదా, అలవాట్లు కి తగ్గట్టు మా ఇల్లుని పూర్తిగా మార్చేసామ్...అన్నట్లు మధ్యలో

మేము రిటైర్ అయిపోయాం....

మాకు మనవలు కలిగారు...

మేము కూడా వెళ్లి అక్కడ ఉండి పిల్లల్ని చూసుకున్నాం...

రెండోసారి వెళ్ళినప్పుడు మొదటిసారి లా ఎక్కడికీ తీసుకెళ్లలేదు వాళ్ళు...

అప్పటికే అన్నీ చూసేసి ఉండటం...చిన్న పిల్లలతో వీలు కాకపోవడం వలన...

అప్పుడు మాత్రం నాలుగు గోడల మధ్య ఓ ఆరు నెలలు జైలు లా, నరకం గా ఉండేది...

ఇంట్లో పనులు, వంట, పిల్లల్ని చూసుకోవడం మా వల్ల కాలేదు...

తరువాత ఇండియా లో మా ఇంటికి వచ్చాకా మాకు ఇక్కడ స్వేచ్ఛ అర్ధమయ్యింది....స్వేచ్ఛ విలువ తెలిసింది...

కొన్నాళ్ళకి మా పిల్లలు "మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది" అని ఫోన్ చేసినప్పుడు, నిజంగా మా సంతోషానికి అవధులు లేవు...

ఈ సారి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసామ్...

చుట్టాలకి ఫ్రెండ్స్ కి హోటల్ లో పార్టీ ఇచ్చాం...

కనిపించిన వాళ్లందరికీ స్వీట్స్ పంచాం....

అంత ఆనందం ఎప్పుడూ పొందలేదు....

కాలం ఆగదు కదా...సాగిపోతూనే ఉంటుంది...

మా పిల్లలు అక్కడే ఇళ్లు వాకిళ్ళు కొనుక్కున్నారు...

మా మనవలు పెద్ద వాళ్ళైయ్యారు....మా పిల్లలకి కూడా 40 ఏళ్ళు వస్తున్నాయి...

మాకు అంత పెద్ద ఇండిపెండెంట్ ఇంట్లో ఉండాలంటే కష్టం గా ఉండేది...

పిల్లలు ఇప్పుడు ఇండియా కి రావడం తగ్గిపోయింది...

అంత ఇంట్లో ఇద్దరం బిక్కు బిక్కు మంటూ ఉండలేకపోయాం...

మా పిల్లలు కూడా ఆలోచించి...రోజులు బాగాలేవు, క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి...ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చాలా వింటున్నాం...

ఎందుకైనా మంచిది  మీరు అపార్ట్మెంట్ లో ఉంటే మంచిది అని,  ఇక్కడ ఫ్లాట్ కొని మమ్మల్ని షిఫ్ట్ అవమన్నారు...

ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసాం...ఇక్కడికి వచ్చాం...

నాకు 70 ఏళ్ళు, మా ఆవిడకి 65 దాటాయి...

వయసుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి...సహజం కదా....

ఇద్దరం ముసలి వాళ్ళు ఏ తోడూ లేకుండా ఒంటరిగా ఉండటంలో కష్టనష్టాలు తెలియడం మొదలు పెట్టాయి...

నెమ్మదిగా వాస్తవాలు బోధపడసాగాయి...

మా పిల్లలు ఫోన్లు చేస్తూ ఉంటారు...

మనకి పగలైతే వాళ్ళకి రాత్రి కదా...

వాళ్ళు వాళ్ళ పగలు టైం లో మాకు ఫోన్ చేస్తే...రాత్రి పదింటికి కొంచెం నిద్రపడుతున్న మాకు మెలుకువ వస్తుంది...

వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేసినాకా ఇంక నిద్ర పట్టదు...

అలా అని ఫోన్ చేయొద్దు అని చెప్పలేం..

ఇలా ఎన్నాళ్లు అనే ఆలోచన వచ్చేసింది....

ఏ అర్ధ రాత్రో ఎవరికి బాగోలేకపోయినా,వాళ్ళని తీసుకుని ఇంకొకరు హాస్పిటల్ కి వెళ్లడం అసంభవం....

మా ఆవిడ వంట చేయలేకపోతోంది మా ఇద్దరికే అయినా కూడా...

వంటమనిషిని పెట్టుకుందామంటే భయం...

కార్ కి డ్రైవర్ ని పెట్టుకుందాం అంటే  భయం...

మేము ఇద్దరమే అని తెలిసి మాకు ఏ హాని తలపెడతారో అని...

ఈ మధ్యనే  నమ్మిన ఒక  డ్రైవర్ తన ముసలి ఓనర్స్ ని చంపి దొరికినవన్నీ పట్టుకుపోయాడు.అని విన్నాం...

సాటి మనుషుల్ని నమ్మలేని స్థితి కి వచ్చాం...

మా ఈ దీనావస్థకి కారణం మా పిల్లలని, వాళ్ళకి హృదయం లేదని మీలో చాలా మంది అన్నారు...

కానీ ఎంత మాత్రం కాదు...

మా పిల్లలు చాలా మంచి వాళ్ళు...మేము చెప్పిందల్లా చేశారు...!

మమ్మల్ని ఆనంద పెట్టారు...!

వాళ్ళు విదేశాలు వెళ్తామని అడగలేదు...మేమే పంపాము...!

మాచిన్నబ్బాయి "నేను ఎక్కడికీ వెళ్ళను నాన్నా, ఇక్కడే మీ దగ్గరే ఉంటా"  అని రిక్వెస్ట్ చేసాడు...

మేము కొట్టి పారేసామ్...వినలేదు వాడి మాట...

ఎందుకంటే మాకు సొసైటీ లో గుర్తింపు కావాలి...మా ప్రతిష్ట పెరగాలి...

అందరూ మా గురించి గొప్పగా చెప్పుకోవాలనే యావ...

అక్కడ ఉద్యోగం వస్తే సంబరపడిపోయాం...

అక్కడ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తే...అయ్యో...పిల్లలు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారే అన్న బాధ లేకపోగా, ఎగిరి చంకలు గుద్దుకున్నాం...

ఆరోజుల్లో "ఇండియా వచ్చేయండి రా" అని మేము ఒక్క మాటంటే,  వచ్చేసేవారు...కనీసం ఒక్కళ్ళయినా...

మేము అనలేదు సరికదా అక్కడి పిల్లల్నిచ్చి పెళ్లి చేసామ్...

ఇప్పుడు మా కోడళ్ళకి కూడా అక్కడే ఉండాలని ఆశ...

ఒకవేళ మా పిల్లలకి రావాలని ఉన్నా తమ భాగస్వాములు, తమ పిల్లలూ కూడా ఒప్పుకోరు...

మేమే వాళ్ళని అక్కడనుండి కదలకుండా అనేక బంధనాలతో బంధించేసాం...

నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఈ పరిస్థితి మేమే కారణం...

మా పిల్లలు కాదు...ఇది స్వయం కృతం...

మా పిల్లల్ని తిడుతుంటే నేను భరించలేక వచ్చి చెప్తున్నాను...

ఇప్పుడు ఇక్కడ కూడా మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తున్నాయి...

మీరు మీ పిల్లల్ని ఈ దిశగా మరలించండి...

మీకు తెలుసు అనుకోండి..ఆయినా చెప్తున్నాను...

మీ పిల్లల ఫ్యూచర్ తో పాటు,  మీ ఫ్యూచర్ సంగతి కూడా చూసుకోండి...

ఇక్కడ కొన్ని కుటుంబాలు కొడుకుకొడళ్లతో, మనవలతో ఉండటం చూస్తుంటే ఆనందం వేస్తుంది...

మాకు అలాంటి అదృష్టం ఎప్పటికీ రాదు కదా...

అటువంటి అదృష్టాన్ని కోల్పోకండి...

మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తున్నా...

అది ఫైవ్ స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో ఉంది...

మా పిల్లలే ఆన్లైన్ లో చూసి ఏర్పాటు చేశారు...

అక్కడ ఉండటానికి చిన్న చిన్న కాటేజీలు, 

ఎవరికి ఎలాంటి తిండి అవసరమో అలాంటి ఫుడ్ వండి పెట్టె వంటమనుషులు....

మాలాంటి వాళ్ళు ఎందరో అక్కడ మాకు కాలక్షేపం....

పదిహేను రోజులకి ఒకసారి డాక్టర్ వచ్చి చెకప్ లు చేస్తారు.....

వాకింగ్ సౌకర్యం...అందరికీ ఇంట్లో టీవీ...

కామన్ హాల్ లో పెద్ద టీవీ....

ఆకుపచ్చని వాతావరణం....ఇవన్నీ ఉన్నాయి....

ఒక్కొకళ్ళకీ నెలకి 50000 కట్టి మా పిల్లలు ఇందులో చేర్చారు....

అంటే మా ఇద్దరికీ నెలకి ఒక లక్ష ఖర్చు పెడుతున్నారు...

ఒకప్పుడు మేము వాళ్ళ చదువులకి లక్షలు ఖర్చు  పెడితే, వాళ్ళు ఇప్పుడు మాకోసం ఖర్చు పెడుతున్నారు...

వాళ్ళు ఇప్పుడు మా విషయంలో ఇలా చేయక పోయినా మేము చేసేది ఏమీ లేదు... అంటే నా ఉద్దేశ్యం ఇంత జాగ్రత్త తీసుకోకపోయినా అని...

మా పిల్లలకి మేమంటే ప్రేముంది కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి, స్థోమత ఉంది కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారు...

మేము ఒక విధంగా అదృష్టవంతులమే...

పిల్లలతో మనవలతో ఉండటమే ఎక్కువ అదృష్టం...దానితో ఏ అదృష్టానికి పోలిక లేదు...

కానీ ఉన్నంతలో సంతృప్తి చెందాలి...

కానీ ఇండియా లో ఉంటూ కూడా  ముసలితనం లో తల్లి తండ్రులని పట్టించుకోకుండా వదిలేసిన పిల్లలూ ఉన్నారు...

ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇంకా దయనీయం...

US లో ఉన్న పిల్లలు తాము రాలేక, తల్లిదండ్రులని తీసుకుపోలేక, పెద్దవయసైన తల్లిదండ్రులని ఒంటరిగా ఉంచలేక...

అటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో,  వాళ్ళు తమ తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచుతున్నారు...వాళ్ళకి వేరే దారి లేక...

కనీసం అక్కడ ఉంచితే, 

రక్షణ తో పాటు వాళ్ళ అతీ గతీ చూసేవాళ్ళు ఉంటారని...

వైద్య సదుపాయం ఉంటుందని....

మంచి ఆహారం తో పాటూ... ఒకే ఏజ్ వాళ్ళ సహచర్యంతో,  కొంత టైం పాస్ ఉంటుందని...

వాళ్ళని విమర్శించకండి...

దయచేసి మీ పిల్లల అభిప్రాయం తెలుసుకుని, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి చదివించండి...ఇది నా సలహా...అందని వాటికి అర్రులు చాచొద్దు...

మీకు వీలున్నప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి పోతూ ఉండండి...

మేము పెద్దవాళ్ళం కాబట్టి మీ దగ్గరికి రాలేకపోవచ్చు....

మా మీద జాలి పడకండి...

నమస్తే....

అని ఆయన ఆపేశారు...

కొన్ని సెకండ్స్ నిశ్శబ్దం గా గంభీరమైపోయిన  ఆ ప్రదేశం... కొద్ది క్షణాల అనంతరం చప్పట్లతో మారు మ్రోగిపోయింది..

.

★ *వసుంధర గారు చెంగుతో కళ్ళు వొత్తుకున్నారు....*

 😂😂😂🙂🙂😂😂😂

అమూల్యం

 "అమూల్యం"


"ప్రియా రాత్రికి పెళ్ళికెళదాం. కాస్త నీకూ రొటీన్ వర్క్ నించి రిలీఫ్! ఎప్పుడూ టార్గెట్లు, ప్రాజెక్ట్ లాంచింగ్ ల గోలే కదా!  ... ఫ్రెష్ గాలి పీల్చుకున్నట్టూ ఉంటుంది, నలుగురినీ కలిసినట్టూ ఉంటుంది" అన్నది కూతురితో  వైష్ణవి! 


"అబ్బ నాకిష్టమైన కార్యక్రమం వస్తుంది టీవీలో..చూడాలి మమ్మీ. నాకు కూడా ఇవ్వాళ్ళొక్క రోజే కాస్త ఖాళీ దొరికింది. పెళ్ళిళ్ళంటేనే బోర్. అందులోనూ ముక్కూ మొహం తెలియని వాళ్ళఇళ్ళల్లో పెళ్ళికెళ్ళాలంటే ఇంకా బోర్!  డ్రైవర్ ఉన్నాడుగా, నువ్వెళ్ళిరా. అన్నట్టు ఇంతకీ పెళ్ళెవరిది" అన్నది, ఒళ్ళు విరుచుకుంటూ... లాప్ టాప్ లో నించి తలెత్తకుండానే. 


"నువ్వు పసిపిల్లగా ఉండగా నాతో కడపలో కలిసి పని చేసిన శర్మ అంకుల్ కూతురి పెళ్ళి, నాగోల్ లో" అన్నది. 


"అమ్మో..అంటే దాదాపు ముప్ఫయ్యేళ్ళ క్రితం నీతో పని చేసినాయన కూతురి పెళ్ళా? అయినా ఇన్నేళ్ళ తరువాత నిన్నసలు ఆయన ఎలా ట్రేస్ చేశారు మమ్మీ? నీలాంటి కొలీగ్స్ ఆయనకి ఎంత మంది ఉండుంటారు? అందరినీ పిలుస్తారా?" అన్నది ఒళ్ళు విరుచుకుంటూ. 


"అందరినీ కాదు. సర్వీసులో కానీ.. జీవితంలో కానీ కొంత మంది ముఖ్యులంటూ ఉంటారుగా ప్రతివారికీ? నేను కూడా అంకుల్ కి అలాంటి ఒక ముఖ్య వ్యక్తినే! మనుషుల మధ్యలో ఉండే బంధాల అవసరం, అందులో ఉండే అనుభవాల చీకటి వెలుగులు ఈ కాలం పిల్లలకి తెలియట్లేదు. మనిషికి చదువు, డబ్బు, ఉద్యోగపు హోదాలే కాదు..అంతకంటే ముఖ్యమైనవి మానవ సంబంధాలు. బేతాళుడి ప్రశ్నలు ఆపి, లేచి తయారవ్వు. సరదాగా అలా తిరిగొచ్చినట్టు ఉంటుంది". 


"మొన్న మోజుపడి కొనుక్కున్నావు కదా...ఆ రాయల్ బ్లూ చీర కట్టుకో. ఎప్పుడూ ఆ దిండు గలీబులు( నైటీలు) వేసుకు తిరిగే దానివి ఎప్పుడు కట్టుకుందామని కొనుక్కుంటున్నావు అన్ని చీరలు! లే...లేచి తెములు" అన్నది. 


                                                *******


అప్పటికే సాయంత్రం 7 గం లు అయింది. చలి కాలం పొద్దు, చీకటి పడిపోయి రాత్రి తొమ్మిదైనట్టుంది. అప్పుడు బయలుదేరి బంజారా హిల్స్ నించి నాగోల్ వెళ్ళాలంటే...దాదాపు 23 కిలోమీటర్లు.... హీన పక్షం గంటన్నర పడుతుంది. ఇక ట్రాఫిక్ జాం ఉంటే..ఇంకో అరగంట అదనం! 


ఒక్కతే బయలుదేరే జోష్ లేక, కార్లో కబుర్లు చెప్పుకోవటానికి తోడు ఒక మనిషి ఉంటుంది  అని కూతురిని బయలుదేర దీసింది వైష్ణవి. 'కష్టమైనా సుఖమైనా మాట్లాడుకోవటానికి తనకంటూ ఒక మనిషి ఉండాలి అని ఈ తరానికి ఎలా అర్ధమౌతుందో'అనుకుంది స్వగతంగా!  


"నేను కూడా ముందు నువ్వన్నట్టే పెళ్ళికి వెళ్ళటానికి బద్ధకించాను. వద్దనుకున్నాను కూడా. కానీ పాపం నా ఎడ్రెస్ పట్టుకుని నన్ను పెళ్ళికి  పిలవటానికి ఆయన ఎంత శ్రమ పడి ఉంటారు? అదీ కాక ఈ మధ్య కాలంలో అసలు టచ్ లో కూడా లేము."


"ఆయన పిల్ల పెళ్ళి చేసి నన్ను పిలవకపోయినా, నాకు తెలియదు. ఆ టైం కి మనం విదేశాల్లో ఉన్నామనుకో ఎటూ వెళ్ళలేం! ఇక్కడే ఉన్నానని తెలుసుకుని మరీ పిలిచారు. వెళ్ళకపోవటానికి నా దగ్గర పెద్దగా చెప్పటానికి సాకులు కూడా ఏం లేవు...ఒక్క చలికాలం రాత్రిపూట అన్నమాట తప్ప! అందుకే ఆయన చేసిన ప్రయత్నాన్ని గౌరవించాలనే  ఉద్దేశ్యంతోనే బయలుదేరాను."


"మనుషుల మధ్యలో అనుబంధాలు సన్నగిల్లిపోతున్న ఈ రోజుల్లో, మనకి ఎదురయ్యే కొన్ని ఇలాంటి ప్రయత్నాలు మనకి తెలియకుండా ఏవో సూచనలు చేస్తాయి" అన్నది కారులో కూతురితో వైష్ణవి. 


"నీదంతా చాదస్తం మమ్మీ! ఎప్పుడో కలిసి పని చేసిన వ్యక్తి, మళ్ళీ జీవితంలో ఇంకోసారి నీకు కలుస్తారన్న నమ్మకం కూడా లేనప్పుడు ఈ బంధాలని మళ్ళీ తిరగతోడటంలో అర్ధం ఏమున్నది" అన్నది. 


ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే, పెళ్ళి హాల్ వచ్చేసింది. 


"హమ్మయ్యా ఈ జిపిఎస్ ల పుణ్యమా అని ఎక్కువ వెతుక్కోకుండానే ఎడ్రెస్ దొరికింది" అనుకుంటూ లోపలికి దారి తీసింది వైష్ణవి. 


శర్మ గారి బంధువులు తప్ప ఆఫీస్ కొలీగ్స్ ఎవరూ ఇంకా వచ్చినట్టు లేదు. మొహాలు గుర్తు పట్టటానికి ప్రయత్నిస్తూ లోపలికి నడిచింది. 


ఒక పెద్దావిడ భర్తతో సహా సోఫాలో కూర్చుని ఉన్నది. వైష్ణవిని చూస్తూనే, "బావున్నావుటే ? నీకు వీళ్ళు ఎలా పరిచయం? ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి? అచ్ఛం మీ అమ్మ లాగే ఉన్నావు! దా కూర్చో" అంటూ తను జరిగి పక్కన చోటు చూపించి చేతిలో వైష్ణవి చెయ్యి గట్టిగా పట్టుకుని కంటి నిండా నీళ్ళతో పై నించి కిందికి ఆప్యాయంగా ఒళ్ళంతా తడుముతున్నట్టు చూసింది. 


"నేను, శర్మ గారు కలిసి పని చేశాం అత్తయ్యా! అవును ఇప్పుడు నిన్ను చూస్తే గుర్తొస్తున్నది...ఆయన మీ చుట్టమని నాకు అప్పట్లో ఆఫీసులో చెబుతూ ఉండేవారు.  నాకు కూడా నిన్ను చూస్తే భలే సంతోషంగా ఉందత్తయ్యా! నీకు ఒంట్లో ఎట్లా ఉంటున్నది"...లాంటి కుశల ప్రశ్నలు వేస్తూ..పరిసరాలనీ,  తనని తానూ మర్చిపోయి కబుర్లల్లో పడింది వైష్ణవి. 


"మా చిన్నప్పుడు నువ్వూ..అమ్మా కబుర్లు చెప్పుకుంటూ మాకు బోలెడు పనులు నేర్పారు. నువ్వు సరదాగా అప్పుడు అనే దానివి గుర్తుందా అత్తయ్యా...గృహ ప్రవేశ ముహూర్తం పెట్టించుకు రమ్మంటే, మా ఆయన సత్రం ముహూర్తం పెట్టించుకొచ్చాడే ..వచ్చి పోయే వాళ్ళకి వండి వార్చలేక చస్తున్నానని! ఆ జోకులు ఇప్పుడు కూడా మేము పిల్లలతో చెప్పి నవ్వుకుంటూ ఉంటాం" అన్నది వైష్ణవి. 


"అవునే మీ అమ్మ వెళ్ళిపోయి, నన్ను ఒంటరిదాన్ని చేసింది. దానికేం హాయిగా పువ్వల్లే వెళ్ళిపోయింది. అది వెళ్ళి పోయే ముందు రోజు 'దొడ్లో పూశాయి' అని బుట్టెడు మల్లె పువ్వులు పట్టుకొచ్చి నా ముందు పోసి మాల కడుతూ కూర్చుంది. మా అందరికీ తల్లో పెట్టి మురిసిపోయింది. మల్లె పువ్వులు చూస్తే మీ అమ్మే నా కళ్ళల్లో మెదులుతుంది. ఇన్నేళ్ళయినా అసలు మీ అమ్మ మరుపుకే రావట్లేదు" అని జ్ఞాపకాలలో ముంచి తేల్చి వైష్ణవిని వేరే లోకంలోకి తీసుకెళ్ళింది.  అమ్మ స్మృతులతో వైష్ణవి కళ్ళు అశ్రు పూరితాలయ్యాయి. వైష్ణవి ఒళ్ళంతా తడుముతూ 'ఒక్క హగ్ ఇవ్వవే! మీ అమ్మని హగ్ చేసుకున్నట్టుంటుంది' అని ఆవిడ చూపించే ప్రేమానురాగాల్లో తడిసి ముద్ద అయింది వైష్ణవి. 


"అమ్మా....ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోని నాకే అమ్ముమ్మ కూతురిగా నీ పట్ల ఆవిడ చూపించిన ఆప్యాయత, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ గెశ్చర్స్ అపురూపంగా అనిపించాయి" అన్నది ప్రియ అమ్మ మొహంలో కనిపిస్తున్న కొత్త వెలుగుని కన్నార్పకుండా చూస్తూ! 


ఇంతలో పెళ్ళి పెద్ద శర్మ గారు ..."మేడం బయలుదేరారా? ఎక్కడున్నారు? ఎడ్రెస్ తెలుసుకోవటం కష్టం అయిందా....కనుక్కుందామని ఫోన్ చేస్తున్నాను" అన్నారు. 


"వచ్చేశానండి, ఇదిగో మీ పిన్ని గారితో మాట్లాడుతున్నాను" అన్న వైష్ణవి మాటతో, "వచ్చేశారా...అబ్బ నాకెంత సంతోషంగా ఉందో" అంటూ తన వాళ్ళందరిని పిలిచి వైష్ణవి పట్ల ఆయనకున్న ప్రత్యేక అభిమానాన్ని మాటలనిండా వ్యక్తపరిచారు. 


మర్యాద లోపం అవుతుందేమో అని అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్న శర్మ గారిని చూసి "మమ్మీ నీ రాకని ఆయనెంతగా కోరుకున్నారో తెలుస్తున్నది" అన్నది ప్రియ. 


పరిచయ వాక్యాలయ్యాక, డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళి వంటల పెద్దతో "వీరు మాకు బాగా కావలసిన వారు. దగ్గరుండి జాగ్రత్తగా భోజనం పెట్టండి. నేను అవతల రిసెప్షన్ సంగతి చూడాలి" అని మళ్ళీ హడావుడిగా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తే ఆలస్యం అవుతుందని, రెండు మెట్లు ఒక సారి చొప్పున రెండంతస్తుల మెట్లన్నీ  నిముషంలో ఎక్కేసి వెళ్ళిపోయారు. 


ఇక శర్మ గారి తమ్ముళ్ళు, మేనల్లుళ్ళూ..ఒకరేమిటి అందరు నోరారా ఆప్యాయంగా మాట్లాడుతూ..రాత్రి ముహూర్తం దాకా ఉండండి అని చెప్పి చెప్పి వెళ్ళారు. 


ఇంతలో "మీరు వైష్ణవి కదూ...చిన్నప్పుడు మన అమ్ముమ్మగారి ఊరు దంతలూరులో వేసవి సెలవుల్లో కలిసి ఆడుకునే వారం... నేను రామూని అని ఒకరు, నేను అమ్మన్నని అని ఒకరు, నేను వల్లిని" అని ఒకరు వైష్ణవిని చుట్టు ముట్టారు. 


"మీరంతా ఈ పెళ్ళికి వస్తారని నాకు తెలియదు. మీకు శర్మగారు చుట్టమా? మా అమ్మ బాల్య  స్నేహితురాలు కూడా కలిశారు. ఆవిడ ఆయనకి బంధువని అప్పట్లో చెబుతూ ఉండేవారు. కానీ ఆయనతో మీ బంధుత్వం నాకు తెలియదు" అని ఇక వారితో చిన్నప్పుడు ఆడిన కుంటి ఆట, మా తాత ఉత్తరం, దాగుడు మూతలాట, కళ్ళకి గంతలు కట్టుకుని 'వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి ' ఆట....ఇలా ఒకటేమిటి... ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఒకరిని మించి ఒకరు మరో లోకంలోకి వెళ్ళిపోయి అందరూ ఇంచు మించు ఆ వయసులోకి  వెళ్ళిపోయి చుట్టు పరిసరాలని మర్చిపోయి హాయిగా నవ్వుతూ మాట్లాడుకోవటం చూసిన ప్రియకి ఆ దృశ్యం ఎంతో అపురూపంగా అనిపించింది. 


"ఎప్పుడూ సీరియస్ గా, ఏదో పోగొట్టుకున్నట్టు  ఉండే మమ్మీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నది. నిజమే మమ్మీ చెప్పినట్టు తిండి, బట్ట మాత్రమే కాదు. మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేవి, నిలబెట్టేవి చిన్నప్పటి జ్ఞాపకాలు, అయిన వారితో కాలం గడపటం! తమ పరుగుల జీవితంలో ఇలాంటివి ముఖ్యమని ఆలోచించే స్థితిలో లేము" అనుకుంది ప్రియ. 


"నిజమే ఈ తరం యాంత్రికంగా, చదువే లోకంగా బతికేస్తున్నాం. మాకు ఇంత మంచి జ్ఞాపకాలు లేవు. ఇన్నేళ్ళయినా ఏ భేషజాలు లేకుండా నిర్మలమైన మనసుతో వాళ్ళు ఎంతా హాయిగా బాల్యాన్ని నెమరేసుకుంటున్నారో. అనుకోకుండా మిత్రులని కలిసిన అమ్మ మొహంలో ఈ ఆనందం, తృప్తి ఏమిచ్చి తీసికురాగలను. నిజంగా రాకపోయి ఉంటే ఇవన్నీ మిస్సయ్యేదాన్ని." అనుకుంటున్న ప్రియతో...


"ఇక బయలుదేరుదామా? బాగా పొద్దుపోయింది. మనం ఇంటికి చేరేసరికి పదకొండు అవుతుంది. మళ్ళీ డ్రైవర్ గొడవ చేస్తాడు" అన్నది వైష్ణవి. 


"ఫరవాలేదులే మమ్మీ, నేను అతనికి ఎక్స్ట్రా డబ్బు ఇస్తాను. నీ ఫ్రెండ్స్ తో ఇంకొంచెం సేపు గడపాలంటే ఉందాం" అన్నది. 


"వచ్చే నెల మా బాల్య స్నేహితురాలి కొడుకు పెళ్ళి ఉన్నదిట. అప్పుడు కలుద్దామనుకున్నాం. అందరూ ఈ ఊళ్ళోనే ఉంటున్నారుట. ఇక ముందు తరుచు కలుసుకోవచ్చు, ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. ఇలా రాబట్టి అందరూ ఎక్కడెక్కడున్నారో తెలిసింది."


"అసలు అప్పట్లో  పెద్దయ్యాక మనం ఏమౌతామో, ఎక్కడుంటామో, ఎవరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఏమీ తెలియదు. అయినా తాము అలా ఎప్పటికీ కలిసే ఆడుకుంటామని, జీవితమంతా అలా మనం కోరుకున్నట్టే ఉంటుందని అనుకుంటాము. అదే అప్పటి అందమైన అమాయకత్వం!"


"ఎవరి జీవితంలో అయినా నిష్కల్మషమైన బాల్యంలో ఆడుకున్న మిత్రుల విలువే వేరు. స్కూల్లో, పెద్దయ్యాక కాలేజిల్లో కలిసి చదువుకున్న క్లాస్ మేట్స్ వేరు. మనం పెద్ద వాళ్ళమయ్యాక వీరిలో ఎవరు కలిసినా ఆనందమే కానీ...అమ్ముమ్మ గారి ఊళ్ళొ వేసవి సెలవుల్లో కలిసి ఆడుకున్న మిత్రులు...వారి విలువ వేరు. అది అమూల్యం" అన్నది వైష్ణవి కారులో చేరగిలపడుతూ! 


"అవును మమ్మీ నాకు కూడా వాస్తవం ఇప్పుడే కళ్ళకి కట్టినట్టు తెలిసింది. ఇలా ఎవరైనా నీ పాత కొలీగ్స్, మిత్రులు ఆహ్వానిస్తే అవకాశాన్ని బట్టి తప్పకుండా నేను నీతో వస్తాను" అన్నది ప్రియ మనస్ఫూర్తిగా!

Thursday, November 25, 2021

Breaking news

 #ఫ్లాష్.. #ఫ్లాష్... #ఫ్లాష్...(Breaking news) ఖమ్మంలో ఫేస్‌బుక్‌ స్నేహం పేరుతో మరో భారీ దారుణ మోసం


తానో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ను అని నమ్మించింది. మొదట స్నేహం అన్నది. తర్వాత ప్రేమ అన్నది. నెమ్మదిగా పరిచయం పెంచుకున్నది


అబ్బాయి వివరాలు, కుటుంబ నేపథ్యం తెలుసుకున్నది

తేనే పూసిన కత్తిలా తీయని మాయ మాటలు చెప్పి అతని చిరునామా తెలుసుకున్నది.

బయట కలవటం నాకిష్టం ఉండదు..కాబట్టి

ఇంటికి వచ్చి కలుస్తాను అని మర్యాదస్తురాలిగా మాట్లాడింది.


ఒకరోజు మిట్ట మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని ఇంటికి వచ్చింది

ఎవరూ లేరని రారని నిర్థారించుకుంది

నెమ్మదిగా తీయని మాటల్లో దించింది.


అప్పటికే హ్యాండ్ బ్యాగ్లో సిద్ధం చేసుకున్న మత్తుమందు కలిపిన చాక్లెట్‌ తీసి తనకు ఇచ్చింది అది తిన్న ఆ యువకుడు నెమ్మదిగా సోఫాలో మాట్లాడుతూ మగతగా తలవాల్చేసాడు..!


వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వంట గదివైపు వెళ్ళి ఫ్రిజ్ డోర్ తీసి తనతో తెచ్చుకున్న కవరు నిండా టమాటాలు  నింపుకుని 

వడివడిగా ఇంటి వరండా లోకి వెళ్ళి పారిపోయింది..!

అనుబంధం

 భార్యాభర్తల 

    అనుబంధం గురించి

             అమృత వాక్యాలు

 😍😘😍😘😍😘🥰


నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.


తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.


అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.


అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే.


ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే,ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం.


భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం.బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.


సంసారం అంటే కలసి ఉండడమే కాదు.

కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.


ఒక మంచి భర్త భార్య కన్నీరు తూడుస్తాడెమో కానీ అర్థం చేసుకునే భర్త

ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.


భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు.

మధ్యలోనే పోతారు.

భార్యకి భర్త శాశ్వతం.

భర్తకు భార్య శాశ్వతం.


ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క!


అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.


మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం.

ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది "మాంగల్య బంధం"


బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.


మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది.కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.


కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.


నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.

నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.


ప్రేమ అనేది చాలా విలువైనది.దాన్ని "వివాహం"అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.


సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం"కుటుంబం"


గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.


కలిమి లేములతో..

కలసిన మనసులతో...

కలివిడిగా మసలుకో..

కలకాలం సుఖసంతోషాలు పంచుకో..!


బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.

పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే.


ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు.


భర్తకి భార్య బలం కావాలి.

బలహీనత కాకూడదు

భార్యకి భర్త భరోసా కావాలి

భారం కాకూడదు.

భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి

అయోమయం కాకూడదు.


మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.


అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే

ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.


పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా,కష్టం- సుఖం గురించి కాదు.

ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.

 ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.


చిరునవ్వులతో కూడిన దంపతులారా అందుకోండి ఇదే నా సలాం!


         👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👫👫👫👫🙏🙏

చర్చ వాదన తగువు

 చర్చ 

వాదన 

తగువు 


భోజనం చేస్తున్న భర్తతో 

భార్య -:   కూరలో ను పులుసుల్లోనూ ఉప్పుతక్కువైనా వంక పెట్టకుండా తింటున్నావ్ యేమైంది 

 భర్త -: అబ్బో భలే వంట పెళ్ళైన  35 యేళ్ళనుండీ రోజూ సరీగా చేస్తున్నట్లు 

భార్య -: సరీగా చేయడం లేదా ? మన పెళ్ళైన మూడోరోజు వెంకటేశ్వారా టాకీసు  లో సినిమాకీ పోయినపుడు బరువు చూసుకుంటే 53 కిలోలు 

 మొన్న డాక్టర్ దగ్గరకు పోయినపుడు చూస్తే 72 కిలోలు 

సరీగా వండకపోతేనే 20 కిలోలు పెరిగావా ? 

భర్త -:మా అమ్మ 24 యేళ్ళలో 53 కిలోలు  పెంచి నీచేతిలో పెడితే 35 యేళ్ళలో 20 కిలోలు పెంచావ్ 

.

.

.

.

.

.

.

.మొదలైంది బాబోయ్😄😄😄😄😄😄

నోరారా బంధాలను ఆప్యాయంగా తెలుగులో పిలుచుకుందాం

 నోరారా బంధాలను ఆప్యాయంగా తెలుగులో పిలుచుకుందాం

🎊💦🌹🏵️🌻🦜🌈


*_" అమ్మ " అనే పిలుపులో  "_* *_ఆప్యాయత " ఉంది .._*


*_" నాన్న " అనే పిలుపులో  " నమ్మకం " ఉంది .._*


*_" తాత " అనే పిలుపులో " తన్మయత్వం " ఉంది .._* 


*_" అమ్మమ్మ " అనే పిలుపులు " అభిమానం " ఉంది .._* 


*_" నానమ్మ " అనే పిలుపులో " నవ్వు ముఖం " ఉంది .._*


*_" అత్త " అనే పిలుపులో " ఆదరణ " ఉంది .._*


*_" మామ " అనే పిలుపులో " మమకారం " ఉంది .._* 


*_" బాబాయ్ " అనే పిలుపులో " బంధుత్వం " ఉంది .._*


*_" చిన్నమ్మ " అనే పిలుపులో " చనువు" ఉంది .._*


*_" అన్నా " అనే పిలుపులో " అభయం " ఉంది .._*


*_" చెల్లి " అనే పిలుపులో " చేయూత "  ఉంది .._*


*_" తమ్ముడు " అనే పిలుపులో " తీయదనం " ఉంది .._*


*_" అక్క" అనే పిలుపులో " అనురాగం " ఉంది .._*


*_" బావా " అనే పిలుపులో " బాంధవ్యం " ఉంది .._*


*_" వదినా " అనే పిలుపులో " ఓర్పు " ఉంది .._* 


*_" మరదలు " అనే పిలుపులో " మర్యాద " ఉంది .._*


*_" మరిది " అనే పిలుపులో " మానవత్వం " ఉంది .._* 


*_" గురువు " అనే పిలుపులో " గౌరవం" ఉంది .._*



*_నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి అన్నీ పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి ._*


*_కనీసం" పిలుపులో " నయినా  మన " అచ్చ తెలుగులో " పిలుచుకుందాం బంధాలను నిలబెట్టుకుందాం ...*


 


*నోరారా బంధాలను ఆప్యాయంగా తెలుగులో పిలుచుకుందాం*


🎊💦🌹🦚🌻🌈🦜

నీ శత్రువులు ఎవరో తెలుసా

 నీ శత్రువులు ఎవరో తెలుసా

      


 *మనిషికున్న ప్రబల శత్రువుల్లో ఆరోది అసూయ. కోరిక, కోపం, మోహం, లోభం, అహం- వీటిని జయించిన ఎంతటి తపోధనులు అయినా... అసూయకు అతీతులు కాదని చాటే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరు మునులు కఠోర తపస్సు చేస్తున్నారు. కొంత కాలానికి దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని ఒకరిని అడుగుతాడు. సమీపంలో మరో ముని తపస్సు చేస్తున్నాడు, అతడు కోరిన దానికి రెట్టింపు నాకు ఇవ్వమని అడుగుతాడు. దేవుడు రెండో ముని వద్దకు వెళ్ళి, మొదటి ముని కోరిన కోరిక తెలిపి, నీకేం కావాలి అంటాడు. వెంటనే ఆ రెండో ముని ‘నాకు ఒక కన్ను పోవాలి’ అని కోరుకుంటాడు. దేవుడు తథాస్తు అంటాడు. ఫలితం తెలిసిందే!* 


 *బాల్యంలో ఊహ కలిగినప్పటి నుంచే అసూయ మొదలవుతుంది. అమ్మ ఒక పిల్లవాడిని ముద్దు చేస్తే మరొకరికి అసూయ, అసహనం కలుగుతాయి. రుక్మిణిపై అసూయ కారణంగానే శ్రీకృష్ణుణ్ని సత్యభామ వీధిలో విక్రయించి, తులాభారం వరకు తీసుకెళ్ళింది. అసూయను పూర్తిగా త్యజించి అప్రమత్తంగా ఉండేవారు సమస్త విశ్వంలోని ప్రేమను పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు. దాన్ని నిస్వార్థంగా పంచగలుగుతారు.* 


 *‘అసూయ కలిగినవాళ్లు ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడూ అసంతృప్తితో, ప్రతీకారేచ్ఛతో, సందర్భం కోసం ఎదురు చూస్తుంటారు. తమకు ఎంత ఉన్నా ఎదుటివారికి ఉన్న ‘కొంత’ను చూసి అసంతృప్తితో రగిలిపోతుంటారు. నూరుగురు అన్నదమ్ములు, రాజ్యం, సకల సంపదలున్న దుర్యోధనుడు- దాయాదులైన పంచ పాండవులకు సూది మొన మోపినంత భాగం కూడా ఇవ్వననడం అసూయకు పరాకాష్ఠ. అసూయతో సాధించేది శూన్యమని గ్రహించలేకపోవడం* *మూర్ఖత్వం. అసూయ కట్టెకు అంటుకున్న నిప్పు లాంటిది. అసూయకు ఆశ్రయం ఇస్తే వారిని అది చెదపురుగులా తొలుస్తూ, ఆఖరికి అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తుంది.* 


 *అసూయను పట్టుకుని శిఖరాగ్రం వరకు ఎవరైనా చేరారనుకోండి. అక్కడి నుంచి కిందకు చూస్తే, ఏ ఒక్క బంధం కనుచూపు మేరలో కనిపించదు. పైకి వెళ్ళలేక, కిందకు రాలేక, త్రిశంకు స్వర్గమనే శూన్యంలో ఒంటరిగా మిగలాలి.* 



Wednesday, November 24, 2021

 ఆకాశం-మనకోసం

  🌺 ఆకాశం-మనకోసం🌺

                 


గేటు తెరుచుకున్న 🏠చప్పుడయింది.


అప్పుడే నిద్రపడుతున్న శంకరానికి నిద్రా

భంగం అయింది.


    తలతిప్పి ⏰గడియారం వంక చూశాడు.

సమయం రాత్రి పదకొండు అయింది. “ఈ సమయంలో వచ్చింది ఎవరా? అని ఆలోచించలేదతను. వచ్చింది నాన్న కోసమే!” అని మాత్రం అనుకున్నాడు.


    అంతలో పక్కగది తలుపు తెరుచుకుంది. "నువ్వా రమణయ్యా! ఈ సమయంలో వచ్చావు. మందేమైనా కావాలా?" అని తండ్రి అడగడం శంకరానికి వినిపిస్తూనే ఉంది.


     "ఉన్నట్లుండి ఆయాసం వచ్చిపడింది. ఊపిరి సలపడం లేదు. అందుకే ఈ సమయంలో వచ్చాను. ఏమీ అనుకోకు

క్రిష్ణమూర్తీ!" అన్నాడు రమణయ్య.


 “మరేం ఫర్వాలేదు.అలా కూర్చో! మందు ఇస్తాను" అన్నాడు క్రిష్ణమూర్తి. అతనిచ్చిన మందు వేసుకుని అయిదు నిముషాల తరువాత వెళ్లిపోయాడు రమణయ్య.


  క్రిష్ణమూర్తి బయట గేటు వేసి వచ్చి మంచం మీద నడుము వాల్చాడు.నిద్రాభంగం అయిన శంకరానికి మరిక నిద్ర పట్ట

లేదు. అందుకు కారకుడైన తండ్రి మీద పీకలదాకా కోపం వచ్చింది. అది వెంటనే వెళ్లగక్కకపోతే మరిక  నిద్రపట్టదని

నిశ్చయం అయ్యాక మంచం మీద నుంచి లేచి తండ్రి గదిలోకి వెళ్లాడు.


  “ఏం శంకరం! నిద్ర పట్టలేదా?" పలకరించాడు క్రిష్ణమూర్తి.“పట్టిన నిద్ర నీ వలన పాడైంది. అయినా మందులు ఇవ్వడానికి వేళాపాళా లేదా? ఎప్పుడు పడితే అప్పుడు రావద్దని వాళ్లకు చెప్పు" అన్నాడు విసుగ్గా.


“వచ్చే రోగం వేళాపాళా చూసుకుని వస్తుందా? ఏదోచేతనైన సహాయం చేస్తున్నాను. కోపగించకు" అన్నాడు

క్రిష్ణమూర్తి.


"నీ మటుకు నీవుండక ఎందుకొచ్చిన సహాయాలు? ఇంటిని సత్రం చేస్తున్నావు. ఎప్పుడూ ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు" చికాకు పడుతూ తన గదిలోకి వెళ్లిపో

యాడు శంకరం.


    కొడుకు మాటలకు క్రిష్ణమూర్తి మనసు చివుక్కు మంది. అది అతనికి కొత్తేమీ కాదు. ప్రతీసారీ బాధనిపిస్తూనే ఉంటుంది. ప్రక్కవాడికి సహాయం చేయడం తప్పా? మనిషికి మనిషి సహాయం చేయకపోతే మరెవరుచేస్తారు? మనిషి తన మటుకు తాను ఉంటే కుంచించుకుపోతాడు. పదిమందికి సహాయం చేస్తేపరిమళిస్తాడు అన్నది అతని భావన. అతను అలాగే

ఉంటాడు. అందరూ అలా ఉండాలని అనుకుంటాడు.


    శంకరానికి నిద్రపట్టలేదు. తండ్రితో అంత కటువుగా మాట్లాడకుండా ఉండ వలసింది అనుకున్నాడు.


    శంకరానికి పదేళ్ల వయసు వచ్చేసరికి

అతని తల్లి కాలం చేసింది. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా క్రిష్ణమూర్తి మరలా రెండో పెళ్లి చేసుకోలేదు. శంకరాన్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాడు. ఆ అభిమానం

శంకరానికి లేకపోలేదు. వద్దనుకుంటూనే తండ్రి మీద కోపగించుకుంటూ ఉంటాడు.


      తలతిప్పి చూసిన శంకరానికి భార్య ఇందిర, అయిదేళ్ల కొడుకు అనిల్ నిద్రపోతూ కనిపించారు.శంకరానికి కంటిమీదకు కునుకు రాలేదు.


   తెలతెలవారుతుండగా బయట గేటు తీసిన చప్పుడయింది.అప్పుడే నిద్ర పడుతున్న శంకరానికి వెంటనేమెలకువ వచ్చింది. 'ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. అప్పుడే తగలడ్డారు' అని మనసులో తిట్టుకున్నాడు.


   క్రిష్ణమూర్తికి యోగాలో మంచి ప్రవేశం ఉంది.  రిటైరయ్యాక నలుగురిని పిలిచి ఆసనాలు వేయించడం, ధ్యానం

చేయించడం వంటివి నేర్పించడం మొదలు పెట్టాడు.


    ఎప్పుడూ పదిమందికి తక్కువ కాకుండా జనం అతని దగ్గరకు వస్తూనే ఉంటారు.

అది శంకరానికి నచ్చదు. ఎవరింటి దగ్గర వాళ్లుయోగా చేసుకోవచ్చు కదా! మా ఇంటి మీదకు వచ్చిపడతారెందుకు? అనుకుంటాడు. అదే విషయం తండ్రితో

వాదించాడు కూడా!


    ఎవరింటి దగ్గర వాళ్లుఅయితే

బధ్ధకిస్తారు.అదే పదిమందీ ఒక చోట చేస్తే శ్రద్ధగా చేస్తారు.మనిషి పది మందితో కలిస్తే చాలా ప్రయోజనాలుంటాయి. నీవు కూడా వచ్చి వాళ్లతో పాటు యోగా చేయి. ఆరోగ్యానికి ఆరోగ్యం.మానవ సంబంధాలు మెరుగుపడతాయి" అని చెప్పేవాడు

క్రిష్ణమూర్తి.ఆ మాటలు శంకరానికి రుచించేవి కావు.


   సమయం అయిదు గంటలు అయింది. శంకరం మరలా నిద్రపోవడానికి ప్రయత్నించాడు గాని నిద్ర పట్టలేదు.

అతనికి త్వరగా నిద్ర పట్టదు. పట్టినా చిన్న చప్పుడుకే మెలకువ వచ్చేస్తుంది.

అది తెలుసుకున్న క్రిష్ణమూర్తి ఒకసారి 'శంకరం! నీవు ఇష్టపడే ఒంటరితనం నీలో అభద్రతా భావంపెంచింది. నీ సంతోషం హరిస్తున్నది. అది నీవు గ్రహించడం లేదు. నీ మటుకు నీవుంటే నీ సంతోషం నీది. నీ

దుఃఖం నీది. బయటకి వచ్చి పదిమందితో పంచుకుంటే నీ సంతోషం మరింత పెరుగుతుంది. దుఃఖం తగ్గుతుంది" అని సలహా ఇచ్చాడు. తండ్రి మాటలు ఛాద

స్తంగా కొట్టిపారేశాడు శంకరం.


    ఏడు గంటలకు యోగా క్లాస్ పూర్తి అయింది. వచ్చినవారు వెళ్లిపోయారు. క్రిష్ణమూర్తి డాబా మీద నుంచి కిందకు దిగాడు. అప్పటికీ శంకరం కాఫీ తాగి పేపర్ 

చదువుకుంటున్నాడు.


   “కొంచెం సేపు ధ్యానం చేయకూడదూ? ఏకాగ్రత పెరుగుతుంది" అన్నాడు క్రిష్ణమూర్తి. శంకరం పేపర్ లోంచి

తలెత్తకుండానే “అవన్నీ పనీపాటా లేనివారికి. నాకెందుకు?" అన్నాడు.


క్రిష్ణమూర్తి మౌనంగా లోనికి నడిచి అప్పుడే నిద్రలేచిన మనవడ్ని పలకరించి వాడితో సూర్యనమస్కారాలు ప్రాక్టీస్ చేయించ

సాగాడు. అది చూసిన శంకరం “ఈయనగారు ఎవరినీ వదలడు" అనుకున్నాడు.


    శంకరం స్నానం చేసి, టిఫిన్ తిని ఆఫీస్ కి బయలుదేరబోతుండగా క్రిష్ణమూర్తి అతని దగ్గరకువచ్చాడు.


  “ఏమిటి?” అడిగాడు శంకరం. అతను,

శంకరానికి అయిదు వందలు అందించి “ఈ

చిరునామాకు మనీ ఆర్డర్ పంపించు" అని

చెప్పాడు. "ఎందుకట?" వివరం అడిగాడు శంకరం.


    "ఆ అబ్బాయికి చిన్న వయసులోనే గుండెజబ్బట. ఆపరేషన్ కి ఆర్ధిక

సహాయం కోరుతూ పేపర్ ప్రకటన

ఇచ్చారు. నేను చేయగల సహాయం

చేస్తున్నాను" చెప్పాడు క్రిష్ణమూర్తి. 


"అవన్నీ దొంగ ప్రకటనలు" చెప్పాడు శంకరం."మనిషి మీద అంత అపనమ్మకం పెంచుకోకు శంకరం! మనిషి, మనిషిని నమ్మకపోతే అది మానవ మనుగడకే ముప్పు"  కొడుకును హెచ్చరించాడు క్రిష్ణమూర్తి.


    అంతలో అటు వచ్చిన ఇందిర, భరతో 'మామయ్య పెన్షన్ డబ్బు ఆయన ఇష్టం వచ్చినట్లు వాడుకోమని మీరే కదా ! చెప్పారు.

ఆయన చెప్పినట్లు మని ఆర్డర్ చేయండి.

సరిపోతుంది" అన్నది.


  కృష్ణ మూర్తికోడలి వంక ప్రేమ పూర్వకంగా చూశాడు.శంకరం ,భార్య వంక అదోలా 

చూసి బయటకు నడిచాడు.


  శంకరం స్కూటర్ స్టార్ట్ చేస్తూ "అనిల్ ని ఒకసారి బయటకు పిలువు" అని భార్యకు చెప్పాడు."అనిల్ !డాడీ పిలుస్తున్నారు" కేక వేసింది ఇందిర.


    వీడియో గేమ్ ఆడుకుంటున్న అనిల్ బయటకురాకుండానే "బై డాడీ" అని అరిచి చెప్పాడు.కొడుకు బయటకు రాక పోవడం

శంకరానికి బాధ కలిగించింది. ఆఫీస్ కి బయలుదేరిపోయాడు.


    మనవడు బయటకు రాకుండానే బై చెప్పడం గమనించిన క్రిష్ణమూర్తి "మనిషి మనసుతో చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీయాంత్రికం అయిపోతున్నాయి. కొంత కాలానికి మనిషి, మనసులేని మరబొమ్మ అయిపోతాడు" అనుకున్నాడు.


   అతను మనవడి దగ్గరకు వెళ్లి 'అని ల్! నాన్న పిలిచినప్పుడు బయటకు వెళ్లి ప్రేమగా బై చెప్పాలి.అప్పుడతని మనసుకు సంతోషం కలుగుతుంది.వీడియో గేమ్ ఎప్పుడూ ఉంటుంది. డాడీ మళ్లీ

సాయంత్రానికి గాని రాడు" అని చెప్పాడు.


   “అలాగే తాతయ్యా! రేపటి నుంచి బయటకు వెళ్లి డాడీకి బై చెప్తాను" అన్నాడు అనిల్. "కొడుకు కంటే మనవడే నయం. విషయం గ్రహించాడు" అనుకున్నాడు క్రిష్ణమూర్తి.


ఆయనకు భోజనం వడ్డించే సమయంలో

“మామయ్యా! ఎల్లుండి అనిల్ పుట్టినరోజు. మీ యోగా వాళ్లను భోజనానికి పిలుద్దాం" అన్నది. ఇందిర. అతను కోడలు

వంక అపురూపంగా చూశాడు. అతనికి శంకరం ఒక్కడే కొడుకు, కూతుళ్లు లేరు. అందుకని అతను కోడలులోనే కూతురిని చూసుకుంటాడు. ఆ అమ్మాయి కూడా అంతే.

మామగారిని పన్నెత్తి మాట అనదు. గౌరవం

చూపిస్తుంది. ప్రేమ కురిపిస్తుంది.


   "వాళ్లను పిలవడం శంకరానికి ఇష్టం

ఉండదేమో!" అన్నాడు క్రిష్ణమూర్తి. “ఆయనఎవరినీ పిలవొద్దనే అన్నారు. అయినా రోజూ మన ఇంటికి వచ్చేవాళ్లకు చెప్పక పోతే ఏం బాగుంటుంది? మీరు ఆహ్వా

నించండి. మీ అబ్బాయికి నేను నచ్చ చెప్తానులెండి" అన్నది ఇందిర.

“అలాగేనమ్మా!" అన్నాడు. క్రిష్ణమూర్తి.


  ఆ సాయంత్రం శంకరం ఇంటికి వచ్చాక “మనీ ఆర్డర్ పం పావా" అని అడిగాడు క్రిష్ణమూర్తి. "పంపాను. అది చూసి మా కొలీగ్ నవ్వాడు"అని చెప్పాడు శంకరం.


  "ఎందుకు నవ్వాడు?" అడిగాడు క్రిష్ణ మూర్తి."తనకు ఉన్నదేదో మనవడికి ఇవ్వాలి గాని బయట వాళ్లకు దానం చేయడం ఏమిటి! అని కామెంట్ చేశాడు" చెప్పాడు శంకరం. “నువ్వేమన్నావు?"ఆరా తీశాడు క్రిష్ణమూర్తి. "అది నిజమే కదా! అందుకే మౌనం వహించాను" చెప్పాడుశంకరం.


    "మనవాళ్లకే ఉపయోగ పడాలి అనుకోవడం  స్వార్థం అవుతుంది.అందరూ మనవాళ్లే అనుకోవడం ప్రేమ అనిపించుకుంటుంది. మనిషి ప్రేమించడం నేర్చుకోవాలని నీ కొలీగ్ కి చెప్పు" అన్నాడు క్రిష్ణమూర్తి.


     శంకరం తండ్రివంక విసుగ్గా చూసి ఊరుకున్నాడు.


 వ్   శంకరం కాఫీ తాగుతుండగా "అనిల్  పుట్టిన రోజుకి యోగా వాళ్లను పిలవమని మామయ్యకు చెప్పాను" అంది ఇందిర.

“నేననుకోవడం ఈ ఆలోచన నీది కాదు. మా నాన్నది" అన్నాడు శంకరం. ఇందిర కాదని చెప్పినాశంకరం వినిపించుకోలేదు.


   కాఫీ తాగడం పూర్తయ్యాక తండ్రి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో క్రిష్ణమూర్తి

మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు.

“బాబు పుట్టిన రోజుకి యోగావాళ్లను పిలుస్తానన్నావట. వాళ్లు రావడం నాకిష్టం లేదు"చెప్పాడు శంకరం.


  “అయితే మీ ఆఫీస్ స్టాఫ్ ని పిలువు. పుట్టిన రోజునాడు పదిమంది వచ్చిబాబు మీద అక్షింతలు వేసి దీవిస్తే మంచిది"

చెప్పాడు క్రిష్ణమూర్తి.


“మావాళ్లు బిజీ. రాలేరు" చెప్పాడుశంకరం. “ఇంట్లో టీవీ చూస్తూ కూర్చోవడం,

ప్రక్కింటి వాళ్లతో కూడా సెల్ ఫోన్ లో

మాట్లాడ్డం ఇదేగా మీ దృష్టిలో బిజీగా

ఉండడం?" ప్రశ్నించాడు క్రిష్ణమూర్తి.


 “అదేం కాదు. పిల్లల్ని కష్టపడి చదివిం చడం, టాలెంట్ పరీక్షలు రాయించడం వంటి

పనుల్లో వాళ్లు బిజీ" చెప్పాడు శంకరం.

“పిల్లల మనసుల్ని చదువుల పేరుతో

మీరు ఎదగనివ్వడం లేదు. మొగ్గలుగా ఉండగానే తుంచేస్తున్నారు. మానవ సంబంధాలు దెబ్బతినడానికి ఇది ఒక కారణం" అన్నాడు క్రిష్ణమూర్తి,


   అంతలో అక్కడకు వచ్చిన ఇందిర,

భర్తతో “రోజూ మన ఇంటికి వస్తున్నారు.

ఏనాడూ మనం కాఫీ ఇచ్చింది కూడా లేదు.

ఒక్క రోజైనా పిలిచి పలకరిస్తేబాగుంటుంది" అన్నది.


  శంకరం భార్య వంక గుర్రుగా చూశాడు.

ఆ రాత్రి క్రిష్ణమూర్తికి చాలాసేపు నిద్రపట్ట

లేదు. అతను తరిగిపోతున్న మానవ సంబం

ధాల గురించి ఆలోచించాడు. యంత్రాల మధ్య పడి మనిషి కూడా ఒక యంత్రంగా మారిపోతున్నాడు. మనిషికిమనసే తరగని ఆస్తి అన్న సత్యం మరచి పతనాన్ని కొని

తెచ్చుకుంటున్నాడు” అని ఆలోచించాడు. 


   అనిల్ పుట్టిన రోజు వచ్చింది. ఆ రోజు సాయంత్రం క్రిష్ణమూర్తి పిలుపు అందుకున్న యోగా బృందం వాళ్లింటికి వచ్చింది. బాబుకి నీతి కథల పుస్తకాలు, ఆటబొమ్మలు

తెచ్చిచ్చారు. తాము తెచ్చిన స్వీట్స్ బాబు చేత తినిపించారు. అక్షింతలు వేసి దీవించారు. పాటలు పాడి అనిల్ నిఆనందపరిచారు. వాడి చేత ఆడించారు, పాడించారు.

శంకరంతో కూడా కలుపుగోలుగా మాట్లాడారు.


 వ ఎందుకో తెలీదుగానీ శంకరానికి  కూడా

ఆ సాయంత్రంఆనందంగా గడిచిందనిపించింది. వాళ్లు వచ్చి ఉండకపోతే

ఆ వేడుకకు అంత నిండుదనం వచ్చి ఉండేది కాదనుకున్నాడు.


వాళ్లందరూ వెళ్లాక క్రిష్ణమూర్తి, కొడుకుతో “మావాళ్లు రావడం నీకేమైనా ఇబ్బందిగా అనిపించిందా?" అని అడిగాడు.


“అటువంటిదేం లేదు. సంతోషంగానే అనిపించింది"మనస్ఫూర్తిగా చెప్పాడు శంకరం.


“శంకరం! ఒక సత్యం చెబుతాను. నాది ఛాద

స్తంగా భావించకుండా మనసు పెట్టి అలోచించు.మొక్కను తెచ్చి గదిలో పెడితే వాడిపోతుంది. బయట పెడితే చిగురిస్తుంది. దానికి జీవం పోసేది సూర్యకిరణం. ఇదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది. ఒంటరిగా

గదిలో కూర్చుంటే మనసు చచ్చిపోతుంది. బయటకువెళ్లి పదిమందితో గడిపితే అది సేద తీరుతుంది. మనసుకు ప్రాణం పోసేది  ప్రేమ అని మరువకు" అని

చెప్పాడు క్రిష్ణమూర్తి. 


   ఎప్పటిలా ఈసారి తండ్రిమాటలు శంకరం ఖండించలేదు. మౌనం వహించాడు.

ఆ రాత్రి క్రిష్ణమూర్తికి గుండెలో నొప్పిగా అనిపించింది. కొడుకును నిద్ర లేపి విషయం చెప్పాడు.ఎప్పుడూ ఏ నొప్పీ అనని తండ్రి ఒకేసారి గుండెనొప్పి అనగానే శంకరం కంగారుపడ్డాడు. "హాస్పిటల్ కి వెళ్దాం!" అన్నాడు. 


   “ఉదయం వెళ్దాం" అంటూ క్రిష్ణమూర్తి హోమియో మందులేసుకుని కళ్లు

మూసుకుపడుకున్నాడు. శంకరం తండ్రి మంచం పక్కనే పడక కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.


అర్ధరాత్రి చూస్తే తండ్రి ఊపిరి పీలుస్తున్నట్లు అనిపించలేదు. నాడి చూసిన శంకరం తండ్రి ప్రాణం

పోయినట్లు గ్రహించి కంట తడి పెట్టుకున్నాడు.విషయం తెలుసుకున్న ఇందిర, అనిల్ పెద్దగా ఏడవ సాగారు. 


   బంధువులకు, స్నేహితులకు కబుర్లు అందాయి.అంత దుఖం లోనూ శంకరానికి

ఆశ్చర్యం కలిగించింది ఏమంటే కబురు చేసిన వారి కంటే వచ్చిన వారు పది రెట్లున్నారు.


   ఇంటి ముందున్న రోడ్డు అంతా జనంతో నిండిపోయింది. అందరూ విషాద వదనాలతో కనిపించారు.


క్రిష్ణమూర్తి మంచితనం గురించి,అతను తమకు చేసిన సహాయం గురించి కథలు కథలుగా చెప్పుకోసాగారు.


  “శంకరం! పూలదండలోని దారం బయకు కనిపించదు.కానీ అది పూలనన్నింటినీ దగ్గరకు చేరుస్తుంది.ప్రేమ కూడా అంతే! అది బయటకు కనిపించదు. కానీ

మనుషులనందరినీ దగ్గరకు చేరుస్తుంది" అన్న తండ్రిమాటలు గుర్తుకొచ్చాయి శంకరానికి.


   మధ్యాహ్నానికి శవయాత్ర మొదలయింది. పాడెమోయడానికి చాలామందిముందుకు వచ్చారు. భుజం మార్చుకుంటూ తమ అభిమానం చాటుకున్నారు. సాయంత్రానికి అంత్యక్రియలు కార్యక్రమం ముగిసింది.


  ఆ తరువాత ప్రతీరోజు ఎవరో ఒకరు వచ్చి శంకరాన్ని కలిసి అతని తండ్రి మంచితనాన్ని పొగిడి, అతనికి ఓదార్పు మాటలు చెప్పేవారు. పెద్దకర్మ కూడా జరిగిపోయింది. ఇక

అంతటితో అంతా ముగిసిపోయిందని ఇక ఎవరూ తమఇంటికి రారని ఊపిరి 

పీల్చుకున్నాడు శంకరం.ఆ రాత్రి గాఢంగా నిద్రపోయాడు. 


  తెలతెలవారుతుండగా మెలకువ వచ్చింది. తండ్రి చనిపోయేవరకూ ప్రతీ రోజూ ఆ సమయానికి బయట గేటు తెరుచుకునేది. డాబా మీద తండ్రి, వచ్చినవారితో కలసి ఆసనాలు వేసేవాడు.వాళ్ల మాటలు, చిన్న చిన్న శబ్దాలు లీలగా వినిపించేవి.

అప్పట్లో వాళ్ల వలన నిద్రపాడైందని తిట్టుకునేవాడుశంకరం. ఇప్పుడా నిశ్శబ్దం అతని మనసుకు బాధను కలిగించింది.


    భోజనం చేసి ఆఫీసుకి బయలుదేరి నప్పుడు పిలవకుండానే అనిల్ బయటకు వచ్చి బై చెప్పాడు. 'పిలిచినా రానివాడివి. ఈరోజు పిలవకుండానే వచ్చి బై

 చెబుతున్నావు. ఏమిటి విశేషం?" అడిగాడు శంకరం.


   “తాతయ్య చెప్పారు. నేను బయటకు వచ్చి నీకు 'బై' చెబితే నీ మనసుకు సంతోషం కలుగుతుందట" చెప్పాడుఅనిల్. శంకరం కళ్లముందు తండ్రి రూపం కదలాడింది.

మనసును ఎవరో మెల్లగా స్పృశించినట్లు

అనిపించింది.కన్నుల్లో చెమ్మ చేరింది.

కొడుక్కు ' బై' చెప్పి బయలుదేరి పోయాడు.

 

   ఆ సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు కూరగాయల దుకాణానికి వెళ్లాడు. దుకాణం అతను ఆప్యాయంగా పలకరించి “నాన్నగారు పోయారని తెలిసింది. ఊరిలోలేక

రాలేక పోయాను. మహానుభావుడు. ఈ దుకాణం పెట్టుకోడానికి బ్యాంక్ లోన్ ఇప్పించి సహాయం చేశాడు.అతన్ని ఎప్పటికీ మరచిపోలేను" అని చెప్పాడు.


  “నాన్న కనిపించకుండా ఎంత చేశాడు?” అనుకున్నాడు శంకరం. నెల రోజుల తరువాత శంకరానికి ఒక విషయం అర్థమయింది. తను భావించినట్లు చనిపోవడంతో తండ్రి అధ్యాయం ముగిసిపోలేదు. ప్రతిరోజూ ఎవరో ఒకరు క్రిష్ణమూర్తి సహాయాన్ని, మంచితనాన్ని, ప్రేమను శంకరం దగ్గర గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.


  ఒకరోజు శంకరం టవల్స్ కొనడానికి బట్టల కొట్టుకువెళ్లాడు. అది పేరుమోసిన బట్టల దుకాణం. ఆ దుకాణం

యజమాని శంకరాన్ని చూడగానే పలకరింపుగా నవ్వి“మీరు క్రిష్ణమూర్తిగారి అబ్బాయి కదూ!” అని కూర్చోబెట్టి మర్యాద చేశాడు.


     “అప్పుడప్పుడూ మీ నాన్నగారు వచ్చి ఇక్కడ కూర్చునేవారు. ఒకసారి నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నాననిచెప్పాను. మానసిక అశాంతి వలన అయి ఉంటుంది.ధ్యానం చేయమని సలహా ఇచ్చారు. ధ్యానం ఎలా చేయాలో కూడా వివరించారు. అప్పటినుంచి ధ్యానం చేస్తున్నాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంటున్నది.ఆయన చనిపోవడం దురదృష్టకరం" అని బాధపడ్డాడు

దుకాణదారు.


తండ్రి ఎందరి మనసుల్లోనో నిలిచి పోయాడు అన్న సత్యం గ్రహించేసరికి శంకరానికి దిగులుగా అనిపించింది. అటు

వంటి తండ్రిని తను ఖాతరు చేసేవాడు కాదు. ప్రేమ చూపించేవాడు కాదు. ప్రతి చిన్న విషయానికి తప్పు పట్టేవాడు. శంకరం మనసులో తీవ్రంగా బాధపడ్డాడు.


   అతను ఇల్లు చేరగానే ఇందిర ఒక ఉత్తరం అందించింది. చనిపోయిన తండ్రి పేరున ఉన్నదా ఉత్తరం.శంకరం కవరు చింపి చదివాడు.


     "శ్రీయుతులు క్రిష్ణమూర్తి గారికి! నమస్సులు. మీవంటి వాళ్లు పంపిన విరాళం చిన్న మొత్తము కావచ్చు. కాని అది

కష్టకాలంలో నాకెంతో ధైర్యాన్నిచ్చింది. నేను ఒంటరిని కాదు.నాకు తోడుగా చాలామంది ఉన్నారన్న ఆత్మసంతృప్తిని కలిగించింది. మీకు ధన్యవాదాలు... ఇట్లు .. గోపీ

అని ఉందా ఉత్తరంలో.


   శంకరం గోడకు తగిలించిన తండ్రి ఫోటో వంకచూశాడు. “శంకరం! మనిషి- నేను, నా కుటుంబం అన్న సంకుచితత్వం నుంచి బయటపడి మనం - మన వసుధైక

కుటుంబం అన్న విశాల దృక్పథం అలవరచుకోవాలి" అని చెబుతున్నట్లు అనిపించింది.


ఆ రాత్రి శంకరానికి నిద్ర కరువయింది. తనకు,తండ్రికి తేడా ఏమిటో అతను స్పష్టంగా గ్రహించగలిగాడు.తన తండ్రి మనసున్న మనిషి. తను మనసులేని మరబొమ్మ.తనకు జీవన సౌందర్యం తెలియదు. అదెలా ఉంటుందో తండ్రి తెలియబరిచాడు.


    ఒక ఆదివారం అతను తన తండ్రి బ్రతికి ఉండగా యోగాసనాలు వేయడానికి తమ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరి ఇంటికి వెదుక్కుంటూ వెళ్లాడు. “మా నాన్నగారు చనిపోయారని మీరు మా ఇంటికి రావడం మానుకోకండి. నేనూ మీతో కలుస్తాను. యోగాతో నాన్నగారికి అంజలి ఘటిద్దాం" అని ఆహ్వానించాడు. అందుకు వారందరూ

సంతోషంగా తమ సమ్మతి తెలిపారు.


     మరునాడు తెలతెలవారుతుండగా శంకరం ఇంటి బయటి గేటు తెరిచాడు. వస్తున్న వారందరికీ హృదయ పూర్వకంగా ఆహ్వానం పలికాడు. డాబా పైకి వెళ్లి వాళ్లతో

పాటు ఆసనాలు వేశాడు. ఆ తరువాత ధ్యానంలో కూర్చున్నాడు.


    మనసులో తండ్రి రూపం కనిపించింది. “శంకరం!మనిషి తలుపులు మూసుకుని ఒంటరిగా గదిలో ఉండిపోతున్నాడు. అది తప్పు. మన కోసం ఆకాశం బయట వేచి

చూస్తున్నదని తెలుసుకోవాలి. ఇంటి తలుపులే కాదు,మనసు తలుపులు కూడా తెరుచుకుని బయటకు రావాలి.అప్పుడు ప్రపంచమే అతనిదవుతుంది" తండ్రి చెప్పిన

మాటలు మనసులో ప్రతిధ్వనించాయి.


   శంకరం కళ్లు తెరిచాడు. గదిలో ఉంటే కనిపించని ఆకాశం ఎంతో అందంగా,విశాలంగా కనిపించింది.మనసు

కొత్త చిగురు తొడిగిన భావన కలిగింది 


     తొలిసారి అతని మనసుకు ఎంతో సంతోషం, ప్రశాంతత కలిగాయి.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Tuesday, November 23, 2021

అమ్మచేతి వంట.. కొన్ని ముచ్చట్లు !

 అమ్మచేతి వంట.. కొన్ని ముచ్చట్లు !

~~~~~~~~~~~~~~~~~~~~~~~~


అమ్మ--  ఒక అక్షయపాత్ర...!

అమ్మ చేతిగుణమేమిటోగానీ వంట అద్భుతం!

శాఖాహార వంటలకు మా వంశంలోనే పెట్టిందిపేరు.

బెండ, కాకర, సోర, గోరుచిక్కుడు వంటి

అంటుపులుసులు అమృతతుల్యంగా చేసేది.

తియ్యబెండకాయ, కలెగూర, టమాటపప్పు,

టమాటాతో బీర, సోర, పొట్ల, కాకరవంటి

కలగలుపుకూరలు వేటికవే సాటిగా ఉండేవి.

రాములక్కాయ కూర గురించి ఎంతచెప్పినా తక్కువే.

పప్పుచారు కలవోసినా, చుక్కకూర పప్పు వండినా

వంకాయకూరవండి - పచ్చిపులుసుచేసినా

ఆ రోజున ఇంటికి పండుగ వచ్చినట్టే ఉండేది.

అనుపపప్పువేసి పచ్చిపులుసుచేస్తే...

వందవంటల్లోనైనా గుర్తుపట్టేటంత మంచిగుండేది.

పెసరుపప్పు మద్దపప్పు వేసి, చింతకాయ చారుచేస్తే

ఇక ఏ కూరగాయల అవసరమూ లేనేలేదు. 

చలికాలంలో మా చేనులో తను పండించిన

అరొక్క కాయగూరలతో వరుగులు చేసేది...

మాకు తక్కున - మందికి ఎక్కువ ఖర్చుజేసేది.

ఎండకాలంల వరుగులతో ఎన్నిరకాల పులుసులో !

అన్నిటిలో ఉల్లిగడ్డ పులుసుది  రారాణివన్నె !!

చింతపండు తొక్కునూరినా, పుంటికూర తొక్కు నూరినా

కొత్తిమీరతో టమాటపచ్చెడ చేసినా దేనికదే పసందు.

పచ్చికాయలతోటి నువ్వుల తొక్కునూరితే ఆ రుచేవేరు.

పచ్చిమిరుపకాయలు నిప్పులమీద కాల్చి 

పచ్చిపులుసు చేస్తే.. పిల్లికూనలెక్క కాళ్లలో తిరిగేవాడిని.


అమ్మకు పిండివంటల కొలతలు కొట్టినపిండి.

అరిసెలకు , లాడూలకు ఆనుకం(పాకం) పట్టాలంటే

వాడకట్టంతా అమ్మనే పిలుచుకపొయ్యేవారు.

చకినాలు చుట్టుటానికి సంక్రాంతికి వారంముందునుండే

ఇంటిచుట్టున్నవాళ్లు అమ్మ దగ్గర హామీ తీసుకునేవారు.

నువ్వుల కరిజలు చేసినా, ఉప్పుడుపిండి పోసినా

అమ్మచేతి కమ్మదనం అమ్మదే...ఇంకెక్కడా దొరుకదు.


చింతకాయ, మామిడికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ,

కరక్కాయ,టమాట... ఏ ఊరగాయ పెట్టినా

మడతమాను అడుగుతేలేదాకా కాదూలేదనకుండా

పనిపాటలోళ్లకు, అచ్చెగాళ్లకు, బిచ్చగాళ్లకు

చేతికి ఎముకలేకుండా అందరికీ కన్నతల్లిగా పంచిపెట్టేది.


అమ్మది--  అరుకతిగల్ల చెయ్యి...!

మాది కాపుదనపు కుటుంబం కనుక చేనుపనికి వెళ్లేది.

చేండ్ల అరొక్కచెట్టు, కాయగూరల పంట పండించేది

పుంటికూరైతే సగం ఊరికి సరిపొయ్యేటంత...

పనికివచ్చిన కైకిలివాళ్లు ఏనాడూ వట్టిచేతులతో 

ఇంటికి తిరిగివెళ్లేవారుకాదు.కొంగునింపుక పొయ్యేవారు.

మూడు నెలలపొద్దు గుమ్మడిచెట్టుకు నీళ్లుపోసి కాపాడితే

సద్దులబతుకమ్మ నాడు పూలన్నీ పలారం పంచిపెట్టేది.

ఈ విషయమై ఎన్నిపండుగలకు ఏడ్చిగగ్గోలు పెట్టేవాడినో !

రకరకాలపూలచెట్లు, కలియామాకు చెట్లు, జామపండ్లు..

కాలాన్ని అనుసరించి కాయగూరలు, ఆక్కూరలు

అడిగినవారికి లేదనకుంట ఆత్మీయంగా పంచిపెట్టేది.

పొరుగూరివారూ, ఎవరో తెలియని బాటసారులూ

మా చేనుదగ్గర ఆగి ఆకలితీర్చుకునేవారు.

ఆడవారికైతే.. గులాబో, దాసనపువ్వో ఇచ్చిపంపేది.


అమ్మది..  పాడిగలిగిన జీవితం...!

పొద్దున గుడిలో మైకు వెయ్యకముందే లేచేది

నాలుగు పాడిబర్లనూ దుడ్డెలనూ అరుసుకునేది

బర్రె ఈనితే మొదటిజున్ను పోచమ్మతల్లికి చెల్లించి

మూడురోజులూ చుట్టుమెట్టు అందరి కుతీ తీర్చేది

ఎంత చలికాలమైనా సరే, పొద్దు ఎక్కకముందే

దాలిలో రోజూ పెద్దకుండెడు పాలుకాగబెట్టేది.

రెండుపూటలా పెరుగుదుత్తలనిండా గట్టి గడ్డపెరుగు

విసుక్కోకుండా వాడకట్టుమీద అందరికీ 

పాలు, పెరుగు ఓపికగా వాడుకలు పోసేది.

అమ్మ చేతి తీపి పెరుగంటే--- కోమట్లకు ప్రాణం

లేదన్నా వినేవారుకాదు, ప్రాణసరం పడేవారు.

బతుకమ్మ పండుగ వస్తుందంటే నెలముందునుంచే

నెయ్యికోసం ఊరంతా మా ఇంటిదారి పట్టి

ఈ రుచి మరోదగ్గర దొరుకదని తేల్చిచెప్పేవారు.

అమ్మ రోజువిడిచిరోజు పెద్దకుండలో చల్లజేసేది

శేరు సర్వెడు వెన్న, రెండు పటువలనిండ చల్ల...

అమ్మది బతికిచెడ్డ సంసారమే 

కానీ పేదసాదల బలుగానికి లోటెప్పుడూ లేదు.

గంగెడ్లవాడు, సాతాని,బుడబుక్కలవాడు

తొలుతొలుత మా ఇంటివాకిలే తొక్కేవారు 

ఊరిలో అడుగుపెట్టిన బిచ్చగాండ్లందరూ

మా ఇంటికేవచ్చి మా అరుగమీదనే వాళ్ల సామానుంచి

ఊరుతిరుగుటకు పొయ్యచ్చి.. అవ్వా దూపైతంది !

అనుడే ఆలస్యం.. అమ్మ పెద్దచెంచెడు చల్లపోసేది.

ఆ చెంబెడు చల్లత్రాగి నీ కడుపు చల్లగుండ బిడ్డ

నీ ఇంటిదీపం కలకాలం చల్లగ వెలుగనియ్యి తల్లి...

అని బీదసాదలు దీవెనార్తి ఇచ్చిపొయ్యేవారు.

ఇదంతా నిన్నటికి ఇరువైయేండ్లకు ముందు కథ !


ఇవాళ అమ్మ లేదు, అన్నపూర్ణ వంటి అమ్మ 

ఇంకెక్కడ, ఎవరి ఋణం తీర్చుకుంటున్నదో..!

రాత్రి ఎనిమిదింటికీ ఊరి అలికిడి మగ్గినంకా

మా ఇంటి కడపతొక్కి ఆకలి తీర్చుకున్న 

అన్నార్తుల దీవెనలే... నాకు కొండంత అండ...


Friday, November 19, 2021

మన ఆచారాలు

 తరతరాలుగా మనం  వింటున్న , క్రమంగా మరచి పోతున్న కొన్ని మన ఆచారాలు. . 

1. సోమ వారం తలకు నూనె రాయరాదు.

2. ఒంటి కాలీపై నిలబడ రాదు

3. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు

4. శుక్రవారం నాడు కొడలిని పుట్టినింటికి పంప రాదు

5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలీ

6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు

7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు

8. సూర్యాస్తమయం తరువాత కసవువూడ్చరాదు, తల దువ్వ రాదు

9. పెరుగును ఉప్పును అప్పు ఈయరాదు

10. వేడి వేడి అన్నం లోనికి  పెరుగు వేసుకోరాడు

11. భోజనం మధ్యలో లేచి పోరాదు

12. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు

13. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు

14. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు

15.  గోడలకు పాదం ఆనించి పడుకో రాదు

16. రాత్రీ  వేళలో బట్టలుతక రాదు

17. విరిగిన గాజులు వేసుకోరాడు

18. నిద్ర లేచిన తరువాత పడుకున్న ఛాపను మడిచి పెట్టాలి

19. చేతి గోళ్ళను కొరకరాడు

20. అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాడు

21. ఒంటి (సింగల్) అరిటాకును తేరాదు

22. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు

23. భోజనం తరువాత చతిని ఎండ పెట్టవద్దు

24. కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు

25. ఇంటి గడపపై కూర్చోరాదు

26. తిన్న తక్షణమే పడుకోరాదు

27. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు

28. చేతులు కడిన పిమ్మట ఝాడించ రాదు

29. రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి

30. ఎంగిలీ చేతితో వడ్డించరాదు

31. అన్నం, కూర చారు వండిన పాత్రలలో తినరాదు

32. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు

33. ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వకుండా  పంపరాదు

34. చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు

35. ఇంటి లోపలికి చెప్పులు Shoes ధరించి రారాదు

36. దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండీ. వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరీద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే.

37. చిన్న జంతువులకు  (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి

38. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించ రాదు

39. ప్రయాణాల్లో అపరిచితులనుండి పానీయాలు, తీడి పదార్థాలు తీసుకోవద్దు.

40. శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు

41. అనవసరంగా కొత్త చెప్పులను కోనరాదు

42. ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి

43. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి. మీకు రావలసివుంటే అవే వస్తాయి.

44. అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి

45. మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.

46. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి

       మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.

మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి

Thursday, November 18, 2021

Happy Mens Day

 దేవుడు చాలా దుర్మార్గుడు...

ఈ రోజు మా మగాళ్ల దినోత్సవం.

అని సంతోషించే లోపే... 

మరుగుదొడ్ల దినోత్సవం కూడా  

ఉందని గుర్తు చేశాడు.😢😢😢

అయినా సరే ఏదైనా ఎంజాయ్ చేద్దామంటే ఈరోజు కార్తీక పౌర్ణమి.


మా బాధలు ఎవరు పట్టించుకుంటారు, ఏడవలేక పైకి నవ్వుతూ తిరిగే మేము మాకు మేమే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము. 


ఈ క్రింది విధంగా 

మా బాధ లు ఎవరు అర్దం చేసుకుంటారు..


🙏అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు నవంబర్19.2021.🙏


⚡ నువ్వు అలిగితే... ఆడపిల్లవా... అని హేళన.


⚡నువ్వు ఏడిస్తే... ఏడ్చేవాడిని

నమ్మొద్దని హేళన.


⚡సరదాగా బయటతిరిగితే... తిరుగుబోతు అని  బిరుదు.


⚡బాధ మరిచిపోవడానికి తాగితే... తాగుబోతు అని బిరుదు.


⚡అమ్మ చెప్పినట్లు వింటే అమ్మ చాటు కొడుకు అని.


⚡భార్య చెప్పినట్లు వింటే పెళ్ళాం చాటు మొగుడని.


⚡చెల్లె, అక్క, బావ, బాబాయ్, మాట వింటే చేతకాని చవట అని.


⚡దోస్తులతో బయట తిరిగితే

జులాయి అని.


⚡ఎక్కువ మాట్లాడితే పోకిరి అని.


⚡తక్కువ మాట్లాడితే నల్లికుట్లోడు అని.


నీవు ఏమి చేసినా, ఎలా ఉన్నా తప్పు పట్టే లోకంలో.

ఇంటా-బయట అన్ని రకాల 

బాధలు భరిస్తూనే, అవమానాలు సహిస్తూనే... బాధ్యతలు మోస్తూనే... కొడుకుగా, తండ్రిగా, భర్తగా, సోదరుడిగా, మేనమామగా, అల్లుడిగా, ప్రేమికుడిగా, స్నేహితుడిగా నిరంతరం ప్రేమ ను పంచుతూ... 


అనునిత్యం త్యాగాలు చేస్తూ...నే  ఉన్న...ఓ..."మగ"ధీరుల్లారా...


⚡విధి వంచిత, ప్రియురాలు-భార్యాభాధిత, జనబాధిత, అప్పుబాధిత...మొ'...


శోకా...తప్త హృదయుల్లారా

బాధా సర్పదష్టుల్లారా...


⚡ఏ బాధాలేకుండా ఉంటున్న మహర్జాతకుల్లారా...(కొందరు)


⚡బాధనిపిస్తే మనసారా ఏడ్వలేని నిస్సహాయ పురుషుల్లారా...


⚡బ్రతుకు సమరం లో చితికిపోయిన అభినవ గరళకంఠుల్లారా...


⚡జీవితంలో సమస్యలతో కుస్తీ పడుతున్న మల్లయోధుల్లారా...


⚡కుటుంబం కోసం గస్తీ కాస్తున్నా ఇంటి సైనికుల్లారా...


⚡కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడుతున్న జీతంలేని నిరంతర శ్రామికుల్లారా...


⚡ వచ్చింది...నీ కోసం ఓ రోజు నీకూ కేటాయించారు...ఓ రోజు...ఈ రోజైనా...అన్నీ...మరిచి...నీ...కోసం...నీవు...కాసేపైనా...సమయాన్ని కేటాయించుకొని సంతోషంగా గడుపుతావని... ఆశిస్తూ...


అంతర్జాతీయ 

పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు... 

HAPPY MEN'S DAY-2021

సర్వే 'మగ' జనా సుఖినోభవంతు🙏...



స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు

 స్త్రీలు జడ ఎందుకు వేసుకుంటారు 

జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు?*

ఇప్పుడు అంటే ఫ్యాషన్ పేరిట జుత్తుని వదలివేయటం ఎక్కువ అయింది కానీ ఒకప్పుడు అందరు మహిళలు వయసుతో సంబంధం లేకుండా జడ వేసుకునేవారు. ఈ జడ కూడా మూడు విధములుగా వేసుకుంటారు.

✔️ *రెండు జడలు వేసుకోవడం* (రెండు జడలు వేసుకుంటే ఆమె ఇంకా *చిన్నపిల్ల* అని, *పెళ్లికాలేదని అర్ధం.* అంటే ఆ అమ్మాయిలో *జీవ + ఈశ్వర* సంబంధం విడివిడిగా ఉందని అర్ధము).

✔️ *ఒక జడ వేసుకోవడం* (పెళ్లి అయ్యిన ఆడపిల్లలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునేవారు. అంటే ఆమె తన జీవేశ్వరుడినిచేరి వివాహం చేసుకుని భర్తతో కలిసి ఉంటోందని అర్ధం).

✔️ *ముడి పెట్టుకోవడం* (జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానంకూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం).

✔️ అయితే *ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా చివరకు కొప్పు పెట్టుకున్నా* కూడా *జుట్టుని మూడు పాయలుగా విడతీసి త్రివేణీసంగమంలాగ కలుపుతూ అల్లీవారు.* ఈ మూడు పాయలకు అర్ధాలు ఏందిరా అంటే!!

1. *తానూ, భర్త, తన సంతానం* అని ఈ మూడు పాయలకు అర్ధం.

2. *సత్వ, రజ, తమో గుణాలు,*

3. *జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి* అని అర్ధములు.

*అమ్మాయిలు వేసుకున్న జడనిబట్టి వారు వివాహితులా, అవివాహితులా, పిల్లలు ఉన్నవారా, లేని వారా అన్న విషయం తెలిసిపోయేది. ఇంత అర్ధం ఉంది కాబట్టే, మన సంస్కృతి సంప్రదాయాలు నేటికీ పూజించబడుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి పేరిట మనమే వాటిని పాడుచేసుకుంటున్నాం.*

😡 జుత్తు విరబోసుకుని ఉండటం అరిష్టం జ్యేష్టాదేవికి ఆహ్వానం. ...😡


Tuesday, November 16, 2021

గుండె నొప్పి వచ్చి కిందపడిపోయాడు..

 గుండె నొప్పి వచ్చి కిందపడిపోయాడు


రాజారామ్ కు గుండె నొప్పి వచ్చి కిందపడిపోయాడు..

వెంటనే ఫామిలీ వాళ్ళు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు..అన్ని టెస్టులు చేయించారు.."ఇప్పుడిపుడే కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, స్ట్రిక్ట్ గా డైట్ మెయింటైన్ చెయ్యాలి, నేను చెప్పే ఈ డైట్ లో అస్సలు ఉప్పు వాడకూడదు" అని dr చాలా గట్టిగా హెచ్చరించాడు..🤷


ఈ నా డైటు, మందులు వాడితే ఇక లైఫ్ లో గుండెపోటు రాదు అని బల్లగుద్ది మరీ చెప్పాడు.😃


ఇక వీళ్ళు ఇంటికి వచ్చి ఆయన చెప్పిన డైట్ చాలా కచ్చితంగా పాటిస్తున్నారు. ఉప్పు అస్సలు వాడటం లేదు.🤷


ఒక ఆరు నెలల తరువాత మళ్ళీ గుండెపోటు వచ్చింది.

వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లి dr ని నిలదీశారు..😎


మీరు చెప్పిన డైటు తూ చ తప్పకుండా పాటించాము, ఉప్పు అస్సలు వాడటం లేదు.. అయినా ఎందుకొచ్చింది అని గట్టిగానే అడిగారు..👍


Dr కు మతిపోయింది.. అంత మంచి మందులు, ఆ డైటు చేస్తే మళ్ళీ వచ్చే చాన్స్ హే లేదు ఎందుకోచిందబ్బా అని తెగ ఆలోచించాడు..అయినా కారణం దొరకలేదు..


ఇలా కాదని అమెరికా నుండి సైటిస్తులను పిలిపించి రాజారామ్ పై పరిశోధన చేయించాడు...


వాళ్ళు నెలరోజుల తరువాత తేల్చి చెప్పింది ఏమిటంటే..


"అతను వాడే కోల్గేట్ పేస్ట్ లో ఉప్పు0ది, అందుకే అతనికి మళ్ళీ గుండెపోటు వచ్చిoది" అని.


🤣🤣🤣🤣😍😍😍😍🤷🤷🤷🤗🤗🤗🙈

ప్రతి భారతీయ ఓటరు ఆలోచించాల్సిందే

 

ప్రతి భారతీయ ఓటరు ఆలోచించాల్సిందే

ముంబై హైకోర్టు సీనియర్ న్యాయవాది డికె శ్రీవాస్తవ రాసిన ఈ పోస్ట్‌తో మీ జ్ఞానం పెరుగుతుంది.


  ?


  VVV ముఖ్యమైనది ...

   ఇది భారతదేశ వ్యవస్థ

   సాధారణ ప్రజలను మోసం చేస్తున్నారా?


 మీరే చూడండి ....

    

1- నాయకుడు కావాలనుకుంటే, అతను ఒకేసారి రెండు స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కానీ ....

     మీరు రెండు చోట్ల ఓటు వేయలేరు,


2- మీరు జైలులో ఉంటే మీరు ఓటు వేయలేరు .. కానీ

     నాయకుడు జైలులో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.


3-మీరు ఎప్పుడైనా జైలుకు వెళ్లినట్లయితే

    ఇప్పుడు మీకు జీవితకాలం ఉంది

     ప్రభుత్వ ఉద్యోగం రాదు,

కానీ,

హత్య లేదా అత్యాచారానికి పాల్పడిన నాయకుడు ఎన్నిసార్లు జైలు శిక్ష అనుభవించినా, అతను ఇంకా ప్రధాని లేదా రాష్ట్రపతి కావచ్చు, తనకు కావలసిన వారు.



4- బ్యాంకులో నిరాడంబరమైన ఉద్యోగం పొందడానికి

మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి ..


కానీ,

నాయకుడికి బొటనవేలు ముద్ర ఉన్నప్పటికీ, అతను భారతదేశ ఆర్థిక మంత్రి కావచ్చు.


5-మీరు సైన్యంలో మైనర్ అయి ఉండాలి

సైనికుడి ఉద్యోగం పొందడానికి, మీరు 10 కిలోమీటర్లు పరిగెత్తి డిగ్రీ చూపించాలి.


కానీ ....

నాయకుడు నిరక్షరాస్యుడు-పిరికివాడు మరియు లూలా-కుంటివాడు అయితే

అప్పుడు కూడా అతను ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు.

 మరియు

వీరి కుటుంబం మొత్తం ఇప్పటి వరకు ఏ పాఠశాలకు వెళ్లలేదు .. ఆ నాయకుడు దేశంలోని విద్యా మంత్రి కావచ్చు.


మరియు

వేలాది కేసులు జరుగుతున్న నాయకుడు ..

ఆ నాయకుడు పోలీసు శాఖ చీఫ్ కావచ్చు, అంటే హోం మంత్రి.



ఒకవేళ

ఈ వ్యవస్థను మార్చాలని మీరు అనుకుంటున్నారా?

నాయకుడు మరియు ప్రజలు ఇద్దరికీ ఒకే చట్టం ఉండాలి.

కాబట్టి

దయచేసి ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయడం ద్వారా దేశంలో అవగాహన తీసుకురావడానికి మీ మద్దతు ఇవ్వండి.



మీరు ఫార్వార్డ్ చేయకపోతే ఏ నాయకుడిని నిందించవద్దు ....

కాకపోతే, మీరు నష్టానికి బాధ్యత వహిస్తారు.

30 నుండి 35 సంవత్సరాల వరకు సంతృప్తికరమైన సేవను అందించిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ అర్హత లేదా? కేవలం 5 సంవత్సరాలు మాత్రమే MLA/MP పెన్షన్ యొక్క న్యాయం ఎక్కడ ఉంది ...?


.

శ్రీ డి. కె. శ్రీవాస్తవ

చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్

బొంబాయి హైకోర్టు.

ముంబై .....

 ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లండి

తొలగించవద్దు,

మేము ఈ వ్యవస్థను మార్చడానికి నిజంగా అవసరం.

గతంలోలా మారుద్దామా...

 గతంలోలా మారుద్దామా...


చిన్నప్పుడు

ఏ పండక్కో..పబ్బానికో

 Dress కుట్టిస్తే..

ఎంత ఆనందమో...👗👕


ఎప్పుడు పండగ

వస్తుందా, ఎప్పుడు

వేసేసుకుందామా

అన్న ఆతృతే...🥳


ఇంటికి చుట్టాలొచ్చి

వెళ్తో వెళ్తూ.. 

చేతిలో రూపాయో... 

అర్ధరూపాయో పెడితే

ఎంత వెర్రి ఆనందమో...😊


చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే

దుఃఖం తన్నుకు వచ్చేది...

ఇంకా ఉంటే బాగుండు

అన్న ఆశ...

ఎంత ఆప్యాయతలో...💞


సినిమా వచ్చిన ఏ

పదిహేను రోజులకో

ఎంతో ప్లాన్ చేసి

ఇంట్లో ఒప్పించి

అందరం కలిసి

నడిచి వెళ్లి..

బెంచీ టికెట్

కొనుక్కుని  సినిమా

చూస్తే ఎంత ఆనందమో...🥰


ఇంటికొచ్చాకా 

ఒక గంటవరకూ

ఆ సినిమా కబుర్లే...

మర్నాడు స్కూల్ లో

కూడా...

ఆ ఆనందం ఇంకో పది

రోజులుండేది...💖


అసలు రేడియో విచిత్రం..

అందులోకి మనుషులు

వెళ్లి మాట్లాడతారా అన్న

ఆశ్చర్యం...అమాయకత్వం..🙄


పక్కింట్లో వాళ్లకి రేడియో

ఉంటే..ఆదివారం

మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం

ముందు కూర్చుని 

రేడియో లో సంక్షిప్త

శబ్ద చిత్రం (ఒక గంట కి

కుదించిన) సినిమాని

వింటే ఎంత ఆనందం...

మనింట్లో కూడా రేడియో

ఉంటే...అన్న ఆశ...😇


కాలక్షేపానికి లోటే లేదు...

స్నేహితులు

కబుర్లు, కధలు

చందమామలు

బాలమిత్రలు...🥰


సెలవుల్లో మైలు దూరం

నడిచి లైబ్రరీ కి వెళ్లి

గంటలు గంటలు

కథల పుస్తకాలు

చదివి ఎగురుకుంటూ

ఇంటికి రావడం....🏃🏻‍♂️


సర్కస్ లు, 

తోలు బొమ్మలాటలు

లక్కపిడతలాటలు...

దాగుడు మూతలు...

చింత పిక్కలు

వైకుంఠ పాళీ

పచ్చీసు..

తొక్కుడు బిళ్ళలు..

ఎన్ని ఆటలో...☺️


మూడు గదుల రైలుపెట్టి

లాంటి ఇంట్లో అంతమంది

ఎంత సంతోషంగా ఉన్నాం...

వరుసగా కింద చాపేసుకుని

పడుకున్నా ఎంత హాయిగా

సర్వం మరిచి నిద్రపోయాం...😴


అన్నంలో కందిపొడి..

ఉల్లిపాయ పులుసు

వేసుకుని తింటే

ఏమి రుచి...

కూర అవసరమే లేదు..🤷‍♂️


20/-రూపాయలు తీసుకెళ్లి

నాలుగు కిలోల 

బియ్యం తెచ్చేది...

ఇంట్లో,  చిన్నా చితకా

షాపింగ్ అంతా నేనే...

అన్నీ కొన్నాకా షాప్

అతను చేతిలో గుప్పెడు

పుట్నాల పప్పో, పటికబెల్లం

ముక్కో పెడితే ఎంత

సంతోషం...

ఎంత బరువైనా

మోసేసేవాని..💓


ఎగురుతున్న విమానం

కింద నుండి 

కళ్ళకు చెయ్యి అడ్డం

పెట్టి చూస్తే ఆనందం...🥰


తీర్థం లో ముప్పావలా

పెట్టి కొన్న ముత్యాల దండ 

చూసుకుని మురిసి

ముక్కలైన రోజులు...


కొత్త పుస్తకం కొంటే

ఆనందం...వాసన

చూసి మురిపెం..

కొత్త పెన్సిల్ కొంటే

ఆనందం...

రిక్షా ఎక్కితే...

రెండు పైసల

ఇసుఫ్రూట్ తింటే

ఎంత ఆనందం..?🤩


రిక్షా ఎక్కినంత తేలికగా... 

ఇప్పుడు విమానాల్లో 

తిరుగుతున్నాం...✈️

మల్టీప్లెక్స్ లో ఐమాక్స్

లో సినిమా చూస్తున్నాం.

ఇంటర్వెల్ లో

ఐస్ క్రీం తింటున్నాం..🍧


బీరువా తెరిస్తే మీద పడి

పోయేటన్ని బట్టలు...

చేతినిండా డబ్బు...

మెడలో ఆరు తులాలనగ....

పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...

ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...

హోమ్ థియేటర్లు...

సౌండ్ సిస్టమ్స్, 

చేతిలో ఫోన్లు... 

అరచేతిలో స్వర్గాలు...

అనుకోవాలే గానీ క్షణంలో

మన ముందు ఉండే 

తిను బండారాలు.. 

సౌకర్యాలు...😍


అయినా చిన్నప్పుడు

పొందిన  ఆ ఆనందం

పొందలేకపోతున్నాం

ఎందుకు ...?

ఎందుకు...? ఎందుకు...?🤔


చిన్నప్పుడు కోరుకున్నవి

అన్నీ ఇప్పుడు  

పొందాము కదా...

మరి ఆనందం లేదేం...

ఎందుకంత మృగ్యం

అయిపోయింది...

ఎండమావి 

అయిపోయింది..


మార్పు ఎందులో...?🤔

మనలోనా...?

మనసుల్లోనా...?

కాలంలోనా...?

పరిసరాల్లోనా...?

ఎందులో... ఎందులో...?

ఎందులో ...?

చెప్పవా తెలిస్తే....!!   

ప్రస్తుతం అందరి మనసుల్లోనూ "స్వార్థం" నిండిపోయింది.

నీకు తప్పక తెలియాల్సిన అంశాలు

 నీకు తప్పక తెలియాల్సిన అంశాలు

❤️తనవారు చేసిన తప్పులకు తాను బాధ్యత వహించేవాడు ఉత్తముడు. 💕తాను చేసిన తప్పులకు తనవారిని, అమాయకులను, తనను విశ్వసించినవారిని బాధ్యులను చేసేవాడు అధముడు.

🌺ఈ కలికాలంలో నీ, నా భేదాలు, పాపం పుణ్యం పరమార్థాలు ఉండని వైనం సర్వత్రా దర్శనీయమే. 

💕స్వప్రయోజనాలకోసం ఎంతకైనా తెగించే తత్వంతో ఇతరులకు హానిచేసైనా తన పబ్బం గడుపుకోవాలన్న దుగ్ధతో మనిషి ఎంతకైనా దిగజారి అత్యంత అసహ్యకరమైన పరాన్నభుక్కుల ప్రవృత్తికి దిగజారి పాపాల మూటలను మరుజన్మలో అత్యంత కష్టభూయిష్టమైన బతుకుకోసం కూడబెట్టుకుంటున్న వైనం ఆత్మహత్యా సదృశం.

💕కుటుంబంలో వ్యక్తి తప్పు చేస్తే కుటుంబ యజమాని; శిష్యుడు తప్పు చేస్తే గురువు; పరివారం, ఉద్యోగులు తప్పు చేస్తే పాలకులు బాధ్యత వహించాలని భారతీయ ధర్మాలు చెబుతున్నాయి. ధర్మాన్ని ఆచరించడం మనిషి ప్రధాన కర్తవ్యం. అధర్మ వర్తన మనసుకు తోచినంత మాత్రానే సరిదిద్దుకునేవాడు వివేకి. 

❤️నిజానికి మనసే మొదటి న్యాయస్థానం. మనస్సు కచ్చితమైన నిర్ణయాన్నే ఇస్తుంది. ఆ తీర్పును శిరసావహించినవారు పుణ్యపురుషులై చరితార్థులవుతుండగా, మనసు చూపిన బాటను త్రోసిపారవేసి ఆత్మవంచన చేసుకుంటూ పరుల కష్టార్జితాన్ని అప్పణంగా భోంచేస్తూ రౌరవాదినరకాలకు రాచబాటలను వేసుకుంటున్నారు కొందరు పరమమూర్ఖశిఖామణులు.

❤️గంగా యమునలు కలిసే చోట నీటమునిగి పన్నెండు సంవత్సరాలు ఘోర తపమాచరించిన మహా రుషి చ్యవనుడు. ఒకసారి జాలర్లు వేసిన వలలో చిక్కుతాడు. ఆశ్చర్యపోతారు, భయపడతారు మత్స్యకారులు. 'చేపలతోపాటు రాజుగారికి నన్ను కూడా అమ్మేయండి' అంటాడు చ్యవనుడు. విషయం తెలుసుకున్న మహారాజు నహుషుడు వచ్చి చ్యవనుడి పాదాలపై పడి- ఇది నా తప్పుగా భావించి మన్నించమని ప్రార్థిస్తాడు. ఇది ఎవరి తప్పుకాదు. నా విలువ ఎంతో కట్టి, వారికి ఇచ్చి పంపమంటాడు. కోటి మాడలిస్తానని అంటాడు మహారాజు. 'నా విలువ అంతేనా?' అంటాడు. అయితే రాజ్యమే వారికిస్తానంటాడు మహారాజు. నవ్వుతాడు చ్యవనుడు. ఇంతేనా నా వెల అంటాడు. సర్వ సంపదలకు నెలవు గోమాత. కాబట్టి ఆ మత్స్యకారులకు గోదానం చేసి పంపుతారు మధ్యవర్తులుగా అక్కడే ఉన్న రుషులు, మంత్రులు.

🌺ఇక్కడ మనం గమనించాల్సింది- నిజానికి మత్స్యకారులు చేసిన తప్పేమీ లేదు. అది వారి వృత్తి. అంతటి మహర్షి తపోభంగమైంది కాబట్టి తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి, ఆ తప్పును తనదిగా భావించమని, రాజ్యపరిత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు నహుషుడు.

❤️శివాజీ మహారాజుకు కానుకగా సైనికులు, ఓ అద్భుత సౌందర్యవతిని అంతఃపురానికి తెస్తారు. విషయం తెలుసుకున్న ఛత్రపతి ఆ సౌందర్యవతి దగ్గరకు వెళ్ళి- తల్లీ! నా సైనికులు చేసిన ఈ అజ్ఞానపు కార్యానికి నన్ను మన్నించు. 'అమోఘ సౌందర్యవతివి తల్లీ నీవు! బిడ్డగా నీ కడుపున పుట్టే భాగ్యం నాకు లేకపోయెనే' అంటూ చేతులు జోడిస్తాడు.

💕అంతటి గొప్ప సంస్కారం ఉంది కనకనే చరిత్రలో వారి గాథలు సువర్ణాక్షర లిఖితమయ్యాయి.

అవినీతిపరుల దుశ్చర్యలతో ప్రభుత్వ బొక్కసంలోని ద్రవ్యం అపహరణకు గురైనా, ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టినా, దుండగుల వల్ల రాజ్యంలో శాంతి సుఖాలకు ఆటంకం ఏర్పడ్డా, ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారినా అందుకు తప్పు- బాధ్యులైన పాలకులదే కదా.

❤️తన తప్పులకు ఇతరులను బలిచేయడం, అభిశంసించడం, దోషులుగా చేయడం అమానవీయ వైఖరి. పంచతంత్ర కథలు ఇందుకు అద్దం పట్టేవిగా అనేకం కనిపిస్తాయి. 'ఇకపై అడవిలోని సాధు జంతువులను కాపాడదాం. ఇష్టం వచ్చినట్లు తినేయడం, చంపేయడం చెల్లదు' తీర్మానం చేసింది పులి. అలాగేనన్నాయి నక్క, తోడేలు, ఒంటె. నక్కకు జిహ్వచాపల్యం ఎక్కువ.

💕దొంగచాటుగా సాధు జంతువులను చంపి తింటూ ఎముకలను తోడేలు, ఒంటె సంచరించే ప్రాంతాల్లో వేసేది. పైగా పులితో ఈ రెండింటిపై చాడీలు చెప్పింది. పులి వచ్చిచూసింది. ఆగ్రహించింది. వాటిని చంపేసింది.

💕తన కడుపు నింపుకోవడంతోనే తృప్తిపడలేదు నక్క.

🌺నిప్పు కాలుస్తుంది. తప్పూ అంతే. ధర్మరాజుకు తెలియనిదా, జూద వ్యసన ఫలితం ఎలా ఉంటుందో! జూదం ఆడక తప్పలేదు. ఫలితం కురుక్షేత్ర సంగ్రామానికే దారితీసింది. తెలిసి తప్పుచేసి దిద్దుకొనే కంటే, తప్పు చెయ్యకపోవడమే మేలు కదా!

Monday, November 15, 2021

సహజంగా మనం పట్టించుకోని సోషల్ రూల్స్

 

సహజంగా మనం పట్టించుకోని సోషల్ రూల్స్


 1. ఒకరికి, రెండు సార్లకు మించి

     అదేపనిగా కాల్ చేయవద్దు. వారు

     సమాధానం ఇవ్వకపోతే, వారికి వేరే

     చాలా ముఖ్యమైన పని ఉందని

     అర్థం.


 2. అవతలి వ్యక్తి అడగక ముందే మీరు

     అరువు తీసుకున్న డబ్బును వారికి

     తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న

     మొత్తమైనాసరే! అది మీ

     వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది! 


 3. ఎవరైనా మీకోసం పార్టీ

     ఇస్తున్నప్పుడు మెనూ లో ఖరీదైన

     వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్

     చేయవద్దు.  వీలైతే మీ కోసం వారినే

     ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని

     అడగండి.


 4.  "మీకు ఇంకా వివాహం కాలేదా?

      మీకు పిల్లలు లేరా? 

      ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?"

      వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను

      ఎదుటివారిని అడగవద్దు. అవి,

      వారి సమస్యలు. మీవి కావు!


 5. మీ వెనుక ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ

      మీరే  తలుపు తెరిచి లోపలికి

      ఆహ్వానించండి. అమ్మాయి,

      అబ్బాయి, చిన్నా, పెద్దా ఎవరైనా

      సరే. ఒకరిక పట్ల మంచిగా

      ప్రవర్తించడం ద్వారా మీరు చిన్నగా

      మారరు.


 6. మీరు ఎవరితోనైనా వేళాకోళంగా

     మాట్లాడుతున్నప్పుడు దాన్ని వారు

     సరదాగా తీసుకోకపోతే వెంటనే

     దాన్ని ఆపివేయండి! మరలా

     చేయవద్దు.


 7. బహిరంగంగా ప్రశంసించండి,

      ప్రైవేటుగా విమర్శించండి.


 8. ఒకరి బరువు గురించి మీరు

     ఎప్పుడూ  వ్యాఖ్యానించవద్దు.

     "మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు"

      అని చెప్పండి.  అప్పుడు బరువు

      తగ్గడం గురించి మాట్లాడా

      లనుకుంటే, వారే మాట్లాడుతారు. 


 9. ఎవరైనా వారి ఫోన్‌లో మీకు ఫోటో

     చూపించినప్పుడు, అదొక్కటే

     చూడండి. ఎడమ లేదా కుడి వైపుకు

      స్వైప్ చేయవద్దు. తర్వాత

      ఏముంటాయో మీకు తెలియదు

      కదా!


 10. మీరు ఒక సీ.ఈ.ఓ. తో ఎట్లా

       వ్యవహరిస్తారో అదే గౌరవంతో

       క్లీనర్‌తో కూడా వ్యవహరించండి.

       మీ క్రింది వారిని గౌరవంగా చూస్తే

       ప్రజలు ఖచ్చితంగా దాన్ని

       గమనిస్తారు.


 11. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ

        సలహా ఇవ్వకండి.


 12.  సంబంధంలేని వారికి మీ

        ప్రణాళికల గురించి చెప్పవద్దు. 


 13. ఒక స్నేహితుడు / సహోద్యోగి

       మీకు ఆహారాన్ని ఆఫర్

       చేసినప్పుడు మర్యాదగా 'నో'

       చెప్పండి. కానీ, రుచి లేదా వాసన

       చూసిన తర్వాత 'నో' చెప్పవద్దు.

       అట్లా చేస్తే మీరు వారిని

       అవమానించినట్లే! 


 14. మరో ముఖ్య విషయం! ఇతరుల

        విషయంలో అనవసరంగా జోక్యం

        చేసుకోకుండా, మీ పనేదో మీరు

        చూసుకోండి!! 


నోట్: మీకు నచ్చితే ఆచరించండి! 

         లేకపోతే వదిలేయ్యండి!

         అంతేగానీ ఏంటీ శ్రీ రంగనీతులు

         అని మాత్రం అనుకోకండి!

Saturday, November 13, 2021

10 -11 మధ్యే ఉత్తమం

 🔊10–11 మధ్యే ఉత్తమం


🔶రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రిస్తుంటే జాగ్రత్త

🔷గుండె జబ్బులు పెరిగే ప్రమాదం అధికం

🔶వైద్య నిపుణులు,పరిశోధకుల హెచ్చరిక

🔷అంతకు ముందే నిద్రించినా గుండెకు ముప్పే

🔶90 వేల మందిపై అధ్యయనంలో వెల్లడి

*రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోతున్నారా? మరీ 11, 12 గంటలు కూడా దాటిపోతోందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఈ అలవాటును మార్చుకోవాల్సిందే. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్న వారిలో గుండె జబ్బులు పెరిగే ప్రమాదం అధికమైనట్లు వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. రోజూ రాత్రి 10–11 గంటల మధ్య నిద్రకు ఉపక్రమించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఈ అలవాటుతో గుండె జబ్బులను చాలావరకు దూరం పెట్టొచ్చునని అంటున్నారు.

*🌀రాత్రి 10 గంటలకు ముందు 11 గంటల తర్వాత నిద్రించే వారిలో గుండె జబ్బులు, ఇతర సమస్యలు పెరుగుతున్నట్టుగా ఓ తాజా అధ్యయనం తేల్చింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటెర్‌ బిజినెస్‌ స్కూల్‌లో అంతర్భాగంగా ఉన్న ‘ద ఇనిషియేటివ్‌ ఇన్‌ డిజిటల్‌ ఎకానమీ ఎట్‌ ఎక్సెటెర్‌ (ఇండెక్స్‌), వివిధ దేశాల్లోని పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో ఆయా అంశాలు వెల్లడయ్యాయి.*

*💥శరీరంలో గడియారం!*

*💠మన శరీరంలో అంతర్గతంగా  24 గంటల గడియారం (సిర్కాడియన్‌ రిథమ్‌) పనిచేస్తుందని, అది శారీరక, మానసిక పనితీరు క్రమబద్ధీకరణకు ఉపకరిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీనిని బట్టి రాత్రి 10–11 గంటల మధ్యకాకుండా ఇతర సమయాల్లో నిద్రకు ఉపక్రమిస్తే ఈ శరీర గడియారం సరిగా పనిచేయక గుండె సంబంధిత ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని తేలింది. యూకే బయోబ్యాంక్‌లోని దాదాపు 90 వేల మందికి సంబంధించిన సమాచారం, వివరాలు ప్రాతిపదికన ఈ  పరిశీలన నిర్వహించారు.*

*🥏వారం రోజుల పాటు వారు నిద్రించిన, మేల్కొన్న సమయాలను వారి ముంజేతిపై ఉండే అక్సిలరోమీటర్‌ (రిస్ట్‌వార్న్‌ అక్సిలరోమీటర్‌) ఆధారంగా పర్యవేక్షించారు.వివిధ సామాజిక నేపథ్యాలు, జీవనశైలి, ఆరోగ్యం, వ్యక్తిగత వివరాలు, తదితర అంశాలతో కూడిన ప్రశ్నల ఆధారంగా తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. దీనితో  పాటు గుండె జబ్బులను గుర్తించేందుకు ఒక కొత్త విధానాన్ని అవలంబించడంతో పాటు, గుండెపోటు, గుండె వైఫల్యం, దీర్ఘకాలిక గుండెజబ్బు, తదితర అంశాలను పరిశీలించారు.*

*ఈ క్రమంలో రాత్రి 10 నుంచి 10.59 నిమిషాల మధ్యలో నిద్రపోని వారిలో అత్యధికంగా* *గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం హెచ్చుస్థాయిలో* *ఉన్నట్టుగా గుర్తించారు. ప్రధానంగా వయసు, లింగం, నిద్రపోయే కాలం, నిద్రలో అవాంతరాలు, మధ్యలో లేవడం, త్వరగా నిద్రపోవడం, రాత్రంతా గుడ్లగూబలా* *మేల్కొనడం, పొగతాగే అలవాటు, బాడీ మాస్‌ ఇండెక్స్, డయాబెటీస్, రక్తంలో కొలస్టరాల్, సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా నిద్రకు ఉపక్రమణ– గుండె సంబంధిత పని విధానాన్ని ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొన్నారు.*

*💥25 శాతం అధికం*

*►రాత్రి 10–11 మధ్యలో నిద్రపోయే వారితో పోల్చితే ఆ తర్వాత అర్ధరాత్రి నిద్రపోయే వారిలో వివిధ గుండెజబ్బులకు (కార్డియో వాస్క్యులర్‌ డిసీజెస్‌) గురయ్యే అవకాశం 25 శాతం అధికంగా ఉండే ప్రమాదం.*

*►రాత్రి 11–12 మధ్యలో నిద్రపోయే వారు గుండెజబ్బులకు గురయ్యే ప్రమాదంలో 12 శాతం పెరుగుదల*

*►రాత్రి 10 గంటల లోపు పడుకునే వారిలోనూ 24 శాతం అధికంగా గుండెజబ్బులు పెరిగే అవకాశం*

*►మహిళల్లో ఈ ప్రమాదం మరింత అధికం* 

*►రాత్రి 10 గంటలోపు నిద్రపోయే పురుషుల్లోనూ ఇది గణనీయంగానే ఉంది.*

*►అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం మరింత ప్రమాదకరం. ఉదయమే సూర్యకాంతిని చూడడం వల్ల శరీర గడియారం ‘రీ సెట్‌’ అయ్యే అవకాశాలుండగా, అది చూడలేకపోవడం వల్ల నష్టం జరిగే అవకాశం.*

💥మరణాలు నిర్ధారణ కాలేదు

*♦️అర్ధరాత్రి, అపరాత్రి నిద్ర వల్ల తీవ్రమైన గుండెజబ్బులువచ్చే ప్రమాదం పెరుగుతుందని వెల్లడైందే తప్ప దాని వల్ల మరణాలు సంభవిస్తాయనేది నిర్ధారణ కాలేదని యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటెర్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన సీనియర్‌ లెక్చరర్‌ డాక్టర్‌ డేవిడ్‌ ప్లాన్స్‌ స్పష్టం చేశారు.* 

Friday, November 12, 2021

జొన్న రొట్టే కదా అని తేలిగ్గా తీసుకోకండి.



🥞జొన్న రొట్టే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. పోషక విలువలు అధికమంటున్న పరిశోధకులు



 *మధుమేహులకు మంచిదంటున్న డైటీషియన్లు పోషక విలువలు అధికమంటున్న పరిశోధకులు జొన్న.. తింటే ఆరోగ్యం మిన్న జొన్న రొట్టె.. ఒకప్పుడు పేదలు తినే ఆహారం. వరి అన్నం ఫేమస్‌ అయ్యాక వారూ జొన్నల వినియోగం తగ్గించారు. తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఆహారంగా తీసుకునేది జొన్న రొట్టెనే. బీ కాంప్లెక్స్‌ విటమిన్స్‌కు తోడు ఫైబర్‌, విటమిన్‌ ఏ, విటమిన్‌  సీ, క్రూడ్‌ ఫ్యాట్‌, అమినో యాసిడ్స్‌ ఇలా అత్యవసర పోషకాలు అధికంగా ఉండే ఆహారం జొన్న. ఆరోగ్యం మెరుగుపడాలంటే ఇది తప్పనిసరి. మధుమేహులకు ఇది చక్కటి భోజనం అని కూడా చెబుతున్నారు. నగరంలో జొన్న రొట్టెలకు ప్రాచుర్యం ఇటీవల బాగా పెరిగింది. అంతకు ముందు హోటల్స్‌లో జొన్న రొట్టె కనిపించడం తక్కువే కానీ, పెరిగిన ఆరోగ్యాభిలాషులతో స్టార్‌ హోటల్స్‌ కూడా జొన్న రొట్టెను తమ మెనూలో జోడించాయిప్పుడు. వీధులలో రూ.10లకే లభిస్తున్న జొన్నరొట్టె పలు హోటల్‌లలో వాటి స్థాయిని బట్టి రూ.30 నుంచి రూ.150 వరకూ చార్జి చేస్తున్నారు.* 



*🧑🏻‍⚕️ఏ రోటీ మంచిది..*

 

 *చపాతీ, రోటీ ఏదైనా తక్కువ కాలంలోనే తినేయాలి. లేదంటే అవి పాడైపోయే అవకాశాలున్నాయి. కానీ జొన్నరొట్టెకు ఆ ఇబ్బంది లేదు. కాస్త ఆలస్యమైనా దీనిని ఇబ్బంది లేకుండా తినేయొచ్చు. జొన్నరొట్టెలో ఉన్న రెండు రకాలలో ఒకటి కడక్‌ రోటీ. ఇది గట్టిగా ఉంటుంది. మరోటి సాఫ్ట్‌రోటీ మెత్తగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే దీనిని తినేయాలి. కానీ కడక్‌ రోటీ అలా కాదు. కొన్ని వారాలైనా పాడయ్యే అవకాశాలు తక్కువగాఉంటాయి. దీనిని సంప్రదాయ పద్ధతులలో నిల్వ చేస్తే వీటి జీవితకాలం మరింత పెరుగుతుంది. మన నగరంలో జొన్న రొట్టెను వెజిటేబుల్‌ కర్రీ లేదంటే చికెన్‌ కర్రీ లాంటి వాటితో కలిపి తీసుకుంటుంటారు. కొంతమంది పచ్చడితో కలిపి కూడా తింటుంటారు.* 


 *జొన్న అనగానే ముందుగా గుర్తొచ్చేది జొన్నరొట్టెనే కానీ, పశువుల మేతకు కూడా జొన్నలు వాడుతుంటారు. అయితే, ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి ఈ జొన్నతో సిరప్‌, ఇథనాల్‌, బయో ఫ్యూయల్‌ కూడా తీయొచ్చంటూ నూతన వంగడాలనూ సృష్టించారు. ఇంకో విశేషమేమిటంటే, ప్లాస్టిక్‌ కూడా దీని నుంచి తీయొచ్చని చెబుతున్నారు.* 


*🧑🏻‍⚕️మేలైన ఆహారం..*


 *పోషకాలు సమృద్ధిగా కలిగిన ఆహారం జోవార్‌. గ్లూటెన్‌ లేకపోవడం, పలు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా న్యూ క్వినోవాగా దీన్ని పిలుస్తున్నారు. దీనిలో కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ ఉండటం వల్ల మధుమేహులకు చక్కటి అవకాశంగా నిలిచింది.*

 *ఇది నెమ్మదిగా గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. శాకాహారులకు ఇది అత్యుత్తమం. 100 గ్రాముల జొవార్‌లో 10.4 గ్రాముల ప్రోటీన్‌ ఉంది. మన శరీరానికి ప్రతిరోజూ అవసరమైన ఫైబర్‌లో 40శాతం ఇది అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గించడంలో సహాయపడటంతోపాటుగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.* 

 *గ్లూటెన్‌ పదార్థాల ఎలర్జీ ఉన్న వారితో పాటుగా ఉదరకుహర వ్యాధి (సెలియాక్‌ డిసెజస్‌) ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. జొన్నలలో ఐరన్‌, కాల్షియం, విటమిన్‌ బి, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటివి ఉన్నాయి. దీనివల్ల చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి దోహదపడతాయి. జీర్ణక్రియనూ* *మెరగుపరుస్తుంది. జొన్నలను రోటీ రూపంలో మాత్రమే కాదు ఇడ్లీ, దోశ రూపంలో తినొచ్చు. ఊబకాయులు బరువు తగ్గేందుకు కూడా ఇది చక్కటి ఎంపిక.* 


🌀☘️🌻🌸🍁🌹🏵️🌀

Thursday, November 11, 2021

ఈ ప్రయాణం చాలా చిన్నది

 నాకు కోపం రాదు. ఎందుకంటే జీవితమనే మన 

ఈ ప్రయాణం చాలా చిన్నది


ఒక వృద్ధమహిళ బస్సులో ఎక్కి కూర్చుంది. 

తరువాతి స్టాప్ వద్ద, 

ఒక బలమైన, 

క్రోధస్వభావం గల యువతి పైకి ఎక్కి, వృద్ధురాలి పక్కన కూర్చుని, 


ఆమెను తన సంచులతో కొట్టినంత పని చేసింది. 

వృద్ధురాలు మౌనంగా ఉండిపోవడాన్ని చూసిన యువతి 

తన సంచులు తగిలినందుకు కోపం రాలేదా అని అడిగింది.?


వృద్ధ మహిళ ఒక చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చింది: లేదు,

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.* 


నేను తరువాతి స్టాప్లో దిగబోతున్నాను కాబట్టి, 

ఈ కొంత సమయానికి అసభ్యంగా ప్రవర్తించాల్సిన 

అవసరం లేదు.

ఈ సమాధానం బంగారు అక్షరాలతో వ్రాయడానికి అర్హమైనది:

*అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు* 


*ఎందుకంటే  ఈ మన యాత్ర చాలా చిన్నది.*


ఈ ప్రపంచంలో మనముండే సమయం చాలా తక్కువ అని 

మనలో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. 

పనికిరాని వాదనలు, 

అసూయ, ఇతరుల మీద చాడీలు చెప్పడం, వారి మనసులను బాధపెట్టడం,

ఇతరులను క్షమించకపోవడం, ఎంత ఉన్నా అసంతృప్తి

మరియు చెడువైఖరి ద్వారా సమయం మరియు 

శక్తి హాస్యాస్పదంగా వృధా అవుతాయి.


మీ హృదయాన్ని ఎవరైనా విచ్ఛిన్నం చేశారా? 

ప్రశాంతంగా ఉండు. 

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*


ఎవరైనా మీకు 

ద్రోహం చేశారా, 

బెదిరించారా, 

మోసం చేశారా లేదా 

అవమానించారా? 

విశ్రాంతి తీసుకోండి. 

ఒత్తిడి కి గురికావొద్దు.

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*


కారణం లేకుండా ఎవరైనా మిమ్మల్ని అవమానించారా? 

దాన్ని వదిలేయండి. 

దాన్ని విస్మరించండి. 

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*


ఎవరైనా మీతో విభేదించారా, 

బాగా ఆలోచించండి...? 

గట్టిగా ఊపిరి తీసుకోండి. 

అతన్ని / ఆమెను విస్మరించండి. 

మన్నించి మరచిపోండి. 

“ఎంత ముఖ్యమైనా 

మీ మనసుకు నచ్చని, 

నీ మనసు మెచ్చని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు, 

వారితో ప్రతిరోజూ తగవు పెట్టుకోకుండా. 

వారికి దూరంగా మనశ్శాంతి తో ఉండండి, 


కొంత ఇబ్బంది కలిగినా అలవాటైతే ఏదీ ఇబ్బంది కాదు” 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*


ఎవరైనా మనకు ఏదైనా సమస్య కలగచేసినా, 

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*


ఈ మన యాత్ర యొక్క పొడవు ఎవరికీ తెలియదు. 

దాని స్టాప్ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. 

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*


మనకు అన్ని సమయాలలో అండగా ఉండే 

స్నేహితులను అభినందిద్దాం.

మనం 

గౌరవంగా, 

దయగా, 

క్షమించేలా ఉందాం.


తద్వారా, 

మనం కృతజ్ఞత 

మరియు 

ఆనందంతో నిండిపోతాము. 

చివరికి గుర్తుంచుకోవాల్సింది. 

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*


మీ చిరునవ్వును అందరితో వెంటనే పంచుకోండి. 

“అంత ముఖ్యమైనవి కాని వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు”. 

*ఎందుకంటే ఈ మన యాత్ర చాలా చిన్నది.*


*ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు..* 


*ఇది మూన్నాళ్ళ ముచ్చటే.. !!*

 

పసుపులేటి నరేంద్రస్వామి

🙏🙏

Wednesday, November 10, 2021

KGBV 2021 recruitment

 

District wise TS KGBV CRT PGCRT Staff Nurse Jobs Notification 2021 Details
Nalgonda District KGBV Notification 2021:Click HereNarayanpet District KGBV Notification 2021:Click Here
Kamareddy District KGBV Notification 2021: Click HereRajanna Sircilla District KGBV Notification 2021:Click Here
Khammam District KGBV Notification 2021: Click HereNirmal District KGBV Notification 2021:Click Here
Yadadri Bhuvanagiri District KGBV Notification 2021: Click HereMancherial District KGBV Notification 2021:Click Here
Medak District KGBV Notification 2021:Click HerePeddapalli District KGBV Notification 2021:Click Here
Jangaon District KGBV Notification 2021:Click HereAdilabad District KGBV Notification 2021:Click Here
Hanumakonda District KGBV Notification 2021:Click HereNizamabad District KGBV Notification 2021:Click Here
Mahabubabad District KGBV Notification 2021:Click HereSangareddy District KGBV Notification 2021:Click Here
KB Asifabad District KGBV Notification 2021:Click HereVikarabad District KGBV Notification 2021:Click Here
Siddipet District KGBV Notification 2021:Click HereJagitial District KGBV Notification 2021:Click Here
Nagarkurnool District KGBV Notification 2021:Click HereWanaparthy District KGBV Notification 2021: Click Here
Jayashankar Bhoopalpally District KGBV Notification 2021:Click HereJogulamba Gadwal District KGBV Notification 2021: Click Here 
Medchal District KGBV Notification 2021:Click HereRangareddy District KGBV Notification 2021: Click Here
Mulugu District KGBV Notification 2021: Click HereMedchal–Malkajgiri District KGBV Notification 2021:Click Here
Suryapet District KGBV Notification 2021: Click HereWarangal (Rural) District KGBV Notification 2021: Click Here
Warangal (Urban) District KGBV Notification 2021:Click HereBhadradri Kothagudem District KGBV Notification 2021: Click Here
Hyderabad District KGBV Notification 2021:Click HereKarimnagar District KGBV Notification 2021: Click Here
Mahabubnagar District KGBV Notification 2021: Click Here

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE