NaReN

NaReN

Saturday, July 9, 2022

ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది.🛒

 ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది.🛒

Shpping Wife Shocking Husband



అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది.👜

క్యాషియర్ ఆమె బ్యాగు లో

ఒక టీవీ రిమోట్ గమనించాడు.📲

అతను ఉండబట్టలేక ఆడిగేసాడు..


"మీరు ఎప్పుడూ మీ టీవీ రిమోట్‌ను మీతో తీసుకువెళతారా?" అని.


ఆమె "లేదండీ, ఎప్పుడూ ఇలా తీసుకురాను, అప్పుడప్పుడు మాత్రమే.. 

ఈరోజు మావారు క్రికెట్ 🏏మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా..."

అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చింది.💳


#నీతి : మీ భార్య మాట వినండి, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి ..!💁‍♂️


#కథ ఇంతటితో అయిపోలేదు ..!


క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు.👠👗👛👜👖


ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయింది ..!🤔


"ఏమైంది..!!??" అని క్యాషియర్ని అడిగింది.😬


అతను చెప్పాడు, “మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు...”🤭


#నీతి : మీ భర్త అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి.🙏


#కథ కొనసాగుతుంది ..!


భార్య ఈసారికి తన భర్త క్రెడిట్ కార్డును 💳పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది. 

దురదృష్టవశాత్తు అతను తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.


 #నీతి : మీ భార్య యొక్క శక్తిని మరియు జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు ..!😝

 

#కథ ఇంకా అయిపోలేదు ..!


స్వైప్ చేసిన తర్వాత, ఆ యంత్రం, 


"మీ మొబైల్ ఫోన్‌కు పంపిన పిన్ను నమోదు చేయండి" అని సూచించింది ..!📱


 #నీతి : ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత కూడా రక్షిస్తుంది ‌..!😊😊


#కథ_కొనసా....గుతుంది ..!


ఆమె మరలా నవ్వి, తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను  బయటకు తీసింది.📱


అది తన భర్త ఫోన్.📵


ఆమె దానిని రిమోట్ కంట్రోల్‌తో బాటుగా తీసుకుని వచ్చేసింది.

ఎందుకంటే, తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసిగించకుండా ఉండేందుకు.

చివరకు ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. 😂😂😂

 

#నీతి : ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు ..! 


#కథ_కొనసాగుతుంది ..!


ఆమె ఇంటికి చేరుకునేసరికి ఇంటి బయట ఆమెకు తన భర్త కారు కనిపించ లేదు.🚘


ఒక నోట్ తలుపు మీద అతికించబడి  ఉంది.

అందులో ఇలా రాసి ఉంది ..!📒


"రిమోట్ దొరకలేదు. మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను. 👣

నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యి ..!

అని ఇంటి తాళాలు కూడా తనతోబాటే తీసుకుపోయాడు.🔑


#నీతి : మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. 😋😂😆😉😁


#తెలివి_ప్రతిభ_అనేది_ఒకరి_సొత్తు_కాదు.  


 

Friday, July 8, 2022

ఋణానుబంధం

 🌺ఋణానుబంధం🌺


ఇతరులతో పూర్వజన్మలో  మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి అనుసంధానమవుతూ ఉంటారు.


ఆ ఇచ్చి పుచ్చుకునే ఋణాలు తీరగానే ఏదోరకంగా మనకు దూరమవడం జరుగుతుంది. 


ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవిత కాలంలో మనకి  ఏర్పడే సంబంధాల  మీద మోజు కలుగదు.  


ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే..


మనం పూర్వ జన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ, వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారి గాను తారసపడతారు.


ద్వేషం కూడా బంధమే, పూర్వజన్మలో  మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు.


మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో, దాయాదులుగానో, ఏదో ఒక రకంగా మనకు  అపకారం చేసే వారిగా ఎదురవుతారు.


మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో, సహాయకులు గానో ఎదురవుతారు.


🌺ఉదాహరణకు ఒక జరిగిన కథ గమనించండి.🌺


కొల్లూరు లోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల దాకా గుడి పక్కన బిచ్చం  అడుక్కుంటూ ఉండేవాడు. ఆ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు. 

కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ, రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ, మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టే ఉచిత భోజనాన్ని తింటూ, చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు.


తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎం.బీ.బీ.ఎస్ చదివిస్తున్నాడు. 


ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు. 


పూర్వజన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని, వాళ్లు చాలా బాధలో ఉన్నప్పుడు  ఇతను, ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ వున్నా, తాను  బాధలు  పడుతూ, వాళ్లను చదివిస్తూ వాళ్ల రుణాన్ని తీర్చుకుంటున్నాడు అని. 


అంతే కాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ..


ఒకసారి మహర్షి బస చేసిన అతిథిగృహం  బయట ఉన్న చెత్తకుండీలో తిని పారేసిన విస్తరాకులు కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. 

అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు, స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని. 


ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు, అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు, అని స్వామి జవాబు చెప్పారు.


నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా  దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అన్నారు మహర్షి.


ఒకమారు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు బందరుకి వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామి వారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే, ఆయన వెనక్కి  పిలిచి నీ చేతి సంచి ఏది అని అడుగుతే,  పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు. 

అప్పుడు మలయాళ స్వామి వారు నువ్వు మోయగలిగి ఉండి, ఈ జన్మలో నీ మిత్రుడు చేత సంచీని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు.


ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం, మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞత గానో, గౌరవంతోనో  లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా  స్వీకరించిన వన్నీ  కర్మ బంధాలై జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి.


కొత్త వాళ్ల నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం, మన పెట్టె లాంటివి మోయించడం, పక్క వాళ్ళు షాప్ కి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం.

అవి కర్మ బంధాలవుతాయి అని తెలియక మన  జీవితకాలంలో చేసే ఇలాంటి వేలకొద్దీ కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము.


ఆరడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో, అలాగే అంగుళం తాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం, అలాగే కర్మ ఎంత పెద్దదైనా, చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు.


ఒకతను వెళ్తూ ఓ చోట కొందరు రక్షక భటులు ఓ దొంగను చుట్టుముట్టడం చూసాడు. మరికొంత దూరం వెళ్ళాక ఓ రాజు చుట్టూ కూడా ఉన్న కొంతమంది రక్షక భటుల్ని చూసాడు. అతను ఆగి రాజుని సందేహంగా అడిగాడు. ''రాజా! దొంగ చుట్టూ ఇలాగే రక్షక భటులున్నారు. మీ చుట్టూ కూడా రక్షక భటులున్నారు. ఆ దొంగకి, మీకూ గల తేడా ఏమిటీ?''


అందుకా రాజు నవ్వి జవాబు చెప్పాడు. ''తన చుట్టూ రక్షక భటులున్న ఆ దొంగ బంధితుడు. అతను పారిపోకుండా వాళ్ళు కాపలా ఉన్నారు. నేను స్వేచ్ఛ కల వాడిని. ఈ రక్షక భటులు నన్ను కాపాడటానికీ వీరంతా నా చుట్టూ ఉన్నారు. నేను వెళ్ళిపొమ్మంటే వెళ్ళిపోతారు''


ఆ రక్షక భటులు కర్మలు. దొంగ చుట్టూ పారిపోకుండా ఉండి అతని నేరాలకి తగిన శిక్ష పడేలా చేసే రక్షక భటులు స్వార్ధకర్మల్లాంటి వాళ్ళు. స్వార్ధ కర్మలు మనల్ని బంధిస్తాయి. కాని రాజు చుట్టూ ఉన్న రక్షక భటులు నిస్వార్ధకర్మల్లాంటి వారు. *నిస్వార్ధ కర్మలు మనిషిని రక్షిస్తాయి తప్ప బంధించలేవు.*


త్వరగా పెరిగే ఓ లత, ఓ కొబ్బరి చెట్టు కాండాన్ని అల్లుకుని ఆ కొబ్బరి చెట్టుతో గర్వంగా చెప్పింది.


''చూడు, నేను ఎంత త్వరగా పెరిగి నిన్నంతా అల్లుకున్నానో? మరి నువ్వో? ఓ అంగుళం కూడా పెరగలేదు.''


ఆ కొబ్బరి చెట్టు చిన్నగా నవ్వి జవాబు చెప్పింది. ''వేలకొద్దీ లతలు నాతో ఇదే మాటన్నాయి. గాలి తాకిడికి అవి వెళ్ళిపోయాయి నేను మాత్రం బలంగా ఇక్కడే ఉన్నాను అని''.


కనుక మనం గమనించవలసినది ఏమంటే తెలిసోతెలియకో ఋణగ్రస్తులం కాకుండా మనం  విచక్షణవహించి ఆ బంధములనుండీ బయటపడే మార్గం నిరంతరం అన్వేషిస్తూనేఉండాలి అలాగే తగు ఆచరణద్వారా ఋణవిముక్తులై మోక్షపదాన్ని చేరుకోగలగాలి.🙏


నేను మగాన్ని నువ్వేంటి నాకు చెప్పేది...!!

 నేను మగాన్ని నువ్వేంటి నాకు చెప్పేది...!!

ఇలాంటి మాటలు తరచుగా ప్రతి ఇంట్లో వింటుంటాం



ఇక విషయంలోకి వద్దాం .....

 ఎవరు మగాడు...!!


కన్న తల్లి మాట జవదాటాని వాడు మగాడు..!!


తోడ బుట్టిన చెల్లికి జీవితాంతం రక్షణ కల్పించే వాడు మగాడు..!!


కలసి తిరిగే ప్రేయసితో కడవరకు నడిచేవాడు మగాడు..!!


కట్టుకున్న భార్య కంట్లో కన్నీటి చుక్కలు రానివ్వనివాడు మగాడు..!!


కళ్ళముందు నడుస్తున్న ఆడ కూతురిలో అమ్మను చూసేవాడు మగాడు..!!


ప్యాంట్ విప్పి చేసే పనిని బట్టే మగాడు అనాలి అంటే రోడ్డు మీద ఉన్న ప్రతీ కుక్క చేస్తుంది గా ఆ పని..!!


స్త్రీకి పుడతాడు...

స్త్రీ సహయంతో పెరుగుతాడు... 

స్త్రీ ని ఆధారంగా చేసుకొని నిలబడి గమనం సాగిస్తాడు.... 

చివరికి స్త్రీని అంగట్లో ఆట బొమ్మను చేసి ఆనందిస్తాడు..!!


నిన్ను ఎత్తుకొని ఆడించిన అమ్మ ఒక ఆడదే... 

నువ్వు వాడుకోడానికి ఎత్తుకెళ్లే అమ్మాయి కూడా ఒక ఆడదే..!!


ప్రతి అమ్మాయిలోను అమ్మను చూడగలిగిన రోజే మన దేశానికి నిజమైన స్వాతంత్రము..!!


యత్ర నార్యంతు పూజ్యేంతే రమంతే తత్ర దేవతా..!!

నాకు నచ్చినవి మీరు మెచ్చే మాటలు

 *నాకు నచ్చినవి మీరు మెచ్చే మాటలు*


విడిపోవడం తప్పదు అన్నప్పుడు ...అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది 


నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది. చెప్పక పోతే ఎప్పుడూ భయం వేస్తుంది. 


నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. 


వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్టగ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు. 


పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా? 


మనకు వస్తే కష్టం, మనకు కావలసిన వాళ్ళకి వస్తే నరకం... 


యుద్దంలో గెలవటం అంటే శత్రువుని చంపడం కాదు...ఓడించడం 


గొప్ప యుద్ధాలన్నీ నా అనుకున్న వాళ్ళతోనే. 


కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు. మోస పోయి కన్న వాళ్ళ దగ్గరకు వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. 


మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా...ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు. 


భయపడటంలోనే "పడటం" ఉంది , ఆశ కాన్సర్ ఉన్న వాడిని కూడా బతికిస్తుంది, భయం అల్సర్ ఉన్నోడిని కూడా చంపేస్తుంది. 


ఒళ్ళు తడవకుండా ఏరు దాటినవాడు, కళ్ళు తడవకుండా ప్రేమను దాటినవాడు ఎవ్వరూ లేరు. 


దేవుడు దుర్మార్గుడు. కళ్లున్నాయని సంతోషించే లోపే, కన్నీళ్ళున్నాయని గుర్తుచేస్తాడు. 


గౌరవం మర్యాద పరాయి వాళ్ళ దగ్గర చూపిస్తాం. కానీ కోపమయినా, చిరాకయినా సొంతం అనుకున్న వాళ్ళ దగ్గరే చూపిస్తాం. 


సక్సెస్ లో ఏ వెధవయినా నవ్వుతాడు, కానీ ఫెయిల్యూర్ లో నవ్వేవాడే హీరో. 


కన్నీళ్లు చాల విలువయినవి.... విలువల్లేని మనుషుల కోసం వాటిని వేస్ట్ చేయకూడదు. 


తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది. 


ఎంత పెద్దవాడికి "నో" చెప్తే అంత గొప్పవాడివి అవుతావు. 


బరువు పైన ఉంటె కిందకి చూడలేము, ఎంత బరువు ఉంటె అంత పైకి చూస్తావ్. ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావ్.


మీరు దగ్గర ఏమైనా ఉంటే  నాకు పంపించండి

Thursday, July 7, 2022

చుక్కల భూములంటే ఏమిటి ?


చుక్కల భూములంటే ఏమిటి ? 

ప్రభుత్వానికి వాటిపై హక్కెందుకు ?

(AP State)

...........................................................



" భూమినాదని యనిన భూదేవి నవ్వదా''

 ఈ మాటన్నది ఎవరంటే దార్ల సుందరమ్మనే తత్త్వజ్ఞాని, ఈమె

 గుంటూరు జిల్లాలోని చర్లగుడిపాడులో పద్మసాలె కుటుంబానికి చెందిన గంజి నాగమాంబ, శ్రీరాములు దంపతులకు 1802-03లో జన్మించింది. ప్రాయం వచ్చాక రామచంద్రపురం నివాసి దార్ల శేషయ్యను వివాహమాడింది. 1833లో ఆమె రాసిన భావలింగ శతకం నేటికి లభిస్తున్న మహిళా శతకాల్లో మొట్టమొదటిది.

ఆ భావలింగశతకములోనే ఈ దార్ల సుందరమ్మ మాటన్నట్టుగా నేను చదివాను.


దార్ల సుందరమ్మ కంటే శత సంవత్సరాల ముందుగా  యోగివేమన కూడా 


భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు

దానహీను జూచి ధనము నవ్వు

కదన భీతుఁజూచి కాలుడు నవ్వును

విశ్వదాభిరామ! వినుర వేమ!


అని అన్నాడు.

ఈ సామ్రాజ్యం నాది, ఎన్నో భూభాగాలు జయించాననే రాజును చూచి

నేను జమీందారును నేను భూస్వామిని నాకు వేల ఎకరాల భూముందనే వారిని,

నేను భూవ్యాపారిని (రియాల్టర్) ఎన్నో వందల ఎకరాలు కొన్నాను, అమ్మాననే వాడిని చూచి,

నాకేం బంగారం పండే 10 ఎకరాల మాగాణి వుంది నాకేం తక్కువ అనే వాడిని

నాకు మెట్రోపాలిటన్ సిటిలో, మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో, గ్రామపంచాయితిలో పదులసంఖ్యలో ఇంటి స్థలాలున్నాయని మిడిసిపడే వారిని చూచి భూమాత ఫక్కున నవ్వుతుందట, ఎందుకంటే ఆమే భూమాత సకల భూమికి అధిదేవత, అలాంటి పుడమి తల్లి ఈ భూములన్ని నావే నేనే స్వంతదారుడినంటే నవ్వక ఏం చేస్తుంది.


ఎవరు కూడా వేలవందలపదుల ఎకరాలకు స్వంతదారులు కాదు, ఎంత సంపాదించినా చివరికి వారికి మిగిలేది ఆరడుగుల నేలే.


ఇక చుక్కల భూమి విషయానికి వద్దాం.ఆంధ్రదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం 1918 నుండి 1928 వరకు  భూమిని సమగ్రసర్వే చేయించింది.  ఈనాటికి కూడా ఎవరు వెలెత్తి చూపనంతగా, అంత ఖచ్చితంగానన్నమాట. వారి కొలతలలో 0.0001 మి.మి. తేడా ఈనాటికి  కూడా  లేనంతగా వారి సర్వే జరిగింది. భూములను సర్వేచేయించే సమయంలో భూయాజమానులకు నోటీసులు ఇచ్చి వారి సమక్షంలోనే కొలతలు వేసి రికార్డు చేశారు. ఇలా కొలతలు వేసిన భూరికార్డులను ఫీల్డ్ మెజర్మెంటు (FMB) పుస్తకంగా తీసుకువచ్చారు.


ఒక గ్రామంలో భూయాజమానులకు ఏ సర్వే నెంబరులో ఎంతభూమి వుంది, యాజమాని ఎవరు భూస్వభావం అంటే చెరువు, సముద్రతీరం, నది, వాగు, వంక, కొండ,గుట్ట, దారి అడవి, గుడి, బడి, స్మశానం , ఊరు, అణగారిన వర్గాలకు (డిప్రెస్డ్ కేటగిరి) కేటాయించిన భూమి,, ఎవరికి చెందని భూమి (Unclaimed land) మొదలైనవాటినన్నింటిని నమోదుచేసి ఏ విస్తీర్ణంలో ఇవన్ని ఉన్నాయో స్పష్టంగా పేర్కొని ఒక పుస్తకరూపంలో తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకాన్నే మనము RSR అంటే రీసెటిల్మెంట్ రిజిస్టర్ లేదా Diglot  అంటున్నాము. DigIot అంటే రెండు భాషలు. ఈ పుస్తకము తెలుగు ఇంగ్లీష్ భాషలలో వుంటుంది కనుక DigIot అని అంటారు. Diglot లోని ప్రతినమోదుకు సర్వే నెంబరులు ఇవ్వడము జరిగింది.


RSR లో ఎవరు క్లైమ్ చేయని భూమికి యాజమానెవరో తెల్చడం కష్టము కనుక  ఇలాంటి భూములకు అనగా ఎవరు కాపుదారులు కాని భూములకు యాజమాని పేరున్న చోట చుక్కలను పెట్టారు. ఇవే చుక్కల భూములంటే.


ఇక FMB లో భూయాజమాని - పేరు వివరాలు వుండవు కాని మిగతా వివరాలన్ని (చిహ్నాల) రూపంలో పొందుపరచి వుంటాయి.


1928 వరకు భూమిని సర్వేచేసినపుడు కొందరు యాజమానులు సర్వే సమయంలో సర్వేతోపాటు  హజరు కాలేదు. పంటలు పండక భూమిని వదిలివేయడం, శిస్తులు కట్టలేక భూమిని వద్దనుకోవడం, కరువుకాటకాల వలన గ్రామాన్ని వదిలేయడం, సర్వే చేస్తున్న సంగతి తెలియకపోవడము ఇలా రకరకాల కారణాల వలన వారు హజరుకాలేకపోయివుండవచ్చు.

ఎప్పుడైతే RSR విడుదలైందో అందులో తమపేర్లు భూవివరాలు కనబడలేదో వారంతా ఆందోళనకు భయానికి గురైనారు. RSR లో పేరు లేకపోయినా వాస్తవానికి వారు భూయాజమానులే.


ఎప్పుడైతే తమ పేర్లు RSR లో కనబడలేదో భూమివున్న యాజమానులు ప్రభుత్వానికి తమ గోడును విన్నవించుకోవడం జరిగింది. జరిగిన తప్పులను సరిచేయటానికి ప్రభుత్వం ఓ మధ్యేమార్గాన్ని  ప్రవేశపెట్టింది. ఆ పద్ధతిపేరే రికార్డ్ ఆఫ్ హొల్డింగ్స్ ( RH) అనంటారు. ఎవరి పేరైతే RSR లో లేదో వారి పేర్లంటిని RH లో నమోదు చేశారు. ఇలా RH లో 1933 నుండి 1953 సంవత్సరాల మధ్యకాలములో RSR లో పేర్లులేని భూయాజమానుల పేర్లు నమోదు చేయడము జరిగింది. భూమికి రక్షణదారు అంటే కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్  రివెన్యూశాఖ వుంటుంది. ఎందుకోకాని RH ను రిజిస్ట్రేషన్ శాఖవారికి అప్పగించడము జరిగింది.


సమస్తభూమికి ప్రభుత్వమే యాజమాని, అందుకే RSR లో GD (గవర్నమెంట్ డ్రై) గవర్నమెంట్ వెట్( GW) అని వ్రాసివుంటుంది.ఒక భూమి మనకు వంశపారంపర్యంగా వచ్చినా, కొన్నప్పుడు రిజిస్టర్డ్ డాక్యూమెంట్లు మన దగ్గరున్నా, భూమిని అమ్మే అధికారము తాకట్టు పెట్టే అధికారము మొ॥ మనదగ్గరున్నా చివరగా భూయాజమాని ప్రభుత్వమే. అందుకే ప్రజోపయోగం కోసం ఏ భూమినైనా ప్రభుత్వము స్వాధీనం చేసుకోనే అధికారముంది.


భూమిని స్వాధీనపరచుకొన్నప్పుడు మనకిచ్చే నష్టపరిహారం ప్రభుత్వం మనకు ఇచ్చే సొమ్ము సోషియల్ వెల్పేర్ ఫ్రండే కాని మరేమి కాదు. నాకు ఇచ్చిన భూనష్టపరిహారం పైనే కోర్టులలో వ్యాజ్యాలు వేసుకోవచ్చునే కాని  భూమిని ఇవ్వమని వేయకూడదు. ఒకవేళ అలాంటి కేసులు వేసినా కోర్టులు కొట్టేస్తాయి.


RSR లో చుక్కలున్న భూమికి యాజమానులెవరు లేరు కనుక ప్రభుత్వమే ఈ భూములకు యాజమాని. ప్రభుత్వాలు సాంఘికసంక్షేమ పథకము కింద ఇలాంటి భూములను నిరుపేద వ్యవసాయదారులకు D పట్టా ఇస్తుంది. D పట్టాలంటే ధరఖాస్తు పట్టాలు. భూమిలేని వారు ప్రభుత్వానికి ధరఖాస్తు చేస్తారు కనుక వారికి ఇచ్చిన భూములను D పట్టాభూములంటారు.ఇలా నిమ్నజతులకు ఇచ్చిన D పట్టావివరాలు RSR వుంటాయి.


1954 జూన్ 18 వరకు  అంటే స్వతంత్ర్యం రాకముందు నుండి 18.6.1954 వరకు పేదలకు ఇచ్చిన D పట్టాలలో సదరు భూములు అమ్ముకోరాదని  ఏలాంటి  నిబంధనలు (కండిషన్స్)  ఉండేవి కాదు. అందువలన ఇలాంటి భూములు అన్యాక్రాంతమైయ్యేవి. పేదలు తమకు ఉచితంగా ఇచ్చిన భూములను అమ్మేసుకోవడము వలన వారు తిరిగి భూమిలేని నిరుపేదలయ్యేవారు.


అందువలన ఇలాంటి భూములు అన్యాక్రాంతము కాకుండా రెవెన్యూశాఖ ఒక ప్రభుత్వఉత్తర్వును (GO No 1442  Revenue Department Dated 18.6.1954) తీసుకువచ్చింది.

GO No 1142 జారీ అయిననాటి నుండి పేదలలకు D పట్టాగా మంజూరుచేసిన  భూములను D పట్టాదారులు అమ్మటానికి వీలులేదు, ఇతరులు కొనటానికి వీలులేదు. అలా ఎవరైనా అమ్మినా లేదా కొన్నా అటువంటి భూములను ప్రభుత్వం వెనక్కు (Resume) తీసుకొని మరలా అర్హులకు D పట్టాలివ్వవచ్చును. అయినప్పటికి Dపట్టాదారులకు కొనేవారికి చివరికి కొందరు అధికారులకు చట్టము పట్ల అవగాహనలేకపోవడము వలన D పట్టాభూముల అమ్మకము విరివిగా జరిగింది. 

ప్రభుత్వము 1977 లో నిషేధిత భూవిక్రయచట్టము   Government  అంటే The Andhra Pradesh Assigned Lands (Prohibition of Transfers) Act, 1977 (Act 9 of 1977) చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టము 29.1. 1977  తేదీనుండి ఆంధ్రప్రదేశ్ అంతటా అమలులోనికి వచ్చింది. దీనినే Act 9 ఆఫ్ 77 అనికూడా (యాక్ట్9/77 అంటారు. ఈ చట్టము ప్రకారము ప్రభుత్వము D పట్టాగా ఇచ్చిన భూములను అమ్మడం, కొనడము, తనఖా వుంచడము, కౌలుకు ఇవ్వడము చేయరాదు. అయితే G0 1142 లో చెప్పినట్లుగా ప్రభుత్వబ్యాంక్ లలో, ప్రభుత్వపు కో-ఆపరేటివ్ సొసైటీలలో వ్యవసాయం నిమిత్తము తనఖా(మార్టగేజ్)  చేయవచ్చును.

ఎవరైనా Act 9/77 ను ఉల్లంఘిస్తే అటువంటి భూములను ప్రభుత్వం స్వాధీనము చేసుకోవచ్చును. అలాంటి భూములలో భవనాలు, ఇండ్లు, పరిశ్రమలు మొ॥వున్నప్పటికి ఏలాంటి నష్టపరిహరము లేకుండా స్వాధీనము చేసుకోవచ్చును.


అయితే స్వాతంత్ర్యసమరయోధులకు మాజీ సైనికులకు ( Ex - Service)  D పట్టాగా అసైన్‌మెంటు చేసిన భూములను 10 సంవత్సరాల అనంతరం అమ్ముకోవచ్చుననే వెసులుబాటు కల్పించింది.


అంతా బాగానే వుంది, మరైతే  RSR లో భూమి చుక్కలభూమిగా వుంది, RH లో పేర్లున్నాయి. ఈ భూములు అమ్ముదామన్నా కొందామన్నా రిజిస్టరు కావడము లేదు. ఎందుకంటే ఇలాంటి చుక్కల భూమంతా ప్రభుత్వభూమేనని 2005 లో రెవెన్యూశాఖవారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖవారికి   జాబితాలు పంపడం జరిగింది. దీనినే 22 A (1) కింద వుంచడము జరిగిందంటారు. RH లో పేర్లుండి తమ అవసరాలకు తమ భూమిని అమ్ముకోవాలంటే ఏం చేయాలని ప్రభుత్వంను అడగడం జరిగింది. ఇలాంటి భూములేమైనా వుంటే 22 A (1) నుండి తొలగించటానికి ప్రతిపాదనలు పంపమని కలెక్టర్లను కోరడము జరిగింది. తహశీల్దారుల, ఆర్డీవోల  సాయముతో వాటిని 22 A (1) నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇంకా కొన్ని మండలాలలో పని జరుగుతూవుంది.

అయితే చుక్కలభూమిని ఎవరికి D పట్టాగా అసైన్‌మెంటు చేసివుండరాదు. ఎవరికైనా అసైన్మెంటుగా ఇచ్చివుంటే 22 A (1) నుండి తొలగించాటనికి వీలుకాదు.


ఈ సమాచరము ప్రాథమిక అంశాలు తెలుసుకోటానికి మాత్రమే. 

అవసరమున్న వారు చట్టాలను అవగాహన  చేసుకోవాలి.


పసుపులేటి నరేంద్రస్వామి


మీ చేతిలో భారతం

 *మీ చేతిలో భారతం*


*మహాభారతంలో 100 మంది కౌరవులు  వారి పేర్లు...*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

 

1. దుర్యోధనుడు. 2. దుశ్సాసనుడు. 3. దుస్సహుడు. 4. దుశ్శలుడు. 5. జలసంధుడు. 6. సముడు. 7. సహుడు. 8. విందుడు. 9. అనువిందుడు. 10. దుర్దర్షుడు. 11. సుబాహుడు. 12. దుష్పప్రదర్శనుడు. 12. దుర్మర్షణుడు. 13. దుర్మఖుడు. 15. దుష్కర్ణుడు. 16. కర్ణ. 17. వివింశతుడు. 18. వికర్ణుడు. 19.శలుడు. 20. సత్వుడు. 21. సులోచనుడు. 22. చిత్రుడు. 23. ఉపచిత్రుడు. 24. చిత్రాక్షుడు. 25. చారుచిత్రుడు.

 

26. శరాసనుడు. 27. ధర్మధుడు. 28. దుర్విగాహుడు. 29. వివిత్సుడు. 30. వికటాననుడు. 31. నోర్ణనాభుడు. 32. నునాభుడు. 33. నందుడు. 34. ఉపనందుడు. 35. చిత్రాణుడు. 36. చిత్రవర్మ. 37. సువర్మ. 38. దుర్విమోచనుడు. 39. అయోబావుడు. 40. మహాబావుడు. 41. చిత్రాంగుడు. 42. చిత్రకుండలుడు. 43. భీమవేగుడు. 44. భీమలుడు. 45. బలాకుడు. 46. బలవర్థనుడు. 47. నోగ్రాయుధుడు. 48. సుషేణుడు. 49. కుండధారుడు. 50. మహోదరుడు.


 

51. చిత్రాయుధుడు. 52. నిషింగుడు. 53. పాశుడు. 54.బృఎందారకుడు. 55. దృఢవర్మ. 56. దృఢక్షత్రుడు. 57. సోమకీర్తి. 58. అనూదరుడు. 59. దఢసంధుడు. 60. జరాసంధుడు. 61. సదుడు. 62. సువాగుడు. 63. ఉగ్రశ్రవుడు. 64. ఉగ్రసేనుడు. 65. సేనాని. 66. దుష్పరాజుడు. 67. అపరాజితుడు. 68. కుండశాయి. 69. విశాలాక్షుడు. 70. దురాధరుడు. 71. దుర్జయుడు. 72. దృఢహస్థుడు. 73. సుహస్తుడు. 74. వాయువేగుడు. 75. సువర్చుడు.

 

76. ఆదిత్యకేతుడు. 77. బహ్వాశి. 78. నాగదత్తుడు. 79. అగ్రయాయుడు 80. కవచుడు. 81. క్రధనుడు. 82. కుండినుడు. 83. ధనుర్ధరోగుడు. 84. భీమరధుడు. 85. వీరబాహుడు. 86. వలోలుడు. 87. రుద్రకర్ముడు. 88. దృణరదాశ్రుడు. 89.అదృష్యుడు. 90. కుండభేది. 91. విరావి. 92. ప్రమధుడు. 93. ప్రమాధి. 94. దీర్గరోముడు. 95. దీర్గబాహువు. 96.ఉడోరుడు. 97. కనకద్వజుడు. 98. ఉపాభయుడు. 99. కుండాశి. 100. విరజనుడు.

 

101వ బిడ్డగా దుశ్శల అనే ఆడపిల్ల జన్మిస్తుంది.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి

వీలునామా WILL అంటే ఏమిటి

 వీలునామా WILL అంటే ఏమిటి దానిని ఏవిదంగా వ్రాయవచ్చు వీలునామావ్రాసే వారికి అర్హతలు తెలుసుకుందాం




1)వీలునామా అనేది ఒక వ్యక్తి యొక్క ఆస్తిని అతని / ఆమె కోరిక ప్రకారం మరణం తరువాత బదిలీ చేయడానికి ఉపయోగించే చట్టపరమైన పత్రం. (ఒక వ్యక్తి తన ఇష్టాన్ని లేదా అభీష్టాన్ని వ్యక్తం చేసే పత్రాన్నే *విల్*  అని అంటారు. ఆ వ్యక్తి  వీలునామా రాసినప్పటికినీ, తన మరణానంతరం ఆ వీలునామా అమల్లోకి వస్తుంది. వీలునామానే *మరణ శాసనం* అని కూడా అంటారు. వీలునామా అనేది మనిషి యొక్క చివరి కోరికగా అనుకోవచ్చు. ) వారసత్వ వివాదాల పరిష్కారం కోసం వివిధ కోర్టుల ముందు లక్షలాది సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నందున విల్ యొక్క ప్రాముఖ్యతను తగినంతగా నొక్కి చెప్పలేము. ఇంకా, అన్ని విల్స్ వ్యక్తి జీవితంలో ఎప్పుడైనా ఉపసంహరించబడతాయి మరియు ఇది రహస్య పత్రం. అందువల్ల, ప్రతి ఒక్కరూ విల్ కలిగి ఉండటం మరియు విల్ సృష్టించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.


●2)ఒక వ్యక్తి తన జీవితకాలంలో సంపాదించిన స్థిర, చర ఆస్తి గురించిన సంతోషం కంటే.... తన తదనంతరం ఆ ఆస్తి కోసం తన కుటుంబ సభ్యులు ఎలా కొట్లాడుకుంటారో అన్న భయం, బెంగ ఎక్కువగా ఉంటుంది. ఆస్తి పెరుగుతున్న కొద్దీ ఈ భయం ఉంటుంది. ఇలాంటి భయాలు, బెంగలు నివారించి వాటిని అరికట్టడం కోసం తాను జీవించి ఉండగా చేసే చట్టబద్ధమైన స్వయం నిర్ణయమే వీలునామా.  (స్థిర ఆస్తి అంటే ఇల్లు, ఇళ్ల స్థలములు, వ్యవసాయ భూములు, తోటలు వగైరా... చరాస్తి అంటే నగదు, బ్యాంకు నిల్వలు, ఫర్నిచర్, పుస్తకాలు, పాత సామానులు, డివిడేండ్లు, బోనస్, కారు,ఉమ్మడి ఆస్తిలో తనకు వచ్చు వాటా మొదలైనవి.)


●3)వీలునామా రాసే వ్యక్తి మంచి తెలివితో, వ్యవహార జ్ఞానంతో వీలునామా రాస్తేనే చెల్లుబాటు అవుతుంది. ఒకసారి వీలునామా రాసిన తర్వాత మరల దానిని రద్దుపరచి కొత్త వీలునామా కూడా రాయవచ్చు. రద్దు పరచడం అంటే పాత వీలునామాని చించవచ్చు లేదా తగలబెట్టవచ్చు లేదా  కొత్త వీలునామాలో పాత దాన్ని రద్దు చేస్తున్నట్లు రాసుకోవచ్చు. అలా ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు అంతకు ముందు తాను రాసిన వీలునామా రద్దుపరచి కొత్త వీలునామా రాయవచ్చు. వీలునామా ఏ బాష లోనైనా రాయొచ్చు. చివరిగా రాసిన వీలునామానే చెల్లుబాటు అవుతుంది.


●4) వీలునామా తప్పనిసరిగా రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్టర్ చేయవలసిన అవసరం లేదు. ఎవరైనా వ్యక్తి తాను ఉన్న చోట నుండి తెల్ల పేపరు లేదా బాండ్ పేపర్ మీద స్వదస్తూరితో గాని లేదా దస్తావేజు లేఖరితో గాని వీలునామా రాయవచ్చు లేదా రాయించు కోవచ్చు. వీలునామాలో ఏమైనా తప్పులు దొర్లితే వీలునామా రాసిన వ్యక్తి కొట్టివేతలున్న చోట సంతకం చేయాలి. ఇలా డబ్బు ఖర్చు లేకుండా ఎన్ని సార్లయినా వీలునామా మార్చి మార్చి రాసుకోవచ్చు.


●5)వీలునామా  అనేది వ్యక్తి మరణానంతరము అమల్లోకి వస్తుంది. కనుక దానిలో తన అభిమతానికి అనుగుణంగా తాను మరణించే లోపు ఎన్ని మార్పులు చేర్పులు అయిన డబ్బు ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. కానీ ఆస్తి పంపకాలు (పార్టీషన్), దానధర్మాలు (గిఫ్ట్), ఆస్తి సంబంధిత పత్రాల పరిష్కారాలు ఇతర లావాదేవీలన్నీ తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలి. విల్ మినహా ఏ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయటానికి వీలుండదు. కాబట్టే అందరూ వీలునామాకు  ఆసక్తి చూపుతారు. 


●6) ఒకవేళ వీలునామాని భద్రపరచాలి అనుకుంటే వీలునామా రాసిన వ్యక్తి వీలునామాను సబ్ రిజిస్టార్ వద్ద డిపాజిట్ చేయించవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ఆ వీలునామాను ఫైర్ సేఫ్టీ గదిలో భద్రపరచాలి. వీలునామ రాసిన వ్యక్తి రిజిస్ట్రార్ భద్రపర్చిన పత్రాన్ని  ఎప్పుడైనా కోరితే రిజిస్ట్రార్ ఇస్తాడు. ఒకవేళ వీలునామా రాసిన వ్యక్తి చనిపోతే అతని వారసులు అతని డెత్ సర్టిఫికెట్ రిజిస్ట్రార్‌కి అందజేస్తే వీలునామాను అతని వారసులకు ఇస్తాడు.


●7)  వీలునామా ద్వారా మైనర్లకు ఆస్తి పాస్తులను సంక్రమింప చేయాలనంటే మైనర్‌కు గార్డియన్ ఉంటేనే వీలునామా చెల్లుతుంది. 


●8) సబ్ రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేసిన వీలునామా ఆ వీలునామా రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాతే అతని వారసులకు ఇవ్వబడుతుంది. 


●9) వీలునామాలో ఏదైనా షరతు పెట్టి వీలునామా రాసి ఉంటే ఆ షరతులు పూర్తి చేస్తేనే ఆ వీలునామా చెల్లుబాటు అవుతుంది. 


●10) వీలునామాలో కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలి. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది సాక్షులు కూడా ఉండవచ్చు. ఏదైనా వివాదం ఏర్పడినట్లయితే కోర్టుకి ఒక్కరైనా వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది.


●11) వీలునామాలో ఆస్తుల్ని రాసేటప్పుడు కచ్చితమైన హక్కులతో సహా సర్వే నెంబర్లతో సహా రాయాలి. తనకున్న ఆస్తులని మాత్రమే వీలునామాలో రాయాలి. తనకు లేని ఆస్తులను వీలునామాలో రాయకూడదు. భవిష్యత్తులో వచ్చే ఆస్తులను వీలునామాలో రాయకూడదు.


●12) ఎవరి చేతనైనా వీలునామా రాయించి ఉండి ఉంటే ఆ దస్తూరి రాసిన వ్యక్తి చేత తప్పనిసరిగా సంతకం (చివరి పేజీలో) చేయించాలి. ఒక వేళ కంప్యూటర్ చేయించి ఉంటే ఆ కంప్యూటర్ షాప్ గల వ్యక్తి పేరు, అడ్రస్ ఆ వీలునామాపై రాయించాలి. 


●13)వీలునామా రాసిన తర్వాత రద్దు పరచి మరొక వీలునామా రాయాలనుకుంటే గతంలో రాసిన వీలునామా గురించి ఉదహరించాలి. వీలునామా రాసిన వ్యక్తి (వీలునామాదారు) మరణించక ముందే వీలునామా ద్వారా ఆస్తులను పొందినవారు మ్యుటేషన్ చేయించుకోలేరు. 


●14) వీలునామాను కుంటి, గుడ్డి, అవిటి వారు కూడా మానసిక పరిస్థితి బాగుంటే రాయవచ్చు.


●15) వీలునామా ద్వారా ఆస్తి పొందినవాడు వీలునామా రాసిన వ్యక్తి చనిపోక ముందే ఇతరులకు అమ్మకూడదు లేదా అన్యాక్రాంతం చేయటానికి అవకాశం లేదు. 


●16) ముస్లింలలో వీలునామా అనేది లిఖిత పూర్వకంగా రాయాల్సిన అవసరం లేదు. అంటే నోటి మాట ద్వారా కూడా వీలునామా ప్రకటించవచ్చు. ఒక వేళ వీలునామా రాయాల్సి వచ్చినా కూడా దానిపై వీలునామా చేయాల్సిన వ్యక్తి సంతకం లేదా వేలి ముద్ర వేయాల్సిన అవసరం లేదు. సాక్షి సంతకాలు కూడా అవసరం లేదు. ఒకవేళ ఆసక్తి ఉంటే ముస్లింలు వీలునామాను రిజిస్టర్ కూడా చేయించుకోవచ్చు. ముస్లింలు తన ఆస్తిలో 1/3 వంతు వరకు మాత్రమే వీలునామా చేయొచ్చు. 2/3 వ వంతు తన వారసులకు వదిలేయాలి. ముస్లింలలో వారసులు లేని వారు యావదాస్తిని వీలునామా క్రింద ఇతరులకు రాయొచ్చు. ముస్లింలలో వీలునామాని అమలు పరచదగ్గ వ్యక్తి (ఎగ్జిక్యూటర్) ముస్లిం కాకుండా కూడా ఉండొచ్చు. ముస్లింలు తమ ఆస్తిని ఏ ఇతర మతస్తులకయినా కూడా వీలునామా రాయొచ్చు. హిందువులలో వలెనే ముస్లింలు కూడా తాను రాసిన వీలునామాని రద్దు చేసుకోవచ్చు. అవసరమైతే మార్పులు-చేర్పులు కూడా చేసుకోవచ్చు.


●17)  ఒక వ్యక్తి వీలునామా వ్రాయకుండా చనిపోతే అతనికి ఉన్న ఆస్తులు హిందూ వారసత్వ చట్టం ప్రకారం అతని వారసులకు చెందుతాయి.


●18)  మానసికంగా బలహీనంగా ఉన్నవారు లేదా మానసిక అస్వస్థతతో ఉన్న వారు వీలునామా రాయకూడదు. ఒక వేళ అలా రాస్తే తరవాత ఆ ఆస్థి పొందిన వ్యక్తి తనకు సరయిన విధంగానే ఆస్తి వచ్చిందని నిరూపించుకోవాల్సి ఉంటుంది.


●19) వీలునామా రాసిన వ్యక్తి తెల్ల కాగితం మీద కానీ స్టాంప్ పేపర్ మీద కాని రాయొచ్చు. ప్రతి పేజీ మీద వీలునామా రాసిన వ్యక్తి సంతకం చేయాల్సి ఉంటుంది. సాక్షులు, దస్తూరి రాసిన వ్యక్తి తప్పనిసరిగా  చివరి పేజీ మీద సంతకం చేయాలి. 


●20) వీలునామా రాసిన వ్యక్తి తాను రాసిన వీలునామాని అమలు పరచడం కోసం నమ్మకమైన వ్యక్తిని ఎగ్జిక్యూటర్‌గా నియమించుకోవచ్చు. ఎగ్జిక్యూటర్ (వీలునామా అమలుపరచదగిన వ్యక్తి) అనేవారు వీలునామా రాసిన వ్యక్తికి బంధువు అయి ఉంటే మంచిది. వీలునామా రాసిన వ్యక్తికి ఆస్థులున్న చోట నివాసం వుండే వ్యక్తిని Executor గా నియమించుకోవచ్చు. అవసరమైతే Executor ను సాక్షిగా ఉపయోగించవచ్చు. ఆ వీలునామా ద్వారా లబ్ది పొందే వ్యక్తిని కూడా ఎగ్జిక్యూటర్ గా నియమించు కోవచ్చు. వీలునామా రాసే వ్యక్తి వీలునామాను అమలు చేసే ఎగ్జిక్యూటర్‌కు కొంత పరిహారాన్ని ఇవ్వొచ్చు.


●21) ఒక వ్యక్తికి జాయింట్ కుటుంబ ఆస్తిలో వాటా ఉండి, ఆ ఆస్తిలో తనకు రాబడే అనిర్దిష్ట అంటే ఇంకా పంపకం కాని ఆస్తుల్ని కూడా వీలునామా చేయొచ్చు. 


●22) వీలునామాదారు కొత్తగా పెళ్లి చేసుకుంటే గతంలో చేసిన వీలునామా రద్దు అవుతుంది.


●23) సహజంగా వీలునామాలో పేర్కొనబడిన సాక్షులు, దస్తూరి, ఎగ్జిక్యూటివ్ అనేవారు వీలునామా రాసిన వ్యక్తి కంటే వయసులో తక్కువ ఉంటే మంచిది. ఎందుకంటే వీలునామాను వారు అమలు చేయాల్సి వుంటుంది కనుక. 


●24) డిఫెన్స్ అనగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లలో పనిచేసేవారు తమకున్న ఆస్తిపాస్తులన్నీ వీలునామా ద్వారా ఇతరులకి ఇవ్వొచ్చు. అయితే వీలునామా రాసిన వ్యక్తి తప్పనిసరిగా సంతకం చేయాలనే నిబంధన లేదు. సాక్షి సంతకం కూడా ఉండవలసిన అవసరం లేదు. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల సమక్షంలో చెప్పినా సరిపోతుంది. 


●25)  వీలునామాని రద్దు చేయకుండా మార్పులు-చేర్పులు చేసుకోవడాన్ని కోడోసిల్ (CODOCIL) అంటారు. వీలునామాలో అదనపు విషయాలు చేర్చవచ్చు. కొన్ని విషయాలు తొలగించవచ్చు. మార్పులు, చేర్పులు చేయాలంటే వేరే కాగితంపై రాయవచ్చు లేదా రాసిన వీలునామా వెనుక మరలా రాయవచ్చు. 


●26) భార్య-భర్తలు కలిసి జాయింట్‌గా వీలునామా రాయొచ్చు. మార్పులు, చేర్పులు ఎక్కువగా ఉంటే కోడోసిల్ ప్రకారం రాయటం కంటే మరియొక వీలునామా రాయటం మంచిది.


●27)  వీలునామాలో ఉన్న సాక్షులు ఆ వీలునామా  ద్వారా లబ్ధి పొందకుండా ఉండేలా వీలునామా రాసే వ్యక్తి జాగ్రత్తపడాలి. వీలునామాలో ఉన్న సాక్ష్యులు స్వతంత్ర వ్యక్తులై, వీలునామా రాసిన వ్యక్తితో బంధుత్వం లేకుండా ఉంటే మంచిది. 


●28)  వీలునామా ద్వారా కుటుంబ సభ్యులకు లేక ఎవరైనా ఇతరులకు లేక ట్రస్టులకు, సంస్థలకు ఎవరికైనా ఆస్తులని రాయొచ్చు.


●29)  క్రిస్టియన్లు కూడా హిందువుల వలెనే వీలునామా నియమాలను పాటించవలసి ఉంటుంది. 


●30)  వీలైనంత వరకు వీలునామాని రిజిస్టర్ చేస్తే భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా నివారించవచ్చు. 


●31) వీలునామాలో ఉన్న మంచి సౌలభ్యం ఏంటంటే వీలునామాలో ఉన్న ఆస్తులకు స్టాంప్ డ్యూటీ కట్టే పని లేదు. కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.


●32) వీలునామా రాసిన వ్యక్తి తనకు ఇష్టమైన పదజాలంతో వీలునామా రాయవచ్చు లేదా రాయించుకోవచ్చు. ప్రత్యేకమైన మాటలు కానీ, చట్టపరమైన మాటలు కానీ ఏమీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. 


●33) వీలునామాను రిజిస్ట్రేషన్ చేయించు కోవాలనే ఆసక్తి ఉండి, తనకు తానుగా ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితుల్లో రిజిస్ట్రార్‌ని సంప్రదిస్తే రిజిస్ట్రార్ స్వయంగా వీలునామా రాసే వ్యక్తి ఇంటికి లేదా ఆస్పత్రికి వెళ్లి వీలునామాను రిజిస్టర్ చేయాల్సి వుంటుంది.                     


●34) 18 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులు ఎవరైనా, తను జీవించి ఉండగా ఎప్పుడైనా వీలునామా రాయొచ్చు.


*భారతదేశంలో వీలునామా రకాలు*


*నిరుపయోగమైన వీలునామా*

యాత్రలో పనిచేసే సైనికుడు కాని లేదా వాస్తవ యుద్ధంలో నిమగ్నమైన వ్యక్తి లేదా సముద్రంలో ఒక నావికుడు సృష్టించిన విల్ ను అప్రధానమైన విల్ అంటారు. అప్రధానమైన విల్ చెల్లుబాటు కావాలంటే, ఇది క్రింది షరతులను సంతృప్తి పరచాలి:


విల్‌ను సృష్టించే వ్యక్తి తన / ఆమె గుర్తును విల్‌కు సంతకం చేయాలి లేదా జతచేయాలి. లేకపోతే, అతని / ఆమె సమక్షంలో టెస్టేటర్ (విల్ విల్ క్రియేటింగ్) ఆదేశాల ప్రకారం మరికొందరు సంతకం చేయాలి.


టెస్టేటర్ యొక్క సంతకం లేదా గుర్తు లేదా టెస్టేటర్ కోసం సంతకం చేసిన వ్యక్తి యొక్క సంతకం తప్పనిసరిగా ఉంచాలి, తద్వారా ఇది విల్ వలె రచనను ప్రభావితం చేయడానికి ఉద్దేశించినట్లు కనిపిస్తుంది.


ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సాక్షులు సంకల్పానికి ధృవీకరించాలి. సాక్షులు టెస్టేటర్ గుర్తును చూడాలి లేదా అతని గుర్తును విల్‌కు అంటించాలి లేదా మరికొందరు వ్యక్తులు విల్‌పై సంతకం చేసి, సమక్షంలో మరియు టెస్టేటర్ దిశలో ఉండాలి.


*ప్రివిలేజ్డ్ విల్*


ప్రివిలేజ్డ్ విల్స్ అంటే సైనికుడు, ఎయిర్‌మెన్ లేదా నావికుడు వంటి క్రియాశీల సేవల్లో ఉన్నవారు వ్రాతపూర్వకంగా లేదా నోటి మాట ద్వారా తయారుచేసే విల్స్. కొంతమంది వ్యక్తులు త్వరగా విల్ చేయడానికి వీలుగా ఒక ప్రత్యేకమైన విల్ యొక్క చెల్లుబాటు కోసం చట్టపరమైన అవసరం తగ్గించబడింది. ప్రత్యేకమైన విల్ కోసం కింది షరతులు వర్తిస్తాయి:


టెస్టేటర్ తన ఇష్టంతో మొత్తం ఇష్టాన్ని వ్రాస్తాడు. అటువంటి సందర్భంలో, ఇది సంతకం లేదా ధృవీకరించాల్సిన అవసరం లేదు.


టెస్టేటర్ పూర్తిగా లేదా కొంత భాగాన్ని మరొక వ్యక్తి రాసిన విశేష విల్పై సంతకం చేయాలి. అటువంటి సందర్భంలో, ధృవీకరణ అవసరం లేదు.


ఒక విల్ పూర్తిగా లేదా పాక్షికంగా మరొక వ్యక్తి వ్రాసినది మరియు టెస్టేటర్ సంతకం చేయనిది చెల్లుబాటు అయ్యే విల్, ఇది టెస్టేటర్ ఆదేశాల మేరకు వ్రాయబడిందని లేదా టెస్టేటర్ దానిని అతని / ఆమె విల్ గా గుర్తించాడని రుజువైతే.


అమలు చేయకపోవడం వేరే కారణాల వల్ల జరిగిందని మరియు విల్ సృష్టించడానికి ఉద్దేశాలను వదిలివేసినట్లు కనిపించకపోతే సగం పూర్తయిన ప్రత్యేక విల్ కూడా చెల్లుబాటు అవుతుంది.


*ఉద్దేశాలను ప్రకటించడం ద్వారా నోటిమాట ద్వారా విశేషమైన విల్ చేయవచ్చు.*


ఒక సైనికుడు లేదా ఎయిర్‌మెన్ లేదా నావికుడు విల్ తయారీకి వ్రాతపూర్వక లేదా శబ్ద సూచనలు ఇచ్చినా, దానిని తయారు చేసి అమలు చేయడానికి ముందే మరణించినట్లయితే. మరియు అలాంటి సంకల్పం చెల్లుబాటు అయ్యే విల్.


*షరతులతో కూడిన లేదా ఆకస్మిక విల్స్* 


కొన్ని షరతులను సంతృప్తిపరిచిన సందర్భంలో మాత్రమే ప్రభావం చూపడానికి ఒక విల్ వ్యక్తీకరించబడుతుంది లేదా ఇతర అంశాలపై నిరంతరంగా ఉంటుంది. అటువంటి విల్, కొంత ఆకస్మిక లేదా పరిస్థితి సంభవించినప్పుడు మాత్రమే చెల్లుతుంది, మరియు ఆకస్మిక సంఘటన జరగకపోతే లేదా పరిస్థితి విఫలమైతే, దానిని షరతులతో కూడిన లేదా అనిశ్చిత విల్ అంటారు. జాయింట్ విల్స్ జాయింట్ విల్ అనేది ఒక రకమైన విల్, ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సంయోగ విల్ చేయడానికి అంగీకరిస్తారు. 


*ఒక ఉమ్మడి విల్*

 ఇద్దరు వ్యక్తుల మరణం తరువాత అమలులోకి రావాలని అనుకుంటే, అది వారి జీవిత కాలంలో అమలు చేయబడదు. ఉమ్మడి జీవితాల్లో లేదా మరణం తరువాత వ్యక్తి ఎప్పుడైనా ఉమ్మడి ఇష్టాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఉమ్మడి విల్స్ ఉమ్మడి విల్స్ ఒక వ్యక్తి చేత వ్రాయబడతాయి, ఇందులో రెండు లేదా అంతకంటే ఎక్కువ విల్స్ సౌలభ్యం కోసం ఆస్తిని పారవేయడానికి సూచనలను అందిస్తాయి. 


*ఉదాహరణకు* ఒక విల్ అన్ని స్థిరమైన ఆస్తిని పారవేయడంతో వ్యవహరించగలదు, మరొక విల్ అన్ని కదిలే ఆస్తిని పారవేయడంతో వ్యవహరిస్తుంది. మ్యూచువల్ విల్స్ పరస్పర సంకల్పంలో, పరీక్షకులు ఒకరికొకరు పరస్పర ప్రయోజనాలను అందిస్తారు. భార్యాభర్తలు తమ జీవితకాలంలో అవతలి వ్యక్తికి అన్ని ప్రయోజనాలను అందించే పరస్పర సంకల్పం అమలు చేస్తారు.


*డూప్లికేట్ విల్స్*


టెస్టేటర్ ఒక బ్యాంక్ లేదా ఎగ్జిక్యూటర్ లేదా ట్రస్టీతో భద్రత లేదా భద్రత కోసం నకిలీ వీలునామాను సృష్టిస్తాడు. ఏదేమైనా, టెస్టేటర్ అతని / ఆమె అదుపులో ఉన్న విల్‌ను నాశనం చేస్తే, ఇతర విల్ కూడా ఉపసంహరించబడుతుంది.


*షామ్ విల్స్*


టెస్టేటర్ అతని / ఆమె ఇష్టానుసారం అమలు చేయకూడదనుకుంటే షామ్ విల్స్ అమలు చేయబడతారు కాని చెల్లదు. భారతీయ వారసత్వ చట్టం ప్రకారం, మోసం లేదా బలవంతం ద్వారా లేదా టెస్టేటర్ యొక్క ఉచిత ఏజెన్సీని తీసివేయడం ద్వారా చేసిన విల్ చెల్లదు. 


*హోలోగ్రాఫ్ విల్స్* 


టెస్టేటర్ ఈ హోలోగ్రాఫ్ వీలునామాను పూర్తిగా దాని స్వంత చేతివ్రాతలో వ్రాస్తాడు. భారతదేశంలో విల్ సృష్టించడానికి, ఇండియా ఫిలింగ్స్‌తో సన్నిహితంగా ఉండండి .....✍️

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE