NaReN

NaReN

Thursday, July 7, 2022

ఆషాఢ మాసంపుట్టింటికి వెళ్ళిన భార్య తన భర్తకి పంపిన వాట్స్అప్ మెసేజ్

 ఆషాఢ మాసంపుట్టింటికి వెళ్ళిన భార్య తన భర్తకి పంపిన వాట్స్అప్ మెసేజ్




పనిమనిషికి జీతం ఇచ్చేశాను. 

నేను ఊరినుండి వచ్చిందాకా పనిమనిషి రాదు, వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది.😜

10 రోజులు వైఫై ఆపెయ్యమని ప్రొవిడర్ కి చెప్పేశాను. 

పెందలాడే పడుకోండి. 

మీ external HDD కేబుల్ కోసం వెతక్కండి. అది నాతో పాటు హాండ్ బాగ్లో ఉంది.😄


మీరు చాలా హెల్దీగా ఉన్నారు. మాటి మాటికి ఆ లేడి డాక్టర్ వద్ద చెకప్ కి వెళ్లవద్దు.😁


మీకోతి మూకని పోగు చేయకండి. సోఫాలో సిగిరేట్ పొడిని పోయిన సారి క్లీన్ చేసుకోటానికి రెండు రోజులు పట్టింది.

 పిజ్జా బిల్లులు చాలా దొరికాయి.😱


మీ మరదలు పుట్టినరోజు పోయిన నెలలోనే అయిపోయింది. 

మనిద్దరం వెళ్ళి వచ్చాం. 

అర్ధరాత్రి వెళ్ళి దానికి బిలేటెడ్ బర్త్ డే విషెస్ చెప్పాల్సిన పనిలేదు. 

మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడట. 

అది మీకోసమే అని నా నమ్మకం.😡


పక్కింటి వాళ్ళని పొద్దుటే లేపి 

పేపర్ వచ్చిందా, 

పాలు వచ్చాయా అని విసిగించకండి.😏


అల్మారాలో కుడి వైపు మీ చడ్డీలు ఉన్నాయి. 

ఎడంవైపు ఉన్నవి పిల్లాడివి. ఆఫీసునుండి ఏదో ఇబ్బందిగా ఉంది అని పోయినసారి హడావిడి పెట్టారు గుర్తుందా?😒


 మొబైల్ ఫోన్ బాత్రూమ్ సోప్ బాక్స్ లో పెట్టి ఇల్లంతా రెండు రోజులు వెతికారు పోయినసారి. 

కళ్ళజోడు ఫ్రీడ్జ్ లో ఉండి పోయింది.😍


మరి అంత ఎక్కువ స్మార్ట్ గా తయారవ్వకండి. 

మన వీధిలో ఉండే మిసెస్ స్వాతి, జ్యోతి, రాధిక ముగ్గురు ఊర్లో లేరు.😄

షరా మామూలుగా నేను ఎప్పుడయినా తిరిగి వచ్చే అవకాశం ఉండనే ఉంది.😜

మీ అంత్యక్రియల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?

 


మీ అంత్యక్రియల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?


కొన్ని గంటల్లో ఏడుపుల శబ్దం పూర్తిగా ఆగిపోతుంది.


కుటుంబ సభ్యులు, బంధువుల కోసం భోజనాలు తయారు చేయించి వడ్డీంచడంలో బిజీగా ఉంటారు 


మీ మనవళ్లు మనవరాండ్రు అటుఇటు పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు.


 యువతీయువకులు ఒకరినిఒకరు పలకరించుకొని వారి చదువుల గురించి చెప్పి ఫోన్ నంబర్లను మార్చుకునే పనిలో ఉంటారు 


వయసు మళ్ళిన కొందరు లోకాబిరామాయణం మాట్లాడుకుంటూ,  టీ తాగుతూ సమయం గడపుతారు


మీ అంత్యక్రియలు జరిపిన తరువాత మిగిలిన వ్యర్ధాలను మీ ఇంటి నుంచి దూరంగా విసిరి పరిసరాలను పాడుచేసి ఉంటారని భావించి మీ పొరుగువారు కోపంగా ఉంటారు.


అత్యవసర పరిస్థితి కారణంగా వ్యక్తిగతంగా రాలేకపోవడంపై మీ బంధువొకరు మీ కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడుతూంటారు 


మరుసటి రోజు, కొంతమంది బంధువులు వెళ్లిపోతారు మిగిలిన వారిలో ఒకరు కూరలో తగినంత ఉప్పు లేదని ఆనాటి విందులో ఫిర్యాదు చేసుండొచ్చు.


అంత్యక్రియల ఖర్చు భరించే మీవారిలో ఒకరు మీఅంత్యక్రియలకు అవసరానికి మించి ఎక్కువ ఖర్చు చేశారని  దెబ్బలాడవచ్చు.


జనం మెల్లగా ఒకరొకరు వెళ్లిపోవడం మొదలవుతుంది..


మీరు చనిపోయారని తెలియక కొంత కాలం మీ ఫోన్‌కి కొన్ని కాల్స్ రావచ్చు.


మీ ఆఫీస్ వాళ్ళు మీస్థానంలో వేరొకరిని నియమించుకొనే పనిలో ఉంటారు 


మీ మరణ వార్త విన్న ఒక వారం తరువాత, కొంతమంది ఫేస్‌బుక్ స్నేహితులు, విచారంతో మీచివరి పోస్ట్ ఏమిటో తెలుసుకోవడానికి ఆసక్తిగా వెతుకవచ్చు.


అత్యవసర సెలవు ముగిసిన రెండు వారాల్లో మీ కొడుకు / కుమార్తె తిరిగి ఆఫీస్/వ్యాపార పనులకు వెళ్ళిపోతారు.


మీ జీవిత భాగస్వామి నెలతిరిగే సరికల్లా, అన్ని మర్చిపోయి ఎదోఒక సీరియల్ చూస్తూ గడుపుతుండవచ్చు.


మీ బంధువులు సినిమాలుచూస్తూ, షికార్లు చేస్తూ సరదాగా కాలం గడుపుతూ ఉంటారు. 


ప్రతి ఒక్కరు సాధారణజీవితం గడుపుతుంటారు .


ఒక పెద్ద చెట్టు యొక్క వాడిపోయిన ఆకు రాలిపోయినట్టుగా, మీరు జీవించి, చనిపోయే దాని మధ్య కూడా పెద్ద తేడా లేనట్లు, అంతా మామూలుగా, చాలా వేగంగా, చాలా సాధారణంగా అన్ని జరిగిపోతుంటాయి..


వానలు మొదలవుతాయి, ఎలక్షన్స్ వస్తాయి, పోతాయి, బస్సులల్లో జనాలు ఎప్పటిలాగే గుంపులు, గుంపులుగా ప్రయాణిస్తుంటారు, ఏదోఒక నటి పెళ్లి జరుగుతుంది, పండగలు వస్తుంటాయి, అనుకున్న సమయానికి వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతోంది, చివరికి మీ పెంపుడు కుక్కపిల్ల కూడా పిల్లలను పెడుతుంది, రోజులు అలా గడిచిపోతుంటాయి.


మీ మరణం వల్ల ఏది ఆగదు, అన్ని సర్వ సాధారణంగా జరిగిపోతుంటాయి.


ఆశ్చర్యకరంగా..  

ఈ ప్రపంచంలోని అందరూ అతి త్వరగా నిన్ను పూర్తిగా మరచిపోతారు.


ఈలోగా మీ మొదటి సంవత్సరం వర్ధంతి వస్తుంది, మీ వాళ్ళు ఘనంగా జరుపుకుంటారు.


ఏదో ఒక రోజు, పాత ఫోటోలు చూస్తూ, మీ స్నేహితుడొకరు మిమ్మల్ని గుర్తుపట్టవచ్చు,

మీ ఊరిలో,  మీకు పరిచయమున్న వేలాది మందిలో, ఒక వ్యక్తి మాత్రమే మీ గురించి చాలా అరుదుగా ఎవరితోనైనా మాట్లాడి ఉండవచ్చు..


రెప్పపాటు కాలంలో ఏళ్లు గడిచిపోతాయి, మీ గురించి మాట్లాడేవారు ఉండరు.


ఒకవేళ పునర్జన్మ నిజమైతే మీరు వేరే చోట జీవించి ఉండవచ్చు.  లేకపోతే, ఏమీకాని మీరు మీకు తెలియని ఏదోలోకంలో, ఎక్కడో చీకటిలో  మగ్గిపోతుండోచ్చు 


ఇప్పుడు చెప్పండి..


ఈ ప్రజలు మిమ్మల్ని సులభంగా మరచిపోవాలని ఎదురు చూస్తున్నారు..


మరి మీరు దేని కోసం ఆరాటపడుతున్నారు?


మరియు మీరు ఎవరి గురించి ఆందోళన చెందుతున్నారు?


మీ జీవితంలో ఎక్కువ భాగం, సుమారు 80%, మీ బంధువులు మరియు ఇరుగుపొరుగు మీ గురించి ఏమనుకుంటున్నారో అని మీరు ఆలోచిస్తారు..


వారిని సంతృప్తి పరచడానికి మీరు జీవితాన్ని గడుపుతున్నారా? 

దాని వల్ల ఉపయోగం లేదు.

వాళ్ల కోసమే అని కాకుండా వారికి మీరెంటో అర్థం అయ్యేలా చేయండి.


జీవితం ఒకటే మిత్రమా, దానిని జీవించు......

నలుగురితో జీవించు.....

😊😊

Tuesday, July 5, 2022

నోరారా బంధాలను ఆప్యాయంగా తెలుగులో పిలుచుకుందాం

 నోరారా బంధాలను ఆప్యాయంగా తెలుగులో పిలుచుకుందాం---//-



*_" అమ్మ " అనే పిలుపులో  "_* *_ఆప్యాయత " ఉంది .._*


*_" నాన్న " అనే పిలుపులో  " నమ్మకం " ఉంది .._*


*_" తాత " అనే పిలుపులో " తన్మయత్వం " ఉంది .._* 


*_" అమ్మమ్మ " అనే పిలుపులు " అభిమానం " ఉంది .._* 


*_" నానమ్మ " అనే పిలుపులో " నవ్వు ముఖం " ఉంది .._*


*_" అత్త " అనే పిలుపులో " ఆదరణ " ఉంది .._*


*_" మామ " అనే పిలుపులో " మమకారం " ఉంది .._* 


*_" బాబాయ్ " అనే పిలుపులో " బంధుత్వం " ఉంది .._*


*_" చిన్నమ్మ " అనే పిలుపులో " చనువు" ఉంది .._*


*_" అన్నా " అనే పిలుపులో " అభయం " ఉంది .._*


*_" చెల్లి " అనే పిలుపులో " చేయూత "  ఉంది .._*


*_" తమ్ముడు " అనే పిలుపులో " తీయదనం " ఉంది .._*


*_" అక్క" అనే పిలుపులో " అనురాగం " ఉంది .._*


*_" బావా " అనే పిలుపులో " బాంధవ్యం " ఉంది .._*


*_" వదినా " అనే పిలుపులో " ఓర్పు " ఉంది .._* 


*_" మరదలు " అనే పిలుపులో " మర్యాద " ఉంది .._*


*_" మరిది " అనే పిలుపులో " మానవత్వం " ఉంది .._* 


*_" గురువు " అనే పిలుపులో " గౌరవం" ఉంది .._*



*_నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, తినే తిండి అన్నీ పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి ._*


*_కనీసం" పిలుపులో " నయినా  మన " అచ్చ తెలుగులో " పిలుచుకుందాం బంధాలను నిలబెట్టుకుందాం ...*


 


*నోరారా బంధాలను ఆప్యాయంగా తెలుగులో పిలుచుకుందాం*--🌹🌹🌹....

Monday, July 4, 2022

జీవితం ✨విలువలు

 💥జీవితం ✨విలువలు


జీవితం ఒక నదిలాంటిది. దాని ఈవలి ఒడ్డు పుట్టుక. పుట్టిన ప్రతి మనిషి  జీవనం సాగించాలి. తరువాత, ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. ఈ మరణమే ఆవలి ఒడ్డు. అలా ఆవలి వైపుకు చేరుకున్నవారందరూ ఏమయ్యారు.. ఎక్కడికి వెళ్లారు.. తిరిగి మళ్ళీ పుడతారా ఇటువంటి విషయాల మీద భిన్నాభిప్రాయాలున్నాయి.

సృష్టి.. సృష్టికర్త.. దేవుడు.. పరమాత్మ.. ఆత్మ.. ఆస్తికత్వం.. నాస్తికత్వం.. శాస్త్రీయావగాహన.. హేతుబద్ధత .. ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. వీటిని బట్టి మన ఆలోచన.. ఆలోచనా విధానం..విశ్వాసం.. నమ్మకం..వైఖరి ఏర్పడి చావు పుట్టుకలను అర్ధం చేసుకుని , వాటిని విశ్లేషించగల శక్తి వస్తుంది.

మృత్యువు అంటే మనకు ఎన్ని విభిన్నమైన అభిప్రాయాలున్నా జనన, మరణాల మధ్య మనం గడపవలసిన.. గడిపే జీవితం పట్ల చాలామంది ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. అరుదుగా లభ్యమైన ఈ జన్మను అర్ధవంతం చేసుకోవాలని తపిస్తారు. సకల ప్రాణరాశిలో ఆలోచనలో.. మేధలో.. తార్కికత లో..నిరంతరం ఎదగగలిగే ఏకైక జీవి మానవుడే.

ఇది గ్రహించాడు కనుకనే ఈ సృష్టి లో తన ఉనికికి ఒక సార్ధకత చేకూర్చాలని ఉవ్విళ్ళురుతాడు. ఇక్కడే అందరూ వర్గ వైరుధ్యాలను.. మత విశ్వాసాలను వీడి ఏకభావనులవుతారు. మనసా.. వాచా.. కర్మణా మంచి చేయటానికి ప్రయత్నిస్తారు. కరుణ, ప్రేమలను చూపుతారు. తాము చేసే పనులకు తమ మనస్సునే సాక్షిని చేసుకుంటారు. తోటివారికి శక్తి మేరకు సహాయం సహకారాలనందిస్తారు.

ఇదే  కేవలం నేను.. నా కుటుంబమే ..నా సంక్షేమమేనన్న సంకుచిత.. స్వార్ధ భావన, చింతనల నుండి మనిషిని వేరుచేసి.. అతణ్ణి ఉన్నతుడుగా.. విశ్వమానవుడిగా చేసి...మనీషి గా.. చేస్తుంది. ఇదే అర్ధవంతమైన జీవితమంటే. మనం కన్ను మూసే లోపు ఆ గొప్ప స్థితి కి చేరాలని.. కనీసం ప్రయత్నం చేయాలన్న సంకల్పం వుండాలి. దాన్ని మరింత బలోపేతం చేసే ధతిని జత చేయాలి. ‘ ఒక అర్ధరహితమైన జీవితాన్ని కన్నా ఒక అర్ధవంతమైన చావును కోరుకుంటాను. ‘ ఒక గొప్ప తాత్వికుడి మాటలు ఎంత అక్షర సత్యాలు!

శరీరంలోని కణం, కణజాలంలోని ప్రాణాధారమైన శక్తి సమూలంగా, సంపూర్ణంగా నశించినపుడే మనిషి చనిపోవడం జరుగుతుంది. ఈ చావును ఒకొక్కరు ఒకొక్క రకంగా భావన చేస్తారు. చూసే వ్యక్తి దృష్టి.. దృక్పధం... అవగాహనా శక్తిని బట్టి అర్ధం గోచరిస్తూ ఉంటుంది. వేదాంతులు చావును ఈ శరీరమనే కారాగారంలోబందీ గా వున్న ఆత్మ స్వేచ్ఛను పొందే ఒక అద్భుత వరంగా చెపుతారు. ఆధ్యాత్మిక పరులు జీవాత్మ, పరమాత్మల కలయికగా అభివర్ణిస్తారు.

శాస్త్రవేత్తలు.. భౌతిక శాస్తవేత్తలు .. నాస్తికులు ఒక సహజపరిణామంగా చూస్తారు. ప్రతి ఒక్కరి పుట్టుక చావుతో అంతం కావాలి. ఇది తప్పనిది. తప్పించుకోలేనిది. చదువుకున్న వాడైనా.. చదువుకోనివాడైనా... ధనవంతుడైనా.. పేదవాడైనా.. జ్ఞానైనా, అజ్ఞానైనా మృత్యువాత పడక తప్పదు. జీవితాన్ని ఎవరెలా ఆస్వాదించారు.. ఉన్నంతలో ఎంత తృప్తిగా జీవించారు.. ఎంత చక్కగా భాషించారు.. పవిత్రమైన మనస్సుతో ఆలోచనలు చేసారు అన్న ఈ వివరాలు ఏ ఒక్కరి జీవితంలో ఉంటాయో ఈ జీవితం గొప్పది. వారే గొప్పవారు.

   కొందరికి చావంటే భయం. ఇది వారికి సహజాతం. ఇది వారిని జీవించనీయదు. దానికి వారిని సమాయత్తం చేయదు. ఈ భయంతో  వారు జీవితాన్ని హాయిగా.. ఆహ్లాదంగా.. ఆనందంగా గడపనేలేరు. ఇది ఆధార రహితమే కాదు అర్ధరహితం  కూడ. ఎందుకని..? వారికి ప్రపంచంలోవారొక్కరే చనిపోతున్నారేమో నన్న ఆలోచన. కాని ప్రతి ఒక్కరూ  మరణిస్తున్నారు కదా! ఇది వారి మనసుకు.. బుద్ధికి తట్టదు. ఒకవేళ  తట్టినా  చావకుండా ఉంటే బావుండునన్న కోరిక. ఎంత అసంబద్ధ మైనది..! ఎంత అసాధ్యమైనది..!

ఎంత మంది మృత్యువు నుండి తప్పించుకునే ప్రయత్నం రకరకాలుగా చేసి... తార్కిక శక్తిని వినియోగించక అసాధ్యమైన కోరికలడిగి ఎలా భంగపడ్డారోచెప్పే ఉదాహరణలు పురాణాలలో ఎన్నో వున్నాయి. ఎవ్వరినీ వదలని మత్యువు తనను విడిచిపెట్టదని, తను చావక తప్పదన్న నిజాన్ని బోధపరచుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాలి. జీవితాన్ని చక్కగా గడపాలి. ఈ సహజ భయానికి తోడు .. మహమ్మారి అంటువ్యాధులు.. విపత్తులు సంభవించిన వేళలో మానసిక స్థైర్యాన్ని కోల్పోయి, భయ విహ్వలురై చనిపోయేవారుంటారు. ఇది కూడా కూడదు.

    చావనేది కష్టం కాదు. నష్టమూ కాదు. మనం బతికున్నప్పుడే మనలో ఆలోచనలో చనిపోయేవి.. అంటే మాయమయ్యేవి.. కొన్ని ఉంటాయి. వాటివల్ల మనం ఎన్నో కోల్పోతాం. ఎంతో నష్టపోతాం. ఏమిటవి..? కరుణ.. ప్రేమ.. పరోపకారం.. సహకారం..! వీటివల్ల మానవత్వానికి దూరమవుతాం. నిజానికి దీనికి మనం భయపడాలి.

    జీవితాన్ని గడపటం వేరు. జీవించటం వేరు. మొదటిది యాంత్రికం. రసవిహీనం. ఇది ఒక రకమైన మృత్యువే. ఇక రెండవది జీవించటమంటే ఉన్నంతలో తృప్తిగా, చెడు ఆలోచన మొగ్గలోనే చిదిమేస్తూ చేయగలిగిన సాయం నలుగురికి చేస్తూ, కష్టాలనుండి పాఠాలు నేర్చుకుంటూ, ఆనందంగా ఉండటం. మనిషి ఎలా మరణించాడన్నది ముఖ్యం కాదు. ఎలా జీవించాడన్నది చాలా ముఖ్యం. దీనికి ధనానికి సంబంధమేమి లేదు.

జీవిత వైఖరి.. విలువలు.. మానసిక స్థితి.. ధైర్య, స్థైర్యాలు.. వీటివల్లే మనిషి జీవితం గొప్పదా.. కాదా అన్నది నిర్ణయ మవుతుంది.

   జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని కొందరు.. ఆత్మ ఈ శరీరమనే చెరసాల నుండి స్వేచ్ఛ పొందుతుందని ఇంకొందరు, ఇవేమీ కావని చావు ఒక ఒక సహజ సంఘటనని మరికొందరనచ్చు. ఈ భావనలో భేదాలున్నా జీవితాన్ని ఆదర్శంగా, మంచిగా, విలువైనదిగా చేసుకోవాలన్న విషయంలో అందరిదీ ఒకే అభిప్రాయం. ‘పిరికివాళ్ళు తమ మరణానికి ముందే చాలాసార్లు చనిపోతారు. కాని స్థైర్యవంతుడు ఒక్కసారే మృత్యువును రుచి చూస్తాడు. అన్న షేక్సి్పయర్‌ మాటలు మనస్సులో పెట్టుకుంటే మృత్యువుకు భయపడకుండా జీవితాన్ని ఎలా జీవించాలో వస్తుంది.

   మనం పొందిన ఈ జీవితం అపురూపం. మళ్లీ లభిస్తుందో లేదో తెలియదు. ఇది మరల తిరిగి రాదని కొందరు భావిస్తారు. అందుకే ఈ జీవితాన్ని మంచితనంతో, మంచిపనులతో సుగంధ భరితం చేసుకోవాలి. ఇక్కడ.. సరిగా ఇక్కడే మనిషి తన తెలివితేటలను.. యోచనను..వివేచన విచక్షణలను ఉపయోగించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తను బుద్ధిశాలని నిరూపించుకోవాలి.



.

Sunday, July 3, 2022

కూరగాయల మనోభావాలు..

 కూరగాయల మనోభావాలు..


*గోంగూరకి* ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని...

*తోటకూరకి* వయ్యారం ఏక్కువ ..

ఏందుకంటే నవనవ లాడతానని ...

*పొట్లకాయకి* పొగరు ఎక్కువ.. 

ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని....

*చిక్కుడుకు* చికాకు ఎక్కువ.. 

ఎందుకంటే తనని గోరుతో గోకుతారని....

*కందకి*..వెటకారం ఎక్కువ..

ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని....

*చేమకు* చిమచిమలు ఏక్కువ ...

ఏందుకంటే కూర -  పులుసు - fri గా ఉపయోగ పడతానని ...

*పేండలానికి* పేంకితనo ఏక్కువ ....

కత్తిపీటతో తరూగూతారని ...

*మునగకాయకి* మురిపం ఏక్కువ ...

మగవారికి దివ్య ఔషధం అని ...

*వంకాయకి* గర్వమెక్కువ ..

కూరగాయలన్నింటికీ తనే రారాజునని....

*అరటికాయకి* అభిమానం ఏక్కువ ...

శాఖాకూర అయిన తనను మాంసంతో పోల్చి లంకమాంసం అంటారని ..

*బెండకాయకి* ఆనందమెక్కువ..

తనను మగువల చేతివేళ్ళతో పోలుస్తారని....

*దొండకాయకి* ఆందోళనెక్కువ.. 

కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటదోనని....

*కాకరకాయకి* శాంతమెక్కువ.. 

ఎవరూ ఇష్టపడకపోయినా అందరికీ ఆరోగ్యానిస్తుందిగా....

*బంగాళాదుంపకి* సహనమెక్కువ..

కూరలకైనా,చిరుతిండ్లకైనా, పూరీకైనా,పానీపూరీకైనా అన్నీంటికీ తానే దిక్కు మరి....

*గుమ్మడికాయకి* గాంభీర్యమెక్కువ.. కూరగాయలన్నీంటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా....

*ఆనపకాయకి* ఆనందం ఏక్కువ ...

యేలాగయినా అన్నిరకాలుగా తనని తింటారని ...

*ఉల్లిపాయకి* టెక్కు ఎక్కున..

తానులేనిదే  ఆ కూరగాయలకి రుచి ఎక్కడిదని....

*మిర్చికి* కోపమెక్కువ..

ముందు నోటినీ,తరువాత కడుపుని మండించేస్తుంది....

*కరివేపాకుకి* మిడిసిపాటు ఎక్కువ..

తాను కొంచెమైనా కూర సువాసనకి తానే దిక్కుఅని....

*బీరకాయకి* దిగులెక్కువ..

తనను ఎడాపెడా వాడేస్తారని,పీచుని కూడా వదలరని....

*కారెట్ కి బీట్ రూట్ కి* హంగామా ఎక్కువ..

తమంతటి రంగు ఎవరికీ లేదని....!!

ఆఖరిగా *పనస పోట్టుకి* పరువం ఏక్కువ (గ్లామరు హీరోయిను typu)...

ఏలాంటి వాళ్ళనైనా సంత్రుప్తి పరుస్తానని ....


😊😊😁😁😆😆😜😜

Saturday, July 2, 2022

సహాయం

 

సహాయం



సమయం : 🕡

ఉదయం 6గంటల 30 నిమిషాలు..


నిరక్షరాస్యులైన తల్లి,👩

తన కూతురిని వెంటబెట్టుకొని...👧

చెన్నై లోని అన్నా యూనివర్సిటికి వచ్చింది..🏬


8: 30 లకు వాళ్ళ అమ్మాయికి..🕣

B.SC అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించి..

కౌన్సెలింగ్ ఉంది...🤹

వాస్తవానికి  వాళ్లు...

అక్కడికి దగ్గర్లోని గ్రామం నుండి...

కౌన్సెలింగ్ కు ఎడ్ల బండి మీద వచ్చారు...👩‍👧

అంతటి పేదరికం వాళ్లది...😢


కానీ కౌన్సెలింగ్ జరిగేది..🤹

అన్నా యూనివర్సిటిలో కాదు..🙅

తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ..

కొయంబత్తూర్ లో....💁


తెలిసిన వాళ్ళు మిస్ గైడ్ చేయడం వల్ల...🎈

వాళ్ళు ఇక్కడికి వచ్చారు...👩‍👧

ఎం చేయాలో తోచట్లేదు…😢

ఎవరిని అడగాలో కూడా..

అర్థం కాని పరిస్థితి వారిది...🙅


ఇంతలో అటుగా వాకర్లు వాళ్లను చూసి,🚶🏃

అసలు విషయం ఏంటి అని ఆరా తీశారు…????

విషయం తెలుసుకున్న వాకర్లు…🚶🏃

అగ్రికల్చర్ యూనివర్సిటి...

కొయంబత్తూర్ లో ఉంది,🏬

మీరున్నది చెన్నైలో.. 

చెన్నై కు కొయంబత్తూర్ కు దాదాపు..

500 కిలో మీటర్ల దూరం...🤷


అందులో ఇప్పుడు టైమ్ 7 అవుతుంది ,🕖

మీ కౌన్సెలింగ్ ఏమో.. 8: 30 అంటున్నారు…🕣

కానీ జర్నీ చేయాలంటే...

మినిమమ్ 7 హవర్స్ పడుతోంది…🤚✌️

అని చెప్పారు..


ఇక్కడే  కీలక  మలుపు :👌


ఒక్కసారి అమ్మాయి చదువు విషయాన్ని..📕📔📒

ఆరా తీశారు అక్కడి వాకర్స్..

ఇంటర్మీడియట్ లో 1200 లకు గాను..☺️

1017 మార్కులు సాధించింది ఆ అమ్మాయి, 🤗

అది కూడా ఫుల్ పీవర్ లో ఎగ్జామ్ రాసి, 

మారుమూల ఊరు నుండి..🌲🌳


దీంతో చలించిపోయిన వాకర్స్...🚶🏃

తమ ఫోన్లకు పని చెప్పారు…📲

ఒకాయన… 

అమ్మకు, అమ్మాయికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు,✈️

ఇంకోకాయనకు తమిళనాడు..

అగ్రికల్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్...✍️

బాగా పరిచయం ఉన్న వ్యక్తి కావడం వల్ల..

రిజిస్ట్రార్ కు ఫోన్ చేసి..📱

ఈ అమ్మాయి గురించి చెప్పాడు...

కౌన్సెలింగ్ కు కాస్త లేటు గా వస్తుందని….🗣️


ఆ అమ్మా, అమ్మాయి వద్దకు కార్ వచ్చింది..🚕

చెన్నై ఏయిర్ పోర్ట్ లో దించింది…🛫

చెన్నై నుండి కొయంబత్తూర్ కు వెళ్లే ఫ్లైట్ లో..

వాళ్లు 10.05 కు ఎక్కారు...✈️

11.40 కి అక్కడ దిగారు...

దిగగానే అక్కడికి ఇంకో కార్ వచ్చింది…🚗


అటు నుండి తమిళనాడు...

అగ్రికల్చర్ యూనివర్సిటీలో దించారు వారిద్దరిని..👩‍👦

ఆ అమ్మా, ఆ అమ్మాయి ఇద్దరూ..

అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేరే సరికి...🦵

12.15 అయ్యింది .. 

2 వరకు కౌన్సెలింగ్ అయిపోయింది..🕑

ఆ అమ్మాయికి...

BSC (BIO -TECH ) లో సీట్ వచ్చేసింది...🗞️📜📃


ఇది అద్భుతం అంటే . …. 🤹

ఫ్లైట్ టికెట్స్ ఇప్పించిన వ్యక్తి,🤵

కార్లను ఎరేంజ్ చేసిన వ్యక్తి, 👮‍♂️

రిజిస్ట్రార్ తో మాట్లాడిన వ్యక్తి,👨‍🦰

ఇంకొకరు ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తులు...👬

ఇలా ప్రతి ఒక్కరు……

ఆమెకు జీవితంతం గుర్తుంటారు...🤔


డియర్ ఫ్రెండ్స్...🤝

నువ్వు చేసే సహాయం చిన్నదే కావచ్చు...🤲

కానీ అది పొందేవారికి ఒక జీవితం...✊


అందుకే...ఇతరులకు...

సహాయం చెయ్యడం అనేది...🙌

ఎప్పటికి మర్చిపోవద్దు...🙅

😭😭👏👏👏💐💐💐

🙏🙏🙏🙏🙏

పసుపులేటి నరేంద్రస్వామి

9848696955

Friday, July 1, 2022

కంపెనీల ఫ్రాడ్ బ్యాంకులకు టోకరా మధ్య తరగతి వాళ్లు బకరా

 కంపెనీల ఫ్రాడ్ బ్యాంకులకు టోకరా  మధ్య తరగతి వాళ్లు బకరా


ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో 

ఎకరం 10 లక్షల చెప్పున 

ఓ ఇరవై ఎకరాలు కొనుగోలు చేస్తారు....

అగ్రికల్చర్ ల్యాండ్ ను కన్వెర్షన్ ఫీజు కట్టి గజాల్లోకి

మారుస్తారు ... 

అక్కడ  మార్కెట్ విలువ గజం 200/- రూపాయలు 

ప్రభుత్వ విలువ గజం 100/- రూపాయలు ఉంటుంది... 

వారి చుట్టాలకు అందులో గజం 6000/- చెప్పున ఓ 500 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు...

అలా రెండు మూడు ట్రాన్సాక్షన్ లు 

వాళ్ళలో వాళ్ళే చేసుకుంటారు....

ఆ సర్వే నెంబర్ అంతా గజం 6000/- మారిపోతుంది..

మేము పెద్ద ఇండస్ట్రీ కడుతున్నాము... బ్యాంకు లోను కావాలి...షూరిటీ గా 60,000/- గజాలు పెడతాము... 

అక్కడ గజం 6000/- ఉంది అని బ్యాంకు కు చెబుతారు ...

బ్యాంకు వాడికి 

సబ్ రిజిస్ట్రార్ రికార్డ్ ప్రకారం అక్కడ గజం 6000/- కనపడుతుంది..

మార్కెట్ వాల్యూ మాత్రం 200/-

ఆ విషయం బ్యాంకు వాడికి కూడా తెలుసు..పై నుంచి ఫోన్ లు , ఆమ్యామ్యాలు..కాదనలేరు 

కొన్ని వేల కోట్ల రూపాయలు లోన్ 

వచ్చేస్తుంది..

తరువాత ఇండస్ట్రీ పెడతారు....

100 రూపాయలు కు అయ్యేదాన్ని 

10,000/- ఖర్చు అయినట్లు లెక్క చూపెడతారు....ఆన్ ఫీల్డ్ మీద 100 రూపాయలు ఉంటే ఇంటికి 9900/- చేరిపోతుంది.. తరువాత లాస్ చూపెడతారు .. కంపెనీ మూసేస్తారు..బ్యాంకు వాడు ఆక్షన్ వేస్తాడు ...100/- కు 10/- రూపాయలు ముడుతుంది...

ఆ నష్టాలు మన మీద రుద్దడానికి మినిమమ్ డిపాజిట్ లేకపోతే ఫైన్ ...పక్క ఎటిఎమ్ లో డ్రా చేస్తే ఫైన్, ఇన్ని ట్రాన్సాక్షన్ లు దాటితే ఫైన్, అంటూ 

మధ్య తరగతి పేద ప్రజల పొట్ట కొడతారు...)

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE