NaReN

NaReN

Saturday, November 15, 2025

వైద్యో నారాయణ చంద్ర

 *_"వైద్యో నారాయణ చంద్ర"_*

🙏🙏🙏🙏🙏🙏🙏


*ఒకరోజు ఒక డాక్టర్.. హాస్పిటల్ డ్యూటీ నుంచి పొద్దుపోయాక ఇంటికి చేరాడు.  అర్థరాత్రి సమయంలో పడకమీదికి చేరాడు. అలా పడుకుని పది నిమిషాలు కూడా కాలేదు, ఒక యువకుడు వచ్చి తలుపుతట్టాడు.*


*_"సార్, ఒక గర్భిణి ప్రసవవేదనపడుతోంది,దయచేసి రండి, ఆమెను మీరే కాపాడాలి."_ అన్నాడు. డాక్టరు వెంటనే రెడీ అయ్యి హాస్పిటల్ కి వెళ్ళాడు.* 


*70 ఏళ్ళక్రిందటి రోజుల్లో మహారాష్ట్రలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన  యువతి. ఆమెకి 19 లేదా 20 ఏళ్ళుంటాయంతే..! ప్రసవం చాలా కష్టమయ్యింది.*


*ఆ రాత్రి కొన్ని గంటలపాటు ఆయన వైద్యంచేశాడు.  తెలవారుతుండగా, ఆమె డాక్టరు చేతులు పట్టుకొని దీనంగా ఇలా అనింది..* 


*_"డాక్టరు సారూ నన్ను బ్రతికించవద్దయ్యా!  నన్ను చంపేయండి. ఎందుకంటే, నేను కటిక పేదరాలిని, నా భర్త నన్ను వదిలేశారు, నాకే దిక్కులేదు. ఇప్పుడు పుట్టబోయే బిడ్డను సాకలేను."_ అంది ఏడుస్తూ...* 


*ఆమె దీనస్థితికి ఆయన కదిలిపోయాడు.*


*_"అమ్మా, మేమున్నది బ్రతికించడానికే గానీ, చంపటానికి కాదు, నువ్వేం భయపడకు"_ అని ధైర్యం చెప్పాడు.* 


*ఎలాగో ప్రసవం జరిగింది, ఆడపిల్ల పుట్టింది. ఆనందించాలో, బాధపడాలో ఆ యువతికి అర్థం కాలేదు.*


*అప్పుడు ఆయన.. _"అమ్మా! నువ్వేం భయపడవద్దు. నేను నీదగ్గర ఫీజు ఏమీ తీసుకోను, నేనే నీకు వంద రూపాయలిస్తున్నాను. దగ్గర్లో  ఉన్న పూణేకి వెళ్ళి అక్కడ nursing college లో ఒక గుమాస్తాను కలువు. నేను పంపానని చెప్పు."_ అన్నాడు.*


*ఆమె అక్కడికి వెళ్ళింది. ఫలనా డాక్టరు గారు పంపారు అని చెప్పగానే, వాళ్ళు ఆమెను అక్కడ చేర్చుకుని training ఇప్పించి, 8 నెలల తరువాత ఉద్యోగం కూడా ఇచ్చారు.*


*25 ఏళ్ళు గడచిపోయాయి. ఆ డాక్టరు senior professor అయ్యాడు. ఒక university వాళ్ళు విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేసే కార్యక్రమానికి ఆ డాక్టరు గారిని ఆహ్వానించారు. అది పూర్తి అయ్యింది.*


*'చంద్రా' అనే ఒక యువతి వచ్చి డాక్టరును కలిసి తన ఇంటికి రావాల్సిందేనని పట్టుబట్టింది. స్వతహాగా సున్నితమైన మనసున్న ఆయన కాదనలేక వాళ్ళింటికి వెళ్ళాడు.* 


*అక్కడ నడివయసులో ఉన్న ఒకామె.. డాక్టరు గారికి 'టీ' ఇచ్చింది... ఆయన టీ తాగుతూ వారి గురించి అడిగాడు.. ఆమె, తమది ఒక పల్లెటూరు అని.. తమ కుటుంబానికి సంబంధిన వివరాలు చెపుతుండగా, ఆయన ఆలోచనలు వెనక్కి  వెళ్ళాయి.* 


*ఇంతలో హఠాత్తుగా ఆమె, మరియు ఆ యువతి వంగి ఆ డాక్టరు కాళ్ళకు నమస్కారం చేశారు. _"ఏమిటమ్మా ఇది ?"_ అని ఆయన అడిగితే...* 


 *ఆమె కన్నీళ్ళు కారుతుండగా.. ఆయనతో ఇలా చెప్పింది, _"25 ఏళ్ళక్రితం ఓ అర్థరాత్రి మీరే నన్ను  కాపాడారు సార్, దిక్కు లేని నా పేదజీవితానికి ఒక దారి చూపారు. ఆ అర్థరాత్రి పుట్టిన ఆడపిల్లే ఈ అమ్మాయి, మీరే మాకు దేవుడు. మీ పేరునే ఈ పాపకు పెట్టాను 'చంద్ర'  అని చెప్పి, అంతేకాదు సార్.. మీదయవల్ల ఇప్పుడు మేము ఆర్థికంగా స్థిరపడ్డాము. త్వరలో  మేము పేదలకోసమని ఓ ఉచిత ఆసుపత్రిని ప్రారంభించబోతున్నాం.  దానికి కూడా మీ పేరునే పెడుతున్నాం."_ అని చెప్పింది, అది విన్నాక, ఈ సారి కన్నీరు పెట్టడం ఆ డాక్టరు వంతు అయ్యింది.*



*ఇంతకూ ఆ డాక్టరు ఎవరో తెలుసా...? Infosys అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఛైర్మెన్ శ్రీమతి సుధామూర్తి గారి తండ్రి అయిన _"డాక్టర్. రామచంద్ర కులకర్ణి"_ గారే...!!!*


*(ఈ సుధామూర్తి.. Infosys అనే సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుడైన.. ఎన్. ఆర్. నారాయణమూర్తి గారి సతీమణి. వీరి పెద్ద కుమార్తె.. 'అక్షతామూర్తి.' ఈమె ఎవరోకాదు, 2022 నుంచి 2024 వరకు బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేసిన రిషిసునాక్ భార్య.)*

==================

*_{మంచి స్ఫూర్తిదాయకమైన వాస్తవగాథ.. నన్ను చాలా కదిలించింది. ఎంతెంత చదువులు చదివామన్నది కాదు, ఎంత సంస్కారవంతంగా, సాటి మనుషుల పట్ల.. సమాజం పట్ల మానవతా దృక్పథంతో  ఉంటూ మనవంతుగా ఎంతో కొంతైనా సేవాతత్పరత చూపించాలి.: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*

మానవత్వం చూపిన ఆటో డ్రైవర్

 👉👉విజయవాడలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు మరణించడంతో  నెల్లూరు జిల్లాకు చెందిన 19 సంవత్సరాల యువతి మానసిక వేదనతో బాధపడుతున్న ఆ యువతి, ఒంటరిగా నెల్లూరు  నుంచి బస్సులో  ప్రయాణించి విజయవాడ  బస్టాండ్‌కు వచ్చింది 


👉 దారి మధ్యలో ఆమె ఫోన్, పర్సు పోగొట్టుకోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఆకలితో, ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఎవరూ లేని బాధతో ఆమె సమీపంలో ఉన్న ఆటో డ్రైవర్ల వద్దకు వెళ్లి సహాయం కోరింది.


👉నాకు ఎవరు లేరు… కొంచెం టిఫిన్ పెట్టండి… పని చేసుకుంటూ నేనే హాస్టల్‌లో ఉంటాను… దయచేసి నన్ను అక్కడికి చేర్చండి" అని ఆ యువతి కన్నీళ్లు పెట్టుకుంది.


👉యువతి పరిస్థితి చూసి ఆటో డ్రైవర్లు ముందుగా ఆమెకు టిఫిన్ ఏర్పాటు చేశారు. తరువాత విషయాన్ని అర్థం చేసుకున్న వారు తెలివిగా ఆలోచించి ఆ యువతిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.


👉అక్కడ పోలీసులు ఆమె మాటలు విన్న వెంటనే విషయం సీఐ  గారికి పోలీస్ సిబ్బంది తెలియజేశారు. సీఐ  గారు తక్షణమే స్పందించి వాసవ్య మహిళా మండలికి ఫోన్ చేసి, ఆ యువతి పూర్తిగా సురక్షితంగా ఉండేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.


👉ఆమె బంధువులు వచ్చే వరకు ఆమెను వాసవ్య సంరక్షణలో ఉంచి, అన్ని విధాలుగా సహాయం అందించాలని పోలీసుల సూచన మేరకు చర్యలు వేగంగా తీసుకున్నారు.


👉కాలుష్యంతో నిండిన ఈ కాలంలో ఇలాంటి మానవత్వం చూపిన ఆటో డ్రైవర్లపై, అలాగే వెంటనే స్పందించి రక్షణ కల్పించిన కృష్ణలంక పోలీసులపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



మానవత్వం చూపిన ఆటో డ్రైవర్ అందరమూ మేచుకోక తప్పదు 


Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE