తణుకులో పద్మశ్రీ ధియేటర్ కి ఎదురుగా ఉన్న ఓ చిన్న మిక్సీ రిపేరింగ్ షాపు ఇది..
బాగా పట్టి పట్టి చూస్తే కానీ ఇక్కడ ఓ షాపు ఉన్నట్టు కూడా కనపడదు..
ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నరేమో కదా,
అక్కడికే వస్తున్నా..!!
నిన్న మంగళవారం మా ఇంట్లో చట్నీ చేస్తుండగా సడన్ గా మిక్సీ ఆగిపోయింది..
సరే వెంటనే బాగు చేయిద్దాం కదా అని ఊరంతా తిరిగా...
మార్కెట్ సెలవు అన్ని షాపులు మూసేసిఉన్నాయి.
ఎవరో ఒకతను మన పద్మశ్రీ సందులో ఒకాయన రిపేరింగ్ చేస్తాడు అని చెప్పడంతో ఈ షాపు దగ్గరకి వెళ్ళా..
షాపులో ఒక ముసలాయన కూర్చుని ఉన్నారు..
ఆయనకు మిక్సీ చూపించి పనిచేయడం ఆగిపోయింది అని చెప్పగానే వెంటనే విప్పి చూసి ఏం పోయిందో అని చెక్ చేసాడు. ఎలాగైతే వెంటనే కంప్లైంట్ ని పట్టుకుని అందులో ఎదో చిన్న పార్ట్ పోతే అది వేసి, షోల్డరింగ్ చేసి లోపల శుభ్రంగా క్లీన్ చేసి ఎలా పని చేస్తుందో చెక్ చేసి బిగించేసి నాకు ఇచ్చారు..
ఇదంతా అయ్యే సరికి ఓ 15 నిముషాలు పట్టింది..
సరే ఎంతండీ అని అడిగా..
ఆయన 10 రూపాయలు ఇవ్వండి అన్నాడు..
అదేంటండి లోపల ఎదో పార్ట్ కూడా వేశారు అంత తక్కువేంటని అడిగా..
దానికి ఆయన అది తక్కువ రేటే 10/- సరిపోతుంది అన్నారు.
అయినా నేను 50/- ఇచ్చా ..
ఆయన తీసుకోలేదు.....
నా మిక్సి రిపేరింగ్ అయిపోయిన తరువాత ఇంకో పెద్దావిడ కారులో వచ్చి ఆయనకీ మిక్సీ ఇచ్చి పనిచేయడం లేదు అని అన్నారు , ఆయన ఆ మిక్సీ కూడా ఓపెన్ చేసి
శుభ్రంగా ఆయిల్ వేసి క్లీన్ చేసి ఇచ్చారు ఆవిడ బాబాయ్ గారు ఎంత అండీ
అని అడిగితే ఆయన అయిదు రూపాయలు ఇమ్మన్నారు ,
ఆ మాట విని అదేంటండీ అంటే అప్పుడు ఆయన నేను శుభ్రపరిచాను అంతే కదమ్మ 5రూపాయలు చాలు అని అన్నారు ,
ఇంకా ఇంత నిజాయితీగా పనిచేసే మనుషులు ఉన్నారు కాబట్టే
టైంకి వర్షాలు పడుతున్నాయి అనుకుని ఆయనకి దణ్ణం పెట్టాను..!!
ఇలాంటి మంచి మనస్సు మన వుంది అని ఈ పోస్ట్ పెడుతున్నాను...
No comments:
Post a Comment