స్కూల్ టీచర్ కష్టాలు
ఒక స్కూల్లో టీచర్ దగ్గరికి ఇద్దరు ఆడపిల్లలు కవల పిల్లలు చిన్న పాపలు వచ్చేవాళ్ళు వాళ్లని రోజు దిగబెట్టడానికి వాళ్ళ పని అబ్బాయి కూడా వచ్చేవాడు.
టీచర్ ఒకరోజు ఒక పాపని మీ పేరేమిటి అడిగింది ఆ పాప అప్పన్న అన్నది రెండవ పాపని నీ పేరేమిటి అడిగింది ఆ పాప కూడా అప్పన్న అన్నది పని అబ్బాయిని మీ పేరేమిటి అడిగింది అతడు కూడా అప్పన్న అన్నాడు టీచర్ కి కోపం వచ్చింది ఇదేమిటి వేళాకోళంగా ఉందా అన్నది మరుసటి రోజు పిల్లల్ని దిగబెట్టడానికి వాళ్ళ అమ్మ వచ్చింది టీచర్ వెళ్లి జరిగిన విషయం చెప్పింది.
అప్పుడు ఆ పిల్లల తల్లి నవ్వుతూ ఇలా చెప్పింది పాపల పేర్లు అపర్ణ అర్పణ నోరు తిరగక చిన్నవాళ్ళు కాబట్టి అప్పన్న అని చెప్తారు మా పని అబ్బాయి పేరు నిజంగా అప్పన్న అని చెప్పింది టీచర్ కూడా నవ్వేసింది.
మీరు టీచర్ అయితే ఇలాంటి కష్టాలు నవ్వులు మాకు షేర్ చేయండి.
Whatsaap ద్వారా 9848696955 నెంబర్ కు పంపండి.