NaReN

NaReN

Tuesday, October 31, 2023

Self Confidence

 *💁🏻‍♂️ Self Confidence:*


*💁‍♀️ అద్భుత అస్త్రం.. ఆత్మవిశ్వాసం!*

➢➢➢➢➢➢➢➢➢➢➢➢

*ఉద్యోగం సంపాదించడంలో చెందుతున్న ఎక్కువమంది అభ్యర్థుల్లో ఉండే లోపాలూ, వాటిని అధిగమించే మెలకువలు ఇవీ...*


   *ఉద్యోగ నియామకాలకు నిర్వహించే రాత పరీక్షతో అకడమిక్‌ పరిజ్ఞానాన్ని తెలుసుకుంటారు కాబట్టి.. బృందచర్చ, ఇంటర్వ్యూల్లో దానికి ప్రాధాన్యం తక్కువే. వీటిలో అభ్యర్థుల తీరు, వారు విభిన్న    పరిస్థితులకు ఎలా స్పందిస్తున్నారో పరిశీలిస్తారు. అందులో మెరుగైన ప్రదర్శన చేసినవారికే అవకాశాలు లభిస్తాయి. కొలువు కొట్టటంలో వైఫల్యం చెందుతోన్న ఎక్కువమంది అభ్యర్థుల్లో ఉమ్మడిగా ఉండే లోపాలూ, వాటిని అధిగమించే మెలకువలూ తెలుసుకుందామా?*


  *సుమతి తెలివైన విద్యార్థిని. పది నుంచి పీజీ దాకా డిస్టింక్షన్‌. సుగుణకు పీజీ వరకు ప్రథమ శ్రేణి మార్కులున్నాయి. వీళ్లిద్దరూ చిన్నప్పటి నుంచీ కలిసే చదువుకున్నారు. కార్పొరేట్‌ సంస్థ నియామక పరీక్షను ఇద్దరూ రాసి, అర్హత పొందారు. ఎంపికలో తర్వాత దశ.. బృంద చర్చ, ముఖాముఖిలోనూ పాల్గొన్నారు. ఫలితాల జాబితాలో అనూహ్యంగా సుమతి పేరు లేకుండా సుగుణ పేరుంది. ఏం జరిగి ఉంటుంది?*


   *సుమతి లాంటి ఉద్యోగార్థుల్లో.. అకడమిక్‌ పరిజ్ఞానం, అవసరమైన స్కిల్స్‌ రెండూ బాగా ఉంటాయి. కానీ గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలకు వచ్చేసరికి తడబడుతుంటారు. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో విఫలమవడానికి ప్రధాన కారణాల్లో ముఖ్యమైంది.. వారిలో ఆత్మవిశ్వాసం లోపించడమే.*


   *ఏం మాట్లాడితే ఏమవుతుందోననే జంకు, భయం కొందరిదైతే, ఇంటర్వ్యూ అంటేనే ఒత్తిడికి గురై బెదిరిపోయేవాళ్లు ఇంకొందరు. సరైన సమాధానం తెలిసినప్పటికీ అది అవునో, కాదో అనే సందేహం, చొరవ తీసుకోవడంలో మీమాంస, ఆందోళన... తదితర కారణాలతో వీరంతా ఆఖరి అంకంలో వెనుదిరగాల్సివస్తోంది. ఉద్యోగానికి కావాల్సిన అన్ని యోగ్యతలూ ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం లోపించడంతో విఫలమవుతున్నారు. ఇంటర్వ్యూ చేసేవారి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఫలితంగా ఉద్యోగ సాధనలో వెనుకబడుతున్నారు.*

   *సామర్థ్యాన్ని అస్త్రంగా మార్చుకుని, వందశాతం ఉపయోగిస్తేనే ఫలితమొస్తుంది. చాలామంది విషయంలో పరిజ్ఞానం ఉన్నప్పటికీ ప్రభావవంతంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోలేకపోవడం వల్ల విజయం  దూరమవుతోంది. దీంతో విషయపరంగా కాస్త వెనుకబడినప్పటికీ, ఆత్మవిశ్వాసం సమృద్ధిగా ఉన్నవాళ్లు వీరికి దక్కాల్సిన అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. కారణాలు విశ్లేషించుకోకుండా.. ఎంపిక విధానంలోనే లోపం ఉందని సమర్థించుకునేవాళ్లూ ఎక్కువే. చేసిన తప్పులు, అలా ఎందుకు జరుగుతోందో తెలుసుకుంటే, తర్వాత ప్రయత్నాల్లో విజయం సాధించడానికి మార్గం సులువవుతుంది.*


*నమ్మకం ఉంటేనే..*


   *యద్భావం తద్భవతి. మనం ఆశించిన ఫలితమే మనకు దక్కుతుంది. నా వల్ల కాదు అనుకుంటే దాని ఫలితమూ అలాగే ఉంటుంది. నేను సాధిస్తాను.. సాధించగలను.. విజయం పొందగలను.. అనే నమ్మకంతో ముందడుగేస్తే విజయానికి దగ్గరవుతాం. ఎవరిని వాళ్లు నమ్మలేనప్పుడు ఇతరులు ఆ వ్యక్తులను నమ్ముతారని ఆశించడం వ్యర్థమే.*  

*పోల్చుకోవడం*


   *ఎక్కువమంది ఇతరులతో పోల్చుకుంటారు. వాళ్ల దగ్గర ఉన్నదాన్ని చూసి, తమ వద్ద లేదని బాధ పడతారు. దీంతో ఒత్తిడికి గురవుతారు. ఆత్మవిశ్వాసం మీద దాని ప్రభావం పడుతుంది. అందువల్ల ఎవరితోనూ పోలిక వద్దు. మీ లక్ష్యం దిశగా అడుగులేయండి. నిన్నటి మిమ్మల్ని, ఈ రోజు మీతో బేరీజు వేసుకోండి. ఇతరుల సంగతి అనవసరమని భావించండి. మీరేం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుని ఆ దిశలో ముందుకు కదలండి. వేరెవరి దగ్గరో ఉన్నది మీకు సొంతం కాదు. ఒకవేళ అది మీకు అవసరమైనదైతే ప్రయత్నం చేస్తే తప్పక మీ సొంతమవుతుందని గ్రహించండి. పోల్చుకుంటే సమయం వృథాతోపాటు మీపై మీరే నమ్మకం కోల్పోవచ్చు.*


*వాస్తవికతకు దగ్గరగా..*


  *మీరు ఏర్పరచుకున్న లక్ష్యాలు వాస్తవికతకు అనుగుణంగా ఉండాలి. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవడం... దాన్ని అందుకోవడం అద్భుతమే. అయితే భారీ లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకోలేకపోతే నిరాశ చెందుతారు. దాని ప్రభావం తర్వాత పెట్టుకునే లక్ష్యాలపైనా పడుతుంది. అందువల్ల లక్ష్యాన్ని చిన్న భాగాలుగా విభజించుకోండి. ఒక్కో దానికి సరిపడా గడువు నిర్ణయించుకోండి. ఇలా చేయడం వల్ల సులువుగా ఒకదాని తర్వాత మరొకటి పూర్తిచేయడానికి అవకాశం కలుగుతుంది. వాస్తవికతకు అనుగుణంగా చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని అధిగమిస్తే మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. దీంతో పెద్ద లక్ష్యాలను చేరుకోవడం సులువవుతుంది.*


*ప్రతికూలంగా..*


  *కొంతమంది వాళ్లకు సంబంధించి ప్రతి విషయాన్నీ విమర్శనాత్మక ధోరణిలో చూస్తారు, వారిపై వాళ్లే ప్రతికూలంగా ఆలోచిస్తారు. దీంతో నియంత్రణ కోల్పోతారు. మాతో ఏమీ సాధ్యం కాదు అనే పరిస్థితికి చేరుకుంటారు. ఫలితంగా ఆత్మవిశ్వాసం ఆవిరవుతుంది. అందువల్ల మిమ్మల్ని మీరు ప్రేమించడాన్ని మొదలు పెట్టండి. మీపై మీకు నమ్మకం కలిగేలా వ్యవహరించండి.*


*సమర్థతపై నమ్మకం*


  *స్వశక్తిపై పూర్తి నమ్మకం ఉన్నవాళ్లే ఏదైనా సాధించగలరు. దేన్నైనా సాధించాలంటే పూర్తిస్థాయుల్లో మీ శక్తియుక్తులు, సామర్థ్యాన్ని ప్రదర్శించడం ముఖ్యం. మీపై మీకు నమ్మకం ఉండడం వల్ల సంతోషంగా ఉండటంతోపాటు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది.*


*మీకోసం మీరు*


*మీపై మీరే పెట్టుబడి పెట్టుకోవాలి. అంటే ఉన్న సమయాన్ని మీకోసం మీరు వెచ్చించుకోవాలి. వీలైతే అదనపు సమయాన్నీ కేటాయించాలి. ఏదైనా అంశంలో ప్రావీణ్యం లేకపోతే అందులో అభివృద్ధి చెందడానికి కృషి చేయాలి. కృషి ద్వారా సమర్థత, సమర్థతతో ఆత్మవిశ్వాసం మెరుగవుతాయి. ఫలితంగా లక్ష్యానికి మార్గం సుగమమవుతుంది.*


*ఆ దిగులొద్దు..*


  *నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అనుకునేవాళ్లు ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లే. ఎవరి పనులతో వాళ్లు తీరిక లేకుండా ఉంటారు. ఒకరిని ఇంకొకరు పట్టించుకోవడం అన్ని సందర్భాల్లోనూ వీలుపడదు. మీరు కూడా ప్రతిసారీ వేరేవాళ్లను పట్టించుకోవడంలేదు కదా. కాబట్టి ఇతరుల స్పందన కోసం చూడకుండా చేసే పనిని మాత్రమే మీరు ప్రేమించండి. మీ ఆలోచనలకు గుర్తింపు, గౌరవం దక్కడం లేదని దిగులు చెందకండి.*


*గతం నుంచి ప్రేరణ*


  *ఇప్పటిదాకా మీరు సాధించిన విజయాలు, అందుకు లభించిన ప్రశంసలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. వాటి నుంచి ప్రేరణ పొందండి. కొత్త లక్ష్యం దిశగా సానుకూలంగా ముందుకు వెళ్లండి. మరికొంచెం కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాను అనే విశ్వాసంతో ప్రయత్నం దిశగా అడుగులేయాలి. ఒకవేళ గతంలో విఫలం చెందితే అందుకు కారణాలు తెలుసుకుని, లోపాలు అధిగమించండి. ఆ ఓటమిని మరిచిపోండి.*


*జ్ఞానమే ఆయుధం*


   *ప్రతికూల ధోరణి తగ్గించుకుని, జ్ఞానం పెంచుకోవడానికి అధ్యయనంపై దృష్టి సారించండి. విస్తృతంగా చదవడం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, అవగాహన సామర్థ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి జ్ఞానానికి మించిన ఆయుధం లేదు. ఎంత ఎక్కువ పరిజ్ఞానం ఉంటే అంత మొత్తంలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. నలుగురిలోనూ ప్రత్యేక గుర్తింపూ దక్కుతుంది.*


*భయాలతో యుద్ధం..*


  *భయమే అత్యంత క్రూరమైన శత్రువు. అది విశ్వాసాన్ని దెబ్బకొట్టి, నిస్సహాయుల్ని చేస్తుంది. లక్ష్యాలను చేరుకోకుండా వెనుక్కి లాగుతుంది. భయాల నుంచి దూరంగా పారిపోకుండా వాటితో యుద్ధం చేయాలి. భయానికి కారణాలు తెలుసుకుని, ప్రయత్నం ద్వారా అధిగమించాలి. ప్రతికూల ఆలోచనలకు అవకాశం ఇస్తే నెమ్మదిగా మన బుర్రంతా వాటితోనే నిండిపోతుంది. కాబట్టి వాటిని అక్కడితో ఆపి సానుకూలంగా ఆలోచించండి. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది.*


*ఇవి పాటించండి!*


*➤సానుకూలంగా మాట్లాడేవాళ్లతో ఒక సమూహంగా ఏర్పడండి. దీనివల్ల ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. ప్రతికూలంగా మాట్లాడేవారికి దూరంగా ఉండండి.*


*➤గతంలో మీకు ఎదురైన ప్రతికూల ఫలితాలను గుర్తుతెచ్చుని బాధ పడకుండా వాటిని వీలైనంత త్వరగా మర్చిపోండి. గత వైఫల్యాల ప్రభావం లేకుండా చూసుకోవడం ముఖ్యం.*


*➤మీకంటూ ఓ ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోండి. ఈ సమయంలో నిష్పాక్షికంగా మిమ్మల్ని మీరు బేరీజు వేసుకోండి. ఎక్కడ వెనుకబడుతున్నారు, అందుకు కారణాలు ఏమిటి, అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు, చేసుకోవాల్సిన మార్పులు ఏమైనా ఉన్నాయా.. వీటిని విశ్లేషించుకోవాలి. అందరికంటే ఎక్కువగా మీ గురించి మీకే బాగా తెలుస్తుందని గుర్తించుకోండి.*


*➤ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశం లేదా విభాగంలో ఇతరుల కంటే మెరుగ్గా ఉంటారు. మీరు ఎందులో సమర్థులో తెలుసుకోండి. అందులో మరింత పట్టుకోసం కృషిచేయండి.*


*➤మనసుకు నచ్చిన పనినే చేయడం వల్ల నమ్మకం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు రావు. అందువల్ల మీ లక్ష్యాలు ఎప్పుడూ మీ ఇష్టానికి అనుగుణంగా ఉండాలి. ఏమాత్రం ఇష్టంలేని వాటిని కర్తవ్యంగా భావించినప్పుడు విఫలమవ్వడమే కాకుండా, మీపై మీకు నమ్మకం పోతుంది. దాని ప్రభావం మిగిలిన అన్నింటిపైనా పడుతుంది.*


*➤ఆత్మవిశ్వాసం తగ్గడానికి కారణాలు తెలుసుకోండి. ఇంగ్లిష్‌లో ధారాళంగా మాట్లాడలేకపోవడం మీ సమస్య అయితే ఆ భాషను నేర్చుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఆ విషయంలో మీకంటే మెరుగైన వ్యక్తుల సహాయం తీసుకోండి. ఇలా ప్రతి సమస్యను అధిగమించడానికి ఉండే పరిష్కారాలు తెలుసుకుని ఆచరించండి.*


*➤ఆత్మవిశ్వాసం లోపిస్తే ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ అది వెలుగులోకి రాదు. అదే సమృద్ధిగా ఉంటే అవసరమైనంత ప్రతిభ లేకపోయినప్పటికీ విజయాన్ని అందుకోవచ్చని తెలుసుకోండి!*

మా లెక్కల టీచర్

 మా లెక్కల టీచర్



కేరళలో పంపనూరు రైల్వే స్టేషన్ పక్కన చెత్త కుప్ప దగ్గర ఒక పెద్దావిడ అందరినీ యాచిస్తూ కూర్చుని ఉంది .


ఆ పక్కనే ఒక ఆవిడ వెళుతూ .....

ఈ పెద్ద ఆవిడని చూసి , మల్లపురం స్కూల్లో నేను చదివేటప్పుడు లెక్కల టీచర్ కదా అని ఆశ్చర్యపోతూ ..... దగ్గరికి వెళ్లి విచారించగా ,


అవును నేను రిటైర్ అయిపోయిన తర్వాత నా పిల్లలు నన్ను వదిలేసి వేరే ఊర్లో వెళ్ళిపోయారు , 

వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు 

ఇలాగ బిచ్చమెత్తుకుంటున్న ను అని  దుఃఖంతో చెప్పింది. 


వెంటనే శిష్యురాలు కళ్ళమ్మట నీళ్ళు తిరిగి ,

ఆ పెద్దావిడని ఇంటికి తీసుకునివెళ్ళి .....

భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చింది. 


తరువాత టీచర్ భవిష్యత్తు గురించి ఆలోచించి శాశ్వతంగా భద్రత ఉంచాలని ఆలోచించింది.


 వెంటనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది. అది చూసిన పూర్వ శిష్యులు వెంటనే స్పందించి అందరూ కలిసి భద్రతా గృహంలో ఉంచారు. తల్లిని పిల్లలు వదిలేసినా శిష్యులు మాత్రం వదల్లేదు..

శిష్యులందరికీ అభివందనాలు

Wednesday, October 25, 2023

అమెరికాలో భారతీయుడు

అమెరికాలో భారతీయుడు

Its a true story in USA 


Lets read .....


ఒక భారతీయుడు లోను కోసం అమెరికన్ బ్యాంకు

లోకి వెళతాడు.... 


తనకు చాలా అత్యవసరంగా ఐదు వేల డాలర్లు అవసరముందని తాను అన్ని ప్రదేశాలలో

మిత్రుల దగ్గరా అడిగానని ఫలితం లేకుండా పోయిందనీ.... 


తన కోటి రూపాయల "ఫెరారీ " కారును తాకట్టు పెట్టుకుని

తనకు ఆ

అయిదు వేలు ఇప్పించవలసిందిగా కేవలం వారం

రోజుల్లో తిరిగి తీరుస్తానని హామీ ఇచ్చాడు...


I am going to other state 


I will return after 5 days 

Then

Immediatly I will pay


ఈ బ్యాంకు వారికి చాలా ఆశ్చర్యం వేసింది

అస్సలు వీడికేమైనా పిచ్చి లేసిందా.. 


కోటి రూపాయల

కారును అంత ఛీప్ గా మరీ

ఐదువేలకు తకట్టు పెడుతున్నాడేంటి అని చాలా

సార్లు తర్జనభర్జనలు పడ్డారంట. సరే ఏమైతే అదైందిలే...


వీడు తీర్చలేకపొతే కారు మనదవుతుంది కదా అనుకుని...


మేనేజర్ కార్ తాళాలు తీసుకుని జాగ్రత్తగా పార్కింగ్ చేసి


సార్

మీరప్పుడైనా వచ్చి డబ్బు కట్టి మీకారు

తీసుకుపోవచ్చని

చెపుతాడు....


ఒక వారం గడుస్తుంది... ఆ భారతీయుడు తిరిగి

బ్యాంకుకు వచ్చి ఐదువేల డాలర్లకు వడ్డి $15.41

డాలర్లు కట్టి కారును తీసుకువెళ్ళేందు

కు సిద్ధమవుతాడు... 


ఇంతలో ఆ యువ బ్యాంకు

మేనేజర్

ఆసక్తి చంపుకోలేక “ సార్! మీరు కోటి యాభైలక్షల

కారు ను తాకట్టు పెట్టి కేవలం ఐదువేల డాలర్లు అప్పు తీసుకున్నారు...  


మీరు గట్టిగా

ప్రయత్నిస్తే తప్పక దొరికేవి కదా.. దీనిలో మర్మమేంటి" అని

అడిగాడు...


అప్పుడు మన భారతీయుడు... 


"సార్! విమానాశ్రయంలో

పార్కింగ్ కు దాదాపు ఈ వారం రోజులకు

ఐదువందల

డాలర్లు కట్టవలసి వచ్చేది.. ..


But


నేను ఇక్కడ

మీకు కేవలం $15.41 డాలర్లు మాత్రమే చెల్లించి

వారం రోజులు కారును చాలా జాగ్రత్తగా

ఉంచుకున్నాను...


విమానాశ్రయంలొ అయితే కొంచెం భద్రత/శుభ్రత

కూడా తక్కువ... 


ఇక్కడ మీరు చాలా బాగా చూసు

కున్నారు..

ధన్యవాదములు".. 

అని చెప్పాడు...


బ్యాంకు మేనేజర్ కు నోట మాటరాలేదు..


ఈ విషయం తెలిసిన ఒబామా మన భారతీయుల తెలివి

తేటలకు హతాశుడయ్యాడట...


ఇది అమెరికాలో జరిగిన ఒక యథార్థ సంఘటన.

Tuesday, October 3, 2023

లూటీ మాల్

లూటీ మాల్

 కూకట్ పల్లిలో లులు మాల్ ను కస్టమర్లు దోచేశారు. అదేంటి కస్టమర్లు అంత పెద్ద మాల్‌ ను దోచేయడం ఏంటని బిత్తరపోతున్నారా. మీరు విన్నది నిజమే నండోయ్‌..లులు మాల్‌ ను మంత్రి కేటీఆర్‌ నాలుగురోజుల ముందు రిబ్బన్‌ కట్ చేసి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. దీంతో జనాలు లులు మాల్‌కి మూడు రోజులకు పోటెత్తారు. ఇసుకవేస్తే రాలే విధంగా జనాలు అక్కడకు చేరుకున్నారు. కాలుపెట్టే స్థలంకూడా లేనంతగా నగర ప్రజలు లులు మాల్‌ ను చూసేందుకు ఎగబడ్డారు. అయితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నా లెక్కచేయలేదు. అసలు కస్టమర్లు ఎవరు ఏం చేస్తున్నారనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. మాల్ ఉన్న వస్తువులు ఫుడ్ మొత్తాన్ని తిని పడేస్తూ వెళ్లిపోయారు. ఫుడ్డు తో పాటు కూల్ డ్రింక్స్ సీసాలు మొత్తం ఖాళీ చేసి పడేశారు. కస్టమర్ల ఆగడాలను చూసి యాజమాన్యం విస్తు పోయింది. 


ఆదివారం కావడంతో నగరంలోని ప్రజలు లులు మాల్ ను చూసేందుకు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ వున్న సెక్యూరిటీ కూడా వాళ్లను కంట్రోల్ చేయలేకపోయాడు. బైక్ లు, కార్లు కూడా పెట్టడానికి స్థలం లేకుండా పోయింది. ఇదంతా ఒక ఎత్తైతే లులు మాల్ నే కస్టమర్లు విపరీతంగా వాడేసుకున్నారంటే యాజమాన్యం మాత్రం బిత్తరపోయిందంటే నమ్మండి. కస్టమర్లు దేవుళ్లు అనే సామెత ఏమోగానీ.. కస్టమర్లు చేసిన హడావుడికి మాత్రం లులు మాల్ అంతా చెత్త కుండీలా మారింది. లులు మాల్ లో ఎక్కడ చూసిన చాక్లట్ కవర్లు, ఫుడ్ కవర్లు, కూల్ డ్రింక్ తాగేసి ఖాలీ చేసిన బాటిల్లు దర్శనమివవ్వడంతో యజమాన్యం తలలు పట్టుకుంటున్నారు. వామ్మో వీల్లు కస్టమర్లు కాదు.. ఇంతలా రాక్షసంగా ప్రవర్తించారేంటని విస్తుపోయారు. ఇప్పటికైనా ఫుల్ సెక్యూరిటీ పెట్టాలని, కస్టమర్లపై నిఘా పెట్టాలని పట్టిస్టంగా ఉండాలని రూల్స్ పెట్టాలని ఆలోచనలో పడ్డారు. మరి యూఏఈ తరహా లులు మాల్ పెట్టారు సరే కానీ నగరంలోని ప్రజలు మాస్ అని పాపం తెలుసుకోలేక పోయారు. కానీ ఇప్పటి కస్టమర్లకు రూల్స్ మాత్రం లులు మాల్ వెళితే మామూలుగా ఉండదండోయ్ కాస్త జాగ్రత్త మరి.


యూఏఈకి చెందిన లులు గ్రూప్ హైదరాబాద్ లో తొలి మాల్ ను ప్రారంభించింది. కూకట్ పల్లిలో లులు మాల్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ రిబ్బను కట్ చేసి ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో లులు మాల్ ను తీర్చిదిద్దారు. 75 దేశీ, విదేశీ బ్రాండ్ స్టోర్లు ఈ మాల్ లో ఉంటాయి. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్, ఇలా కావాల్సినవన్నీ ఒకే చోట లభిస్తాయి. సినిమా ప్రియుల కోసం ఐదు స్క్రీన్లు ఉన్నాయి. వీటిలో 1400 మంది సినిమాలను వీక్షించవచ్చు. నిత్యావసర వస్తువులు, ఫ్యాషన్ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, మాంసం, ఎలక్ట్రానిక్, ఐటీ వస్తువులు, మొబైల్స్, గృహోపకరణాలు ఇలా అన్ని ఈ మాల్ లో లభిస్తాయి. అలాగే పిల్లల కోసం ఎంటర్ టైన్ మెంట్ జోన్ కూడా ఉంటుంది. దేశంలో ఇప్పటికే ఐదు నగరాల్లో లులు మాల్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఆరో నగరమైంది. బెంగళూరు, కోయంబత్తూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో లులు స్టోర్లకు విశేష ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్ లులు మాల్ ను రోజుకు 30 వేల మంది సందర్శించవచ్చు. తెలంగాణలో రూ. 500 కోట్ల పెట్టుబడులలో భాగంగా లులు మాల్ ను ప్రారంభించారు. అయితే ఇప్పుడు కస్టమర్లు చేసిన పనికి లులు యాజమాన్యం బిత్తరపోయేలా చేసింది.

Monday, October 2, 2023

పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు బంటి.

 పరీక్షకు  ప్రిపేర్  అయ్యాడు బంటి. 


English subject  లో  

" *My Friend* "   అనే విషయం  మీద  Essay   అడుగుతారు  🤔అనుకొని  బట్టీ పట్టి  ...పరీక్షకు వెళ్ళాడు .


  ఐతే పరీక్ష లో  ....

" *My  Father*" అనే విషయం లో essay  రాయమన్నారు .

  

  బంటి *My Friend*   ఉన్న దగ్గర *My Father*   గా మార్చి ...   essay  రాసాడు .


   Essay correction  చేసిన టీచర్  ఇప్పటి వరకు    unconsious  లో ఉన్నది .

 

  బంటి  రాసిన Essay  😩😊


I AM A VERY FATHERLY PERSON.


I HAVE LOTS OF FATHERS .


SOME OF MY FATHERS ARE MALE AND SOME ARE FEMALE. 


MY MOTHER IS VERY CLOSE TO MANY OF MY FATHERS.


MY UNCLE IS ALSO MY FATHER. 


MY TRUE FATHER IS MY NEIGHBOUR. 


AND I LOVE ALL MY FATHERS BECAUSE EVERY PERSON MUST HAVE A FATHER.😜

చదవడం ఓ కళ

  చదవడం ఓ కళ


సంసార విషవృక్షానికి రెండు అమృత ఫలాలు. సజ్జన సాంగత్యం, సద్గ్రంథ పఠనం అంటుంది హితోపదేశం. మానవ నాగరికతా వికాసంలో పుస్తక పఠనం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఏ భాషా వ్యవహర్తల్లోనైనా వారి విద్యా సాంస్కృతిక వారసత్వాన్ని అనుసరించి భాషాభివ్యక్తి నైపుణ్యాలుంటాయి. శ్రవణం, భాషణం, పఠనం, రాత అనే నాలుగు పద్ధతులుగా ఈ నైపుణ్యాలను వర్గీకరించారు నిపుణులు.


పుస్తక పఠనం ప్రగతికి సోపానం. పుస్తకాలు చదవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎందరో మేధావులుగా, తత్వవేత్తలుగా, రాజనీతిజ్ఞులుగా, సంస్కర్తలుగా రూపొందారు. ‘పుస్తకాలు బురదగుంటలో పడిఉన్న నన్ను లేవనెత్తి నా ముందు విశాలమైన ప్రపంచ దృక్పథాలను సాక్షాత్కరింపజేశాయి’ అంటారు మాక్సిం గోర్కీ. పుస్తకాలు మనోమాలిన్యాన్ని ప్రక్షాళనం చేస్తాయంటారు అంబేడ్కర్‌. ‘ఒక పెద్ద బ్యాంకులోకంటే ఒక మంచి పుస్తకంలో ఎక్కువ సంపద ఉంటుంది’ అన్న రాయ్‌.ఎల్‌.స్మిత అనే విఖ్యాత రచయిత మాటలు అక్షరసత్యాలు.


పుస్తకం ఒక నేస్తం. మంచి పుస్తకం మంచి మిత్రుడు. పుస్తకాలు ఎందరో మంచి మిత్రుల్ని కూడా మనకు పరిచయం చేస్తాయి. మొత్తం మానవ సమాజం ఆలోచించినవి, చేసినవి, సాధించినవి... అన్నీ పుస్తకాల పుటల్లో దర్శనమిస్తాయి. అన్నిరకాల ఆధునిక ప్రసార మాధ్యమాలకన్నా పుస్తకం గొప్పది.


పుస్తకంలో ఒక బంగారపు ఇల్లు ఇమిడి ఉంటుందనేది చైనీయుల సామెత. నువ్వు జేబులో పెట్టుకుపోగలిగిన ఉద్యానవనం పుస్తకమని అరేబియన్‌ సామెత. మంచి పుస్తకం నీటి ఊట వంటిది. ఎన్నిసార్లు తాగినా మళ్ళీ తాగడానికి ఇంకా మిగిలే ఉంటుంది. పుస్తకాలు మెదడును తెరుస్తాయి. విశాలం చేస్తాయి. శరీరానికి వ్యాయామం ఎలాగో, మెదడుకు చదువు అలాంటిది. అది మెదడు శక్తిని పెంచుతుంది.


‘మనసుంటే మార్గముంటుంది’ అనేది లోకోక్తి. అబ్రహాం లింకన్‌ పట్టుదలతో చదువుకుంటూ ఎందరికో మార్గదర్శి అయ్యాడు. చదువు అతడి జీవితాన్నే మార్చివేసింది. మహాత్మాగాంధీని రస్సెల్‌, టాల్‌స్టాయ్‌ రచనలు ప్రభావితం చేశాయి. కందుకూరి వీరేశలింగం బహుగ్రంథకర్త. ‘చిరిగిన చొక్కానైనా తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కో’మని చెప్పారు. నేటి యువత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పుస్తక పఠనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పరీక్ష కోసమే చదివే చదువు నిజమైన గ్రంథపఠనం కాదు. విజ్ఞానాన్ని, వివేకాన్ని, విశ్లేషణాశక్తిని కలిగించే పుస్తకాలు చదవడం ఏ తరంలోనైనా అనివార్యం.


ఏ పుస్తకం చదవాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. మంచి మిత్రుణ్ని ఎంచుకున్నట్లుగా మంచి రచయితను ఎంచుకోవాలి. క్షణికానందం కలిగించే పుస్తకాలుంటాయి. కలకాలం చదివి గుర్తుంచుకోదగిన పుస్తకాలూ ఉంటాయి. శాశ్వతంగా భద్రపరచుకోదగినవీ ఉంటాయి. ఎన్నిసార్లు చదివినా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు అందిస్తూ జీవితాన్ని వికసింపజేసే పుస్తకాలూ ఉంటాయి. ‘కొన్ని పుస్తకాలు రుచి చూడాలి... కొన్ని మింగేయాలి... కొన్ని నమిలి జీర్ణించుకోవాలి’ అంటాడు ఫ్రాన్సిస్‌ బేకన్‌.


పుస్తక పఠనం ఒక కళ. ఏది చదివి గుర్తుంచుకోవాలో, ఏది వదిలిపెట్టాలో తెలిస్తేనే పఠనకళలో నైపుణ్యం సాధించగలుగుతారు. ‘పుస్తకం హస్త భూషణం’ అనేది పాతమాట. అది కేవలం అలంకారప్రాయం కాదు. పుస్తకం మనల్ని ఆలోచింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది, ఉత్తేజపరుస్తుంది, సృజనాత్మకతను పురిగొల్పుతుంది. ఆధ్యాత్మిక గ్రంథపఠనం పరమాత్మకు సన్నిహితుణ్ని చేస్తుంది!


 

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE