NaReN

NaReN

Monday, September 6, 2021

మహిళా ఉపాధ్యాయురాలు

 మహిళా ఉపాధ్యాయురాలు

 👩‍🏫👩‍🏫👩‍🏫👩‍🏫👩‍🏫👩‍🏫👩‍🏫👩‍🏫👩‍🏫

********************

భుజాన హ్యాండ్ బ్యాగ్ చేతిలో సెల్ ఫోన్ చీరకట్టులో

మహాలక్ష్మిని మరిపించే

మూర్తిమత్వం..

అందరితో కలివిడిగా

ఉండే మనస్తత్వం

గళగళ మాటల సవ్వడులు

మనోఫలకంపై..

సమస్యలెన్నో నాట్యం చేస్తున్నప్పటికీ..

మోముకు

కృత్రిమ ఆహార్యంతో నవ్వులు!

ఆమె ఎవరో కాదు!

భావి భారత పౌరులను

తీర్చిదిద్దే లేడీ టీచర్!

సూర్యచంద్రులను తలపించేలా..

ప్రతి రోజూ..

కొనసాగే ఆమె దినచర్య

శృతి,గతి ఎప్పటికీ తప్పదు

సుప్రభాతవేళ..

తమ వారి సేవలోనే

తరిస్తుంది తప్ప

తన గురించి ఒక్క క్షణమైనాఆలోచించదు!

మనసంతా పని ఒత్తిడితో

చిత్తడవుతున్నా..

ఇంట్లో పనులన్నీ

స్వయంగా చక్కబెట్టందే

బడికి బయలుదేరడం కష్టం

బస్సు కోసం నిరీక్షణలు

బస్సెక్కిన పిదప..

గమ్యం చేరేదాకా యాతనలు

ఇవన్నీ లెక్కచేయక..

గడియారంతో పోటీపడి

పరుగులు తీసినా

అప్పుడప్పుడు 

బడిలోనూ, ఇంట్లోనూ..

తప్పదు చివాట్ల వర్షం!

గంట గంటకూ..

తరగతులు మారుతూ..

పాఠాలు చెప్పాలి!

ఇష్టం ఉన్నా లేకున్నా..

సహచరుల మాటలతో

శృతి కలపాలి!

హోంవర్క్ పిల్లలకే కాదు..

"నేనుసైతం"అంటూ 

బండెడు మోతను

ఇంటికి తీసుకెళ్లాలి!

తన ఇష్టాఇష్టాలతో 

పని లేకుండా..

పతి అడుగు 

జాడల్లో నడవాలి!

పేరుకే జీతం

 ఆమె ఖాతాలో జమ..

ఏటీఎం కార్డు మాత్రం

భర్తజేబులోనే సుమా!

ఉదయం బడికెళ్లేటప్పుడు

సముద్రంపై చినుకుల

తాకిడితో తళుక్కున మెరిసే మెరుపు వోలే

ఉండే ఆమెనవ్వు

సాయంత్రం..

ఇంటికొచ్చేటప్పుడు

వర్షం వెలిశాక

మబ్బులు ఫక్కున నవ్వినట్లు

మంచు పరిమళాలను పంచి..పనికిరాని

గరిక పువ్వులా మారుతుంది!

అయినా..

అలసటను

లోలోనే దాచుకుంటూ..

సాయంకాలపు సేవకూ..

మళ్ళీ సిద్ధమవుతుంది.*


*కాబట్టి మిత్రులారా!కాలం కంటే వేగంగా పరిగెత్తే స్త్రీమూర్తికి వందనం* *అభివందనం!ఆమె కుటుంబానికి ఒక సేవకురాలిగా, మార్గదర్శిగా,ఇల్లాలుగా,గృహిణిగా*

*అమ్మగా..ఇలా ఎన్నో.. ఇంకెన్నో బహుముఖ పాత్రలు పోషించే ఆ మాతృమూర్తికి*


   "నమస్కరిస్తూ"

🙏🌳🌹🙏🌳🌹🙏

పసుపులేటి నరేంద్రస్వామి


No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE