NaReN

NaReN

Thursday, July 29, 2021

ప్రజలపై పన్నుల భారం

 *పరిపాలించే ప్రభుత్వాలు జనం పై ఎన్ని రకాల పన్నులు వేస్తాయో*? ఒక్కసారి గమనించండి.

*ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు,రాయితీలు మన కష్టార్జతాలే*

 అవి ఎలానో తెలుసుకుందాం.


1. సంపాదిస్తే  income tax

2. అమ్మితే sale tax 

3. ఉత్పత్తి చేస్తే production tax

4. మార్కెట్‌ చేస్తే commercial tax

5. సినిమాకి వెళ్తే entertainment tax

6. వెహికల్‌ కొంటే life tax

7. దాన్ని రోడ్‌ పైకి తెస్తే road tax

8. లాంగ్‌ జర్నీ చేస్తే toll tax

9. బండిలో పెట్రోల్‌ పోస్తే fuel surcharge tax                                                                            10. భార్య, పిల్లలతో పార్క్‌ కి వెళ్తే entery tax

11. ఉద్యోగం చేస్తే professional tax

12. వ్యాపారం చేస్తే  trade tax

13. బట్టలు కొంటే vat tax

14. కరెంటు, వాటర్‌ బిల్‌ కడితే series tax

15. ఆస్థి పై property tax

16. చివరకి పబ్లిక్‌ urinals కి వెళ్తే Swachha Bharat charge

17. సబ్బు కొంటే customer charge.

                                                                                 ఒక వస్తువు కొంటె tax, దాన్ని వినియోగిస్తే tax,                                    

దాన్ని రిపేరు చేపిస్తే tax,                        

దాన్ని లెక్కల్లో చూపిస్తే tax,                

సంపాదించింది ఖర్చుపెడితే tax.              

                                                                                     మొత్తం మీద మనిషి జన్మిస్తే tax, మనిషి సంపాదిస్తే tax, మనిషి సంతోషిస్తే tax, మనిషి మరణిస్తే tax. 


*ఇలా పలు రకాల టాక్స్ లతో మనిషి పుట్టిపెరిగిన నుండి మొదలుకొని అతడు చచ్చే వరకు* వారి శక్తికి మించి పన్నులు చెల్లిస్తూ ఆ వచ్చే రాయితీలు ప్రభుత్వాల,నాయకుల బిక్షగా భావించుకుంటున్నారు.                               అది నిజంకాదు.. ప్రజల కష్టార్జితాలు.                   ఇప్పటికైనా ఆలోచించండి..                  ఉచితాలకు ఆశపడకండి..🙏💐🇮🇳💐🙏

భార్య-భర్త

 ఇది అందరూ చదవండి 

గొప్పగా ఉంటుంది చాలా గర్వంగా ఉంటుంది.*


☘️🌿☘️🌿☘️☘️🌿☘️🌿☘️


*ఒక గర్భవతైన భార్య,* 

*ఆమె భర్త ఇలా*

*మాట్లాడుకుంటున్నారు..*


*భార్య:* 


ఏం అనుకుంటున్నావ్..?

అబ్బాయి పుడతాడనా ?

అమ్మాయనా..??


*భర్త:*


అబ్బాయనుకో...

వాడికి లెక్కలు

నేర్పుతాను...

ఇద్దరం కలిసి గేమ్స్

ఆడుకుంటాం... 

స్విమ్మింగ్

నేర్పుతా... 

చెట్లెక్కడం

నేర్పుతా... 

అమ్మాయిలతో 

ఎలా మాట్లాడాలో

నేర్పుతా... ఇంకా....


*భార్య:*


చాలు చాలు! 

మరి అమ్మాయి పుడితే..!?


*భర్త:* 


అమ్మాయైతే 

ఏం నేర్పనవసరంలేదు...!

అదే నాకు

నేర్పుతుంది... 


నేనేం తినాలి... 

ఏం తినకూడదు...

ఏం మాట్లాడాలి... 

ఏం మాట్లాడకూడదు... 

నేను ఎలాంటి బట్టలు

వేసుకోవాలి... 


ఒక రకంగా 

మా అమ్మ లాగా

అన్నమాట... 


ఇంకా నేను దానికి

ప్రత్యేకంగా ఏం

చేయకపోయినా 

నన్ను హీరోలా చూసుకుంటుంది... 


నన్నెవరైనా

బాధపెట్టారనుకో, 

వాళ్ళని అస్సలు

క్షమించదు... 

ఎదురు తిరుగుంది... 


భర్త దగ్గర కూడా 

నాగురించి గొప్పగా

చెప్తుంది... 

మా నాన్న నాకోసం 

అది చేసాడు... 

ఇది చేసాడు అనీ... 


*భార్య:*


సో..అమ్మాయైతే ఇవన్నీ

చేస్తుంది... 

అబ్బాయైతే 

చేయడంటారు

అంతేగా..??


*భర్త:*


కాదు..

అబ్బాయైతే ఇవన్నీ

మనల్ని చూసి నేర్చుకుని

చేస్తాడు... 


అమ్మాయికి 

బై బర్త్ వచ్చేస్తాయ్... 


*భార్య:*


అదేం 

శాశ్వతంగా మనతోనే 

ఉండిపోదు కదా..!


*భర్త:*


ఉండదు... 

కానీ మనం దాని గుండెల్లో

ఉండిపోతాం... 


అందుకని 

అది ఎక్కడ ఉంది 

అన్నది సమస్య కాదు..!


Daughters 

are Angles... 

Born with

unconditional 

love and care forever...


అందుకని 

ఆడపిల్లల

తల్లిదండ్రులు

అదృష్టవంతులు...


కూతురంటే కూడికల,

తీసివెతల లెక్క కాదు

నీ వాకిట్లో పెరిగే 

'తులసి మొక్క'... 


కూతురంటే 

దించేసుకొవలసిన 

బరువు కాదు..

నీ ఇంట్లో వెలసిన 

'కల్పతరువు'... 


కూతురంటే 

భద్రంగా చూడవలసిన

గాజు బొమ్మ కాదు... 

నీ కడుపున పుట్టిన 

మరో "అమ్మ"... 


కూతురంటే

కష్టాలకు,కన్నీళ్ళకు

వీలునామా కాదు ...

కల్మషం లేని 

'ప్రేమ' కు చిరునామా...


కళ్యాణమవగానే 

నిన్ను విడిచివెళ్ళినా...

పరిగెత్తుకొస్తుంది నీకు 

ఏ కష్టమెచ్చినా... 


తన ఇంటి పేరు

మార్చుకున్న

కడదాక వదులుకోదు

పుట్టింటి పైన ప్రేమను...


కొడుకులా

కాటి వరకు

తోడురాకపోయినా... 

అమ్మ అయి 

నీకు ప్రసాదించగలదు 

మరో జన్మ...


కూతురున్న 

ఏ ఇల్లు అయినా

అవుతుంది.. 

దేవతలు 

కొలువున్న కోవెల... 


*కూతురిని కన్న* 

*ఏ తండ్రి అయినా* 

*గర్వపడాలి యువరాణిని*

*కన్న మహారాజు లా..🙏🙏🙏🙏*

తెలంగాణ జిల్లాల సమాచారం

 తెలంగాణ జిల్లాలు – వివరాలు

*💥తెలంగాణ జిల్లాలు – వివరాలు*💥 

31 జిల్లాలు ఏర్పడిన నాటి సమాచారం


*68-రెవెన్యూ డివిజన్లు 


కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు  – 21,


మండలాలు                –125,


రెవెన్యూ డివిజన్లు        – 25


పోలీస్ కమిషనరేట్‌లు    – 4,


పోలీస్ డివిజన్లు           – 23,


పోలీస్ స్టేషన్లు              – 91,


సర్కిళ్లు                        – 28

———————————————–


మొత్తం జిల్లాలు   : 31,


విస్తీర్ణం చ.కి.మీలో: 1,12,077


జనాభా               : 3,50,03,674,


అక్షరాస్యత          : 66.46,


మండలాల సంఖ్య: 584,


రెవెన్యూ డివిజన్లు: 68,


రెవెన్యూ గ్రామాలు: 10,966,


———————————————–

*🌻జిల్లాల ప్రాముఖ్యత🌻*


అతిపెద్ద జిల్లా:


భద్రాద్రి-కొత్తగూడెం 8,062చ.కి.మీ,


అతిచిన్న జిల్లా:


హైదరాబాద్ 217చ.కి.మీ,


———————————————–


*👨‍👩‍👧‍👦జిల్లాజనాభా👨‍👨‍👧*


ఎక్కువ: హైదరాబాద్ 39,43,323,


తక్కువ : రాజన్న సిరిసిల్ల జిల్లా 5,43,694,


———————————————–


*జిల్లా అక్షరాస్యత*


ఎక్కువ : హైదరాబాద్ 83 %,


తక్కువ : కామారెడ్డి 48.49 %,


———————————————–


*💥మండలాలు*💥 


ఎక్కువ         : నల్లగొండ 31,


తక్కువ.       : వరంగల్ అర్బన్ 11,


———————————————–


*మండల జనాభా*


ఎక్కువ :  హైదరాబాద్ జిల్లాలో బహదూర్‌పుర 4,68,158


రెండో మండలం: ఖమ్మం అర్బన్


తక్కువ : 


మహబూబబాద్ జిల్లాలో గంగారం 10,780,


———————————————–


*గ్రామాలు


ఎక్కువ*    : సంగారెడ్డి 600,


తక్కువ    : హైదరాబాద్ 100,


———————————————–


*రెవెన్యూ డివిజన్లు


ఎక్కువ*      : రంగారెడ్డి 11,


తక్కువ ఉన్న జిల్లాలు: రాజన్న సిరిసిల్ల, వనపర్తి, జోగులాంబ గద్వాల, వరంగల్ అర్బన్*


———————————————–


*🍁31 జిల్లాలు -వాటి వివరాలు🍁*

*🕌ఆదిలాబాదు జిల్లా🕌*

విస్తీర్ణం                : 4,153చ.కి.మీ


జనాభా               : 7,21,433


అక్షరాస్యత          : 63.01%


మండలాలు         : 18


రెవెన్యూ గ్రామాలు: 504


రెవిన్యూ డివిజన్లు: ఆదిలాబాదు, ఉట్నూరు.

———————————————–


*🥗నల్లగొండ జిల్లా🥗*


౼౼౼౼౼౼౼౼౼


విస్తీర్ణం                 : 6,863చ.కి.మీ


జనాభా               : 16,31,399,


అక్షరాస్యత          : 65 %,


మండలాలు         : 31


రెవెన్యూ గ్రామాలు: 565


రెవెన్యూ డివిజన్లు: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ.


———————————————–


*🌰నిర్మల్ జిల్లా🌰*

విస్తీర్ణం                 : 3,845చ.కి.మీ


జనాభా               : 7,30,286


అక్షరాస్యత          : 57.73 %


మండలాలు         : 19


రెవెన్యూ గ్రామాలు: 428


రెవెన్యూ డివిజన్లు: నిర్మల్, భైంసా.


———————————————–


*🍎సూర్యాపేట జిల్లా🍎*

విస్తీర్ణం                : 3,374చ.కి.మీ


జనాభా               : 10,99,560


అక్షరాస్యత          : 63 %


మండలాలు         : 23


రెవెన్యూ గ్రామాలు: 279


రెవెన్యూ డివిజన్లు: సూర్యాపేట, కోదాడ.


———————————————–


*🚌మంచిర్యాల జిల్లా🚌*

విస్తీర్ణం                : 3,943చ.కి.మీ


జనాభా               : 7,07,050


అక్షరాస్యత          : 61.81 %


మండలాలు         : 18


రెవెన్యూ గ్రామాలు: 389


రెవెన్యూ డివిజన్లు: మంచిర్యాల, బెల్లంపల్లి.


———————————————–


*⛰యాదాద్రి భువనగిరి జిల్లా⛰*

విస్తీర్ణం                : 3,092చ.కి.మీ


జనాభా               : 7,26,465


అక్షరాస్యత          : 68 %


మండలాలు         : 16


రెవెన్యూ గ్రామాలు: 296


రెవెన్యూ డివిజన్లు: భువనగిరి, చౌటుప్పల్.


———————————————–


*🐠కొమరంభీం ఆసిఫాబాదు జిల్లా🐠*

విస్తీర్ణం                : 4,878చ.కి.మీ


జనాభా               : 5,92,831


అక్షరాస్యత          : 52.62 %


మండలాలు         : 15


రెవెన్యూ గ్రామాలు: 435


రెవెన్యూ డివిజన్లు: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్.


———————————————–


🌹జయశంకర్ భూపాలపల్లి జిల్లా🌹

విస్తీర్ణం                 : 6,175చ.కి.మీ


జనాభా               : 7,05,054


అక్షరాస్యత          : 60 %


మండలాలు         : 20


రెవెన్యూ గ్రామాలు: 574


రెవెన్యూ డివిజన్లు: భూపాలపల్లి, ములుగు.


———————————————–


*🏛భద్రాద్రి కొత్తగూడెం జిల్లా🏛*

విస్తీర్ణం                : 8,062చ.కి.మీ


జనాభా               : 11,02,094


అక్షరాస్యత          : 62.63 %


మండలాలు         : 23


రెవెన్యూ గ్రామాలు: 449


రెవెన్యూ డివిజన్లు: భద్రాచలం, కొత్తగూడెం.


———————————————–


*🌳మహబూబాబాదు జిల్లా🌳*

విస్తీర్ణం                : 2,877చ.కి.మీ


జనాభా               : 7,70,170


అక్షరాస్యత          : 57 %


మండలాలు         : 16


రెవెన్యూ గ్రామాలు: 297


రెవెన్యూ డివిజన్లు: మహబూబాబాదు, తొర్రూరు.


———————————————–


*🌼వరంగల్లు(రూరల్) జిల్లా🌼*

విస్తీర్ణం                : 2,175చ.కి.మీ


జనాభా               : 7,16,457


అక్షరాస్యత          : 66 %


మండలాలు         : 15


రెవెన్యూ గ్రామాలు: 233


రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు, నర్సంపేట.


———————————————–


*👑వరంగల్లు(అర్బన్) జిల్లా👑*

విస్తీర్ణం                 : 1,305చ.కి.మీ


జనాభా               : 11,35,707


అక్షరాస్యత          : 66 %


మండలాలు         : 11


రెవెన్యూ గ్రామాలు: 133


రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు.


———————————————–


*💊సంగారెడ్డి జిల్లా💊*

విస్తీర్ణం                 : 4,441చ.కి.మీ


జనాభా               : 15,23,758


అక్షరాస్యత          : 64.26 %


మండలాలు         : 26


రెవెన్యూ గ్రామాలు: 600


రెవెన్యూ డివిజన్లు: సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్.


———————————————–


*✈రంగారెడ్డి జిల్లా✈*

విస్తీర్ణం                 : 5,006చ.కి.మీ


జనాభా               : 25,51,731


అక్షరాస్యత          : 75.87 %


మండలాలు         : 27


రెవెన్యూ గ్రామాలు: 594


రెవెన్యూ డివిజన్లు: రాజేంద్రనగర్, చేవెళ్ల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్.


———————————————–


*🚙మేడ్చల్ జిల్లా🚙*

విస్తీర్ణం                : 1,039చ.కి.మీ


జనాభా               : 25,42,203


అక్షరాస్యత          : 69 %


మండలాలు         : 14


రెవెన్యూ గ్రామాలు: 161


రెవెన్యూ డివిజన్లు: కీసర, మల్కాజ్‌గిరి.


———————————————–


*🏭హైదరాబాద్ జిల్లా🏭*

విస్తీర్ణం                 : 217చ.కి.మీ


జనాభా               : 39,43,323


అక్షరాస్యత          : 83.25 %


మండలాలు         : 16


రెవెన్యూ గ్రామాలు: 100


రెవెన్యూ డివిజన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్.


———————————————–


*🦄కరీంనగర్ జిల్లా🦄*

విస్తీర్ణం                 : 2,379చ.కి.మీ


జనాభా               : 10,18,119


అక్షరాస్యత          : 61 %


మండలాలు         : 16


రెవెన్యూ గ్రామాలు: 215


రెవెన్యూ డివిజన్లు: కరీంనగర్, హుజురాబాద్.


———————————————–


*🐚సిరిసిల్ల రాజన్న జిల్లా🐚*

విస్తీర్ణం                 : 2,019చ.కి.మీ


జనాభా               : 5,43,694


అక్షరాస్యత          : 66.1 %


మండలాలు         : 13


రెవెన్యూ గ్రామాలు: 170


రెవెన్యూ డివిజన్లు: సిరిసిల్ల.


———————————————–


*🦋పెద్దపల్లి జిల్లా🦋*

విస్తీర్ణం                : 2,236చ.కి.మీ


జనాభా               : 7,95,332


అక్షరాస్యత          : 60 %


మండలాలు         : 14


రెవెన్యూ గ్రామాలు: 215


రెవెన్యూ డివిజన్లు: పెద్దపల్లి, మంథని.


———————————————–


నిజామాబాదు జిల్లా:-

విస్తీర్ణం                : 4,261చ.కి.మీ


జనాభా               : 15,77,108


అక్షరాస్యత          : 54.42 %


మండలాలు         : 27


రెవెన్యూ గ్రామాలు: 438


రెవెన్యూ డివిజన్లు : నిజామాబాదు, ఆర్మూరు, బోధన్.


———————————————–


*🎾సిద్దిపేట జిల్లా🎾*

విస్తీర్ణం                : 3,432చ.కి.మీ


జనాభా               : 10,02,671


అక్షరాస్యత          : 61.45 % మండలాలు         : 22


రెవెన్యూ గ్రామాలు: 376


రెవెన్యూ డివిజన్లు: సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాదు.


———————————————–


*💥వికారాబాదు జిల్లా💥*

విస్తీర్ణం                : 3,386చ.కి.మీ


జనాభా               : 8,81,250


అక్షరాస్యత          : 69 %


మండలాలు         : 18


రెవెన్యూ గ్రామాలు: 476


రెవెన్యూ డివిజన్లు: వికారాబాదు, తాండూరు.


———————————————–


*🔻కామారెడ్డి జిల్లా🔻*

విస్తీర్ణం                 : 3,667చ.కి.మ


జనాభా               : 9,74,227


అక్షరాస్యత          : 48.49 %


మండలాలు         : 22


రెవెన్యూ గ్రామాలు: 474


రెవెన్యూ డివిజన్లు: కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి.


———————————————–


*🔸నాగర్‌కర్నూలు జిల్లా🔸*

విస్తీర్ణం                 : 2,966చ.కి.మీ


జనాభా               : 8,60,613


అక్షరాస్యత          : 54.04 %


మండలాలు         : 20


రెవెన్యూ గ్రామాలు: 362


రెవెన్యూ డివిజన్లు: నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి.


———————————————–


*🔹మహబూబ్‌నగరు జిల్లా🔹*

విస్తీర్ణం                : 4,037చ.కి.మీ


జనాభా               : 12,90,467


అక్షరాస్యత          : 57 %


మండలాలు         : 26


రెవెన్యూ గ్రామాలు: 454


రెవెన్యూ డివిజన్లు: మహబూబ్‌నగరు, నారాయణపేట.


———————————————–


*🏀జోగులాంబ గద్వాల జిల్లా🏀*

విస్తీర్ణం                : 2,928చ.కి.మీ


జనాభా               : 6,64,971


అక్షరాస్యత          : 51 %


మండలాలు         : 12


రెవెన్యూ గ్రామాలు: 226


రెవెన్యూ డివిజన్లు: గద్వాల.


———————————————–


*🔻జనగాం జిల్లా🔺*

విస్తీర్ణం                : 2,187చ.కి.మీ


జనాభా               : 5,82,457


అక్షరాస్యత          : 61 %


మండలాలు         : 13


రెవెన్యూ గ్రామాలు: 200


రెవెన్యూ డివిజన్లు: జనగాం, స్టేషన్‌ఘనపురం.


———————————————–


మెదక్ జిల్లా:-

విస్తీర్ణం                : 2,723చ.కి.మీ


జనాభా               : 7,67,428


అక్షరాస్యత          : 55.52 %


మండలాలు         : 20


రెవెన్యూ గ్రామాలు: 381


రెవెన్యూ డివిజన్లు : మెదక్, తూప్రాన్, నర్సాపూరు.


———————————————–


ఖమ్మం జిల్లా:-

విస్తీర్ణం                : 4,360చ.కి.మీ


జనాభా               : 13,89,566


అక్షరాస్యత          : 62.26 % మండలాలు         : 21


రెవెన్యూ గ్రామాలు: 380


రెవెన్యూ డివిజన్లు: ఖమ్మం, కల్లూరు.


———————————————–


జగిత్యాల జిల్లా:-

విస్తీర్ణం                : 3,043చ.కి.మీ


జనాభా               : 9,83,414


అక్షరాస్యత          : 54.53 % మండలాలు         : 18


రెవెన్యూ గ్రామాలు: 284


రెవెన్యూ డివిజన్లు: జగిత్యాల, మెట్‌పల్లి.


———————————————–


వనపర్తి జిల్లా:-

విస్తీర్ణం                : 3,055చ.కి.మీ


జనాభా               : 7,70,334


అక్షరాస్యత          : 54 % మండలాలు         : 14


రెవెన్యూ గ్రామాలు: 27931


రెవెన్యూ డివిజన్లు: వనపర్తి.


🔺🔸🔹🔺🔸🔹🔺🔸🔹*💥31 తెలంగాణ జిల్లాలు – వివరాలు*💥 


*68-revenue divisions*


కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు  – 21,


మండలాలు                –125,


రెవెన్యూ డివిజన్లు        – 25


పోలీస్ కమిషనరేట్‌లు    – 4,


పోలీస్ డివిజన్లు           – 23,


పోలీస్ స్టేషన్లు              – 91,


సర్కిళ్లు                        – 28

———————————————–


మొత్తం జిల్లాలు   : 31,


విస్తీర్ణం చ.కి.మీలో: 1,12,077


జనాభా               : 3,50,03,674,


అక్షరాస్యత          : 66.46,


మండలాల సంఖ్య: 584,


రెవెన్యూ డివిజన్లు: 68,


రెవెన్యూ గ్రామాలు: 10,966,


———————————————–

*🌻జిల్లాల ప్రాముఖ్యత🌻*


అతిపెద్ద జిల్లా:


భద్రాద్రి-కొత్తగూడెం 8,062చ.కి.మీ,


అతిచిన్న జిల్లా:


హైదరాబాద్ 217చ.కి.మీ,


———————————————–


*👨‍👩‍👧‍👦జిల్లాజనాభా👨‍👨‍👧*


ఎక్కువ: హైదరాబాద్ 39,43,323,


తక్కువ : రాజన్న సిరిసిల్ల జిల్లా 5,43,694,


———————————————–


*జిల్లా అక్షరాస్యత*


ఎక్కువ : హైదరాబాద్ 83 %,


తక్కువ : కామారెడ్డి 48.49 %,


———————————————–


*💥మండలాలు*💥 


ఎక్కువ         : నల్లగొండ 31,


తక్కువ.       : వరంగల్ అర్బన్ 11,


———————————————–


*మండల జనాభా*


ఎక్కువ :  హైదరాబాద్ జిల్లాలో బహదూర్‌పుర 4,68,158


రెండో మండలం: ఖమ్మం అర్బన్


తక్కువ : 


మహబూబబాద్ జిల్లాలో గంగారం 10,780,


———————————————–


*గ్రామాలు


ఎక్కువ*    : సంగారెడ్డి 600,


తక్కువ    : హైదరాబాద్ 100,


———————————————–


*రెవెన్యూ డివిజన్లు


ఎక్కువ*      : రంగారెడ్డి 11,


తక్కువ ఉన్న జిల్లాలు: రాజన్న సిరిసిల్ల, వనపర్తి, జోగులాంబ గద్వాల, వరంగల్ అర్బన్*


———————————————–


*🍁31 జిల్లాలు -వాటి వివరాలు🍁*

*🕌ఆదిలాబాదు జిల్లా🕌*

విస్తీర్ణం                : 4,153చ.కి.మీ


జనాభా               : 7,21,433


అక్షరాస్యత          : 63.01%


మండలాలు         : 18


రెవెన్యూ గ్రామాలు: 504


రెవిన్యూ డివిజన్లు: ఆదిలాబాదు, ఉట్నూరు.

———————————————–


*🥗నల్లగొండ జిల్లా🥗*


౼౼౼౼౼౼౼౼౼


విస్తీర్ణం                 : 6,863చ.కి.మీ


జనాభా               : 16,31,399,


అక్షరాస్యత          : 65 %,


మండలాలు         : 31


రెవెన్యూ గ్రామాలు: 565


రెవెన్యూ డివిజన్లు: నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ.


———————————————–


*🌰నిర్మల్ జిల్లా🌰*

విస్తీర్ణం                 : 3,845చ.కి.మీ


జనాభా               : 7,30,286


అక్షరాస్యత          : 57.73 %


మండలాలు         : 19


రెవెన్యూ గ్రామాలు: 428


రెవెన్యూ డివిజన్లు: నిర్మల్, భైంసా.


———————————————–


*🍎సూర్యాపేట జిల్లా🍎*

విస్తీర్ణం                : 3,374చ.కి.మీ


జనాభా               : 10,99,560


అక్షరాస్యత          : 63 %


మండలాలు         : 23


రెవెన్యూ గ్రామాలు: 279


రెవెన్యూ డివిజన్లు: సూర్యాపేట, కోదాడ.


———————————————–


*🚌మంచిర్యాల జిల్లా🚌*

విస్తీర్ణం                : 3,943చ.కి.మీ


జనాభా               : 7,07,050


అక్షరాస్యత          : 61.81 %


మండలాలు         : 18


రెవెన్యూ గ్రామాలు: 389


రెవెన్యూ డివిజన్లు: మంచిర్యాల, బెల్లంపల్లి.


———————————————–


*⛰యాదాద్రి భువనగిరి జిల్లా⛰*

విస్తీర్ణం                : 3,092చ.కి.మీ


జనాభా               : 7,26,465


అక్షరాస్యత          : 68 %


మండలాలు         : 16


రెవెన్యూ గ్రామాలు: 296


రెవెన్యూ డివిజన్లు: భువనగిరి, చౌటుప్పల్.


———————————————–


*🐠కొమరంభీం ఆసిఫాబాదు జిల్లా🐠*

విస్తీర్ణం                : 4,878చ.కి.మీ


జనాభా               : 5,92,831


అక్షరాస్యత          : 52.62 %


మండలాలు         : 15


రెవెన్యూ గ్రామాలు: 435


రెవెన్యూ డివిజన్లు: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్.


———————————————–


🌹జయశంకర్ భూపాలపల్లి జిల్లా🌹

విస్తీర్ణం                 : 6,175చ.కి.మీ


జనాభా               : 7,05,054


అక్షరాస్యత          : 60 %


మండలాలు         : 20


రెవెన్యూ గ్రామాలు: 574


రెవెన్యూ డివిజన్లు: భూపాలపల్లి, ములుగు.


———————————————–


*🏛భద్రాద్రి కొత్తగూడెం జిల్లా🏛*

విస్తీర్ణం                : 8,062చ.కి.మీ


జనాభా               : 11,02,094


అక్షరాస్యత          : 62.63 %


మండలాలు         : 23


రెవెన్యూ గ్రామాలు: 449


రెవెన్యూ డివిజన్లు: భద్రాచలం, కొత్తగూడెం.


———————————————–


*🌳మహబూబాబాదు జిల్లా🌳*

విస్తీర్ణం                : 2,877చ.కి.మీ


జనాభా               : 7,70,170


అక్షరాస్యత          : 57 %


మండలాలు         : 16


రెవెన్యూ గ్రామాలు: 297


రెవెన్యూ డివిజన్లు: మహబూబాబాదు, తొర్రూరు.


———————————————–


*🌼వరంగల్లు(రూరల్) జిల్లా🌼*

విస్తీర్ణం                : 2,175చ.కి.మీ


జనాభా               : 7,16,457


అక్షరాస్యత          : 66 %


మండలాలు         : 15


రెవెన్యూ గ్రామాలు: 233


రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు, నర్సంపేట.


———————————————–


*👑వరంగల్లు(అర్బన్) జిల్లా👑*

విస్తీర్ణం                 : 1,305చ.కి.మీ


జనాభా               : 11,35,707


అక్షరాస్యత          : 66 %


మండలాలు         : 11


రెవెన్యూ గ్రామాలు: 133


రెవెన్యూ డివిజన్లు: వరంగల్లు.


———————————————–


*💊సంగారెడ్డి జిల్లా💊*

విస్తీర్ణం                 : 4,441చ.కి.మీ


జనాభా               : 15,23,758


అక్షరాస్యత          : 64.26 %


మండలాలు         : 26


రెవెన్యూ గ్రామాలు: 600


రెవెన్యూ డివిజన్లు: సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్.


———————————————–


*✈రంగారెడ్డి జిల్లా✈*

విస్తీర్ణం                 : 5,006చ.కి.మీ


జనాభా               : 25,51,731


అక్షరాస్యత          : 75.87 %


మండలాలు         : 27


రెవెన్యూ గ్రామాలు: 594


రెవెన్యూ డివిజన్లు: రాజేంద్రనగర్, చేవెళ్ల, కందుకూరు, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్.


———————————————–


*🚙మేడ్చల్ జిల్లా🚙*

విస్తీర్ణం                : 1,039చ.కి.మీ


జనాభా               : 25,42,203


అక్షరాస్యత          : 69 %


మండలాలు         : 14


రెవెన్యూ గ్రామాలు: 161


రెవెన్యూ డివిజన్లు: కీసర, మల్కాజ్‌గిరి.


———————————————–


*🏭హైదరాబాద్ జిల్లా🏭*

విస్తీర్ణం                 : 217చ.కి.మీ


జనాభా               : 39,43,323


అక్షరాస్యత          : 83.25 %


మండలాలు         : 16


రెవెన్యూ గ్రామాలు: 100


రెవెన్యూ డివిజన్లు: హైదరాబాద్, సికింద్రాబాద్.


———————————————–


*🦄కరీంనగర్ జిల్లా🦄*

విస్తీర్ణం                 : 2,379చ.కి.మీ


జనాభా               : 10,18,119


అక్షరాస్యత          : 61 %


మండలాలు         : 16


రెవెన్యూ గ్రామాలు: 215


రెవెన్యూ డివిజన్లు: కరీంనగర్, హుజురాబాద్.


———————————————–


*🐚సిరిసిల్ల రాజన్న జిల్లా🐚*

విస్తీర్ణం                 : 2,019చ.కి.మీ


జనాభా               : 5,43,694


అక్షరాస్యత          : 66.1 %


మండలాలు         : 13


రెవెన్యూ గ్రామాలు: 170


రెవెన్యూ డివిజన్లు: సిరిసిల్ల.


———————————————–


*🦋పెద్దపల్లి జిల్లా🦋*

విస్తీర్ణం                : 2,236చ.కి.మీ


జనాభా               : 7,95,332


అక్షరాస్యత          : 60 %


మండలాలు         : 14


రెవెన్యూ గ్రామాలు: 215


రెవెన్యూ డివిజన్లు: పెద్దపల్లి, మంథని.


———————————————–


నిజామాబాదు జిల్లా:-

విస్తీర్ణం                : 4,261చ.కి.మీ


జనాభా               : 15,77,108


అక్షరాస్యత          : 54.42 %


మండలాలు         : 27


రెవెన్యూ గ్రామాలు: 438


రెవెన్యూ డివిజన్లు : నిజామాబాదు, ఆర్మూరు, బోధన్.


———————————————–


*🎾సిద్దిపేట జిల్లా🎾*

విస్తీర్ణం                : 3,432చ.కి.మీ


జనాభా               : 10,02,671


అక్షరాస్యత          : 61.45 % మండలాలు         : 22


రెవెన్యూ గ్రామాలు: 376


రెవెన్యూ డివిజన్లు: సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాదు.


———————————————–


*💥వికారాబాదు జిల్లా💥*

విస్తీర్ణం                : 3,386చ.కి.మీ


జనాభా               : 8,81,250


అక్షరాస్యత          : 69 %


మండలాలు         : 18


రెవెన్యూ గ్రామాలు: 476


రెవెన్యూ డివిజన్లు: వికారాబాదు, తాండూరు.


———————————————–


*🔻కామారెడ్డి జిల్లా🔻*

విస్తీర్ణం                 : 3,667చ.కి.మ


జనాభా               : 9,74,227


అక్షరాస్యత          : 48.49 %


మండలాలు         : 22


రెవెన్యూ గ్రామాలు: 474


రెవెన్యూ డివిజన్లు: కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి.


———————————————–


*🔸నాగర్‌కర్నూలు జిల్లా🔸*

విస్తీర్ణం                 : 2,966చ.కి.మీ


జనాభా               : 8,60,613


అక్షరాస్యత          : 54.04 %


మండలాలు         : 20


రెవెన్యూ గ్రామాలు: 362


రెవెన్యూ డివిజన్లు: నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి.


———————————————–


*🔹మహబూబ్‌నగరు జిల్లా🔹*

విస్తీర్ణం                : 4,037చ.కి.మీ


జనాభా               : 12,90,467


అక్షరాస్యత          : 57 %


మండలాలు         : 26


రెవెన్యూ గ్రామాలు: 454


రెవెన్యూ డివిజన్లు: మహబూబ్‌నగరు, నారాయణపేట.


———————————————–


*🏀జోగులాంబ గద్వాల జిల్లా🏀*

విస్తీర్ణం                : 2,928చ.కి.మీ


జనాభా               : 6,64,971


అక్షరాస్యత          : 51 %


మండలాలు         : 12


రెవెన్యూ గ్రామాలు: 226


రెవెన్యూ డివిజన్లు: గద్వాల.


———————————————–


*🔻జనగాం జిల్లా🔺*

విస్తీర్ణం                : 2,187చ.కి.మీ


జనాభా               : 5,82,457


అక్షరాస్యత          : 61 %


మండలాలు         : 13


రెవెన్యూ గ్రామాలు: 200


రెవెన్యూ డివిజన్లు: జనగాం, స్టేషన్‌ఘనపురం.


———————————————–


మెదక్ జిల్లా:-

విస్తీర్ణం                : 2,723చ.కి.మీ


జనాభా               : 7,67,428


అక్షరాస్యత          : 55.52 %


మండలాలు         : 20


రెవెన్యూ గ్రామాలు: 381


రెవెన్యూ డివిజన్లు : మెదక్, తూప్రాన్, నర్సాపూరు.


———————————————–


ఖమ్మం జిల్లా:-

విస్తీర్ణం                : 4,360చ.కి.మీ


జనాభా               : 13,89,566


అక్షరాస్యత          : 62.26 % మండలాలు         : 21


రెవెన్యూ గ్రామాలు: 380


రెవెన్యూ డివిజన్లు: ఖమ్మం, కల్లూరు.


———————————————–


జగిత్యాల జిల్లా:-

విస్తీర్ణం                : 3,043చ.కి.మీ


జనాభా               : 9,83,414


అక్షరాస్యత          : 54.53 % మండలాలు         : 18


రెవెన్యూ గ్రామాలు: 284


రెవెన్యూ డివిజన్లు: జగిత్యాల, మెట్‌పల్లి.


———————————————–


వనపర్తి జిల్లా:-

విస్తీర్ణం                : 3,055చ.కి.మీ


Biజనాభా               : 7,70,334


అక్షరాస్యత          : 54 % మండలాలు         : 14


రెవెన్యూ గ్రామాలు: 27931


రెవెన్యూ డివిజన్లు: వనపర్తి.

------------------------------------------------------------

Tuesday, July 27, 2021

ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారు

 

*ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారు*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

100 మంది పిల్లలకు హాస్టల్‌లో ప్రతిరోజూ ఉప్మా వడ్డిస్తారు. 100 మంది విద్యార్థుల్లో 80 మంది విద్యార్థులు మాకు వేరె టిఫిన్ కావాలి అని వార్డెనుకు ఫిర్యాదు చేశారు.

కానీ, అందులో 20 మంది విద్యార్థులు తమకు ఉప్మా తినడం ఆనందంగా ఉంది అన్నారు. 80 మంది విద్యార్థులు ఉప్మా కాకుండా వేరే ఏమైనా కావాలి అని కోరుకున్నారు.

ఒక నిర్ణయానికి రావడానికి చాలా గందరగోళంతో, వార్డెన్ ఓటింగ్ ఏర్పాట్లు చేశాడు.ఇప్పుడు ఏ టిఫిన్‌కు మెజారిటీ లభిస్తుందో, ఆ టిఫిన్ తయారు చేయబడుతుంది.

ఉప్మా కోరుకున్న 20 మంది విద్యార్థులు వెంటనే ఓటు వేశారు. మిగిలిన 80 మంది విద్యార్థులలో వారి అభిరుచి ప్రకారం ఇలా ఓటు వేశారు.

18: మసాలా దోస
16: ఆలూ పరోటా & దాహి
14: రోటీ & సబ్జీ
12: బ్రెడ్ & వెన్న
10: నూడుల్స్
10: ఇడ్లీ సాంబార్

కాబట్టి, ఓటింగ్ సరళి & మెజారిటీ ప్రకారం చివరికి ఉప్మా కొనసాగించబడింది.

పాఠం ఏంటి అంటే: మన జనాభాలో 80% మంది  స్వార్ధపూర్వకంగా, విభజించబడి చెల్లాచెదురుగా ఉంటే, 20% వాళ్లే మనలను శాసిస్తారు.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి 
*అర్థమవుతుందా..... 📢*

ఇది నీ జీవితం

 *ఇది నీ జీవితం*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

మీకోసం టైం కెటాయించి చదవండి 



తెల్లవారింది.నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది లేచి చేసేది ఏముందని

అలాగే పడుకొని ఉన్నాను.మార్నింగ్ వాక్ కి

వెళ్ళాలి.కానీ బద్దకంగా అనిపించింది.

        మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు.ఆయన చనిపోయి రెండేళ్లు

అయింది.కొడుకు....కూతురు అమెరికాలో

స్థిర పడి పోయారు.నన్నూ అక్కడకు 

వచ్చేయమంటారు.కానీ నాకే ఇషష్టం లేదు 

ఆయన పోయాక నాకు

ఆసక్తి పోయింది.నిరాశ...నిస్పృహలతో

కాలం గడుపుతున్నాను.

     కాఫీ తాగాలి అనిపించింది.కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను.కాఫీ త్రాగడం ఎప్పటి అలవా టో!

       చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను.బ్రష్

చేసుకొని వాకింగ్ కి బయలు దేరాను.కొంత సేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురు పడింది.వయసు పాతిక ఉంటుంది.

అందంగా...ఆరోగ్యంగా...అంతకు మించి చలాకీగా ఉంది.

        నన్ను చూడగానే "గుడ్ మానింగ్ ఆంటీ!" అని విష్ చేసింది.ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు.

    ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి ని 

గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను.

కానీ గుర్తు రాలేదు.మరుసటి రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా అదే చిరు నవ్వుతో

విష్ చేసింది.

       అలా వారం గడిచింది.ఒక రోజు తను నన్ను విష్ చేసినప్పుడు " సారీ అమ్మా!

నిన్ను గుర్తు పట్టలేక పోయాను!"అన్నాను.

      ఆ యువతి చిన్నగా నవ్వి " మన మధ్య పరిచయం ఉంటే కదా ఆంటీ!మీరు నన్ను గుర్తు పట్టడానికి" అన్నది.

      నేను ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాను.

అప్పుడా అమ్మాయి" విష్ చేయడానికి పరిచయం ఎందుకు?" అన్నది.తన మాటకు

నేను నవ్వేసాను.నేను నవ్వి చాలా కాలం అయింది.ఆ విషయం మనసు గుర్తు చేసింది.

      " నీ పేరు?" అని అడిగాను."స్వప్న.మరి మీ పేరు?" అని అడిగింది."వకుళ" అని చెప్పాను.స్వప్న నన్ను దాటిపోతూ 

వెనక్కి తిరిగి "ఆంటీ! మీ నవ్వు చాలా బాగుంటుంది" అన్నది.నాకు మావారు గుర్తుకు వచ్చారు.ఆయన కూడా అదే మాట అనేవారు.గుండెలో సంతోషం పొంగింది.

    మధ్య మధ్యలో నాకు స్వప్న ఉత్సాహం...సంతోషం గుర్తుకు వస్తూ ఉండేవి.ఉత్తేజంగా అనిపించేది.

   ఒక రోజు "ఒక ఐదు నిముషాలు అలా కూర్చుని మాట్లాడుకుందాం" అన్నాను.

స్వప్న సరేనంది.ఇద్దరం అక్కడ ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాము.

     "నీకు పెళ్లి అయిందా?" అని అడిగాను.

"అయింది.ఒక బాబు...పాప" అంది స్వప్న.మాటల్లో మావారు పోయిన విషయం...మా పిల్లలు అమెరికాలో ఉన్న విషయం చెప్పాను.మావారు పోయినందుకు

సంతాపం తెలియ బరిచింది.

      కొద్ది క్షణాల తరువాత "ఇప్పుడు ఇంటికి

వెళ్లి బ్రేక్ ఫాస్ట్ ఏం చేస్తారు?" అని అడిగింది స్వప్న." బ్రెడ్" అని చెప్పాను.

"ప్రతి రోజూ అదేనా?" అని అడిగింది స్వప్న.

"ఒక్కదాన్నే గా!అందుకే!" అన్నాను.

      "ఒక్కరు కాబట్టే మంచి ఆహారం తీసుకోవాలి.మీ ఆరోగ్యం మీరు కాపాడు కోవాలి" అంది స్వప్న.కొంచెం సేపు ఆగి

తనే" మీవారు..పిల్లలు ఉన్నప్పుడు వాళ్లకు

ఇష్టం అయినవి చేసి పె ట్టి ఉంటారు.ఇప్పుడుమీకు ఇష్టమైనవి చేసుకు

తినండి" అన్నది.ఆ తరువాత మేం విడి 

పోయాము.

        ఇంటికి వెళ్ళిన తరువాత కూడా స్వప్న మాటలు తలపుకు వచ్చాయి.అందులోని వాస్తవం గుర్తించాను.చాలా కాలం తరువాత

నాకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకు తిన్నాను.ఎందుకో మనసుకు తృప్తిగా అనిపించింది.

     మరుసటి రోజు కలిసినప్పుడు స్వప్నకి

జీడిపప్పు ఉప్మా గురించి చెప్పాను.ఎంతో సంతోషించింది."మంచి పని చేశారు" అని అభినందించింది.మాటల్లో జీవితం నిరాసక్తత

గా ఉన్నట్లు చెప్పాను.స్వప్న మౌనం వహించింది.

    నెల తరువాత ఒక రోజు    " వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రా!" అని ఆహ్వానించాను.స్వప్న వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను" అని నా సెల్ నంబర్ తీసుకుంది.మా వారు పోయాక నేను

మా ఇంటికి ఆహ్వానించిన తొలి వ్యక్తి స్వప్న.

      సాయంత్రం నాలుగు గంటలకు  వస్తున్నట్లు స్వప్న ఫోన్ చేసింది.

నాకు సంతోషం అనిపించింది.

     తనకోసం కాఫీ చేసి ఫ్లాస్క్ 

లో పోసి ఉంచాను.చెప్పినట్లు సరిగ్గా   

నాలుగు గంటలకు స్కూటీ మీద వచ్చింది.

వస్తూ వస్తూ నాకోసం గులాబీ కుండీ  తెచ్చింది.

       "ఎందుకిది " అని అడిగాను."రోజూ దీనికి నీళ్లు పోస్తూ పూవు పూసే రోజు కోసం ఎదురు చూడండి!" అంది.

        స్వప్న సోఫాలో కూర్చుంది.కాఫీ అందించాను."మీరు తీసుకోరా?" అని అడిగింది."డయాబెటీస్.అందుకే ఇష్టమైనా

 తీసుకోవడం లేదు" అన్నాను.

        తను కిచెన్ లోకి వెళ్లి ఒక కాఫీ కప్పు తెచ్చి అందులో కొద్దిగా కాఫీ పోసి నాకు అందిస్తూ"జబ్బు కంటే భయమే శరీరం మీద

 ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.ఏం కాదు.హ్యాపీగా త్రాగండి" అంది.నేను మంత్ర ముగ్ధురాలిలా కాఫీ సిప్ చేశాను.చాలా కాలం తరువాత త్రాగుతున్న కాఫీ నాకు అద్భుతంగా అనిపించింది.  అప్పుడు స్వప్న చిక్కటి పాలల్లో..

బ్రూ పౌడర్ కలుపుకు త్రాగినా రుచి అద్భుతంగా ఉంటుంది.అందుకు కొంచెం

మైండ్ సెట్ మార్చుకో వాలి" అన్నది.

         కాఫీ త్రాగడం పూర్తి అయ్యాక "ఇల్లు చూద్దువు గాని రా!" అని స్వప్నను లోనికి తీసుకు వెళ్ళాను.

   తను పూజా మందిరం చూసి " రోజూ పూజ చేయడం లేదా?" అని అడిగింది." లేదు"

అన్నాను.తను రెండు అగరొత్తులు  తీసి వెలిగించింది.క్షణంలో గది పరిమళ భరితం

అయింది.అప్పుడు స్వప్న "పూజ చేసినప్పుడు

మన మనసూ ఇలా పరిమళ భరితం అవుతుంది" అన్నది.

       " ఈ అమ్మాయి ఏ విషయం చెప్పినా ఎంతో

బాగుంటుంది" అని మనసులో అనుకున్నాను.

         స్వప్న బయలు దేరినప్పుడు " గులాబీ మొక్కకు నీరు పోసేటప్పుడు చిన్నప్పుడు 

మీ పాపకు పాలు పట్టడం గుర్తు చేసుకోండి!"

అన్నది."అలానే" అన్నాను.

          గదిలో అలుముకున్న అగరొత్తుల

 పరిమళం స్వప్న వెళ్ళిపోయినా ఆమెను

గుర్తు చేస్తూనే ఉంది.

      మరునాటి ఉదయం రోజులా నిస్పృహతో

లేవలేదు.కాఫీ త్రాగాలన్న ఉత్సాహంతో లేచాను.కాఫీ చక్కెర లేకుండా త్రాగాను.స్వప్న చెప్పినట్లు మైండ్ సెట్ మార్చుకొని త్రాగితే

బాగుంది అనిపించింది.చాలా కాలం తరువాత

ప్రభాత సమయంలో  ఉత్సాహంగా అనిపించింది.

     వాకింగ్ సమయంలో అదే విషయం స్వప్నకి 

చెప్పాను.సంతోషం వ్యక్తం చేసింది.

     స్వప్న ఇచ్చిన గులాబీ మొక్కకు రోజూ శ్రద్ధగా నీరు పోయసాగాను.క్రమేపీ దానితో

అనుబంధం పెరిగింది.ప్రతి రోజూ దాన్ని 

శ్రద్ధగా పరిశీలించ సాగాను.మొగ్గ తొడగడం...పువ్వు విచ్చడం...పరిమళం

అద్భుతం అనిపించ సాగింది.

      మావారు ఉన్నప్పుడు పూల కుండీలు

ఉండేవి గాని...వాటి పోషణ ఆయన చూసుకునేవారు.ఇప్పుడు ఇది నాకు సరి 

కొత్త అనుభవం.

     మధ్య మధ్యలో స్వప్న తను ఇచ్చిన గులాబీ మొక్క గురించి వాకబు చేస్తూ నా ఆనందం

పంచుకుంది.

              ఈమధ్య స్వప్న నాతో పాటే వాకింగ్ చేయసాగింది.ఒకరోజువాకింగ్ మధ్యలో " మీకో చిన్న పని చెప్తాను. అలా చేసి 

ఎలా ఉందో నాకు చెప్పండి" అంది.

      "ఏమిటది?" అని ఆసక్తిగా అడిగాను.

రెండు చిన్న బౌల్స్ తీసుకొని ఒకదానిలో

బియ్యం గింజలు..ఒకదానిలో నీరు పోసి

మీ పిట్ట గోడ మీద పెట్టండి" అన్నది.

తన భావం గ్రహించి" సరే" అన్నాను.

         అలా పెట్టిన గింజలు పిట్టలు తింటూ...

దప్పిగొన్న పక్షులు నీరు తాగుతుంటే ఆ దృశ్యం మనోహరంగా అనిపించ సాగింది.

      ఉదయం తాగుతున్న కాఫీ...పూజ...

అగరొత్తుల పరిమళం... పూస్తున్న గులాబీలు...గింజలు తింటున్న పిట్టలు...

నీరు తాగుతున్న పక్షులు....ఇవి చిన్న చిన్న

మార్పులే గానీ నా జీవితంలో పెను మార్పులు తెచ్చాయి.ఒకప్పుడు నిరాశ..నిస్పృహలతో నిరుత్సాహంగా ఉండే నేను ఇప్పుడు ఉత్సాహంగా...సంతోషంగా ఉంటున్నాను.

నాలోని మార్పుకు స్వప్నే కారణం.

      ఒకరోజు సాయంత్రం స్వప్న స్కూటీ మీద

వచ్చింది.తనతో పాటు ఇద్దరు పిల్లలను తెచ్చింది."వీళ్ళు మా పని మనిషి పిల్లలు.

బాగా చదువుతారు.కానీ వీళ్ళమ్మ వీళ్ళను

చదివించలేక పోతున్నది.అందుకే ఈ బాబుకు నేను స్కూల్ ఫీ కడుతున్నాను.

మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాప స్కూల్ ఫీ కి మీరు సహాయం చేయండి" అన్నది.

నేను క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసు

కున్నాను.వాళ్లకు సహాయం చేయడం నాకు

ఎంతో తృప్తిని ఇచ్చింది.

      పిల్లలు నన్ను అడిగి జామ చెట్టు దగ్గరకు వెళ్ళి జామ కాయలు కోసుకున్నారు.స్వప్న నాతో "మీ హాబీస్ ఏమిటి?" అని అడిగింది." ఒకప్పుడు బొమ్మలు గీసేదాన్ని" అని చెప్పాను.

" వావ్" అని స్వప్న నన్ను కౌగిలించుకుంది.

"ఆంటీ! నాకు పెయింటింగ్స్ అంటే పిచ్చి.

నాకోసం ఒకటి డ్రా చేయండి" అని చిన్న పిల్లలా మారాం చేసింది ."వాటి జోలికి వెళ్లి

చాలా కాలం అయింది.వేయగలనో! లేదో!"

అన్నాను."తప్పక వేయగలరు!" అంది స్వప్న.

ఆన డమే కాదు...ఆ సాయంత్రం నేను పెయింటింగ్ వేయడానికి అవసరమైన డ్రాయింగ్ చార్ట్...పెన్సిల్స్...వాటర్ కలర్స్

తెచ్చి ఇచ్చింది.

      దాన్ని బట్టి తనకు పెయింటింగ్స్ ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నాను.

        ఆలోచించి రాధా కృష్ణుల పెయింటింగ్ మొదలు పెట్టాను.మొదట కొంచెం తడబడినా త్వరగానే దారిలోకి వచ్చాను.

పెయింటింగ్ పూర్తి చేయడానికి నాలుగు రోజులు పట్టింది.ఆ విషయం స్వప్నకి చెప్పాను.

       ఆ సాయంత్రమే పరుగున నా దగ్గరకు వచ్చేసింది.పెయింటింగ్ చుడగానే " "ఎక్సలెంట్ ఆంటీ!" అని నన్ను కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది.

నాకు సంతోషం...సిగ్గు రెండూ కలిగాయి.

     " పెయింటింగ్ మీద మీ సైన్ చేసి నాకు గిఫ్ట్ గా ఇవ్వండి" అని కోరింది.అలానే చేశాను.

      ఆ రాత్రి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను. "ఎప్పుడూ మేం చేయడమే గాని,నీవు చేసింది లేదు.ఫస్ట్ టైం నువ్వే చేశావు" అని ఆశ్చర్య పోయింది.క్లుప్తంగా స్వప్న గురించి చెప్పాను." నీ లైఫ్ స్టైల్ 

మార్చింది .నా అభినందనలు తెలియ జేయి"

అన్నది.

        కొద్ది రోజులకు స్వప్న తన ఇంటికి 

ఆహ్వానించింది.తనే వచ్చి స్కూటీ మీద తీసుకు

వెళ్ళింది.ఇంటికి వెళ్లగానే నేను పెయింట్ చేసిన రాధాకృష్ణ  అందమైన ఫ్రేమ్ లో

కనిపించి కనువిందు చేసింది.నాకు మనసులో  గర్వంగా అనిపించింది.

       స్వప్న నాకు వాళ్ళ అత్త మామ గార్లను

పరిచయం చేసింది.నేను సోఫాలో  కూర్చున్నాను.స్వప్న కాఫీ తేవడానికి లోనికి

వెళ్ళింది.

       స్వప్న అత్తగారు నాతో మాట్లాడుతూ..

" మా కోడలు దేవతమ్మా!మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది."అన్నది.అంతలో

స్వప్న కొడుకు...కూతురు మా దగ్గరకు వచ్చారు.నేను వాళ్లకు నేను తెచ్చిన బిస్కెట్స్...చాక్లెట్స్ ఇచ్చాను. వాళ్ళు 

అక్కడినుంచి వెళ్లి పోయారు.

      అప్పుడు స్వప్న అత్తగారు" ఈ బాబే స్వప్న కొడుకు.ఆ పాప అనాధ.స్వప్న దత్తత తీసుకొని పెంచుకుంటున్నది.అం తే కాదు...

మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది.అదేమంటే...మన పిల్లలను మనం పెంచడం ...ప్రేమించడం గొప్ప కాదు.

అనాధకు చేయూత నీయడం గొప్ప అంటుంది.

మా అబ్బాయి అందుకు సమర్ధిస్తాడు" అని

చెప్పింది.

      అది విన్న నాకు సంభ్రమాశ్చర్యాలు

కలిగాయి.స్వప్న కు అంత చిన్న వయసులోనే

ఎంత పరిపక్వత అనుకున్నాను.కాఫీ తెస్తున్న స్వప్న లో నాకు దేవతా మూర్తి గోచరించింది.

    స్వప్న,అత్తగారితో " మొత్తం చెప్పేసారా?

చెప్ప నిదే ఊరుకోరు కదా!" అంది నవ్వుతూ.

నేను సింపుల్ గా " అభినందనలు స్వప్నా!"

అన్నాను.

          ఇల్లు చేరానే గాని ఆ రాత్రి నిద్ర పట్టలేదు.స్వప్నను చూసాక జీవన మాధుర్యం

బోధ పడింది.ఈరోజు తను చేసిన పని తెలిశాక నా జీవిత గమ్యం బోధ పడింది.

నా దగ్గర బాగానే డబ్బు ఉంది.నా డబ్బు మా పిల్లలు ఆశించరు.ఆ విషయం నాకు బాగా తెలుసు. చాలా సేపు ఆలోచించి ఏం చేయాలో

నిర్ణయం తీసుకున్నాను.అప్పుడు హాయిగా నిద్ర పట్టింది.

       కొద్ది కాలానికి మా వారి పేరు మీద

ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచాను.దానికి

సెక్రటరీ గా స్వప్నను ఏర్పాటు చేశాను.

      ఇప్పుడు నాకు జీవితం నిరాశగా... నిస్పృహగా అనిపించడం లేదు.సంతోషంగా...

ఉత్సాహంగా అనిపిస్తున్నది.ఒకప్పుడు సమయం గడవని నాకు ..ఇప్పుడు సమయం చాలడం లేదు.

       వయసులో చిన్నదే అయినా ..నా మనసులో గురువు స్థానం స్వప్నకే

ఇచ్చాను!! 


Note≈ ఒంటరిగా ఉంటే అన్ని కోల్పోయినట్టు కాదు... మనస్సుకు నచ్చినట్టు ఊడటం తప్పు కాదు.... 🙏🙏🙏

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి

Monday, July 26, 2021

మనసున్నోడు

 

*మనసున్నోడు*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*నేను ఇంటి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి రెండు నెలలు అయింది. పనిచురుకుగానే సాగుతున్నది. ఈ రోజు స్లాబ్ వేయాలి. మేస్త్రి కనిపిస్తే "పని వాళ్ళు అందరూ వచ్చినట్లేనా?" అని అడిగాను. "ఒక మనిషి తగ్గాడు. మరేం ఫర్లేదు. పనికి ఇబ్బంది లేదు" అన్నాడు.*


*అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. నాకు నమస్కారం చేసి "అయ్యా! నా పేరు రాజయ్య. పొరుగూరు నుంచి కుటుంబంతో వచ్చాను. వారం నుండి పనికోసం తిరుగుతున్నాను. ఎక్కడా పని దొరకలేదు. పిల్లలు పస్తు ఉన్నారు. దయ చూపించి పని ఇప్పించండి" అని ప్రాధేయ పడ్డాడు.*

*అక్కడే ఉన్న మేస్త్రి "నీవెవరివో తెలీకుండా... నీ పనితనం తెలీకుండా.. పనిలో పెట్టుకొనేది లేదు. వెళ్ళు! వెళ్ళు!" అని కసురుకున్నాడు.*

     

*నా వైపు జాలిగా చూస్తూ "ఇది నాకు అలవాటున్న పనేనయ్యా! దయ చూపండి" అని ప్రాధేయపడ్డాడు. నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ.. కన్నుల్లో ఆకలి కనిపించింది. మేస్త్రితో "తెలిసిన పనే అంటున్నాడుగా! ఈ రోజుకు పెట్టుకు చూద్దాం" అన్నాను. మేస్త్రీ అయిష్టంగా "సరే! మీ ఇష్టం " అన్నాడు.*


*అతను నావంక కృతజ్ఞతగా చూసి పనిముట్లు వైపు నడిచాడు. మధ్య మధ్యలోఅతని వంక చూసాను. కష్టపడి పని చేయడం గమనించాను. "పోనీలే! నేను పని ఇవ్వడం వలన అతని కుటుంబానికి ఒక రోజు గడుస్తుంది" అని మనసులో సంతోషించాను. మధ్యలో కూలీలు అందరికీ టీ తెప్పించాను. అందరూ పదినిముషాలు పని ఆపి కబుర్లు ఆడుతూ టీ తాగుతున్నారు. రాజయ్య వంక చూసాను. ఎంతో ఇష్టంగా టీ తాగుతూ నా వంక చూస్తున్నాడు. అతను ఆకలిగా ఉన్నట్లు గ్రహించాను. మధ్యాహ్నం కూలీలు పని ఆపి భోజనాలు చేస్తున్నారు. రాజయ్య ఏం తెచ్చుకోకపోవడంతో పని ఆపకుండా తట్టలు పైకి మోస్తున్నాడు. ఆతని  ఆకలి గుర్తించగలిగాను కానీ దగ్గరలో ఏం హోటల్స్ లేకపోవడంతో అతన్ని టిఫిన్ చేయడానికి పంపలేకపోయాను. రాజయ్య మాత్రం మంచి నీళ్ళతో సరిపెట్టేసుకున్నాడు. అతని ఆకలి నాకు గిల్టీగానే ఉంది.*


*సాయంత్రం అయింది. మేస్త్రీకి డబ్బులు ఇచ్చాను. అతడు కూలీలకు పంచాడు. రాజయ్య బయలు దేరుతూ నా దగ్గరకు వచ్చి రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. "నువ్వేం తినలేదు. త్వరగా వెళ్లి భోజనం చేయి" అన్నాను. "నేనే కాదయ్యా! ఇంట్లో వాళ్లకు ఎవరికీ భోజనం లేదు. మీ దయ వల్ల ఈ పూట గడుస్తుంది" అన్నాడు. అతనికన్నుల్లోని అవేదన సరిగానే గుర్తించాను. అతను బయలుదేరి పోయాడు. ఎందుకో తెలీదు... రాజయ్య వంకే చూడ సాగాను.*


*వెళ్తున్న రాజయ్యకు పావురాలు అమ్ముతున్న వ్యక్తి ఎదురుపడ్డాడు. రాజయ్య ఆగి తనను దాటిపోయిన పావురాలు అమ్మే వ్యక్తినే చూడసాగాడు. అతని చేతిలో రెండు పావురాలు ఉన్నాయి. రెండు నిముషాలు ఆగి రాజయ్య ఆ వ్యక్తిని కేకేసి పిలిచాడు. నాకు విషయం అర్థం అయిపోయింది. ఈ పూట రాజయ్య పావురాయి మాంసంతో విందు భోజనం చేయబోతున్నాడు అన్న ఆలోచన రాగానే నాకు అంతవరకు రాజయ్య మీద జాలి కరిగి పోయింది. "ఆ డబ్బు జాగ్రత్త చేసుకుంటే మరో పూట కూడా గడిచి పోతుంది. అలాంటిది పావురాయి మాంసంతో జల్సా చేసుకుంటున్నాడు" ఆ ఆలోచన నాకు అతని మీద సదభిప్రాయం దూరం చేసింది.*


*బేరం కుదిరినట్లు ఉంది. పావురాలు అమ్మే వ్యక్తి రాజయ్య ఇచ్చిన డబ్బు తీసుకొని పావురాలు అందిస్తూ "చాలా రుచిగా ఉంటాయి. మరలా నన్ను వెతుక్కోవాలి నువ్వు" అన్నాడు. రాజయ్య చిన్నగా నవ్వి వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీయ సాగాడు. పావురాలు అమ్మినవ్యక్తి, రాజయ్యను వారిస్తూ "ఈ పని ఇంటి దగ్గర చేయి. లేకపోతే ఎగిరి పోతాయి" అన్నాడు.*

*రాజయ్య అతని మాటలు పట్టించుకోకుండా వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీసి వాటిని ఒక్కసారి ముద్దు పెట్టుకొని గాలిలోకి ఎగర వేశాడు. స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురాల వంక అలానే ఆనందంగా చూడసాగాడు. ఆ రెండు పావురాలు స్వేచ్చగా ఎగిరి పోయాయి. రాజయ్య చేసిన పనికి నాతో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆఖరికి పావురాలు అమ్మిన వ్యక్తి కూడా. "ఏంటి నీవు చేసిన పని? డబ్బులు తేరగా వచ్చాయా?" అన్నాడు.*


*డబ్బులు మరలా సంపాదించవచ్చు. పోయిన ప్రాణం మరలా రాదు" అన్నాడు రాజయ్య. ఆ మాట నా చెవిన పడింది. రాజయ్య నాకు ఒక అద్భుతమైన వ్యక్తిలా కనిపించాడు. అతని ఆకలి... ఎదురు చూసే అతని వాళ్ల ఆకలి నా కళ్ళ ముందు కదలాడింది. కూలీ పని చేసి బ్రతికే ఒక మనిషిలో ఎంత గొప్ప మనసు దాగి ఉందో బోధ పడింది.*

*అంతలో పావురాలు అమ్మిన వ్యక్తి.. రాజయ్యతో "అన్నా! నేను చేసే పని తప్పని తెలుసు. కానీ పొట్టకూటి కోసం తప్పడం లేదు. నీ డబ్బులు నీవే ఉంచుకో!" అని రాజయ్య డబ్బులు వెనక్కి ఇవ్వబోయాడు. రాజయ్య అతన్ని వారిస్తూ "డబ్బు వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండదు" అని ముందుకు కదిలాడు. కొంచెంసేపు అలానే ఉండిపోయాను.*


*తరువాత బైక్ స్టార్ట్ చేసి.. రాజయ్య దగ్గరకు పోనిచ్చి "ఎక్కు"అన్నాను. "వద్దు అయ్యగారూ!" అన్నాడు. "మరేం ఫర్లేదు. నేనూ అటేవెళ్తున్నాను" అని బలవంతంగా ఎక్కించి ఒక హోటల్ ముందు ఆపి మీల్స్ పార్సెల్ చేయించాను. ఆ తరువాత రాజయ్య ఎక్కడ ఉంటున్నాడో కనుక్కొని అక్కడ డ్రాప్ చేసి మీల్స్ పార్సిల్ అందించి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాను.*

*"అదేంటి  అయ్యగారూ! మీలాంటి గొప్పోళ్ళు నాకు దండం పెట్టడం" అన్నాడు రాజయ్య. "డబ్బు ఉన్నోడు గొప్పోడు కాదు. మనసున్న వాడు గొప్పొడు. ఆ మనసు నీకుంది. రేపు పనిలోకి వచ్చేయి!" అని బైక్ స్టార్ట్ చేసాను.*

*బైక్  డ్రైవ్ చేస్తున్న నాకు ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తూ కనిపించింది.*

*నాకు రాజయ్య గుర్తుకు వచ్చాడు!!*


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE