NaReN

NaReN

Tuesday, July 8, 2025

ఇలాంటి కొడుకు దొరకడం

 ఇలాంటి కొడుకు దొరకడం 

ఎంత గొప్ప విషయం ఆ తల్లిదండ్రులకి 


Here comes a Great Personality


వీడు కదా నిజమైన హీరో


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


నిన్న మా ఆఫీస్ లో బిల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి 

ముగ్గురు పని చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు


అందులో ఈ అబ్బాయి  నా దగ్గరకి వొచ్చి సార్ ఒక డౌట్ ఉంది చెబుతారా అని అడిగాడు


ఏంటి చెప్పు అన్నాను, వెంటనే ఫోన్ తీసి ఎదో ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇందులో ఒక పాయింట్ అర్ధం కాలేదు అన్నాడు 


చూస్తే ఎదో NIT Warangal  ది ఒక సర్కులర్ అది, ఇదెందుకు నీకు అని అడిగాను, మా కాలేజీ వారు పంపారు సార్ అన్నాడు 




షాక్ అయ్యాను, ఏమి చదువుతున్నావు అన్నాను


అమాయకం గా చెప్పాడు 


NIT WARANGAL CSE 2 nd year అన్నాడు


మరి ఇక్కడ ఏంటి అన్నాను 


మాది శ్రీకాకుళం సార్, నెల్లూరు లో అమ్మ నాన్న పని కి వొస్తారు 


హాలిడీస్ కి నేను కూడా నెల్లూరు కి వొచ్చాను సార్ 


అమ్మా నాన్న పనికి వెళ్తారు, వాళ్ళు కు కొంచం హెల్ప్ చేద్దాము అని వొచ్చాను అన్నాడు 


JEE Mains ఎంత ర్యాంకు అంటే All INDIA 5000 అన్నాడు 


ఎంత గొప్ప వాడు కదా


తల్లితండ్రుల డబ్బులు తో  డ్రగ్స్, గంజాయి, సినిమాలు, మోడరన్ బైక్స్ వాడి ఎంజాయ్ చేస్తున్న ఈ సమాజంలో  


ఇలాంటి వాడు నిజంగా అద్భుతం, ఆదర్శం 🙏


#NITWarangal #Inspiration #RealHero


No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE