NaReN

NaReN

Sunday, December 5, 2021

2.employees Questions & Answers

 సందేహాలు- సమాధానాలు

ప్రశ్న

నేను PF నుండి ఋణం పొందియున్నాను.

వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??

సమాధానం

ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

ప్రశ్న

ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి??

సమాధానం

జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

ప్రశ్న

ఒక టీచర్ ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు.అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి??

సమాధానం

ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి.

ప్రశ్న

నేను సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.

ప్రశ్న

నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను. రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే, DEO గారి అనుమతి తీసుకోవాలా?

సమాధానం

అవును తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి.

ప్రశ్న


చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో  ఉపాధ్యాయినిల వేతనంలో కోత విధిస్తారా ?

సమాధానం

G.O.Ms.No.209 Fin తేది:21-11-2016 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ సెలవును ముందుగా డి.డి.వో తో మంజూరు చేయించుకున్న తరువాత వాడుకోవాలి. మంజూరు ఉత్తర్వులిచ్చి, ఎస్.ఆర్ నందు నమోదుచేసి ఆ నెల పూర్తి వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత డి.డి.ఓ లకే ఉంటుంది.

ప్రశ్న

స్కూల్ ఇంచార్జ్ బాధ్యతలు హెచ్.ఏం ఎవ్వరికైనా ఇవ్వవచ్చునా ? లేక సీనియారిటీ ప్రకారమే ఇవ్వాలా ?

సమాధానం

డి.ఎస్.సి ఉత్తర్వుల సంఖ్య Rc.2409/C3-1/2004 తేది :27.01.2005 ప్రకారం ప్రధానోపాధ్యాయుని అర్హతలు కలిగిన వారిలో సీనియరు ఉపాధ్యాయుడిని మాత్రమే ఇంచార్జ్ గా లేదా ఎఫ్.ఏ.సి.గా నియమించాలి.

ప్రశ్న

ఎస్.జి.టి ఉపాధ్యాయుడు 24 సం॥ స్కేలు పొందుటకు డిపార్ట్మెంటల్ పరీక్షల ఉత్తీర్ణత సాధించాలా ?

సమాధానం

G.O.Ms.No.38 Fin తేది:15.04.2015 ప్రకారం 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు (GOT&EOT) ఉత్తీర్ణత సాధించాలి

ప్రశ్న

 వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎంత సర్వీస్ పూర్తిచేసి ఉండాలి? పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా?

సమాధానం

ఏ.పి.రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 లోని రూల్ 43 ప్రకారంగా 20 సం॥ సర్వీసు (అసాధారణ సెలవు కాకుండా) పూర్తిచేసిన వారికి వాలంటరి రిటైర్మెంట్ అర్హత లభిస్తుంది. రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి.

ప్రశ్న

నేను PF నుండి ఋణం పొందియున్నాను.

వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??

సమాధానం

ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.

ప్రశ్న

ఇంటి నిర్మాణానికి అడ్వాన్స్ తీసుకుంటే ఎప్పటి లోగా తీర్చాలి??

సమాధానం

ఇంటి నిర్మాణానికి అడ్వాన్సు తీసుకుంటే 300 నెలల్లో, మరమ్మతులకి తీసుకుంటే 90 నెలల్లో,ఇంటి స్థలం కోసం తీసుకుంటే 12 నెలల్లో తీర్చాలి.

ప్రశ్న

వాల0టరీ  నియామకం పొందువరికి కారుణ్య నియామకం వర్తిస్తుందా??

సమాధానం

వర్తించదు.ల

ప్రశ్న

CCL ను DDO నుండి ఎప్పటిలోగా తీసుకోవాలి??

సమాధానం

ఏ CCL ఐనా తాను పనిచేసిన ప్రభుత్వ సెలవు దినానికి 6 నెలలలోపే DDO దగ్గర నుండి పొందాలి.

ప్రశ్న

వ్యక్తి గత అవసరాలకు హాఫ్ పే లీవ్ వాడుకుంటే జీతం ఎలా చెల్లిస్తారు??

సమాధానం

మెమో.14568 ,తేదీ:31.1.2011 ప్రకారం పే,డీఏ సగం మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.

ప్రశ్న

ఇంటి మరమ్మతులు కోసం ఎంత అడ్వాన్స్ గా పొందవచ్చు??

సమాధానం

ఇంటి మరమ్మతులు, విస్తరణకు ములవేతనం కి 20 రెట్లు గానీ, 4 లక్షలు గానీ ,ఏది తక్కువ ఐతే ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తారు.

ప్రశ్న

మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా? వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?

సమాధానం

రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు. ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు. సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది. అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది.

ప్రశ్న

నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??

సమాధానం

జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేయించాలి.


ప్రశ్న

బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా??

సమాధానం

Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను కన్నా ప్రసూతి సెలవులు వాడుకోవచ్చు

ప్రశ్న

ఇంటి అద్దె (HRA మినహాయింపు) గణన ఎలా?

సమాధానం

చెల్లించిన అద్దె -10% ఫే - 10% డి.ఏ

సంవత్సరంలో చెల్లించిన అద్దె 1లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఇంటి యజమాని  PAN ఇవ్వాలి (నెలసరి అద్దె 8400/- కానీ అంతకంటే ఎక్కువ చెల్లించిన వారు)

ప్రశ్న

టాక్సేబుల్ ఆదాయం దాదాపు 7,00,000 ఉంటే టాక్స్ ఎలా గణించాలి?*

సమాధానం

2,50,000 వరకు పన్ను లేదు (60 ఏళ్ల లోపు వారికి)

2,50,001-5,00,000 వరకు (2.50 లక్షలకు) 10% 

5,00,001-10,00,000 వరకు (5 లక్షలకు) 20%

10,00,000  పైబడిన 30%

-----

7,00,000 కు టాక్స్ గణిస్తే 

2,50,000 వరకు పన్ను లేదు 

2,50,001 - 5,00,000 వరకు (2.50 లక్షలకు) 10% 

అంటే 2,50,000 X 10% = 25,000/-

5,00,001 - 7,00,000 వరకు (2 లక్షలకు) 20%

అంటే 2,00,000 X 20% = 40,000/-

చెల్లించాల్సిన టాక్స్ (25,000+40,000/-)+3%ఎడ్యుకేషన్ సెస్సు. 

-----

CPS వారికి సంబంధించిన సెక్షన్ల వారిగా ఉన్న అవకాశాలు.

ఉద్యోగుల కంట్రీబ్యూషన్ చేసిన నిధి 80CCD(1) ప్రకారం 80C సెక్షన్ తో 1,50,000/- లో చూపాలి.

అధనంగా 80CCD1(B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది

ఉద్యోగులకు వారి ప్రాన్ (PRAN)  ఖాతా లో ఉద్యోగుల వాటకి సమానంగా జమచేసిన నిధిని ముందుగా ఆదాయం గా చూపించి తర్వాత 80CCD(2) ప్రకారం ఆదాయం నుండి పూర్తి మినహాయింపు కలదు.

ప్రశ్న

అధనంగా 80CCD(1B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది?*

సమాధానం

ఉద్యోగులకు CPS కాకుండా 80C కింద 1,50,000/- సేవింగ్స్ ఉంటే CPS నిధిని 80CCD(1B) లో 50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. 

ఒకవేళ ఉద్యోగులకు 80C కింద CPS కాకుండా 1,30,000/- సేవింగ్స్ ఉండి CPS deduction 70,000/- ఉంటే అప్పుడు 20,000/- లను 80C కింద మిగతా 50,000/- లను 80CCD(1B) కింద చూపవచ్చు.

ప్రశ్న:

ఒక ఉపాధ్యాయుడు గృహిణి ఐన తన భార్యకు కిడ్నీని దానం చేయడానికి అంగీకరించాడు. ఈ సర్జరీ కోసం ఆ ఉపాధ్యాయునికి డాక్టర్లు 6 - 8 వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు ఆ ఉపాధ్యాయుడు వేతనంతో కూడిన సెలవులు పొందాలంటే ఏం చెయ్యాలి?

Employees 1.Questions & Answers

 సందేహాలు - సమాధానాలు

ప్రశ్న:

ఒక DDO ఇంతవరకు తన Complex పరిధి లోని SGT teachers యొక్క PRC  Arrears Bill చేయలేదు రేపు చేస్తా మాపు చేస్తా అని కాలం గడుపుతున్నాడు.. కానీ తను పనిచేసే High school వారివి ఎప్పుడో చేశాడు వాళ్లకు న్యూ scale kuda update అయింది. ఇటువంటి వారి మీద complaint చేయవచ్చా?

సమాధానం:

తప్పకుండా పై అధికారులకు కంప్లైంట్ చేయవచ్చును. మరి మీరు ఎం.ఈ.వో గారికి రిటర్న్ గా PRC ఎరియర్స్ చేయలేదని ఇప్పటి వరకు ఇవ్వలేదా? ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సిన బాద్యత ఆయనదే, వారు స్పందించకపోవడం విచారకరం. వారు కూడా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో బిల్ చేసేలా చూడాలి కదా! ఇప్పటికైనా ఎం.ఈ.వో కు వ్రాతపూర్వకంగా PRC ఎరియర్స్ చేయుటకు తగువిధంగా సహకరించమని. లేనట్లయితే కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు ఎం.ఈ.వో గార్లపై జిల్లా అధికారిగారికి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వవచ్చు

 ప్రశ్న:

నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడను. గత నెలలో కరోనా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరాను. అ ఆసుపత్రి రిఫరల్ కాదు. నాకు మెడికల్ రియ్మేంబెస్మెంట్ కి అవకాశం ఉందో లేదో దయచేసి తెలుపగలరు.

సమాధానం:

Unrecognized hospital లో చికిత్స చేసుకుంటే మెడికల్ రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. జనవరి నెలలో ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆచరణలో అమలుకావడం లేదు. కనుక మీకు మెడికల్ రీయింబర్స్మెంట్ రాకపోవచ్చు.

 ప్రశ్న:

నమస్తే నేనొక గవర్నమెంటు ఉద్యోగిని నాకంటూ ఎవ్వరూ లేరు వారసులు. కాలక్రమేణా నాకు ఏమైనా జరిగితే నా ఉద్యోగమో నాకు రావలసిన డబ్బు ఇవన్నీ ఎవరికి పోతాయి నా దూరపు బంధువులు నా తోడబుట్టినవాళ్లు పేరు పెట్టవచ్చా? వాళ్లకు వర్తిస్తుందా? ఇవన్నీ వాళ్లకు వస్తాయా? నామినీ మా అక్క పిల్లల పేరు పెట్టొచ్చా? మా అక్క పేరు పెట్టొచ్చా? దయవుంచి తెలుపగలరు

సమాధానం:

ముందుగా మీరు చట్టప్రకారం దత్తత తీసుకొని తరువాత వారి పేరు సర్వీస్ రిజిస్టర్ లో మీ కుటుంబ సభ్యుడుగా నమోదు చేయించాలి. అపుడు అన్ని రకాల బెనిఫిట్స్ కు నామినీగా వారి పేరు చేయిస్తే మీ తదంతరం వారికి అన్ని వస్తాయి.

ప్రశ్న:

నమస్తే sir నా wife చనిపోతే నాకు కంపసేనటేవ్ ground's లో జాబ్ వచ్చింది ఇప్పటికి 5years completed, asper G.O.Ms-209 ను 2016  women's కి మాత్రమే 90days child care leaves ఉన్నాయి, But  నాలాంటి single parent కి ఈలాంటి leaves ఏమయినా ఉంటాయా నాకు below 12years ఇద్దరు girls ఉన్నారు. ఏదయినా Go కానీ ఉంటే తెలుపగలరు.

సమాధానం:

మగవారి అటువంటి సెలవులకు సంబంధించి ఏరకమైన జీవోలు లేవు. అర్హత గల హాఫ్ పే/ కమిటెడ్ సెలవులను వాడుకోవచ్చు.

ప్రశ్న:

Entire సర్వీస్ లో డిపార్ట్మెంట్ test compulsory pass కావాలా? Pass కాకపోతే తీవ్రమైన నష్టం ఉంటుందా? ఆర్ధిక పరంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పరంగా పెన్షన్ పరంగా తెలుపగలరు

సమాధానం:

ఇది కొంత మేర ఆర్థిక ప్రయోజనం పై ప్రభావం చూపుతుంది...

ఒక SGT 24 సం. ల స్కేల్, SA/LFL HM 12 సం. ల స్కేల్ పొందాలంటే EO, GO ఉత్తీర్ణత తప్పనిసరి. లేకుంటే ఎప్పుడు పాస్ అయితే అప్పటి నుండే మోనిటరీ బెనిఫిట్ ఇస్తారు.

ఉదాహరణకు ఒక SGT 2018 నాటికి 24 సం. ల సర్వీస్ పూర్తి చేశారు. కానీ 2021 జులై సెషన్ డిపార్టుమెంటల్ పరీక్ష ఉత్తీర్ణత పొందారు. అప్పుడు వారికి 2018 నుండి కాక 2021 లో ఉత్తీర్ణత పొందిన పరీక్ష ఆఖరి తేదీ నుండి వస్తుంది.

అనగా 2.5 సం. లు బెనిఫిట్ లాస్ అవుతుంది.

ప్రశ్న:

మా స్కూల్ టీచర్స్ పి.ఆర్.సీ ఎరియర్ బిల్స్ సబ్మిషన్ చేశాము. అయితే స్టేటస్ లో అవైటింగ్ గవర్నమెంట్ అప్రూవల్ అని వస్తుంది. కానీ IFMIS లో పే వివరాలు కనిపించడం లేదు. ఎందుకని?

సమాధానం:

PRC ఎరియర్ బిల్స్ DTO/STO లో పాస్ కాగానే కొత్త బేసిక్ పే వెంటనే అప్ డేట్ కావడం లేదు. బిల్ పాస్ అయ్యాకా ఒకటి, రెండు రోజుల్లో అప్ డేట్ అవుతున్నాయి. ఆటోమేటిక్ గా అవి అప్ డేట్ అయిన తరువాత మాత్రమే జులై నెల కొత్త జీతం బిల్ చేయాల్సి వుంటుంది. జులై నెల బిల్ సబ్మిట్ చేయడానికి ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది.

ప్రశ్న:

SGT క్యాడర్ లో 24 సంవత్సరాల స్కేల్ తీసుకుంటే SA క్యాడర్ లో 6,12 సంవత్సరాల స్కేల్స్ తీసుకోవచ్చా?

సమాధానం:

తీసుకొనరాదు. ఒకవేళ ఎవరైనా తీసుకున్నట్లయితే రిటైర్మెంట్ అయ్యాక ఆడిట్ లో చెక్ చేసేటప్పుడు పెన్షన్ లో కోత పెడతారు. పెన్షన్ త్వరగా మంజూరు కాదు. ఇబ్బంది పడతారు.

ప్రశ్న:

గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాము పని చేసే కార్యాలయమునకు ఎంత దూరం లోపు నివాసం ఉండాలి అనేదానికి సంబంధిత GO ఏమన్నా ఉంటే తెలుపగలరు.

సమాధానం:

Goms number 20/8-2-2021  ప్రకారం ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి వారు పనిచేస్తున్న హెడ్ క్వార్టర్స్ లో ఖచ్చితంగా నివాసం ఉండాలని మెమో ఇవ్వడం జరిగింది. కనుక ఇంతదూరం, అంతదూరం అనే సంశయము వద్దు.

 ప్రశ్న:

కారుణ్య నియామకంలో జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ కి కావలసిన అర్హతలు ఏమిటో ఎవరైనా తెలియజేయగలరు

సమాధానం:

డిగ్రీ మరియు టైపింగ్ హయ్యర్ సర్టిఫికేట్. అలాగే Ammendment was issued Degree along with" must have knowledge to use computer with associated software like M.S.Office etc"G.O.133 GAD 12.5.2014.

ప్రశ్న:

TTC అర్హతతో SGT గా 05-07-1997 న join అయిన ఉపాధ్యాయుడు 24 years scale కోసం తప్పనిసరిగా డిపార్ట్మెంటల్ tests రాయాలా సర్ అతని అర్హత ఇప్పటికీ TTC నే. 24 years ఇవ్వవచ్చా?

సమాధానం:

Degree, Bed ఉండి departmemtal టెస్ట్ పాసైతేనే 24 years scale ఇస్తారు... అవి లేకుండా TTC తో 24 YEARS ఇవ్వరు...

ప్రశ్న:

హార్ట్ అటాక్ వల్ల ఒక ఉపాధ్యాయుడు తేదీ 09-07-2021 ఉదయం 08-30  కి మరణించారు. ఆ ఉపాధ్యాయుడి కి శాలరీ ఏ తేదీ వరకు ఇవ్వాలి. దయచేసి తెలుపగలరు. కొందరు 09-07-201 వరకు ఇవ్వాలి అని అంటున్నారు. ఇది కరెక్టా ? తెలుపగలరు?

సమాధానం:

కరెక్టే. వారికి 9-07-2021 వరకు శాలరీ బిల్ చేయాలి.

ప్రశ్న:

అలాగే సదరు ఎంప్లాయ్(expired) కి deductions upto 9-07-2021 వరకు ఏమేమి చేయాల్సి ఉంటుంది? తెలుపగలరు.

సమాధానం:

ఉదయం 8.30 కే మరణించడం జరిగింది కనుక.. అతను 09.07.2021 వరకు విధుల్లో ఉన్నట్లు లెక్క. కనుక బిల్స్ 09.07.2021 వరకే చెయ్యాలి.. TSGLI, GIS నెలలో ఎంత ఉంటే అంత కట్ చెయ్యాలి... PT కట్ చేయనవసరం లేదు.

ప్రశ్న:

Tsgli c బాండ్ మరియు మిస్సింగ్ క్రెడిట్స్ అప్లయ్ చేశాను. c bond వచ్చింది కాని మిస్సింగ్ క్రెడిట్స్ అప్డేట్ కాలేదు. ఏమి చేయాలి?

సమాధానం:

మీ యొక్క శాలరీ బిల్ Token number, మీకు కట్ అయ్యే షెడ్యూల్డ్ ఎమౌంట్ ను సూచిస్తూ ఒక లెటర్ ను Tsgli ఆఫీస్ వారికి వ్రాసి దానిని డి.డి.వో తో అటెస్ట్ చేయించి ఇవ్వండి. తప్పక సరిచేస్తారు.

ప్రశ్న:

సర్, G.O no 52 ప్రకారంగా historectomy (గర్భసంచి తొలగింపు) operation చేయించుకుని సెలవులో ఉన్న ఉపాధ్యాయురాలు కు శాలరీ క్రెడిట్ చేయవచ్చా? లేదా?

సమాధానం:

వైద్య పరమైన సెలవుల్లో ఉన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించవచ్చు.. అయితే ఆ సెలవు పీరియడ్ లో ఎటువంటి ఇంక్రిమెంట్లు ఇవ్వరాదు..

ప్రశ్న:

సర్, నేను ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ ఫర్ లో 1998 సెప్టెంబర్ 14 న వచ్చాను. ఈ జిల్లాలో 26-10-1998 న డియస్స్సి. 98 వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు సీనియారిటీ ప్రకారం ప్రకారం నా పేరు ముందుగా రావాలి కదా, కానీ నా పేరు 1998 లిస్ట్ చివరన ఉంది, ఇది కరెక్టేనా? నా అపాయింట్ మెంట్ 1995. వారి కంటే నేను ముందు ఉద్యోగంలో చేరాను. కనుక వివరించగలరు.

సమాధానం:

Inter District transfers లో వస్తే ఆ DSC లో మీరు జూనియర్ అవుతారు. కాబట్టి మీ పేరు lost లో నే ఉంటుంది.

ప్రశ్న:

నేను SSC ఎగ్జామినేషన్ ఇంఛార్జిగా 2018-19, 2019-20, 2020-21. అయితే నాకు ఎన్ని EL's వస్తాయి? మూడు విద్యా సంవత్సరాలకు EL's వస్తాయా?

సమాధానం:

14 రోజుల EL's కు ఎల్జిబిలిటీ వస్తుంది. అది కూడా 2018-19 సంవత్సరానికి మాత్రమే. 2019-20 & 2020-21 సంవత్సరాలలో పరీక్షల నిర్వహణ లేనందున ఆకాలంలో EL's రావు

1. ప్రశ్న:

చదువుకునే ఆడవారు ఆధార్, పాన్ కార్డ్ లను వారి యొక్క ఇంటి పేరుతో తీసుకున్న వాటిని వివాహమైన తర్వాత భర్త ఇంటి పేరుతో తప్పనిసరిగా తీసుకోవాలా? పుట్టినింటి సర్ నేమ్ ను కొనసాగించ వచ్చునా?

సమాధానం:

ఆడవారి surname ఎప్పుడు కూడా వారి తండ్రిది మాత్రమే ఉంటుంది. పెళ్ళితర్వాత భర్తది వస్తుంది కదా అనుకుంటారు... అలా రాదు. వారి పిల్లలకు మాత్రమే వస్తుంది. సో..ఆధార్ లో అయినా, PAN లో అయినా పేరు సర్టిఫికెట్ ప్రకారమే ఉండాలి. అవసరం  అయితే ఆధార్ లో W/o అని భర్త పూర్తి పేరు పెట్టుకోండి. తప్ప మీ ఇంటిపేరు ఎట్టి పరిస్థితుల్లో మార్చకండి. ఉద్యోగ నియామక అప్లికేషన్ చేసిన తరువాత వెరిఫికేషన్ సమయంలో ఇబ్బంది ఎదురుకుంటారు. 

2. ప్రశ్న:

పి.ఆర్.సీ బిల్లులు IFMIS సైట్ లో ఒక్కొక్కరికి చేయాలా? లేక అందరివి ఒకేసారి చేయాలా? ఇంక్రిమెంట్ తేదీ 1st నుంచి చూపించవలెనా? లేకపోతే అపాయింట్ మెంట్ తేది చూపించవలెనా?

సమాధానం:

పి.ఆర్.సీ బిల్స్ ఒక్కొక్కరివి చేస్తేనే మంచిది. సైట్ నందు కూడా ఇండివిడ్యువల్ గా వస్తుంది. ఇకపోతే ఇంక్రిమెంట్ తేదీ మీరు నియామకమైన నెల యొక్క మొదటి తేదీనే చూపించవలసి ఉంటుంది. AAS తీసుకున్న (6, 12, 18, 24) యెడల వాటిని మాత్రమే అపాయింట్మెంట్ తేదీ నుంచి చూపించవలెను. 

3. ప్రశ్న:

SB లో GIS మరియు TSGLI కు సంబదించిన ఎంట్రీ ప్రతి సం|| వుండాలా లేక వాటి పెరుగుదల జరిగినప్పుడు మాత్రమే ఎంట్రీ చేయాలా? దయచేసి తెలుపగలరు.

సమాధానం:

GIS ప్రతి సంవత్సరం Nov - నుండి Oct వరకు SB లో Entry చేయాలి. అలాగే TSGLI పెరిగినప్పుడు మార్పులు ఎప్పటినుండి వస్తే అప్పటిది ఎంట్రీ చేస్తే సరిపోతుంది.  

4. ప్రశ్న:

2018 డిసెంబర్ లో AGI మరియు 6 years AAS ఉన్న ఒక టీచర్ డిసెంబర్ 20,2018 నుండి ... మే 2019 వరకు మెటర్నిటీ లీవ్ లో ఉంది 30 th may 2019 స్కూల్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత టీచర్ కు 1st డిసెంబర్ నుండి AGI ని, మరియు 28th డిసెంబర్ 2018 నుండి 6 year AAS ఇంక్రిమెంట్లు  ఇస్తూ.. మానిటరీ బెనిఫిట్స్ మాత్రం 30 మే 2019 నుండి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2020 PRC లో 6 YEARS AAS ఇంక్రిమెంట్ ను ఎప్పటినుండి ఎంట్రీ చెయ్యాలో చెప్పండి.?

సమాధానం:

Sir Online December 2018 ఉంటుంది. Already దానినే ఎంట్రీ చేసి ఉంటాం. కానీ arrears Bills లో అన్ని నోషనల్ కదా. Due drawn మాత్రమే ఎడిట్ చేసి actual గా తీసుకుంది entry చేయవచ్చు.

Proceedings as for 6 years and AGI కూడా actual date వేస్తాం (అంటే December 2018). May లో join అయ్యారని మే 2019 ఇవ్వకూడదు. Table లో arrears edit చేసుకోవచ్చును.

5. ప్రశ్న:

మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా??

సమాధానం:

చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది. మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు. అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాలంటరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు. 

6. ప్రశ్న:

స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??

సమాధానం:

స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు, సెల్ఫ్ డిక్లరేషన్ జాతపరచాలి. 

7. ప్రశ్న:

సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??

సమాధానం:

సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు. అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి. ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు. 

8. ప్రశ్న:

స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??

సమాధానం:

జీఓ.15,16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి.అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే. 

9. ప్రశ్న:

ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??

సమాధానం:

అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు

10. ప్రశ్న:

చదువుకునే ఆడవారు ఆధార్, పాన్ కార్డ్ లను వారి యొక్క ఇంటి పేరుతో తీసుకున్న వాటిని వివాహమైన తర్వాత భర్త ఇంటి పేరుతో తప్పనిసరిగా తీసుకోవాలా? పుట్టినింటి సర్ నేమ్ ను కొనసాగించ వచ్చునా?

సమాధానం:

ఆడవారి surname ఎప్పుడు కూడా వారి తండ్రిది మాత్రమే ఉంటుంది. పెళ్ళితర్వాత భర్తది వస్తుంది కదా అనుకుంటారు... అలా రాదు. వారి పిల్లలకు మాత్రమే వస్తుంది. సో..ఆధార్ లో అయినా, PAN లో అయినా పేరు సర్టిఫికెట్ ప్రకారమే ఉండాలి. అవసరం  అయితే ఆధార్ లో W/o అని భర్త పూర్తి పేరు పెట్టుకోండి. తప్ప మీ ఇంటిపేరు ఎట్టి పరిస్థితుల్లో మార్చకండి. ఉద్యోగ నియామక అప్లికేషన్ చేసిన తరువాత వెరిఫికేషన్ సమయంలో ఇబ్బంది ఎదురుకుంటారు.

11. ప్రశ్న:

Monday, November 29, 2021

మనశ్శాంతిని పొందడం ఎలా?

 మనశ్శాంతిని పొందడం ఎలా?


🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


సముద్రం ఒడ్డున ఆగి ఉన్న ఓడపైన ఓ కాకి వచ్చి వాలింది...

అంతలో ఓడ ప్రయాణం ప్రారంభమై సముద్రం మధ్యలోకి చేరింది...*


కాకి ఓడపై భాగంలో ఎగిరింది. ఎటూచూసినా నీళ్లే ఉన్నాయి, వాలడానికి స్థలం లేదు, తిరిగి తిరిగి మళ్లీ ఓడపైనే వాలింది...


చంచలమైన మనస్సు కూడా ఆ కాకిలాంటిదే...


చాలాదూరం పరుగెత్తుతుంది, కానీ ఎక్కడా దానికి తృప్తి దొరకడం లేదు... గాలిలో దీపం లాగా ఎప్పుడూ కదులుతుంది, అందుకే మనసును కోతితో పోల్చారు, మన మనసు కూడా కోతిగా ఉంటేనే గెంతులేస్తుంది.


అలాంటిది ఆ కోతి కల్లు తాగిలే.. దాన్నితేలు కుడితే.. దానికి దెయ్యం పడితే.. ఆపై అది నిప్పులు తొక్కితే? ఇక ఆ కోతి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు...


అలాగే మనిషులం అనుకొనే అనే మన -  మనసు కూడా!


 ఈ రోజుల్లో ఏ మనిషిని కదిలించినా చాలా ‘బిజీ’గా ఉండడానికి కారణం మనసుకుండే ఈ కోతి స్వభావమే...


ఇవాళ మనుషులకు అన్నీ ఉన్నాయి కానీ అందరిదీ ‘సమయ ౼ పేదరికం


హద్దులు మీరిన ధనవ్యామోహం, తీవ్రమైన పదవీకాంక్ష, హద్దూ అదుపులేని కీర్తి కండూతి వల్ల మనిషి అనే మనం అశాంతిలో మునిగి తేలుతున్నాము.


ప్రతివారిలో ఆధ్యాత్మికత పెరిగినట్లు కనిపిస్తుంది...

కానీ ఎక్కువమందిమి అశాంతితో జీవిస్తున్నాము...

గుళ్లకు, గురువుల దగ్గరకు వెళ్లి   నాకు ఇళ్లూ, ధనం, పదవి కావాలని భౌతిక సుఖాన్ని యాచిస్తున్నాము...

అంతేతప్ప.. ‘నా మనసుకు శాంతి కావాలి’ అని ఎవరమూ అడగట్లేదు...

 

వెండి, రాగి మొదలైన లోహాలతో కలిసినప్పుడు బంగారం విలువ ఎలా తగ్గిపోతుందో....

అలాగే శుద్ధజ్ఞానం గల జీవుడు శివస్వరూపి అయినా గాని అహంకార, మమకార గుణాలతో మాయ ఆవరించి జీవత్వం పొందుతున్నాము...


స్ఫుటం అనే శుద్ధి ప్రక్రియ ద్వారా స్వర్ణకారులు బంగారాన్ని ఇతర లోహాల నుండి ఎలా వేరు చేస్తారో,

గురువు కూడా అలా తన యోగ విద్యా ప్రబోధం వల్ల మనోనాశనం చేస్తాడు.


సాధన వల్ల కలిగే సంస్కారాలతో జీవుని మనో మాలిన్యం తొలగిస్తే ‘శుద్ధ జ్ఞానైక శివస్వరూపుడు’ అవుతాడు.

అలాంటి సాధానానుష్ఠానం మనోనిశ్చలతను కలిగిస్తుంది

 మనసుకు శాంతిని కలిగించాలి.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳




.

Sunday, November 28, 2021

ఒక పరీక్ష

 ఒక పరీక్ష


స్కూల్లో క్లాస్ టీచర్ తన క్లాసులోని పిల్లలందరికీ కమ్మని మిఠాయి పంచి, ఒక విచిత్రమైన షరతు పెట్టాడు.


 "వినండి పిల్లలూ! మరో పది నిమిషాల వరకు మీరందరూ మీ మిఠాయి తినకూడదు" అని చెప్పి తరగతి గది నుండి వెళ్లిపోయాడు.


క్లాస్‌రూమ్‌లో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవరించింది. 


పిల్లలందరూ తమ ముందు ఉంచిన మిఠాయి  వైపు చూస్తున్నారు, గడిచే ప్రతి క్షణం వారి ఆతృతను అదుపులో ఉంచుకోవటం చాలా కష్టంగా ఉంది.


పది నిమిషాల తర్వాత టీచర్ ఆ క్లాస్ రూమ్ లోకి ప్రవేశించారు. 


అతను పరిస్థితిని సమీక్షించాడు. 


మొత్తం క్లాస్ లో మిఠాయిలు తిననివారు ఏడుగురు పిల్లలు ఉన్నారని కనుగొన్నాడు, మిగిలిన పిల్లలందరూ  మిఠాయి తినేసి, దాని రంగు, రుచి గురించి గట్టిగా మాట్లాడుకుంటున్నారు.


ఉపాధ్యాయుడు తన డైరీలో ఈ ఏడుగురు పిల్లల పేర్లను రహస్యంగా నమోదు చేసి, బోధన ప్రారంభించాడు.


ఈ ఉపాధ్యాయుడి పేరు వాల్టర్ మిషెల్.


కొనేళ్ల తర్వాత వాల్టర్ తన డైరీని తెరిచి ఆ ఏడుగురు పిల్లల పేర్లను బయటకు తీసి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నాడు. 


ఈ ఏడుగురు చిన్నారులు తమ తమ రంగాల్లో మంచి విజయాలు సాధించారని తెలుసుకున్నాడు.


అదే తరగతికి చెందిన మిగిలిన విద్యార్థుల గురించి కూడా ఆరా తీశాడు. వారిలో ఎక్కువ మంది సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారని, కొంతమంది ఆర్థికంగా, సామాజికంగా క్లిష్ట  పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్నాడు.


వాల్టర్ తన పరిశోధనను ఈ ఒక్క వాక్యంలో ముగించాడు –


*" కేవలం ఒక్క పది నిమిషాలు కూడా ఓపిక పట్టలేని వ్యక్తి,  జీవితంలో ఎప్పటికీ పురోగమించలేడు."*


ఈ పరిశోధన ప్రపంచవ్యాప్త ఖ్యాతిని పొందింది. 


ఉపాధ్యాయుడు వాల్టర్ పిల్లలకు ఇచ్చిన మిఠాయి, *"మార్ష్ మెల్లో"* అవడంవల్ల, ఇది *"మార్ష్ మెల్లో సిద్ధాంతం"* అని పిలువబడింది.


ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులు ఎల్లప్పుడూ అనేక ముఖ్యలక్షణాలతో పాటు ఓర్పుని కలిగి ఉంటారు. 


ఓర్పు ఒక వ్యక్తి యొక్క సహనశక్తిని  పెంచుతుంది కాబట్టి, అతను ప్రతికూల పరిస్థితులలో కూడా నిరుత్సాహపడడు. 

తనకు తానుగా ప్రేరేపించుకుంటూ, విజయవంతమైన వ్యక్తి అవుతాడు.

Friday, November 26, 2021

నిజం

 నిజం

                                 ***

ఏవండీ...మీకీ సంగతి తెలుసా...?   మన పక్క ఫ్లాట్ లో ఉండే  కరుణాకర్ గారూ, వసుంధర గారూ ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లిపోతున్నారట...   

వాళ్ళుండే  ఫ్లాట్ అద్దెకి ఇస్తారట ప్రస్తుతం అంది భర్త తో..ప్రభావతి..  

అవునా...నీకెలా తెలుసు..నీకు చెప్పారా..?  అన్నారు ప్రభావతి భర్త ముకుంద రావు గారు..

.                              

*ఈ విషయం మన పనిమనిషి చెప్పింది అందామె'.*

"పోనీలే పాపం,  అక్కడ ఉంటే మంచి కాలక్షేపం, 

కనిపెట్టుకుని చూసే వాళ్ళు ఉంటారు...సేఫ్టీ కూడా...

అన్నారు"  ముకుందం గారు...

:ఏంటో... ఖర్మ కాకపోతే,  ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని దిక్కులేనట్టు... అక్కడ ఉండటం ఏంటో..అంది"  ఆవిడ దీర్ఘం తీస్తూ...

"చూడు..నువ్వు అలా మాట్లాడటం తప్పు...

ఎవరి పరిస్థితులు బట్టి వాళ్ళు బ్రతుకుతారు అంతే గానీ ఇలానే బ్రతకాలి అని ఒక రూల్ పెట్టుకుని అందరం బ్రతకడం కష్టం...ఆ రూల్ ఎంత సహేతుకమైనా...

మనం విమర్శించడం మానేస్తే మంచిది"...అన్నారు ముకుందం గారు...

"సరే లెండి ఏదో పక్క వాళ్ళు చాలా రోజులుగా కలిసి ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకోవడం అంతే... నాకెందుకు...?

సాయంత్రం వంట పని చూసుకోవాలి అంది ఆవిడ తనలో తను మాట్లాడుకున్నట్లు గా పైకే..

ఆవిడ కొడుకూ కోడలు ఉద్యోగాలనుండి రాత్రి 7 దాటాక  వస్తారు...ఈవిడే వాళ్ళొచ్చే టైంకి వంట చేసి పెట్టాలి....

కోడలు చిన్న సాయం కూడా చేయదు...మనవలిద్దరినీ వీళ్లే చూసుకోవాలి.. ఒకడు స్కూల్ కి వెళ్తాడు... రెండో వాడు రెండేళ్ల వాడు....

ఈవిడ ఓపిక లేక,  పిల్లల్ని చూసుకోలేక... పని చేయలేకుండా ఉంటుంది...

'ఆవిడకి పక్కవాళ్ళ మీద అసూయ....చక్కగా ఇద్దరే ఉంటారు లింగు లిటుకు అంటూ...

పనేమీ ఉండదు ఆవిడకి అంతా రెస్ట్ అని ఆవిడ భావన'...

కొన్ని రోజులకే అందరికీ తెలిసింది...

కరుణాకర్ గారి విషయం...

ఫ్లాట్స్ లో ఉన్న అసోసియేషన్ వాళ్ళ ఫంక్షన్ హాల్ లోనే ఆయనకి చిన్న సెండ్ ఆఫ్ పార్టీ ఏర్పాటు చేశారు...

ఆ రోజు సాయంత్రం అందరూ వచ్చారు...చాలా మంది మాట్లాడారు...

కరుణాకర్ గురించి ఆయన భార్య గురించి...వాళ్ళు ఎంత మంచి వాళ్ళో...ఎంత హుందాగా ఉండేవారో...అని..

కొంతమంది సానుభూతి గా మాట్లాడారు...

పిల్లలుండీ ఈ పరిస్థితి రావడం మీద...ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోవడం లేదని..

ఇలాంటి తల్లి తండ్రుల ని ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించడం బాధాకరమని...

ఇలా అనేక రకాలుగా...

కొంతమంది కి మాట్లాడే అవకాశం వచ్చినా...చేతికి మైకు ఇచ్చినా పట్టలేము...

అందరూ కరుణాకర్ గారి  జంట వంక సానుభూతి తో చూస్తున్నారు...

చివరిగా కరుణాకర్ గారి వంతు వచ్చింది...

ఆయన మాట్లాడేస్తే..అందరూ భోజనాలు చేసేసి వెళ్లిపోవచ్చని ఆత్రుత అందరిదీ...

ఆయన లేచి స్టేజి మీదకి వెళ్లి మైకు తీసుకున్నారు...

మాట్లాడటం ప్రారంభించారు...అందరికీ కృతజ్ఞతలు... మా మీద చాలా సానుభూతి చూపించారు..

మా లైఫ్ కూడా మీ అందరి సాన్నిధ్యంలో చాలా బాగా గడిచింది...

నేను ఒక్క అయిదు నిమిషాలు మాట్లాడతాను...దయచేసి వినండి...

మాకు ఇద్దరు అబ్బాయిలు...ఇద్దరికీ రెండేళ్ల తేడా...

మేము ఇద్దరం కూడా ఉద్యోగస్థులం...

పిల్లల్ని మంచి స్కూల్ లోనే చదివించాం...

ఆ రోజుల్లో అందరూ నడిచిన  దారిలోనే నడిచాం...

పిల్లల పదో తరగతి అవగానే ఒక కార్పొరేట్ కాలేజ్ లో  ఎం.పి. సి గ్రూప్ లో జాయిన్ చేయడం...

దానితో పాట ఎంసెట్ కోచింగ్ ఇప్పించాం...

డబ్బుకు చూసుకోలేదు...

పిల్లలకి దీని మీద ఆసక్తి ఉందా లేదా అని  అడగలేదు...

ఒకటే ధ్యేయం...

ప్రస్తుత ట్రెండ్ ని ఫాలో అవ్వాలి అంతే...

మా పిల్లలూ మేము ఏది చెప్తే అదే చేశారు..

ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాకపోయినా,  లక్షల్లో డొనేషన్ కట్టి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేర్పించాం....

ఇంజనీరింగ్ అయ్యాకా,  క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం వచ్చింది మా పెద్ద వాడికి...

మాకు అస్సలు ఆ ఉద్యోగం ఆనలేదు...

అందరిలాగే అమెరికా పంపించాలని ఆశ...

వాడిని జి.ఆర్.యి.  టోఫెల్ ఎక్జామ్స్ వ్రాయించాం...

ఏదో యావరేజ్ గా గట్టెక్కాడు...

అమెరికాలో అన్ని యూనివెర్సిటీస్ కి అప్లై చేయించాం...

ఇద్దరం ఉద్యోగస్థులం కదా...డబ్బుకి వెనకాడలేదు...

బాంక్ లోన్స్ పెట్టి మొత్తానికి అక్కడ యూనివర్సిటీస్ లో ఎయిడ్ రాకపోయినా మా డబ్బుతోనే పంపించేసాం...

అక్కడ చదువు అయ్యాకా అక్కడే ఉద్యోగం వచ్చింది...

మా ఆనందానికి అవధులు లేవు..గర్వంగా ఫీల్ అయ్యాము..

రెండో వాడిని కూడా అదే దారిలో పెట్టేసాము...

రెండో వాడు వెళ్లనన్నాడు..."ఇక్కడే చదువుకుంటాను నాన్నా  అని"  రిక్వెస్ట్ చేశాడు...

మేము ఒప్పుకోలేదు...ఇండియా లో ఏముందిరా...డెవలప్మెంట్ ఉండదు...ఎక్సపోజర్ ఉండదు అని వాడిని ఒప్పించి, ఇంచుమించు బలవంతంగా ఆస్ట్రేలియా పంపించేసాం పై చదువుకి....

మాకు ఎంత గర్వం గా ఉండేదో...మా ఇద్దరి పిల్లలు  విదేశాల్లో ఉన్నారని...

దానికి తోడు,  మా చుట్టాలు, ఆఫీస్ లో మా ఇద్దరి కోలీగ్స్,  మమ్మల్ని పొగుడుతుంటే...నా ఛాతీ గర్వంతో వెడల్పు అయ్యేది...

మీకేమండి... మీ ఇద్దరి పిల్లలూ విదేశాల్లో ఉన్నారు అనగానే మాకు గాలిలో తెలిపోతున్నట్టు ఉండేది...

అసలు మా పూజలు, మా మొక్కులు అన్నీ మా ఇద్దరి పిల్లలు ఇండియా దాటి వెళ్లాలనే...

అవన్నీ ఫలించి మా పిల్లలు అక్కడ ఉన్నారు అనుకునే వాళ్ళం...

ఇద్దరికీ ఉద్యోగాలు అక్కడే వచ్చాయి...

ఇంకా పండగ మాకు...

కొంత కాలానికి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న ఇండియన్ అమ్మాయిలని భారత్ మెట్రిమోనియల్ డాట్ కాం లో చూసి పెళ్ళిళ్ళు కూడా చేసేసాం...

మరి ఇక్కడ అమ్మాయిని చేస్తే అక్కడికి వెళ్లడం...స్థిరపడటం టైం తీసుకుంటుంది అని...

మేము రెండు మూడేళ్ళ కోసారి అమెరికా, ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్లి వస్తూ ఉండేవాళ్ళం...మొదటి సారి అమెరికా వెళ్ళినప్పుడు మావాడు, కోడలు మమ్మల్ని మొత్తం అంతా తిప్పి చూపించారు...

వాళ్ళ వైభోగం, ఆ దేశం చూడటానికి  మా కళ్ళు చాలలేదు...

మేమిద్దరమనుకున్నాం..మనం పిల్లల్ని ఇక్కడికి పంపించి మంచి పని చేశాం అని...మమ్మల్ని మేము మెచ్చుకోలుగా  భుజాలు తట్టుకున్నాం...

వాళ్ళు ఎప్పుడైనా ఇండియా వచ్చేవాళ్ళు...

వాళ్ళ హోదా, అలవాట్లు కి తగ్గట్టు మా ఇల్లుని పూర్తిగా మార్చేసామ్...అన్నట్లు మధ్యలో

మేము రిటైర్ అయిపోయాం....

మాకు మనవలు కలిగారు...

మేము కూడా వెళ్లి అక్కడ ఉండి పిల్లల్ని చూసుకున్నాం...

రెండోసారి వెళ్ళినప్పుడు మొదటిసారి లా ఎక్కడికీ తీసుకెళ్లలేదు వాళ్ళు...

అప్పటికే అన్నీ చూసేసి ఉండటం...చిన్న పిల్లలతో వీలు కాకపోవడం వలన...

అప్పుడు మాత్రం నాలుగు గోడల మధ్య ఓ ఆరు నెలలు జైలు లా, నరకం గా ఉండేది...

ఇంట్లో పనులు, వంట, పిల్లల్ని చూసుకోవడం మా వల్ల కాలేదు...

తరువాత ఇండియా లో మా ఇంటికి వచ్చాకా మాకు ఇక్కడ స్వేచ్ఛ అర్ధమయ్యింది....స్వేచ్ఛ విలువ తెలిసింది...

కొన్నాళ్ళకి మా పిల్లలు "మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది" అని ఫోన్ చేసినప్పుడు, నిజంగా మా సంతోషానికి అవధులు లేవు...

ఈ సారి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసామ్...

చుట్టాలకి ఫ్రెండ్స్ కి హోటల్ లో పార్టీ ఇచ్చాం...

కనిపించిన వాళ్లందరికీ స్వీట్స్ పంచాం....

అంత ఆనందం ఎప్పుడూ పొందలేదు....

కాలం ఆగదు కదా...సాగిపోతూనే ఉంటుంది...

మా పిల్లలు అక్కడే ఇళ్లు వాకిళ్ళు కొనుక్కున్నారు...

మా మనవలు పెద్ద వాళ్ళైయ్యారు....మా పిల్లలకి కూడా 40 ఏళ్ళు వస్తున్నాయి...

మాకు అంత పెద్ద ఇండిపెండెంట్ ఇంట్లో ఉండాలంటే కష్టం గా ఉండేది...

పిల్లలు ఇప్పుడు ఇండియా కి రావడం తగ్గిపోయింది...

అంత ఇంట్లో ఇద్దరం బిక్కు బిక్కు మంటూ ఉండలేకపోయాం...

మా పిల్లలు కూడా ఆలోచించి...రోజులు బాగాలేవు, క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి...ఒంటరిగా ఉన్న పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చాలా వింటున్నాం...

ఎందుకైనా మంచిది  మీరు అపార్ట్మెంట్ లో ఉంటే మంచిది అని,  ఇక్కడ ఫ్లాట్ కొని మమ్మల్ని షిఫ్ట్ అవమన్నారు...

ఆ ఇల్లు అద్దెకి ఇచ్చేసాం...ఇక్కడికి వచ్చాం...

నాకు 70 ఏళ్ళు, మా ఆవిడకి 65 దాటాయి...

వయసుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి...సహజం కదా....

ఇద్దరం ముసలి వాళ్ళు ఏ తోడూ లేకుండా ఒంటరిగా ఉండటంలో కష్టనష్టాలు తెలియడం మొదలు పెట్టాయి...

నెమ్మదిగా వాస్తవాలు బోధపడసాగాయి...

మా పిల్లలు ఫోన్లు చేస్తూ ఉంటారు...

మనకి పగలైతే వాళ్ళకి రాత్రి కదా...

వాళ్ళు వాళ్ళ పగలు టైం లో మాకు ఫోన్ చేస్తే...రాత్రి పదింటికి కొంచెం నిద్రపడుతున్న మాకు మెలుకువ వస్తుంది...

వాళ్ళతో మాట్లాడి ఫోన్ పెట్టేసినాకా ఇంక నిద్ర పట్టదు...

అలా అని ఫోన్ చేయొద్దు అని చెప్పలేం..

ఇలా ఎన్నాళ్లు అనే ఆలోచన వచ్చేసింది....

ఏ అర్ధ రాత్రో ఎవరికి బాగోలేకపోయినా,వాళ్ళని తీసుకుని ఇంకొకరు హాస్పిటల్ కి వెళ్లడం అసంభవం....

మా ఆవిడ వంట చేయలేకపోతోంది మా ఇద్దరికే అయినా కూడా...

వంటమనిషిని పెట్టుకుందామంటే భయం...

కార్ కి డ్రైవర్ ని పెట్టుకుందాం అంటే  భయం...

మేము ఇద్దరమే అని తెలిసి మాకు ఏ హాని తలపెడతారో అని...

ఈ మధ్యనే  నమ్మిన ఒక  డ్రైవర్ తన ముసలి ఓనర్స్ ని చంపి దొరికినవన్నీ పట్టుకుపోయాడు.అని విన్నాం...

సాటి మనుషుల్ని నమ్మలేని స్థితి కి వచ్చాం...

మా ఈ దీనావస్థకి కారణం మా పిల్లలని, వాళ్ళకి హృదయం లేదని మీలో చాలా మంది అన్నారు...

కానీ ఎంత మాత్రం కాదు...

మా పిల్లలు చాలా మంచి వాళ్ళు...మేము చెప్పిందల్లా చేశారు...!

మమ్మల్ని ఆనంద పెట్టారు...!

వాళ్ళు విదేశాలు వెళ్తామని అడగలేదు...మేమే పంపాము...!

మాచిన్నబ్బాయి "నేను ఎక్కడికీ వెళ్ళను నాన్నా, ఇక్కడే మీ దగ్గరే ఉంటా"  అని రిక్వెస్ట్ చేసాడు...

మేము కొట్టి పారేసామ్...వినలేదు వాడి మాట...

ఎందుకంటే మాకు సొసైటీ లో గుర్తింపు కావాలి...మా ప్రతిష్ట పెరగాలి...

అందరూ మా గురించి గొప్పగా చెప్పుకోవాలనే యావ...

అక్కడ ఉద్యోగం వస్తే సంబరపడిపోయాం...

అక్కడ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తే...అయ్యో...పిల్లలు ఎప్పటికీ అక్కడే ఉండిపోతారే అన్న బాధ లేకపోగా, ఎగిరి చంకలు గుద్దుకున్నాం...

ఆరోజుల్లో "ఇండియా వచ్చేయండి రా" అని మేము ఒక్క మాటంటే,  వచ్చేసేవారు...కనీసం ఒక్కళ్ళయినా...

మేము అనలేదు సరికదా అక్కడి పిల్లల్నిచ్చి పెళ్లి చేసామ్...

ఇప్పుడు మా కోడళ్ళకి కూడా అక్కడే ఉండాలని ఆశ...

ఒకవేళ మా పిల్లలకి రావాలని ఉన్నా తమ భాగస్వాములు, తమ పిల్లలూ కూడా ఒప్పుకోరు...

మేమే వాళ్ళని అక్కడనుండి కదలకుండా అనేక బంధనాలతో బంధించేసాం...

నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఈ పరిస్థితి మేమే కారణం...

మా పిల్లలు కాదు...ఇది స్వయం కృతం...

మా పిల్లల్ని తిడుతుంటే నేను భరించలేక వచ్చి చెప్తున్నాను...

ఇప్పుడు ఇక్కడ కూడా మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తున్నాయి...

మీరు మీ పిల్లల్ని ఈ దిశగా మరలించండి...

మీకు తెలుసు అనుకోండి..ఆయినా చెప్తున్నాను...

మీ పిల్లల ఫ్యూచర్ తో పాటు,  మీ ఫ్యూచర్ సంగతి కూడా చూసుకోండి...

ఇక్కడ కొన్ని కుటుంబాలు కొడుకుకొడళ్లతో, మనవలతో ఉండటం చూస్తుంటే ఆనందం వేస్తుంది...

మాకు అలాంటి అదృష్టం ఎప్పటికీ రాదు కదా...

అటువంటి అదృష్టాన్ని కోల్పోకండి...

మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తున్నా...

అది ఫైవ్ స్టార్ హోటల్ లాంటి సౌకర్యాలతో ఉంది...

మా పిల్లలే ఆన్లైన్ లో చూసి ఏర్పాటు చేశారు...

అక్కడ ఉండటానికి చిన్న చిన్న కాటేజీలు, 

ఎవరికి ఎలాంటి తిండి అవసరమో అలాంటి ఫుడ్ వండి పెట్టె వంటమనుషులు....

మాలాంటి వాళ్ళు ఎందరో అక్కడ మాకు కాలక్షేపం....

పదిహేను రోజులకి ఒకసారి డాక్టర్ వచ్చి చెకప్ లు చేస్తారు.....

వాకింగ్ సౌకర్యం...అందరికీ ఇంట్లో టీవీ...

కామన్ హాల్ లో పెద్ద టీవీ....

ఆకుపచ్చని వాతావరణం....ఇవన్నీ ఉన్నాయి....

ఒక్కొకళ్ళకీ నెలకి 50000 కట్టి మా పిల్లలు ఇందులో చేర్చారు....

అంటే మా ఇద్దరికీ నెలకి ఒక లక్ష ఖర్చు పెడుతున్నారు...

ఒకప్పుడు మేము వాళ్ళ చదువులకి లక్షలు ఖర్చు  పెడితే, వాళ్ళు ఇప్పుడు మాకోసం ఖర్చు పెడుతున్నారు...

వాళ్ళు ఇప్పుడు మా విషయంలో ఇలా చేయక పోయినా మేము చేసేది ఏమీ లేదు... అంటే నా ఉద్దేశ్యం ఇంత జాగ్రత్త తీసుకోకపోయినా అని...

మా పిల్లలకి మేమంటే ప్రేముంది కాబట్టి, సంస్కారం ఉంది కాబట్టి, స్థోమత ఉంది కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేశారు...

మేము ఒక విధంగా అదృష్టవంతులమే...

పిల్లలతో మనవలతో ఉండటమే ఎక్కువ అదృష్టం...దానితో ఏ అదృష్టానికి పోలిక లేదు...

కానీ ఉన్నంతలో సంతృప్తి చెందాలి...

కానీ ఇండియా లో ఉంటూ కూడా  ముసలితనం లో తల్లి తండ్రులని పట్టించుకోకుండా వదిలేసిన పిల్లలూ ఉన్నారు...

ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇంకా దయనీయం...

US లో ఉన్న పిల్లలు తాము రాలేక, తల్లిదండ్రులని తీసుకుపోలేక, పెద్దవయసైన తల్లిదండ్రులని ఒంటరిగా ఉంచలేక...

అటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో,  వాళ్ళు తమ తల్లిదండ్రులని ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంచుతున్నారు...వాళ్ళకి వేరే దారి లేక...

కనీసం అక్కడ ఉంచితే, 

రక్షణ తో పాటు వాళ్ళ అతీ గతీ చూసేవాళ్ళు ఉంటారని...

వైద్య సదుపాయం ఉంటుందని....

మంచి ఆహారం తో పాటూ... ఒకే ఏజ్ వాళ్ళ సహచర్యంతో,  కొంత టైం పాస్ ఉంటుందని...

వాళ్ళని విమర్శించకండి...

దయచేసి మీ పిల్లల అభిప్రాయం తెలుసుకుని, వాళ్ళ ఇష్టాన్ని గౌరవించి చదివించండి...ఇది నా సలహా...అందని వాటికి అర్రులు చాచొద్దు...

మీకు వీలున్నప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి పోతూ ఉండండి...

మేము పెద్దవాళ్ళం కాబట్టి మీ దగ్గరికి రాలేకపోవచ్చు....

మా మీద జాలి పడకండి...

నమస్తే....

అని ఆయన ఆపేశారు...

కొన్ని సెకండ్స్ నిశ్శబ్దం గా గంభీరమైపోయిన  ఆ ప్రదేశం... కొద్ది క్షణాల అనంతరం చప్పట్లతో మారు మ్రోగిపోయింది..

.

★ *వసుంధర గారు చెంగుతో కళ్ళు వొత్తుకున్నారు....*

 😂😂😂🙂🙂😂😂😂

అమూల్యం

 "అమూల్యం"


"ప్రియా రాత్రికి పెళ్ళికెళదాం. కాస్త నీకూ రొటీన్ వర్క్ నించి రిలీఫ్! ఎప్పుడూ టార్గెట్లు, ప్రాజెక్ట్ లాంచింగ్ ల గోలే కదా!  ... ఫ్రెష్ గాలి పీల్చుకున్నట్టూ ఉంటుంది, నలుగురినీ కలిసినట్టూ ఉంటుంది" అన్నది కూతురితో  వైష్ణవి! 


"అబ్బ నాకిష్టమైన కార్యక్రమం వస్తుంది టీవీలో..చూడాలి మమ్మీ. నాకు కూడా ఇవ్వాళ్ళొక్క రోజే కాస్త ఖాళీ దొరికింది. పెళ్ళిళ్ళంటేనే బోర్. అందులోనూ ముక్కూ మొహం తెలియని వాళ్ళఇళ్ళల్లో పెళ్ళికెళ్ళాలంటే ఇంకా బోర్!  డ్రైవర్ ఉన్నాడుగా, నువ్వెళ్ళిరా. అన్నట్టు ఇంతకీ పెళ్ళెవరిది" అన్నది, ఒళ్ళు విరుచుకుంటూ... లాప్ టాప్ లో నించి తలెత్తకుండానే. 


"నువ్వు పసిపిల్లగా ఉండగా నాతో కడపలో కలిసి పని చేసిన శర్మ అంకుల్ కూతురి పెళ్ళి, నాగోల్ లో" అన్నది. 


"అమ్మో..అంటే దాదాపు ముప్ఫయ్యేళ్ళ క్రితం నీతో పని చేసినాయన కూతురి పెళ్ళా? అయినా ఇన్నేళ్ళ తరువాత నిన్నసలు ఆయన ఎలా ట్రేస్ చేశారు మమ్మీ? నీలాంటి కొలీగ్స్ ఆయనకి ఎంత మంది ఉండుంటారు? అందరినీ పిలుస్తారా?" అన్నది ఒళ్ళు విరుచుకుంటూ. 


"అందరినీ కాదు. సర్వీసులో కానీ.. జీవితంలో కానీ కొంత మంది ముఖ్యులంటూ ఉంటారుగా ప్రతివారికీ? నేను కూడా అంకుల్ కి అలాంటి ఒక ముఖ్య వ్యక్తినే! మనుషుల మధ్యలో ఉండే బంధాల అవసరం, అందులో ఉండే అనుభవాల చీకటి వెలుగులు ఈ కాలం పిల్లలకి తెలియట్లేదు. మనిషికి చదువు, డబ్బు, ఉద్యోగపు హోదాలే కాదు..అంతకంటే ముఖ్యమైనవి మానవ సంబంధాలు. బేతాళుడి ప్రశ్నలు ఆపి, లేచి తయారవ్వు. సరదాగా అలా తిరిగొచ్చినట్టు ఉంటుంది". 


"మొన్న మోజుపడి కొనుక్కున్నావు కదా...ఆ రాయల్ బ్లూ చీర కట్టుకో. ఎప్పుడూ ఆ దిండు గలీబులు( నైటీలు) వేసుకు తిరిగే దానివి ఎప్పుడు కట్టుకుందామని కొనుక్కుంటున్నావు అన్ని చీరలు! లే...లేచి తెములు" అన్నది. 


                                                *******


అప్పటికే సాయంత్రం 7 గం లు అయింది. చలి కాలం పొద్దు, చీకటి పడిపోయి రాత్రి తొమ్మిదైనట్టుంది. అప్పుడు బయలుదేరి బంజారా హిల్స్ నించి నాగోల్ వెళ్ళాలంటే...దాదాపు 23 కిలోమీటర్లు.... హీన పక్షం గంటన్నర పడుతుంది. ఇక ట్రాఫిక్ జాం ఉంటే..ఇంకో అరగంట అదనం! 


ఒక్కతే బయలుదేరే జోష్ లేక, కార్లో కబుర్లు చెప్పుకోవటానికి తోడు ఒక మనిషి ఉంటుంది  అని కూతురిని బయలుదేర దీసింది వైష్ణవి. 'కష్టమైనా సుఖమైనా మాట్లాడుకోవటానికి తనకంటూ ఒక మనిషి ఉండాలి అని ఈ తరానికి ఎలా అర్ధమౌతుందో'అనుకుంది స్వగతంగా!  


"నేను కూడా ముందు నువ్వన్నట్టే పెళ్ళికి వెళ్ళటానికి బద్ధకించాను. వద్దనుకున్నాను కూడా. కానీ పాపం నా ఎడ్రెస్ పట్టుకుని నన్ను పెళ్ళికి  పిలవటానికి ఆయన ఎంత శ్రమ పడి ఉంటారు? అదీ కాక ఈ మధ్య కాలంలో అసలు టచ్ లో కూడా లేము."


"ఆయన పిల్ల పెళ్ళి చేసి నన్ను పిలవకపోయినా, నాకు తెలియదు. ఆ టైం కి మనం విదేశాల్లో ఉన్నామనుకో ఎటూ వెళ్ళలేం! ఇక్కడే ఉన్నానని తెలుసుకుని మరీ పిలిచారు. వెళ్ళకపోవటానికి నా దగ్గర పెద్దగా చెప్పటానికి సాకులు కూడా ఏం లేవు...ఒక్క చలికాలం రాత్రిపూట అన్నమాట తప్ప! అందుకే ఆయన చేసిన ప్రయత్నాన్ని గౌరవించాలనే  ఉద్దేశ్యంతోనే బయలుదేరాను."


"మనుషుల మధ్యలో అనుబంధాలు సన్నగిల్లిపోతున్న ఈ రోజుల్లో, మనకి ఎదురయ్యే కొన్ని ఇలాంటి ప్రయత్నాలు మనకి తెలియకుండా ఏవో సూచనలు చేస్తాయి" అన్నది కారులో కూతురితో వైష్ణవి. 


"నీదంతా చాదస్తం మమ్మీ! ఎప్పుడో కలిసి పని చేసిన వ్యక్తి, మళ్ళీ జీవితంలో ఇంకోసారి నీకు కలుస్తారన్న నమ్మకం కూడా లేనప్పుడు ఈ బంధాలని మళ్ళీ తిరగతోడటంలో అర్ధం ఏమున్నది" అన్నది. 


ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే, పెళ్ళి హాల్ వచ్చేసింది. 


"హమ్మయ్యా ఈ జిపిఎస్ ల పుణ్యమా అని ఎక్కువ వెతుక్కోకుండానే ఎడ్రెస్ దొరికింది" అనుకుంటూ లోపలికి దారి తీసింది వైష్ణవి. 


శర్మ గారి బంధువులు తప్ప ఆఫీస్ కొలీగ్స్ ఎవరూ ఇంకా వచ్చినట్టు లేదు. మొహాలు గుర్తు పట్టటానికి ప్రయత్నిస్తూ లోపలికి నడిచింది. 


ఒక పెద్దావిడ భర్తతో సహా సోఫాలో కూర్చుని ఉన్నది. వైష్ణవిని చూస్తూనే, "బావున్నావుటే ? నీకు వీళ్ళు ఎలా పరిచయం? ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి? అచ్ఛం మీ అమ్మ లాగే ఉన్నావు! దా కూర్చో" అంటూ తను జరిగి పక్కన చోటు చూపించి చేతిలో వైష్ణవి చెయ్యి గట్టిగా పట్టుకుని కంటి నిండా నీళ్ళతో పై నించి కిందికి ఆప్యాయంగా ఒళ్ళంతా తడుముతున్నట్టు చూసింది. 


"నేను, శర్మ గారు కలిసి పని చేశాం అత్తయ్యా! అవును ఇప్పుడు నిన్ను చూస్తే గుర్తొస్తున్నది...ఆయన మీ చుట్టమని నాకు అప్పట్లో ఆఫీసులో చెబుతూ ఉండేవారు.  నాకు కూడా నిన్ను చూస్తే భలే సంతోషంగా ఉందత్తయ్యా! నీకు ఒంట్లో ఎట్లా ఉంటున్నది"...లాంటి కుశల ప్రశ్నలు వేస్తూ..పరిసరాలనీ,  తనని తానూ మర్చిపోయి కబుర్లల్లో పడింది వైష్ణవి. 


"మా చిన్నప్పుడు నువ్వూ..అమ్మా కబుర్లు చెప్పుకుంటూ మాకు బోలెడు పనులు నేర్పారు. నువ్వు సరదాగా అప్పుడు అనే దానివి గుర్తుందా అత్తయ్యా...గృహ ప్రవేశ ముహూర్తం పెట్టించుకు రమ్మంటే, మా ఆయన సత్రం ముహూర్తం పెట్టించుకొచ్చాడే ..వచ్చి పోయే వాళ్ళకి వండి వార్చలేక చస్తున్నానని! ఆ జోకులు ఇప్పుడు కూడా మేము పిల్లలతో చెప్పి నవ్వుకుంటూ ఉంటాం" అన్నది వైష్ణవి. 


"అవునే మీ అమ్మ వెళ్ళిపోయి, నన్ను ఒంటరిదాన్ని చేసింది. దానికేం హాయిగా పువ్వల్లే వెళ్ళిపోయింది. అది వెళ్ళి పోయే ముందు రోజు 'దొడ్లో పూశాయి' అని బుట్టెడు మల్లె పువ్వులు పట్టుకొచ్చి నా ముందు పోసి మాల కడుతూ కూర్చుంది. మా అందరికీ తల్లో పెట్టి మురిసిపోయింది. మల్లె పువ్వులు చూస్తే మీ అమ్మే నా కళ్ళల్లో మెదులుతుంది. ఇన్నేళ్ళయినా అసలు మీ అమ్మ మరుపుకే రావట్లేదు" అని జ్ఞాపకాలలో ముంచి తేల్చి వైష్ణవిని వేరే లోకంలోకి తీసుకెళ్ళింది.  అమ్మ స్మృతులతో వైష్ణవి కళ్ళు అశ్రు పూరితాలయ్యాయి. వైష్ణవి ఒళ్ళంతా తడుముతూ 'ఒక్క హగ్ ఇవ్వవే! మీ అమ్మని హగ్ చేసుకున్నట్టుంటుంది' అని ఆవిడ చూపించే ప్రేమానురాగాల్లో తడిసి ముద్ద అయింది వైష్ణవి. 


"అమ్మా....ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోని నాకే అమ్ముమ్మ కూతురిగా నీ పట్ల ఆవిడ చూపించిన ఆప్యాయత, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ గెశ్చర్స్ అపురూపంగా అనిపించాయి" అన్నది ప్రియ అమ్మ మొహంలో కనిపిస్తున్న కొత్త వెలుగుని కన్నార్పకుండా చూస్తూ! 


ఇంతలో పెళ్ళి పెద్ద శర్మ గారు ..."మేడం బయలుదేరారా? ఎక్కడున్నారు? ఎడ్రెస్ తెలుసుకోవటం కష్టం అయిందా....కనుక్కుందామని ఫోన్ చేస్తున్నాను" అన్నారు. 


"వచ్చేశానండి, ఇదిగో మీ పిన్ని గారితో మాట్లాడుతున్నాను" అన్న వైష్ణవి మాటతో, "వచ్చేశారా...అబ్బ నాకెంత సంతోషంగా ఉందో" అంటూ తన వాళ్ళందరిని పిలిచి వైష్ణవి పట్ల ఆయనకున్న ప్రత్యేక అభిమానాన్ని మాటలనిండా వ్యక్తపరిచారు. 


మర్యాద లోపం అవుతుందేమో అని అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్న శర్మ గారిని చూసి "మమ్మీ నీ రాకని ఆయనెంతగా కోరుకున్నారో తెలుస్తున్నది" అన్నది ప్రియ. 


పరిచయ వాక్యాలయ్యాక, డైనింగ్ హాల్లోకి తీసుకెళ్ళి వంటల పెద్దతో "వీరు మాకు బాగా కావలసిన వారు. దగ్గరుండి జాగ్రత్తగా భోజనం పెట్టండి. నేను అవతల రిసెప్షన్ సంగతి చూడాలి" అని మళ్ళీ హడావుడిగా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తే ఆలస్యం అవుతుందని, రెండు మెట్లు ఒక సారి చొప్పున రెండంతస్తుల మెట్లన్నీ  నిముషంలో ఎక్కేసి వెళ్ళిపోయారు. 


ఇక శర్మ గారి తమ్ముళ్ళు, మేనల్లుళ్ళూ..ఒకరేమిటి అందరు నోరారా ఆప్యాయంగా మాట్లాడుతూ..రాత్రి ముహూర్తం దాకా ఉండండి అని చెప్పి చెప్పి వెళ్ళారు. 


ఇంతలో "మీరు వైష్ణవి కదూ...చిన్నప్పుడు మన అమ్ముమ్మగారి ఊరు దంతలూరులో వేసవి సెలవుల్లో కలిసి ఆడుకునే వారం... నేను రామూని అని ఒకరు, నేను అమ్మన్నని అని ఒకరు, నేను వల్లిని" అని ఒకరు వైష్ణవిని చుట్టు ముట్టారు. 


"మీరంతా ఈ పెళ్ళికి వస్తారని నాకు తెలియదు. మీకు శర్మగారు చుట్టమా? మా అమ్మ బాల్య  స్నేహితురాలు కూడా కలిశారు. ఆవిడ ఆయనకి బంధువని అప్పట్లో చెబుతూ ఉండేవారు. కానీ ఆయనతో మీ బంధుత్వం నాకు తెలియదు" అని ఇక వారితో చిన్నప్పుడు ఆడిన కుంటి ఆట, మా తాత ఉత్తరం, దాగుడు మూతలాట, కళ్ళకి గంతలు కట్టుకుని 'వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి ' ఆట....ఇలా ఒకటేమిటి... ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఒకరిని మించి ఒకరు మరో లోకంలోకి వెళ్ళిపోయి అందరూ ఇంచు మించు ఆ వయసులోకి  వెళ్ళిపోయి చుట్టు పరిసరాలని మర్చిపోయి హాయిగా నవ్వుతూ మాట్లాడుకోవటం చూసిన ప్రియకి ఆ దృశ్యం ఎంతో అపురూపంగా అనిపించింది. 


"ఎప్పుడూ సీరియస్ గా, ఏదో పోగొట్టుకున్నట్టు  ఉండే మమ్మీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నది. నిజమే మమ్మీ చెప్పినట్టు తిండి, బట్ట మాత్రమే కాదు. మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేవి, నిలబెట్టేవి చిన్నప్పటి జ్ఞాపకాలు, అయిన వారితో కాలం గడపటం! తమ పరుగుల జీవితంలో ఇలాంటివి ముఖ్యమని ఆలోచించే స్థితిలో లేము" అనుకుంది ప్రియ. 


"నిజమే ఈ తరం యాంత్రికంగా, చదువే లోకంగా బతికేస్తున్నాం. మాకు ఇంత మంచి జ్ఞాపకాలు లేవు. ఇన్నేళ్ళయినా ఏ భేషజాలు లేకుండా నిర్మలమైన మనసుతో వాళ్ళు ఎంతా హాయిగా బాల్యాన్ని నెమరేసుకుంటున్నారో. అనుకోకుండా మిత్రులని కలిసిన అమ్మ మొహంలో ఈ ఆనందం, తృప్తి ఏమిచ్చి తీసికురాగలను. నిజంగా రాకపోయి ఉంటే ఇవన్నీ మిస్సయ్యేదాన్ని." అనుకుంటున్న ప్రియతో...


"ఇక బయలుదేరుదామా? బాగా పొద్దుపోయింది. మనం ఇంటికి చేరేసరికి పదకొండు అవుతుంది. మళ్ళీ డ్రైవర్ గొడవ చేస్తాడు" అన్నది వైష్ణవి. 


"ఫరవాలేదులే మమ్మీ, నేను అతనికి ఎక్స్ట్రా డబ్బు ఇస్తాను. నీ ఫ్రెండ్స్ తో ఇంకొంచెం సేపు గడపాలంటే ఉందాం" అన్నది. 


"వచ్చే నెల మా బాల్య స్నేహితురాలి కొడుకు పెళ్ళి ఉన్నదిట. అప్పుడు కలుద్దామనుకున్నాం. అందరూ ఈ ఊళ్ళోనే ఉంటున్నారుట. ఇక ముందు తరుచు కలుసుకోవచ్చు, ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. ఇలా రాబట్టి అందరూ ఎక్కడెక్కడున్నారో తెలిసింది."


"అసలు అప్పట్లో  పెద్దయ్యాక మనం ఏమౌతామో, ఎక్కడుంటామో, ఎవరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఏమీ తెలియదు. అయినా తాము అలా ఎప్పటికీ కలిసే ఆడుకుంటామని, జీవితమంతా అలా మనం కోరుకున్నట్టే ఉంటుందని అనుకుంటాము. అదే అప్పటి అందమైన అమాయకత్వం!"


"ఎవరి జీవితంలో అయినా నిష్కల్మషమైన బాల్యంలో ఆడుకున్న మిత్రుల విలువే వేరు. స్కూల్లో, పెద్దయ్యాక కాలేజిల్లో కలిసి చదువుకున్న క్లాస్ మేట్స్ వేరు. మనం పెద్ద వాళ్ళమయ్యాక వీరిలో ఎవరు కలిసినా ఆనందమే కానీ...అమ్ముమ్మ గారి ఊళ్ళొ వేసవి సెలవుల్లో కలిసి ఆడుకున్న మిత్రులు...వారి విలువ వేరు. అది అమూల్యం" అన్నది వైష్ణవి కారులో చేరగిలపడుతూ! 


"అవును మమ్మీ నాకు కూడా వాస్తవం ఇప్పుడే కళ్ళకి కట్టినట్టు తెలిసింది. ఇలా ఎవరైనా నీ పాత కొలీగ్స్, మిత్రులు ఆహ్వానిస్తే అవకాశాన్ని బట్టి తప్పకుండా నేను నీతో వస్తాను" అన్నది ప్రియ మనస్ఫూర్తిగా!

Thursday, November 25, 2021

Breaking news

 #ఫ్లాష్.. #ఫ్లాష్... #ఫ్లాష్...(Breaking news) ఖమ్మంలో ఫేస్‌బుక్‌ స్నేహం పేరుతో మరో భారీ దారుణ మోసం


తానో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ను అని నమ్మించింది. మొదట స్నేహం అన్నది. తర్వాత ప్రేమ అన్నది. నెమ్మదిగా పరిచయం పెంచుకున్నది


అబ్బాయి వివరాలు, కుటుంబ నేపథ్యం తెలుసుకున్నది

తేనే పూసిన కత్తిలా తీయని మాయ మాటలు చెప్పి అతని చిరునామా తెలుసుకున్నది.

బయట కలవటం నాకిష్టం ఉండదు..కాబట్టి

ఇంటికి వచ్చి కలుస్తాను అని మర్యాదస్తురాలిగా మాట్లాడింది.


ఒకరోజు మిట్ట మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని ఇంటికి వచ్చింది

ఎవరూ లేరని రారని నిర్థారించుకుంది

నెమ్మదిగా తీయని మాటల్లో దించింది.


అప్పటికే హ్యాండ్ బ్యాగ్లో సిద్ధం చేసుకున్న మత్తుమందు కలిపిన చాక్లెట్‌ తీసి తనకు ఇచ్చింది అది తిన్న ఆ యువకుడు నెమ్మదిగా సోఫాలో మాట్లాడుతూ మగతగా తలవాల్చేసాడు..!


వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వంట గదివైపు వెళ్ళి ఫ్రిజ్ డోర్ తీసి తనతో తెచ్చుకున్న కవరు నిండా టమాటాలు  నింపుకుని 

వడివడిగా ఇంటి వరండా లోకి వెళ్ళి పారిపోయింది..!

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE