Tuesday, March 30, 2021
కోవిషీల్డ్ కోవాక్సిన్ లలో ఏది ఉత్తమమైనది....?
Monday, March 29, 2021
నమ్మకం-అహంకారం
నమ్మకం-అహంకారం
ఈలోకంలో మనకు నిజమైన ' *యజమాని* ' ఎవరు.??
ఒక ఆవు ఒకరోజు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది.
ఇంతలో ఒక పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం ఆ ఆవు చూసింది. పులి నుంచి తప్పించుచుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి, పారిపోతోంది, పులి కూడా అంతే వేగంగా అవుని వెంబడిస్తోంది. చివరికి అవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది, పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు చెరువులోకి దూకేసింది, పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనుకే ఆ చెరువులోకి దూకేసింది.
దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ చాలా లోతైన బురద ఉంది అందులో ఆవు పీకివరకూ కూరుకుపోయింది.
అవుని వెంబడిస్తూ వచ్చిన ఆ పులి కూడా ఆ బురదలో చిక్కుకుని పీకల్లోతు లో మునిగి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. ఇక అంతకుమించి ముందుకి వెళితే ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది.
ఈ స్థితిలో ఉన్న ఆ "ఆవు-పులీ" రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి.
కొద్దిసేపయ్యాక, ఆవు పులితో ఇలా అంది,
" నీకెవరైన యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?? అని అడిగింది ". దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది,
నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా..
అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయి కదా.., అంది.
అప్పుడు ఆ పులి, ఆవు తో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?? అంది.
అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది,
"చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైన వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు." మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు .?? అంది.
ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే ఆ అవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి ఆ అవుని బయటకు లాగి, తన ఇంటికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. కావాలంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.
ఈ కథలో...
*ఆవు* - సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo.
*పులి* - అహంకారం నిండిఉన్న మనస్సు.
*యజమాని* - సద్గురువు/పరమాత్మ.
*బురదగుంట* - ఈ సంసారం/ప్రపంచం
మరియు,
*ఆ ఆవు-పులి యొక్క సంఘర్షణ* : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడమo కోసం చేసే జీవన పోరాటం.
*నీతి :*
ఎవరిమీదా ఆధార పడకుండా జీచించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ,
" నేనే అంతా, నా వలనే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలుగరాదు.
దీనినే ' *అహంకారము* ' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.
ఈ జగత్తులో *'సద్గురువు'*(పరమాత్మ)ను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఎవరుంటారు.?? ఉండరు.
ఎందుకంటే.?? వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.
పరమాత్మా నీవే ఉన్నావు...!
అంతా నీ ఇష్టప్రకారమే జరుగనీ..!!
కాళిదాసు-అనుభవాలు 1
కాళిదాసు-అనుభవాలు 1
మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు.దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె దగ్గరకు వెళ్ళి"దాహంగా ఉంది,నీళ్లు ఇవ్వండి"అని అడుగుతాడు....
గుడిస లోపల నుండి ఓ ముసలావిడ బయటకు వచ్చి ‘మీరెవరు?ఎక్కడనుండి వస్తున్నారు?'అంటుంది....
కాళిదాసు"నేను ఎవరో తెలియకపోవడం ఏంటి?నేను ఓ పెద్ద పండితుడను.ఎవరిని అడిగినా చెబుతారు"అని అంటాడు....
ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి..'మీరు అసత్యమాడుతున్నారు.మీరంత గొప్పవారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులెవరో చెప్పండి’అంటుంది....
కాళిదాసు కాసేపు ఆలోచించి"నాకు తెలియదు.గొంతు ఎండి పోతుంది,ముందు నీళ్లు ఇవ్వండి"అని బతిమాలుకుంటాడు...
"ఆ ఇద్దరు బలవంతులు ఆకలి, దాహం.ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?"అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....
ఈసారి ‘నేను బాటసారి’ని అంటాడు కాళిదాసు....
అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరూ అంటూ ప్రశ్నిస్తుంది ముసలావిడ....
తెల్ల ముఖం పెట్టి మాతా!"నీళ్ళు ఇవ్వండి.లేకుంటే దాహంతో చనిపోయేలా ఉన్నాను" అంటూ ప్రాదేయపడతాడు కాళీదాసు....
వాళ్ళు సూర్యచంద్రులు’అని తెలిపి"మరి మీరెవరో సెలవివ్వండి.నీళ్లిస్తాను" అంటుంది ముసలావిడ....
కాళిదాసు దీనంగా"నేను అతిథిని"అని బదులిస్తాడు....
"మీరు మళ్ళీ అసత్యం చెబుతున్నారు.ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే.ఒకటి ధనం, రెండోది యవ్వనం.అవి ఎప్పుడు వస్తాయో పోతాయో ఎవరికీ తెలియదు"అంటుంది ముసలావిడ....
కాళిదాసు"నా సహన పరీక్ష తరువాత చేద్దురు.ముందు నీళ్లు ఇవ్వండి"అని వేడుకుంటాడు....
"ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు.వారెవరో శెలవివ్వ గలరా" అంటూ...బిక్కమొహం వేసిన కాళీదాసుతో"ఒకటి భూమి,రెండోది వృక్షం"అని భోద పరచి"ఇప్పుడు నిజం చెప్పండి మీరెవరు?"అని మళ్ళీ అడుగుతుంది ముసలావిడ....
ఓపిక నశించిన కాళిదాసు"నేను మూర్ఖుడను.ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లివ్వండి"అని సాగిల పడతాడు....
ఆ అవ్వ నవ్వుతూ"ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు"అని అంటుంది....
ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది.ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు....
ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది.‘నాయనా! విద్యతో వినయం వృద్ధి చెందాలి,అహంకారం కాదు.కీర్తి,ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరి చేయటానికే ఈ పరీక్ష’ అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది.
*విద్య, అధికారం, ధన బలము తో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి*.🙏
Saturday, March 27, 2021
గోదారోళ్ళ కితకితలు
😃😜గోదారోళ్ళ కితకితలు😃😜
ఇందాక కాతంత పనుండి రాజమండ్రెల్లాక...
మా పెద్దమ్మ పోనుచేసిందండే....!!!
ఒరే...బుజ్జే ఎక్కడున్నావురా?
నేను రాజమండ్రీలో వున్నాను పెద్దమ్మా !
వచ్చీదప్పుడు హార్లిక్సుపొట్లవోటి అట్టుకురామ్మా!!!
అలాగే...నాకో గంటడద్ది...వచ్చీదప్పుడు తెత్తానులే..!!
షాపులోకెల్లి హార్లిక్సు పేకెట్టిమంటే...
మదర్ హార్లిక్సోటే వుందండి...ఇమ్మంటారా?
మా మదరికి కాదండి..మాపెద్దమ్మకి..
పెద్దమ్మ హార్లిక్సివ్వండి..!
పెద్దమ్మ హార్లిక్సులు...పిన్ని హార్లిక్సులు..ఆంటి హార్లిక్సులు వుండవండి..కావల్తే ఇదట్టుకెల్లండన్నాడండే...
తీసుకుని ఇంటికొచ్చేక డౌటొచ్చిందండే!!!
మదరార్లిక్సు పెద్దమ్మకిత్తే సరిగ్గా పంజెయ్యదేమో అని!!!
కానీ మనవేమన్నా తెలివితక్కువోల్లమేటండే!!!
ఎమ్మటనే మాపెద్దమ్మ కొడుక్కి పోన్చేసిరమ్మని...
ఒరే అన్నయ్య ఇది అమ్మకిచ్చేయరా!!
అలాగే వచ్చేవుకదా!!!నువ్వే ఇచ్చేయొచ్చుకదా!!!
నేనివ్వటానికి ఇదేవన్నా పెద్దమ్మ హార్లిక్సేటి?
ఇది మదరు హార్లిక్సు నువ్వేఇవ్వాలి...
అనగానే..
ఇంకా చాలా.... తిట్టేసేడండి...
ఎందుకంటారు?????
సేకరణ: పసుపులేటి నరేంద్రస్వామి
బోను వచ్చినా ఎలుక చావలేదు కానీ.
బోను వచ్చినా ఎలుక చావలేదు కానీ....
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
పసుపులేటి నరేంద్రస్వామి
9848696955
అనగనగా ఒక 🌾రైతు.
ఇంట్లో 🐭ఎలుకల బాధ భరించలేక ఆదివారం సంతకు వెళ్లి 🥅ఎలుకల బోను తెచ్చాడు.
అప్పుడే కన్నంలో నుంచి తలబయట పెట్టిన 🐭చిట్టెలుకకు ఆ బోనును చూడగానే ముచ్చెమటలు పట్టాయి.
వెంటనే రివ్వున 🌾పొలం వెళ్లి తను చూసిన విషయాన్ని తోటివారికి చెప్పాలనుకుంది.
‘రైతు సామాన్యుడు కాడు. మనల్ని పట్టుకోవడానికి 🥅బోను కొనుక్కుని వచ్చాడు. జాగ్రత్త జాగ్రత్త’ అని గట్టిగా అరిచింది.
🐭ఎలుక హడావిడి చూసి 🐓కోడిపుంజుకు చిర్రెత్తుకువచ్చింది.
‘అయితే ఏమిటట?
🥅బోను తెస్తే భయపడాల్సింది నువ్వు. మాకెందుకు భయం?’ అంటూ కొక్కొరోకో అనబోయి ఇంకా తెల్లవారలేదన్న సంగతి గుర్తుకొచ్చి ఊరుకుంది. ఇంత పెద్ద కబురు తెస్తే 🐓కోడిపుంజు అలా గాలి తీసినట్టు తేలిగ్గా తీసిపారేయటం చూసి 🐭చిట్టెలుక చిన్నబుచ్చుకుంది.
పక్కనే పడుకున్న 🐖పంది దగ్గరకు వెళ్లి తన కడుపులోమాట చెప్పి బావురుమంది. 🐖పంది 🐭ఎలుకను ఓదార్చింది. 🥅బోను గురించి భయపడాల్సిన పని తనకు లేదని అంటూ 🐭ఎలుక క్షేమం కోసం ప్రార్ధనలు చేస్తానని హామీ ఇచ్చింది.
🐭ఎలుక అంతటితో వూరుకోకుండా దోవలో కనబడ్డ 🐐మేకకు 🥅బోను విషయం చెప్పి ‘అందరం కలసి ఏదో చెయ్యకపోతే అందరికీ మూడుతుందని’ హెచ్చరించింది.
🐐మేక దానికి సమాధానంగా ‘ఓసి పిచ్చిమొద్దూ . 👨🏻🌾రైతు 🥅ఎలుక బోను తెచ్చాడని నేనెందుకూ కంగారు పడాలి అందులో నా కాలు కూడా పట్టదు’ అని ఎగతాళి చేసింది.
ఇక ఎలుకకు ఏమి చేయాలో తెలియక 🎪ఇంటి దారిపట్టింది.
ఆ రాత్రి 👨🏻🌾రైతు ఇంట్లో పెద్ద శబ్దం వినిపించింది. 🥅ఎలుకల బోను హటాత్తుగా మూసుకోవడంతో వచ్చిన చప్పుడు అది. రైతు 👩🏻🌾భార్య లేచి 🥅బోను వద్దకు వెళ్ళింది. చీకట్లో అందులో ఏదో చిక్కుకున్న సంగతి లీలగా బోధపడింది. తీరా చూస్తే అది ఒక 🐍విష సర్పం. దాని కాటుకు రైతు భార్య స్పృహ కోల్పోయింది. వెంటనే వూళ్ళో 🧑🏻⚕️వైద్యుడిని పిలుచుకు వచ్చారు. అతడేదో మందువేసి నీరసంగా వున్న రైతు 👩🏻🌾భార్యకు ఏదయినా బలవర్ధక ఆహారం పెట్టమని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు.
రైతుకు 🌾పొలంలో వున్న 🐓కోడిపుంజు గుర్తుకు వచ్చి దానిని కోసి భార్యకు ఆహారంగా ఇచ్చాడు.
విషయం తెలుసుకున్న ఇరుగూ పొరుగూ చూడడానికి వచ్చారు. వారిలో కొందరు ఆమెను కనిపెట్టుకు చూడడానికి అక్కడే వుండిపోయారు. వారికోసం రైతు 🐖పందిని కోసి వండక తప్పలేదు.
కానీ, దురదృష్టం. 🧑🏻⚕️వైద్యుడు ఇచ్చిన 💊ఔషధం కన్నా విషం బాగా పని చేసి రైతు 👩🏻🌾భార్య ఆ మరునాడు కన్నుమూసింది.
ఆమె కర్మకాండకు ఎంతో దూరం నుంచి చుట్టపక్కాలు వచ్చారు. వారికి వొండి పెట్టడానికి రైతు👨🏻🌾 మేకను🐐 కోయాల్సివచ్చింది.
ఈ పరిణామాలన్నింటినీ 🐭ఎలుక తన కలుగులోనుంచి గమనిస్తూ తన తోటివారు ఒక్కొక్కరే కనుమరుగు కావడం చూసి ఎంతో బాధపడింది.
_ఒక విదేశీ జానపద కథాంశం ఆధారం అయిన ఈ 🐭చిట్టెలుక కథలో నీతి ఏమిటంటే_
*‘ఎవరయినా ఏదయినా సమస్యలో చిక్కుకుని మన వద్దకు వచ్చినప్పుడు ఆ సమస్య మనది కాదని తప్పుకోవడం మంచిది కాదు. సంఘ జీవనంలో వున్నప్పుడు అందరి సమస్యలు అందరివీ అనుకోవాలి.’*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
పసుపులేటి నరేంద్రస్వామి
9848696955
పదిలం పాత తరం
పదిలం పాత తరం
రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు అవ్వబోతోంది.
అవును ఇది ఒక చేదు నిజం ।
ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.
రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !
ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !
నడక అలవాటు ఉన్నవాళ్ళు!
మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు
ఉదయమే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !
ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!
మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!
పూజకు పూలు కోసే వాళ్ళు !
పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !
మడిగా వంట వండేవాళ్ళు !
దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!
దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !
దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!
మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!
అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు!
కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !
స్నేహంగా మెలిగే వాళ్ళు!
తోచిన సాయం చేసేవాళ్ళు !
చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !
ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !
ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !
పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు!
ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు!
పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!
కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !
సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !
పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు !
తీర్థయాత్రలు చేసేవాళ్ళు !
ఆచారాలు పాటించే వాళ్ళు !
తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !
పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !
.
చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !
లుంగీలు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు !
చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!
అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు !
వాళ్ళు ....
తలకు నూనె రాసుకునే వాళ్ళు !
జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !
కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !
చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !
ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషుల తో స్నేహంగా గడిపిన తరం.....
.
ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు
మీకు తెలుసా ?
వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.
మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.
మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి
.లేదంటే .....
.లేదంటే .....
.లేదంటే .....
ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.
.వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వం తో,స్నేహం తో కూడి ఉండే తరం...
సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!
స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !
కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!
ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగిన తరం
ద్వేషం, మోసం లేని స్నేహ జీవనం గడిపిన తరం అది!
సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అదే
లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !
ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!😊
తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం
.
వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది
మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .
సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి..
*సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని మార్చేయ్యకండి !!!*
తప్పులను సరిదిద్దగలది సంస్కారమే
సర్కారు చేసే చట్టాలు కాదు....🙏
*రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను,స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు..🤔*
.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Saturday, February 20, 2021
ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు
ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Pasupuleti Narendra swamy
1. ఒక రోజు సమయం లో నీకోసం కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
.
2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
.
3. ప్రతి రోజూ చేసి వ్యాయామం నీ ఒత్తిడి రసాయనాలను తగ్గించ గలదని గుర్తించుకో !
.
4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో !
.
5. కక్ష కన్నా క్షమ గొప్పది అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
.
6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకో !
.
7. నవ్వు , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
.
8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ఉండడం సాధన చెయ్యి
9. నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! చేరలేని గమ్యాలను నిర్దారించుకోకు !
.
10. పాజిటివ్ గా ఆలోచించు . నీ బాహ్యస్వరూపం బట్టి నిన్ను ఇతరులు అంచనా వేస్తారు . అందువలన నీ బాహ్యస్వరూపం విషయం లో జాగ్రత్త వహించు
.
11. *మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో*
.
12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు . కనీసం 10 శాతం పొడుపు చెయ్యి
.
13. ఒద్దు , లేదు అనే మాటలను చెప్పడం నేర్చుకో !
.
14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో !
.
15. *టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో* !
.
16. *పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో* !
.
17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాటాడు
.
18. బాగా నిద్రపో ! మంచి పక్క , దిండూ ఏర్పాటు చేసుకో ! గాలీ ధారాళంగా వచ్చేలా చూసుకో !
.
19. వారానికి ఒక్కసారి మస్సాజ్ చేసుకో ( తలంటి స్నానం చెయ్యి ) సినిమాకో , హోటల్ కో వెళ్ళు . రిలాక్స్ అవ్వడం నేర్చుకో !
20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
.
21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో !
.
22. నీ ఆందోళన వలన సమస్యలు త్వందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు అని గుర్తించుకో !
.
23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
.
24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని . నవ్వుతూ ఉండు . ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !
25. యోగా చెయ్యి . ప్రాణాయామం చెయ్యి . భగవంతునికి కృతజ్ఞతలు చెప్పు .
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️