NaReN

NaReN

Monday, May 26, 2025

తండ్రితో బ్యాంకులో

 తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి

కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.?

తండ్రి ఆన్సర్ హైలైట్.!



_కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో  వేచి ఉన్నాడు._

_తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు_


_“నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు?”_


_“ఎందుకు చేయించుకోవాలి” అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు._


_“ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు”._


_internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు._


_*తండ్రి :* “అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా?”_


_”ఆవును అవును”, అని కొడుకు జవాబిచ్చాడు._

_“ఇంకా,… ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన వస్తువులు…_

_ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి”, అంటూ వివరించే ప్రయత్నం చేశాడు._


_*అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుక్కు ఇంక మాటలే లేవ్ !!!*_


_“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను._

_ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను._


_నీకు తెలుసు నేను ఒంటరివాడిని._

_నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే._

_నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను._


_రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చాడు._

_నాకోసం బాధపడ్డాడు…, కన్నీళ్లు కార్చాడు.., నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు._


_కొన్ని రోజుల క్రితం…అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది._

_మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు._


_నువ్వన్నట్టు online లో shoppingలు అవీ చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా.?_

_పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా.??_

_కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా..???_


_ఒక computer లేదా mobile phoneతో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే... నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక electronic పరికరమా!!!_


_నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడటం నాకిష్టం._

_నువ్వనే ఆ amazon flipkartలో నాకు ఇవన్నీదొరుకుతాయా?_

_కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలూ బలపడతాయి._


_*టెక్నాలజీ ఉండాలి కానీ.,*_

_*అది మాత్రమే జీవితం కాకూడదు !*_

_*దానికి మనం బానిసలం కాకూడదు!*_


_*మనుషులతో జీవించండి…..*_

_*పరికరాలను వాడుకోండి…..*_


_*” ప్రేమించవలసిన మనుషులను వాడుకొని,*_

_*వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి “*_


*తెగిపోతున్న మానవ సంబంధాల గురించి ఒక్కసారైనా అలోచించండి*

ఈ కథ పై మీ స్పందనలు 9848696955 వాట్సాప్ లో పంచుకుంటే ఇక్కడ పోస్ట్ చేస్తాను

Saturday, May 24, 2025

చిన్న సాయం పెద్ద మార్పు

 చిన్న సాయం పెద్ద మార్పు


 

అది బెంగళూరుకు వెళ్తున్న రైలు. రద్దీగా ఉంది. సెకండ్ క్లాస్ బోగీలో టీసీ చెక్ చేస్తుండగా ఓ పదమూడేళ్ళమ్మాయి పట్టుబడింది. ఆ పిల్లను ఆనాల్సిన నాలుగు మాటలూ అని మరికాసేపట్లో వచ్చే స్టేషన్లో దిగిపొమ్మని కటువుగా చెప్పాడు టీసీ.

ఆ మాటలకు బిక్క మొహం వేసుకుందా పిల్ల.


ఇంతలో అదే బోగీలో ప్రయాణిస్తున్న సుధామూర్తి (ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తిగారి భార్య) ఈ సన్నివేశాన్ని చూశారు. ఆమె టీసీతో "అంతా చూస్తూనే ఉన్నానండి. ఉన్నట్టుండి ఇలా మధ్యలో ఆ పిల్లను దిగిపొమ్మంటే ఎలా చెప్పండి. ఈ రైలు ఎక్కడి వరకూ వెళ్తుందో అక్కడిదాకా ఈ పిల్లకు టిక్కెట్ ఇవ్వండి. జరిమానాతోపాటు డబ్బు

నేనిస్తాను" అన్నారు. 


"వద్దండి. ఇలాంటి వాళ్ళకు సాయం చేయకండి. ఇలా మీరు చేశారని తెలిస్తే మరొకరిలా టిక్కెట్ లేకుండా ఎక్కుతారండి. ఇలాంటి వాళ్ళ పట్ల జాలి , దయా వంటివి చూపకూడదు" అని టీసీ గట్టిగా అంటున్నాడు.


అయినా ఆమె అవన్నీ పట్టించుకోకుండా ఆ అమ్మాయికి టిక్కెట్ తీసిచ్చారు.


ఆ తర్వాత సుధామూర్తి ఆ పిల్లను చేరదీసి ఆడిగారు ఎక్కడి నుంచి వస్తున్నావని. ఎవరూ ఏమిటి అనే వివరాలు అడిగారు.


ఆ అమ్మాయి చెప్పడం మొదలు పెట్టింది. 


ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. ఆమె తండ్రి తన తల్లి చనిపోవడంతో మరో పెళ్ళి చేసుకున్నాడు. ఆయన కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. తండ్రి ఉన్నంత కాలం సవతి తల్లి ఈ అమ్మాయిని బాగానే చూసుకుంది. తండ్రి పోయిన తర్వాత ఆ సవతితల్లి నానా మాటలు అనడం, కొట్టడం చేస్తోంది. దాంతో ఆ నరకయాతన భరించలేక ఈ అమ్మాయి పారిపోయి ఈ రైలెక్కింది. లక్ష్యం లేని దారీ తెన్నూ తెలియని జీవన ప్రయాణం ఆమెది. 


సుధామూర్తి ఆమె చెప్పిందంతా విన్నాది. 


బెంగుళూరూ స్టేషన్లో రైలు ఆగింది. 


ప్రయాణికులు దిగిపోతున్నారు. సుధామూర్తి కూడా దిగిపోయారు. ఆమెకోసం కారు ఆగి ఉంది. ఆ కారులో ఎక్కబోతున్న సుధామూర్తి కళ్ళు ఆ అమ్మాయికోసం చూశాయి. ఆ పిల్ల అక్కడే ఓ మూల నిల్చునుంది. ఆమె దగ్గర ఏమీ లేదు. కట్టుబట్టలతో వచ్చిన పిల్ల. 


సుధామూర్తి దగ్గరకెళ్ళి ఆ పిల్లను చేయి పట్టుకుని తనతో కారులో ఎక్కించుకున్నారు.


దార్లో తన మిత్రుడు నడుపుతున్న అనాథాశ్రమానికి కారును మళ్ళించింది. అక్కడ మిత్రుడితో ఆమ్మాయి విషయం చెప్పారు సుధామూర్తి. 

ఆ తర్వాత ఆమె మిత్రుడికి థాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు.


ఆ మిత్రుడు ఆ అమ్మాయిని తన హోమ్ లో చేర్చుకున్నాడు. అమ్మాయికి చదివించారు. ఆమెకు ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం వస్తుంది. కంపెనీ వాళ్ళే ఆ పిల్లను అమెరికా పంపించారు. ఈ కాలమంతా గిర్రున తిరిగింది.


అమెరికాలో ఉన్న కన్నడం వాళ్ళు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుధామూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆమె ఆ కార్యక్రమం కోసం అమెరికా వెళ్ళారు. అక్కడ ఒక అమ్మాయి దగ్గరుండి సుధామూర్తికి అవసరమైన ఏర్పాట్లన్నీ చూసారు. అంతేకాదు ఆఖరిరోజు సుధామూర్తి లాడ్జింగుకి కట్టాల్సిన బిల్లు కోసం కౌంటర్ కి వెళ్ళారు. అయితే కౌంటర్లోని వారు "వద్దండి. మీ బిల్లంతా ఓ అమ్మాయి కట్టాశారండి" అన్నారు.


"ఎవరా అమ్మాయి? చెప్పగలరా? " అని సుధామూర్తి అడగ్గా ఓ రెండు మూడు అడుగులు వెనకే ఉన్న అమ్మాయిని చూపించారు.


"మీరెందుకమ్మా నా ఖర్చుకి pay చేశారు" అని అడగ్గా ఆ అమ్మాయి ఒక్కసారి రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి దొరికిపోయిన దగ్గర్నించి ఇప్పుడు బిల్లు పే చెయ్యడం దాకా తన జీవితంలో జరిగిన సంఘటనలను చెప్తూ ఆ పిల్ల తానేనని అంది. 


"మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కనీసం నాకు ఈ ఒక్క చిన్ని అవకాశమైనా కలిగింది....మీ బిల్లు నేను pay చెయ్యడం చాలా చిన్నది. నావల్ల అయిందిదే" అంటూ ఆ పిల్ల సుధామూర్తి కాళ్ళకు దణ్ణం పెడుతుంది. 


ఆ పిల్లను చూసి సుధామూర్తి ఆశ్చర్యపోయారు. ఆమెను గట్టిగా హత్తుకున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ అప్రమేయంగా కన్నీళ్ళు కారాయి..

అందుకే సహాయం చెయ్యాలి.. ఒక వేళ వారు మోసం చేస్తే వాళ్ళు ఏనాటికైనా ఖర్మ అనుభవిస్తారు.. నిజంగా వారి అవసరత నిజమైతే ఒక జీవితమే మన వల్ల ఆనందిస్తుంది.



Monday, May 19, 2025

Zoom

 *సమస్త మండల విద్యాధికారులకు మరియు Course Incharge లకు తెలియజేయునది ఏమనగా, రేపు అనగా తేదీ 20.05.2025 రోజున జిల్లాస్థాయి మరియు మండల స్థాయిలో ఉపాధ్యాయులకు 5 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమవుతున్న సందర్భంగా గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి గారు ZOOM MEETING ద్వారా శిక్షణా కార్యక్రమాన్ని జిల్లాలో ఒకేసారి ఉదయం 9.00 గంటలకు ప్రారంభిస్తారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొనుటకుగాను జిల్లా, మండల స్థాయి శిక్షణ కేంద్రంలో IFP లలో ఉపాధ్యాయులందరూ వీక్షించుటకు /పాల్గొనుటకు అనుగుణంగా ఇంటర్నెట్,  వెబ్ కామ్ మరియు శిక్షణ నిర్వహణకు సంబంధించిన ఇతర  ఏర్పాట్లు పూర్తిచేసుకుని సిద్ధంగా ఉండగలరు.*


*క్రింది లింక్ ద్వారా IFP ప్యానెల్ లో జిల్లా స్థాయి ZOOM MEETING లో పాల్గొనగలరు.*



Click https://zoom.us/j/98301963009?pwd=UkkhCtahZbw3nyveirG9SkXaXDjkCV.1 to start or join a scheduled Zoom meeting.

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE