Wednesday, November 13, 2024
Sunday, November 10, 2024
ఓ మనిషి
*_ఓ మనిషి....?_*
_ఎక్కడ_నీ_బంధుగణం!?_
_ఎక్కడ_నీ_రక్తసంబంధం!?_
_ఎక్కడ_నీ_ఆత్మీయబృందం!?_
_ఎక్కడ_నీ_కులం!?_
_ఎక్కడ ..!?_
_పట్టు వస్త్రాలు పరుల పాలు_
_పట్టు పరుపులు చాకలి పాలు_
_ఆస్తి,పాస్తులు బిడ్డల పాలు_
_విర్రవీగిన దేహం మట్టిపాలు_
_మరి నీవేంటి..!?_
_గుక్కెడు తులసి జలం_
_నోట్లో గుప్పెడు బియ్యం_
_తలపై రూపాయి నాణెం_
_ఒంటిపై తెల్లని వస్త్రం_
_ఇవి కూడా బూడిద పాలే_
_వీటి కోసమా..!?_
_పగలు_ప్రతీకరాలు_
_మోసపు జీవితాలు_
_నాటకపు బ్రతుకులు_
_కుళ్ళు_కుతంత్రాలు_
_నయవంచనలు_
_నమ్మకద్రోహాలు_
_నీతోవచ్చేది_ఎవరు_వచ్చేదేంటి..!?_
_భార్య ఇంటి గుమ్మం వరకు_
_బిడ్డలు కట్టె కాలే వరకు_
_బంధువులు స్మశానం వరకు_
_కానీ నీ మంచితనం నీవు అస్తమించినా_
_ఉదయించే సూర్యునిలా రోజు ప్రకాశిస్తుంది._
_నీ_బ్రతుకు_ఎలా_ఉండాలంటే_
_నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మొక్కాలి.._
_నీ మరణం ఎలా ఉండాలంటే_
_దేహం_కాలిబూడిదైనా_
_నలుగురు_గొప్పగా_చెప్పుకునేలా_
_ఉండాలిజీవితం..//_
*_నీ చివరి మజిలీలో స్మశానం కూడా కన్నీరు పెట్టాలి...!_*
*_అలా బ్రతకాలి ఓ మనిషీ_*