NaReN

NaReN

Wednesday, July 24, 2024

Tuesday, July 23, 2024

Saturday, July 13, 2024

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?*

              ➖➖➖✍️

```

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకువస్తుంది. 


ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొనితీరాలంటూ పెద్దలు చెపుతూ ఉంటారు. 


ఎందుకంటే..

 

జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి.  


అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. 


ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. 


గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.

 

ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది.  


అలా బయటి వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.


ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, 

వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. 


వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

 

ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు పూలు, వేళ్లు, బెరడు , విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే !  గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే ! 


కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.

 

ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ ల మీద ఆధారపడుతూ ఉంటారు. 


గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే ‘లాసోన్‌’ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. 


కానీ చాలా రకాల కోన్ లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. 


కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.✍️```


    పిల్లలకు బతుకుతో పాటు

  మన పూర్వీకుల అలవాట్లను తెలియజేయండి మరియు పాటించేలా చూడండి.




Monday, July 8, 2024

మగవాళ్లు మొలతాడును ఎందుకు కట్టుకుంటారు?

 మగవాళ్లు మొలతాడును ఎందుకు కట్టుకుంటారు? కట్టుకోకపోతే ఏమౌతుందో తెలుసుకుందాం.




మనం ఎన్నో ఆచారాలను పాటిస్తూ వస్తున్నాం. అంటే పెళ్లి తర్వాత ఆడవాళ్ల చేతులకు గాజులుండాలి. మెట్టెలు ఉండాలి. నుదిటిన ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి.

మంగళవారం గోర్లను, వెంట్రుకలను కట్ చేయకూడదు అంటూ ఎన్నో నియమాలను పాటిస్తూ వస్తున్నాం. అలాగే మగవాళ్లు అన్నాక మొలతాడు ఖచ్చితంగా కట్టుకోవాలనే నియమం కూడా ఉంది. దీన్ని నేటికీ కూడా పాటిస్తూ వస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా మొలతాడును ఖచ్చితంగా కడతారు. 

పాత పడిన తర్వాత కొత్తది కట్టి పాతమొలతాడును తీసేస్తుంటారు. కానీ మొలతాడు లేకుండా మాత్రం ఉండరు. ఇలా ఉండకూడదని పెద్దలు చెప్పడం వినే ఉంటారు. అయితే ఒకప్పుడు అంటే బెల్టులు అందుబాటులో లేని కాలంలో పంచెలు, లుంగీలు, ప్యాంటులు జారిపోకుండా ఉండేందుకు వీటిని ఉపయోగించేవారు. అయితే వీటిని సపరేట్ గా వీటికోసమే ఉపయోగించేవారు కాదు. మొలతాడుకు ఇలా కూడా ఉపయోగించేవారు. 

జ్యోతిష్యం ప్రకారం.. మొలతాడు లేకుండా ఉండటం అంటే చనిపోవడమనే అర్థం వస్తుంది. పెద్దల ప్రకారం.. చనిపోయినప్పుడు మాత్రమే మొలతాడును తీసేస్తారు. అందుకే మొలతాడును ఎప్పుడూ నడుముకు ఉండేలా చూస్తారు. అలాగే ఎనకటి కాలంలో డాక్టర్లు, హాస్పటల్స్ ఎక్కువగా ఉండేవి కావు. కాబట్టి పాము కరిస్తే మొలతాడును తెంపి పాము కుట్టిన దగ్గర కట్టి విషయాన్ని తీసేసేవారని కూడా పెద్దలు చెప్తుంటారు. 

బ్లాక్ లేదా ఎర్రని మొలతాడును ఎక్కువగా కట్టుకుంటుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మొలతాడు మగవారికి దిష్టి తగలకుండా కాపాడుతుంది. ఇది చెడు కంటి నుంచి రక్షిస్తుందని చెప్తారు. అందుకే మొలతాడును ఎప్పటి నుంచో కట్టుకునే ఆచారం మొదలైంది. అది నేటికీ కూడా కొనసాగుతూ వస్తోంది. ఏదేమైనా మొలతాడును మగవారు మాత్రమే కట్టుకుంటారు. కానీ దీన్ని ఆడవాళ్లు కూడా కట్టుకోవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

ప్రస్తుత కాలంలో చాలా మంది చేతికి లేదా కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు. ఎందుకందే ఇది కూడా దిష్టి తగలకుండా కాపాడుతుంది. నల్లదారం దుష్టశక్తులకు మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని నమ్ముతారు. సైన్స్ ప్రకారం.. మొలతాడు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. దీన్ని కట్టుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. హెర్నియా వ్యాధి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మొలతాడును కట్టుకోవడం వల్ల పురుషుల జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకం కూడా ఉంది.



Sunday, July 7, 2024

నేనొక ఫంక్షన్ కి అటెండ్ అయ్యా

 😛🤣😛😢😭😂

నేనొక ఫంక్షన్ కి అటెండ్ అయ్యా


ఈ మధ్య నేనొక ఫంక్షన్ కి అటెండ్ అయ్యా..దాదాపు 50 మంది అతిథులు కుర్చీల్లో ఆశీనులయ్యారు..నేను ముందు వరుసలో కూర్చున్నా..ఆకలిగా అనిపించింది.


కాసేపయ్యాక ఒకామె ట్రేలో స్నాక్స్ తెచ్చి వెనుక వరుస నుండి అతిథులకు అందించడం ప్రారంభించింది..ముందుకి కూర్చున్న నా వరకు వచ్చేసరికి స్నాక్స్ అయిపోయాయి..చిరాగ్గా అనిపించింది.తిన్నగా లేచివెళ్లి వెనుక వరుసలో కూర్చున్నా.


ఈలోగా మరొక ఆమె కూల్డ్రింక్స్ తెచ్చి ముందువరుస నుండి పంపకం మొదలెట్టింది..అనుమానించినట్టే వెనక్కు వచ్చేలోపు అవికూడా అయిపోయాయి..


కోపం పట్టలేక వెళ్లిపోదాం అని లేచి నిల్చున్నా..సరిగ్గా అదే టైమ్ కి ముగ్గురు మహిళలు ట్రే లలో ఘుమ ఘుమలాడే వంటకాలను తీసుకువచ్చారు..స్మార్ట్ గా ఆలోచించి ఈసారి మధ్య వరుసలో కూర్చున్నా.


ఒకామె ముందునుండి, మరొకామే వెనుక నుండి అందించడం మొదలెట్టారు..థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు టెన్షన్ గా అనిపించింది..ఊహించరాని విధంగా మధ్య వరుస వచ్చేసరికి సమాప్తం..


అందరూ తింటుంటే ఏం చేయాలో తోచక అయోమయంగా తలదించి కోపంగా నా చేతులవైపు చేసుకుంటున్నా..


సరిగ్గా అదేసమయంలో మూడవ మహిళ నా వద్దకు వచ్చి..తన చేతిలో ఉన్న బౌల్ ని చూపించి తీసుకోమన్నట్టు సైగ చేసింది..ఆతృతగా బౌల్ లో చెయ్యిపెట్టి బయటకు తీసా..అదేంటో తెలుసా??


టూత్ పిక్..పళ్ళసందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని తీసే కర్రపుల్లలు..ఛి ఛీ.ఎదవ జన్మ.


నీతి :

జీవితంలో మీ పొజిషన్ ని తరచుగా మార్చడానికి ప్రయత్నించొద్దు.


దేవుడు మీరు ఎక్కడుంటే మంచిదో అక్కడే ఉంచుతాడు.


కాదూ,కూడదు అని తొందరపడితే దొరికేది "టూత్ పిక్" లే.

😀😀😂😂😁😁😎😎

Friday, July 5, 2024

సస్పెండెడ్ మీల్స్

 మీకు "సస్పెండెడ్ మీల్స్" అంటే ఏంటో తెలుసా .....

అలాగే సస్పెండెడ్ కాఫీ అంటే మీకు తెలుసా.....? 


నార్వేలో ఒక రెస్టారెంట్ కౌంటర్ లో డబ్బులు ఇస్తూ ఒక మహిళ, "Five coffee, two suspended" అంటూ ...


 ఐదు కాఫీలకి సరిపడ డబ్బు ఇస్తూ, మూడు కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళింది. 


మరొకరు వచ్చి, "Ten coffee, five suspended", అని పదికి డబ్బు కట్టి, ఐదు కాఫీలు పట్టుకుపోయాడు.



 అలాగే మరొకరు, "Five meals, two suspended", అని ఐదు భోజనాలకి డబ్బు కట్టి, మూడు భోజనం ప్లేట్లు తీసుకున్నారు.


 ఇదేమిటో అర్థం కాలేదా...? 


కాసేపటికి ఒక ముసలాయన, చిరిగిన బట్టలతో కౌంటర్ దగ్గరకు వచ్చి, "Any suspended coffee?" అని అడిగాడు. 


కౌంటర్ లో ఉన్న మహిళ, "Yes", అని, వేడి వేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చింది.


 ఇంకొక పేదవ్యక్తి వచ్చి "Any suspended Meals" అని అడిగిన వెంటనే ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తి ఎంతో గౌరవంతో వేడి వేడి అన్నం పార్సెల్ మరియు నీళ్ళ బాటిల్ చేతిలో పెట్టాడు. 


పేదరికంలో ఉన్న ముక్కు మొహం  కూడా తెలియని మనుషులకు మనసుతో చేసే సహాయం అంటే.. ఇదే మానవత్వం. 


ఈ పద్దతి ప్రపంచంలో అనేక చోట్ల వ్యాపించింది. 


మన దేశంలోకి కూడా రావాలని ఆశిస్తూ... 

ఈ విషయాన్ని వీలయినంత ఎక్కువ మందికి share చేద్దాం..👍

Thursday, July 4, 2024

నాన్న లేరు.. తాత పట్టించుకోలేదు

 👉🏻 నాన్న లేరు.. తాత పట్టించుకోలేదు!

 అమ్మ కసితో పెంచిన ఈ రాఖీ భాయ్ కథ తెలుసా?



         మధ్యతరగతి జీవితాల్లో చాలా కథలు కన్నీటితో మొదలై.., కన్నీటితో ఆగిపోతాయి. అక్కడ ఎలాంటి మిరాకిల్స్ ఉండవు. కానీ.., టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా కథ ఇలాంటిది కాదు.


            అక్కడ ఉప్పొంగిన కన్నీరు తరువాత.. ఓ అద్భుతం జరిగింది. ఆకలిపస్తులు ఉన్న ఆ ఇంట్లో కూడా ఆనందం వెల్లువెరిసింది. ఈ అద్భుతానికి కారణం బుమ్రా తల్లి దల్జిత్‌ కౌర్‌ బుమ్రా. వేలుపట్టుకుని నడిచే కొడుకు తప్ప పక్కన ఎవ్వరూ లేరు. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష, తిన్నావా అని అడిగే మనిషి కూడా లేని స్థితి. మామూలుగా అయితే ఓ స్త్రీ కుప్పకూలిపోయేది. కానీ.., దల్జిత్‌ కౌర్‌ అక్కడే ఆగిపోలేదు. పరిస్థితులను ఎదిరించింది, నిలబడింది. ఆ బిడ్డలో తన భవిష్యత్ చూసుకుంది. అతన్ని ఓ యోధుడిగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది. ఆ మాతృమూర్తి తీసుకున్న గొప్ప నిర్ణయానికి ఇద్దరి జీవితాలు నిలబడ్డాయి. దాంతో పాటు.. క్రికెట్ ప్రపంచంలో మన దేశం పరువు నిలబడింది.

           వంద కోట్ల మంది భారత క్రికెట్‌ అభిమానులంతా ఓటమిని ఒప్పుకుంటున్న క్షణాల్లో.. బంతి అందుకుని మ్యాచ్‌ను మన వైపు తిప్పేశాడు. సూపర్‌ బౌలింగ్‌తో టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు.  జస్ప్రీత్‌ బుమ్రాపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంస వర్షం కురుస్తోంది. ఆహా బుమ్రా, ఓహో బుమ్రా అంటూ ఇప్పుడు అంతా పొగుడుతున్నారు కానీ, పసితనంలో అతను అనాథలా బతికాడని చాలా మందికి తెలియదు. కన్నీళ్లు పెట్టించే బుమ్రా లైఫ్‌ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..


            జస్ప్రీత్‌ బుమ్రాది పంజాబీ కుంటుంబం. తండ్రి జస్వీర్ సింగ్, తల్లి దల్జిత్‌ కౌర్‌ బుమ్రా. బుమ్రాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి జస్వీర్‌ సింగ్‌ మరణించాడు. తండ్రిలేని బిడ్డ అయిన మనవడిని, భర్తను కోల్పోయి బాధలో ఉన్న కొడలిని చేరదీయాల్సిన బుమ్రా తాత సంతోక్‌ సింగ్‌ బుమ్రా.. వాళ్లను వదిలేసి వేరే ఊరికి వెళ్లిపోయాడు. భర్త మరణం, మామగారు పట్టించుకోకపోవడంతో.. బుమ్రా తల్లి ఒంటరిదైపోయింది. అదే ఆమెలో కసి పెంచింది. ఎలాగైనా తన కొడుకును గొప్పవాడ్ని చేయడానికి.. కంకణం కట్టుంది. అప్పటికే వస్త్రపూర్‌లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆమె.. తన బిడ్డకోసం మరింత కష్టపడింది.చిన్నతనం నుంచి బుమ్రాకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని పసిగట్టిన తల్లి దల్జిత్‌ కౌర్‌.. బుమ్రాను క్రికెట్‌ వైపు ప్రొత్సహించింది. తల్లితో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్న సమయంలో బుమ్రా బాల్‌తో ఆడుకుంటూ ఉంటే.. కింద ఉన్న ఇంటి ఓనర్లకు సౌండ్‌ వస్తే డిస్టబ్‌ అవుతుందని.. సరిగ్గా గోడ కింద భాగంలో బాల్‌ వేస్తూ ఆడుకునేవాడు బుమ్రా. అందుకే తాను అంత కచ్చితంగా యార్కర్లు వేయగలుగుతున్నానని ఒకానొక సందర్భంలో బుమ్రానే చెప్పాడు. అంత కఠినమైన పరిస్థితుల నుంచి ఎంతో కష్టపడి బుమ్రా క్రికెటర్‌గా ఎదిగాడు. భర్త అండ లేకపోయినా.. అత్తింటివారు పట్టించుకోకపోయినా.. బుమ్రా తల్లి ఓ యోధురాలిలా బుమ్రాను గొప్ప బౌలర్‌గా తయారు చేసింది. నిజానికి దేశం కోసం ఒంటరిగా ఒక వజ్రాయుధాన్ని తయారుచేసిందని చెప్పాలి.


              తన తల్లి ఎంతో కష్టపడి పెంచిన దానికి బదులుగా.. బుమ్రా ఒక గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడు. దేశం గర్వించే ఆటగాడు అయ్యాడు. తన సహజమైన బౌలింగ్‌తో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపాడు. ఇక చివరగా ఈరోజు ఇండియన్ క్రికెట్ కి బుమ్రా అనే ఓ ఆయుధం ఉంది. కానీ.., ఆ ఆయుధాన్ని చెక్కింది మాత్రం కచ్చితంగా దల్జిత్‌ కౌర్‌ బుమ్రానే. జిజియా భాయ్ ఓ శివాజీని పెంచినట్టు.. తన కొడుకుని పెంచిన దల్జిత్‌ కౌర్‌ లాంటి తల్లి నిజంగా అందరికీ ఆదర్శం. అమ్మ కష్టం తెలుసుకుని, లక్ష్యం వైపు పరుగులు తీస్తున్న బుమ్రా కూడా యువతకి ఆదర్శం.

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE