NaReN

NaReN

Saturday, September 30, 2023

ఫోటో తీసిన వ్యక్తి ఆత్మహత్య

 



*👉ఈ ఫోటో తీసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంట.*


*😰 మీరు ఈ ఫొటో జాగ్రత్తగా చూడండి ఆ పాప చేతిలో ఆహారం వుంది వెనకాల రాబందు వుంది ఆ పాప అనుకుంటుంది, రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుందని దాచుకొంటోంది. 

కానీ, పాపకు తెలియని విషయం ఏంటంటే, రాబందు చూసేది ఆహారం కోసం కాదు ఆ పాప కోసమే అని ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని...*     


*ఈ ఫొటో కెవిన్ అనే ఫొటో గ్రాఫర్ సూడాన్ లో 1990 లో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజెయ్యాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఫొటో ఈ ఫొటోకి గాను కెవిన్ కు చాలా గుర్తింపు వచ్చింది సన్మానాలు చాలానే జరిగాయి ప్రపంచంలో కెవిన్ పేరు మారు మ్రోగిపోయింది*     

*ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి సన్మానాలు చేసుకోడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్ కు ఒక సారి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తగానే అవతలి వ్యక్తి... 

ఆ పాప ఏమయ్యింది సార్, బ్రతికుందా చనిపోయిందా అని అడిగాడు. అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు... 

ఏమోసార్ ఫొటో తీసి వచ్చిన తరువాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు, ఆ పాప ఏమయ్యందో అని/ అప్పుడు అవతలి వ్యక్తి ఇలా అన్నాడు... 

ఆ రోజు అక్కడ వున్నవి రెండు రాబందులు, ఒకటి పాప చనిపోతే తినేద్దాం అనిచూస్తుంటే ఇంకొకటి కెమేరా పట్టుకొని కూర్చుంది... అని ఫోన్ పెట్టేసారు... 

ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే, 1993 లో ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత...*     

*అప్పటికి ఆయన వయస్సు 33 సంవత్సరాలే... 

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు చాలా మంది వున్నారు‌. 

ప్రతీది ఫొటో తీయడం, అక్కడ మన అవసరం వున్నా సహాయం చేయకుండా కెవిన్ లాగా పదిమంది మెప్పు గురించి బ్రతికేవారే ఎక్కువ... 

ఆరోజు అక్కడ కెవిన్ మరిచింది ఏంటంటే మానవత్వం. 

ఈరోజుల్లో మనం మరుస్తుంది కూడా మానవత్వమే.* 


     *కాబట్టి మీలో వున్న కెవిన్ ని చంపండి..👍*

Monday, September 18, 2023

విద్యార్థి ప్రశ్నలకు కంగు తిన్న ఉపాధ్యాయులు

 *🌍SAA*

స్కూల్ అసిస్టెంట్స్ అసోషియేషన్


*విద్యార్థి ప్రశ్నలకు కంగు తిన్న ఉపాధ్యాయులు* 

మీ విద్యార్థులు మిమ్మల్ని అడిగిన ఇలాంటి ప్రశ్నలు 9493696955 వాట్సాప్ ద్వారా పంపండి.

===================


ప్రభుత్వ పాఠశాలలలో కొంతమంది విద్యార్థులు  అడిగే ప్రశ్నలు *గొప్ప గొప్ప శాస్త్ర వేత్తలని తలపిస్తాయి.*_ 


_అలా ఒక ఉపాధ్యాయుడి Service లో ఎదురైన సంఘటనల ఆధారంగా విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలు మీ ముందు:_


 _*చంద్రునిపై కాలుమోపడం* నిజమే  అని నేను నమ్మాను. అయిదో తరగతిలో ఈ వార్త చదివి విన్పిస్తే... పిల్లలంతా ఆశ్చర్యంగా నమ్మారు._

_ఒక్క.. సతీష్ గాడు తప్ప..., నమ్మిన మిగతా పిల్లలందర్నీ వాడు జాలిగా చూశాడు. నన్నూ, పేపర్ లోని అమెరికా వాళ్లు దిగిన చంద్రమండలం బొమ్మని మార్చి మార్చి చూశాడు. కొంచెం సేపు వాడి చూపులు నన్ను కలవర పెట్టాయి._ 

 

_'నీ డౌట్ ఏంట్రా... అమెరికా వాళ్లు ఖచ్చితంగా చంద్రమండలానికి వెళ్లి వచ్చారు. అదే ఈ వార్త' అన్నాను._  *“నేను నమ్మట్లేదు సార్...”* _అన్నాడు ధృడంగా..._ *“ఎందుకురా... నువ్వేమైనా చూసొచ్చావా”* _అన్నాను కోపంగా. ప్రపంచమంతా ఒప్పుకుంటుంటే... వీడేంటి అన్న అసహనం పుట్టుకొచ్చింది._    *“చంద్రమండలం మీద గాలి లేదన్నారు కదా సార్... మరి అమెరికా వాళ్ల జెండా ఎలా రెపరెపలాడుతుంది?”* _అన్నాడు. ఖంగుతిన్నాను..._


_వాడి ప్రశ్న వందలాది వేట కొడవళ్లుగా మారి... అమెరికా వైపు దూసుకెళ్తున్నట్టు... అగ్రరాజ్యాన్ని నిలదీస్తున్నట్టు... కలవర పెట్టింది. వాడి మొహంలో చిద్విలాసం._ 

*నిజమే... ఇప్పుడు నాకూ నమ్మకం కలగట్లేదు.....*

_ఇరవై ఏళ్ళలో బదిలీపై ఏ ఊరికెళ్లినా ఆ ప్రశ్నలు వెంటాడుతాయి. ప్రశ్న వేసిన ఆ పిల్లల మొహాలు మర్చిపోలేనంతగా వేటాడుతాయి._ 


_పదేళ్లకింద చర్లపల్లె స్కూల్లో అలాంటి ప్రశ్నే ఎదురైంది..._

_నాకా ప్రశ్న వేసిన నాలుగో తరగతి చదివే *రమేష్* గాడి మొహం ఇప్పటికీ మనసులోంచి చెక్కు చెదరలేదు._


_అప్పట్లో నాలుగో తరగతి తెలుగు వాచకంలో ' *'కల్పవృక్షం'* అనే పాఠం ఉండేది. తాటిచెట్టు కల్పవృక్షం లాంటిది. తాటికమ్మలు గుడిసె వేసుకోవడానికి... తాటి ముంజలు తినడానికి... తాటి దోనెలు నీరు పారించుకోవడానికి... ఇలా తాటిచెట్టులోని ప్రతీది మనిషికి పనికొస్తుంది. ఇలా అడిగిందల్లా ఇస్తుంది కాబట్టి తాటిచెట్టును కల్పవృక్షంతో పోల్చారు... అంటూ పాఠాన్ని వివరించినప్పుడు...  చెబుతున్నంత సేపూ... రమేష్ గాడి మొహం చిన్నబోయింది. వాడి కళ్ళల్లో తడి... నేను అబద్దం చెప్తున్నట్టు కోపం... నాకేమి అర్ధం కాలేదు... “రమేష్... ఏమైందిరా...” అనడిగాను._


*“మా అయ్య రోజూ తాటికల్లు తాగొచ్చి అమ్మనూ, నన్నూ, తమ్ముణ్ని బాగా కొడతాడు.. తాటిచెట్టు మంచిదెట్లయితది సార్...”*

_వాడి ప్రశ్నకి... షాక్ తిన్నాను. నన్నే కాదు... విద్యావ్యవస్థనే ప్రశ్నించినట్లుంది వాడి ప్రశ్న. నిజానికి తాటిచెట్టు పాఠంలో 'కల్లు' ప్రస్తావన ఎక్కడా రాలేదు._ *తాటిచెట్టు* *కల్పవృక్షంతో పోల్చదగిందేనా...* 

_వాడికి నేను సమాధానం చెప్పాలి. ఏం చెప్పాలి...???_


_చివరకు *“తాటికల్లు మంచిదేరా... కాకపోతే ఓ కప్పుగాని, అరకప్పు గాని తాగితే మంచిది... కానీ మీ నాన్న కుండల కొద్దీ తాగుతాడు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు...”* అంటూ ఇంకొంచెం విపులంగా చెప్పాను. అయినా నా సమాధానం వాణ్ణి సంతృప్తి పర్చలేదు. అంతకు మించి చెప్పడానికి నాక్కూడా ఏం తోచలేదు. వాడు అయిష్టంగానే కూచున్నాడు._


*వాడి ప్రశ్న ఇప్పటికీ ఇలా వెంటాడుతూనే వుంటుంది.*


 _సుజాత టీచర్ ఓరోజు మూడో తరగతిలో *"బాతు - బంగారు గుడ్డు"* పాఠం చెప్పింది. ఒక బాతు రోజూ బంగారు గుడ్లు పెడుతుంటే... ఆత్యాశతో దాన్ని కోసి... యజమాని భంగపడ్డాడు అనే పాఠ్యాంశాన్ని చెప్పింది._

_తీరా ఒక పిల్లాడు వేసిన ప్రశ్నకి ఆమెకు చిర్రెత్తుకొచ్చి వాడి వీపు బద్దలు చేసింది. ఇంతకీ వాడు అడిగింది ఏమిటంటే...._

*“బాతుని కోస్తే తప్పేంటి టీచర్... బాతు కడుపులో గుడ్డు తయారవుతుంది కానీ... బంగారం తయారు కాదు గదా...! అందుకే బాతుని కోసి చూశాడేమో టీచర్... యజమాని తప్పేం లేదుగా? కాదంటారా?”* _అనడిగాడు._

 

 _ఈ మధ్య మా స్కూళ్ళ లో 'నిజాయితీ పెట్టె' లు పెట్టాలని విద్యాశాఖ సూచించింది. ఏ పిల్లవాడికైనా ఏదైనా దొరికితే దాంట్లో వేయాలి. టీచర్ దాన్ని తీసి అది పోగొట్టుకున్న పిల్లలకి అందజేస్తాడు. ఇది పిల్లల్లో నిజాయితీని పెంచుతుంది. పిల్లలు కూడా ఏవి దొరికినా ఉత్సాహంగా దాంట్లో వేస్తున్నారు. మొన్నీమధ్య *'తిరుపతి* నా పెన్ను దొంగతనం చేసాడు సార్' అంటూ రాధిక అనే అమ్మాయి నాకు కంప్లయింట్ చేసింది. “అవును... వాడు పెన్ను దొంగతనం చేసాడు సార్..” అంటూ పిల్లలందరూ చెప్పారు._

_తిరుపతి గాడిని పిలిచి అడిగితే మౌనంగా ఉండిపోయాడు. వాడి బ్యాగ్ తీసి పుస్తకాలు బయట పడేసి వెతికినా దొరకలేదు. చివరికి గట్టిగా అడిగితే... నేనే తీసాను అని ఒప్పుకున్నాడు. “ఎక్కడ దాచావురా” అని అడిగితే... నిజాయితీ పెట్టిని చూపించాడు. నాకు ఆశ్చర్యమేసింది._ 


_పెట్టెని తెరచి చూస్తే... రాధిక పెన్ను అందులో ఉంది._

_“దాంట్లో ఎందుకు వేసావురా?” అనడిగాను. “రోజూ అందరికీ ఏవేవో దొరుకుతున్నాయి. పెట్టెలో వేస్తున్నారు. నాకేం దొరకట్లేదు... అందుకే పెన్ను తీసి అందులో వేసాను” అని చెప్పాడు. నాకు బుర్ర తిరిగిపోయింది. పిల్లలందరిలోను ఒకటే ప్రశ్న..._

_తిరుపతి దొంగనా... నిజాయితీ పరుడా... దొంగతనం చేసాడు కాబట్టి... దొంగే కదా సార్... అన్నారు కొందరు. పెట్టెలో వేసాడు కాబట్టి నిజాయితీ పరుడే కదాసార్... అని మరి కొందరు పిల్లలు వాదించారు. చివరికి వాడు *నిజాయితీ పరుడే* అని వాళ్లని సమాధాన పర్చడానికి ఒక పీరియడ్ అయిపోయింది. ఇలాంటి ఇబ్బందికర ప్రశ్నలకి సమాధానం దొరక్క చాలా మంది టీచర్లు సహనం కోల్పోతారు._ 


 *ముఖ్యంగా తరగతి గదిలో దొంగతనం, కులం ఈ రెండు ఉద్రిక్తతని సృష్టిస్తాయి.*


 _అలాగే కులం ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాకు *వేదవతి* అనే పాప గుర్తొస్తుంది. శ్రీరాములపల్లె స్కూల్లో పని చేసేటప్పుడు... మధ్యాహ్న భోజనం సమయంలో ప్రతి మంగళవారం ఉడకబెట్టిన కోడిగుడ్డు పెట్టేవాళ్లం._ 


_మూడో తరగతి చదివే వేదవతి అనే పాప మాత్రం తన ప్లేటులో వేసిన గుడ్డుని టీచర్లు చూడకుండా వేరే పిల్లలకి ఇచ్చేది. ఓసారి అది గమనించిన నేను హెడ్ మాస్టర్ కి చెప్పాను. ఆయన పాపని పిలిచి గుడ్డు తింటే గుండెకు బలం వస్తుందని బుజ్జగించి మరీ మరీ చెప్పటంతో చాలా ఇష్టంగా కోడిగుడ్డు తింది._ 


_ఆ తర్వాత వేదవతి నాల్రోజుల వరకూ పాఠశాలకు రాలేదు. అనుమానంతో నేనూ, హెచ్.ఎం. కల్సి వాళ్లింటికి వెళ్లాం. మమ్మల్ని చూడగానే వాళ్లమ్మ దాడి చేసినంత వేగంగా కయ్యానికి దిగింది._

*“మేం బ్రాహ్మలం... మా పాపచేత  కోడిగుడ్డు తినిపిస్తారా... మీ స్కూల్ కి నా బిడ్డని చస్తే పంపించం.”* _అంటూ గొడవ పడింది. గుడ్డు తిన్న పాపానికి వేదవతిని బాగా కొట్టినట్టుంది. జ్వరంతో పడుకుంది. మమ్మల్ని చూడగానే భయంగా.... నీరసంగా లేచి నిల్చుంది._ 


_కోడిగుడ్డు శాఖాహారమే అంటూ మహాత్మగాంధీ చెప్పిన మాటలు కూడా ఆమె దగ్గర ఏం పని చెయ్యలేదు. చివరికి పాప చదువు పాడైపోతుందని, కోడి గుడ్డు తనకి పెట్టించమని మేం హామీ ఇచ్చాక గానీ బడికి పంపడానికి ఒప్పుకోలేదు._


_వేదవతి జ్వరంతోనే మర్నాడు స్కూల్ కొచ్చింది. వేదవతి మెల్లిగా తలొంచుకొని నా దగ్గర కొచ్చింది. “హోం వర్కు చేసావా?” అనడిగాను. మాట్లాడలేదు. నిమిషం సేపు నిశ్శబ్దంగా నా కళ్లలోకి సూటిగా చూస్తూ..._ *“మేమెందుకు కోడిగుడ్డు తినకూడదు సార్?”* _అనడిగింది. ఎవరో గుండెమీద సర్రున చరిచినట్లయింది నాకు... ఆ ప్రశ్నకు ఏ సమాధానం లేదు నా దగ్గర..._ 

_ఇంట్లో స్వేచ్చని చంపే ఆచారాలు బడిలో కూడా ఎంతగా ప్రభావం చూపిస్తాయో వేదవతి ప్రశ్న నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది._ 


_“దానికి బదులు నీకు అరటిపండు తెప్పిస్తాను సరేనా” అని భుజం తట్టి పంపించాను._


*_పిల్లల ప్రశ్నలకు మనసంతా నమ్మకం నిండేలా జవాబు చెప్పకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. వాళ్ల అనుమానంలోంచి పుట్టే ప్రశ్నకి రాగద్వేషాలుండవు._* 


_సి.నా.రె.కి జ్ఞానపీఠం అవార్డు వచ్చాక చాలామంది పండిత పామరులు రకరకాల ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేసారు. ఓసారి స్కూల్ పిల్లలు కూడా ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు.. మేధావులెవరూ అడగని ప్రశ్న ఒక పాప అడిగింది._

' *మీ పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి కదా. మరి మీ పేరు ముందు 'ఎస్' రావాలిగాని సి' ఎలా వస్తుంది?"* అని.

_ఆయన ఆశ్చర్యపోయారట... ఇప్పటివరకూ ఎవరూ అడగని ప్రశ్న... “పదో తరగతి మార్కుల మెమోలో 'ఎస్'కి బదులు 'సి' అనీ పడిందమ్మా అప్పట్నించి సి. నారాయణరెడ్డి అనే పిలుస్తున్నారు' అని నవ్వేసారట._  


_తరగతిగది లోపల పుట్టే ప్రశ్నలో నిజాయితీ ఉంటుంది._ *సమాధానం కూడా అంతే నిజాయితీగా లేనప్పుడు రానురాను వాళ్లు ప్రశ్నలు వేయటం మానుకుంటారు.* 


 *ప్రశ్నించే స్వేచ్చని పాఠశాలల్లో బాగా విస్తరిస్తే*  ప్రతి  పాఠ్యాంశం గురించి మేమంతా హోంవర్క్ చేసుకోవాల్సిందే...


*==================*

*(ఈ ప్రశ్నలకు జవాబు మీకెవరికైనా తెలిస్తే చెప్పండి)*

మన ఆరోగ్యం

 *💁🏻‍♂️ మన ఆరోగ్యం 👌 *

〰〰〰〰〰〰〰〰

*👉1. ఆయుర్వేద చిట్కా: దంత సంరక్షణ*


*మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. దంత సంరక్షణ చాలా అవసరమని ఆయుర్వేదం చెబుతోంది. ప్రస్తుతం రకరకాల పేస్టులు వచ్చాయి. కానీ, పూర్వపు రోజుల్లో వేప బెరడుతో అందరూ తమ దంతాలను శుభ్రం చేసుకునే వారు. ఇలా చేయడం వలన వారి దంతాలు ఆరోగ్యంగా ఉండేవి.* *ఆయుర్వేదంలో కూడా వేపతోనే దంతాలను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. తాజా వేపపుల్లతో లేదంటే, బొగ్గుతో పళ్లను శుభ్రం చేసుకోవడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.*


*👉2. మళ్లీ మళ్లీ వేడి చేసి తాగుతున్నారా?*

*టీని మళ్లీ మళ్లీ వేడి చేయడం ఆరోగ్యానికి హానికరమని అనేక పరిశోధనలు నిరూపించాయి. అలా చేస్తే టీ రుచి, వాసన, టానిన్లను కోల్పోతుంది.* *చెడిపోయిన టీలో సూక్ష్మజీవులు పెరుగుతాయి. దాన్ని వేడి చేసి తాగితే అనారోగ్యం. హెర్బల్ టీని మళ్లీ వేడిచేస్తే పోషకాలు తగ్గిపోతాయి. ఇలా టీని ఎక్కువసార్లు వేడి చేసి తాగితే.. కడుపునొప్పి, అతిసారం, వికారంలాంటివి రావొచ్చు.*

*♨ 4 గంటలకు పైగా నిల్వఉంచిన టీని మళ్లీ వేడి చేసి తాగకండి*


*👉3. మైగ్రేన్‌కు ఇలా చెక్ పెట్టండి!*


*ఈ రోజుల్లో మైగ్రేన్ చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఒకటి. రోజుకు 7-8 గంటలు నాణ్యమైన నిద్ర కావాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి, టైంకి భోజనం చేయాలి. కెఫెన్‌ కలిగిన పానీయాలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగాలాంటివి సహకరిస్తాయి. తలనొప్పికి దారితీసే కారణాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండాలి. మెడిసిన్ రెగ్యూలర్‌గా వాడుతూ, అలవాట్లు మార్చుకోవాలి.*


*👉4. కిడ్నీ సమస్యలను ఇలా గుర్తించండి.*


1. *మూత్రం తక్కువగా రావడం.*

2. *రాత్రివేళల్లో అతిమూత్రం*

3. *మూత్రంలో నురుగు రావడం*

4. *ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు*

5. *ముఖం లేదా శరీరం ఉబ్బడం*

6. *హై బీపీ*

7. *మూత్రం ఎర్రగా లేదా కోలా రంగులోకి మారడం*

8. *చూపు మందగించడం*

❤ *రోజూ కనీసం 2-3 లీటర్ల నీళ్లు తాగాలి. పెయిన్ కిల్లర్లు అతిగా వాడొద్దు.*


*👉5. తిన్నాక నడక మంచిదేనా?*


*భోజనం తిన్న తర్వాత నడక మంచిదే అంటున్నారు పరిశోధకులు. తాజాగా 30 వేలమందిని వారం పాటు తిన్న తర్వాత నడిపించి శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వాకింగ్ వల్ల వారిలో గుండెకు సంబంధించిన రిస్క్ 20 శాతం తగ్గిందట. గ్యాస్, ఎసిడిటీ సమస్యలూ తగ్గినట్లు గుర్తించారు. నడక వల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి శరీరానికి పోషకాలు అందుతాయని పరిశోధకులు తెలిపారు. ఈ నడక డయాబెటిస్ పేషంట్లకు మరీ మంచిదని స్పష్టం చేశారు.*

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE