NaReN

NaReN

Sunday, April 13, 2025

ఉమ్మడి కుటుంబాలు

 ఉమ్మడి కుటుంబాలు

ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో... అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది...!!


అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు...!!

ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా బ్రతకడానికి కావలసిన నీతి, నైతికత నేర్పించేవారు...!!


అప్పట్లో డబ్బు కొంచెం సమస్యగా ఉన్నా కూడా ఉన్నదంతా పంచుకుంటూ, అందరూ కలిసి సంతోషంగా ఉండేవారు...!!



అమ్మమ్మ - తాతయ్య

నానమ్మ - తాతయ్య

పెద్దనాన్న - పెద్దమ్మ

చిన్నాన్న - చిన్నమ్మ

అత్త - మామ

అక్క - బావ

మరదలు - తమ్ముడు

వదిన - అన్నయ్య

చెల్లి - బావ గారు

మేనమామ - మేనత్త

మేనకోడలు - మేనల్లుడు

అని ఓ బంధాల అల్లికలు ఉండేవి...!!


పిల్లలు తప్పు చేస్తే కుటుంబమే వారిని సారీ చెప్పేంతగా, మారేంతగా తీసుకునేది...

పిల్లలకు ప్రతి ఒక్కరిలోనూ భయం, భక్తి, ప్రేమ, అభిమానం ఉండేవి...!!


కొత్తగా వచ్చే అల్లుడు కానీ, కోడలు కానీ

ఆ ఉమ్మడి కుటుంబంతో సరదాగా కలసి పోయేవారు...

అల్లుడికి తగిన మర్యాద

కోడలికి తగిన బాధ్యత

ఇలా ప్రతి దానికీ ఒక పద్ధతి ఉండేది...!!


ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు బాధ్యతగా మెలగడం, ఆదరించడం...

అదే కారణంగా ఆ కుటుంబ పరువు మర్యాదలతో వర్ధిల్లేది...!!


అలాంటి ఉమ్మడి కుటుంబాలు పెద్దల చేత నడిచే ఒక గొప్ప రథాల్లా ఉండేవి...!!

ఇంటిని దేవాలయంలా చేస్తూ, పెద్దలు ఆలయ శిఖరాల్లా వెలిగేవారు...!!


ఇప్పుడు వాటిని పక్కన పెట్టేశారు...

పెద్దలను భారంగా భావిస్తూ దూరం చేస్తూ, వాళ్ళను ఒంటరిగా విడిచిపెడుతున్నారు...


వాళ్లకేమీ లేదు... హాయిగా దేవతామూర్తుల్లా కాలం వెళ్లదీస్తున్నారు...!!


ఈ నాడు స్వేచ్ఛగా బ్రతకాలని పల్లెటూర్ల నుంచి పట్టణాలకు వచ్చిన జంటలు...

వాళ్లు కట్టుకున్న ఇరుకుగదులే సుఖం అనుకుంటున్నారు...!!


కానీ...

డబ్బు కోసం పరుగులు తీయే భర్త

బాధ్యతలు మరిచిపోయిన భార్య

తల్లిదండ్రులను గౌరవించలేని పిల్లలు

బాగుపడితే ఒర్చుకోలేని అన్నదమ్ములు

దుమ్మెత్తి పొసే బంధువులు

సెల్ ఫోన్ లో పలకరించే దిక్కుమాలిన బతుకులు


ఇప్పుడు మంచి చెప్పేవారు లేరు, వినేవారు లేరు...!!

భయం లేదు

భక్తి లేదు

ప్రేమ ఒక నాటకం

అభిమానం ఒక భూటకం


నవ్వునీ నటిస్తూ బ్రతుకుతున్నారు...

అవసరంలేని బంధాలని పట్టుకుని,

అవసరమైన బంధాలని విడిచి,

బంధీలుగా బ్రతుకుతున్నారు...!!


ప్రతి రోజు వార్తల్లో కొన్ని సంఘటనలు చూస్తే బాధగానే ఉంటుంది...

చాలావరకు కుటుంబాలు రోడ్డున పడిపోవడానికి కారణం...

మంచి చెడు చెప్పే పెద్దలు మనతో లేకపోవడం...


బలమైన ఉమ్మడి కుటుంబాలను వదిలేసి,

మనమే మన పునాదుల్ని బలహీనపరచుకుంటున్నాం...!


ఉమ్మడి కుటుంబాలని తిరిగి స్వాగతిద్దాం

మన పెద్దలను గౌరవిద్దాం

తల్లిదండ్రులను ప్రేమిద్దాం

మన పిల్లలకు సంస్కారం నేర్పుదాం

మనం మన సమాజానికి మంచి పంచుదాం


ఒక్కటిగా జీవిద్దాం - ఆనందంగా బ్రందాం

బంధాలు బలంగా నిలిపిద్దాం!!

Friday, April 11, 2025

నీ హక్కు తెలుసుకో...


నీ హక్కు తెలుసుకో...



*ఒక్క బాత్రూమ్ కోసం రూ.1.65 లక్షలు, ఒకే దెబ్బకు దేశం లోని అన్ని పెట్రోల్ బంకులకు గుణపాఠం నేర్పిన మహిళ*:- భారతదేశం లో పెట్రోల్ బంకులు కేవలం పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు లభించే ప్రదేశాలు మాత్రమే కాకుండా అక్కడ కొన్ని ఉచిత సౌకర్యాలు కూడా పొందవచ్చు. దూర ప్రయాణాలు చేసే వారు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు రెస్ట్‌రూమ్ సదుపాయం లాంటి వాటిని వాడుకోవచ్చు. ప్రభుత్వం దేశంలోని పెట్రోల్ బంకుల్లో బాత్రూమ్ వాడకాన్ని ఉచితంగా అందుబాటు లో ఉంచాలని సూచనలు చేసింది. మీరు అక్కడ పెట్రోల్ నింపినా, నింపకపోయినా, టాయిలెట్‌ ను ఉపయోగించేందుకు ఎలాంటి షరతలు ఉండకూడదు. అయితే, వాస్తవానికి కొన్ని పెట్రోల్ బంకులు ఈ నియమాన్ని పాటించకపోవడం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకంగా, కొన్నిచోట్ల టాయిలెట్‌లను లాక్ చేసి ఉంచడం, తాళం వేసి ఉంచడం వంటి మనకు చాలా చోట్లనే కనిపిస్తుంది. ఇలాంటి ఓ సంఘటన కూడా ఇటీవల తాజాగా కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అక్కడి ఓ పెట్రోల్ పంపు నిర్వాహకులు దాని ఆవరణ లో టాయిలెట్‌ను సాధారణ ప్రజలకు అందుబాటు లో ఉంచక పోవడంతో, ఒక మహిళ ఈ వ్యవహారాన్ని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన కమిషన్, పెట్రోల్ పంపు యజమానులకు గుణపాఠం చెప్పేలా చర్యలు తీసుకుంది. ఈ వివరాల గురించి కింది కథనంలో పూర్తిగా తెలుసుకుందాం. కేరళ లో రాష్ట్రం లోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన జయకుమారి అనే మహిళ మే 8, 2024 న ఆమె తన కారులో ప్రయాణిస్తూ కోజికోడ్ ప్రాంతానికి చేరుకుంది. ప్రయాణంలో ఉన్న సమయంలో ఇంధన నింపుకోవడానికి ఓ స్థానిక పెట్రోల్ బంక్ వద్ద కారు ఆపింది. అయితే ఆ టైం లో అత్యవసరంగా ఆమె బాత్రూమ్ ఉపయోగించాల్సి వచ్చింది. ఆమె పెట్రోల్ బంక్‌ లోని టాయిలెట్‌ ను ఉపయోగించాలన్న ఉద్దేశంతో సిబ్బందిని కోరింది. కానీ అక్కడి సిబ్బంది టాయిలెట్‌ను మూసివేసి ఉంచినట్టు తెలిపారు. ఇది చూసిన జయకుమారి, నిబంధనల ప్రకారం టాయిలెట్‌ ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పింది. అయినప్పటికి వారు ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే తిరిగి ఆమెతో అసభ్యంగా మాట్లాడినట్టు సమాచారం. పెట్రోల్ బంక్ సిబ్బంది ఆమె పట్ల నిర్వహించిన తీరును తెలియజేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. అప్పటివరకు తాళం వేసి ఉన్న టాయిలెట్‌ను సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకున్న విచారణ చేసిన తరువాత తాళం తీశారు. జయకుమారి అంతటితో ఆగలేదు. ఆమె ఈ అంశాన్ని వినియోగదారు ల వివాదాల పరిష్కార కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. పతనం తిట్ట వినియోగదారుల కమిషన్ ఈ కేసును సీరియస్‌గా పరిగణించింది. విచారణలో, జయకుమారి చెప్పిన సంగతులన్నీ, పోలీసుల నివేదికలు, సాక్ష్యాల ఆధారంగా కమిషన్ తీర్పును ఇచ్చింది. పెట్రోల్ బంక్ యజమాని ఫాతిమా హన్నా, జయకుమారికి రూ.1.65 లక్షలు పరిహారంగా చెల్లించాలని కమిషన్ ఉత్తర్వులిచ్చింది. జయకుమారి పోరాటానికి న్యాయమూర్తులు న్యాయం చేశారు. మొత్తం రూ.1.65 లక్షలు పరిహారంలో రూ.1.50 లక్షలు ఆమెకు జరిగిన మానసిక ఇబ్బంది, అవమానం కింద పరిహారంగా ఇవ్వాలని, మిగిలిన రూ.15 వేల రూపాయలు చట్టపరమైన ఖర్చులకోసం చెల్లించాలని తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజలకు ప్రాథమికంగా అందించాల్సిన సేవలను నిరాకరించడం చాలా తప్పు. ఈ తీర్పు కేవలం ఒక సంఘటనకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి పెట్రోల్ బంక్‌కు ఒక గుణపాఠంగా నిలిచేలా మారింది. రెస్ట్‌ రూమ్‌ లాంటి అవసరమైన సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులో ఉంచకపోతే, దాని మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని ఈ తీర్పు తెలుపుతోంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు జయకుమారి ధైర్యాన్ని, కమిషన్ తీర్పును ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రతి భారతీయ పౌరుడు ఇలాంటి హక్కులు తెలుసుకోవాలనే ఆలోచనతో ఇలాంటి సంఘటనలూ ప్రాచుర్యం లోకి తీసుకువచ్చు తీసుకువస్తున్నాను. 


సదా మీ సేవలో

పసుపులేటి నరేంద్రస్వామి

Monday, April 7, 2025

Monday, March 10, 2025

Tuesday, March 4, 2025

Friday, February 28, 2025

Special test 2025

 


ప్రతి తండ్రి బిడ్డలకు ఇవ్వాల్సిన సలహా


 _*ప్రతి తండ్రి బిడ్డలకు ఇవ్వాల్సిన సలహా:*_


 _1. జీవితంలో అన్నీ అనుకున్నట్లుగా జరగవు. అందుకే ఆశలు తగ్గించుకుని, జీవితం ఎలా నడుస్తుందో అలా వెళ్లాలి._


 _2. నీ మనసులో ఉన్న జెలసీ, కోపం తగ్గించు. వాటివల్ల నీకు దక్కాల్సిన లాభం దక్కదు_


 _3. విజయవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే ఒకే ఒక నియమాన్ని పాటించు – నీకు నీవు అబద్ధం చెప్పుకోవద్దు._


 _4. నీ తల్లిదండ్రులు నీమీద ఆధారపడితే వారి అవసరంతో మాత్రం ఆడుకోవద్దు._


 _5. వ్యక్తులను కాదురా, లక్ష్యాలను అనుసరించు._


 _6. నీ 20వ పుట్టిన రోజు వరకూ స్వార్థం తోనే ఉండాలి, నీ జీవితం కోసం నువ్వే పోరాడు_


 _7. వదిలేయడానికి చాలా గొప్ప శక్తి కావాలి, నీ మనశ్శాంతికి అడ్డం నిలిచే దాన్ని వదిలేయి._


 _8. నీ మాటలు నీమౌనం కన్నా అందంగా ఉంటేనే మాట్లాడు._


 _9. నీ రూపాన్ని మెరుగుపరుచుకో. ఎవరి కోసమో కాదు, నీ కోసమే. బాగుంటే, మనసు కూడా హాయిగా ఉంటుంది. డబ్బుల్లేవని ఎలా పడితే అలా ఉండొద్దు._


 _10. కొంతమంది నువ్వు నాశనం కావాలని కోరుకుంటారు, ఎందుకంటే వారి జీవితం సరిగ్గా సాగడం లేదు కాబట్టి_


 _11. మంచివాళ్లను అందరూ ప్రేమించరు, కానీ ఎక్కువగా ఉపయోగించుకుంటారు._


 _12. మనుషులను వదిలేయడానికి భయపడకు, ఇలాంటి వారిని సంతోషపెట్టే ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోవడం ఖాయం_


 _13. నీ ఆలోచనలను రహస్యంగా ఉంచుకో. పని పూర్తయ్యే వరకు బయటపెట్టకు. ముందుగా చెప్పడం అపశకునం లాంటిదే_


 _14. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అతిగా/ ఎక్కువగా ప్రేమించవద్దు. సైకో థెరపీ ఖర్చుతో కూడుకున్నది. ఒంటరిగా ఉన్నావని పెళ్లి మాత్రం చేసుకోవద్దు._


 _15. నీ ఆలోచనలు శక్తివంతమైనవి, అవి సానుకూలంగా ఉండేలా చూసుకో._


 _16. పుట్టినరోజుకి ఎవ్వరూ నీకు బహుమానాలు ఇవ్వరు, కష్టపడి సంపాదించు, నీకు నువ్వే బహుమతులిచ్చుకో_


 _17. భయపడుతూ వెనుకడుగు వేయకు, ఎందుకంటే అదే నీ జీవితాన్ని మార్చే నిర్ణయం కావొచ్చు._


 _18. ఎంత దాహంగా ఉన్నా, కొందరిని నీరు అడగకూడదు. తిండి విషయంలో కూడా కొందరు పిలిస్తే పోవద్దు_


 _19. నీ జీవితానికి విలువ జోడించు. నైపుణ్యాలను అభివృద్ధి చేసుకో._


 _20. ఎవరినైనా ప్రేమించు, కానీ వారిని ప్రేమిస్తున్నంతవరకు నిన్ను నువ్వు గౌరవించుకో._


 _21. నీవే నీకు అసలైన మిత్రుడు. ఎప్పుడూ నిన్ను నువ్వు అవమానించుకోకు._


 _22. కొందరు నీ జీవితంలోనికి తిరిగి రావడం అంటే నువ్వు ఇంకా మూర్ఖుడిలాగే ఉన్నావా అని పరీక్షించడానికి మాత్రమే._


 _23. నీ జీవితంలో అవసరంలేని వారిని పంపించు, అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది._


 _24. పెద్ద కలలు కను, కానీ చిన్న చిన్న పనులతో మొదలు పెట్టు. స్థిరంగా ఉండి, ఎదుగుతూ వెళ్లు._


 _25. ఇతరులకు దానం/ ఖర్చు చేయడానికి ముందు నీ కుటుంబం పరిస్థితి చూసుకో._


 _26. తేలికగా వచ్చినది ఎక్కువ కాలం నిలబడదు. ఎక్కువ కాలం నిలబడేది తేలికగా రాదు._


 _27. నీ వ్యక్తిగత జీవితంపై అధికంగా ప్రశ్నలు వేసే వారికి తప్పు సమాచారం ఇవ్వడం అలవాటు చేసుకో._


 _28. మోసం చేసిన వ్యక్తులను మళ్లీ మళ్లీ నమ్మడం వల్ల ఓ రోజు నువ్వు HIV పాజిటివ్ కూడా అవ్వొచ్చు._


 _29. స్నేహితుల ఒత్తిడికి లోనవద్దు._


 _30. మహిళలను వేధించవద్దు, గౌరవించు._


 _31. పని చేసే ప్రదేశంలో అందరూ నీ స్నేహితులు కాదు._


_32.  త్వరపడుతూ , పొరపడుతూ నీ అభివృద్ధిని చెడగొట్టుకోవద్దు._


_~ నీ పనిమాత్రం నువ్వు హాయిగా చేసుకో.!_

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE