NaReN

NaReN

Friday, July 5, 2024

సస్పెండెడ్ మీల్స్

 మీకు "సస్పెండెడ్ మీల్స్" అంటే ఏంటో తెలుసా .....

అలాగే సస్పెండెడ్ కాఫీ అంటే మీకు తెలుసా.....? 


నార్వేలో ఒక రెస్టారెంట్ కౌంటర్ లో డబ్బులు ఇస్తూ ఒక మహిళ, "Five coffee, two suspended" అంటూ ...


 ఐదు కాఫీలకి సరిపడ డబ్బు ఇస్తూ, మూడు కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళింది. 


మరొకరు వచ్చి, "Ten coffee, five suspended", అని పదికి డబ్బు కట్టి, ఐదు కాఫీలు పట్టుకుపోయాడు.



 అలాగే మరొకరు, "Five meals, two suspended", అని ఐదు భోజనాలకి డబ్బు కట్టి, మూడు భోజనం ప్లేట్లు తీసుకున్నారు.


 ఇదేమిటో అర్థం కాలేదా...? 


కాసేపటికి ఒక ముసలాయన, చిరిగిన బట్టలతో కౌంటర్ దగ్గరకు వచ్చి, "Any suspended coffee?" అని అడిగాడు. 


కౌంటర్ లో ఉన్న మహిళ, "Yes", అని, వేడి వేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చింది.


 ఇంకొక పేదవ్యక్తి వచ్చి "Any suspended Meals" అని అడిగిన వెంటనే ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తి ఎంతో గౌరవంతో వేడి వేడి అన్నం పార్సెల్ మరియు నీళ్ళ బాటిల్ చేతిలో పెట్టాడు. 


పేదరికంలో ఉన్న ముక్కు మొహం  కూడా తెలియని మనుషులకు మనసుతో చేసే సహాయం అంటే.. ఇదే మానవత్వం. 


ఈ పద్దతి ప్రపంచంలో అనేక చోట్ల వ్యాపించింది. 


మన దేశంలోకి కూడా రావాలని ఆశిస్తూ... 

ఈ విషయాన్ని వీలయినంత ఎక్కువ మందికి share చేద్దాం..👍

Thursday, July 4, 2024

నాన్న లేరు.. తాత పట్టించుకోలేదు

 👉🏻 నాన్న లేరు.. తాత పట్టించుకోలేదు!

 అమ్మ కసితో పెంచిన ఈ రాఖీ భాయ్ కథ తెలుసా?



         మధ్యతరగతి జీవితాల్లో చాలా కథలు కన్నీటితో మొదలై.., కన్నీటితో ఆగిపోతాయి. అక్కడ ఎలాంటి మిరాకిల్స్ ఉండవు. కానీ.., టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా కథ ఇలాంటిది కాదు.


            అక్కడ ఉప్పొంగిన కన్నీరు తరువాత.. ఓ అద్భుతం జరిగింది. ఆకలిపస్తులు ఉన్న ఆ ఇంట్లో కూడా ఆనందం వెల్లువెరిసింది. ఈ అద్భుతానికి కారణం బుమ్రా తల్లి దల్జిత్‌ కౌర్‌ బుమ్రా. వేలుపట్టుకుని నడిచే కొడుకు తప్ప పక్కన ఎవ్వరూ లేరు. రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష, తిన్నావా అని అడిగే మనిషి కూడా లేని స్థితి. మామూలుగా అయితే ఓ స్త్రీ కుప్పకూలిపోయేది. కానీ.., దల్జిత్‌ కౌర్‌ అక్కడే ఆగిపోలేదు. పరిస్థితులను ఎదిరించింది, నిలబడింది. ఆ బిడ్డలో తన భవిష్యత్ చూసుకుంది. అతన్ని ఓ యోధుడిగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది. ఆ మాతృమూర్తి తీసుకున్న గొప్ప నిర్ణయానికి ఇద్దరి జీవితాలు నిలబడ్డాయి. దాంతో పాటు.. క్రికెట్ ప్రపంచంలో మన దేశం పరువు నిలబడింది.

           వంద కోట్ల మంది భారత క్రికెట్‌ అభిమానులంతా ఓటమిని ఒప్పుకుంటున్న క్షణాల్లో.. బంతి అందుకుని మ్యాచ్‌ను మన వైపు తిప్పేశాడు. సూపర్‌ బౌలింగ్‌తో టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు.  జస్ప్రీత్‌ బుమ్రాపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంస వర్షం కురుస్తోంది. ఆహా బుమ్రా, ఓహో బుమ్రా అంటూ ఇప్పుడు అంతా పొగుడుతున్నారు కానీ, పసితనంలో అతను అనాథలా బతికాడని చాలా మందికి తెలియదు. కన్నీళ్లు పెట్టించే బుమ్రా లైఫ్‌ స్టోరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..


            జస్ప్రీత్‌ బుమ్రాది పంజాబీ కుంటుంబం. తండ్రి జస్వీర్ సింగ్, తల్లి దల్జిత్‌ కౌర్‌ బుమ్రా. బుమ్రాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తండ్రి జస్వీర్‌ సింగ్‌ మరణించాడు. తండ్రిలేని బిడ్డ అయిన మనవడిని, భర్తను కోల్పోయి బాధలో ఉన్న కొడలిని చేరదీయాల్సిన బుమ్రా తాత సంతోక్‌ సింగ్‌ బుమ్రా.. వాళ్లను వదిలేసి వేరే ఊరికి వెళ్లిపోయాడు. భర్త మరణం, మామగారు పట్టించుకోకపోవడంతో.. బుమ్రా తల్లి ఒంటరిదైపోయింది. అదే ఆమెలో కసి పెంచింది. ఎలాగైనా తన కొడుకును గొప్పవాడ్ని చేయడానికి.. కంకణం కట్టుంది. అప్పటికే వస్త్రపూర్‌లోని ఓ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆమె.. తన బిడ్డకోసం మరింత కష్టపడింది.చిన్నతనం నుంచి బుమ్రాకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని పసిగట్టిన తల్లి దల్జిత్‌ కౌర్‌.. బుమ్రాను క్రికెట్‌ వైపు ప్రొత్సహించింది. తల్లితో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్న సమయంలో బుమ్రా బాల్‌తో ఆడుకుంటూ ఉంటే.. కింద ఉన్న ఇంటి ఓనర్లకు సౌండ్‌ వస్తే డిస్టబ్‌ అవుతుందని.. సరిగ్గా గోడ కింద భాగంలో బాల్‌ వేస్తూ ఆడుకునేవాడు బుమ్రా. అందుకే తాను అంత కచ్చితంగా యార్కర్లు వేయగలుగుతున్నానని ఒకానొక సందర్భంలో బుమ్రానే చెప్పాడు. అంత కఠినమైన పరిస్థితుల నుంచి ఎంతో కష్టపడి బుమ్రా క్రికెటర్‌గా ఎదిగాడు. భర్త అండ లేకపోయినా.. అత్తింటివారు పట్టించుకోకపోయినా.. బుమ్రా తల్లి ఓ యోధురాలిలా బుమ్రాను గొప్ప బౌలర్‌గా తయారు చేసింది. నిజానికి దేశం కోసం ఒంటరిగా ఒక వజ్రాయుధాన్ని తయారుచేసిందని చెప్పాలి.


              తన తల్లి ఎంతో కష్టపడి పెంచిన దానికి బదులుగా.. బుమ్రా ఒక గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడు. దేశం గర్వించే ఆటగాడు అయ్యాడు. తన సహజమైన బౌలింగ్‌తో టీమిండియాను విశ్వవిజేతగా నిలిపాడు. ఇక చివరగా ఈరోజు ఇండియన్ క్రికెట్ కి బుమ్రా అనే ఓ ఆయుధం ఉంది. కానీ.., ఆ ఆయుధాన్ని చెక్కింది మాత్రం కచ్చితంగా దల్జిత్‌ కౌర్‌ బుమ్రానే. జిజియా భాయ్ ఓ శివాజీని పెంచినట్టు.. తన కొడుకుని పెంచిన దల్జిత్‌ కౌర్‌ లాంటి తల్లి నిజంగా అందరికీ ఆదర్శం. అమ్మ కష్టం తెలుసుకుని, లక్ష్యం వైపు పరుగులు తీస్తున్న బుమ్రా కూడా యువతకి ఆదర్శం.

Sunday, June 30, 2024

హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు

 😭🙏::_*జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.*_


*హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు పది సార్లు ఆలోచించండి.*


మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ లో అడ్మిట్ కావద్దు.


ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు. అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు.


👤చాలా మంది  కమర్షియల్ అయిపోయారు. హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. పైన ఉన్నంత అందమైనది కాదు.


 మేనేజ్మెంట్ పెట్టె టార్గెట్స్ రీచ్ కావడానికి నానా అబద్ధాలు అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్.


డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది.అది డెబ్బై శాతం అబద్దం. ముప్పై శాతమే నిజం.


SP బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే.


😌ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు. అదేదో హోటల్ అనుకున్నాడు. అటు నుండి అటే అనే తెలుసుకోలేక పోయాడు.రెండు కోట్లు  బిల్లు వసూలు చేశారు. శవాన్ని ఇచ్చారు.


దాసరి నారాయణ రావు, జయలలిత....ఇలా చాలా మంది చావుకు   రోగం కారణం కాదు. నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి,టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, భయంకరమైన ఆంటీ బయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు.


 తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు,డబ్బు ఉన్నవారు. వైద్యమును చాలా మిస్టరీ గా చేశారు అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం. అది తప్పు.


అసలు అన్నీ రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి  కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది? 


ఉన్న రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా??


అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో. ఇంకో పది ఏండ్లు బ్రతికే అవకాశం ఉన్న మనిషి ఆయన.


అందుకే మిత్రులారా హాస్పిటల్... అది ఎలాంటి దైనా ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి. సెకండ్ opinion తీసుకోండి. ఊరకే జొరబడ వద్దు. *సహజంగా మన శరీరంలో వైద్య పరంగా ఓ..యంత్రాంగం వుంటుంది. నిద్రావస్తలో వున్నప్పుడు మన శరీరంలో వున్న అనారోగ్యాలను పోగొట్టి తనకు తాను సరిచేసుకుంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు సమయానికి ఆహారం నిద్ర వుండాలంటారు*. ప్రతీ చిన్న విషయానికి హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం..పది రూపాయల ఖర్చుతో పోయే రోగం పదిలక్షల వరకూ లాగే ప్రక్రియ మూడువంతులు జరుగుతోంది.  


పూర్వ కాలంలో వున్న ఉన్నత మైన వైద్య విధానం ఇప్పుడు కనబడటం లేదు. అత్యంత మోసపూరిత వ్యాపార విధానం అయింది. ఈ రోజు వైద్యం..! కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది. ప్రతీ దానికీ కార్పొరేట్ హాస్పిటల్ లోకి పోవడం కరె క్టు కాదు.

కనీసం మీరైనా ఈ విషయాలను మనస్సులో పెట్టుకోండి. ఇంట్లో ఉంటే వంద ఏండ్లు బ్రతుకుతారు. హాస్పిటల్ కు పోతే రేపే ....


*జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.*


*అందరికీ మంచి జరుగాలనీ కోరుకుంటూ.*

________________________________

💯% Correct ఎన్ని గ్రూప్ లకైనా షేర్ చేయొచ్చు ఇది సగటు భారతీయుని మనస్సు లోని మాట, ఆవేదన, నగ్నసత్యం మన ప్రియతమ గౌరవ రాష్ట్రపతి మరియు ప్రధాని గార్లకు చేరేవరకు భారతఫౌరుని బాధ్యత గా బావించి  షేర్ చేద్దాం మిత్రులారా.......

బయట తినేప్పుడు జాగ్రత్త

 బయట తినేప్పుడు జాగ్రత్త 

మనం ఎప్పుడూ ఒకరు తిని వదిలేసిన ఆహారాన్ని లేదా కుళ్ళిన ఆహారాన్ని తినము.!!! కానీ భారతదేశంలో ఇప్పుడు ఈ పరిస్థితే దాపురించింది!!! కొంచెం ఆలోచించండి.


కొద్ది రోజుల క్రితం మా పరిచయస్తులు మమ్మల్ని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్‌కు తీసుకెళ్ళారు. నాకు సాధారణంగా బయట తినే అలవాటు లేదు, కానీ కొన్ని సార్లు సామాజిక ఒత్తిడితో అనివార్యం అవుతుంది.


ఈ రోజుల్లో పనీర్ పదార్థాలు తినడం విలాసానికి గుర్తుగా భావించబడుతోంది, కాబట్టి వారు పనీర్‌తో కొన్ని వంటకాలు ఆర్డర్ చేశారు. ప్లేట్‌లోని పనీర్ ముక్కల విభిన్న పరిమాణాలు మరియు రంగులను చూసి నాకు ఏదో తేడాగా అనిపించింది. ఆ ముక్కలు ఉద్దేశపూర్వకంగా కత్తిరించి వండినట్లు అనిపించింది. నేను వెయిటర్‌ను పిలిచి, ఆ హోటల్లో వంట వండినవాణ్ణి తీసుకురావాలని కోరాను. అతడు వచ్చినప్పుడు, నేను అడిగాను, "పనీర్ ముక్కలు ఎందుకు విభిన్న పరిమాణాలు మరియు రంగుల్లో ఉన్నాయి?" అప్పడు అతను అన్నాడు, "ఇది మా ప్రత్యేక వంటకం."


దానిపై నేను అతనికి చెప్పాను, "నేను ఇదే వంటకం మరొక ప్లేట్ ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నాను. కానీ మీ ప్రత్యేక వంటకం నా ముందే వండండి." రెస్టారెంట్ మొత్తం నా పెరిగిన స్వరంతో వణికిపోయింది... చాలామంది తమ భోజనాన్ని ఆపేసి నా వైపు చూడటం మొదలుపెట్టారు.


హోటల్ సిబ్బంది వివిధ కారణాలు చెప్పడం ప్రారంభించారు. చివరకు పోలీసుల భయంతో, వెయిటర్ అసలు కారణాన్ని తెలియజేసి తప్పును అంగీకరించాడు. కస్టమర్లు  చాలా సార్లు తమ ప్లేట్‌లలో అన్నం, కూరగాయలు, సలాడ్‌లు మరియు చపాతీలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. హోటల్ సిబ్బంది వాటిని అన్నీ పడేయడం లేదు. పెద్ద పనీర్ ముక్కలను మరియు కూరగాయలను తిరిగి మరొక వంటకంలో కలిపి వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది.


ప్లేట్‌లలో మిగిలిన సలాడ్ కొత్త ఆర్డర్ కోసం ఉపయోగించబడుతుంది. ప్లేట్‌లలో పడేయబడిన ఎండిన చికెన్ మరియు మాంస ముక్కలను తిరిగి కర్రీలో వేసి, పైపైన అలంకరించి, వినియోగదారులకు తిరిగి వడ్డించబడుతుంది.


ఇది పెద్ద పెద్ద హోటల్‌లలో జరిగే వాస్తవం. ఇక మీదట, ఎప్పుడు హోటల్‌లో భోజనం చేయడానికి వెళ్తే, మిగిలిన భోజనం ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకుని, బయటకు వెళ్లి జంతువులకు ఆహారంగా ఇవ్వండి లేదా ఆ సంచి చెత్తబుట్టలో మీరే స్వయంగా వేయండి, లేదంటే, మీ ప్లేట్‌లోని భోజనం మరొకరి ప్లేట్లో నుంచి వచ్చిన ఎంగిలి ఆహారమై ఉండొచ్చు లేదా మీరు తినగా మిగిలిన భోజనం మరొకరికి ఆహారం కావచ్చు. జాగ్రత్త!!

----


మరో సంఘటన శ్రీకృష్ణుని జన్మస్థానం అయిన బృందావనంలో జరిగింది. బృందావనం చేరుకున్న తర్వాత, నేను నేను బృందావనాన్ని ఎంతో పవిత్రమైన భూమిగా చూస్తున్నాను. ఢిల్లీ నుండి సుదూర ప్రయాణం చేసిన తర్వాత మేము అందరమూ ఎంతో ఆకలితో ఉన్నాము. అందుకే ఒక శుభ్రంగా కనిపించే భోజనశాలలో ప్రవేశించాము. ఆర్డర్‌కు ఆలస్యం కాకుండా ఉండటానికి డిష్‌ల కంటే రెడీమేడ్ భోజన థాళిలను ఆర్డర్ చేసాము.

ఒక శుభ్రమైన ట్రే ద్వారా దాల్, కూరగాయలఅన్నం, రైతా మరియు ఒక బుట్టలో చపాతీలు తీసుకువచ్చారు.


మొదటి కొద్దిముక్కల తిన్నప్పుడు గుర్తించలేదు, కానీ తర్వాత ఏదో తేడాగా అనిపించింది. చపాతీ పుల్లగా ఉండగా, కూరగాయల రంగు విభిన్నంగా ఉంది. అన్నం రుచి కూడా అసహజంగా ఉంది. అందరం భోజనం అలాగే వదిలేసి, కౌంటర్ వద్దకి బిల్లు ఎంత అని అడిగాము, 650 రూపాయల బిల్లు ఇచ్చారు.


నేను చెప్పాను, "బాబు, నేను చెల్లిస్తాను, కానీ ఒకసారి మీ కిచెన్ చూపించండి." అతను ఉలిక్కిపడుతూ, "ఏమైంది?" అని అడిగాడు. నేను చెప్పాను, " ఒక కస్టమర్ గా, నేను భోజనం ఎలా తయారవుతున్నదో చూడటం నా హక్కు." అతను సమాధానం చెప్పే ముందే నేను కిచెన్‌లో ప్రవేశించాను.


లోపల, ఎటువంటి వంట జరగడం లేదు. కొన్ని చపాతీలు ఒక బుట్టలో ఉన్నాయి. ఫ్రిజ్ తెరిచి చూశాను, లోపల వేరే వేరే రకాలుగా వండిన కూరగాయలు ఉన్నాయ్, చాలా రకాల వండిన కూరగాయలు మూతలు లేని పాత్రలలో ఉన్నాయి మరికొన్నింటి నుంచి కుళ్ళిన వాసన వస్తుంది ఫ్రిజ్ మొత్తం దుర్వాసన కొడుతోంది, వంట చేసేవాడిని నాలుగు తిట్టిన తర్వాత అతడు అసలు నిజం చెప్పాడు. ఈ కూరగాయలు వారం రోజులుగా ఉన్నాయి. 


అతను మరొక విషయం కూడా చెప్పాడు, వండేటప్పుడు పాత కూరగాయలను, కుళ్ళిన కూరగాయలను మళ్లీ నూనెతో వేడి చేసి కొత్తిమీర టమాటాలతో అలంకరించి మళ్ళీ కొత్త వంటకం లాగ వేరే కస్టమర్లకు వడ్డిస్తాం.


చపాతి పిండిని కూడా రెండు రోజులకు ఒకసారి తయారు చేస్తాము. కరెంటు కోత కారణంగా ఫ్రిజ్ లోని ఆహార పదార్థాలు చెడిపోతాయి. ఆ చెడిన వాసనను తెలియనివ్వకుండా మరిన్ని మసాలాలు, కారము కలిపి వంట చేసి సర్వ్ చేస్తాము. పులిసిపోయిన చపాతి పిండిని నాన్ తయారీకి ఉపయోగిస్తాము.


నేను రెస్టారెంట్ యజమానితో చెప్పాను, "మీరు కూడా ఎప్పుడైనా యాత్రలు చేస్తారు, మీరు యాత్రలో ఆకలితో ఉండగా మీకు కూడా మీరు మీ కస్టమర్లకు ఇచ్చినటువంటి భోజనమే రావాలి." నా మాటలతో అతని ముఖం నల్లగా మారింది....


ఈ రోజు మనకు జరిగే ఇటువంటి ప్రమాదాలు మరియు మోసాల నుండి కేవలం మన అప్రమత్తత మాత్రమే రక్షిస్తుంది. ఎందుకంటే దేవుడు కూడా చెడ్డవారి వలయములో చిక్కుకుని ఉన్నాడు.


భారతదేశంలో సత్యం మరియు అసత్యం మధ్య తేడా క్షీణిస్తోంది. ప్రతి దుకాణం లేదా సంస్థలో ఒక మూలలో దేవాలయం ఉంటుంది. వ్యాపారి ఉదయం వచ్చినప్పుడు దేవుని విగ్రహం ముందు ధూపం, దీపం వెలిగిస్తాడు, కౌంటర్‌ని నమస్కరించి, ఆ తర్వాత తన ఆత్మను విక్రయించడం ప్రారంభిస్తాడు!!!


దేవుని వద్ద భక్తులు అడిగేటప్పుడు, వారు ప్రపంచానికి ఏమి ఇస్తున్నారో ఆలోచించరు!!!


జాగ్రత్తగా ఉండండి! అప్రమత్తంగా ఉండండి!! బయట తినడం నివారించండి. 🙏


ఇంటి ఆహారం అత్యుత్తమం.

Wednesday, June 26, 2024

చిరిగిన చొక్కా

 చిరిగిన చొక్కా


చిరిగిన పంచె చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల  చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు మీ కోసం ఏమి తీసుకురావాలి అని?.


ఆ వ్యక్తి ఇలా అన్నాడు....

       జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్‌ దోశ తినిపిస్తాను అని  మా అమ్మాయికి వాగ్దానం చేశాను.


                   'మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది. కనుక దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి' అని అతను అడగడం జరిగింది . 'మీ అమ్మాయికైతే ఒక దోశ చెప్పారు.... మరి మీకేమి కావాలి అని అతన్ని వెయిటర్ అడిగాడు ? అతను కొంచం బాధాతత్వ హృదయంతో ఇలా అన్నాడు, ' నా దగ్గర ఒక దోశకి సరిపడే డబ్బే మాత్రమే ఉంది. కాబట్టి ఇంక నాకేమి వద్దు'! 

        విషయం విన్న తర్వాత వెయిటర్ బాధపడి #యజమాని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు ..."నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకోండి" అని వెయిటర్ అనగా....అప్పుడు అది విన్న యజమాని  వెయిటర్ ని  అభినందిస్తూ ఇలా అనడం జరిగింది .... "ఈ రోజు మనం మన హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళకి పార్టీ ఇద్దాం". అన్నాడు, ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు 


                  హోటల్ వాళ్ళు ఒక టేబుల్‌ను చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో  పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ యజమాని వాళ్లకి మూడు దోశలు పెట్టడంతో పాటు పొరుగువారికి కూడా స్వీట్స్ పంచమని  పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడు. తమను చాలా గౌరవించి ,సత్కరించిన హటల్ యజమానికి, వెయిటర్ కి  కన్నీళ్లతో కృతజ్ఞతను తెలిపి అక్కడ నుంచి నిష్క్రమించారు ఆ తండ్రి ,కూతురు.


          సమయం గడిచిపోయింది (కొన్ని సంవత్సరాల పిమ్మట)...

          ఒక రోజు ఆ అమ్మాయే I.A.S. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే #కలెక్టర్‌గా వచ్చింది. ఆమె ముందు తన సర్వెంట్ ని అదే హోటల్‌కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పమన్నారు అనగా. హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్‌ను బాగా అలంకరించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది కలెక్టర్ గారిని చూడటానికి.


       అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో కలసి నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమెను చూసి గౌరవార్థం గా నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించగా .., వెయిటర్ టిఫిన్ ఆర్డర్ కోసం అభ్యర్థించారు. కలెక్టర్ గా ఆ హోటల్ కి వచ్చిన ఆమె ఇలా చెప్పింది- "మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. ఒకప్పుడు నేను ,మాతండ్రితో కలసి మీ హోటల్ కి వచ్చినప్పుడు నేను చదువులో మెుదటి ర్యాంకు తెచ్చికొన్న విషయం మీకు తెలిసి.. మా వద్ద తగినంత ధనం లేకున్నా కూడా మీరు  సంతోషంతో మాకు అన్ని వడ్డించడమే కాక మా వద్ద నుండి ఒక్క పైసా కూడ అడగక పోవడమే కాక మమల్ని మీరు ఘనంగా సత్కరిృచడం జరిగింది .                                                ఆనాడు మీరిద్దరూ #మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు, నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి, మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేసి ఇచ్చారు.


       ఈ రోజు నేను మీ ఇద్దరి ఆశీస్సుల వల్ల కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ నా జన్మంతా గుర్తుంచుకుంటాను. ఈ రోజు ఈ పార్టీ నా తరుపున, ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను.  అలా అని అందరి ముందు హోటల్ యజమనితో పాటు వెయిటర్ని కూడా సత్కరించడం జరిగింది.


నీతి: పేదరికాన్ని ఎగతాళి చేయకుండా, వాళ్ళలో ఉన్న #


ప్రతిభను గుర్తించి గౌరవించండి.... వాళ్ళను ప్రోత్సహించండి 💐🙏💐

నీతో నీవు పోరాడు

 మనం ఎక్కడైతే అంతా ఐపోయింది ఏం లేదు అని నిరాశ చెందుతామో,,



అక్కడే మొదలవుతుంది,

ఎలా మొదలవుతుంది అంటే  నిన్ను పడగొట్టినవారు   కళ్ళు చేదరెలా నిలబడతావు,,

 స్థానం అదే,,

నీవు పతనం ఐపోయావు అని చూసినా వాళ్లకి,,

 నీ ఎదుగుదల అసలు ఊహకే రాదు,,

అలసిపోయి ఆగిపోకు,,

ప్రాణం ఉన్నంతవరకు పోరాడు,,

ఎవరితోనూ పోరాడకు నీతో నీవు పోరాడు,,

నిన్ను నీవు గెలుచుకుని నిలబడినప్పుడే,

ప్రపంచాన్ని జయించగలవు....


Sunday, June 23, 2024

ఓ కుర్రాడు కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు

 ఓ కుర్రాడు కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు



ఎంత కోపంతో వచ్చాడంటే.. తను చూసుకోలేదు తనకాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.


కొడుక్కి ఒక మోటార్ సైకిల్  కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో..

అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.


చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని గట్టిగా నిశ్చయించుకున్నాడు. 

ఇంటి నుండి వచ్చేప్పుడు కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు

కొట్టుకోచ్చేశాడు 


అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే

ఉంటాయని వాడి నమ్మకం.


నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది . కరుస్తూ ఉన్నట్టు ఉంది . బూటు లోపల సాఫ్ట్ గా లేదు .

వాడి మడమ నొప్పెడుతోంది .


అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .లోపల తడి తడి గా అనిపించింది .

కాలు ఎత్తి చూశాడు....బూటు అడుగున చిన్న కన్నం..కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! 


బస్ స్టాండ్ విచారణ కౌంటర్లో వాకబు చేస్తే తెలిసింది...ఇంకో గంట దాకా బస్ ఏదీ లేదని 


సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …నాన్న పర్సు లో ఏం ఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు .


ఆఫీసు లో 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు ,


కొడుకు కోసం కొన్న లాప్ టాప్ బిల్లు,


ఆఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లుతో రమ్మని మేనేజర్ ఇచ్చిన  మెమో


పాత స్కూటర్ తెండి – కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి . గొప్ప ఎక్చేంజ్ మేలా అని రాసి ఉన్న కరపత్రం..


ఇవి కనబడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో…

వాటిని చూసాక ఈ కుర్రాడి కళ్ళు చెమర్చాయ్


వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు .

సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు . 

ఇళ్లంతా వెతికాడు, కానీ ఇంట్లో

నాన్న లేడు. స్కూటరూ లేదు .

అతడికి తెలిసిపోయింది.....


నాన్న తన స్కూటర్ తీసుకొని

ఎక్స్చేంజ్ మేలా కు వెళ్లాడని..

అతి ప్రేమగా చూసుకుంటున్న 

తన స్కూటర్ ను అక్కడిచ్చి..

తన కోసం బైక్ తేడానికే ఖచ్చితంగా వెళ్లాడని…

ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి.

పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు . 


వాళ్ల నాన్న అక్కడే ఉన్నాడు,

ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు. 


ప్రస్తుతం యూత్ కి బాగా ఇష్టమైన

మోడల్ బైక్ ఏదో చూపించు..

దాని మీద నా కొడుకు హీరో లా

ఉండాలి అని చెబుతున్నాడు..

వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది. 

అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూసాడు. 

అప్పుడు ఆ అబ్బాయి నాన్నని కౌగిలించుకొని

”వద్దు నాన్నా ! వద్దు నాన్నా !

నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా.."

అంటూ ఏడవసాగాడు !


ఇంటికి వెళుతూ వెళుతూ… 

తండ్రి కోసం  కొత్త షూస్ కొని తీసుకువెళ్ళారు 

ఆ తండ్రీకొడుకులిద్దరూ….!


మీకోసం 

తన జీతాన్నే కాదు...

జీవితాన్నీ దారపోసి....

సర్వస్వాన్నీ సమర్పించిన

ఆయన 

త్యాగాన్ని గుర్తించండి !

బంధాన్ని గౌరవించండి !!

మనసారా ప్రేమించండి !!!


మన పిల్లలకు మన ఆస్తులు కాదు...విలువలతో కూడిన ధర్మాలు ఇవ్వండి....మన సంస్కృతీ 

సాంప్రదాయాల గొప్పదనం చెప్పండి.


🌿🌼🙏🙏తండ్రి  ప్రేమని అర్థంచేసుకున్న  ప్రతి ఒక్క కొడుకుకి అంకితం🙏🌼🌿

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE