NaReN

NaReN

Friday, September 16, 2022

అందరూ మనసు పెట్టి చదవాల్సిన కథ

 అందరూ మనసు పెట్టి చదవాల్సిన కథ


ఒకవూరిలో పాడుబడ్డ దేవాలయం గోపురాన్ని నివాసంగా చేసుకొని కొన్ని పావురాలు  

ప్రశాంతంగా జీవిస్తుండేవి..ఒకరోజు ఊరివారందరూ కలిసి ఆ గుడిని బాగుపరిచి ఉత్సవం చెయ్యాలని గుడికి మరమ్మత్తు పనులు మొదులుపెట్టారు.


వెంటనే పావురాలన్నీ గుడి గోపురాన్ని వదిలి కాస్తాదూరంగా వున్నచర్చి మీదికి చేరు కున్నాయి..ఆ చర్చి మీద  

ఎప్పట్నుంచో  నివసించే పావురాలు ఈ పావురలన్నింటికీ స్వాగతంపలికాయి.

తమతో పాటే వుండమన్నాయి.పావురాలన్నీ చక్కగా సర్దుకున్నాయి.కొన్నాళ్ళకు చర్చి గంటలు మ్రోగడం ఎక్కువైంది.క్రిస్మస్ దగ్గర పడిందని జనం తాకిడి ఎక్కువైంది.చర్చికి అలంకరణ చెయ్యాలని అనుకున్నారు. చర్చి అధికారులు.


పావురాలన్నీ మరో దిక్కున వున్న మసీదు పైకి  ఎగిరిపోయాయి.మసీదు మీద వున్న పావురాలు వీటిని సాదరంగా ఆహ్వానించాయి.వచ్చినందుకు సంతోషపడ్డాయి.వివరం తెలుసుకొని మసీదు మీద అందరికీ చోటు సరిపోతుందని చెప్పి వూరడించాయి.ఏ దిగులూ లేకుండా హాయిగా అన్నీ కలిసిమెలిసి  జీవించసాగాయి. 


ఇంతలో  రంజాన్ మాసం వచ్చింది.మసీదుకు రంగులు వెయ్యాలని అనుకున్నారు.పావురాలన్నీ కలిసి ఏమిచెయ్యాలో మాట్లాడుకొని మళ్ళీ పాత గుడి మీదికి చేరుకున్నాయి.అన్నీ చక్కగా సర్దుకున్నాయి.


ఒక రోజు ఆవూరి మార్కెట్ మధ్యలో మతకలహాల విధ్వంసం మొదలైంది.పిల్లలూ,ఆడవాళ్ళూ,ముసలివాళ్ళూ కేకలూ కత్తుల కంటిన నెత్తురు ఎవరిదో  

తెలియడంలేదు.  గోపురం మీది నుంచి చూస్తున్న చిట్టిపావురం అమ్మా ఎవరే వాళ్ళు?అని తల్లి పావురాన్ని అడిగింది.


వాళ్ళను మనుషు లంటారు.తల్లి పావురం చెప్పింది.ఎందుకు కొట్లాడుకుంటున్నారు?అని అడిగింది చిట్టి పావురం..అప్పుడు తల్లి పావురం యిలా అంది.ఈ గుడికి వచ్చేవాళ్ళను హిందువులు అంటారు,చర్చికి వచ్చే వారిని క్రైస్తవులు అంటారు,ఆ మసీదు కు వెళ్ళే వాళ్ళని ముస్లిములు అంటారు.అని యింకా 

వివరించ బోతుంటే గుడి మీదవున్నా, చర్చి మీద వున్నా,మసీదు మీదవున్నా మనల్ని  

పావురాలనే అంటారుకదా మరి వాళ్ళనెందుకు రకరకాలుగా పిలవడం?అందరినీ మనుషులు అని అనరెందుకు?


చిట్టిపావురం అమాయకంగా అడిగింది.తల్లి పావురం నవ్వి దైవం అనే భావన మనలో వుంది కాబట్టి మనం వాళ్ళకంటే ఎత్తులో ప్రశాంతంగా వున్నాం.


ఈ మనుషులకి అంత జ్ఞానం లేదు అందుకే దిగువన వున్నారు.అలా కొట్టుకుంటూ దైవానికి దూరమవుతూనే వుంటారు.అని చెప్పింది.చిట్టి పావురం కువ కువ మంటూ మార్కెట్ వైపు యెగిరి పోయింది.పాపం అదేమీ చెయ్యలేదని దానికి యింకా తెలీదు.



Thursday, September 15, 2022

నీ ఓటు విలువ

 నీ ఓటు విలువ



నియోజకవర్గంలో....ని

ఏ ఒక్కమగాడి ఒంట్లోనుండి   

వీసమెత్తు మత్తుదిగకుండా సూడండీ

ఓటు హక్కున్న ఏ ఒక్కఆడది కైకిలికిపోకుండా కాపలాకాసీ 

కూలిచ్చి మన ప్రచారానికి పిలుచుకపోండీ


పిడుచగట్టుకపోయిన ఆ లేకి నాలుకలమీద 

పూటపూటకి నాలుగు పెగ్గుల సొప్పున చీపులిక్కరిని పొయ్యండి

వాళ్లే......

పొంగిపోయి మన వెంట నడుస్తారు

వాళ్లే....

నిక్కీ నీలిగీ మనకోసం నినాదాలిస్తారు


మడిసి మడిశి మశివంతపేలికలైన ఆ  ముడుతకొంగుల ముఖాన 

ఓ మోపెడన్నీ చీరెల మూటల్ని ముట్టజెప్పండి

వాళ్లే....

కట్టుకొనచ్చి మన ప్రచారలకి పబ్బతులు పడుతారు

వాళ్ళే....

జట్లుజట్లుగొచ్చి మన జీపులముందు జానపద కోలాటమాడుతారు


మన పుట్టినరోజులకి  ఫ్లెక్సీలు కడుతూ

మన పెళ్లిరోజులకి కేకులు కట్జేస్తూ యూత్ లీడర్లుగా ఊరుమీద పడి తిరుగుతున్న ఆ హౌలా అవారాగాళ్ళకి మాత్రం ముందస్తు బయానాలు ఇచ్చేయండి 

వాళ్లే.... 

మన కాన్వాయిల వెనుక  కుక్కలై తిరుగుతారు

వాళ్లే.... 

మన రథయాత్రలముందు రిమ్మచ్చి మొరుగుతారు


ఏ కులానికి ఎవరెవరు నాయకులో

ఏ సంఘానికి ఎవరెవరు సంస్కర్తలో 

వాళ్లని పిలిపించి ప్రత్యేక ప్యాకేజీలు మాట్లాడండి

వాళ్లే...... 

వాళ్ల కులభవనాల్లో మన పార్టీ భజనలు చేస్తారు

వాళ్లే....

వాళ్ల సంఘ సభ్యులకి మనకి కట్టుబడి ఉండాలని తీర్మానం చేసుకుంటారు


ఆ ఆట పాటల అలుకతక్కువ ఏశగాళ్లకి 

గోశీ గొంగల్లు పంచి పెట్టండీ

కళాకారులుగా  కైకిలొచ్చే ఆ కూలీ గొంతుకలకి

కొన్నిజతల కొత్తగజ్జెలు ఇప్పించండీ

వాళ్లే.... 

నాలుగురోడ్ల కూడలీలో నిలబడి మన పేర్లమీద పాటలుపాడుతారు

వాళ్లే....

ఊరు వాడల్లో తిరుగుతు మన రాజకీయ వీరంగమాడుతారు


కొసాకరికి

గంపగుత్తగా మనం కొనుక్కున్న ఓట్లెన్ని

రేపు శత్రుశిభిరాలు  చీల్చుకుపోయే ఓట్లెన్ని

చివరాకరికి మన ఉచ్చులో చిక్కుకున్న ఓట్లెన్ని

తెల్లారితో మన గుర్తు మీద గుద్దబడే ఓట్లెన్ని

లెక్కలుతీసి ప్రతీ గడపగడపకు పచ్చనాకులు పంచిపెట్టండి

వాళ్లే....

వాళ్ల చూపుడువేలుతో వాళ్ల కండ్లల్ల పొడుచుకుంటారు

వాళ్లే....మన కుర్సీలముందు కుక్కిన పేనుల్లా పడుంటారు. 


                                         సత్య కలకోటి👣


( ఎవరికి ఓటేస్తున్నాం ఎందుకు ఓటేస్తున్నాం ఎవరెవరు పోటీదారులు ఎవరి ఎజెండాలేంటి 

ఎవరిని ఎన్నుకోవాలి అనే మౌళిక విషయాలు కూడా తెలియని మెజారిటి ప్రజలే ఈ దేశంలో ప్రభుత్వాల్ని ఏర్పరుచుకుంటారు  ఆ ప్రభుత్వ పాలకులచే రకరకాల హింసకి గరవుతుంటారు. 


వాళ్ల నియోజ్కవర్గానికి ఎమ్మల్యే ఎవరో కూడా తెలియని ఎంతోమంది అమాయక ఓటర్లున్న దేశం మనది. 

ఈ దేశంలోని మెజారిటి ప్రజలకి 

ఎలక్షన్ అంటే డబ్బులు, ఎలక్షన్ అంటే మందు ఎలక్షన్ అంటే పాటలు ప్రచారాలు అనే తెలుసు తప్ప ఎలక్షన్ అంటే దేశ భవిష్యత్తుని ఓటుకి దేశ ధిశల్ని మార్చేసేంత దమ్ముందని తెలియదు. ఎందుకంటె ఈ దేశంలో ఎలక్షన్ ఓక జాతర ఆ జాతరలో ప్రజలు తాగుతారు తింటారు ఆడుతారు పాడుతారు వెళ్లిపోతారు తరాలుగా అలవాటుపడ్డ బతుకలవి. 


బహుజన ఓటుబ్యాంక్ బాగానే ఉందికానీ

ఆ బ్యాంకుకి లాకర్లు లేవు కనీసం లాక్ చేయడానికి గేట్లు కూడా లేవు. 

అందుకే ఎవడిపడితే వాడు చొరబడుతాడు ఎప్పుడుపడితే అప్పుడు దోచుకుంటాడు)

పెసరట్టు కావాలా నాయనా అదీ నెయ్యితో....

 పెసరట్టు కావాలా నాయనా అదీ నెయ్యితో....



ఇదిగో...ఇవాళ ఏం టిఫిన్ చేస్తున్నావ్ ? 


మీకేం కావాలో చెప్పండి..


చక్కగా అల్లం, పచ్చి మిరప కాయల్తో ,ఉల్లిపాయ పెసరట్టు వెయ్యి..


ఒకటి చాలా..


ఒకటేం సరిపోతుంది... మధ్యాహ్నం వరకూ మళ్ళీ ఏమీ ఉండదు గా.. 

ఒక నాలుగు వెయ్యి...


నూనెతో నా , నెయ్యితో నా ?


హోటల్లో లా నూనెతో వేస్తే ఏం బాగుంటుంది చెప్పు..

నేతితోనే వెయ్యి... 

రుచి గా ఉండాలి మరి..


ఏం చట్నీ కావాలి ?? 

వేరుశనగల చట్నీ చెయ్యమంటారా ? లేక అల్లప్పచ్చడి కూడా కావాలా ..? 


రెండూ ఉంటే భేషుగ్గా ఉంటుందోయ్...నీకు తెలుసుగా ... 


సరే అలాగే.. ..

ఇదేమిటి ..

కరెంటు పోయిందా ?


అవును..మళ్ళీ వస్తుందిలే ..కంగారు పడకు ..

ఇవాళ పెసరట్లు తిని తీరాల్సిందే...


అలాగే..మీకు చేసి పెట్టడం నాకు కూడా సంతోషమే ..


అన్నట్లు.. 

ఇందాక ఫోన్ వచ్చింది..

లలిత జ్యువెలర్స్ నుండి..దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయి కదా ...

కొత్త కొత్త డిజైన్లు వచ్చాయిట....

ఒక్కొక్క డిజైన్ కి పది, పన్నెండు మాత్రమే చేయించారుట..

తొందరగా వస్తే మంచిదని ఫోన్ చేశారు..


వాళ్ళు నీకెందుకు ఫోన్ చేశారు ?? అనుమానంగా అడిగాడు..


నాలుగేళ్ల క్రితం , గొలుసు మార్చి కొంత డబ్బు వేసి ..ఇదిగో ఈ గొలుసు కొన్నాను కదా..అప్పుడు వాళ్ళ దగ్గర నా ఫోన్ నెంబరు ఇచ్చాను...


అవును..

వాళ్ళు అలాగే చెపుతారు...

మనం డబ్బు చూసుకోవాలి కదా ...


సరే..మీ ఇష్టం.. 

మీకు టిఫిన్ కావాలా..

బయటకు వెళ్లి తెచ్చుకుంటారా ? 


మరి...పెసరట్లు వేస్తానన్నావు ?


అన్నాను గానీ... 

ఇవాళ మనసు బాగోలేదు..ఇంకో సారి చేస్తానులెండి...


మనసు బాగోక పోతే హాస్పిటల్ కి వెళ్తారు... లలిత జువెలర్స్ షాప్ కి వెళ్ళరు ఎవరూ..


భార్యకు బాగో పోతే భర్తలు పెసరట్లు తినరు....

అయినా నేను బంగారం కొనమనేది మీ కోసమేగా ? 


నాకోసమా అదెలా ?? 


నేను పెట్టుకునేది మీ కోసమేగా..

నేను పెట్టుకుంటే మీకే గౌరవం..కాదంటారా ? 


అవుననుకో.... కానీ..


కానీలు, అర్ధనాలు పోయి చాలా కాలం అయ్యింది..బంగారం కొంటే , ముందు ముందు ధర పెరుగుతుంది...మీరు టీచర్  కదా...మీకు తెలియదా..?


అవుననుకో...


మన పెళ్ళప్పుడు పది గ్రాముల బంగారం మూడు వేలు..ఇప్పుడు యాభై మూడు వేలు.. అప్పుడు ఎలాగూ కొన లేదు... ఇప్పుడయినా కొనండి...


మా అమ్మకు కూడా నిన్న రాత్రి ఫోన్ చేసి చెప్పాను..నాలుగు బంగారపు గాజులు ..కొత్త డిజైన్లు కొనుక్కుంటున్నానని....

అమ్మ మిమ్మల్ని ఎంత పొగిడిందో తెలుసా ? 


ఎంత ? ..


ఈ భూమండలం మొత్తం వెదికినా మీలాంటి మంచి అల్లుడు లేడని అన్నది..


అవును..ఆవిడకు నేనంటే అభిమానం..


ఉన్న ముగ్గురు అల్లుళ్లలో మీరే ఆవిడకు గొప్ప... 

నాకు అమ్మ అలా మీగురించి చెపుతూ ఉంటే గర్వంగా ఉంటుంది తెలుసా ? నాకేమీ అక్కర లేదు ఇంకా..


అంటే గాజులు అక్కర లేదా ?...


అవి తప్ప ..

ఇంకేమి వద్దని నా ఉద్దేశం..


ఇప్పుడు ఏం చేద్దాం..

నా దగ్గర పన్నెండు వేలున్నాయి.. నాలుగు గాజులు సుమారు 35 గ్రాములు ఉంటాయి.. ఇంకో రెండు లక్షలు మీరు ఇస్తే చాలు... తరుగు, మేకింగ్ ఛార్జీలు  కూడా ఉంటాయి కదా...మొత్తం డబ్బు మీతో ఖర్చు చేయించటం నాకు ఇష్టం లేదు..


సరే..చూద్దాం..సాయంత్రం వెళ్దాం.


మరి మీరు టిఫిన్ చెయ్యరా ??.


చేస్తాను..


అయితే పదండి..బయటకు వెళ్లి టిఫిన్ చేసి ,అటునుండి లలిత జువెల్లర్స్ కి వెళ్లి గాజులు తెచ్చుకుందాం..


తప్పదా ..


డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి..ఇంకా ఏం ఆలోచించకండి ..


సరే ..నీ ఇష్టం..


ఇద్దరూ దార్లో టిఫిన్ చేసారు.. భర్త రెండు ఇడ్లీలు తిన్నాడు.


భార్య నేతి పెసరట్టు అల్లం చట్నీ తో తింది.. బంగారపు గాజులు బోనస్ గా వచ్చాయి ఆవిడకు..


భర్తలు బయట ఎక్కువగా తినరని మీకెలా చెప్పాలి  ?  వాళ్ళు చేసే త్యాగం గాజులు, నెక్లేస్ ల రూపం లో కనబడుతూ ఉంటుంది అపుడప్పుడు...


ఇంటికి వచ్చిన తరువాత భార్య అన్నది....భర్త తో... మీరెంత మంచి వారండీ ?? 


మళ్లీ ఏడాది వరకూ నాకు పెసరట్టు అక్కర లేదు ..చెప్పాడు భర్త..


అలాగే...ఏడాదికో సారి బంగారం కొన్నప్పుడు బయట తిందాం..హోటల్ లో కుదిరినట్లు ఇంట్లో సరిగ్గా కుదరవు ....


ఆ రోజు రాత్రి తల్లి కి ఫోన్ చేసి చెప్పింది...

మీ అల్లుడు గారు నేను వద్దన్నా వినకుండా ,బోలెడు డబ్బు పోసి ,నాలుగు గాజులు కొన్నారు.. ఆయన బలవంతం చేసి నేతి తో వేసిన పెసరట్టు కూడా  తినిపించారు...నాతో..


నువ్వు అదృష్ట వంతురాలివి తల్లీ....సంక్రాంతి కి కూడా ఏమైనా కొనుక్కో.. తప్పకుండా ...


అలాగేనమ్మా....ఆయన నా మాట కాదనరు...చెప్పింది కూతురు..


నేతి పెసరట్టు తినాలని కోరిక ఉన్న భర్తలు ..

లలిత జువెల్లర్స్ కి వెళ్ల వలసిన ప్రమాదం ఉంటుందని ఈ  జీవితం ప్రతి వార ఫలాల్లో వ్రాసి ఉంటుంది..  

ఆ తరువాత మీ ఇష్టం.

చట్టం తెలుసుకో

 చట్టం తెలుసుకో


ఐపిసిలో సెక్షన్ ల అర్థం     తెలుసుకోండి

======================

  * సెక్షన్ 307 * = హత్యాయత్నం

  * సెక్షన్ 302 * = హత్యకు శిక్ష

  * సెక్షన్ 376 * = అత్యాచారం

  * సెక్షన్ 395 * = దోపిడీ

  * సెక్షన్ 377 * = అసహజ కదలికలు

  * సెక్షన్ 396 * = దోపిడీ

                       సమయంలో హత్య

  * సెక్షన్ 120 * = కుట్ర

  * సెక్షన్ 365 * = కిడ్నాప్

  * సెక్షన్ 201 * = సాక్ష్యాలను తొలగించడం

  * సెక్షన్ 34 * = వస్తువుల ఉద్దేశం

  * సెక్షన్ 412 *= జరుపుకుంటున్నారు

  * సెక్షన్ 378 * = దొంగతనం

  * సెక్షన్ 141 * = అక్రమ డిపాజిట్

  * విభాగం 191 * = తప్పు లక్ష్యం

  * సెక్షన్ 300 *   =   హత్య

  * సెక్షన్ 309 * = ఆత్మహత్య ప్రయత్నం

  * సెక్షన్ 310 * = మోసం

  * సెక్షన్ 312 * = గర్భస్రావం

  * సెక్షన్ 351 * = దాడి చేయడానికి

  * సెక్షన్ 354 * = మహిళలపై సిగ్గు

  * సెక్షన్ 362 * = కిడ్నాప్

  * సెక్షన్ 415 * = ట్రిక్

  * సెక్షన్ 445 * = దేశీయ వివక్ష

  * సెక్షన్ 494 * = జీవిత భాగస్వామి 

               జీవితంలో పునర్వివాహం

  * సెక్షన్ 499 * = పరువు నష్టం

  * సెక్షన్ 511 * = నేరారోపణపై జీవిత ఖైదు.

   

  మన దేశంలో, మనకు తెలియని కొన్ని చట్టాలు ఉన్నాయి.


  ఐదు ఆసక్తికరమైన విషయాలు  

ఆ సమాచారం తెలుసుకుందాం,

  ఇది జీవితంలో ఎప్పుడైనా  

  ఉపయోగపడుతుంది.


 (1) సాయంత్రం 6 గం,,తర్వాత    ఉదయం 6గం,, లోపు  మహిళలను అరెస్టు చేయలేము -


  క్రిమినల్ కోడ్, సెక్షన్ 46 ప్రకారం, సాయంత్రం 6 గంటల తరువాత మరియు ఉదయం 6 గంటలకు ముందు, భారత పోలీసులు ఎంత తీవ్రమైన నేరం చేసినా, ఏ మహిళను అరెస్టు చేయలేరు.  పోలీసులు అలా చేస్తే, అరెస్టు చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయవచ్చు.  ఇది ఈ పోలీసు అధికారి ఉద్యోగానికి హాని కలిగించవచ్చు.


  (2.) సిలిండర్ పేలడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టంపై రూ .4 మిలియన్ల వరకు బీమా పొందవచ్చు


  పబ్లిక్ లయబిలిటీ పాలసీ ప్రకారం, ఏదైనా కారణం చేత మీ ఇంటిలో సిలిండర్ పేలిపోయి, మీరు ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటే, మీరు వెంటనే గ్యాస్ కంపెనీ నుండి బీమా రక్షణ పొందవచ్చు.  గ్యాస్ కంపెనీ నుండి రూ .4 మిలియన్ల వరకు బీమా క్లెయిమ్ చేయవచ్చు.  కంపెనీ మీ దావాను తిరస్కరించినా లేదా వాయిదా వేసినా, దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు.  నేరం రుజువైతే, గ్యాస్ కంపెనీ లైసెన్స్ రద్దు చేయవచ్చు.


  (3) ఏదైనా హోటల్ 5 నక్షత్రాలు అయినా; మీరు ఉచితంగా నీరు త్రాగవచ్చు మరియు వాష్‌రూమ్‌ను ఉపయోగించవచ్చు -


  ఇండియన్ సిరీస్ యాక్ట్, 1887 ప్రకారం, మీరు దేశంలోని ఏ హోటల్‌కైనా వెళ్లి నీరు అడగవచ్చు మరియు త్రాగవచ్చు మరియు ఆ హోటల్ యొక్క వాష్‌రూమ్‌ను కూడా ఉపయోగించవచ్చు.  హోటల్ చిన్నది లేదా 5 నక్షత్రాలు అయితే, వారు మిమ్మల్ని ఆపలేరు.  హోటల్ యజమాని లేదా ఉద్యోగి మిమ్మల్ని తాగునీరు లేదా వాష్‌రూమ్ ఉపయోగించకుండా ఆపివేస్తే, మీరు చర్య తీసుకోవచ్చు.  మీ ఫిర్యాదు ఈ హోటల్ లైసెన్స్ రద్దు చేయబడవచ్చు.


   (4) గర్భిణీ స్త్రీలను తొలగించలేరు -


  ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ప్రకారం, గర్భిణీ స్త్రీలను అకస్మాత్తుగా తొలగించలేరు.  గర్భధారణ సమయంలో, యజమాని మూడు నెలల నోటీసు మరియు ఖర్చులలో కొంత భాగాన్ని చెల్లించాలి.  అతను అలా చేయకపోతే, ప్రభుత్వ ఉపాధి సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు.  ఈ ఫిర్యాదు సంస్థను మూసివేయడానికి కారణం కావచ్చు లేదా కంపెనీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.


  (5) మీ ఫిర్యాదు రాయడానికి పోలీసు అధికారి నిరాకరించలేరు


  ఐపిసి సెక్షన్ 166 ఎ ప్రకారం, మీ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఏ పోలీసు అధికారి నిరాకరించలేరు.  అతను అలా చేస్తే, అతనిపై సీనియర్ పోలీసు కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు.  నేరం రుజువైతే, పోలీసు అధికారికి కనీసం * (6) * నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా తొలగింపును ఎదుర్కోవచ్చు.


  ఇవి ఆసక్తికరమైన వాస్తవాలు, ఇవి మన దేశ చట్టం ప్రకారం వస్తాయి, కాని వాటి గురించి మనకు తెలియదు.  మీ జీవితంలో ఉపయోగపడే ఆసక్తికరమైన విషయాలను మీకు అందించడానికి  నేను నా వంతు ప్రయత్నం చేస్తాను.


  ఈ సందేశాన్ని మీ వద్ద ఉంచుకోండి, ఈ హక్కులు ఎప్పుడైనా చెల్లుతాయి.

=================

Wednesday, September 14, 2022

స్నేహం

 *స్నేహం* 🤝


 *వ్యక్తుల మధ్య స్నేహం కలగడానికి* 

 *కారణం ఏదైనా కావచ్చు.* 

 *కానీ...* 

 *నిజమైన స్నేహం కోరుకునేది మాత్రం* 

 *ఎదుటి వాళ్ళ మంచినే...* 

 *నిజమైన స్నేహం ఎదుటి వాళ్లు* 

 *వాళ్ళ జీవితం మీద వాళ్లకు ఉన్న* 

 *స్వేచ్ఛను స్వాగతిస్తుంది.* 


 *ఒక్కోసారి స్నేహం* 

 *గొడవతో కూడ మొదలు కావచ్చు.* 

 *ఇద్దరి ఆలోచనలు వేరు కావచ్చు.* 

 *అంతరాల మధ్య తేడా ఉండచ్చు.* 

 *అభిప్రాయాలు కలువక పోవచ్చు.* 

 **ఇద్దరి ఇష్టాలు వేరు కావచ్చు.* 

 *అయిన కొంత మంది మంచి స్నేహితులుగా వుంటారు.* 


 *మంచి స్నేహం  జీవితాల త్యాగాన్ని కోరుకోదు* 

 *వ్యక్తిగత అభిప్రాయాలు గౌరవించుకుంటుంది* 


 *స్నేహం అంటే తలకు మించిన భారాన్ని ఎత్తుకోవడం కాదు.* 

 *ఆపదలో ఉన్నప్పుడు నీకు నేను ఉన్నా నేస్తం అని భరోసా ఇవ్వడం* 

 *నీకోసం ఏదైనా చేస్తా అని ప్రగల్భాలు పలకడం కాదు.* 

 *జీవితంలో ముందడుగు వెయ్యటానికి తోచిన మంచి సలహాలు ఇవ్వడం..* 


 *కానీ... అదే స్నేహం ఎదుటి వాళ్లలో ఒక్కోసారి మార్పును కోరుకుంటుంది తప్పు లేదు.* 

 *కానీ ఖచ్చితంగా మారాలి అనడం స్వార్థం* 

 *అక్కడ స్నేహం కనబడదు..* 


 *నిజమైన స్నేహాం నచ్చనప్పుడు మౌనంగా దూరం అవుతుందే తప్ప  ఆంక్షల పంజరంలో దాన్ని బంధీ చెయ్యదు..* 



సంపద

 సంపద 

వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. 

పెద్దయ్యారు..పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్లకు..ఒకరు గోవింద్ ..ఇంకొకరు శ్రీనాథ్..

 ఇద్దరి పుట్టిన ఊరు బాసర.. అక్కడే చదువు, సంస్కారం నేర్చుకున్నారు..

 

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం ఇద్దరికీ.. గోవింద్ స్కూల్ టీచర్.

 శ్రీనాథ్ కి సెక్రటేరియట్ లో ఉద్యోగం... ఏరా అంటే ఏరా అనే సాన్నిహిత్యం వాళ్ళది... 


జీవితం మాత్రం శ్రీనాథ్ ని కొంచెం డబ్బున్న వాడిగా మార్చింది..గోవింద్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్ గా ఉండి పోయాడు..అద్దె ఇల్లు, సిటీ బస్ ప్రయాణం మామూలు విషయం గోవింద్ కి..కానీ ఎప్పుడూ తన స్థితి కి బాధ పడలేదు..


పెళ్లయిన తరువాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాల్లో... 


గోవింద్ భార్య  సరళ..పేదింటి అమ్మాయి.. గోవింద్ మేనమామ కూతురే.. అందలం ఎక్కాలని ఆశ సరళ కు..కానీ తీరేదెలా ?


ఎప్పుడయినా సరళ హంగులు, ఆర్భాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునే వాడు గోవింద్.. మన దేశం లో నూటికి 40 మందికి ప్రతి రోజూ తిండి లేదు..వాళ్ళతో పోలిస్తే మనం నయమే కదా అంటాడు..పాపం సరళ కోరికలు తీర్చలేనందుకు కొంచెం బాధ పడుతూ ఉంటాడు అప్పుడప్పుడు..


ఆడవాళ్లు  తమ పక్కన వాళ్ళతో పోల్చుకుని తమ జీవితాలలో లేనివి ఏమిటో ఇట్టే తెలుసుకుంటారు... వాళ్లకు ఉన్న గొప్ప విషయాలను  మాత్రం అంతగా పట్టించు కోరు.. ఇక్కడ కూడా అదే జరిగింది... సొంత ఇల్లు, సొంత కారు లేవని బాధ సరళకు....  


శ్రీనాథ్ భార్య లక్ష్మి.. మంచి కుటుంబం నుండి వచ్చింది.. దాన ధర్మాలు చేయటం అలవాటు..దైవ భక్తి మెండుగా ఉంది...ఉన్న సంపద ను చూసి మిడిసి పాటు లేదు లక్ష్మికి...  లక్ష్మి, సరళ కూడా స్నేహితులయ్యారు. 

ఇళ్లకు రాక పోకలు కూడా బాగానే ఉన్నాయి...  లక్ష్మి కి సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది.. పిచ్చి పిల్ల.. సంపదలు ఉన్నా , సఖ్యం మరియు సౌఖ్యం ఉండాలి జీవితం లో ..అదే చెప్పింది చాలా సార్లు.. నువ్వెన్నయినా చెప్పు లక్ష్మీ... డబ్బులున్న దారే వేరు..చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు ? ఎవరికి ఉపయోగ పడినట్లు..?? 

రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.. నలుగురూ పెద్దవాళ్ళయ్యారు...


అది ఆగస్ట్ నెల.. ఆ నెలలో శ్రీనాథ్  రిటైర్ అవుతున్నాడు...మరుసటి నెల సెప్టెంబర్ లో గోవింద్ రిటైర్మెంట్ ..


ఆగస్ట్ 31 వ తారీకు రానే వచ్చింది..శ్రీనాథ్, లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు.. రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావాలని... పిలవక పోయినా గోవింద్ వెళ్ళేవాడే.. ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది... శ్రీనాథ్ యూడీసీ గా రిటైర్ అయ్యాడు.. ఫంక్షన్ బాగా జరిగింది సెక్రటేరియట్ లో వాళ్ళ డిపార్ట్మెంట్ లో.. చాలా మంది శ్రీనాథ్ ని మెచ్చుకున్నారు..మంచి వాడు.. పని లో చురుకుదనం చూపించే వాడని.. అతను రిటైర్ అవటం డిపార్ట్మెంట్ కి తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు..


స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు... మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్ కి మళ్ళీ స్నేహితుడుగా పుట్టాలని..స్నేహానికి ప్రాణం ఇచ్చే శ్రీనాథ్ తనకు తన కుటుంబం లో మనిషని చెప్పాడు.. అందరూ ఆనందించారు...


ఆ రాత్రి దగ్గర్లో ఉన్న కామత్ హోటల్ లో భోజనం చేశారు శ్రీనాథ్, గోవింద్ కుటుంబాలు... చాలా రోజుల తరువాత సరళ బయట భోజనం చేసింది.. ఆమెకు నిజంగా అసూయగా ఉంది.. శ్రీనాధ్ ది మంచి ఉద్యోగం.. రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చేసారు..అందరూ పొగిడారు ఆయనను..


వచ్చే నెల లో తన భర్త గోవింద్ రిటైర్మెంట్ వుంది.. మామూలు స్కూలు టీచర్ గా చేరి ఇప్పుడు ఒక స్కూల్ హెడ్మాస్టర్ గా రిటైర్ అవుతున్నాడు.. అప్పుడు ఫంక్షన్ యెలా జరుగుతుందో ఏమో ?? శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లా ఆర్భాటంగా ఎలాగూ జరగదు...కనీసం లో కనీసం తల దించు కోకుండా జరిగితే చాలు...అలా చాలా మంది దేవుళ్ళకు మొక్కింది..


రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళ లో ఆందోళన పెరిగి పోతూ వచ్చింది... ఇద్దరూ వెళ్లి శ్రీనాథ్ ని, లక్ష్మి నీ పిలిచారు ఫంక్షన్ కి..మనసులో మాత్రం, న్యూనతా భావం నిండి ఉండటం వలన ,  సరళ వాళ్లు రాక పోతే బాగుండునని చాలా సార్లు అనుకుంది.. గోవింద్ మాత్రం మామూలుగానే  ఉన్నాడు.. మామూలు రోజుల్లాగే రిటైర్మెంట్ రోజు వచ్చింది..


ఆ రోజు మామూలు గా స్కూల్ కి వెళ్లి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు.... అదే తన ఆఖరి క్లాసు కావటం తో రుద్ధమైంది ఆయన గొంతు..  కష్టం మీద క్లాసు కానిచ్చి స్టాఫ్ రూమ్ కి వచ్చాడు గోవింద్..


సాయంత్రం నాలుగు గంటలయ్యింది..  ఆ పాటికే సరళ ను , పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్లు కూడా స్కూల్ కి వచ్చారు.


శ్రీనాథ్ కి చాలా సంతోషంగా ఉంది..గోవింద్ రిటైర్ అవుతున్నాడు.. వాడూ ,తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలి..ప్లాన్ వేసుకున్నాడు.


సరళ కు బెంగగా ఉంది..ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది తనకు.. ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండును..అనుకుంది.


తలవొంపులుగా ఫంక్షన్ జరుగుతుంది ..తను తట్టుకోలేదు...మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేలమంది, లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయటానికి... టీచర్  రిటైర్మెంట్ అంత గొప్ప విషయం కాదు.. తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని ఆరాటం సరళకు.. పిల్లలు కూడా వచ్చారు..తండ్రి రిటైర్మెంట్ చూడడానికి...


సరళ వాళ్ళను స్టాఫ్ రూం లో కూర్చో బెట్టారు..మిగతా టీచర్లు..


అప్పటి వరకూ పెద్దగా జనం లేరు . విద్యార్థులు , టీచర్లు అందరూ కలిసి ఒక వంద మంది ఉంటారు.. వాళ్ళు రోజూ స్కూల్లో ఉండే వాళ్లే కదా.. సరళ కు పెద్దగా సంతోషం కలగ లేదు ... ఇంకో పది నిముషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా ...ఎక్కడినుండి వచ్చారో..దాదాపు ఇంకో వంద మంది పైనే జనం వచ్చారు..వాళ్లు పిల్లల బంధువులని తెలిసింది... 


ఫంక్షన్ ఆరుబయట చెయ్యాలని నిర్ణయం చేశారు...అందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు..చాలా మంది నుంచునే ఉన్నారు...ఫంక్షన్ అయ్యేంత వరకూ..


ఎక్కడి నుండో పల్లకీ ని తీసుకు వచ్చారు... మాస్టారు గోవింద్ ను పిల్లలు పల్లకీ లో కూర్చుండ బెట్టారు.. కొంత మంది టీచర్లు, పిల్లల బంధువులు పల్లకీ మోయటానికి సిద్ధ పడ్డారు... సరళ కు అంతా కల గా ఉంది... పల్లకీ లో  గోవింద్ ని కూర్చో బెట్టి లేప బోతుండగా ఎవరో అరిచారు..

మాస్టారి గారి ధర్మ పత్ని ని కూడా పల్లకీ లో కూర్చో బెట్టాలని.. అందరి బలవంతం మీద పల్లకీ లో కూర్చుంది సరళ.. గోవింద్ తో...పెళ్లి రోజు తరువాత మళ్లీ ఇన్నాళ్ళకు...పల్లకీలో ఎక్కడం.. సరళ కు సంతోషం తో కళ్ల వెంట నీళ్ళు వచ్చాయి..


పల్లకీ లేచింది..చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకీ మోస్తున్న వాళ్ళకు సాయపడుతున్నారు.. ఆ దృశ్యం మనోహరం గా ఉంది.. కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండునని అనిపించింది సరళ కు.. గోవింద్ కి భాధ గానూ, సంతోషం గానూ ఉంది..పిల్లలూ జాగ్రత్త .. మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్ళను వారిస్తున్నాడు..అయినా వాళ్లు వినటం లేదు ...


ఇంతలో పల్లకీ ని దింపారు.. ఎందుకో అర్థం కాలేదు సరళ కు, గోవింద్ కు... 


కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్ కి ఆ వచ్చినాయన... గోవింద్ కాళ్ళకు దండం పెట్టాడు.. ఆ వచ్చినాయన జిల్లా ఎస్పీ గారు.. వెంట పది మంది పోలీసులు..  ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆగింది.. వచ్చింది జిల్లా 

జడ్జ్ గారు..ఆయన కూడా తన వాళ్ళతో వచ్చారు.. 


జిల్లా ఎస్పీ, జడ్జ్ గారు, 

మిగతా వాళ్లు పల్లకీ మోస్తుండగా నిర్ణీత స్థలానికి చేరారు..


నీళ్ళు, కాళ్ళు  కడిగే ఇత్తడి పళ్ళెం వచ్చాయి...ఎక్కడి నుండో... ఎస్పీ, జడ్జ్ గార్లు గోవింద్ మాస్టారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నారు... కొంత మంది ఆడవాళ్ళు హారతి ఇచ్చారు గోవింద్ కి, సరళ కు.. ఆ రోజు పూల వాన కురిపించారు అందరూ  వారిద్దరి మీద..


పిల్లలు మాస్టారు గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేసారు.

ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే..అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.. జిల్లా ఎస్పీ,జడ్జ్ కూడా మాట్లాడారు. తమ జీవితం లో తాము సాధించిన విజయాలు అన్నీ గోవింద్ మాస్టారి వలనే అని గర్వంగా చెప్పారు.. ఆయన పక్కన కూర్చోవటం కూడా వాళ్లకు మనస్కరించక నుంచునే ఉన్నారు..చాలా సేపు... 


అప్పటి వాతావరణం చెప్పటం కష్టం.. శ్రీనాథ్ సంతోషం చెప్పనలవి కాదు..తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం..అది.. వాడికి జరిగినా తనకూ జరిగినట్లే... 


శ్రీనాథ్ మాట్లాడుతూ చెప్పాడు..ఇక్కడున్న ఇన్ని వందల మంది లో  తనొక్కడే గోవింద్ ని ఆప్యాయంగా ఒరేయ్  అని పిలువ గల అర్హత  కలవాడవటం  సంతోషంగా ఉందని అన్నాడు..


చివరగా గోవింద్ మాట్లాడాడు..

పిల్లలందరికీ నా ఆశీస్సులు... ఒకప్పటి నా విద్యార్థులు ఈ నాడు జిల్లా కు జడ్జ్ గానూ, ఎస్పీ గానూ ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ..ఇలా పిల్లల్ని మంచి ఉన్నత స్థితి లో చూడటం తనకు గర్వ కారణం అనీ, ఈ పిల్లలే తన ఆస్తి ,ఐశ్వర్యం , వీళ్ళే నా సర్వస్వం అంటూ ...మాట్లాడలేక పోయాడు.

 

నాకు ఇంత గొప్ప వరం ఇచ్చిన భగవంతుడిని కోరేదొకటే అన్నాడు.. నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తును, దీర్ఘాయువును ఇమ్మని కోరాడు..


పిల్లలను పట్టుకోవడం ఎవరి తరం కాలేదు..అంతలా అభిమానించారు  గోవింద్ మాస్టారును.. 


ఫంక్షన్ ముగిశాక  అందరూ కలిసి వచ్చి గోవింద్ ని ఇంటి వరకూ దిగ బెట్టారు....వెళ్ళలేక వెళ్ళారు పిల్లలందరూ...


ఆ రోజు రాత్రి  శ్రీనాథ్ , లక్ష్మి వారి పిల్లలూ గోవింద్ ఇంట్లోనే ఉండి పోయారు...


భోజనాలు అయిన తరువాత గోవింద్ పాతికేళ్ల  కొడుకు సుబ్రహ్మణ్యం,  తల్లితో అన్నాడు... నాన్న గారికి ఇంత ఆస్తి ఉందని నాకు ఇంత వరకూ తెలియదమ్మా ....


నాకూ ఇంత వరకూ తెలియదురా  అన్నది సరళ ఎంతో సంతోషంగా.. .


శ్రీనాథ్ కల్పించుకుని అన్నాడు..

వీడు కుబేరుడికి ఏం తీసిపోడు.. మనః స్ఫూర్తిగా చెపుతున్నాను.. 


సరళ గోవింద్ వంక చూసింది.. గోవింద్ ...మనకు ఈ సంపద చాలు సరళా  ఈ జన్మకు ...  అన్నాడు..


ఆకాశం లో ఒక మెరుపు మెరిసింది.. గురువులు పూజ్య నీయులు .. వారు ప్రోగు చేసుకున్న  అస్తి పిల్లల అభిమానమే... అన్నట్లుగా... 




🌸🌸🌹🌹

Tuesday, September 13, 2022

ఈ క్రింది ఫొటోలో రోడ్డు పక్కన శవమై పడి ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా?

 ఈ క్రింది ఫొటోలో రోడ్డు పక్కన శవమై పడి ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా?



ఆయన పేరు సైరస్ మిస్త్రీ.  టాటా గ్రూపుకు మాజీ ఛైర్మన్. ఆస్తి రూ. 80 వేల కోట్లు.


సెప్టెంబర్ 4న గుజరాత్ నుంచి ముంబైకి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యారు. వెనుక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ, ఇంకో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు.


వారున్నది మెర్సిడెజ్ బెంజ్ GLC 220D. రూ.3 కోట్ల విలువైన లగ్జరీ కారు. ప్రయాణీకుల పూర్తి సేఫ్టీ కోసం ఏడు ఏర్ బ్యాగ్స్ (airbags) ఉన్నాయి. అవి ఆయన ప్రాణాన్నికాపాడలేదు. 


ఆయన 80 వేల కోట్ల రూపాయల ఆస్తి ఆయన ప్రాణాన్ని కాపాడలేదు. 


అందరి ప్రయాణం ఏదో ఒక సమయంలో ముగుస్తుంది. జీవితాన్ని ఉన్నదానితో  ఆనందంగా గడప౦డి. జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు.


మీకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాణ్ణి చూసి ఏడవకండి. ఇంకా ఇంకా సంపాదించాలి, కులపోళ్ళల్లో మేమే నెంబర్ 1, చుట్టుప్రక్కల గ్రామాల్లో మేమే అందరికంటే గొప్పగా ఉండాలి అనే తపనను మానండి.   


మీకంటే తక్కువ స్థాయిలో, మీకంటే కష్టాల్లో ఉన్నవాడిని చూసి జీవించండి. సంతృప్తిగా ఉండే జీవితంలో ఉన్న ఆనందం ఎన్ని వేల కోట్లిచ్చినా మార్కెట్లో దొరకదు, ఎవరూ అమ్మరు, అమ్మలేరు.


గ్రీకు వీరుడు అలెగ్జాండర్‌ విశ్వవిజేతగా ప్రపంచాన్ని గెలిచిన యోధుడని, అతి పరాక్రమ వంతుడని చరిత్ర చెబుతోంది. 20 ఏళ్లకే సింహాసనం ఎక్కాడు.  ప్రపంచాన్నంతా జయించి, చివరలో విషజ్వరం వచ్చి 33 ఏళ్లకే చనిపోయాడు. వైద్యులు రేయింబవళ్ళూ కష్టపడ్డా ప్రాణాలను నిలుపలేకపోయారు. ఇంతటి యోధుడు చనిపోయే ముందు తన వారిని దగ్గరకు పిలిచి మూడు కోరికలు కోరాడు. మొదటి కోరికగా తన శవపేటికను తన వైద్యులు మోయాలని కోరాడు. రెండవ కోరికగా తన శవపేటిక వెంబడి మణులు, మాణిక్యాలు వెదజల్లించండని కోరాడు. మూడవ కోరికగా తాను చనిపోయిన తరువాత తన రెండు చేతులను శవపేటిక నుంచి బయటకు పెట్టి ఊరేగిస్తూ శ్మశానికి తీసుకెళ్లి, అక్కడ కూడా తన రెండు చేతులు బయట పెట్టి ఖననం చేయండని కోరాడు. 


ఆ కోరికలకు అర్ధం ఏమిటని అలెగ్జాండర్‌ను ప్రాణస్నేహితుడైన ఓ సైనికాధికారి అడిగాడు. అప్పుడా గ్రీకు చక్రవర్తి ఇలా చెప్పాడు. "నా ప్రజలంతా ఈ పచ్చి నిజాలను తెలుసుకోవాలి. వైద్యులు ఎంత మంది వెంట ఉన్నా మరణాన్ని ఆపలేరు. మనచుట్టూ ఎన్ని ధనరాశులు ఉన్నా ప్రాణం పోయే సమయంలో అవి మనల్ని కాపాడలేవు. రెండు చేతులు ఎందుకు బయట పెట్టమన్నానంటే .. నేను ఎన్నో రాజ్యాలను కొల్లగొట్టాను, వేలకొద్దీ ఏనుగులు మోసేట౦త వజ్ర వైడుర్యాలు, బంగారం స౦పాది౦చాను. అయినా ఏవీ నేను నాతో తీసుకపోవడం లేదు అని చెప్పడానికే నా రెండు చేతులు బయట పెట్టమంటున్నాను. జీవితమంతా పోరాడి కూడబెట్టిన ధనరాశులను పోయేటప్పుడు పట్టుకుపోలేం… పుట్టినప్పుడు వట్టి చేతులే,  ప్రాణం పోయినప్పుడు కూడా వట్టి చేతులతోనే వెళ్తాం అని నా చావు ద్వారా ప్రజల౦దరికీ చెప్పాలనుకున్నాను,” అని చెప్పాడు అలెగ్జాండర్‌.....

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE