NaReN

NaReN

Friday, July 15, 2022

సినిమా హాల్లో .. స్నేహితుడు

 సినిమా హాల్లో... స్నేహితుడు


మా ఆవిడ సినిమాకి వెళదామంటే.. సరే అని  వెళ్ళాం.టికెట్స్ తీసుకొని లోపలికి వెళుతుంటే..

ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపి గాడు నన్ను గుర్తు పట్టాడు. పలకరించుకున్నాక, మా ఆవిడకి పరిచయం చేశాను. ఇంటర్లో క్లాస్ మేట్ అని..!


         హాల్లో కూర్చున్నాక అడిగింది.. "అదేమిటండి మీ క్లాస్మెట్ అంటున్నారు.....ఇలా గేట్ దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం.." అంది.


      "ఏమో చదువు అయ్యాక, ఇప్పుడే గదా కలిసింది" అన్నాను.వాడిల్లు చిన్నప్పుడు మా వీధిలోనే...చాలా అల్లరి వెధవ....సినిమాల పిచ్చి ఎక్కువ...ప్రతి రోజు పేపర్ తిరగెయ్యటం, ఏ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో చూడటం...


                ప్రతీ సినిమా రిలీజ్ రోజే ఉదయం ఆట చూసేయ్యటం... సినిమా హాల్స్ కేబిన్ దగ్గరకి వెళ్ళి తెగి పోయిన ఫిల్మ్ ముక్కలు ఏరు కోవటం..ఇదే పని.

         అప్పుడప్పుడు వాడి డబ్బులుతో నేల టిక్కెట్ కి  నన్ను కూడా తీసుకెళ్లేవాడు...

           "ఎందుకురా" అంటే.. "ఒక్కడిని అయితే బెంచ్ టికెట్ తీసుకునేవాడిని.. నువ్వూ వస్తే 2నేల టికెట్స్.. అంతే గదరా.." అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా...!


            "మా పెద్దోళ్ళు, వాడితో తిరిగితే ఎక్కడ  చెడి పోతామో అని వాడితో ఆడనిచ్చే వారు కాదు.చివరకు వాళ్ళు చెప్పినట్టే, వీడు లైఫ్ లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలడ్డాడు" అన్నాను.


        "మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోడులా ఉన్నాడు....లేపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకి ఎందుకు తీసుకెళుతాడు..

అయినా మీరు మటుకు చేసేది ఏమైనా పెద్ద కలక్టర్ ఉద్యోగమా ఏంటి....ఇప్పటి వరకు  స్కూటర్ దాటి మరేం కొనలేదు" అంటూ భార్య దెప్పింది.


       నాకు ఉక్రోషం వచ్చి "ఎలా చూసినా వాడికంటే బెటరే కదే" అన్నాను.


        ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చిన..ఆ కుర్రోడికి డబ్బులు ఇవ్వబోతుంటే.. "వద్దు సార్" మీ ప్రెండ్ పంపాడు అని చెప్పి వెళ్లి పోయాడు.


         ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ.. "నిజంగా మీ ఫ్రెండ్ మంచోడు అండీ..మీరే సరిగ్గా పలకరించ లేదు..పోజు కొడుతూ మాట్లాడారు." అన్నది.


         "కాదులేవే...వాడి పొజిషన్ ఇప్పుడు బాగా లేదేమో కదా.. నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాననుకో...రేపు ఎప్పుడైనా అప్పు అడిగితే...అదో తలనొప్పి మళ్లీ నాకు...!" అన్నాను సాలోచనగా.


           "అతను ఏ పొజిషన్ లో ఉన్నా..  స్నేహితుడు స్నేహితుడే..!  "కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థాంక్స్ చెప్పండి" అంది నా శ్రీమతీ నిశ్చయంగా..


 సినిమా అయిపోయింది......


              మా ఆవిడ పోరు పడలేక.. ఎంట్రన్స్ దగ్గర సిబ్బందితో, వాడి గురించి వాకబు చేస్తే...

అతను పై ఫ్లోర్ లోని  ఒక రూమ్ లోకి  తీసుకెళ్లాడు.


          పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూమ్...ఒక సోఫాలో గోపి గాడు కూర్చుని ఉంటే....హాల్ మేనేజర్ ఆరోజు కలెక్షన్స్ లెక్కలు చెబుతున్నాడు... ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంట...మేము లోపలికి వెళ్లగానే...లేచి బయటకు వెళ్లిపోయారు.


            గోపి గాడు మమ్మల్ని చూడగానే రారా.. రా.. అంటూ ఇద్దర్ని కూర్చో బెట్టి, కాఫీ తెప్పించాడు. ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాలు వాడిదేనని.!


       మొదట్లో 16mm ప్రొజెక్టర్ తో  ఊర్లలో పండగలకి పబ్బాలకి సినిమాలాడించి, ఈ స్టేజీకి ఎదిగాడుట. ఇంకా ఆంద్రా, తెలంగాణాలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందట. కొత్త సినిమాలు జిల్లాల వారిగా కొంటాడుట..! అలా తను ఎదిగిన క్రమాన్ని చెపుతూ... ఈ రోజు టికట్ చింపే పనివాడు రాక పోతే తానే ఆపని చేసాడని చెప్పుకొచ్చాడు.


       నా స్నేహితుడు"ఎలా వచ్చార్రా.." అని నన్ను అడిగితే.."రిక్షాలో" అని చెప్పా తలవంచు కొంటూ.


        డ్రైవర్ని పిలిచి, వద్దన్నా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు.


               అప్పుడు దారిలో మా ఆవిడ.. "ఇలా ఇంకెప్పుడూ, ఎవర్నీ తక్కువ అంచనా వేయకండి....

స్నేహితుడు ముఖ్యం. అతడి స్టేటస్  కాదు.. 

ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు..." అంది ఒకింత కోపంగా...!!

     "ఎదుటివారిని చూడంగానే  ఒక అంచనా వేయకండి." మనిషి చూడానికి ఎలా వున్నా.... మీ కన్నా గొప్పవాడు కావచ్చేమో కదా....!!

          "మనిషి ముఖ్యం.....స్టేటస్ కాదు"

                   *💐🙏🤝🤝🤝🙏💐 

Friend ship is great... not their position 👍*

IIT Updates 15.07.2022

 IIT Updates 15.07.2022

నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ( ఎన్ఐఆర్ఎఫ్)ను విడుదల చేశారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.-*


 అధికారిక వెబ్ సైట్ లో ర్యాకింగ్ సంబంధిత విషయాలను వెల్లడించారు


*మొత్తం 11 కేటగిరీల్లో ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా ర్యాంకింగ్స్ ప్రకటించారు*.


 విశ్వవిద్యాయాలం, నిర్వహణ, కళాశాల, ఫార్మసీ, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లా, రిసెర్చ్, డెంటల్ కు సంబంధించిన విద్యాసంస్థలు ఉన్నాయి.


టీచింగ్, లర్నింగ్ అండ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్యాడ్యుయేషన్ అవుట్ కమ్, ఔట్ రీచ్, ఇన్‌క్లూసివిటీ, పర్సెప్షన్ ఇలా ఐదు అంశాల కింద విద్యాసంస్థలకు మార్కులు కేటాయించి ర్యాంకులు ఇస్తారు.


 *ఓవరాల్ గా అన్ని విభాగాల్లో తీసుకుంటే ఐఐటీ – మద్రాస్ తొలిస్థానంలో నిలిచింది.*


*🎯ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2022:*


 *ఇంజనీరింగ్ విభాగం ర్యాంకింగ్స్ వరసగా..*


1)ఐఐటీ మద్రాస్,

2) ఐఐటీ ఢిల్లీ,

 3) ఐఐటీ బాంబే,

4) ఐఐటీ కాన్పూర్,

5) ఐఐటీ ఖరగ్ పూర్,

6) ఐఐటీ రూర్కీ,

7) ఐఐటీ గౌహతి,

8) ఎన్ఐటీ తిరుచిరాపల్లి,

9) ఐఐటీ హైదరాబాద్

 10) ఎన్ఐటీ సూరత్కల్...


*⛔️ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2022: యూనివర్సిటీ ర్యాకింగ్స్*


1) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , బెంగళూర్,

2) జవహర్ లాల్ యూనివర్సిటీ, ఢిల్లీ

3) జామియా మిల్లియా ఇస్లామియా, ఢిల్లీ,

 4)జాదవ్ పూర్ యూనివర్సిటీ, కోల్ కతా,

 5) అమృత విశ్వవిద్యా పీఠం, కోయంబత్తూర్,

6) బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి,

7) మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మణిపాల్,

 8) కలకత్తా యూనివర్సిటీ, కోల్ కతా,

 9) వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూర్,

10) యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్....




*♉️ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2022: ఓవరాల్ ర్యాంకింగ్స్*


1) ఐఐటీ – మద్రాస్,

 2) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , బెంగళూర్,

3) ఐఐటీ బాంబే,

4) ఐఐటీ ఢిల్లీ,

 5) ఐఐటీ కాన్పూర్,

6) ఐఐటీ ఖరగ్ పూర్,

7) ఐఐటీ రూర్కీ,

8) ఐఐటీ గౌహతి,

9) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్), ఢిల్లీ,

 10) జే ఎన్ యూ, ఢిల్లీ....

వంటపనా!

 🫖 వంటపనా!🏺


వంటింటి పని అంటే కేవలం ఉడికించడమే కాదు...


కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, అల్లం లాంటివి చెడిపోకుండా చూస్తుండాలి. 


ఏ ఏ కూరగాయలు ఎన్ని దినాలు ఫ్రెష్ గా ఉంటవి ఏవి త్వరగా చెడిపోతాయి అనేది తెలిసుండాలి. 


తెలిసుంటే చాలదు.... రోజు ఒకే విధమైన వంట కాకుండా రకరకాలైన వంటలు చేస్తూ వంటిల్లి నిర్వహించాలి.


తినేవారి అభిరుచులను బట్టి ఇష్టా ఇష్టాలు, తినే సామర్థ్యం తెలిసుండాలి.


దానికి తగినట్లు సరుకుల కొలత తెలుసుకొని సరిపడ పాత్రలు కూడా సమకూర్చుకోవాలి.


రుబ్బాలి...., 

వేయించాలి....., 

ఉడికించాలి.....,

పొడి చేయాలి. 

ఫాలో 

...........ఫ్రై. 

................డీప్ ఫ్రై చేయాలి. 

మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి. 


అంట్లను కడగాలి. 

.............తుడవాలి. 

సర్దాలి.


శుభ్రతను పాటిస్తూ..... ఓ యుద్దమే చేయాలి. 


నిన్నటి పాలు. 

ఈ రోజు పాలు

పాత డికాక్షన్ 

కొత్త డికాక్షన్ 

కాఫీ పొడి

టీ పొడి తేడా తెలిసుండాలి.


తెచ్చిన సామానులు సర్ది పెట్టే

స్టోర్స్ మెనేజ్మెంట్ కూడా తెలిసుండాలి. 


రెండు మూడు బర్న ర్ల పై ఒకేసారి వేరు వేరు వంటలు చేయగలిగే టైం మేనేజ్మెంట్  తెలిసుండాలి. 


వడ్డించడం తెలిసుండాలి, 


మిగిలిన దానిని ఖాళీ చేసీ వేరే పాత్రలోకీ సర్దుబాటు చేసే 

"స్పేస్ మేనేజ్మెంట్ " తెలుసుండాలి.


అమ్మా..... అంటూ పిలిచే వేరు వేరు వ్యక్తుల పిలుపులకు స్పందిస్తూ సమయానికి అన్నీ పనులు పూర్తి చేయగలిగే 

మల్టి టాస్కింగ్ సామర్థ్యము ఉండాలి.


ఒక దోస హాట్ కంటైనర్ లోకి దూర్చి మరొకటి ప్లేట్లోకి  వేసి  వేరోకటి పెనం పైన వేసే చేతి వాటం కలిగుండాలి. 


నిత్య మేనేజ్మెంట్ 

చిన్నచిన్న గాయాలు, 

చురుకులకు చలించక

కామన్ సెన్సు, 

సమయస్పూర్తి ఉండాలి.


ఇవ్వన్ని ఏ కోచింగ్ సెంటర్ కు వెళ్ళకుండా తరతరాలుగా నేర్చుకుంటూ వస్తున్న ఆ శ్రమజీవులందరికీ గౌరవాన్నిచ్చే 

పెద్ద మనస్సుండాలి..


వంటపనా....., 


అదేం మహా!


అని వెటకారించే ముందు 

ఇన్ని సామర్ధ్యాలు, సుగుణాలు మనకున్నాయా అని ఆలోచించాలి.


"వంటపని"  అందరి అవసరం.

అది అందరి జీవనాధారం.


"వంటపని" ఒక ధ్యానం. భక్తి ,  దినచర్య ,  కళ , విజ్ఞానం , ప్రేమ..., అనుభూతి..., సేవ..., 

గౌరవం..., విలువ... 


ఈ విషయాల్లో వెటకారం తగదు. 


వంటింటి కళాకారులకు  ఓ పెద్ద "నమస్కారం".

🙏🙏🙏

Thursday, July 14, 2022

నవీన్ పట్నాయక్ కంటతడి

 .



నవీన్ పట్నాయక్ కంటతడి... 12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం...  





నవీన్ పట్నాయక్… పెళ్లాంపిల్లలు, కుటుంబం ఎవరూ లేరు… పైరవీలు, పెత్తనాల భయంతో తన బంధుగణాన్ని కూడా దగ్గరకు రానివ్వడు… ఎప్పుడూ తన మొహంలో ఎమోషన్స్ కనిపించవు… ఉన్నతాధికారులు, తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు… ఎవరూ తన దగ్గర సర్కిల్‌లోకి వెళ్లరు… తను కూడా పని ముగిసిందంటే చాలు, ల్యాప్ టాప్ తీసుకుని, ఓ సిగరెట్ పాకెట్‌తో బెడ్ రూంలోకి వెళ్లిపోతాడు… అత్యవసరమైతే తప్ప ఇక ఎవరూ తనను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు…


ఎంత కఠిన హృదయుడో కదా అనిపిస్తోందా..? ఏ బంధాలూ లేకుండా, సంపాదన కక్కుర్తి లేకుండా వ్యవహరిస్తున్నాడు కాబట్టే పాతికేళ్లుగా తనను ఎవరూ ఆ సీఎం కుర్చీ మీద నుంచి ఇంచ్ కూడా కదిలించలేకపోతున్నారేమో… ఐనా రాతి లోపల కూడా కొన్నిసార్లు జల ఉంటుంది… నవీన్ కూడా అంతే… నిర్వికారంగా కనిపించే ఆయన పన్నెండు దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీల ఎదుట వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు… అసలు అనేక ఎత్తుపల్లాల నడుమ కూడా ఏ ఎమోషన్ చూపించని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి ఒడిశా నుంచి వెళ్లిన ఉన్నతాధికారుల బృందం ప్లస్ వేలాది మంది ప్రవాస ఒడిస్సీలు విస్తుపోయారు… విషయం ఏమిటంటే..?


కిసన్ శేషదేవ్… సంబల్‌పూర్ జిల్లాకు చెందిన ఓ గిరిజన కుటుంబం… చిన్నప్పుడు ఏడాది వయస్సున్నప్పుడే తల్లిని కోల్పోయాడు… 2006లో తండ్రి తీవ్ర అనారోగ్యం పాలైతే కిసన్ కూలీ పని చేయాల్సి వచ్చింది… 2012లో తండ్రిని కూడా కోల్పోయాడు… అప్పటికి తనకు పద్దెనిమిదేళ్లు… రెండేళ్ల క్రితం అక్కను కూడా పొగొట్టుకున్నాడు… ప్రస్తుతం అనాథ…




చిన్నప్పటి నుంచీ మెరిట్ స్టూడెంట్… ప్రతి పరీక్షలోనూ తనే టాప్… 2005లో ఉత్తమ విద్యార్థి అవార్డు తీసుకుని నవోదయ ఎంట్రన్స్‌లో టాపర్‌గా నిలిచి, ప్లస్‌టూ వరకు అక్కడే చదివాడు… తరువాత 2012లో National Entrance Screening Test (NEST) రాశాడు… 17వ ర్యాంకు… కానీ ఆ సంవత్సరమే తండ్రి చనిపోయాడు… 2013లో మళ్లీ రాశాడు, ఈసారి 15వ ర్యాంకు, NISER లో అయిదేళ్ల ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరాడు…


2018… ఒడిశా నాలెడ్జ్ హబ్‌లో ఓ పెద్ద మీటింగ్… విద్యావేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు, టెక్నిషియన్స్ ఉన్న ఆ మీటింగును ఉద్దేశించి ప్రసంగించాలని నవీన్ పట్నాయక్ ఈ కిసన్‌ను ఆహ్వానించాడు… అప్పట్లో స్లిప్పర్లు, మాసిపోయిన బట్టలు, చేతిలో ఓ డొక్కు నోకియా ఫోన్‌తో ఉన్న కిసన్ భుజం తట్టి ఒక ఐఫోన్ కానుకగా ఇచ్చాడు… తరువాత కిసన్ జర్మనీలోని Gottingen లోని జార్జ్-అగస్ట్ యూనివర్శిటీలో చేరాడు… పీహెచ్‌డీ చేశాడు… ఇప్పుడు తను అక్కడే కెమికల్ సైంటిస్టు…


గత నెల చివరివారంలో పట్నాయక్ రోమ్ వెళ్లాడు… దాదాపు 12 యూరప్ దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీలను పిలిచారు ఓ మీటింగుకు… శేషదేవ్ కూడా జర్మనీ నుంచి రోమ్ వెళ్లాడు… అందరి ఎదుట శేషదేవ్‌కు కాసేపు మాట్లాడే చాన్స్ దొరికింది… తన చేతిలోని ఐఫోన్ పైకి లేపి, ఊపుతూ… ఇదేమిటో తెలుసా అంటూ… ముఖ్యమంత్రి తనకు ఏయే సందర్భాల్లో ఎలా అండగా నిలిచాడో ఎమోషన్‌తో చెబుతూ పోయాడు…




*‘‘నాకు సార్ చెప్పింది ఒకటే… పది మందికీ ఉపయోగపడు అన్నాడు… పదే పదే అదే గుర్తొస్తుంది… మా ఊళ్లో 170 మంది పిల్లలకు కోచింగ్ సెంటర్ పెట్టించాను… 30 లక్షలతో ఇల్లు కట్టాను… నథింగ్ నుంచి నన్ను ఎవిరీ థింగ్ స్టేజీకి తీసుకొచ్చాడు సీఎం… తిరిగి వచ్చేస్తాను, ఓ పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ పెడతాను ఒడిశాలో… నాకు ఎవరూ లేరు సార్, అందరినీ కోల్పోయాను, అయితే ఏమిటి సార్, మీరున్నారు, మీరే నా తండ్రి…’’ శేషదేవ్ ముగించాడు… అదుగో అప్పుడు ఏ ఫ్యామిలీ బంధాలు లేని ఆ పట్నాయక్‌ కంటి నుంచి బొటబొటా కన్నీళ్లు రాలాయి… ఆ ఎమోషన్ పేరు ఆనందమే…*


ఇందులో ఏముంది అనకండి… మనసంతా పాజిటివిటీని నింపే ఇలాంటి వార్తలు చదవాలి… ఖచ్చితంగా చదవాలి… ఓ గిరిజన విద్యార్థి కష్టనష్టాల జీవనప్రయాణం ఇది… రాజకీయ నాయకులంటేనే హార్డ్ కోర్ అండ్ నొటోరియస్ అనే భావన బలంగా ఉన్న ఈ రోజుల్లో పట్నాయక్‌ వంటి నేతలూ ఉంటారని తెలియాలి… ప్రతి కఠినమైన గుండెలో కూడా తడి ఉంటుందనీ, అది కొన్నిసార్లు కంటికట్టలు తెంచుకుని బయటికి దూకుతాయని కూడా తెలియాలి…!!




.

Monday, July 11, 2022

worth reading worthy sharing

 👌👌worth reading 

👌👌worthy sharing 


I woke up today , having dreamt early morning at 4 AM . ⏰ 


🏢

I was in the biggest Mall of  India looking to buy a pair of socks 🧦 and a neck tie. 👔


🚶🏻‍♂️As I walked in, I noticed a sweater with a price tag of RS 25,000 .


Next to the sweater were a pair of Jeans 👖for Rs.1,00,000 .


The socks 🧦 were Rs.15,000 ! 

And Tie 👔 for astonishing 20,000 /-_


👉I went looking for a salesperson and found one in the watch Dept.


 He was showing a man a Rs. 225/- Rolex watch. 🥸


I looked in the glass case and there was a 4 carat diamond ring 💍 also on sales for Rs.95/-🧐


Shocked I asked the salesperson "How could a Rolex watch sell for Rs.225/- ? ,and a cheap pair of socks sell for Rs. 15,000/-"?🤔


He said "Someone slid into the store last night and changed the price tag on everything ".🤪


👉👉"Everyone is confused , people are acting like they have lost their sense of value". 


💰 "They are willing to pay lots of money for things of little value ,and very little money for things of great value " 💵 


🤭"Its like they don't know what is really valuable and what's not " .


😥I hope we get the price tags back-on right soon ,I really pity , seeing people paying way too much for things of little value "


🥺I woke up startled & confused and thinking since then ...


👉👉Maybe our life is like this dream.


👉👉Maybe someone slid into our lives and the changed the price on everything.


 👉👉Maybe  they *marked up* the value of  competition, position, titles,  fame , promotion,  show-off , money and power !🤔


👉👉...And put a huge discount on the value of *Happiness , Family , Relationships, Peace of mind , Contentment , Love , Knowledge , Kindness  , Friendships*...🤔🤔


 👉Maybe We are all living this dream...


🥺*I hope...... this message will be a wake up call and we wake up,*

well in-time.


Have a great life ahead 🤝

Saturday, July 9, 2022

ఆధార్ కార్డా మజాకా...

 ఆధార్ కార్డా మజాకా...

ఆధార్ కార్డు వలన భవిష్యత్తులో జరగబోయేది ఇదే అందరూ తెలుసుకోండి.



 *హోటల్  ప్యారడైజ్  కి  బిర్యాని ఆర్డర్ ఇద్దామని కాల్ చేశా.*


*ఆపరేటర్* : హలో… ప్యారడైజ్ హోటల్ …


*నేను*: ఒక ఆర్డర్ తీసుకోండి ప్లీజ్..?


*ఆపరేటర్*: మొదట మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి సార్


*కస్టమర్*:  ఒక నిమిషం… నా ఆధార్ నెంబర్ "1234 5678 9012 "


*ఆపరేటర్*: ఓకే మీ పేరు అనిత

నెంబర్ 17, 

గాంధీ రోడ్, 

శ్రీనగర్ కాలనీ నుండి మాట్లాడుతున్నారు. 

*మీ ఇంటి ఫోన్ నెంబర్ 408423666, ఆఫీస్ నెంబర్ 76452302, మొబైల్ నెంబర్ 0142662566. ఇప్పుడు మీరు మీ మొబైల్ నుండి మాకు కాల్ చేశారు…*


*నేను*: వావ్.. *ఇన్ని నెంబర్లు ఎలా  తెలుసుకున్నారు..?*


*ఆపరేటర్*: కేవలం *ఒక్క ఆధార్ నంబర్ తో మీ డిటైల్స్ అన్ని తెలిసిపోతాయి మేడం.*


*నేను*: గుడ్.. నాకు *ఒక చికెన్ ఫ్రై బిర్యాని ఆర్డర్ తీసుకుంటారా..?*


*ఆపరేటర్*: మేడం.. *నాకు తెలిసినంత వరకు అది వద్దనే చెప్తాను*


*నేను*: ఏ.. ఎందుకు ? *వద్దు*


*ఆపరేటర్*: మీ మెడికల్ రిపోర్ట్స్ ని బట్టి *మీకు కొలెస్ట్రాల్ లెవల్ ఎక్కువగా ఉంది..*


*నేను*: What..? *అప్పుడు నేను ఏమి తినాలి..?*


*ఆపరేటర్*: మా దగ్గర ఉండే *Low fat వెజిటబుల్ బిర్యాని ట్రై చేసి చూడండి మేడం. అది మీకు బాగా నచ్చుతుంది..*


*నేను*: నాకు నచ్చుతుంది అని *మీకు ఎలా తెలుసు..*


*ఆపరేటర్*: పోయిన వారం మీరు *బాబాయ్ హోటల్ లో వెజిటబుల్ బిర్యాని తిన్నారు మేడం..*


*నేను*: మై గాడ్.. చాలు సామీ చాలు.. *మీరు చెప్పిన వెజిటబుల్ బిర్యాని ఫ్యామిలీ సైజ్ లో ఇవ్వండి..*


*ఆపరేటర్*: ఖచ్చితంగా మేడం… *ముగ్గురు ఉన్న మీ కుటుంబానికి అది ఖచ్చితంగా సరిపోతుంది. బిల్ అమౌంటు 2350 రూపాయలు సార్..*


*నేను*: నేను *నా క్రెడిట్ కార్డ్ లో  pay చేయచ్చా..?*


*ఆపరేటర్*: లేదు మేడం. మీరు క్యాష్ రూపంలోనే చెల్లించాలి. *మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎప్పుడో అయిపోయింది. అదీకాకుండా జనవరిలో మీరు 1,50,648 రూపాయలు క్రెడిట్ కార్డ్ బాకీ పెట్టి ఉన్నారు.*


*నేను*: నేను ఎలాగైనా క్యాష్ రెడీ చేస్తాను. *మీరు బిర్యాని పంపండి. ఎంత టైం పడుతుంది..?*


*ఆపరేటర్*: 45 నిమిషాలు పడుతుంది మేడం.. *అంతసేపు మీరు వెయిట్ చేయలేకపోతే మీ స్కూటీ లో వచ్చి మీరే తీసుకెళ్ళచ్చు సార్..*


*నేను*: What.?


*ఆపరేటర్*: మీ ఆధార్ కార్డు ప్రకారం *మీ దగ్గర ఒక స్కూటీ ఉంది. దాని నెంబరు 1122.*


*నేను*: మీరు ప్రకటన లో చెప్పిన విధంగా *ఆ మూడు ఫ్రీ కోక్ బాటిల్స్ కలిపి పంపండి.*


*ఆపరేటర్*: బిర్యాని మాత్రమే పంపిస్తాం . *మీ మెడికల్ రిపోర్ట్ ప్రకారం మీ ఆరోగ్యాన్ని దృష్ఠిలో ఉంచుకుని మీకు ఆ కోక్ ని ఇవ్వలేం మేడం*


*నేను*: ***%&$%%### You $##$%%@!))) *(ఇక్కడ రాయలేని మాటలు)*


*ఆపరేటర్*: మేడం.. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి .. *ఇలానే ఒక పోలీస్ దగ్గర తిట్టినందుకు కోర్టు మీకు రెండు నెలల జైలు శిక్ష మరియు 5000 రూపాయల జరిమానా విధించింది మర్చిపోయారా?.. అంతే..*


*నేను* :  ఢాం అని *కళ్ళు తిరిగి కింద పడిపోయా*


*చదివేటపుడు చూసేటపుడు ఇది సరదాగానే ఉంటుంది కానీ ప్రభుత్వం ప్రతీ దానికి ఆధార్ కార్డ్ ను లింక్ పెడుతుంది దీని కోసమే. భవిష్యత్తులో జరగబోయేది ఇదే అందరూ తెలుసుకోండి.*

ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది.🛒

 ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది.🛒

Shpping Wife Shocking Husband



అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది.👜

క్యాషియర్ ఆమె బ్యాగు లో

ఒక టీవీ రిమోట్ గమనించాడు.📲

అతను ఉండబట్టలేక ఆడిగేసాడు..


"మీరు ఎప్పుడూ మీ టీవీ రిమోట్‌ను మీతో తీసుకువెళతారా?" అని.


ఆమె "లేదండీ, ఎప్పుడూ ఇలా తీసుకురాను, అప్పుడప్పుడు మాత్రమే.. 

ఈరోజు మావారు క్రికెట్ 🏏మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా..."

అంటూ తన క్రెడిట్ కార్డ్ ఇచ్చింది.💳


#నీతి : మీ భార్య మాట వినండి, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి ..!💁‍♂️


#కథ ఇంతటితో అయిపోలేదు ..!


క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు.👠👗👛👜👖


ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయింది ..!🤔


"ఏమైంది..!!??" అని క్యాషియర్ని అడిగింది.😬


అతను చెప్పాడు, “మీ భర్త మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేసారు...”🤭


#నీతి : మీ భర్త అభిరుచులను ఎల్లప్పుడూ గౌరవించండి.🙏


#కథ కొనసాగుతుంది ..!


భార్య ఈసారికి తన భర్త క్రెడిట్ కార్డును 💳పర్స్ నుండి తీసి స్వైప్ చేసింది. 

దురదృష్టవశాత్తు అతను తన సొంత కార్డును బ్లాక్ చేయలేదు.


 #నీతి : మీ భార్య యొక్క శక్తిని మరియు జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయవద్దు ..!😝

 

#కథ ఇంకా అయిపోలేదు ..!


స్వైప్ చేసిన తర్వాత, ఆ యంత్రం, 


"మీ మొబైల్ ఫోన్‌కు పంపిన పిన్ను నమోదు చేయండి" అని సూచించింది ..!📱


 #నీతి : ఒక్కోసారి మనిషి ఓడిపోయినప్పుడు, సాంకేతికత కూడా రక్షిస్తుంది ‌..!😊😊


#కథ_కొనసా....గుతుంది ..!


ఆమె మరలా నవ్వి, తన పర్సులో మెసేజ్ శబ్దంతో మోగిన మొబైల్ ను  బయటకు తీసింది.📱


అది తన భర్త ఫోన్.📵


ఆమె దానిని రిమోట్ కంట్రోల్‌తో బాటుగా తీసుకుని వచ్చేసింది.

ఎందుకంటే, తన షాపింగ్ సమయంలో భర్త తనకు కాల్స్ చేసి విసిగించకుండా ఉండేందుకు.

చివరకు ఆమె తన షాపింగ్ పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చింది. 😂😂😂

 

#నీతి : ఎప్పుడూ మీ భార్యని తక్కువ అంచనా వేయవద్దు ..! 


#కథ_కొనసాగుతుంది ..!


ఆమె ఇంటికి చేరుకునేసరికి ఇంటి బయట ఆమెకు తన భర్త కారు కనిపించ లేదు.🚘


ఒక నోట్ తలుపు మీద అతికించబడి  ఉంది.

అందులో ఇలా రాసి ఉంది ..!📒


"రిమోట్ దొరకలేదు. మ్యాచ్ చూడటానికి ఫ్రెండ్స్ తోబాటు బయటకు వెళ్తున్నాను. 👣

నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ కు కాంటాక్ట్ చెయ్యి ..!

అని ఇంటి తాళాలు కూడా తనతోబాటే తీసుకుపోయాడు.🔑


#నీతి : మీ భర్తను నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. 😋😂😆😉😁


#తెలివి_ప్రతిభ_అనేది_ఒకరి_సొత్తు_కాదు.  


 

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE