NaReN

NaReN

Wednesday, November 10, 2021

తెలివైన తాబేలు

 

తెలివైన  తాబేలు




ఒక అడవిలో ని చెరువులు ఒక తాబేలు ఉండే ది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది.

ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ ఇంతలో నక్క దాన్ని చూసింది.

వెంటనే తాబేలు కాళ్లు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండి పోయింది. నక్క-తాబేలు దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకొని చూసింది పైన డొప్ఫ గట్టిగా తగిలింది.

తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది ఇలా నక్క తనని పరీక్షిస్తున్న ఎంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపట్టుకొని ఉన్నది.

ఊపిరి బిగపట్టుకొని ఉన్నది ఇంతలో దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తలా కొంచెం బయట పెట్టింది అయ్యో నక్క బావ నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో ఇతర మాంస మైనా తినలేవు అంది తాబేలు.

ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్లీ నా శరీరం తీరే అంత నా అక్క బావ నీటిలోనుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడి పోతాను, 

మళ్లీ నీళ్లు తగిలాయి అనుకో వెంటనే మెత్తబడ్డ తాను అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది.

అసలే జిత్తులమారి నక్క మహా తెలివైనది కదా తాబేలు మాటలు నమ్మి నమ్మి అన్నట్టుగానే తల ఊపింది తాబేలు ను నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొప్పి పెట్టింది.

కాసేపయ్యాక తాబేలు తెలివిగా నక్క బావ నేను పూర్తిగా నాను కానీ నువ్వు కాలు పెట్టిన చోట నాన్న లేదు అన్నది.

దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుతామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది.🍁

Tuesday, November 9, 2021

ఏ సిరి ధాన్యాల ఏ వ్యాధులను తగ్గిస్తుంది

    ఏ సిరి ధాన్యాల ఏ వ్యాధులను తగ్గిస్తుంది 


1. కొర్రలు (Foxtail Millet): నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్ధయిటిస్, పార్కిన్సన్, ముస్క్యూలెర్ డిస్ట్రోఫీ,  మూర్ఛరోగాల నుండి విముక్తి.


 2. అరికలు (Kodo Millet): రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయబిటిస్, | మలబద్ధకం, మంచినిద్ర. 


3. ఊదలు (Barnyard Millet): లివరు, కిడ్నీ, నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాండ్స్), కొలెస్టరాల్ తగ్గించడం, కామెర్లు.


 4. సామలు (Little Millet): అండాశయం, వీర్యకణ సమస్యలు, పిసిఒడి, సంతానలేమి సమస్యల నివారణ.


 5. అండు కొర్రలు (Browntop Millet): జీర్ణాశయం, ఆర్థయిటిస్, బి.పి. థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయ నివారణ.


సిరిధాన్యాల వాడుటకు  ముఖ్య సూచనలు:


ఒక్క అండు కొర్రలను మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. 

మిగతా సీరిధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు.


సమయాభావం ఉంటే ముందురోజు రాత్రే నానబెట్టుకోవచ్చు.


ఈ సిరిధాన్యాలను కలగలిపి వాడొద్దు.


దేనికి అది విడివిడిగా వండుకోవాలి. కలగలిపితే ఏ రకమైన ప్రయోజనం కలుగదు.


ఏ ఆరోగ్య సమస్యలు లేనివారు రెండు రోజులు ఒక రకం సిరిధాన్యాన్నే వాడాలి. తరువాత రెండు రోజులు వేరొక సిరిధాన్యాన్ని వాడాలి.


అలాగ ఈ ఐదు రకాల సిరిధాన్యాలు ఒకదాని తరువాత ఒకటి చొప్పున వాడుకోవాలి పదకొండవ రోజు తిరిగి మొదటి సిరిధాన్యంతో మొదలు పెట్టాలి.


వీటితోపాటు కషాయాలు కూడా తీసుకుంటే  ఇంకా మంచిది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వారి సమస్యనుబట్టి ఈ సిరిధాన్యాలలో కొన్నిటిని ఎక్కువ రోజులు వాడాల్సి రావొచ్చును. ఉదాహరణకు, ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పైన వివరించిన పట్టికలో సూచించిన విధంగా వారికి అవసరమైన సిరిధాన్యాలను ఒక్కొక్క రోజు వాడుకుని తిరిగి ముందు ఎంపిక చేసుకున్న ధాన్యాలను మరల మూడు రోజుల చొప్పున వాడుకోవాలి.


ఉదాహరణకు, సుగర్, కిడ్నీ సమస్యలు ఒకరికే ఉంటే వారు అరికలు 3 రోజులు, ఊదలు 3 రోజులు తింటూ మిగతా 3 రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి. ఆ సమస్యతో పాటు ప్రాస్యేటు సమస్య కూడా ఉంటే సామలు కూడా 3 రోజులు తింటూ మిగిలిన రెండు ధాన్యాలను ఒక్కొక్కరోజు తినాలి.


పెరుగు, మజ్జిగ వాడుకోవచ్చును. సముద్రపు ఉప్పు గానుగ నూనె వాడుకోవాలి..


వీటితో పాటు కొన్ని రకాల ఆకు కషాయాలు తీసుకుంటే ఇంకా మంచిది.


మహిళల సమస్యలకు గోంగూర ఆకుల కషాయం బాగా పనిచేస్తుంది.


రోగ నిరోధకశక్తి పెంపొందించకోవడానికి గరికే కషాయం పనిచేస్తుంది. కొత్తిమీర, పుదీనా, నిమ్మగడ్డి ఆకుల కషాయాలు ఎవరైనా వాడవచ్చును.


ఏ కషాయమైనా ఒకవారం మాత్రమే వాడాలి. ఒకదాని తరువాత ఒకటి వాడుకోవాలి. సుగర్ ఉన్న వారికి దొండ ఆకుల కషాయం, దాల్చిన చెక్క కషాయం మంచివి. ఇవి పరగడుపున తీసుకోవాలి.


కషాయం తయారు చేసే విధానం:


రాగి పాత్రలో ఉంచిన 150-200 మి.లి. నీరు తీసుకుని, (రాగి పాత్రలలో వేడివంట చెయ్యకూడదు) వేరే గిన్నెలో నీరు మరిగించి, దానిలో మనకు అవసరమైన 5-6 ఆకులు వేసి నాలుగు నిమిషాలపాటు ఉంచి, స్టవ్ కట్టేసిన తరువాత 2 నిమిషాలు మూతపెట్టి, ఆ తరువాత వడగట్టి, ఆ నీటిని త్రాగాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చెయ్యాలి. ఉదయం పరగడుపున ఒకసారి, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఒక గంట ముందు తీసుకోవాలి.


రక్తహీనతకు 3 రోజులు అరికెలు. 3 రోజులు సామలు రోజుకి 3 పూటలు తినాలి. తరువాత 3 రోజులు ఒక్కొక్క సిరిధాన్యాం 3 పూటలు తినాలి. 


దీనితోపాటు పరగడుపున క్యారెట్, ఉసిరి, జామ లేదా బీట్రూట్, రసం తీసుకోవాలి, సాయంత్రం 20 కరివేప ఆకులు, 1 గ్లాసు పల్చటి మజ్జిగతో మిక్సీలో వేసి తిప్పి, 15-20 నిమిషాల తరువాత, భోజనానికి 1 గంట ముందు తీసుకుంటే ఒక నెలలో రక్తహీనత నివారింపబడుతుంది. 


థైరాయిడ్ సమస్య ఉన్నవారు 3 రోజులు సామ బియ్యం, ఒక రోజు అరికెలు, ఒక రోజు ఊదలు, ఒక రోజు కొర్రలు, ఒకరోజు అండు కొర్రలు వండుకుని మూడుపూటలు అదే తినాలి. తిరిగి 3 రోజులు సామలు, తరువాత నాలుగు రోజులు ఒక్కొక్క సిరిధాన్యం తినాలి. దీనికి తోడు మెంతి ఆకుల కషాయం ఒక వారం, పుదీన ఆకుల కషాయం ఒక వారం, తమలపాకుల కషాయం ఒక వారం రోజుకి 2-3 సార్లు తీసుకోవాలి. 

గానుగలో స్వయంగా తీయించుకున్న కొబ్బరినూనె రోజూ ఉదయం 3 చెంచాలు 3 నెలల పాటు తీసుకుటే 20 వారాలలో అన్నిరకాల మందులు మానివేయవచ్చును. రోజూ కనీసం అరగంట వాకింగ్ చెయ్యా లి.

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

పసుపులేటి నరేంద్రస్వామి

    9848696955

చెవి గోల

 👂 చెవి గోల 👂


  నేను మీ చెవిని👂

  మేము  ఇద్దరము, కవలలము👂👂, కానీ  మా దురదృష్టమేమిటంటే,   

ఇప్పటి వరకు మేము

 ఒకరినొకరు చూసుకోలేదు .

  ఏ శాపమో తెలియదు  

 మేము ఎడ మొహం పెడ మొహంగా అమర్చబడ్డాము. 

 

  మా బాధ్యత కేవలము 

  వినడము మాత్రమే. 

  తిట్లు, చప్పట్లు, 

  మంచి, చెడు,

  అన్నీ మేమ వింటాము. 

  

 కానీ  క్రమ క్రమంగా మమ్మల్ని వస్తువుల్ని వేలాడదీసే ఆధారాలుగా మార్చేశారు. కళ్ళ జోడు బరువును మాపై  మోపుతున్నారు. సమస్య కళ్లదైతే, సావు మోత మాకేమిటి? 


  బాల్యంలో చదువుకునేటప్పుడు 

   ఎవరికైనా మెదడు పని 

  చేయకపోతే మాస్టరు గారు 

   మమ్మల్నే మెలేస్తారు 

 

  యవ్వనంలో పురుషులు, 

  మహిళలు అందరూ 

  అందమైన జూకాలు,

  కమ్మలు, లోలకులు 

  మొదలైనవి చేయించుకొని  

  మాపైన వేలాడదీస్తారు. 

 రంద్రాలు చేయడం, రక్తాలు కారడం మాకైతే, 

  పొగడ్తలు మాత్రము  ముఖానికి. 


   ఇక అలంకరణ చూడండి. ! 

   కండ్లకు కాటుక, ముఖానికి  క్రీములు

  పెదవులకు లిపిస్టిక్, 

  మరి మాపై ఎందుకు వివక్ష? 


  ఎప్పుడైనా ఏ కవి అయినా 

  ఏ శాయరీ అయినా చెవుల గురించి ప్రశంసిస్తూ పొగిడితే చెప్పండి.

వారి దృష్టిలో కళ్ళు,

 పెదవులు, చెంపలు ఇవే సర్వస్వము. 

  

కళ్లకు బాధ కలిగితే కన్నీరు కారుస్తాయి. ముక్కుకు బాధకలిగితే చీదుతుంది, నోటికి బాధ కలిగితే అబ్బో, అయ్యో అని మొత్తుకుంటుంది. మరి మాకు బాధ కలిగితే బయటకు తెలియకుండా లొలొపలే భరించాలి.


ఇక పోతే పెన్నులు, పెన్సిళ్లు, అగ్గి పుల్లలు,  సిగరెట్లు, బీడీలు,  ఇలా ఎవరికి కావలసింది వారు మా మీద దాస్తుంటారు.


ఇదివరకు హెడ్ ఫోన్లని మాకు మూతలు వేసేవారు, ఇప్పుడు పైత్యం పెరిగి, ఇయర్ ఫోన్లని మాలోపలికి తోసి మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏమండీ ఒక్కసారి మీ ముక్కుకు నోరుకు మూతవేసి చూడండి ఎం జరుగుతుందో. 


మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కరోనా మాయరోగం మా చావుకు వచ్చింది. ముక్కు, మూతి మూసుకోవడానికి వేసుకునే మాస్కులను కూడా మాకే తగిలిస్తున్నారు.


మేము చెవులమండీ, చెక్క కొయ్యలం కాదు, ఏది పడితే అది వ్రేలాడెయ్యడానికి. 


మీకిష్టమొచ్చినట్లు కాకుండా    మా పనికి మాత్రమే మమ్మల్ని వాడండి. చెవులే కదా అని చిన్న చూపు చూడకండి. మేం సంయమనం కోల్పోయామంటే మీరు కళ్ళు తిరిగి కింద పడతారు.

Monday, November 8, 2021

జీవితాన్ని జీవించండి .ఏదో అలా ..గడపేయకండి

 *జీవితాన్ని జీవించండి .ఏదో అలా ..గడపేయకండి



ఏదో చెప్పాలంకుంటాం.

మరేదో మాట్లాడుతుంటాం.

కమ్యూనికేషన్ ప్రాబ్లెమ్.

🙊


ఏదో విన్నామనుకుంటాం.

మరేదో అర్ధమవుతుంది.

తొందరపాటుతనం.

🙉


అంతా మనవాళ్లే అనుకుంటాం.

కాదని.. సడన్ గా అర్ధమవుతుంది.

వాస్తవం.

🙆‍♂🙆‍♀


మనం సరైన దారిలోనే వెళుతున్నామనకుంటాం.

సగంలో అడ్డు గోడ వస్తుంది.

అజ్ఞానం.

🙈


ప్రేమ, కోపం, అభిమానం, అభ్యంతరం, చూపించాల్సిన సమయంలో చూపించo.

మొహమాటం.

😶


మనకేం కావాలో మనకే తెలియదు.

మనం ఏం కోరుకుంటున్నామో మనకే తెలియదు.

అయోమయం.

😇


జీవితాన్ని ఆనందంగా ఎలా ఉంచుకోవాలో తెలియదు.

నవ్వాలనుకున్నప్పుడు నవ్వలేం.

🙃


ఏడవాలనుకున్నప్పుడు ఏడవలేం.

😒


కానీ, కాలం గడిచిపోతూనే ఉంటుంది.


కాలండర్ లో పేజీలు మారిపోతుంటాయి.

రోజులు.. సంవత్సరాలుగా మారిపోతాయి.


ఒక గమ్యం ఉండదు, ఒక *సంతోషం* ఉండదు,

మనసులోని భావాలు మనసులోనే సమాధి అయిపోతాయి.


ఏమి లేకుండానే... పెద్దవాళ్ళం ఐపోతాం, ముసలివాళ్ళం ఐపోతాం. ఒక రోజు *పోతాం*.


మరి జీవితం లో ఎం సాధించాం?


మన జీవిత పుస్తకంలో 

మనకంటూ నాలుగు పేజీలైనా ఉన్నాయా!


ఆ నాలుగు పేజీలలో 

మనల్ని మనం *సంతోషంగా* ఉంచుకున్న క్షణాలు ఏవైనా ఉన్నాయా ??????


చూసుకుంటే బాధ వేస్తుంది కదూ. 


చిన్న చిన్న ఆనందాలు😄, 

చిన్న చిన్న సంతోషాలు🤣,

ఎన్ని మిస్ చేసుకున్నామో చూసుకుంటే దిగులేస్తుంది😟 కదూ.


అందుకే.. మనసుని *20* లో లాక్ చెయ్యండి...

చూడండి... ప్రపంచం🌎 ఎంత అందంగా ఉంటుందో..

చుట్టూ వున్న ప్రకృతిని🌿🎄 చూడండి.


ప్రకృతి లోని ప్రతీ ప్రాణి🦎 అంత సంతోషంగా ఎలా జీవిస్తున్నాయో చూడండి.


మంచి పుస్తకాలు📖 చదవండి.


మనసుకు నచ్చిన వాళ్లతో మనసు విప్పి మాట్లాడండి.


హాయిగా నవ్వండి🤣,


🧡జీవితాన్ని *జీవించండి* . ఏదో అలా ' *గడపేయకండి* '🧡


పసుపులేటి నరేంద్రస్వామి

9848696955

Tuesday, October 26, 2021

అల్లుడి సొమ్ముపై అత్తకూ హక్కు ఉంటుంది

 అల్లుడి సొమ్ముపై అత్తకూ హక్కు ఉంటుంది

సుప్రీం కోర్టు సంచలన తీర్పు 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పితృస్వామ్య భావజాలం బలంగా ఉన్న భారత్ లో అత్తా అల్లుళ్ల వ్యవహారం చాలాసార్లు చర్చకు వస్తుంది. ఆస్తుల విషయానికొస్తే, అత్తసొమ్ముకు ఆశపడని అల్లుడు ఉండడనే సామెత ప్రాచుర్యంలో ఉంది.


అనుకోడానికి, మాట్లాడుకోడానికి ఎన్నో ఉన్నా, నిజంగా అత్త - అల్లుళ్ళ వ్యవహారం చట్టబద్దంగా ఎలా ఉంటుంది? ఒకరి సొమ్ముకు మరొకరు బాధ్యులు అవుతారా అనే అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది..


కూతురుతో కలిసి అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త ఆయనకు చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద అతనికి లభించే పరిహారం పొందడానికి ఆమె ముమ్మాటికీ అర్హురాలేనని పేర్కొంది. జస్టిస్‌ ఎస్ఏ నజీర్, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పునిచ్చింది.


కూతురు-అల్లుడితో కలిసి అత్తలు జీవిస్తుండటం భారత సమాజంలో సహజమేనని, కొద్ది మంది ముసలితనంలో పోషణ నిమిత్తం అల్లుడిపైనే ఆధారపడుతుంటారని, అంతమాత్రాన అల్లునికి అత్త చట్టబద్ధమైన వారసురాలు కాబోదన్న కోర్టు.. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అత్తగారు కచ్చితంగా అల్లుడికి చట్టబద్ధ ప్రతినిధి అవుతారని, ముఖ్యంగా అల్లుడు మరణించిన సందర్భంలో ఆమె బీమా పొందేందుకు అర్హురాలు అవుతుందని, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 166 ప్రకారం అత్తగారు అల్లుడికి చట్టబద్ధమైన ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. చనిపోయిన అల్లుడి బీమా డబ్బులు పొందే హక్కు అత్తకు లేదంటూ గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం సుప్రీంకోర్టు కొట్టివేసింది.


అత్తా అల్లుళ్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పిన ఈ కేసు వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన ఎన్ వేణుగోపాలన్ నాయర్ అనే ప్రొఫెసర్ 2011లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు భార్య ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. దీంతో ఆయన కుటుంబానికి రూ. 74,50,971 పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆ పరిహారాన్ని రూ. 48,39,728కి తగ్గించింది. అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మృతుడి భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 83,831 వేతనం తీసుకుంటున్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అతడు 52 ఏళ్లకే మరణించడంతో కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని..కాబట్టి రూ. 85,81,815 పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Monday, October 25, 2021

చేసిన సాయం వృధా కాదు !*

 చేసిన సాయం వృధా కాదు !


ఒక అడవిలో పొగరుబోతు ఎలుగుబంటి ఉండేది. ఎవ్వరితోను సరిగా కలిసేది కాదు. మాట్లాడేది కాదు. తన పిల్లలే లోకంగా బ్రతికేది.  అవసరమొచ్చి  ఎవరైనా సాయం అడిగినా  కసిరేది తప్ప  చేసేది కాదు. 


ఒకసారి పిల్లల్ని ఇంటి దగ్గరుంచి  ఆహారం కోసం వెళ్ళింది pసుకుంటూ అది వెళ్తుంటే దానికి రక్షించమని ఎవరో వేసిన కేకలు వినబడ్డాయి. 


కేకల్ని విననట్టే  వెళ్ళబోయింది ఎలుగుబంటి. 


మళ్ళీ రక్షించమన్న కేకలు పెద్దగా వినబడ్డాయి. “ ఎవరు పిలిస్తే నాకేంటి? అరిస్తే నాకేంటి? అవతల పిల్లల ఆకలి తీర్చాలి. వెళ్ళిపోతా” అనుకుని ముందుకే అడుగేసింది  ఎలుగుబంటి.  


ఈసారి మరింత దీనంగా కేకలు వినబడ్డాయి.

ఎలుగుబంటికి ఆగక తప్పలేదు. కేకలెవరివో చూసి వెళ్ళిపోదామనుకుంది. శబ్దం వచ్చిన వైపు వెళ్ళింది. 


అక్కడ ఊబిలో కూరుకుపోయిన ఒక  జింక కనబడింది . ప్రయత్నిస్తున్నా సరే బయటపడలేక చావు భయంతో అరుస్తోంది.  

 ఎలుగుబంటిని చూడగానే చిన్న ఆశ కలిగింది జింకకి. అంతలోనే  అదెవరికీ సాయం చెయ్యదని గుర్తొచ్చి ఆశ వదులుకుంది. కానీ బతుకుమీదున్న తీపితో సాయం చెయ్యమని ఎలుగుబంటిని అడిగింది జింక. 


“అవతల నా పిల్లలకి తిండి ఆలస్యమౌతోంది. తొందరగా వెళ్ళాలి” అని బయల్దేరబోయింది ఎలుగు. 


“నా పిల్లలు కూడా  చూస్తుంటాయి నాకోసం. ఏమీ తెలియని వయసు వాటిది. తల్లిలేని పిల్లల బతుకెంత   కష్టమో తెలియంది కాదు నీకు. నేను బయట పడేలా  సాయం  చెయ్యు” అని బ్రతిమాలింది జింక.  


ఎలుగుబంటి చిరాకు పడుతూ  “ఊబి ఉందో లేదో సరిగా చూసుకోవద్దా? నిన్ను రక్షించడం తప్ప  పనేమీ లేదనుకున్నావా?” అని కసురుకుంది. మళ్లీమళ్లీ జింక బ్రతిమాలేసరికి మూట క్రింద పెట్టి చుట్టూ చూసింది ఎలుగు.  కొంచెం  దూరంలో తాడు కనబడితే అక్కడకి వెళ్ళింది. గట్టు మీదున్న  రైతు పనిముట్లలోని బలమైన తాడుని  అందుకుంది. ఆ  తాడుతో ఊబిలోని జింకను బయట పడేలా చేసింది.  బయటకు వచ్చిన జింక ఎలుగుబంటికి ఎన్నో విధాలుగా ధన్యవాదాలు చెప్పింది. 


‘సర్లే. నీ పొగడ్తలు ఆపు. అవతల నా పిల్లలకు తిండి ఆలస్యమవుతోంది” అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది ఎలుగుబంటి.  


ఇంటికి వెళ్లేసరికి దొడ్లో కుందేలు, కోతి, గాడిద , ఏనుగు మొదలైన  జంతువులు కనబడ్డాయి ఎలుగుబంటికి.  


“ చెరకు గడలు తెస్తున్నట్టు వీటికి  తెలిసిందేమో. ఒక్కటి కూడా ఇవ్వను. ఇవన్నీ నా పిల్లలకే” అనుకుంది ఎలుగుబంటి. 


దారిలో ఉన్న జంతువుల్ని  ప్రక్కకు తప్పుకోమని కసురుకుంటూ గడప దగ్గరకి  వెళ్ళింది ఎలుగు. 


అక్కడ క్రింద పడి ఉంది దాని పిల్ల. దాని కాలికి  ఏదో పసరు రాస్తోంది కొంగ. అది  చూసి కంగారు పడిన ఎలుగు బంటి  “నా పిల్లకి ఏమైంది? పసరు ఎందుకు రాస్తున్నావు?” అని అడిగింది. 


“ఇది బయట ఆడుతుంటే పాము కాటేసింది. అది చూసిన  కోతి మామ మాతో  చెప్పాడు. సమయానికి  నువ్వు ఇంట్లో లేవు  కదా. వదిలేస్తే ప్రాణానికే ప్రమాదం.  అందుకే మేమంతా వచ్చాము. కొంగబావకు వైద్యం తెలుసని కుందేలు చెప్పడంతో చిలుక వెళ్లి పిలుచుకు వచ్చింది.  విషానికి విరుగుడు ఆకులు వెతికింది బాతు. ఆకుల్ని నూరి  పసరు రాస్తోంది కొంగ. ఇంతలో నువ్వొచ్చావు” అని జరిగిందంతా చెప్పింది ఏనుగు. 


“అయ్యో!  నా పిల్లని మీరు కాపాడారా? మీరే  లేకపోతే అది బ్రతికేది కాదు. మీకెప్పుడూ ఏమీ  చేయకపోయినా , మీతో మంచిగా ఉండకపోయినా కూడా మనసులో పెట్టుకోకుండా కాపాడారు” అంది ఎలుగుబంటి. 


అప్పుడే అక్కడకు వచ్చిన జింక “నువ్వేమీ సాయం చేయకపోవడమేమిటి?  ఇప్పుడే నన్ను ఊబిలో నుండి కాపాడావు ... నువ్వక్కడ నన్ను  కాపాడితే ఇక్కడ నీ పిల్లను వీళ్ళు కాపాడారు. అంతే” అంది. 


మిగతా జంతువులు ఎలుగుబంటి చుట్టూ చేరి జింకను కాపాడినందుకు  అభినందించాయి. 


“నీలోనూ మార్పు వచ్చింది. సాయం చెయ్యడానికి ముందుకు రాని నువ్వు ఈరోజు జింకని కాపాడావు. తెలిసో తెలియకో మనమెవరికైనా సాయం చేస్తే ఇంకో రూపంలో మనకు తిరిగి దొరుకుతుందని అమ్మ చెప్పేది. ఇప్పుడు రుజువయింది “ అంది చిలుక. 


“నిజమే. నేను విసుక్కుంటూనే జింకని రక్షించాను. కానీ చేసిన సాయం వూరికే పోలేదు. మీ రూపంలో నా పిల్లని రక్షించింది” అంది ఎలుగుబంటి.  


“అడవిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఆపదలు వస్తుంటాయి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ మనల్ని మనమే కాపాడుకోవాలి. అవసరంలో ఉన్నవారికి సాయపడమని పిల్లలకు కూడా చెప్పాలి” అంది ఏనుగు. అవును అన్నాయి జంతువులన్నీ. 

 

---***----

Saturday, October 23, 2021

గమ్యం లేని ప్రయాణం

 *గమ్యం లేని ప్రయాణం*


**************************

అది ఒక మధ్య తరగతి కుటుంబం.ఆ ఇంటి కోడలు లక్ష్మీ పరమ గయ్యాళి చుట్టాలతో కాని

ఇరుగుపొరుగు వారితో కాని మంచితనం లేని మనిషి

భర్తకు కనీసం అన్నం కూడా వండి పెట్టదు అత్తగారిని అయితే ఎన్నడూ అత్తయ్య అని పిలిచి ఎరుగదు

ఇదిగో అదిగో అనే పిలుపు తప్ప తను వచ్చి ఇరవై సంవత్సరాలు అయినా ఆమె నుండి చెడ్డ పేరు తప్ప ఆ కుటుంబానికి ఒరిగింది ఏమీ లేదు


అనుకోకుండా ఆ ఇంటి పెద్దాయన లక్ష్మీ మామ గారు కాలం చేశారు


ఇదే అదునుగా భావించిన లక్ష్మీ.అత్తగారిని వేధించడం మొదలు పెట్టింది తను మనిషిని అన్న సంగతి మరచి అత్తగారి మీద చెయ్యి చేసుకోవడం మొదలు పెట్టింది 


అత్తగారి మెతకతనం చూసి అందరూ అమ్మో మీ కోడలు లాంటిది ఇంటికొకరు ఉంటే చాలు ఆ ఇల్లు గుల్లే అని అనేవాళ్ళు


అన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదు అత్తగారికి

ఎలాగైనా అత్తగారిని వదిలించుకోవాలి అని తలచి కూతురి దగ్గరకు పంపింది అత్తగారిని


ఇదిగో రెండు రోజులు నీ కూతురి దగ్గర ఉండి రా అని చెప్పింది లక్ష్మీ


కోడలు ఆమాట చెప్పగానే సంతోషంతో సరే లక్ష్మీ

మీ మామయ్య పోయి ఏడాది దాటింది..పిల్లను చూసి వస్తా అని చెప్పి బయలుదేరింది అత్తగారు


రెండు రోజుల తరువాత కూతురు దగ్గర నుండి ఇంటికి వచ్చింది ఆ పెద్దావిడ ఇంటికి గొళ్ళెం పెట్టి ఉంది మెల్లిగా తలుపు తెరిచి చూసింది ఇల్లంతా ఖాళీగా ఉంది ఓ గోడ మీద ఆ ఇంటి పెద్దాయన ఫోటో ఎండిపోయిన పూలమాలతో వేలాడుతూ ఉంది


ఆ ఫోటోలో ఉన్న పెద్దాయన నవ్వుతూ ఇంకా ఏం మిగిలింది నీకు ఇక్కడ!వచ్చేయ్ ఆశ పడ్డావో

ముందు ముందు ఇంకా నరకం చూస్తావు

ఏంటోయ్ నీ రాక ఎప్పుడూ అని ఆడిగినట్లుగా

అనిపించింది పెద్దావిడకు


కంట్లో నీళ్లు తుడుచుకుంటూ ఇల్లంతా  గమనిస్తుంది పెరటిలో ఉన్న పెద్ద రోలు కనిపించలేదు నలుగురు కూడా మోయలేని అంత పెద్ద రోలు ఎలా తీసుకుని పోయిందో కోడలు అని మనసులో అనుకుంటూ ఉండగా


పక్క పోర్షన్ లో ఉండే ఆవిడ వచ్చింది ఆంటీ మీ

కోడలు వాళ్ళ అమ్మగారి ఊరికి సామాన్లు మినీ ఆటోలో తరలించిందిగా చీకటితో నాలుగు గంటలకే మొదలు పెట్టారు సామాన్లు సర్దుకోవడం పాపం అన్నయ్య ముఖంలో నెత్తుటి చుక్క లేదు అన్నయ్యకు ఇష్టం లేదు అనుకుంటా ఆంటీ అలా వెళ్లడం అన్నయ్య ఎంత సైలెంట్ గా ఉన్న కూడా ఆటో కదిలే వరకు తిడుతూనే ఉంది

మీ కోడలు అన్నయ్యని పాపం అంటూ గోడ వైపు చూసింది అంకుల్ ఫోటో ఆవిడకు బరువై పోయిందా!ఇలా వదిలేసి పోయింది అసలు ఆ రోలు నలుగురికి కూడా పైకి లెగవలేదు మా వారిని కూడా హెల్ప్ అడిగారు అంతేలే రాతికి ఉన్న విలువ మనుషులకు లేదు హ్మ్మ్ అనింది నిట్టూర్పుగా


అయ్యో లేదమ్మా మర్చిపోయి ఉంటుంది అంటూ గోడకు ఉన్న ఫోటో తీసి కొడలిపై మాట పడకుండా సమర్ధిస్తూ ఆ ఫోటోకి ఉన్న ఎండిన పూలమాల తీసేసింది ఫోటోని పవిట కొంగుతో తుడిచి పవిటలో ఫోటో చుట్టుకుని సరే మా ఉంటాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి ప్రతిరోజు అన్నదానం జరిగే గుడి వైపుగా నడిచింది గమ్యం తెలియని ఆ పెద్దావిడ


వెన్నలాంటి మెత్తని మనసున్న మంచి మనుషులకు

రాతి బంధాలు దొరికితే!జీవితాలకు గమ్యం లేని ప్రయాణాలే చివరి మజిలీ వరకు.

*సమాప్తం*

**********************************************

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE