NaReN

NaReN

Sunday, June 8, 2025

పూలు పండ్లు-3

పూలు పండ్లు-3


  శిల్ప, విక్రమ్ ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ టెన్షన్తో చేతులు రెండు లాక్ చేస్తుంది.. శిల్ప టెన్షన్ చూసి విక్రమ్ హే జస్ట్ రిలాక్స్,  ఇక్కడ ఉన్నది మనిద్దరమే.


   భార్యాభర్తలు అంటే వేరు, వేరు కాదు ఒకటే అని మా గ్రానీ ఎప్పుడూ చెబుతూ ఉండేది.

   మా ఇంటి ఆచార ప్రకారం ఈరోజు జరిగే కార్యం వరకు మనం ఒకరినొకరు చూసుకోకూడదు.

ప్రజెంట్ జనరేషన్ లో ఫోటో కూడా చూడకుండానే పెళ్లి చేసుకుంది మనమే అయి ఉంటాం. మన ఆచారాలు మనం పాటించాలి కదా! అని చెబుతూ ఉంటే ముసుగులో నుంచే శిల్ప విక్రమ్ చూస్తూ ఉంటుంది.

     విక్రమ్,  శిల్పతో బాక్స్ ఓపెన్ చేసి చూడవా నేను ఇచ్చినవి  అంటే... శిల్ప కంగారుగా బాక్స్ ఓపెన్ చేస్తుంది.

   ఆ గిఫ్ట్ ని పట్టుకుని చూస్తూ ఉంటుంది.  ముసుగులో ఉన్న శిల్ప భావాలు అర్థం కాక... నచ్చిందా అని అడుగుతాడు.

    శిల్ప నచ్చింది అని తల ఊపుతుంది. విక్రమ్ హ్యాపీగా ఫీల్ అయ్యి నేను పెట్టనా అని అడుగుతాడు.

    ఆ బాక్స్ విక్రమ్ చేతికి ఇస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న నల్లపూసలు, గ్రీన్ స్టోన్ రింగ్ ఆమెకు పెట్టి రింగ్ పెట్టిన చేతిని కిస్ చేస్తాడు.

    శిల్ప చిన్నగా వణుకుతుంది. దానికి విక్రమ్ జస్ట్ రిలాక్స్ అని చెబుతూ ఉంటే... శిల్ప విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది.

శిల్ప ఎందుకో కంగారు పడుతుంది అని అర్థమయ్యి... నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంటే, డోర్ నాక్ చేసిన సౌండ్ వస్తుంది.

    విక్రమ్ వెళ్లి డోర్ తీస్తాడు.  అక్కడ నివి, భార్గవి ఉంటారు.

   భార్గవి విక్రమ్ చూస్తూ.... అది అల్లుడుగారు కార్యం అయ్యేవరకు ఇద్దరు ఒకచోట ఉండకూడదని చెప్పి, శిల్ప ని తీసుకు వెళుతుంది. శిల్ప తన చీర  కొంగుతో విక్రమ్ తొడిగిన రింగ్ చేతుని కవర్ చేస్తుంది.

   అది చూసి విక్రమ్ నవ్వుకుంటాడు. పరవాలేదు.. తెలివైంది.  ఎవరైనా చూస్తే టీస్ చేస్తారని బాగానే కవర్ చేసింది అనుకుంటాడు.

     సాయంత్రం శిల్పా, విక్రమ్ ను తీసుకుని ధనుంజయ్ వాళ్ళ ఇంటికి వెళతారు.

విక్రమ్,  శిల్ప ఒక కారులో వెళ్తారు. విక్రమ్ శిల్పతో నువ్వు నన్ను చూస్తున్నావు ముసుగులోనుంచి.  కానీ..నిన్ను చూడడానికి మాత్రం నేను రాత్రి వరకు వెయిట్ చేయాలి అని చెబుతాడు.

   దానికి శిల్ప తలవంచుకుంటుంది.  శిల్ప సిగ్గు చూసి విక్రm❤️ చిన్నగా నవ్వుకుంటాడు.

పెళ్లి ఒక మ్యాజిక్ కదా!    తెలియని ఇద్దరు మనుషుల్ని ఒకటి చేస్తుంది.

    శిల్ప  నువ్వు  అస్సులు టెన్షన్ పడకు. మన ఇంట్లో అందరూ బాగా కలిసి పోతారు.

బిజినెస్ ఫీల్డ్ లోనే మేము సీరియస్ గా ఉంటాము.  అది తప్పదు. బట్ ఇంట్లో అలా ఉండము.

  అమ్మ, అత్తయ్య,, నివి నీతో బాగా కలిసి పోతారని చెబుతూ ఉంటే శిల్ప విక్రమ్ చేయి పట్టుకుంటుంది.

    ఎందుకు కంగారుపడుతున్నావ్??  నేను ఎక్కడికి వెళ్ళను.  నీతోనే ఉంటాను అని చెప్పి చేయి ప్రెస్ చేస్తాడు.

   ఇంటి ముందు కారు ఆగుతుంది. విక్రమ్,  శిల్ప కారు దిగి లోపలికి వెళతారు.

లోపల కు వెళ్లగానే ఇద్దరినీ సోఫాలో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తారు. విక్రమ్ ను రెస్ట్  తీసుకోమని ఒక రూమ్ లోకి తీసుకువచ్చి వదులుతారు.

     విక్రమ్ వెళ్లి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంటాడు.  కళ్ళ ముందు మేలు ముసుగులో ఉన్న శిల్ప రూపం కనిపిస్తుంది.

శిల్ప రూమ్ లోనికి వెళ్లే ముందు వెనక్కి తిరిగి నన్ను ఎందుకు చూసింది.  తన స్పర్శ నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు ఉంది అనుకుంటాడు  .

రాత్రి గర్భధారణ పూజ సమయానికి విక్రమ్ ఫ్యామిలీ అందరూ వస్తారు. ఒక ఇందిర గారు తప్ప.

    పూజారి ఇద్దరి చేత గర్భాదాన పూజ చేయించి, పెద్దలు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు.

  జంటగా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత శిల్ప ను విక్రమ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు. శిల్ప విక్రమ్ పాదాలు తాకి గట్టిగా పట్టుకుంటుంది. శిల్ప కన్నీటి చుక్క విక్రమ్ పాదాలపై పడుతుంది.

శిల్ప ప్రవర్తన అర్థం కాక విక్రమ్ చాలా డిస్టర్బ్ అవుతాడు. భార్గవి వచ్చి శిల్పను రెడీ చేసి తీసుకు వస్తానని రూములోకి తీసుకు వెళుతుంది.

    లలిత గారు కూడా వస్తాను అంటే వద్దు వదినగారు, అమ్మాయి సిగ్గుపడుతుంది.

నేను రెడీ చేసి తల్లిగా నేను చెప్పవలసిన చెప్పి తీసుకో వస్తానని చెప్పి లోపలికి తీసుకు వెళుతుంది.

విక్రమ్ ని గదిలోకి పంపిస్తారు.  శిల్ప ను అందంగా రెడీ చేసి ముసుగు వేసి తీసుకు వస్తుంది

సత్యవతి గారి పాల గ్లాసు ఇచ్చే జాగ్రత్తలు చెప్పి విక్రమ్ ఉన్న గదిలోకి పంపిస్తారు.
శిల్ప విక్రమ్ గదిలోకి వెళ్లిన తరువాత, విక్రమ్ ఫ్యామిలీ అంతా మాన్షన్ కి వెళ్ళిపోతారు.

ఆ గది మొత్తం సువాసన వెదజల్లే పూలతో అలంకరిస్తారు. ఫ్లోర్ మొత్తం గులాబీ రేకులతో నిండిపోతుంది. అరోమా క్యాండిల్స్ తో విక్రమ్ కి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి.

     విక్రమ్ శిల్పని చూసి ఎందుకు తలుపు దగ్గర నిలబడిపోయావు...ఎవరైనా పనిష్మెంట్ ఇచ్చారా అని అంటే... లేదు అని కంగారుగా తల ఊపుతుంది.

విక్రమ్ నవ్వుతూ ముందుకు వచ్చే శిల్ప చేయి పట్టుకుంటాడు.

    ఆ టచ్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. నిన్నటి నుంచి టచ్ చేసినప్పుడు వచ్చిన ఫీల్ రావడం లేదు ఏంటిది అని ఆలోచిస్తూ...  శిల్ప ను తీసుకోవచ్చి మంచం మీద కూర్చోబెడతాడు.
ముసుగు తియ్యనా అని శిల్ప ని అడుగుతాడు. దానికి సరే అని తల ఊపుతుంది.

  మెల్లిగా శిల్ప మొఖంపై ఉన్న ముసుగు తీసి తన ముఖం చూస్తాడు.  శిల్ప చాలా అందంగా ఉంటుంది.  ఆ అందంతో ఎవరినైనా కట్టే పడేయచ్చు అన్నట్టుగా ఉంది.

   బ్యూటిఫుల్ అంటాడు. దానికి శిల్ప నవ్వుతుంది.  కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది విక్రమ్ కి.

   శిల్ప చేయి పట్టుకోగానే నెగటివ్ వైప్స్  వచ్చినట్టు అనిపిస్తుంది.
శిల్ప మెడ వంక చూస్తాడు. తను ఇచ్చిన నల్లపూసలు ఉండవు.
డౌటుగా మాట్లాడుతూ,  చేతులు పట్టుకొని తను పెట్టిన ఉంగరాన్ని చూస్తాడు. ఆ ఉంగరం ఉండదు. వేరే మోడల్ ఉంగరం ఉంటుంది.
శిల్ప చేతులను చూస్తాడు. సాయంత్రం వరకు అరచేతుల వరకు ఉన్న గోరింటాకు ఇప్పుడు మోచేతులు దాకా కనిపిస్తుంది.

  కుడి చేతి మణికట్టుపై తన చూసిన పుట్టుమచ్చ కూడా లేదు.  ఏదో తప్పు జరుగుతుంది అని విక్రమ్ కి అర్థమయ్యి శిల్ప వంక కోపంగా చూస్తూ.... రూమ్ లో నుంచి బయటికి వెళ్లిపోతాడు.

    కోపంగా విక్రమ్ ఎక్కడికి వెళుతున్నాడు??
    ఇప్పుడు శిల్ప పరిస్థితి ఏమిటి??
    కథ కొనసాగుతుంది....

ఇంకా చదవాలని ఉంటే కింద క్లిక్ చేయండి.

Click here

పూలు పండ్లు -2

పూలు పండ్లు -2

గుమ్మం దగ్గర నిలబడిన నూతన దంపతులను ఆపి పేర్లు చెప్పి రమ్మంటారు.


      దానికి వరుడు చిన్నగా నవ్వి, విక్రమ్ జై సింహ అనే నేను నా భార్య అయిన శిల్పతో వచ్చాను అని చెబుతాడు.

     వధువు వంక చూసి ఇప్పుడు నువ్వు చెప్పు వదిన అనగానే,  వధువు కంగారుగా విక్రమ్ చేయి పట్టుకుంటుంది.

  దానికి విక్రమ్ చిన్నగా చేతిని ప్రెస్ చేసి రిలాక్స్ అని చెప్పి,  విక్రమ్ వాళ్ళ అమ్మగారి వంక చూస్తాడు.  లలితగారు నవ్వుకుంటు వచ్చి శిల్పా మౌనవ్రతంలో ఉంది లోపలికి రానివ్వండి అని చెబుతారు.

ఇందిరా దేవి గారు అక్కడికి వచ్చి అప్పుడే కోడల్ని వెనకేసుకొస్తున్నావా అని అడుగుతారు.

   దానికి  లలితగారు మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టు శిల్ప కు నేను ఇస్తున్నాను అత్తయ్య గారు  అని చెబుతుంది.

దానికి ఇందిరాగారి ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వు వస్తుంది. భార్య లౌక్యం చూసిన లలిత భర్త గారైన కళ్యాణ గారు ముసిముసగా నవ్వుకుంటారు.

  విక్రమ్ శిల్ప కుడి కాలు లోపలికి పెట్టి వస్తారు. విక్రమ్ చెల్లి అయిన నివేదిత వాళ్ళ అమ్మ గారిని అడుగుతుంది.  వదిన ఎప్పుడు ముసుగు తీయాలి అని...

దానికి శిల్ప టెన్షన్ తో ముసుగుని గట్టిగా పట్టుకుంటుంది. నీకెందుకే అంత తొందర అంటూ వినయ్ అక్కడికి వస్తాడు. చిన్నన్నయ్య అని గారంగా పిలుస్తుంది.

దానికి ఉన్నదే ఆ కంగారు కదా అని అంటూ భరత్ అక్కడికి వస్తాడు. బావా అంటూ గుర్రుగా చూస్తుంది.

శిల్పతో భరత్ హాయ్ చెల్లమ్మ నేను నీకు అన్నయ్యని అవుతాను. అలాగే నీ భర్తకి బావ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ని అని పరిచయం చేసుకుంటాడు.
వినయ్ కూడా హాయ్ వదిన నేను నీకు బుల్లి గారాల మరిదిని అని పరిచయం చేసుకుంటాడు.

నివేదిత మళ్ళీ అడుగుతుంది మూసుకు ఎప్పుడు తీస్తారు అని...

  రేపు ఉదయమే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. రేపు రాత్రికి కార్యం జరుగుతుంది.

ఎల్లుండి శిల్ప పూజ చేసిన తర్వాత ముసుకు తీస్తామని ఇందిరా గారు చెబుతారు.

అన్నయ్య ఎప్పుడు చూస్తాడు అంటే... నువ్వు చిన్నపిల్లవు ఇంకా ఎక్కువగా అడగకు అని  చిరు కోపంగా చెప్పి, వదినని రూమ్ కి తీసుకెళ్లని ఇందిరా గారు చెబుతారు.

శిల్పా రూమ్ లోకి వెళ్ళగానే శిల్ప మేనమామ అయిన సునీల్, మేనత్త అయిన బిందు లోపలికి వస్తారు.

    సునీల్ లోపలికి వస్తూనే క్షమించండి.  కొంచెం ట్రాఫిక్ జామ్ అయి లేట్ అయ్యాము అని చెబుతారు.

ఎందుకు అంత కంగారు పడుతున్నారు?  శిల్పా  మా అమ్మాయి రూములో ఉంది అని చెప్పి...

సర్వెంట్ ని పిలిచి గెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లమంటారు బిందూకి వ్రతం వరకు శిల్పని కలవడం కుదరదు.

వ్రతానికి విక్రమ్, శిల్ప కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. శిల్ప తల్లిదండ్రులైన ధనుంజయ్,  భార్గవి,  నానమ్మ,  తాతయ్యలైన సత్యవతి,  శేషగిరి గారు వస్తారు.

    వ్రతం అంత ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. వ్రతం పూర్తయిన తర్వాత లలితగారు వంశపారపర్యంగా వస్తున్న నగలను శిల్పకు అందిస్తారు.

శిల్ప మొహమాటం పడుతుంటే,  తీసుకో శిల్పా అవి ఇంటి కోడళ్ళకి చెందవలసినవి.  నీకు ఇంకా వినయ్ కి వచ్చే భార్యకు మాత్రమే చెందుతాయి. అని చెప్పి శిల్పకు అందిస్తారు.

శిల్పా అవి తీసుకోగానే భార్గవి వచ్చి అవి శిల్ప చేతిలో నుంచి తీసుకుంటుంది. విక్రమ్ మేనత్త అయిన మాధవి గారు డైమండ్ సెట్ ప్రెసెంట్ చేస్తారు..

లలిత గారు అది చూసి ఇప్పుడు ఎందుకు వదిన అంటే,,  నా కూతురికి మేము పెట్టుకుంటున్నాం అని మాధవి భర్త అయినా  రమేష్ గారు చెబుతారు.

వ్రతం పూర్తిచేసి విక్రం కి శిల్ప కి రూమ్లో భోజనం ఏర్పాటు చేస్తారు. నివేదిత ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది.  శిల్ప ముసుగు లోపలికి చేతిని తీసుకువెళ్లి భోజనం చేస్తూ ఉంటుంది.

భోజనం అయిన తర్వాత విక్రమ్ నివేదితను పిలిచి, నివి బయట 5 మినిట్స్  మేనేజ్ చెయ్ అని చెబుతాడు.

దానికి నివి ఓహో..... లెజెండ్ విక్రమ్ గారు రొమాంటిక్ పర్సన్ అయ్యారా..అని టీస్ చేస్తుంది.

  ఒక నవ్వి నవ్వి విక్రమ్ చెల్లిని పంపిస్తాడు. విక్రమ్ శిల్ప దగ్గరికి వచ్చి నీకు ఒక స్మాల్ గిఫ్ట్ అని ఒక బాక్స్ ఇస్తాడు.

ఆ గిఫ్ట్ చూసిన శిల్ప రియాక్షన్ ఏమిటి??
కథ కొనసాగుతుంది....

ఇంకా చదవాలని ఉంటే కింద క్లిక్ చేయండి.

Click here

పూలు పండ్లు-1

పూలు పండ్లు 

ఈ కథ పూర్తిగా కల్పితం..


కళ్యాణ మండపం...

ఈ సిటీ లోనే పెద్ద పెద్ద బడా బాబుల్ని భరించే అతిపెద్ద కళ్యాణ మండపం.

రాష్ట్రంలోనే రెండు పెద్ద బిజినెస్ కుటుంబాల మధ్య జరుగుతున్న వివాహ వేడుక ఇది.
అంగరంగ వైభవంగా అలంకరించి ఉంది ఎటు చూసినా రెండు కుటుంబాల వైభోగం కనబడుతుంది.
కళ్యాణ మండపం చుట్టూ ఫుల్ గా సెక్యూరిటీ ఉంది.
ప్రతి ఒక్కరినే బాగా చెక్ చేసి గాని లోపలికి పంపడం లేదు.

        పెళ్ళికొడుకు మండపంలో కూర్చుని వర పూజ చేస్తున్నాడు. పెళ్ళికొడుకుని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.

  ఆరడుగుల అందగాడు, చురకత్తుల లాంటి చూపులు, సమ్మోహనపరిచే చిరునవ్వు, సిల్కీ హెయిర్, చుక్కల్లో చంద్రుడు వలె మెరిసిపోతున్నాడు.

    పెళ్లికి వచ్చిన బంధువు వర్గం అంతా ఈ సంబంధం మాకు ఎందుకు కుదరలేదు అని బాధపడుతూ, పెళ్లికూతురు తండ్రి అదృష్టానికి ఈర్షపడ్డారు .

  పెళ్ళికాని అమ్మాయిలు అయితే తమ కలల రాకుమారుడు వేరొకరి సొంతం అవుతున్నందుకు తెగ బాధ పడిపోయారు.

ఇంతలో పూజారి గారు పెళ్ళికూతురుని తీసుకురండి అని చెబుతారు. పెళ్ళికూతురని ఆమె స్నేహితులు తీసుకు వస్తూ ఉంటారు. వారి ఆచారం ప్రకారం ముసుగు వేసుకుని ఉంటుంది.

    పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోబెడతారు.ఇద్దరి మధ్యన తెర అడ్డుగా ఉంటుంది. పూజారి గారు వధువుతో పూజ చేయిపిస్తూ మంత్రాలు చెప్పిస్తుంటే, వధువు తల్లి అయిన భార్గవి వచ్చి అమ్మాయి రెండు రోజులు మౌనవ్రతం లో ఉంది అండి.

     పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని అమ్మవారికి మొక్కుకుంది అని చెబుతుంది. అందరూ వధువు భక్తికి మురిసిపోతారు వధువు తండ్రి అయిన ధనుంజయ్ గారు కూతురిని చూసి పొంగిపోతారు.

  ధనుంజయ కళ్ళు ఎవరినో వెతుకుతాయి కానీ అతనికి నిరాశ ఎదురవుతుంది.

కన్యాదాన పూజలో వధువు కుడి చేతి మణికట్టుపై ఉన్న పుట్టుమచ్చ చూసి వరుడికి రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి.
ఆ పుట్టుమచ్చ పెసరబద్ధంత పెద్దగా ఉంటుంది.
కన్యాదానం పూర్తయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టేస్తారు.

తరువాత తాళి కట్టినప్పుడు వరుడు ఎంతో సంతోషంగా కడుతూ ఉంటే, వధువు కంటలో నుండి నీళ్లు జలజలా కారుతాయి..

ఒక కన్నీటి బొట్టు వచ్చే వరుడు పాదాలపై పడుతుంది.
వరుడు అర్థం కాక వధువు వంక అనుమానంగా చూస్తూ ఉంటే, భార్గవి వచ్చి మీతో వివాహానికి తను చాలా సంతోషంగా ఉంది అని వరుణ్ణి డైవర్ట్ చేస్తుంది.

తలంబ్రాల ఘట్టంలో కూడా వధువు వణుకుతూ ఉంటుంది. పెళ్లి ఘట్టాలు అన్నీ పూర్తి అయ్యాక అప్పగింతల అప్పుడు వధువు తన నానమ్మ అయిన సత్యవతి గారికి దగ్గరికి వెళుతూ ఉంటే భార్గవి వచ్చి వధువును హత్తుకుని భయపడకు మేమందరం నీ వెనకాల వస్తున్నాము అని చెప్పి సాగనంపుతుంది.

   వధువు,  వరుడు ఒక కారులో,  మిగిలిన వాళ్ళందరూ ఎవరి కారులో వారు బయలుదేరతారు.

కార్ స్టార్ట్ అవ్వగానే వరుడు,,  తమకు డ్రైవర్ కి మధ్య ఉన్న డోర్ వేసేస్తాడు.  ఆ కారు చాలా లగ్జరీస్ కారు. అన్ని రకాల హంగులు ఉంటాయి.

   వెంటనే వరుడు వధువు చేయి పెట్టకు పట్టుకుని నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా!! ఎవరి బలవంతం మీద నువ్వు ఒప్పుకోలేదు కదా అని గంభీరంగా అడుగుతాడు.

   అతని మాటలోనే గంభీరానికే భయపడుతుంది. వధువు భయం అర్థం అయ్యి కూల్ గా మాట్లాడతాడు భయపడకు నిజం చెప్పు అని...

దానికి వధువు ఇష్టమే అని తల ఊపుతుంది. మౌనవ్రతం ఎన్ని రోజులు అని అడుగుతాడు??  రెండు రోజులు అని తన వేళ్ళు చూపిస్తుంది.

  వధువు చేతి వేళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. వరుడు తన చేయి పక్కన వధువు చేయి పెట్టి చూసి చిన్నగా నవ్వుకుంటాడు.

  ఇంతలో కార్ ఒక అందమైన మాన్షన్ ముందు ఆగుతుంది. అది జై సింహా మాన్షన్. పెళ్లి గురించి మాన్షన్ మొత్తం అందమైన పువ్వులతో అలంకరించబడి ఉంటుంది .

  జై సింహా ఫ్యామిలీ తరతరాల నుంచి చెయ్యని బిజినెస్ అంటూ లేదు. స్కూల్స్ దగ్గర నుంచి హాస్పిటల్స్ వరకు,  వ్యవసాయ ఉత్పత్తుల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ వరకు అన్ని రకాల బిజినెస్ లు చేస్తున్నారు.

   చారిటీస్ కూడా రన్ చేస్తున్నారు. కంపెనీ ప్రాఫిట్ లో 25% చారిటీస్కు ఉపయోగిస్తున్నారు.

ఇద్దరినీ గుమ్మం ముందు ఆపి పేర్లు చెప్పి లోపలికి రమ్మంటారు. వధువుకి చాలా టెన్షన్ గా ఉంటుంది.
వరుడు వధువు వంక చూసి చిన్నగా నవ్వుతాడు. వధువు ఆలోచిస్తుంది ఇప్పుడు ఎలా తను మాట్లాడేది అని...

కథ కొనసాగుతుంది.....


ఇంకా చదవాలని ఉంటే కింద క్లిక్ చేయండి.

Click here 

Thank you All

 







తండ్రి కూతురు

 తండ్రి కూతురు

అన్నీ సర్దుకున్నావా తల్లీ, ఇంకోసారి చూసుకో అక్కడ నువ్వు బయటకు వెళ్లి తెచ్చుకోవడానికి లేదు, నిన్ను బయటకు ఎవరూ తీసుకువెల్లరు మల్లీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, మీ అమ్మమ్మ నిన్ను చూడాలంది కాబట్టి నిన్ను పంపిస్తున్నాం. 


నిజానికి నిన్ను అక్కడికి పంపించడం నాకు అసలు ఇష్టం లేదు, కాని తప్పట్లేదు అని తన నిస్సహాయతకు బాధపడుతూ కూతురు భానుమతితో చెప్తూ ఉన్నాడు భగత్. 


నేను అన్నీ సర్దుకున్నాను నాన్న, నువ్వేం కంగారుపడకు , నాకు తెలీదా అక్కడికి వెలితే మల్లీ బయటకు రాలేనని, నేను ఈజీగా ఇమిడిపోతాను నాన్న అక్కడ, భయపడకు వెలదామా అని అడిగింది భానుమతి. 


మీ అమ్మ ఎక్కడికి వెల్లిందిరా అని అడిగాడు భగత్. 


ఇప్పుడదంతా అవసరం లేదు నాన్న, నేను లేనప్పుడు అయినా అమ్మను తిట్టకుండా ఉండు, చెల్లి జాగ్రత్త అని చెప్పి తన   క్రచ్ ( నడవడానికి సపోర్ట్ గా ఉండే కర్ర) తీసుకుని కుంటుకుంటూ బయటకు నడిచింది భానుమతి. 


లగేజ్ ని పట్టుకుని భగత్ ముందు వెలితే, చేతికర్ర సహాయంతో మెల్లగా నడుచుకుంటూ బయటకు వచ్చింది భానుమతి. 


ఆమె ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి బయటకు కాలు పెడుతుందా అని ఎదురుచూస్తుంది భానుమతి పినతల్లి పార్వతి. 


పేరుకి పార్వతీ అయినా రాక్షస గుణం నుండి వచ్చిందనడానికి ఏమాత్రం తీసిపోదు ఆమె ప్రవర్తన. 


ఊ ఊ అంటూ మూతి తిప్పుతూ, రావే దరిద్రం మన ఇంటిని వదిలి ఇన్ని రోజులకు పోతుంది, ఇల్లు కడిగి శుభ్రం చేసుకుందాం అంటూ తన కూతురు అయిన త్రిశూలని పిలిచి చెప్తుంది పార్వతి. 


నేనెందుకు క్లీన్ చేయాలి అమ్మా, పనివాళ్లు ఉన్నారు వాల్లకు చెప్పు, నాకు డస్ట్ అంటే పడదు అని నీకు తెలుసు కదా అంటూ ముఖం చిట్లిస్తూ మాట్లాడి, వెలుతున్న భానుమతిని చూస్తుంది త్రిశూల. 


అవన్ని మాటలు తనకు వినిపించనట్టుగా గేట్ దాటి వెలిపోతుంది భానుమతి, భగత్ కూతురికి నూటొక్క జాగ్రత్తలు చెప్పి జాగ్రత్త తల్లి వెళ్లగానే ఫోన్ చేయు, నిన్ను ఈ టైమ్ లో పంపిస్తున్నందుకు నన్ను క్షమించరా . 


నీతో పాటు వస్తే మీ అమ్మ అరచి గోల చేస్తుంది, వెళ్లగానే ఫోన్ చేయు తల్లి అంటూ చెప్పి టైమ్ చూస్తాడు. 


అప్పటికి రాత్రి పది గంటలు అవుతుంటే టెన్షన్ గా ఉంటుంది అతనికి ఒంటరిగా ఆడపిల్లని అంత దూరం పంపిస్తున్నాము అందులో కాలు కూడా సరిగ్గా లేదు అని. 


అతని భయాన్ని అర్థం చేసుకున్న భానుమతి తండ్రి చేతిని పట్టుకుని, నేను జాగ్రత్తగానే వెలతాను నాన్న, వెల్లగానే ఫోన్ చేస్తాను అని తండ్రికి ధైర్యం చెబుతుంది. 


ఇంతలో బుక్ చేసుకున్న బస్ రావటంతో, క్లీనర్ ఫోన్ నంబర్ తీసుకుని, దిగేటప్పుడు జాగ్రత్తగా దించండి బాబు అంటూ అతనికి చెప్పి ఆమె సీట్ లో కూర్చునే వరకు చూసి అప్పుడు బస్ దిగుతాడు భగత్. 


తండ్రి కేరింగ్ కు మురిసిపోతూ వెల్లొస్తాను నాన్న అంటూ చెప్పి, బస్ బయలుదేరగానే కల్లు మూసుకుంటుంది సీట్ బెండ్ చేసి. 


భానుమతి చురుకైన పిల్ల, తల్లి చిన్నప్పుడు చనిపోతే అతని ఇంటివారు మల్లీ పెల్లి చేసారు భగత్ కి అతను వద్దని ఎంత చెప్పినా వినకుండా, ఆ ఇంటికి కోడలుగా వచ్చిన పార్వతి అతనికి భార్య అయింది కాని భానుమతికి తల్లి కాలేకపోయింది.


భగత్ ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా చూసుకునేది భానుమతిని. 


భగత్ ఆ విషయం తెలుసుకుని నిలదీస్తే, మీకు మీ కూతురే ఎక్కువా అంటూ ఏడుస్తూ గొడవపడి విషం తాగడానికి ప్రయత్నించింది. 


అప్పటికే రెండు సంవత్సరాల త్రిశూల ఉంది ఆమెకు, ముందున్న భార్యను పోగొట్టుకుని భానుమతి తల్లి లేనిది అయిపోయిందనే ఆమె కోసం మల్లీ పెల్లి చేసుకున్నాడు, ఇప్పుడు పార్వతి కూడా అలా అయితే ఎలా అని భయపడ్డాడు, పార్వతికి ఎదురు చెప్పడం మానేసాడు కాని భానుమతి విషయంలో ఆమెతో గొడవలు పడుతూ ఉంటాడు. 


అప్పటినుండి బానుమతికి దూరంగా ఉన్నా, తండ్రి ప్రేమ పంచుతూనే వచ్చాడు, తరువాత కొన్ని రోజులకు బానుమతికి ఒక యాక్సిడెంట్ లో ఒక కాలు విరిగి, అది అతుకకుండా ఉండిపోయింది. 


ఎవరి మీద ఆధారపడని భానుమతి కాలు విరిగాక కూడా తన పనులు తను చేసుకుంటూ ఉంది, ఆమెకు స్నేహంగా తన దగ్గర ఉన్న చేతికర్రే తోడుగా మారింది. 


ఇప్పుడు భనుమతి వెళుతుంది తన కన్న తల్లి పుట్టిన ఇంటికి, తన అమ్మమ్మ ఇంటికి. 


భానుమతి అమ్మమ్మ పేరు ఇందిరా, తన కూతురు చనిపోయినప్పటినుంచి , ఆ ఇంటికి ఈ ఇంటికి మాటలు తగ్గిపోయాయి, భానుమతిని చూడాలనిపించడంతో భగత్ గారికి ఫోన్ చేసి పిల్లను పంపించు ఇక్కడ కొన్ని రోజులు ఉంచుకుని పంపిస్తాను అని చెప్పింది. 


పెద్దావిడ గారి మాటలు కాదనలేక భానుమతిని హైదరాబాద్ కి పంపిస్తున్నాడు భగత్. 


విజయవాడలో రాత్రి బస్ ఎక్కితే పొద్దున దిగుతారు, సేఫ్టీ చూసి మరీ భానుమతికి బస్ ఎక్కించి ఇంటికి వచ్చాడు భగత్. 


పొద్దున ఎనిమిది గంటలకు హైదరాబాద్ లో బస్ దిగిన భానుమతి ఆటో తీసుకుని ఇందిరా గారి ఇంటిముందు దిగింది. 


ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఇందిరా గారిది. 


ఇందిరా గారికి ఇద్దరు పిల్లలు, ఒకరు భానుమతి వాల్ల అమ్మ అయితే ఇంకొకరు మోహన్ గారు. 


మోహన్ గారు ఒక కంపెనీలో మానేజర్ గా వర్క్ చేస్తూ, పెల్లి చేసుకుని ,రాను రాను తనే ఒక కంపెనీ పెట్టేంతగా ఎదిగిపోయాడు మోహన్, తన చెల్లిని మంచిగా ఉన్నటువంటి ఇంటికే ఇచ్చారు, భానుమతి పుట్టగానే తన చెల్లెలు చనిపోయేసరికి దూరం వచ్చేసి హైదరాబాద్ లో స్థిరపడ్డారు. 


మోహన్ కి ఒక కొడుకు ఒక కూతురు, కొడుకు భార్గవ్, కూతురు భవిక. 


భార్గవ్ మంచిగా చదువుకుని  ఇప్పుడు ఒక లెక్చరర్ గా స్థిరపడ్డాడు, భవిక ఇప్పుడు ఎం. బి. ఎ ఫస్ట్ ఇయర్ లో ఉంది. 


తండ్రి తెచ్చిన ఆస్తిని లెక్కచేయకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని, తన పాషన్ అయిన లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. 


ఇరవై ఏడేల్ల భార్గవ్ కి పెల్లిచేయాలని ఇంట్లో అనుకున్నారు, కాని భవిక ఉండటంతో ఆమె పెల్లి తరువాత చెయ్యాలి అని ఫిక్స్ అయ్యారు. 


మోహన్ గారి భార్య చందన, చందన తన అన్న కూతురితోనే భార్గవ్ పెల్లి జరిపించాలని అనుకోవటంతో ఒకే చేసారు ఇంట్లో అంతా. 


భార్గవ్ కి కూడా ఆ ప్రపోజల్ నచ్చడంతో ఒకే అన్నాడు, అందులోనూ తన మరదలు అప్సరసలా వంక పెట్టడానికి లేకుండా ఉంటుంది, తన ఇంట్లోనే ఆమె కూడా ఉండటంతో ఒప్పుకున్నాడు పెల్లికి.


పొద్దున్నే లేచిన భార్గవ్ మెడిటేషన్ చేసి,ఫ్రెష్ అప్ అయి డైనింగ్ ఏరియాకు వచ్చాడు. 


ఇందిరా గారితో పాటుగా తల్లి ,తండ్రి ,చెల్లెలు ,మరదలు అక్కడే ఉండటంతో అందరికి ఒకేసారి మార్నింగ్ విష్ చెప్పి కూర్చున్నాడు తినడానికి. 


భవిక పక్కన కూర్చున్న భార్గవ్ ని చూసి లేచి వచ్చి అతన పక్కన సీట్ లో కూర్చుంది మరదలు లావణ్య. 


లవ్ తినే దగ్గర నుండి లేవద్దు అని నీకెన్ని సార్లు చెప్పాను మారవా నువ్ అన్నాడు తింటూనే. 


నువ్ నా పక్కనే ఉండాలి బావా, లేకపోతే నాకు నచ్చదు అంటూ కూర్చుని తను కూడా టిఫిన్ చేయడం మెుదలు పెట్టింది. 


తన అన్న కూతురు తనింటి కోడలు కాబోతుంది అని సంతోషపడుతూ అందరికి టిఫిన్ వడ్డిచటంలో మునిగిపోయింది చందన. 


తిని అందరికి బాయ్ చెబుతూ కాలేజ్ కి వెళ్లడానికి బయటకు వచ్చి కార్ తీస్తున్నాడు భార్గవ్. 


గేట్ ముందు సెక్యూరిటీతో మాట్లాడుతుంది భానుమతి, ప్లీజ్ ఒక్కసారి లోపలికి ఫోన్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. 


సెక్యూరిటీ ఆమెను లోపలకు వెల్లనివ్వకుండా అడ్డుపడుతున్నాడు,చాలా సేపటి నుండి బ్రతిమిలాడి ఓపిక నశించి భగత్ గారికి ఫోన్ చేసింది. 


ఫోన్ మోగడంతో దానివైపు చూసిన పార్వతికి అందులో బంగారం అని పేరు చూసి పెదవి విరుస్తూ సైలెంట్ లో పెట్టేస్తుంది భగత్ గారు వాష్ రూంలో ఉండటంతో. 


నాన్న కూడా ఫోన్ లేపడంలేదు , నాకేమో అమ్మమ్మ ఫోన్ నంబర్ తెలీదు ఏం చేసేది అనుకుంటూ వెనక్కి వెల్లిపోదాం అని వెనుదిరుగేతంలో , ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతాడు సెక్యూరిటిని భార్గవ్. 


అతనిని చూసి, సర్ ఇతను నన్ను లోపలకు వెల్లనివ్వటం లేదు, ఒకసారి ఇందిరమ్మ గారికి ఫోన్ చేయండి, నేను ఆవిడకు తెలుసు,భానుమతి వచ్చింది విజయవాడ నుండి అని చెప్పండి అంటూ భార్గవ్ తో అంది. 


ఎవరు ఈ అమ్మాయి అనుకుంటూ భానుమతిని చూసాడు, నడుము వరకు ఉన్న జడ, చేపలాంటి కల్లు, పొడవాటి ముక్కు,చిట్టి పెదాలు, నున్నటి మెడ,కొంచెం కిందకు చూపు దించాడు వెంటనే జ్ఞానం మేలుకొని చూపు తిప్పి పంపించండి తనను అని సెక్యూరిటికి చెప్పాడు. 


మనసు కుదుటపడి హమ్మయ్య అనుకుంది భానుమతి. 


గేట్ తీయగానే లగేజ్ దగ్గర ఉన్న చేతి కర్రను తీసుకుని గేట్ లోపలకు నడిచింది, అప్పటివరకు మామూలుగా ఉన్న భార్గవ్ మెుహం కోపంతో నిండిపోయింది. 


లోపలికి వెలుతున్న తనతో ఆగు అని అరిచాడు. 


కోపంగా వినిపించిన అతని వాయిస్ కి భయపడి అక్కడే నిలబడిపోయింది.


సెక్యూరిటీ ఆ అమ్మాయిని బయటకు పంపించండి, ఇంట్లోకి రావటానికి వీలులేదు ఈ అవిటివారు మా అమ్మమ్మని ఊరికే అడ్డుపెట్టుకుని డబ్బులు లాగుతూ ఉంటారు అని భానుమతిని చీదరింపుగా చూస్తాడు. 


అవిటివారు అనగానే భానుమతికి ఏడుపు వచ్చింది, కల్లలో తడి చేరింది, కాని వాటిని బయటకు తీసుకురావడానికి మనసు అంగీకరించకపోవటంతో మెుండిగా నిలబడింది అలాగే. 


సెక్యూరిటి ఆమె దగ్గరకు వచ్చి పదమ్మా బయటకు అన్నాడు, ప్లీజ్ అండి ఒక్కసారి ఇందిరమ్మ గారిని చూసి వెల్లిపోతాను అని బ్రతిమిలాడింది. 


చెప్పేది నీకే పంపించండి ఆ అమ్మాయిని అంటూ అరిచి వెల్లి తన కార్ లో కూర్చున్నాడు. 


పదమ్మా మల్లీ సార్ తిడతాడు నిన్ను పంపించలేదు అని భానుమతి లగేజ్ ని తీసుకున్నాడు సెక్యూరిటి, చేసేదేం లేక ఏడుపుని పంటి బిగువున దాచి పెట్టి కర్ర సహాయంతో గేట్ బయటకు నడిచింది. 


కార్ లో కూర్చుని బ్లడీ పీపుల్, ఒకసారి సహాయం చేసిన పాపానికి మల్లీ మల్లీ ఈఇంటికి వస్తూ విసిగిస్తున్నారు, ముందు గ్రానిని తిట్టాలి , దానాలు ధర్మాలు అంటూ ఆస్తిని మెుత్తం ఖర్చుచేస్తుంది , ఆ తరువాత భవికకి ఏం ఇద్దామని అనుకుంటుంది అని ఆలోచిస్తూ కార్ స్టార్ట్ చేసి కాలేజ్ కి పోనిస్తాడు. 


గేట్ బయటకు కార్ రాగానే అక్కడే సెక్యూరిటి పక్కన నిలబడిన భానుమతిని చూస్తూ, తనని ఇంట్లోకి పంపించినట్టు తెలిసిందో మీ పోస్ట్ లు ఊడతాయి అని చెప్పి వెల్లిపోయాడు.


భార్గవ్ ఎవరో తెలియకున్నా అతను అవిటిది అన్న మాట మాత్రం గుండెల్లో దిగిపోయింది భానుమతికి.

లింక్ పై క్లిక్ చేసి పూర్తి కథను చదవండి.

https://pasupuletinarendraswamy.blogspot.com/2025/06/blog-post_98.html

మన కర్తవ్యం

 మన కర్తవ్యం 

"నీవు లేక నేను లేను..."


"ఏవండీ, నేనో మాట అడుగుతాను, ఏమీ అనుకోకుండా, సమాధానం చెప్పాలి..."


"మళ్ళీ ఏదో భేతాళ ప్రశ్న వేసేట్టున్నావే...

 సరే, నాకు కొత్త కాదుగా...రానీ..."


"ఏమీ లేదు, మన పిల్లలా...సప్తసముద్రాల అవతల,

ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు, మనిద్దరమే ఇక్కడ

వృద్ధ దంపతులం ఉంటున్నాం. దేవుడి దయవల్ల తిండికి, బట్టకి, లోటు లేకుండా సొంతింట్లో పడి, కాలక్షేపం చేసేస్తున్నాం..."


"అయితే...?"


"మనకా, రాను రాను ఓపికలు తగ్గుతున్నాయి, పూర్వకాలంలో వాళ్ళలాగ, పిల్లల దగ్గిర ఉండలేము, వాళ్ళూ ఇక్కడికి రాలేరు, ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళినా, ఆరు నెల్లవగానే ఇక్కడికొచ్చేయాలి... 


ఇలా అంటున్నానని, బాధపడొద్దు...ఒకవేళ నాకు

ఏమైనా అయితే, మీరు ఒంటరిగా ఎలా బతగ్గలరా 

అని నాకు బెంగ ! రోజూ పడుకున్నా, ఇలాంటి

ఆలోచనలతో సరిగ్గా నిద్రపట్టి చావట్లేదు ! 

వెధవ కలలు కూడా, అలాంటివే వస్తున్నాయ్...

ఈమధ్య !"


"అలాగా ? నాక్కూడా అలాంటి బెంగలే పట్టుకుంటున్నాయ్...


నువ్వు పైకి తేలావు - నేను తేలట్లేదు...అంతే తేడా !

ఇలాంటి వాస్తవాలు మాట్లాడితే, మీ ఆడవాళ్ళందరికీ సెంటిమెంట్లు అడ్డొచ్చేస్తాయి ! ఎలాగూ ఆ టాపిక్ 

నువ్వే తెచ్చావు కాబట్టి, ఓసారి నా మనసులోమాట చెప్పేస్తాను, నేను చెప్పేదానికి అడ్డు రాకుండా, 

శ్రద్ధగా విను...


నీకంటే నేను  పెద్ద, పైగా,  సాధారణంగా 

మగాళ్ళకంటే ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, నాకేమైనా అయితే, నీ పరిస్థితి ఏంటి ?"


"అలాంటి అశుభం మాటలు మాట్లాడకండి, 

శుక్రవారం పూటా..."


"అదిగో మళ్ళీ...సెంటిమెంట్లు తేవద్దన్నానా? 

పూర్తిగా విను ! నువ్వు వెళ్ళిపోయినా, 

నేను వెళ్ళిపోయినా, లోకం ఏమీ ఆగిపోదు !

కాకపోతే, ఇన్నాళ్ళూ ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా,

కలిసి బతికి, మన ఇద్దరు పిల్లల్నీ పెంచి పెద్దచేసి,

బాగా చదివించి, ఒకింటివాళ్ళని చేసి, సంతోషంగా విదేశాలకు పంపించాం. వాళ్ళు, వాళ్ళ పిల్లలు - సంసారాలతో చాలా ఆనందంగా వృద్ధిలోకొస్తున్నారు...


నా పెన్షన్ డబ్బుల తోటి, బ్యాంకు  వారిచ్చిన 

ఆరోగ్య బీమాతోటి, ఇంతకాలం బాగానే బతికేస్తున్నాం..."


 "దేవుడు ఎప్పటికీ మన్నిలాగే రక్షిస్తాడు..."


"రక్షిస్తున్నాడు కనుకనే, ఇలా  ఏళ్ళు నిండినా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతున్నాం ! 

అసలు సంగతి చెబుతాను, విను...


నీకు ఎన్నిసార్లు నేర్పినా, మన సందు చివరున్న

ఏటీఎం కి వెళ్ళి, డబ్బులు తేగలవా ?

అత్యవసరమైతే, చేతిలో ఉన్న సెల్ ఫోన్ నుంచి 

క్యాబ్ బుక్ చెయ్యగలవా ?

ఎన్నిసార్లు చెప్పినా, నీ బుర్రలోకి వెళ్ళిందా ?

ప్రాణాపాయ స్థితిలో, అంబులెన్స్ బుక్ చెయ్యగలవా ? 

నన్ను హాస్పిటల్ దాకా తీసికెళ్ళగలవా ?

ఇన్సూరెన్స్ కార్డు ఎక్కడుందో, ఎప్పుడైనా పట్టించుకున్నావా ? దాన్ని ఎలా వాడాలో తెలుసా ?


నీ మనవలతో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా, 

'మీరు అన్నీ నేర్చేసుకోండి, వంట, ఈత, కారు డ్రైవింగు, కరాటే, డాన్సు, సంగీతం, అన్నీ వచ్చెయ్యాలి' అని వాళ్ళకి క్లాసులు తీసుకుంటావు కానీ, నువ్వు, ఇక్కడ, నీకు అవసరమైన కనీస విషయాలు నేర్చుకుంటున్నావా? 


భగవద్గీత రోజూ చదువుతుంటావే...

అందులో దేవుడు ఏం చెప్పాడో, అవన్నీ వంటబట్టించుకుంటున్నావా ?


అసలు నాకెంత పెన్షన్ వస్తుందో చెప్పు చూద్దాం...

ప్రతి నెలా మనకెంత ఖర్చవుతుందో తెలుసా, నీకు ?

మన ఇంటికి ఎంత టాక్స్ కడుతున్నాం ? ఎంతసేపూ

నీ చీరలు, నగలు, ఇంట్లో వున్న గిన్నెలు, తప్పేళాలూ జాగ్రత్తగా చూసుకుంటావుగానీ...

ఇంట్లో గ్యాస్ అయిపోతే, బుక్ చేయగలవా ? 

కరెంట్ బిల్లు ఎక్కడ కట్టాలో, ఎలా కట్టాలో తెలుసా ?

నీ ఫోన్ నువ్వు రీఛార్జ్ చేసుకోగలవా?

మనకి, ఏ బ్యాంకులో, ఎన్ని డిపాజిట్లు ఉన్నాయో, 

ఆ రసీదులు ఎక్కడున్నాయో పట్టించుకున్నావా ?

నీ పేరున వున్న బ్యాంకు అకౌంటు తాలూకు 

నెట్ బ్యాంకింగ్ ని, ఎలా ఆపరేట్ చెయ్యాలో,

కనీసం, దాని పాస్ వర్డ్ ఏమిటో గుర్తుంచుకుంటావా ?

నేను రాసిన వీలునామా ఎక్కడుందో గుర్తుందా ?

అన్నీ నేనే చూడాలా ? నేను నీకు గుమాస్తానా ?"


"మీరు చాలాసార్లు చెప్పారు కానీ...

నాకు బుర్రలోకి వెళ్ళవు ! హాయిగా, అండగా, 

మా ఆయనుండగా, ఆ గొడవలన్నీ నాకెందుకు, దండగ !"


"అక్కడే వచ్చింది, నీలాంటి వాళ్ళతో చిక్కు !

నువ్వు ఆ రోజుల్లో ఇంటర్ పాసయ్యావు కానీ,

లోకజ్ఞానం మాత్రం నీకఖ్ఖర్లేదు ! పోనీ, నేను చెబుతుంటే...నన్ను, నా మాటల్ని పట్టించుకోకుండా,

ఏదో ఒకటి చెప్పి, అక్కణ్ణించి జారుకుంటావ్...

ఈసారి నుంచీ, రాత్తిళ్ళు పడుకోబోయే ముందు,

నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బతుకుతాను అని కాకుండా, నేను వెళ్ళిపోతే నువ్వు ఎలా బతకాలో ఆలోచించు !"


"బాబోయ్, ఇలాంటివన్నీ నాతో అనకండి, 

తల్చుకుంటేనే భయం వేస్తోంది ! 

దేవుడా, నన్నే ముందర తీసికెళ్ళిపో..."


"ఆయన మనం చెప్పినట్టు వినడు, ఆయన చేసేవన్నీ మనమే వినమ్రంగా స్వీకరించి, మనోధైర్యంతో,

ఆయన ఇచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ, 

మన శేషజీవితాల్ని ప్రశాంతంగా లాగించెయ్యాలి...

అర్థమైందా, తెలిసిందా, బోధపడిందా ?"


"బాబోయ్, ఎరక్కపోయి మీతో ఏదో మనసులో 

మాట చెబితే, మీదంతా రివర్స్ ఇంద్రజిత్తా  లేదా నరేంద్రజిత్తా !

మనసంతా పాడైపోయింది...కాసేపు దేవుడి పుస్తకాలు చదువుకుంటూ, దేవుడు గూడు దగ్గర కూర్చుని వస్తాను..."


"ఆ దేవుడు చెప్పేది కూడా అదే... 

'కర్తవ్యము నీ వంతు -  కాపాడుట నా వంతు' అని !"

       దట్స్ ఆల్ యువర్ హానర్.....

            ******

Saturday, June 7, 2025

పర్యావరణ జాజి

 పర్యావరణ జాజి 



దూరవిద్య ద్వారా రెండు పీజీలు చేసిన "జాజి "అనే వ్యక్తి వారానికి ఐదు రోజు పొద్దున్నే తన బండి తీసుకుని, నల్లమల అడవిలోకి వెళ్ళి ,అక్కడ కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలు లాంటివి తను తెచ్చుకున్న సంచీ లో వేసి తెచ్చి చెత్త ఇరుకునేవాళ్లకి ఇస్తాడు.ఇలా పాతికేళ్ల నుండి చేస్తున్నాడు..అలాగే వర్షాకాలం మొదలవగానే విత్తనాలను తీసుకెళ్లి రోడ్డుకి పక్కన ఖాళీ ప్రదేశాల్లో చల్లేసి వస్తాడు.. కొన్నాళ్ళకి అవి మొలకెత్తాయో లేదో చూసుకుని వస్తాడు.

పల్నాడు కి చెందిన "జాజి" దినచర్య ఇది.జాజి అసలు పేరు komera Ankarao .


అంతేకాదు ప్రకృతి పాఠశాల పేరు తో పుస్తకం రాశాడు.తన ప్రాంతం కి చుట్టూ ఉండే ఐదువేల పైన పాఠశాలకు వెళ్ళి పిల్లలకి  ప్రకృతి పరిరక్షణ పై అవగాహన  కార్యక్రమాలు చేశాడు.

ఎన్నో పురస్కారాలు వచ్చాయి.

The week మ్యాగజైన్ ఈతని మీద ఒక కథనం రాసింది.

 

 అడవులు పర్యావరణ పరిరక్షణ అంటూ తనపని తను చేసుకుంటూ,  ప్లాస్టిక్ వ్యర్థాలను పక్షులు, జంతువులు తినకుండా ఏరిపారేస్తూ ,భూమ్మీద మనిషిగా పుట్టినందుకు ఎంతో కొంత కాకుండా తలకుమించిన భారాన్ని ఇష్టం గా మోస్తూ  ప్రకృతి కోసం కష్టపడుతున్న ఫారెస్ట్ మ్యాన్ ( జాజి) అంకారావ్ కొమెర  ను అటవీ పరిరక్షణ  సలహాదారు గా  ఏపీ ప్రభుత్వం నియమించింది..


అతనో సంచీ భుజానికి తగిలించుకుని అడవుల్లో కనిపించే వ్యర్థాలను ఒక్కడే సంచీలో వేసుకుని తిరగడం చూసి అతని కి పర్యావరణం  పట్ల ఉన్న బాధ్యత చూసి,ఈరోజు అతన్ని వెతుక్కుంటూ వచ్చిన అధికారం  చూసి నల్లమల నుండి చిన్న చిన్న అడవుల్లో ఉండే చాలామంది సంతోషపడతారు.


Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE