NaReN

NaReN

Saturday, June 7, 2025

నాన్నా రియల్ హీరో..

నాన్నా రియల్ హీరో..

 ఒకరోజు ఒక అమ్మాయి తన తండ్రి దగ్గరకి వచ్చింది,

" నాన్నా..! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తోంది.


నాకే ఇన్ని కష్టాలు రావాలా..? " అంటూ తన బాధలను చెప్పుకుంటూ 

వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.


తండ్రి మౌనంగా విన్నాడు. ఏమీ మాట్లాడలేదు. 

చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచాడు.


గ్యాస్ పొయ్యి మీదున్న - మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెట్టాడు.


వాటిల్లో నీళ్ళు పోసి ఒకదానిలో బంగాళా దుంపలు ( ఆలుగడ్డలు), 

మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీగింజలు వేశాడు.


తండ్రి తనతో అలా నిర్లక్ష్యముగా ఉండి, 

ఏమీ మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా - 

అలాగే చూడసాగింది ఆ అమ్మాయి.


అలా 20 నిముషాలు మరిగించాక - స్టవ్ ని కట్టేసి, ఆ గిన్నెలను దింపి, 

వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలింఛి చెప్పమన్నాడు.


నాన్న ' అలా ఎందుకు చేసాడా పని..' అని అయోమయముగా ఉన్న ఆ కూతురు వాటిని పరిశీలించాక అంది,


" ఏముందీ..! దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్డు గట్టిపడింది. 

కాఫీ డికాషన్ వచ్చింది........

అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?.. " అంది.


అప్పుడు ఆ తండ్రి చిన్నగా నవ్వి,


" ఆ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకేలా ఒకే రకమైన గిన్నెల్లో, అదే గ్యాస్ వేడినీ, వేడి నీటినీ చవిచూశాయి.


కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా? 

మామూలుగా గట్టిగా ఉండే దుంపలు ఇప్పుడు మెత్తబడ్డాయి.


చితికిపోయే గుడ్డు గట్టిపడింది. 

గట్టిగా ఉండే కాఫీ గింజలు మెత్తపడి, వాటిలోని రసాన్ని ఊరించి, 

నీటిరంగునే మార్చింది.. అవునా..!!


ఇప్పుడు చెప్పు..


వీటిల్లో - నీవు ఎలా ఉండాలి అనుకుంటున్నావు?


మెత్తబడిపోతావా..? ( ఇప్పుడు నీవున్న స్థితి అదే.. )


గట్టిపడిపోతావా..?


పరిస్థితులను మారుస్తావా...?


ఇక్కడ నీదే ఎంపిక, 

దానిమీదే ఇందాక నీవడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది.." అన్నాడు.


ఆ అమ్మాయి మొఖంలో ఏదో తెలీని వెలుగు. కన్నీళ్లు ఆగిపోయాయి. బాధలేదు.


దాని బదులుగా ఆ కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది..


" నాన్నా! యూ ఆర్ మై రియల్ హీరో.. మెంటార్.. ఎవర్ అండ్ ఫరెవర్.." కృతజ్ఞతాభావంతో అంది...


100 మందికి చేరేలా షేర్ చేయండి

Thursday, June 5, 2025

పిన్ కోడ్ కు ఇక సెలవు



 *పిన్ కోడ్ (PIN CODE) కు ఇక సెలవు!* 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


 *డిజి పిన్ను (DIGI PIN) ఆవిష్కరించిన పోస్టల్ శాఖ* ఇది మన దేశ కొత్త చిరునామా వ్యవస్థ.


 *ముఖ్యమైన ప్రయోజనాలు* 


4 చదరపు మీటర్ల వైశాల్యంలో కచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించవచ్చు.


చిరునామా రాసేటపుడు ఉపయోగించే పిన్ (పోస్టల్ ఇండెక్స్ నంబర్) కోడ్ అవసరం తగ్గబోతున్నది. తపాలా శాఖ కొత్తగా డిజిటల్ చిరునామా విధానం డిజిపిన్ ను ప్రారంభించింది. 


*  *పిన్ కోడ్ ఓ ప్రాంతానికి సంబంధించినది కాగా,* 


* *డిజిపిన్(DIGI PIN) ఓ ఇల్లు లేదా భవనానికి కచ్చితమైన గుర్తింపు సంఖ్య.* దీనిలో 10 క్యారెక్టర్లు (అంకెలు, అక్షరాలు, గుర్తులు) ఉంటాయి. దీనిని ఉపయోగించినప్పటికీ తపాలా చిరునామా మారదు. అయితే, డిజిపిన్ అనేక రంగాలకు విస్తరించిన తర్వాత, జీఐఎస్ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ అయిన అనంతరం సవివరమైన తపాలా చిరునామాను ఇవ్వవలసిన అవసరం తగ్గుతుంది.


 *ఆఫ్లైన్లోనూ* ..

కూడా ఉపయోగించు కోవచ్చు. దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ కోడ్స్ తపాలా శాఖ పబ్లిక్ డొమైన్లో ఉంచింది. దీని ద్వారా ప్రజలు డిజిపిను డీకోడ్ చేయవచ్చు.


అత్యవసర సేవలు, డెలివరీస్ ను సమర్ధవంతంగా నిర్వహించవచ్చు.


అన్ని రకాల ప్రదేశాలకు ఈ విధానాన్ని


 *డిజిపిన్ను ఎలా పొందాలి?* 


https://dac.indiapost.gov.in/mydigipin/home 2 


డిజిపిన్ ను పొందవచ్చు. ఈ వెబ్సైట్ను సందర్శించి, తమ ఇంటిని గుర్తించి, డిజిపిన్ ను సృష్టించవచ్చు. అంబులెన్స్. అగ్నిమాపక శకటాలు వంటి అత్యవసర సేవలు సకాలంలో అందడానికి ఈ డిజిపిన్ దోహదపడుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలవారికి ప్రయోజనకరం. అంతేకాకుండా ఆన్లైన్ షాపర్స్, లాజిస్టిక్స్ ప్రొవైడర్స్ వంటివారికి, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ వేగంగా, కచ్చితంగా డెలివరీ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.


 *ఉపయోగించవచ్చు* .

వ్యక్తిగత డాటాను స్టోర్ చేయరు కాబట్టి వ్యక్తిగత గోప్యత ఉంటుంది.


 *డిజిపిన్ గురించి* 


ఇది దేశవ్యాప్తంగా జియోకోడెడ్ అడ్రసింగ్ సిస్టమ్. దీనిని ఐఐటీ హైదరాబాద్, ఇస్రో లోని ఎస్ఆర్ఎస్సీలతో కలిసి తపాలా శాఖ అభివృద్ధి చేసింది. ఇది భారత దేశాన్ని సుమారు 4m x 4m గ్రిడ్స్ (ఇండ్లు, కార్యాలయాలు, సంస్థలు మొదలైనవాటి)గా విభజిస్తుంది. ప్రతి గ్రిడ్కు అక్షాంశాలు, రేఖాంశాల

ఆధారంగా 10 క్యారెక్టర్ల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ను ఇస్తుంది.


 *పిన్కోడ్, డిజిపిన్ మధ్య తేడా* 


సాధారణ తపాలా చిరునామాలో ప్రాంతం, వీధి, ఇంటి నంబరు ఉంటాయి. డిజిపిన్లో 10 క్యారెక్టర్ల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఉంటుంది. ఇది అక్షాంశాలు, రేఖాంశాల స్థానాల ఆధారంగా ఉంటుంది. స్పష్టమైన చిరునామా చెప్పే అవకాశం లేని గ్రామీణ ప్రాంతాలు, అడవులు, మహాసముద్రాలు వంటివాటిలో డిజిపిన్ ఎంతో ఉపయోగకరం.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Wednesday, June 4, 2025

నాన్నను మరచి పోతున్నామా...

 నాన్నను మరచి పోతున్నామా...


*నాన్నకు  కన్నీళ్లు ఉన్నాయి* 

  *నాన్నలందరికి అంకితం..* 

  *దయచేసి పూర్తిగా చదవండి


 *నాన్న మనకోసం ఏం చేశాడో..* 

 *ఏం కోల్పోయాడో  మనకు తెలియదు..!* 


 *జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ..* 

 *వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి.* 

 *తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు తండ్రి. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు.* 

 *ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు..!* 

 

 *ఎందుకంటే..నాన్న ఎవరికీ చెప్పడు.* 

 *పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు.* 

 *అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు.* 

 *బిజీగా ఉన్న నాన్న రాత్రి పూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు..* 

 

 *"ఎప్పుడూ పనేనా..? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా.."* *అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం.* 

 *పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు.* 

 *నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు.* 

 *పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.* 

 

 *మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి.* *చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు..*

* *వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు.* 

 *ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి.* 

 *వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు.* 

 *వృద్ధాప్యం ఇంకా రాలేదు..* 


 *మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు.* *నాన్న డాక్టర్‌ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు.* 

 *ఎందుకంటే..ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.* 

 

 *తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం.* *అందుకే అప్పులు చేసి చదివిస్తాడు.* 

 *ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు.* 

 *మీరు పరీక్ష రాస్తుంటే బయట* *రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు.* 

 *పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ.* 

 

 *ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు.* 

 *ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు.* *కొన్ని వందల సార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా..?* 

 *నాన్న కూడా ఏడుస్తాడు.* 

 *కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు.* 

 

 *పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి..* 

 *నాన్న అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు.*

 *అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు.* 

‘ *ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా..?* 

 *నేను ఎవరి కోసం బతికాను..?’* 

 *అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి.* 

 *‘నా కోసం నేను ఏదీ దాచుకోలేదే..’ అనుకుంటాడు.* 

 

 *నిజానికి ‘నేను’ అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు.* 

 *ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి.* 

 *ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నను ఏడిపిస్తాడు.* 

 *నాన్న గుండెల పై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు.* 

 *అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి.* 

 

 *కొడుకు ఎంత మంచివాడు..* *ప్రయోజకుడైతే తండ్రి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు. అతడికి ఎంత సక్సెస్‌ వస్తే.. అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తాడు.* 

 *(పాజిటివ్ గా ఆలోచించండి) ఇది నిజం.* 


 *మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి.* 

 *బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం.* 

 *కానీ, మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు.* *అసలు మీ నాన్న పుట్టిన రోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే* 

 *మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు..* 

 

 *మీ కోసం రిస్క్‌ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు.* 

 *మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నలు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోయారు..’* 


*అమ్మానాన్నలు బ్రతికున్నంత వరకు బాగా చూసుకోండి*


 *ప్రతీ నాన్నకు నా సెల్యూట్*



తల్లి కొరకు సంకల్పయాత్ర

 తల్లి కొరకు సంకల్పయాత్ర

స్కూటర్‌పై 98వేల కిలోమీటర్ల సంకల్పయాత్ర



పాత బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ నడుపుతూ కొడుకు.. వెనుక సీటుపై అమ్మ.. ఒకటీ రెండూ కాదు, ఇలా 98వేల కిలోమీటర్లు తిరిగి తిరుమలకు వచ్చారు ఈ తల్లీకుమారులు.


ఉల్లాసంగా ఉత్సాహంగా దూసుకుపోతున్న వీరిని పలకరించినపుడు ఆసక్తికరమైన అనేక సంగతులు పంచుకున్నారు. స్కూటర్‌ నడుపుతున్న దక్షిణామూర్తి కృష్ణకుమార్‌ది మైసూరు. బెంగళూరులోని ఒక కార్పొరేట్‌ సంస్థలో టీం లీడర్‌గా ఉద్యోగం. 2015లో తండ్రి చనిపోవడంతో అమ్మను బెంగళూరుకు తీసుకువచ్చాడు. జీవన సహచరుడ్ని కోల్పోయిన దుఃఖంలోంచి అమ్మను బయటకు తీసుకురావడానికి రోజూ ఆఫీసు నుంచి వచ్చాక ఆలయాల గురించి చెప్పేవాడు. ఆమె ఎంతో ఆసక్తిగా వినేది. ఒకరోజు ఎందుకో.. ' అమ్మా.. నువ్వు ఇప్పటిదాకా ఏయే ఆలయాలు సందర్శించావు?' అని అడిగాడు. నోటితో కాకుండా తొణికిసలాడే కన్నీటితో అమ్మ సమాధానం చెప్పింది. తన సమీపంలో ఉండే ఒక్క ఆలయానికి కూడా ఆమె ఇప్పటిదాకా వెళ్లనేలేదు అని తెలుసుకుని తల్లడిల్లిపోయాడు. 68 ఏళ్ల వయసు వచ్చినా ఇల్లు తప్ప ఆమెకు మరో ప్రపంచం తెలీదు. 'నీకు దేశంలో ఉన్న అన్ని ఆలయాలూ చూపిస్తానమ్మా!' అని కృష్ణకుమార్‌ తల్లికి మాటిచ్చాడు. ఉద్యోగం చేస్తూ అమ్మకి ఆలయాలన్నీ చూపించడం సాధ్యం కాదని అతనికి అర్థమైంది. 2018లోనే రూ.60 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు. 2018 జనవరి 16న తన బజాజ్‌ స్కూటర్‌ మీదే 'మాతృ సేవా సంకల్ప యాత్ర' ప్రారంభించాడు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, అస్సోం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌, మణిపుర్‌, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్‌.. ఇలా కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ తల్లితో స్కూటర్‌పై తిరుగుతున్నాడు ఈ 45 ఏళ్ల కుమారుడు. నేపాల్‌, భూటాన్‌కూ తల్లితో స్కూటర్‌పైనే వెళ్లాడు. ఇప్పటికి 98,109 కిలోమీటర్లు ప్రయాణించాడు. గురువారం తిరుమలకు చేరుకుని తల్లి చూడరత్నమ్మతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నాడు. తన సంకల్పయాత్రకు అవరోధం కాకూడదని కృష్ణకుమార్‌ పెళ్లి కూడా చేసుకోలేదు. ఎందుకీ త్యాగం? అని అడిగితే, 'చనిపోయాక శ్రాద్ధకర్మలు ఘనంగా చేయడం కాదు.. బతికి ఉన్నపుడు సంతోషపెట్టడమే కొడుకుగా నా బాధ్యత' అని సమాధానం ఇచ్చాడు. ఈ సంకల్ప యాత్రలో ప్రయాణిస్తున్నది ఇద్దరు కాదు, ముగ్గురు. అంటూ తన స్కూటర్‌ వైపు మురిపెంగా చూశాడు. 'నాకు 21 ఏళ్ల వయసులో నాన్న ఇచ్చిన కానుక ఇది. దీని మీద తిరుగుతూ ఉంటే నాన్న కూడా మాతోపాటే యాత్రలు చేస్తున్నట్టుగా ఉంది. ఈ యాత్రకు ముగింపు లేదు. అమ్మా నేనూ ఓపిక ఉన్నంతదాకా ఇలా తిరుగుతూనే ఉంటాం. ఒక్కో గుడినీ సందర్శిస్తూ ఉంటే అమ్మ గొప్ప ఆనందం పొందుతోంది. నాకు జన్మనిచ్చిన తల్లికి ఇంతకన్నా ఏవిధంగా రుణం తీర్చుకోగలను?' అని అమ్మను అల్లుకుపోయి ఆనందంగా చెప్పాడు కృష్ణకుమార్‌.

కేజీ కి 900 గ్రాములే

 కేజీ కి 900 గ్రాములే 


ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు.  పాలు, పెరుగు,నెయ్యి,అన్నీ అమ్ముకుంటూ, తన భార్యతో 

జీవనం సాగిస్తుండేవాడు. కొన్ని  పాలని ఊరిలో అమ్మి, 

ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి, వారానికి ఒకసారి మార్కెట్ కు వెళ్లి అమ్మేవాడు.

భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్

సంచిలో kg బ్యాగ్స్ లో వేసి ఇచ్చేది.ఒకరోజు మార్కెట్ కు వెళ్ళి రోజంతా అమ్మి,ఒక కొట్టుకు వెళ్ళి అక్కడి  యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు , పప్పు, బియ్యం అన్నీ సరుకులు ఇంటికి తీసుకొని బయలుదేరాడు. అప్పుడు కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ ను తూకం వేసి చూశాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది.. 1kg లేదు కేవలం 900 గ్రాములే ఉంది.యజమాని అన్నీ తూకం చేసి చూస్తే  అన్నీ 900gm బ్యాగులే ఉన్నాయి.ఆయనకు చాలా మనసుకు బాధ అనిపించింది

ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే.నన్ను మోసం చేశాడే అని అనుకున్నాడు..


 మళ్ళీ ఒక వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మటానికి వచ్చాడు.

అప్పుడు యజమాని చెప్పాడు.. నా కొట్టుకు ఇకపై కాలు పెట్టకు నీవు మోసగాడివి నమ్మకద్రోహివి..నెయ్యి 1kg అని 900gm ఇస్తావా.. ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు అని గొడవ చేశాడు...


అప్పుడు ఆ పెద్దాయన వినయంతో యజమానితో ఇలా చెప్పాడు, అయ్యా నేను బీదవాడినే కానీ మోసగాణ్ణి కాదు.. నా దగ్గర తక్కెడ కొనే అంత డబ్బు లేదు.మీ దగ్గర తీసుకెళ్లిన 1kg చక్కెర  ఆధారంగా ఇంట్లో తక్కెడ లా చేసుకొని తూకం చేస్తాను అని చెప్పాడు..

అందుకు యజమాని తల వంచుకుని తన తప్పు తనకు తెలిసి సిగ్గు పడ్డాడు..


   మనం వేరేవారికి ఏం చేస్తామో

తిరిగి అదే మళ్ళీ మనకు జరుగుతుంది. అది మంచి కానీ చెడు కానీ, .గౌరవం కాని అవమానం కానీ,  దుఃఖం కానీ సంతోషంకాని,  మోసగించటం కానీ మోసపోవటం కానీ,  తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది.



పాలను ఆశించి గోవును పోషిస్తాము. గోవు నుంచి మనకు పాలు వస్తాయి. అంతే కాదు పేడ కుడా వస్తుంది. పాలు ఇంట్లోకి తెచ్చుకుంటాం. కాని, పేడని మాత్రం ఇంటి బయట వేస్తాం. ఆవు నుండి పాలు మాత్రమే రావాలి, పేడ రాకూడదు అంటే వీలు కాదు.


కర్మలు కూడా ఇలానే ఉంటాయి. ఏ కర్మ చేసినా అది పూర్ణంగా అర్ధవంతంగా ఉంటుందని చెప్పలేము. కొంత అభ్యంతరకరంగా కూడా ఉండవచ్చు. సంబంధాలు కూడా ఇలానే ఉంటాయి. ఏ సంబంధం లేకుండా....  ఎవ్వరితోనూ సంబంధం లేకుండా జీవించడం సాధ్యపడదు. కాని సంబంధాలలో కేవలం సంతోషమే ఉంటుందని చెప్పలేము. విషాదం కూడా కలిసి ఉంటుంది.


తల్లిదండ్రులు కావచ్చు , అన్నదమ్ములు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనతో కలిసి జీవిస్తున్న ఎవరైనా కావచ్చు.. వారిలో మనకు అన్ని నచ్చిన గుణాలే ఉంటాయని చెప్పలేము. మనకు నచ్చనివి వారు మేచ్చేవి కూడా ఉంటాయి.. అలాంటివి ప్రేమకి, సౌఖ్యానికి ప్రతిబంధకాలే కావచ్చు.. కాని అవి లేకుండా సంబంధాలు లేవు.

గులాబీల మధ్య ముళ్ళు తప్పనట్లు సంబంధాలలో ఈ విధమైన సంఘర్షణలు తప్పవు.


మనిషి జీవితంలో ఎన్నటికైనా ఏ అవసరం లేని క్షణం ఒకటి వచ్చి తీరుతుంది. కాని, బ్రతికున్నంత కాలం అవసరాలతో పాటు అప్పుడప్పుడూ తొంగిచూసే అనవసరాలను కూడా పెద్ద మనసుతో అంగీకరించే శక్తిని పెంచుకుంటేనే జీవితాన్ని ప్రశాంతంగా, ఉల్లాసంగా ఆస్వాదించగలం..



Monday, June 2, 2025

ఉపాధ్యాయుల పై విద్యార్థుల ప్రభావాలు...

 

ఉపాధ్యాయుల పై విద్యార్థుల ప్రభావాలు...

ఒక ఉపాధ్యాయుడిగా ప్రయాణం మొదలుపెట్టిన సూర్యాపేట జిల్లా, మోతే మండలంలోని  రాయికుంట తండా ప్రాథమిక పాఠశాలలో చదివిన విద్యార్థులు క్రియేట్ చేసిన గ్రూపులో  వారు షేర్ చేసిన అనుభవాలు.....
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
మాకు  విద్యా బుద్దులు నేర్పించి మమ్మల్ని ఈ స్థాయికి చేర్చిన మా గురువులకు పాదాభివందనాలు...
👏👏👏👏👏👏
గుర్తుకొస్తున్నాయి....గుర్తుకొస్తున్నాయి....

అదొక మారుమూల గ్రామం...కాలినడకి కూడా సహకరించని బాటలు....వర్ష కాలానికి జల దిగ్బంధంలో ఆ ఊరు....అలాంటి ఊరికి రోడ్డు మార్గ సదుపాయం కల్పించిన కీ||శే  గౌరవనీయులు శ్రీ కొండా లక్ష్మా రెడ్డి గారు అంతే కాకుండా మాలాంటి మారుమూల తండకి రోడ్డు వేస్తేనే రాక పోకలు ఉంటాయి...తద్వారా అభివృద్ది చెందుతుంది అని గ్రహించిన మహనీయులు....అలాగే మా తండాలో పాఠశాల నిర్మాణానికి సహకరించిన అప్పటి MEO పెద్ద జానయ్య గారు, పాండురంగం గారు మరియు కీ||శే  మిట్టు గారు , ఖండ్యా నాయక్ గారు....వీరి సహకార కృషి ఫలితమే మన ఊరి పాఠశాల....

ఒక్కసారి దీనికి ముందు....సంఘటన
మా ఊరికి దారి  వేసిన పెద్దలు లక్ష్మా రెడ్డి గారు అయితే ....మా జీవితాల్లో అక్షర జ్యోతి నీ వెలిగించిన గురువార్యూలు... ఉపేందర్ సార్
అది నేను  మొదటి రోజు పశువులశాల (పాఠశాల) కీ వెళ్ళిన రోజు...నిజమే నా మొదటి అక్షరం అమర్ సింగ్ వాళ్ళ పశువుల కొట్టం లో నేర్చుకున్న...
పలక మీద నేను రాయించుకున్న అ అక్షరం ఇప్పటికీ గుర్తుకు ఉంది.... లలిత చెల్లి గోల చేసింది అనే ఈ పద్యం మా క్లాస్ లో సొమ్లా చంటి మధు అందరూ లేచి చదివారు కానీ నాకు చదవడం రాలేదు.. ఆ రోజు ఉపేందర్ సార్ చేతిలో తిన్న దెబ్బల గాయం  ఇప్పటికీ నా మదిలో మానలేదు.... మమ్మల్ని ఇంటింటికి తిరిగి పాఠశాలలో చేర్పించి హాజరు తీసుకున్న విధానం...అప్పట్లో మీరూ చదువుకొండి...చదువుకుంటే మీకు రిజర్వేషన్ తోపాటు నౌకరీలు వస్తాయి అని ప్రేరేపించిన మీకు జన్మతః రుణపడి ఉంటాము....సార్

అలాగే మా రెండవ గురువు...గిరిబాబు సార్
మేము చదివే రీతిని మార్చిన గురువు గారు...రోజంతా చదివిన సాయంత్రం అయ్యేసరికి అక్షర దోష (డిక్టేషన్) పరీక్ష పెట్టేవారు...అప్పుడు నేను గెల్చుకున్న చిన్న ప్యాన్ ఇప్పటికీ నా మదిలో తిరుగుతూనే ఉంది....

అలా సాగుతున్న మా చదువులు...అప్పుడే పెను ఉప్పెన లాగ వచ్చిన మా చొక్కా రావు సార్....మాకు వచ్చినా కొద్దీ చదువులకు కొత్త పుంతలు తొక్కి కాంపిటీటివ్  పరీక్షలను పరిచయం చేసిన ఘనుడు....మార్గదర్శకుడు...తన కష్టార్జితమే...నరేందర్ నవోదయ సీటు ... ఆ ప్రభంజనమే నన్ను గురుకుల సీటు సాధించే టట్టు చేసింది అనడంలో అతియోశక్తి లేదు....ఒకరోజు హాజరు తీస్తుంటే నేను yes sir  అనలేదు... నా వక్రబుద్ధి కీ సార్ చేతి దెబ్బలు తినక తప్పలేదు....

నేను ఇప్పుడు చెప్పబోయే గురుద్వయం పేరు.. భరత్ బాబు సార్ & బ్రహ్మయ్య సార్
కేవలం విద్యా ఒక్కటే కాదు...విద్యతోపాటు  క్రీడలు కూడా మానసిక ఆహ్లాదకరానికి అవసరం అని గుర్తించి మనల్ని ఆ దిశగా నడిపించిన ఈ ఉపాధ్యాయుల గురించి ఎంత చెప్పినా తక్కువే....

చివరిగా ఒక గురువు గురించి చెప్పుకోవాలి..వారే రవీందర్ సార్
మన పాఠశాలను అత్యధిక హాజరుతో కూడిన విద్యార్థులను చేర్పించి...వారికి ఏకలవ్య  గురుకులలో సీటు సాధించేటట్టు ప్రణాళికలు చేసి...మన చిన్న నాటి పాఠశాల స్మృతులు చెరిగిపోకుండా చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించి ...మన పాఠశాల సంరక్షకుడిగా ఉండి మన భావితరాలకి ఇచ్చి ఈ మధ్యనే బదిలీ అయిన రవీందర్ సార్ కి మనమందరం రుణపడి ఉండాలి...
మన పాఠశాలలో చదివి వెళ్ళిన స్టూడెంట్స్ తర్వాత ఉర్లుగొండ స్కూల్ లో  టాపర్స్... అది ఇప్పటికీ ఎప్పటికీ ట్రెండ్...అది కదా మన పాఠశాల విద్యా భీజ వంగడం....
ఆచార్య దేవో భవ...
గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై గురవే నమః

ఇట్లు
గురుభక్తితో
మీ శిష్యుడు
భూక్యా నాగరాజు
S/o సూర్య
Branch manager
Canara bank
Hanamkonda
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

ఇన్లాండ్ ఉత్తరం


*ఇన్లాండ్ ఉత్తరం* 
- ఒక తీపి జ్ఞాపకం

వెనుకటి రోజుల్లో పోస్టు కార్డు కన్నా కాస్త ఎక్కువ రాయాలని అనిపించినప్పుడల్లా అందరూ ఎంచుకునే ఉత్తరం – ఇన్లాండ్ లెటర్. ఆ నీలి రంగు కాగితం మీద చక్కటి దస్తూరితో రాసిన మాటలు – అది కేవలం ఉత్తరం కాదు, మనసులో మాటల్ని భద్రంగా మోసుకొచ్చే ఒక పల్లకి .

ఇన్లాండ్ లెటర్ ఇంటికి వస్తే, అక్షరం చెదరకుండా, ఎంతో శ్రద్ధగా చింపి తెరవడం ఒక కళే! అందులో రాసిన ప్రతి అక్షరం, ప్రతి పదం చదవడం ఒక అనుభూతి. ఎవరి నుండి వచ్చిందో తెలుసుకునే కుతూహలం, రాసినవారి భావోద్వేగాలు చదివే క్షణాలు – ఇవన్నీ ఇప్పుడు స్మృతులే అయ్యాయి.

ఈ “ఇన్లాండ్ లెటర్”లు నశించిన ఈ ఆధునిక కాలంలో, వాటి స్థానం వాట్సాప్ మెసేజులు, ఈమెయిళ్లు, నోటిఫికేషన్లు ఆక్రమించాయి. కానీ వాటిలో ఆ మనసుని తాకే భావం శూన్యం. మనుషుల మధ్య మనసుల మధ్య అనుబంధానికి సాక్ష్యంగా నిలిచిన ఆనాటి ఉత్తరాలు, ఇప్పుడు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయాయి.

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE