NaReN

NaReN

Friday, August 2, 2024

“పక్కింటోళ్ళ చలవ”

 “పక్కింటోళ్ళ చలవ”


కొన్ని కార్ల మీద, ఆటోలు, మోటర్ సైకిళ్ళు, స్కూటర్ల మీద ” Dad’s Gift”, లేక “Mother’s Gift”, “God’s Gift” ఇలా నానారకాలుగా వ్రాసి ఉండడం చూస్తూంటాం. కుటుంబసభ్యులు కొని ఇచ్చారనో, లేదా దేవుడు కరుణించి డబ్బులు వచ్చేలా చేసినందుకు ఈ వాహనం తనకు ఏర్పడిందని చెప్పుకోడం కోసం అలా వ్రాస్తారు అనేది సహజమైన ఆలోచన అనుకుంటాం. పాతిక ముప్పై ఏళ్ళు వచ్చిన తరువాత ఎవరో కొనిస్తే కానీ వీళ్ళు స్వంతంగా ఒక చిన్న వాహనం కొనుక్కోలేకపోయారు అని నేను వాళ్ళ అసమర్ధ చూసి జాలి పడతాను. మొన్న ఒక బట్టల దుకాణం దగ్గర “పక్కింటోళ్ళ చలవ” అని అచ్చ తెలుగులో రాసి కనపడిందో కారుమీద. ఇదేదో వింతగా అనిపించింది నాకు. దానర్ధం బోధ పడ్లేదు? ఎందుకంటే పక్కింటోడు  కారెందుకు కొనిస్తాడెవరికైనా? అనే ఆలోచనతో. ఇందులో మర్మమేమిటో తెలుసుకోవాలనిపించింది. దానర్ధం ఎంటో తెల్సుకోవాలని ఉత్సుకత పెరిగిపోడంతో ఆ బండి యజమాని వచ్చే వరకు అక్కడే తచ్చాడాను. కొన్ని సందేహాలు తీర్చుకోకపోతే నిద్రపట్టదు. ఒక అరగంట తర్వాత ఆ కారు యజమాని వచ్చి తలుపు తీయబోతుంటే  ఆయన్ని పలకరించాను.

“ఏం కావాలి” ఏదో నేను ఆయన నుంచి ఆశిస్తున్నట్టు  చూస్తూ అన్నాడు. ఆయన తప్పేంలేదు, ఎవరికైనా అదే అనుమానం వస్తుంది ఆ సమయంలో.

“ఏం లేద్సార్… చిన్న సందేహం! మీకు అభ్యంతరం లేకపోతే” అని కొద్దిగా నానుస్తూ మాటలు నమిలాను. నా వల్ల ఆయన కొచ్చే ఆర్ధిక ఇబ్బంది ఏమీ లేదని గ్రహించి, మొహం కొంచం తేట చేసుకొని ” ఏంటండీ మీ సందేహం?” అన్నాడు.

“ఏం లేద్సార్, మీ కారు వెనక పక్కింటోళ్ళ చలవ  అని వ్రాసి ఉందే దాని అర్ధం తెల్సుకోవాలని” బయట పెట్టాను అరగంటకి పైగా బుర్ర తొలిచేస్తున్న నా సందేహాన్ని.

“మా పక్కింటోళ్ళు కారు కొన్నప్పట్నుండి మా ఆవిడకి నిద్ర, ఆవిడ వల్ల నాకు మనశ్శాంతి కరువైనాయి. వాటన్నింటిని తిరిగి పొందడం కోసం అవసరం లేకపోయినా అప్పు చేసి మరీ కొన్నను ఈ కారు. చేసిన పాపం చెబితే పోతుందన్నారుగా! అందుకని అలా రాయించా” తాపీగా చెప్పారు ఆ కారు యజమాని.

చాలా రోజులకి ఓ సరదా మనిషి తారస పడ్డాడన్పించింది😀.

సింప్లిసిటీ

 సింప్లిసిటీ



ఆరోజు చివరి రైలు ఆ స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నుండి వెళ్ళిపోయింది. తదుపరి రైలు రేపు ఉదయం వరకు రాదనే విషయం తెలియక ఒక వృద్ధురాలు రైలు కొరకు ఎదురుచూస్తూ ప్లాట్‌ఫారమ్ పై  కూర్చొని ఉంది. అది గమనించిన ఒక కూలీ ఆ తల్లిని అడిగాడు. అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అని. దానికి సమాధానం గా ఆ పెద్దావిడ నేను నా కొడుకు వద్దకు ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పింది. జవాబుగా కూలీ ఈ రోజు ఇక రైలు లేదు అమ్మా అని చెప్పాడు. అందుకు ఆ స్త్రీ నిస్సహాయంగా చూసింది. అయితే ఆమెకు వెయిటింగ్ రూమ్‌లో ఆశ్రయం కల్పించాడు. అంతటితో ఆగకుండా ఆ కూలీ ఆమె కొడుకు గురించి అడగగా ఆమె తన కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడని తల్లి బదులిచ్చింది. పేరు చెప్పండి, సంప్రదించడానికి మేము ప్రయత్నిస్తాము అన్నాడు ఆ కూలి. మా అబ్బాయిని అందరూ *లాల్ బహదూర్ శాస్త్రి అని పిలుస్తారు* అని ఆ అమ్మ బదులిచ్చారు. ఆ స్త్రీ మూర్తి కొడుకు అప్పుడు ఇండియన్ రైల్వేస్ కేంద్ర కేబినెట్ మినిస్టర్. ఒక్క క్షణంలో స్టేషన్ మొత్తం దద్దరిల్లింది. వెంటనే సైరన్న్ కారు వచ్చింది. వృద్ధురాలు ఆశ్చర్యపోయింది. ఈ విషయం లాల్ బహదూర్ శాస్త్రికి ఏమీ తెలియకుండా భారతీయ రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది. ఆవిడ ఢిల్లీ లో తన కొడుకుని కలిసిన తర్వాత కొడుకుని ఈవిధంగా అడిగింది - *"అబ్బాయి, నీవు రేల్వే లో ఏం పని చేస్తావు..."*


ఇదే కదా సింప్లిసిటీ అంటే.

Wednesday, July 24, 2024

Tuesday, July 23, 2024

Saturday, July 13, 2024

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?*

              ➖➖➖✍️

```

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకువస్తుంది. 


ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొనితీరాలంటూ పెద్దలు చెపుతూ ఉంటారు. 


ఎందుకంటే..

 

జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి.  


అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. 


ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. 


గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.

 

ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది.  


అలా బయటి వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.


ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, 

వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. 


వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

 

ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు పూలు, వేళ్లు, బెరడు , విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే !  గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే ! 


కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.

 

ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ ల మీద ఆధారపడుతూ ఉంటారు. 


గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే ‘లాసోన్‌’ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. 


కానీ చాలా రకాల కోన్ లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. 


కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.✍️```


    పిల్లలకు బతుకుతో పాటు

  మన పూర్వీకుల అలవాట్లను తెలియజేయండి మరియు పాటించేలా చూడండి.


. 



Monday, July 8, 2024

మగవాళ్లు మొలతాడును ఎందుకు కట్టుకుంటారు?

 మగవాళ్లు మొలతాడును ఎందుకు కట్టుకుంటారు? కట్టుకోకపోతే ఏమౌతుందో తెలుసుకుందాం.




మనం ఎన్నో ఆచారాలను పాటిస్తూ వస్తున్నాం. అంటే పెళ్లి తర్వాత ఆడవాళ్ల చేతులకు గాజులుండాలి. మెట్టెలు ఉండాలి. నుదిటిన ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి.

మంగళవారం గోర్లను, వెంట్రుకలను కట్ చేయకూడదు అంటూ ఎన్నో నియమాలను పాటిస్తూ వస్తున్నాం. అలాగే మగవాళ్లు అన్నాక మొలతాడు ఖచ్చితంగా కట్టుకోవాలనే నియమం కూడా ఉంది. దీన్ని నేటికీ కూడా పాటిస్తూ వస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా మొలతాడును ఖచ్చితంగా కడతారు. 

పాత పడిన తర్వాత కొత్తది కట్టి పాతమొలతాడును తీసేస్తుంటారు. కానీ మొలతాడు లేకుండా మాత్రం ఉండరు. ఇలా ఉండకూడదని పెద్దలు చెప్పడం వినే ఉంటారు. అయితే ఒకప్పుడు అంటే బెల్టులు అందుబాటులో లేని కాలంలో పంచెలు, లుంగీలు, ప్యాంటులు జారిపోకుండా ఉండేందుకు వీటిని ఉపయోగించేవారు. అయితే వీటిని సపరేట్ గా వీటికోసమే ఉపయోగించేవారు కాదు. మొలతాడుకు ఇలా కూడా ఉపయోగించేవారు. 

జ్యోతిష్యం ప్రకారం.. మొలతాడు లేకుండా ఉండటం అంటే చనిపోవడమనే అర్థం వస్తుంది. పెద్దల ప్రకారం.. చనిపోయినప్పుడు మాత్రమే మొలతాడును తీసేస్తారు. అందుకే మొలతాడును ఎప్పుడూ నడుముకు ఉండేలా చూస్తారు. అలాగే ఎనకటి కాలంలో డాక్టర్లు, హాస్పటల్స్ ఎక్కువగా ఉండేవి కావు. కాబట్టి పాము కరిస్తే మొలతాడును తెంపి పాము కుట్టిన దగ్గర కట్టి విషయాన్ని తీసేసేవారని కూడా పెద్దలు చెప్తుంటారు. 

బ్లాక్ లేదా ఎర్రని మొలతాడును ఎక్కువగా కట్టుకుంటుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మొలతాడు మగవారికి దిష్టి తగలకుండా కాపాడుతుంది. ఇది చెడు కంటి నుంచి రక్షిస్తుందని చెప్తారు. అందుకే మొలతాడును ఎప్పటి నుంచో కట్టుకునే ఆచారం మొదలైంది. అది నేటికీ కూడా కొనసాగుతూ వస్తోంది. ఏదేమైనా మొలతాడును మగవారు మాత్రమే కట్టుకుంటారు. కానీ దీన్ని ఆడవాళ్లు కూడా కట్టుకోవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

ప్రస్తుత కాలంలో చాలా మంది చేతికి లేదా కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు. ఎందుకందే ఇది కూడా దిష్టి తగలకుండా కాపాడుతుంది. నల్లదారం దుష్టశక్తులకు మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని నమ్ముతారు. సైన్స్ ప్రకారం.. మొలతాడు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. దీన్ని కట్టుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. హెర్నియా వ్యాధి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మొలతాడును కట్టుకోవడం వల్ల పురుషుల జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకం కూడా ఉంది.



Sunday, July 7, 2024

నేనొక ఫంక్షన్ కి అటెండ్ అయ్యా

 😛🤣😛😢😭😂

నేనొక ఫంక్షన్ కి అటెండ్ అయ్యా


ఈ మధ్య నేనొక ఫంక్షన్ కి అటెండ్ అయ్యా..దాదాపు 50 మంది అతిథులు కుర్చీల్లో ఆశీనులయ్యారు..నేను ముందు వరుసలో కూర్చున్నా..ఆకలిగా అనిపించింది.


కాసేపయ్యాక ఒకామె ట్రేలో స్నాక్స్ తెచ్చి వెనుక వరుస నుండి అతిథులకు అందించడం ప్రారంభించింది..ముందుకి కూర్చున్న నా వరకు వచ్చేసరికి స్నాక్స్ అయిపోయాయి..చిరాగ్గా అనిపించింది.తిన్నగా లేచివెళ్లి వెనుక వరుసలో కూర్చున్నా.


ఈలోగా మరొక ఆమె కూల్డ్రింక్స్ తెచ్చి ముందువరుస నుండి పంపకం మొదలెట్టింది..అనుమానించినట్టే వెనక్కు వచ్చేలోపు అవికూడా అయిపోయాయి..


కోపం పట్టలేక వెళ్లిపోదాం అని లేచి నిల్చున్నా..సరిగ్గా అదే టైమ్ కి ముగ్గురు మహిళలు ట్రే లలో ఘుమ ఘుమలాడే వంటకాలను తీసుకువచ్చారు..స్మార్ట్ గా ఆలోచించి ఈసారి మధ్య వరుసలో కూర్చున్నా.


ఒకామె ముందునుండి, మరొకామే వెనుక నుండి అందించడం మొదలెట్టారు..థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు టెన్షన్ గా అనిపించింది..ఊహించరాని విధంగా మధ్య వరుస వచ్చేసరికి సమాప్తం..


అందరూ తింటుంటే ఏం చేయాలో తోచక అయోమయంగా తలదించి కోపంగా నా చేతులవైపు చేసుకుంటున్నా..


సరిగ్గా అదేసమయంలో మూడవ మహిళ నా వద్దకు వచ్చి..తన చేతిలో ఉన్న బౌల్ ని చూపించి తీసుకోమన్నట్టు సైగ చేసింది..ఆతృతగా బౌల్ లో చెయ్యిపెట్టి బయటకు తీసా..అదేంటో తెలుసా??


టూత్ పిక్..పళ్ళసందుల్లో ఇరుక్కున్న ఆహారాన్ని తీసే కర్రపుల్లలు..ఛి ఛీ.ఎదవ జన్మ.


నీతి :

జీవితంలో మీ పొజిషన్ ని తరచుగా మార్చడానికి ప్రయత్నించొద్దు.


దేవుడు మీరు ఎక్కడుంటే మంచిదో అక్కడే ఉంచుతాడు.


కాదూ,కూడదు అని తొందరపడితే దొరికేది "టూత్ పిక్" లే.

😀😀😂😂😁😁😎😎

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE