NaReN

NaReN

Monday, May 6, 2024

వేరికోజ్ వీన్స్

 *_'వేరికోజ్ వీన్స్.'_*

*_🌹ఉబ్బిన సిరలు ఎందుకు వస్తాయి..?_*



*_మన శరీరం లో రక్తాన్ని గుండె నుండి ఇతర భాగాలకి సరఫరా చేసే వాటిని ధమనులు(arteries), అలాగే, వివిధ శరీర భాగాల నుండి గుండె కి చేరవేసే నాళాల్ని సిరలు(Veins) అనీ అంటారు._*


*_సిరలు తీసుకెళ్లే రక్తం సహజం గానే కలుషిత రక్త అవడం వల్ల అది కొంచెం డార్క్ కలర్ లోనే వుంటుంది._*


*_మనం శరీర భాగాల్లో పైకి కనిపించే వాటిలో చూసుకుంటే మనకు ఆ రంగు తేడా అనేది కనిపిస్తుంది._*


*_Varicose veins లేదా varicosities అంటే, ఎప్పుడైతే,ఆ రక్త సరఫరా విధానం లో ఇబ్బందులు తలెత్తుతాయో,అప్పుడు,అక్కడ రక్తం కొంచెం సరఫరా లో అంతరాయం ఏర్పడి అక్కడే నిల్వ ఉండిపోవడం గానీ, గడ్డ కట్టడం కానీ జరుగుతుంది._*


*_ఇది సహజం గా, కాళ్ళలోనూ, తొడల దగ్గర ఏర్పడతాయి._*


*_ఇవి ఎక్కువ గా ఏర్పడితే మనకి, అక్కడ ఉబ్బినట్లు,ఇంకా ఎక్కువ గాఢమైన రంగులోనూ(ముదురు నీలం, purple,లేదా ముదురు ఎరుపు),కనిపిస్తాయి._*


*_వీటి వల్లన వచ్చే ఇబ్బందులు,వాటి సంఖ్య,గాఢత,వెడల్పు ను బట్టి వుంటాయి._*


*_కొంతమంది కి చాలా తక్కువే వుంటాయి,అవి పెద్ద గా ఇబ్బంది పెట్టవు._*


*_కానీ, ఎక్కువ వాచినవి, సంఖ్య ఎక్కువ గా వున్నవి,చాలా నొప్పి కలిగిస్తాయి, కొంచెం బిగిసిపోయిన సెన్సేషన్ కలిగించి,నడవడానికి ఇబ్బంది కలిగిస్తాయి._*


*_ఇక్కడ రక్త సరఫరా విధానం disturb అవ్వడం, లేదా, ఆ వేయిన్స్ damage అవ్వడం ప్రధాన కారణం._*


*_ఆ నొప్పి కూడా వున్న తీవ్రత నీ బట్టి ఎక్కువ/తక్కువలు వుంటాయి._*


*_బీపీ,అధిక బరువు, హార్మోన్ల అసమతౌల్యత, రక్తం గడ్డ కట్టే కాలం లో తేడాలు, ఎక్కువ కొలెస్టరాల్, గుండె వ్యాధులు, వార్ధక్యo, ఆడవారికి అయితే మెనోపాజ్ దశలో, ముఖ్య కారణాలు._*


*_ఈ వ్యాధి మరీ ప్రాణాంతకం అయితే కాదు,కానీ,తీవ్రతను బట్టి రోజువారీ దినచర్యలో ఇబ్బంది కలిగిస్తుంది,నొప్పి కూడా తీవ్రతను బట్టి కొంచెం ఎక్కువ గానే వుండే అవకాశాలు వుంటాయి._*


*_ప్రాణహాని కాకపోయినా,ఇది వున్న తీవ్రత మనకి వున్న ఇతర అనారోగ్యాల తీవ్రతకు ఒక alarming లా చూపిస్తుంది._*


*_ఉదా:- గుండె జబ్బుకు,అధిక కొవ్వు(కొలెస్ట్రాల్/లిపిడ్స్),లేదా మన శరీరం లో రక్త గాఢత,గడ్డ కట్టే కాలం ఇలాంటి వాటిలో ఏమైనా abnormalities వుంటే,వాటికి సంకేతం అందించినట్లు గా._*


*_కనుక,అలాంటపుడు మనం తగిన పరీక్షలు,నివారణ కి తగ్గ చర్యలు తీసుకోవచ్చు._*


*_ఎక్కువ గా నిలబడి పని చేయాల్సి వచ్చే వాళ్ళకి కూడా,క్రమేణా ఆ నాళాలు బలహీనమై, ఇలా ఏర్పడవచ్చు._*


*_ఇవి వున్నవాళ్ళు,ఆయా అనారోగ్యాలు వుంటేవాటికి సంబంధించిన మందులు,జాగ్రత్తలు తీసుకోవాలి._*


*_రోజూ, కొంచెం వేడి నీళ్లలో crystal salt వేసి,అందులో రోజుకి 2-3 సార్లు కాళ్ళు పెట్టి, ఒక 15-30 నిముషాలు వుంచితే కొంచెం నొప్పులనుండి, ఉపశమనం కలగడమే కాకుండా,ఆ veins లో కూడా తేడా రావొచ్చు._*


*_పడుకొనేటపుడు కాళ్ళు ఎత్తు మీద పెట్టుకొని పడుకుంటే మంచిది.కూర్చున్నపుడు కూడా కాళ్ళు కొంచెం ఎత్తు మీద పెట్టుకొంటే మంచిది._*


*_బరువు వున్న వాళ్ళు ఖచ్చితం గా తగ్గాలి._*


*_అస్తమానూ కూర్చుని వుండే వాళ్ళు, కొంచెం walking కూడా చేస్తే మంచిది._*


*_ఆహారం లో,ఫైబర్, విటమిన్ K, మాంగనీస్, పొటాషియం వున్న పదార్థాలు కొంచెం ఎక్కువ వుండేవి తింటూ వుండాలి.అరటిపండు,pine Apple, క్యాబేజ్,ఆకు కూరలు,బటానీలు తింటే మంచిది.ఉప్పు/నూనె వాడకం ఎంత తగ్గితే అంత మంచిది._*


*_స్నానం అతి వేడి నీళ్ళతో చెయ్యడం మంచిది కాదు._*


*_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

డెత్ సర్టిఫికెట్

 డెత్ సర్టిఫికెట్:


       ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది. 



     ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు.

  

     “చూడు నాయనా! విద్యుత్ బల్బు లు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో  ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను, నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా. 

                                                                                                            అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.


     ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వే లో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావు గారు ఆర్మీలో లెఫ్నె౦ట్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివ  గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను" 

"మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటి కి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది  అయినా ఒకటే. 


     అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే. 

ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. 


       మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటి కి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి. 

చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము. 


     ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు..

 

     మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే.. 

అదే డెత్ సర్టిఫికేట్.

*గౌ.శ్రీ. జస్టిస్ ఎన్.వి.రమణ*

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

Sunday, May 5, 2024

40 నుండి 50 డిగ్రీల వేడి

 40 నుండి 50 డిగ్రీల సెల్సియస్ హీట్ వేవ్ కోసం సిద్ధంగా ఉండండి.

ఎప్పుడూ నిదానంగా నీళ్ళు తాగాలి...

చల్లని లేదా ఐస్ వాటర్ తాగడం మానుకోండి!


ప్రస్తుతం మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ తదితర దేశాలు ‘హీట్ వేవ్’ను ఎదుర్కొంటున్నాయి.


 కాబట్టి ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు:


1. *మన చిన్న రక్తనాళాలు పగిలిపోయే అవకాశం ఉన్నందున, ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నప్పుడు చాలా చల్లటి నీరు త్రాగకూడదని వైద్యులు సలహా ఇస్తారు.*

ఒక వైద్యుడి స్నేహితుడు చాలా వేడిగా ఇంటికి వచ్చాడని తెలిసింది - అతనికి బాగా చెమటలు పట్టాయి మరియు త్వరగా చల్లబడాలని కోరుకున్నాడు -

వెంటనే చల్లటి నీళ్లతో కాళ్లు కడుక్కుని... ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఆస్పత్రికి తరలించారు.


2. *బయట వేడి 38°Cకి చేరినప్పుడు మరియు ఇంటికి వచ్చినప్పుడు, చల్లని నీరు త్రాగకూడదు - గోరువెచ్చని నీటిని మాత్రమే నెమ్మదిగా త్రాగాలి.*

ఎండలో ఉండి ఇంటికి వస్తే వెంటనే చేతులు, కాళ్లు కడుక్కోవద్దు. కడగడానికి లేదా స్నానం చేయడానికి ముందు కనీసం అరగంట వేచి ఉండండి.


3. *ఒక వ్యక్తి వేడి నుండి చల్లబడాలని కోరుకున్నారు, వెంటనే స్నానం చేసారు. స్నానం చేసి, ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతని ఆరోగ్యం క్షీణించింది, అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.*

 

 వేడి నెలల్లో లేదా మీరు బాగా అలసిపోయినట్లయితే, తక్షణమే చాలా చల్లటి నీటిని తాగడం మానుకోండి ఎందుకంటే ఇది సిరలు లేదా రక్త నాళాలు ఇరుకైనది, ఇది స్ట్రోక్‌కు దారి తీస్తుంది.



 _*దయచేసి ఇతరులకు తెలియ చేయండి!*

షేర్ చేయండి 🙏

Saturday, May 4, 2024

నవ్వుతూ బ్రతకాలిరా..

  నవ్వుతూ బ్రతకాలిరా..

 (మే 5 మే  మొదటి ఆదివారం

ప్రపంచ నవ్వుల దినోత్సవం )


 నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం  అన్నారు జంద్యాల గారు.ఇదివరకు మనవాళ్ళు నవ్వు నాలుగు విధాలా చేటు అన్నారు. కాని ఇప్పుడు నవ్వు నలభై విధాలా గ్రేటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.


నవ్వడం మూలాన జీవితంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలనుంచి దూరంగా ఉండొచ్చు.ఇప్పుడు మన దేశంలోకూడా నవ్వుల దినోత్సవాన్ని ఘనంగానే జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా నవ్వుల పండుగను ఆస్వాదిస్తున్నారు. 


నవ్వు గురించి బోలెడు విశ్లేషణలు ఉన్నాయి. ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా చిరునవ్వు విలువ చెబుతూ ఉంటారు. నవ్వులు ఎన్నో రకాలు. నవ్వుకూ చిరునవ్వుకూ చాలా తేడా ఉంది. నవ్వీ నవ్వనట్లుగా, పెదాల మధ్య స్వచ్ఛమైన పువ్వుల్లా విచ్చుకునేదే చిరునవ్వు. అమెరికాలోని బాల్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌ అనే సంస్థ 18 రకాల నవ్వులను గుర్తించింది.


నవ్వులు ఎన్ని ఉన్నా, చిరునవ్వు ప్రత్యేకతే వేరు. మనకు అత్యంత ఆత్మీయులు ఎదురైనప్పుడు మాటకన్నా ముందుగా మనసులోంచి ఉబికివచ్చే భావనే చిరునవ్వు. కొద్దిపాటి పరిచయాలను కూడా దృఢపరిచి, స్నేహంగా మార్చేశక్తి చిరునవ్వుకు సొంతం. ఇక నవ్వు విలువ తెలియక చాలా మంది నవ్వే తెలియనట్లు ఉండిపోతారు. కొందరు చీటికిమాటికి రుసరుసలాడుతూనే ఉంటారు. ప్రపంచాన్ని జయించే శక్తి అణ్వాయుధాల కన్నా, చిరునవ్వుకే ఉంది. ఇది శత్రువులైనా సులువుగా అర్థం చేసుకోగల శాంతి సంకేతం.


 ఏ వ్యక్తి అయినా నిరాశ, నిస్పృహలోంచి బయటపడాలంటే చిరునవ్వు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం చిందించే చిరునవ్వు ఇతరుల బాధలను కూడా మాయం చేస్తుంది. చిరునవ్వుతో ఉన్న మోము మానసిక ఆరోగ్యానికి ప్రతిబింబంగా ఉంటుంది. అలాగే అభిప్రాయ బేధాలను కూడా దూరం చేయగల శక్తి చిరునవ్వుకే సాధ్యం. శరీరంలో రోగనిరోధక శక్తిని మింగేసే కార్టిసోల్‌ అనే పదార్థంపై చిరునవ్వు ప్రభావం చూపి, దాన్ని అణిచివేస్తుందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.


వందసార్లు చిరునవ్వు నవ్వితే పది నిమిషాల వ్యాయామంతో సమానమవుతుందని అంటున్నారు. నగర జీవనంలో ఒత్తిళ్లతో కూడిన జీవనానికి చిరునవ్వు ఒక టానిక్‌లా పనిచేస్తుందని మనోవికాస నిపుణులు సూచిస్తున్నారు. విద్యార్థులు, యువకులు, గృహిణులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారికి నవ్వు ద్వారా రిలాక్స్‌ అయ్యే లాఫింగ్‌ థెరపీ అవసరం.


ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరిదీ ఉరుకులు పరుగుల జీవనం. గడియారంలోని ముళ్లలా క్షణం వృథా కాకుండా చూసుకోవాలి. నిత్యం ఒత్తిళ్లే. విద్యార్థులకు చదువు, గృహిణులకు వంటావార్పు, ఇల్లు చక్కబెట్టుకోవడం, ఉద్యోగులకు కార్యాలయాల్లో గుట్టలుగా పేరుకుపోయిన ఫైళ్లు...ఇలా అన్ని వర్గాల వారూ మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. ఈ తరుణంలో ఇంట్లోని కుటుంబ సభ్యులను కూడా పరస్పరం చిరునవ్వుతో పలుకరించడం చాలా కుటుంబాల్లో మర్చిపోతున్నారు. పిల్లలైతే పాఠశాలకు ఆలస్యమైతే అసహనం, విసుగు, చిరాకు, భయం ముఖానికి అట్టిపెట్టుకుంటున్నారు.


 ఆఫీసుకు ఏమాత్రం ఆలసమైనా ఉద్యోగులు కుటుంబ సభ్యులను కసురుకుంటారు. చిరుబుర్రులాడుతారు. ఈ మానసిక ఒత్తిళ్లతో ఉదయం ఇంటినుంచి బయట పడుతున్నారు. దారిలో ఏ బాటసారి అడ్డు వచ్చినా, ఇతర వాహనాలు ముందు నిలిచి విసిగించినా తిట్లదండకం అందుకుంటారు. వీటిని అధిగమించేందుకే లాఫింగ్‌ థె రపీ అలవాటు చేసుకోవాలని యోగా నిపుణులు చెబుతున్నారు.


 ఎదుటివారు ఎంత మనసు గాయం చేస్తున్నా దాన్ని చిరునవ్వుతోనే సంతోషంగా జయించాలని వారు సూచిస్తున్నారు. ఒక చిన్న చిరునవ్వు వందమంది హిట్లర్లకు ఉన్నంత కోపాన్నికూడా జయిస్తుందని వారు చెబుతున్నారు. 


పెదవులపై విరిసీ విరియనట్లు మెరిసే చిరునవ్వుతో ఆత్మీయులకు మరింత ఆత్మీయంగా మెలగాలని వారు సూచిస్తున్నారు.చిరునవ్వులతో బతకాలి.ఎదుటి వారిని చిరునవ్వుతో పలుకరించి చూడండి. వారు మీకు ఆత్మీయులైపోతారు. ప్రశాంత వదనంతో ఉండి, సన్నటి స్మైల్‌ను మీ పెదవులపై జాలువార్చి చూడండి. నలుగురిలో మీరుంటే అక్కడ మీరే సెంట్రల్‌ అట్రాక్షన్‌గా మారిపోతారు. ద్వేషించే వారిని కూడా దగ్గరకు చేర్చే శక్తి ఈ ప్రపంచ భాషకు ఉంది. ముఖంపై చిరునవ్వు ఉంటే చాలు ప్రత్యేకంగా మళ్లీ మేకప్‌ వేసుకోవాల్సిన అవసరం రాదని అంటారు ప్రముఖ హాస్య నటుడు చార్లీ చాప్లిన్‌. 


నవ్వు మన వ్యక్తిత్వాన్ని అద్దంలా చూపిస్తుంది. ఒక నవ్వు కళ్లతో లోతుగా పలుకరిస్తుంది. మరో నవ్వు ఆత్మీయతను ప్రేరేపిస్తుంది.

ఇంకోనవ్వు నేరుగా హృదయపు లోతుల్లోకి తొంగిచూస్తుంది. అవతలి వాళ్లు మూడీగా ఉంటే మీ చిరునవ్వే వాళ్లలో ఉత్తేజాన్ని నింపుతుంది. లోపల ఏదో వెలితి, కలత ఉంటే బహుశా మీ చిరునవ్వు వారికి భరోసా కలిగిస్తుంది. మానవ సమాజంలో చిట్టిచిట్టి పాపాయిల బోసి నవ్వుల నుంచీ ఆవిర్భమైన ఈ నవ్వుల ప్రక్రియ వారు ఎదిగే క్రమంలో మానవ సంబంధాలను కలుపుకునేందుకు ఒక ఆభరణంగా నిలుస్తుంది. ఇంకా మనలోని సకల ఒత్తిళ్లను వెలికి పంపుకునేందుకు ఒక వాహికగా నిలుస్తుంది.


 పిల్లలు తమ తల్లిదండ్రులను చిరునవ్వుతో పలుకరించడం, అలాగే పెద్దలు కూడా పిల్లలను చిరునవ్వుతో నిద్రలేపడం, విసుగు, అలసట, కోపం, చిరాకు వంటివి ఇంట్లో ఎవరూ ప్రదర్శించకపోతే ఆఇల్లు చిరునవ్వుల లోగిలిగా మారుతుంది. చిరునవ్వును ఆభరణంగా పెట్టుకొని బయటకు బయలుదేరితే ఆరోజంతా సంతోషకరమైన సందర్భాలే ఎదురవుతాయి.

కాబట్టి అందరం నవ్వుతూ ఉందాం. ఇతరులను కూడా నవ్విస్తూ ఉందాం.అంతేగానీ నవ్వులుపాలు మాత్రం కాకూడదు. నవ్వించే పేరుతో ఇతరులను అపహాస్యం చేయకూడదు.


Wednesday, April 24, 2024

ఉజ్వల భవిష్యత్తుకు ఈ ఉగాది తోడ్పడాలి



*ఉజ్వల భవిష్యత్తుకు ఈ ఉగాది తోడ్పడాలి...*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️



 *అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాధి శుభాకాంక్ష‌లు*


ఈ ఉగాది పండుగ అంద‌రికీ స‌క‌ల శుభాల‌ను పంచాలి. జీవితాల్లో సుఖ శాంతులు తేవాల‌ని,  క‌ష్టాలు, నష్టాలు తొల‌గి ఆనంద‌మ‌య జీవితాల‌కు ఈ పండుగ నాంధి కావాలి.


 'షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ, కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని, తద్వారా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని కోరుకుంటున్నాను.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


మీ..

పసుపులేటి నరేంద్రస్వామి

Thursday, April 18, 2024

నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు



  *నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు:*

                 ➖➖➖✍️




*నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నయ్…*

 

నాన్న వయస్సు పెరిగేకొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది… 


గదిలోనే అటూఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది… 


తన చేతులు పడినచోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి…


నా భార్యకు అది చిరాకు… తరచూ నాతో చెబుతోంది… గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లయింట్… 


ఓరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు… అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద…


నా భార్య నామీద అరిచింది… 


నేనూ సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను… నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను… 


గాయపడ్డట్టుగా తన కళ్లు… 

నావైపు అదోలా చూశాడు… 


నాకే సిగ్గనిపించింది… ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు…


ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను… 


ఓరోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు… 


మంచం మీద పడిపోయాడు… తరువాత కొన్నాళ్లకే కన్నుమూశాడు… 


నాలో అదే దోషభావన… 


ఆరోజు తను నావైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది… 

నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా…


కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం… 


పెయింటర్స్ వచ్చారు… 


తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు… అరిచాడు…


ఆ పెయింటర్స్ సీనియర్లు, క్రియేటివ్ కూడా… 

“మీ తాత చేతిముద్రలు చెరిగిపోకుండా చూస్తాం, వాటి చుట్టూ సర్కిళ్లు గీసి, డిజైన్లు వేసి, ఓ ఫోటో ఫ్రేములా మార్చి ఇస్తాం”సరేనా అని సముదాయించారు…


అలాగే చేశారు… 


ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం… 

ఆ డిజైన్ను మా ఇంటికొచ్చినవాళ్లు అభినందించేవాళ్లు… 

వాళ్లకు అసలు కథ తెలియదు… తెలిస్తే నన్ను ఎంత అసహ్యించుకునేవాళ్లో…!


కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది… 


నాకూ వయస్సు మీద పడింది… శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు… 


నాకిప్పుడు అదే గోడ ఆసరా కావల్సి వస్తోంది… 


నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తోంది…


ఎందుకనిపించిందో తెలియదు, గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను… 


ఓరోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు, నా భుజాలు పట్టుకున్నాడు… “నాన్నా! గోడ ఆసరా లేకుండా అస్సలు నడవొద్దు, పడిపోతవ్” అని మందలించాడు…


మనవరాలు వచ్చింది, “నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాతా”అంది ప్రేమగా… 


నాలో దుఖం పొంగుకొచ్చింది… అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు, అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు… 


నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్లు బతికేవాడు కదా అనే బాధ…

నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది… తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది… 


గదిలోని గోడ మీద నాన్న చేతిముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది… 


టీచర్ బాగా అభినందించిందని చెప్పింది… ‘పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి’ అని రాసిందామె ఆ స్కెచ్ మీద…


నా గదిలోకి వచ్చి పడుకున్నాను… మౌనంగా రోదిస్తున్నాను… నన్ను వదిలి వెళ్లిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను… 


తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది… ఏమో… తరువాత ఏమైందో నాకు తెలియదు… నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది… ✍️


A heart touching story


~Father's handprints ~ 

✋🏽 🖐🏽 🤚🏽


Father had grown old and would take support of the wall while walking. As a result the walls had discoloured, wherever he used to touch and his fingerprints got printed on the walls.


My wife detected this and would often complain about the dirty looking walls.


One day, he was having headache, so he massaged some oil onto his head. So, while walking oil stains were formed on the walls. 


My wife screamed at me seeing this.  And I in turn shouted at my father and spoke to him rudely, advising him not to touch the walls while walking.


He looked hurt. I also felt ashamed of my behaviour , but did not say anything to him.


Father stopped holding the wall while walking. And fell down one day. He became bedridden and left us shortly. I felt guilt in my heart and could never forget his expressions and forgive myself of his demise shortly thereafter. 


After sometime,  we wanted to get our house painted. When the painters came, my son, who adored his grandfather,  did not allow the painters to clean father's fingerprints, and paint those areas.

The painters were very good and innovative. They assured him that they will not remove my father's fingerprints/ handprints, rather would draw a beautiful circle around these marks and create a unique design.


This continued thereafter and those prints become part of our house. Every person visiting our home admired our unique design. 


With time, I also grew old.


Now I needed the support of wall to walk. One day while walking, I remembered 

my words to my father, and tried to walk without support. My son saw this and immediately came to me and asked me to take support of the walls while walking, expressing concern that I would have fallen without support, I realised that my son was holding me.


My grand daughter immediately came forward and affectionately,  asked me put my hand on her shoulder for support. I almost started crying silently. Had I done the same for my father, he would have lived longer.


My grand daughter took me along and made me sit on the sofa.


Then she took out her drawing book to show me.

Her teacher had admired her drawing and given her excellent remarks. 


The sketch was of my father's handprint on the walls. 


*Her  comment -  “wish every child loves elders in same way.”*


I came back to my room and started crying profusely, asking forgiveness from my father, who was no more.


*We also grow old with time.  Let's take care of our elders and teach the same to our children.*

***************


Tuesday, April 16, 2024

ఒంటరి ప్రయాణం

  *ఒంటరి ప్రయాణం*



ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడ్ని తల్లిదండ్రులు వేసవి విరామం కోసం అతని అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్ళేవారు, మళ్లీ రెండు వారాల తరువాత అదే రైలులో ఇంటికి తిరిగి వచ్చేవారు.*


*అయితే ఒక రోజు అబ్బాయి తన తల్లిదండ్రులతో ఇలా చెబుతాడు:  “నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాను! ”*


*కొంచెం ఆలోచన తరువాత తల్లిదండ్రులు అంగీకరిస్తారు....*


*తర్వాత రోజు వారు రైల్వే స్టేషన్ కి వెళ్తారు, ట్రైన్ ప్లాట్ ఫాం మీద ఉంది, ఫ్లాట్ ఫాం మీద ఉండి కిటికీ ద్వారా అతనికి వీడ్కోలు చెప్తూ పదే పదే జాగ్రత్తలు చెబుతున్నారు.*


*"తెలుసు నాకు తెలుసు, మీరు ఇప్పటికే నాకు చాలాసార్లు చెప్పారు.! "అన్నాడు బాలుడు కొంచెం అసహనంతో.*


*రైలు బయలుదేరబోతోంది ఇంతలో తండ్రి అతని జేబులో ఏదో పెడుతూ గుసగుసలుగా: ”బాబూ, నీకు అకస్మాత్తుగా ఒంటరిగా లేదా భయం అనిపిస్తే, ఇది చూడు!”*


*ట్రైన్ బయలుదేరింది...*


*ఇప్పుడు బాలుడు ఒంటరిగా ఉన్నాడు, రైలులో కూర్చున్నాడు, తల్లిదండ్రులు లేకుండా, మొదటిసారి!*


*అతను కిటికీ గుండా వెళ్లే దృశ్యాన్ని చూస్తున్నాడు.*


*అతని చుట్టూ అపరిచితులు హల్‌చల్ చేస్తున్నారు, శబ్దం చేస్తున్నారు, కొంతమంది కంపార్ట్మెంట్‌లోకి ఎక్కుతున్నారు,కొంతమంది దిగుతున్నారు. అటూ ఇటూ చూస్తున్నాడు అన్నీ కొత్త మొహలే. తెలిసిన మొహం ఒక్కటీ లేదు. అతను ఒంటరిగా ఉన్నాడు అనే భావన అతనికి వచ్చింది. ఒక వ్యక్తి విచారకరమైన మొహంతో తననే చూస్తూన్నాడు.అది కుర్రాడికి మరింత అసౌకర్యంగా ఉంది.*


*ఇప్పుడు ఒక్క సారిగా భయం వేసింది. రైలు వేగానికి కుదుపులకి కడుపు నొప్పి మొదలైంది. మరియు రైలు వేగంతో సరిపోలడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.*


*సీట్లో మూలకి ముడుసుకుని కూర్చున్నాడు, ఒక్క సారిగా అతని కళ్ళల్లో నీళ్ళు.....*


*ఆ సమయంలో అతనికి తన తండ్రి తన జేబులో ఏదో ఉంచినట్లు గుర్తువచ్చింది.*


*వణుకుతున్న చేతితో అతను జేబులోంచి ఓకాగితాన్ని తీశాడు. అందులో ఇలా ఉంది:  "భయపడవద్దు, నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాను."*


*ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు దైర్యంతో మొహం మెరిసి పోయింది.  గుండెల నిండా దైర్యం... చిరునవ్వుతో తల పైకి ఎత్తుకొని కూర్చున్నాడు, గుండె వేగం తగ్గింది, కడుపు నొప్పి ఛాయలు లేవు!* *అపరిచితుల మధ్యలో చాలా సౌకర్యంగా ఉంది ఇప్పుడు.*


*నీతి*


*అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి!*


*దేవుడు ఈ లోకంలో మనలను పంపినప్పుడు, మనందరి జేబులో కూడా ఒక నోట్ వుంచుతాడు: "నేను మీతో ప్రయాణిస్తున్నాను!" అని.*


*కాబట్టి భయపడవద్దు!*

*నిరాశ చెందకండి!*

*ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది!*


*ప్రస్తుతం ప్రపంచంలో మనుగడ కోసం పోరాడుతున్న ఈ అనిశ్చిత సమయాల్లో, ఏవరో ఒకరు నీ కోసం మరొక కంపార్ట్మెంట్లో అలాగే వేరెవరో నీ సహాయం కోసం వేరే కంపార్ట్మెంట్లో ఉండవచ్చు.*


*భగవంతుని విశ్వసించండి, ఆయనపై నమ్మకం ఉంచండి, మన ప్రయాణమంతటా ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు భగవంతుడు*


మీకు కూడా ఇలాంటి అనుభవం ఉందా ...ఉంటే నాతో పంచుకోండి ఓ మంచి కథలా అందరికీ ఉపయోగపడేలా చేస్తా.... 

మీ పిల్లలను కూడా మీరు ధైర్యంతో ముందుకు నడిపించండి.


మీ 

పసుపులేటి నరేంద్రస్వామి

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE