NaReN

NaReN

Thursday, May 11, 2023

ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు

 ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు 

చెప్పిన రిటైర్డు ఫ్యామిలీ (సుప్రీమ్) కోర్టు జడ్జి గారు.


(1) ఎటువంటి పరిస్థితుల్లో కూడా 

మీ కొడుకు కోడలుతో కలిసి ఉండకండి. అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండ మనండి. మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో, మీ కోడలితో 

మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి.


(2) మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి. లేదా ఒక ఫ్రెండ్ గానే చూడండి. అంతే తప్ప ఆమెను మీ కుమార్తెగా చూడొద్దు. మీ అబ్బాయిని అన్నట్టుగానే ఆమెను కూడా పొరపాటున ఒక మాట కూడా అనవద్దు. అది ఆమె జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది. ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది.


(3) మీ కోడలి అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య. మీకు అసలు సంబంధం లేదు, అనవసరం కూడా.


(4) ఒక వేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి. వారికి సంబంధించిన ఏ పని మీరు చేయొద్దు. ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే 

ఆ పని మీరు చేయండి. మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోకండి.


(5) మీ కొడుకు కోడలు వాగ్యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు మీరు చెవిటి వారిలా ఉండిపోండి. సాధారణంగా పెద్దలు కల్పించుకోవటం వారికి ఇష్టం ఉండదు.


(6) మీ మనుమలు పూర్తిగా 

మీ కొడుకు కోడలు యొక్క ఆస్తి. వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారో అది వారి ఇష్టం .


(7) మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు, అలా ఆశించకండి. ఒక మంచి వ్యక్తిగా మసులుకోమని మాత్రమే మీరు 

మీ కుమారుడికి చెప్పండి .


(8) మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోండి. మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.

(9) రిటైర్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుకుంటారో అది మీ ఇష్టం. ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి. మీ డబ్బులు మీకు పనికి రాకుండా పోయేలా చూసుకోరాదు.


(10) మనుమల మీద మీకు ఎటువంటి హక్కు లేదు అది మీ సంతానానికి దేవుడిచ్చిన వరం.


సాధ్యమైనంత వరకూ ఈ మెసేజ్ ఎక్కువ మంది షేర్ చేసుకునేలా చూడండి. ఇది తన జీవిత కాలం సుప్రీం కోర్టులో ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులు చూసిన ఒక జడ్జిగారి అనుభవ సారం.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

ప్రేమ ఉన్నోడే పేదోడు

 ప్రేమ ఉన్నోడే పేదోడు


ఉన్నోళ్లు అన్నా..

అదృష్టవంతులన్నా కొందరే ..

ఏదైనా వారికే అనుకూలంగా జరుగుతుంది.. 

వారు అనుకునుకున్నదంతా... నెరవేరుతుంది.. 

ఏదైనా ఆ కొందరికే అందుతుంది.. 

అదృష్టమైనా ...ఆనందమైన..


 భయంతో... అదృష్టము

వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది!..

అన్ని దారులూ.. వాళ్ళకే రాచబాటలై...

అన్నీ వారితోనే జతకడతాయి..


కొందరు పేదోళ్లు.. 

అందరికీ వీళ్ళంటే అయిష్టం!..  

అందరూ వీళ్ళను ద్వేషిస్తారు..

దోషులుగా చూస్తారు. 

వీరికి కాలమెప్పుడూ కలసిరాదు..

కష్టాలు..కలతలు మాత్రం 

ఎప్పుడూ వీళ్ళవెంటే...  

దురదృష్టం వద్దన్నా వీళ్లవెన్నంటే...


అందుకే వీళ్ళకంటే వాళ్ళే నిజంగానే భాగ్యవంతులు...

కష్టాలెన్నడూ ఎరగనోళ్లు!... 

బ్రహ్మ సైతం చక్కని రాత రాసిన

అసలుసిసలైన గొప్పోళ్ళు.. 


కించిత్తు శరీర కష్టం లేకుండా... 

ఆవేదన్నదే ఎరుగని సుఖజీవులు!...

కానీ ఆత్మీయత..అనురాగాలు 

అంత త్వరగా వీరి దరికి చేరని నిర్భాగ్యులు !...


మమకారం..మానవత్వం 

ఎపుడూ పేదోళ్ళలోగిళ్లు...

నిఖార్సయిన ప్రేమ ఒక్కటే..

పేదోడికున్న ఆస్తి..ఐశ్వర్యం...

వీళ్ళకెన్నడూ వీడని బాధలే... 

వీరివెప్పుడూ వాడిన మొఖాలే!...


వీళ్లకు అడుగడుగునా 

ధ్వనించే మూగరోదన!...

వీల్లెప్పుడు అభాగ్యహీనత్వం!...

నిర్భాగ్య దీనత్వం...

వీళ్ళ చుట్టూ ఆవరించిన 

దురదృష్టం...

ఆరుగాలమంతా... 

అలుపెరుగని కాయకష్టం


వీళ్లెప్పుడు ఏ పనిచేసినా 

త్రికరణశుద్ధిగా చేస్తారు...

తమవంతు బాధ్యతగా...

వాళ్ళపాత్ర సమగ్రంగా పోషిస్తారు...

అందుకే కష్టాలు వారిని

ఎప్పుడూ వెతుక్కుంటూ వస్తాయి. 

చరిత్రలో సదా బతుకువెతలు వాల్లవే!..

మెతుకు కథలు వాళ్ళవే..

అందుకే అదృష్టమే

మీకు పునాది...

పేదోడికి" ప్రేమొక్కటే.".. 

తరతరాలకూ తరగని పెన్నిధి


పిల్లలు ఆవేశపరులౌతున్నారు ఎందుకు?


పిల్లలు ఆవేశపరులౌతున్నారు ఎందుకు?

తల్లి సాత్వికురాలైనా పిల్లలు ఆవేశపరులౌతున్నారు ఎందుకు?


*ఇది  మన  సనాతన  ధర్మం  చెబుతున్నది..*

*మనవారు  దీన్ని  ఎప్పుడో  మరిచారు.*


*వంటచేయడం  వడ్డించడం ఒక వరం..*


*అయితే అది  ఇప్పుడు  ఒక కళగా  మారింది..*


*వంట  ఇల్లు  ఒక  దేవాలయం..*


*పొయ్యి  వెలిగించడం అంటే  అగ్ని  హోత్రం  వెలిగించడమే..  అది భక్తిగా..  భగవంతుని  తలుస్తూ… ‘నేను  చేయ  బోయే  పదార్థాలు            మా ఇంట్లో సభ్యులందరికీ  ఆకలి  తీర్చి  ఆరోగ్యం  చేకూర్చాల’ని భగవంతుని  ప్రార్థిస్తూ  చేయాలి   అని  పెద్దలు  చెబుతారు.*


*అందుకే   మన  పూర్వీకులు  ఏదో  ఒక  పారాయణం చేస్తూ  వంట  చేసే  వారు.*


*వంట  చేసిన వారి  మానిక స్థితి తిన్నవారిపై  కూడా  ప్రభావం  చూపుతుంది  అంటారు.*


*దీనికి  అమ్మ చెప్పిన ఒక  కథ  కూడా  ఉంది….*


*ఒక  ఊరిలో ఒక  బ్రాహ్మణుడు  ఉండేవాడు.*


*అతను  మహా  నిష్టాగరిష్ఠుడు. అతనింట్లో  దేవతార్చన, అతని  కుల  వృత్తి తప్ప అతనికి ఏం తెలియదు.*


*ఒకరోజు  ఆ ఊరి  జమీందారు గారు  ఈ బ్రాహ్మణుడిని తమ  ఇంటికి  భోజనానికి  పిలిచారు.*


 *పాపం  ఎప్పటి  లాగే   ఆయన  భోజనానికి  వెళ్ళారు.*


*ఏనాడు  లేనిది  ఆరోజు  ఆయనకు  తాను  భోంచేస్తున్న  అరిటాకు  పక్కన  పెట్టిన  వెండి గ్లాసు మీదకు  మనసు  పోయింది.*


*భోజనం చేస్తున్నాడన్న మాటే  కానీ   చూపు  గ్లాసు  మీదే  ఉంది.*


*చివరకు  భోజనం  చేయడం  పూర్తి అయ్యింది.*

*చేయికడుక్కోవడానికి  గ్లాస్  తీసుకుని వెళ్ళి  చేయి కడుక్కుని  ఆ గ్లాస్ ని   తన చేతి సంచీలో వేసుకున్నాడు.*


*ఆ తరువాత  జమీందారు గారు  ఇచ్చిన  దక్షిణ తాంబూలాదులు  తీసుకుని  ఇంటికి  తిరిగి  వచ్చాడు.*


*కాళ్ళు  కడుక్కని  లోపలికి  వెళ్ళి కూచున్నాక…*

*భార్య  ఇచ్చిన  దాహం  పుచ్చుకున్న  వెంటనే  అతను  స్పృహలోకి   వచ్చాడు.*


*తాను  చేసినది  దొంతనం  అని  తనను  ఎవరో  ఛెళ్ళున  కొట్టినట్టు అయ్యింది.*


*వెంటనే  చేతి  సంచీ  భుజాన  వేసుకుని  భార్యతో  కూడా  చెప్పకుండా  పరుగు  పరుగున  జమిందారు గారింటికి  వెళ్ళాడు.*


*ఇప్పుడే  వెళ్ళి  మళ్ళీ తిరిగి  వచ్చిన   బ్రాహ్మణుడిని  ఆశ్చర్యంగా  చూస్తున్న  జమీందరుని చూసి ..*


*"అయ్యా  మీ ఇంట్లో  వండిన  పదార్థాలకు  కావలసిన  వస్తువులను  కూరగాయలతో  సహా  ఎలా  సేకరించారు. మీ వంట  మనిషేమయినా  మారారా? వేరే  వంటవారు  వచ్చారా?" అని  అడిగాడు.*


*ఆయన  భార్యను  పిలిచి  అడిగాడు.*


*"అవునండి  నెలరోజులయ్యింది" అని  చెప్పింది.*


*"ఆర్యా!  ఏం  జరిగింది? " అనడిగిన  జమీందారుకు…*


*"అయ్యా!  ఎన్నడూ  లేనిది  మీ ఇంట  నేను  దొంగతనం  చేసాను..  నాకు  ఎందుకు ఆబుద్ధి  పట్టిందో  తెలీదు. ఇంటికి  వెళ్ళి  నాభార్య  చేతి  మంచి నీరు తాగాక  నేను  స్పృహలోకి  వచ్చి  జరిగిన  తప్పు  తెలుసుకుని  వచ్చాను.. "*


*"మీ  వంట మనిషి  మీ ఇంట దొంగతనం  చేస్తున్నదేమో  గ్రహించండి..  అటువంటి  మనిషి  చేతి  వంట  తిన్న నా బుద్ధి  వక్రీకరించింది." అని  చెప్పడంతో*


*వారు  వంట మనిషిని పిలిచి గట్టిగా  అడగడంతో  ఆమె  తప్పు ఒప్పుకుని వంట  సరుకులను , కూరగాయలను తన  ఇంటికి  దొంగతనంగా  చేర  వేస్తుండడం ఒప్పుకుంది.*


*వెంటనే వారు ఆమెను పని నుండి  బహిష్కరించారు.*

*బ్రాహ్మణుడు  తాను దొంగిలించిన  వస్తువును  వారికి  తిరిగి  ఇచ్చి  క్షమించమని అడిగి తిరిగి  ఇంటికి  వెళ్ళాడు.*


*వంట  చేసే  వారి  ప్రభావం  వారి  వంట మీద  ఎంత  ఉంటుందో  తెలుసుకోవాలి.*


*”అతిథి దేవో భవ” అన్నారు..*


*ఏదో  అలా  వంట  చేసి  అందమైన  టేబుల్ మీద  అందమైన  పాత్రలలో సర్దడం కాదు .  నేల  మీద అరిటాకులో  వడ్డించినా  మంచి మనసుతో వండి వడ్డించడం అవసరం.*


*అలాగే  చాలా మంది ఇంట్లో ఎంగిళ్ళకు ప్రాధాన్యత  ఇవ్వరు.  తిన్న  కంచంలో  మిగిలినది  కూడా వంటలో  కలపడం, తింటున్న కుడిచేత్తో  మారు వడ్డించుకోడం..  ఒకరి పళ్ళెంలో  నుండి  ఒకరు  తీసుకుని  తినడం    ఫ్రిజ్ లో  బాటిల్ ని నోటికి  కరిచి  పెట్టుకుని  తాగడం  ఇలా చాలా ఉంటాయి.*


*నేను  కళ్ళతో చూసాను..*


*వచ్చే వారు నిష్టాగరిష్టులైతే  వారికి ఎంగిలి  పెట్టిన  పాపం  ఊరికే  పోదు..*


*అందుకే  నియమంతో  ఉండే  వారు  ఎవరూ    వేరే వారి  ఇంట్లో   వేరేవారి  చేతిమీద  వీలైనంతవరకు  తినకపోవడమే  మంచింది.*


*నేడు  రోడ్డు  మీద  ఎవరు  వండినదో  తినడం  ఎక్కువయ్యింది   అందుకే   ఇంత  గందర  గోళం.*


*అందుకే తల్లి  సాత్వికురాలైనా  పిల్లలు  ఆవేశ పరులవుతున్నారు.*


*అది  గమనించుకుని  పిల్లలను  పెంచండి.*

.

Wednesday, May 10, 2023

బ్రహ్మానందం - తనికెళ్ల భరణి

 బ్రహ్మానందం - తనికెళ్ల భరణి



ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కు వెళ్ళారు, షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు...


అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు, బ్రహ్మానందం తనికెళ్ళ భరణి ఇద్దరినీ చూడగానే ఆ పూజారి వీళ్ళని గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారిద్దరూ కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నమయ్యాడు


పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీలేదు, వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది గానీ ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలేదు, ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకొని పూజారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయమని అడిగారు, ఇప్పుడు సమయం అయిపోయింది రేపు ఉదయం ఏడు గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు...


మర్నాడు ఉదయం ఏడు గంటలకల్లా గుడి దగ్గర నిలబడి ఉన్నారు, పూజారి రావడం, అభిషేకం చేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అన్నీ అయిపోయాయి...


స్వామి దక్షిణ తీసుకోండి అని తలా వేయిరూపాయలు బయటకు తీశారు, ఆయన హుండీలో వేయమని సైగ చేశాడు.


యూనిట్ వాళ్లు టిఫిన్ తెచ్చి ఇచ్చారు ఇద్దరూ ఆ గుడి ఆవరణలోనే కూర్చుని తినడానికి వెళ్తూ పూజారిని ఆహ్వానించారు, నేను తినేశాను మీరు తినండి అని సున్నితంగా తిరస్కరించాడు, కాఫీ అయినా తాగండి అన్నారు, ఆ పూజారి మంచినీళ్ళు కూడా తాగను అనేశాడు, మీరు మమ్మల్ని గుర్తించారా అని అడిగారు భరణి గారు కాస్త అహంతో...


ఆ పూజారి పేర్లతో సహా చెప్పాడు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఆశ్చర్యంతో "స్వామి దక్షిణ ఇస్తే తీసుకోలేదు హుండీలో వేయమన్నారు, టిఫిన్ ఇస్తే తీసుకోలేదు, కనీసం కాఫీ కూడా తాగలేదు, ఎందుకు, కారణం తెలుసుకోవచ్చా" అని అడిగారు అప్పుడాయన "సార్ నాకోక ఎకరం పొలం ఉంది, ఒక ఆవు ఉంది, ఒక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి ఈ జీవితానికి" అని వెళ్ళిపోయాడు... 


ఆ సందర్భాన్ని అప్పుడే భరణి గారు 

"మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది" అని వర్ణించారు...


ఎవరి దగ్గరా ఏదీ ఆశించకపోతే జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది ఇద్దరికీ, ఆక్షణం ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలో ఇంకెవరూ లేరు అన్నంత గొప్పగా కనిపించాడు ఆ పూజారి వాళ్ళిద్దరి కళ్ళకి, సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషీ మహారాజే గురూజీ...


*ఆశించడం ఆపేస్తే జీవితం* *అద్భుతంగా ఉంటుంది*

*ఎవరి నుంచీ ఏదీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అప్పుడే లైఫ్ లో తృప్తి దొరుకుతుంది, ప్రశాంతత నీలో కొలువుంటుంది*...


ఈ సంఘటనను వెంటనే భరణి గారు

ఓ పాటలా ఇలా రాశాడు... 

"మాసెడ్డ మంచోడు దేవుడు 

మాసెడ్డ మంచోడు దేవుడు...

నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు

మాసెడ్డ మంచోడు దేవుడు...

అస్సలడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు

మాసెడ్డ మంచోడు దేవుడు...".



ఐదు రూపాయలు

 ఐదు రూపాయలు


"నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?" తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ! 


ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో ! 


కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి 

టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు ! 


అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని !


సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత ఎవరికైనా కంట తడి రాక మానదు ! 


ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ ఐదు రూపాయలు ! 


చెన్నై లో క్షణం తీరికలేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థత గా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు ! 


లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరకు వచ్చి గద్గద స్వరంతో " నాన్న గారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు సర్దుతారా.." అనంటంతో షాక్ తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటెంబట క్షణ కాలం మాట రాలేదు ! 


వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్భం మీద ఆపుకుంటూ జేబులోనుంచి ఐదు రూపాయిలు తీసి ఆయన చేతిలో పెట్టాడు ! 


ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు వివరించారు !!


దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దారిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా ? 


ముఖ్యమంత్రి పదవి అంటే  తర తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచి పెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి  ముఖ్యమంత్రిని చూడగలమా ? 

చూడగలమా ? 


అంటే చూడలేమనే సమాధానం వస్తుంది ! 


ఆ తరం వేరు 

నేటి తరం వేరు !


ఆనాటి రాజకీయాలు వేరు 

ఈనాటి అరాచకీయాలు వేరు ! 


డియర్ రాజకీయ నాయకులూ / పాలకులూ మీ మీ ఓటు బ్యాంకు  రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒకసారైనా ఇటువంటి మహానీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి !


దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడు అయ్యారు !


ఈ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా మహానుభావుడికి నివాళులు !

Tuesday, May 9, 2023

సింహం - నక్క

 సింహం - నక్క

ఆకలితో ఉన్న సింహం నక్కతో అన్నది. 

*ఏదన్నా జంతువుని తీసుకురా లేకపోతే నిన్ను తింటాను* అన్నది. 


నక్క వెతగ్గా ఒక గాడిద కనబడింది. *సింహం నిన్ను తన వారసుడిగా నిన్ను ఈ అడవికి రాజును చేస్తానన్నది, నాతో రా!* అన్నది. 


గాడిదను చూడగానే దాడి చేసి దాని చెవులు కొరికేసింది. గాడిద పారిపోతూ నక్కతో కోపంగా:  *ఇంత మోసం చేస్తావా* అన్నది.


*పిచ్చిదానా! కిరీటం పెట్టడానికి చెవులడ్డమని కోరికిందంతే: ఏం సందేహించకు* అని నచ్చ చెప్పి మళ్ళీ తీసుకొచ్చింది. 


ఈసారి దాడిలో దాని తోక దొరికితే కొరికి తెంపేసింది. మళ్ళీ పారిపోతూ కోపంతో బాధతో వెంట వస్తున్న నక్కతో: *మళ్ళీ మోసం చేశావు కదూ!* 


నక్క: *ఛీ! ఛీ! అదేంలేదు. నీన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తోక అడ్డమని కొరికేసిందంతే!* అన్నది.


సరే అని మళ్ళీ వచ్చిన గాడిదని సింహం చంపేసి నక్కతో: *దీని చర్మం వలిచి మెదడు, గుండె, లివరు ఊపిరితిత్తులు తీసుకురమ్మన్నది.*


నక్క మెదడు తాను తినేసి మిగిలినవి పట్టుకొచ్చింది. అవి చూసి సింహం: *వీటిలో మెదడేది?* అని అడిగింది.


నక్క: *ప్రభూ! దీనికి మెదడే లేదు. ఉండి ఉంటే మీరు దాడి చేస్తున్నా మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేది కాదు కదా!* అన్నది.


*నిజమే!* అన్నది సింహం.


 సందేశం:  *మోసం చేసిన నక్క లాంటి అవినీతి నాయకులది గొప్పతనం కాదు పదే పదే వాళ్ళ మాటలు నమ్మి ఓట్లేసే గాడిద లదే  తప్పంతా.*

Sunday, May 7, 2023

ఆపరేషన్ కావేరీ

 

ఆపరేషన్ కావేరీ

భారత్ సైన్యం జరిపిన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్.. '



భారత సైన్యం చేసిన  సాహసోపేతమైన రెండు-రోజుల ఆపరేషన్‌ కావేరీ కు అంతర్జాతీయ రక్షణ రంగం నివ్వెర పోయింది..

ఒకప్పుడు ఇజ్రాయెల్ ఉగాండా లో తన సైనిక చర్య జరిపినప్పుడు ప్రపంచం ఇజ్రాయెల్ సైన్యం వంక ఎలా చూసిందో అదే నివ్వెరపాటుతో భారత సైనిక పాటవాన్ని..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేగాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోయింది..


భారత్ యొక్క స్వర్ణ యుగం ప్రారంభమైందని ప్రపంచం గమనించింది..


సూడాన్ లో జరిగిన ఈ ఆపరేషన్ మొత్తం ప్రపంచానికి చాలా షాకింగ్ మరియు థ్రిల్లింగ్‌గా ఉంది..ఒక హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని సంఘటన ఇది..


ఉక్రెయిన్ మరియు కాబూల్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా భారతీయులను రక్షించడం పెద్ద విషయం కాదు.. ఎందుకంటే వారిని అక్కడనుంచి లిఫ్ట్ చేసింది పగటిపూట అది కూడా సాధారణ విమానాశ్రయాల్లో..


కానీ సుడాన్‌లో అలా కాదు.. సుడాన్ యొక్క గగనతలం మూసివేశారు..విమానాలు ఎగరడానికి అనుమతి లేదు..కేవలం US మాత్రమే తన రాయబారులను రక్షించడానికి ధైర్యంగా తన హెలికాప్టర్‌లను పంపింది..


పోరాటం విమానాశ్రయాల్లో కూడా జరుగుతున్నందున అలాగే అక్కడ అల్మోస్ట్ అన్నీ ఇతర దేశాల దౌత్యవేత్తలు అక్కడికే చేరుకున్నారు కనుక అక్కడనుంచీ మనవాళ్లను కాపాడడం దాదాపు అసాధ్యం.. 


దేశంలోని చాలా మంది ఇలా చిక్కుకుపోయారు.

అక్కడ చిక్కుకున్నవారిలో తొలివిడతలో గుర్తించింది 278 మంది భారతీయులను.. ఇప్పుడు వారిని రక్షించడం పెద్ద సవాలుగా మారింది.


ప్రధాని మోదీ భారత వైమానిక దళానికి పూర్తి అధికారాన్ని ఇచ్చారు..

ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కూడా రంగంలోకి దిగింది..మిలిటరీ ఇంటిలిజెన్స్ మానిటరింగ్ మొదలుపెట్టింది..


వీళ్ళకి తోడు డైనమిక్ విదేశాంగ శాఖామాత్యులు జైశంకర్ గారి నేతృత్వంలో  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ప్రపంచ వాయుసేన చరిత్రలో సువర్ణాక్షరాలతో భారత్ చరిత్రను లిఖించడానికి భారత వైమానిక దళం ఉత్సాహంతో రంగంలోకి దిగింది..


విదేశీ విమానాలు సుడాన్‌లో ఎగరలేవు..ఒకవేళ సూడాన్ కు రెండో వైపునుంచి భారత్ విమానాలు ఎగిరితే ఇంకోవైపు వారు భయంతో దాడి చేయవచ్చు..ప్రధాన విమానాశ్రయం శిధిలమై ఉంది.. ఈ పరిస్తితిలో  సూడాన్ అనుమతి లేకుండా భారతీయులను రక్షించాలి.


భారత ఇంటెలిజెన్స్ సూడాన్‌ లో రెక్కీ వేసింది.. రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో మానవరహిత..ఒక పాడుబడిన విమానాశ్రయాన్ని కనుగొంది.


అక్కడ విమానాన్ని ల్యాండ్ చేయవచ్చు కానీ సమస్య ఏమిటంటే 

అన్నింటిలో మొదటిది..అక్కడ భూమిపై ఎవరూ లేరు..కరెంటు లేదు..జనరేటర్ కూడా శిధిలమైంది..ఇక లైట్లు వెలిగే అవకాశమే లేదు..


ఎయిర్ ట్రాఫిక్ గైడెన్స్ లేదు..ఇక్కడ విమానం ల్యాండింగ్ లేదా టేకాఫ్ అయినా ప్రమాదాన్ని కావాలని కొనితెచ్చుకోవడమే..


విమానం వచ్చినా వారిని ధిక్కరించి రహస్యంగా రావడానికి సుడాన్ అనుమతించదు.


ఇక రక్షణ విషయానికి వస్తే భారతీయ విమానాలు ఎగరడానికి వాళ్ళ నిఘా లేని మార్గం లేదు.


ఇన్ని సమస్యలు!

అయినా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన ఆపరేషన్ లో ముందుకే వెళ్లడానికి నిర్ణయం తీసుకుంది..


మొదటగా భారత వైమానిక దళం తన కమాండోలతో కూడిన ఒక పెద్ద విమానాన్ని సౌదీ జెడ్డాకు పంపింది అక్కడ నుండి అది సూడాన్ వైపు వెళ్లడానికి కావలసిన ఇంధనం నింపుకుంది..


ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు ముందుగా ఆ 278 మంది భారతీయులను ఆ పాడుపడిన విమానాశ్రయానికి చేర్చాయి..


ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన జీవితంలోనే అత్యంత ఉద్విగ్నభరితమైన ఆపరేషన్ మొదలుపెట్టింది..అప్పటిదాకా ఏ విమానాన్ని పంపాలో కూడా టీం అత్యంత రహస్యంగా ఉంచింది..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ' హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ ' ను రంగంలోకి దించింది..ఇక సాహసోపేతమైన ఫీట్ మొదలైంది.


లైట్లు లేని చీకటిలో నైట్ విజన్ పరికరాల సాయంతో  విమానం ఎగిరింది.. లైట్లు లేకుండా ఎగరడంతో సూడానీస్ ఆర్మీ..పారా మిలటరీ దానిని చూడలేకపోయింది.


శ్రీహరి కోట షార్ సెంటర్ నుంచి లభించిన  ఉపగ్రహ మార్గదర్శకత్వంలో భారత విమానం సంపూర్ణంగా చీకటిలో ప్రయాణించింది.


పైలట్లు రాత్రికి రాత్రే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు..ఇంజన్ ను షట్ డౌన్ చేయలేదు..


విమానం డోర్ తెరుచుకోవడంతో భారత కమాండోలు పరుగున వెళ్లి విమానంలోకి 278 మందిని మెరుపు వేగంతో తీసుకెళ్లారు..


7 నిమిషాల పాటు విమానం సూడాన్ నేలపైనే ఉండిపోయింది..

నో లైట్స్..నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్..నో సైన్ బోర్డ్స్ నథింగ్..అందరూ కూచున్న తర్వాత

కేవలం శాటిలైట్ నావిగేషన్ సాయంతో అంతే మెరుపువేగంతో విమానం టేకాఫ్ తీసుకుంది..


సౌదీ అరేబియాలోని జెడ్డాలో విమానం లాండ్ అయిన తర్వాత జెడ్డా నుంచి డిల్లీకి భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు.


ఈ సంఘటన ప్రపంచ వేదికపై తీవ్ర దిగ్భ్రాంతిని సృష్టించింది..నిజానికి ప్రకంపనాలే పుట్టించింది..

ఇజ్రాయెల్ తప్ప మరే దేశం ఇలాంటి సవాలును తీసుకోలేదు కానీ భారతదేశం ధైర్యం చేసింది.


మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ల శక్తి తెలిసి పాకిస్థాన్ వణికిపోతోంది..చైనా ఆర్మీ చీఫ్ డయపర్స్ కి ఆర్డర్ ఇచ్చాడు..


నిజానికి ఈ ఆపరేషన్ చాలా సవాలుతో..ప్రమాదంతో కూడుకున్నది..విమానం అక్కడ చిక్కుకుపోయినా లేదా అక్కడి ఫైటర్స్ విమానాన్ని గమనించి విమానాన్ని చుట్టుముట్టినా  అత్యంత ప్రమాదమే కాదు..భారత్ కు పరువుప్రతిష్టల సమస్య..


కానీ మోదీజీ నాయకత్వంలోని భారతదేశం ప్రపంచంలోనే అతి గొప్ప సాహసం చేసింది.


ఆశ్చర్యకరంగా ఇది ఏప్రిల్ 29, 2023 శనివారం నాడు జరిగింది..


ఏదో ఒకటో రెండో జాతీయవాద చానల్స్ తప్ప మిగిలిన భారత మీడియా

ఎందుకు మాట్లాడలేదు?


భారత సైన్యంపై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.. దేశప్రజల ప్రాణాలు కాపాడడంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రుల మాదిరిగా మోదీజీ కూడా చరిత్రలో నిలిచిపోయారు.


తమ ప్రజలను కాపాడుకునేందుకు మోదీజీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని నిరూపించింది.

ఈ ఘనత సాధించిన పైలట్‌, క్రూ చీఫ్‌ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వీరి పేర్లను అవార్డులకు ఎప్పుడు ప్రకటిస్తారో అప్పుడే బహుశా వారి పేర్లు కచ్చితంగా తెలిసే అవకాశం  ఉంది.


భారత వైమానిక దళం ఒక గొప్ప విజయాన్ని సాధించింది.. 

ప్రతి భారతీయుడు తమ ఛాతీని పైకెత్తి గర్వంగా వారికి సెల్యూట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది.


భారత ప్రభుత్వం తన పౌరులకు "భయం లేదు..భయం లేదు..భయం లేదని ' అభయం ఇచ్చిన క్షణం..


భారత్‌ సూపర్‌ పవర్‌ టైటిల్‌ను చేరిన క్షణం...


బెంగళూరు సమీపంలో రాజీవ్ హంతకులు మెరుపుదాడి చేసినప్పుడు ఢిల్లీ నుంచి కమాండోలు రావడానికి రెండు రోజులు పట్టింది..


ముంబై దాడి సమయంలో ఢిల్లీ నుంచి కమాండోలు రావడానికి ఒక రోజు పట్టింది..


మోడీ హయాంలో 7 నిమిషాల్లో సూడాన్ నుండి భారతీయులను రక్షించాం..

భారత్ మారుతుంది..భారత్ శక్తి మారుతుంది..

భారత్ వేగం మారుతుంది..

భారత్ ను ప్రపంచం చూసే దృష్టి మారుతుంది..

ఇది మోదీజీ నాయకత్వంలో దేశం సాధించిన అపురూప చారిత్రక విజయం..

( ఈ ఆపరేషన్ తర్వాత షుమారు 3 వేలమంది భారతీయులను సౌదీ అరేబియా..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహాయంతో సీ పోర్ట్ మార్గం ద్వారా తరలించారు ) 


Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE