NaReN

NaReN

Monday, April 17, 2023

మానవ సంబంధాలు

 *పలచబడి పోతున్న మానవ సంబంధాలు*


 గత ముప్ఫై ఏళ్లుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు లో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము .

          పెద్దగా ఆస్తులు..చెప్పుకోదగ్గ ఆదాయ వనరులు.. సమాజంలో హోదా.. సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చక్కగా (చిక్కగా )వుండేవి..

               ఒకరికి ఒకరు చేదోడుగా.. నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు..

          వున్నంతలో తృప్తిగా వున్నారు.. కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం.. అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా వుండేది..

               కుటుంబంలో ఎవరి పిల్లలు అయినా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు..

               మా మనవడు లేదా మనవరాలు..అని తాతలు.. మా మేనకోడలు లేదా మేనల్లుడు అని అమ్మమ్మ ఇంటివారు నానమ్మ ఇంటి వారు అందరూ గర్వంగా చెప్పుకునే వారు..

             కానీ ఎప్పుడైతే 1983-84 నుంచి కార్పొరేట్ కాలేజ్ సంస్కృతి పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి priority ఇవ్వడం మొదలైందో.. ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో..ఈ సంబంధాల్లో  కూడా compitetion మొదలైంది... పిల్లలో ఈర్ష్య, పెద్దల్లో అసూయ..


             మొదట్లో success అయిన వారే కుటుంబాలలో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసే వారు.. మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించే వారు.. తాము ఎదగడంతో పాటు తమ వారు కూడా ఎదగడం కోసం సహాయ పడ్డారు..


             కానీ ఎప్పుడైతే సర్వీస్ సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో.. ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో.. వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో..

              అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు.. విలాసాలు.. పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణతి చెందాల్సిన దగ్గర రివర్స్ లో కుంచించుకు పోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలుచపడటం మొదలైంది.... అంతా కమర్షియల్ అయిపోయింది 

              ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు..  కొన్న ఆస్తులు.. చేయించుకున్న నగలు.. వారు పొందుతున్న సాలరీ ప్యాకేజ్.. వారు పొందుతున్న కంఫర్ట్ గురించి తప్ప..

               వెనుకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించు కోవడమే తగ్గిపోయింది..పలకరించుకున్నా ఏదో మొక్కుబడిగానే...


                ఆనాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా..శుభకార్యం జరిగినా కనీసం 10 మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చి వుండేవారు..

              తరువాత కూడా ఇంకో వారం రోజులు వుండేవారు..

            రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకుని పొద్దుబోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వారు..

               ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా.. చేసే వారు కూడా ఆప్పో సొప్పో చేసి పక్క వాడి కన్నా ఘనంగా చేయాలి అని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందాము అని మర్చిపోతున్నారు..


                అటెండ్ అయ్యే వారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి.. తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడనికి ఇస్తున్న ప్రయారిటీ..

             పారదర్శక సంబంధాల కి ఇవ్వడం లేదు.. చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హజరులు మిగిలిపోతున్నాయి..

           అందరికి పిల్లలు దూరంగా వుంటున్నా.. ఇరుగు పొరుగు నే వుంటున్న రక్త సంబంధీకులు తో కూడా ఆత్మీయ అనుబంధాలు వుంచుకోవడం లేదు..

            నిష్కారణంగా చిన్న చిన్న కారణాలు తోనే విపరీతమైన అహం అతిశయం తో వ్యవహరిస్తూ.. అందరికి అందరూ గిరిగీసుకుని బతకడానికి అలవాటు పడుతున్నారు..


          వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు..

         నూటికి 90% కుటుంబాలలో పిల్లలు దూరంగానే వుంటున్నారు.. వీళ్లకు పెద్ధతనం.. ఒంటరి తనం.. అనారోగ్య సమస్యలు.. మనిషి తోడు అవసరం..

            అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో వుండడం లేదు.. విపరీతమైన స్వార్థం పక్క వాడి నీడ కూడా సహించడం లేదు..

దగ్గరి వాళ్ళ మధ్య కూడా గొడవలు.. మాట్లాడుకోక పోవడం.. షరా మాములు అయిపోయింది...


 సినిమా లో  రాసిన ఓ చక్కని డైలాగ్‌ గుర్తుకొస్తుంది........

‘"మనం బాగున్నప్పుడు లెక్కలు చూసుకుని... కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు" ,


వీలైతే  మనం బాగున్నప్పుడు కూడా అందరితో కలిసి ఉండాలి మన వారికీ అవసరమైన సహాయం అందించాలి.

       చాలా కుటుంబాలలో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు..

            వలసలు పుణ్యాన.. గత 60-70 సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజ్ తగ్గిపోయింది.. 

        దానికి తోడు కేవలం కూడూ గుడ్డా కూడా పెట్టని ఈ అడ్డు గోడలు పర్యవసానం..

                బాధాకరమైన విషయం ఏంటంటే ఒక వేళ పిల్లలు కజిన్స్ మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా..రిలేషన్స్ లో ఎమోషన్ వుంచుకుందాము అనుకున్నా మెజారిటీ కుటుంబాలలో పెద్ద వాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు..

           చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి..

              నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో..

      రేపటి రోజున మన తరువాత మన పిల్లలకు మన అనే వారే లేని..  మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాము..

        నీ ఇంటికి వస్తే ఏమి పెడతావు? నా ఇంటికి వస్తె ఏమి తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటి అయినా మార్పు చెందాలి..

           అందరూ కొద్దిగా ఆలోచించండి.. మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ.. మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము..

               ఎవ్వరికీ వారు గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి.. మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకు ఏమేమి దూరం చేస్తున్నాము? 

           ఇప్పటికే చాలా మంది పెద్దవారు వెళ్ళిపోయారు.. మనకి ఎంత టైం వుంటుందో తెలియదు..

           మనం సక్రమంగా ఆరోగ్యంగా వున్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గర అయినా పనికిమాలిన అహం, అతిశయం, వదిలి వెద్ధాము....


ఒక్కడై రావడం... ఒక్కడై పోవడం...

ఈ నడుమ అయినా అందరితో కలసి మెలసి ఉందాం...

🙏🙏🙏

ఉల్లిపాయలు

 *ఉల్లిపాయలు🧅*


*వేస‌విలో ఉల్లిపాయ‌ల‌ను క‌చ్చితంగా తినాల్సిందే. ఎందుకో తెలుసా? వేస‌వి వ‌చ్చిందంటే చాలు చాలా మంది త‌మ శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునే మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు.అందులో భాగంగానే చ‌ల్ల‌ని ప‌దార్థాలు, పానీయాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటుంటారు. అయితే వేస‌విలో ఉల్లిపాయ‌ల‌ను కూడా తీసుకోవాల్సిందే. ఉల్లిపాయ‌ల్లో అనేక అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. క‌నుక వీటిని తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.*


*1.వేస‌విలో మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచేందుకు ఉల్లిపాయ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ను నియంత్రించే స‌మ్మేళ‌నాల‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక ఉల్లిపాయ‌ల‌ను ఈ సీజ‌న్‌లో రోజూ తినాలి. రోజుకు 2-3 ఉల్లిపాయ ముక్క‌ల‌ను తింటే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. దీంతో శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.*

*2.ఈ సీజ‌న్‌లో గ్యాస్‌, క‌డుపులో మంట‌, విరేచ‌నాలు అధికంగా అయ్యేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అలాగే వేడి కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. కానీ ఉల్లిపాయ‌ల‌ను తింటుంటే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అలాగే ఉల్లిపాయ గుజ్జులో చ‌క్కెర క‌లుపుకుని తింటే మూత్రం కూడా బొట్లు బొట్లుగా కాకుండా ధారాళంగా వ‌స్తుంది. మూత్రాశ‌య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. వేడి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.*

*3.ఉల్లిపాయ‌ల్లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీని వ‌ల్ల సీజ‌న‌ల్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఉల్లిపాయ‌ల్లో అధికంగా ఉంటే పొటాషియం శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో హైబీపీ త‌గ్గుతుంది.*

*4.డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ ఉల్లిపాయ‌ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. ఉల్లిపాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ‌శ‌క్తి మెరుగు ప‌డుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.*

Sunday, April 16, 2023

ఒక స్త్రీ

 ఒక స్త్రీ  కుటుంబానికి  అంకితం అయ్యి తన గురించి ఆలోచించలేక పోయినది.


భర్త ఉద్యోగం ఉద్యోగం అంటూ ఊర్లు తిరిగి సంపాదించడానికి వెళ్ళేవారు.

కుటుంభంలోని ప్రతి ఒక్కరి బాధ్యత ఆమెదె అయ్యింది


వయసు మీదపడ్డ అత్తమామలు

బడికి వెళుతున్న చిన్న పిల్లలు

ఇక ఇంట్లో అన్ని అవసరాలు.


ఒక్కరోజు రమ్మని మిత్రులంతా కలుసుకోవాలని అడిగితే నేను లేకపోతే ఆ ఇంట్లో కష్టం అని రాలేదు.


తన అన్న కూతురి పెళ్ళికి రెండ్రోజులు ముందు వెళ్ళలేదు కారణం అత్త మామకు అనారోగ్యం దగ్గరుండి చూసుకోవాలి.


స్నేహితురాలి గృహప్రవేశానికి రాలేకపోయింది

కారణం పిల్లలకు పరీక్షలు.


ఎప్పుడైనా పలకరిస్తే మాతో ఒక్క మాట మాట్లాడితే ఇంట్లో వారి అవసరాలకు బదులు చెప్పిందే ఎక్కువ.

మా వారికి కనీసం ఒక్క టీ పెట్టడం రాదూ 


నేనంటూ లేకపోతే ఇంట్లో వారికి కష్టం అని పదే పదే చెపుతుండేది.


ఒక రోజు ఆమె ఇక లేదు అన్న వార్త అందింది.

మనసు చెప్పలేనంత బాధ నన్ను చుట్టుకుంది.

ఆమె లేదు అన్న చేదు వార్త ఒక పక్క అయితే ఆమె పైన ఆధారపడిన కుటుంభం అని ఆలోచన వచ్చింది.


పదిరోజుల తరువాత ఆమె భర్తకు ఫోన్ చేసాను.

ఎలా ఉన్నారు అని .


ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ ఒక కొలిక్కి వచ్చాయి అని చెప్పారు.

తల్లితండ్రిని చూడడానికి ఒక మనిషిని పెట్టాను.

వంటకు ఒక మనిషిని మాట్లాడుకున్నాను మొత్తం వాళ్ళే చూసుకుంటారు.


నేను ఊర్లోనే ఉద్యోగం చూసుకుని ఇక్కడే ఉండిపోయాను.

పిల్లలు నాతోనే ఉన్నారు వాళ్లు కూడా మెల్లగా వారి పనులు చేసుకుంటున్నారు 


నేను ఇప్పుడే బయట స్నేహితులతో గడిపి వస్తున్నాను అని అన్నారు.


వారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాక నా మనసు నిజంగా ఇప్పుడు ఏడవడం మొదలుపెట్టింది.


మనవాళ్లు అనుకుని మన సంతోషాలను దూరం చేసుకోకూడదు.

బాధ్యతలను వదిలేయమని చెప్పడం లేదు

మీ ఆనందాలను అనుభవించమని చెబుతున్నాను.


మీ సంతోషాలను త్యాగం చేసి మరి బరువులను మోయమనడం లేదు.

మీకోసం సమయాన్ని వెచ్చించమని చెబుతున్నాను.


ఇవన్నీ ఆమెకు చెప్పాలని ఉంది కాని వినిపించుకోలేనంత దూరం ఆమె వెళ్లిపోయింది అని రెండు కన్నీటి చుక్కలు కార్చేసి నేను మర్చి పోతాను


మనుషులు మారిపోయారు

ఎవరికోసం నువ్వు నిన్ను పోగొట్టుకుంటున్నావు

నువ్వు చనిపోతే ఒక రెండ్రోజులు ఆ తరువాత ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు

గుర్తింపు లేని సేవ ఎక్కడ ఉంటుంది అంటే అది ఇంట్లో బాధ్యతలు మోస్తున్న ప్రతి స్త్రీ జీవితం అని చెప్పాలని ఉంది.

************************************

గృహిణి జీవితాన్ని వాస్తవం గా వివరించారు ...

తను ఉన్నప్పుడు చేయలేని పనులన్నీ  తను వెళ్ళిపోయాక చేసుకుంటున్నారు.. తను  పోయిన బాధ  ఎవరిలో లేదు.. కాని తను మాత్రం జీవితం మొత్తం వాళ్ళకి బానిసల చేసి చేసి ఇప్పుడు శాశ్వత విశ్రాంతి తీసుకుంటుంది..

ఓ తండ్రి కథ...

 160423f1607.      170423-4.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఓ తండ్రి కథ…



       నీ భవిష్యత్ ను మార్చే శక్తి 

          నీకు మాత్రమే వుంది!

               ➖➖➖


వార్తాపత్రికలు వేసే వ్యక్తి ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నాకు వార్తాపత్రికను అందించడానికి వచ్చేవాడు, నేను మా ఇంటి వసారాలో నడవడం గమనించేవాడు. అలా నా ఇంటి ముందు గేటు దాటుతూ, సైకిల్ ఆపకుండానే న్యూస్ పేపర్ ని బాల్కనీలో విసిరేసి…

 “నమస్తే బాబూజీ” అని పలకరించి వేగంగా ముందుకెళ్లిపోయేవాడు.

సంవత్సరాలు గడిచేకొద్దీ నేనూ పెద్దవాడినయ్యాను, నా మేల్కునే సమయం కూడా మారిపోయింది. ఇప్పుడు నేను ఉదయం 7 గంటలకు లేస్తున్నాను.


చాలా రోజులుగా నేను ఉదయం నడకకు లేవలేకపోవడంతో, ఒక ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో, నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి  అతను నా ఇంటికి వచ్చాడు. ఇంట్లో అంతా బాగానే ఉందని, నేను ఆలస్యంగా లేవడం ప్రారంభించానని తెలుసుకుని, ముకుళిత హస్తాలతో, "బాబూజీ! నేనొక విషయం చెప్పవచ్చా?" అని అడిగాడు.

"ఫర్వాలేదు, చెప్పు" అన్నాను.


అతను ఇలా అన్నాడు, "ఉదయం త్వరగా లేచే మంచి అలవాటును మీరు ఎందుకు మార్చుకుంటున్నారు? నేను ఉదయాన్నే విధానసభ రహదారి నుండి వార్తాపత్రికలను తీసుకొని వస్తాను. మీరు వార్తాపత్రిక కోసం ఎదురుచూస్తూ ఉంటారని, మీకు వార్తాపత్రికను అందించడం ఆలస్యం అవకూడదని అనుకుంటూ, చాలా వేగంగా సైకిల్  త్రొక్కుకుంటూ వస్తాను."


నేను ఆశ్చర్యంగా "నువ్వు విధానసభ రోడ్డు నుండి వార్తాపత్రికలు తెస్తావా?" అన్నాను.


"అవును, అక్కడ నుండే మొదటి పంపిణీ ప్రారంభమవుతుంది," అతను సమాధానం చెప్పాడు.


నేను అతనిని మరొక ప్రశ్న అడిగాను, "అయితే అప్పుడు నువ్వు ఎన్ని గంటలకు నిద్ర లేస్తావు?" 


"రెండున్నరకి లేస్తాను ... మూడున్నరకి అక్కడికి చేరుకుంటాను" చెప్పాడు.


"అప్పుడు?" నేను మళ్ళీ అడిగాను. 


"వార్తాపత్రికలు పంచిన తరువాత, ఏడు గంటలకు నేను ఇంటికి వెళ్లి పడుకుంటాను. పది గంటలకు ఆఫీసుకు వెళ్ళాలి. పిల్లలను పెంచడానికి, కుటుంబ పోషణకి ఇవన్నీ చేయాలి కదా", అన్నాడు.


నేను కొన్ని క్షణాలు అతని వైపు చూస్తూ ఉండిపోయాను, "సరే! నువ్విచ్చిన విలువైన సూచనను నేను గుర్తుంచుకుంటాను", అన్నాను.


ఈ సంఘటన జరిగి దాదాపు పదిహేనేళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మా ఇంటికి వచ్చి ఒక ఆహ్వానపత్రిక ఇచ్చాడు. "బాబూజీ! నా కూతురి పెళ్లి... మీరు మీ కుటుంబంతో తప్పక రావాలని కోరుకుంటున్నాను", అన్నాడు.


పెళ్లిపత్రికను చూసిన వెంటనే ఒక డాక్టర్ అమ్మాయికి డాక్టర్ అబ్బాయికి పెళ్లి అని తెలిసింది.

నేను గబుక్కున అనాలోచితంగా, "మీ అమ్మాయా?" అనడిగాను.


నేను ఏ ఉద్దేశ్యంతో అడిగాననుకున్నాడో, అతను వెంటనే, "అదేంటి బాబూజీ అలా అడుగుతున్నారు! ఈమె నా కూతురే!", అన్నాడు.


వెంటనే నా వైఖరిని సరిదిద్దుకుని, 

"అంటే నా ఉద్దేశ్యం, నీ కుమార్తెను డాక్టర్‌ ని చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను", అంటూ మా మధ్య ఇబ్బందిని తొలగించాను.


“అవును బాబూజీ! నా కుమార్తె KGMC నుండి MBBS చేసింది. ఆమె కాబోయే భర్త కూడా అక్కడ MD…  

నా కుమారుడు కూడా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు" అన్నాడు.


తలుపు దగ్గర నిలబడి లోపలికి పిలవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా, "సరే బాబూజీ! నేను ఇంక బయలుదేరాను... ఇంకా చాలా కార్డులు పంచాలి... పెళ్ళికి దయచేసి తప్పకుండా రండి. మీ కుటుంబంతో రండి, నా కుటుంబం మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తుంది" అన్నాడు.


నేనెప్పుడూ అతనిని లోపలికి రమ్మని పిలవలేదు, ఈరోజు హఠాత్తుగా లోపల కూర్చోమని ఆహ్వానిస్తే, అది బూటకమే అవుతుంది. కాబట్టి గౌరవంగా ఒక నమస్కారం పెట్టి, నేను బయటి నుండే అతనికి వీడ్కోలు పలికాను.


ఆ సంఘటన జరిగిన రెండేళ్ల తర్వాత, అతను ఇంకోసారి నా ఇంటికి వచ్చినప్పుడు, అతని కొడుకు జర్మనీలో ఎక్కడో పనిచేస్తున్నాడని మా సంభాషణలో తెలిసింది.


ఇప్పుడింక, నా ఉత్సుకత ఆపుకోలేక, చివరికి అతనిని ఒక ప్రశ్న అడిగాను: "నీ పరిమిత ఆదాయంతో నీ పిల్లలకు ఉన్నత విద్యను ఎలా అందించావు?"


"బాబూజీ! ఇది చాలా పెద్ద కథ, కానీ నేను మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వార్తాపత్రికలు, నా ఉద్యోగమే కాకుండా, నేను ఖాళీ సమయంలో కూడా కొన్ని పనులు చేస్తూనే ఉంటాను. నా రోజువారీ ఖర్చులు కూడా చాలా జాగ్రత్తగా నిర్వహించుకుంటాను.

నేను రాత్రిపూట మాత్రమే మార్కెట్‌ కి వెళ్లి తక్కువ ధరకు లభించే గుమ్మడి, పొట్లకాయ, బెండకాయలు కొంటాను... ఎందుకంటే రాత్రిపూట దుకాణాలు మూసే సమయంలో దుకాణదారులు చాలా తక్కువ ధరకే కూరగాయలు ఇస్తారు.

ఒకరోజు, నా కొడుకు ఇరుగుపొరుగు పిల్లలతో ఆడుకోవడానికి వారి ఇంటికి వెళ్ళాడు, ఎర్రటి ముఖంతో, కళ్ళ నీళ్లతో తిరిగి వచ్చాడు. మమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలని అనుకున్నాడు.


ఆ సాయంత్రం అందరం భోజనానికి కూర్చున్నప్పుడు, మా అబ్బాయి కంచంలో కూర, చపాతీని చూసి ఏడవడం మొదలుపెట్టాడు. తల్లితో ఇలా అన్నాడు, “ఏంటి ఇది.. ఎప్పుడూ అదే గుమ్మడికాయ, బెండకాయ, పొట్లకాయ ... రుచి పచి లేని కూరగాయలు ...ఇవన్నీ తిని, తిని అలసిపోయాను. నేను నా స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు బఠానీలు-పనీర్, కోఫ్తాలు, దమ్ ఆలూ, ఒకటి కాదు... ఇంకా చాలా తింటారు!  ఇక్కడేమో, కేవలం ఒక కూర, ఎండిన చపాతీ మాత్రమే ."


నేను అతని వైపు ప్రేమగా చూసి, “ముందు నువ్వు ఏడుపు ఆపితే, తర్వాత మాట్లాడుకుందాం” అన్నాను.


అప్పుడు నేను, "నాయనా! ఎప్పుడూ నీ కంచంలోనే చూసుకో. ఎదుటివాళ్ళకి ఉన్నదానిని మనం చూసుకుంటే అసలు మన దగ్గర ఉన్నవాటిని కూడా మనం ఆస్వాదించలేం. ఇప్పుడు, ఈ క్షణంలో  మనకు ఏది ఉందో దానిని హృదయపూర్వకంగా అంగీకరించాలి. భగవంతునికి ధన్యవాదాలు తెలుపుకుని, ఎల్లప్పుడూ మన భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ నిన్ను నీవు విశ్వసించు, నీ భవిష్యత్తును మార్చే శక్తి నీకు మాత్రమే ఉంది, వేరెవరికీ లేదు. నిన్ను నీవు ఇంకా మెరుగుపరచు కోవడానికి, ఇంకా మంచిగా అవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండు. 


నా కొడుకు కన్నీళ్లు తుడుచుకుని, ఆ తర్వాత నవ్వుతూ నా వైపు చూసి, 'ఈ రోజు నుండి నేను నా జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోను, నా భవిష్యత్తును బాగు చేసుకోవడానికి నా వంతు కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను’,  అన్నాడు. 


అప్పటి నుండి, నా పిల్లలు ఎవరూ నా నుండి ఏ కోరికలు కోరలేదు, ఏమీ ఆశించలేదు. పరిమిత వనరులతో, వారు తమ జీవితాన్ని మెరుగుపరచు కోవడం ప్రారంభించారు. బాబూజీ! ఈ రోజు వారు ఎక్కడ ఉన్నా, అది వారి త్యాగాల ఫలితమే".


నేను మౌనంగా, శ్రద్ధగా అతని మాటలు వింటూనే ఉన్నాను. నా హృదయపు లోతుల్లో తండ్రి ప్రేమ యొక్క శక్తిని అనుభవించగలిగాను.


♾️♾️♾️♾️♾️♾️


మన భవిష్యత్తు, మన విధి, దానిని మనం ఎంత బాగా నిర్మించుకుంటాం అన్నది, మనపైనే ఆధారపడి ఉంటుంది. 

కర్మ తలుచుకుంటే...

 🎻🌹🙏 కర్మ తలుచుకుంటే  మనుషుల పరిస్థితి ఇలానే ఉంటుందేమో????


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿ఒక జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్నవేళ ఒక వ్యక్తి తలుపు కొట్టే శబ్దం వినిపించింది


🌸ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే 

ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు


🌿దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది


🌸ఏమీ  అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి

రేపటికి మనకే పనికివస్థాయి అన్నాడు


🌿ఇలా చిన్న చిన్న మనస్పర్థలు పెరిగి పెద్దవయ్యాయి భార్యభర్తలు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు.


🌸అతడి పరిస్థితి తలకిందులైయింది, ఉద్యోగం పోయింది, అన్నం పెటేవారు లేరు ఇలా అతను 

కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు


🌿భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా గడుపుతుంది


🌸భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేల ఒక బిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆ భర్త మొదట అతడికి పెట్టేసేయ్ తరువాత మనం వండుకోవచ్చులే అన్నాడు


🌿సరే అని ఆమె బయటకెళ్లి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది అని అడిగాడు ఆ భర్త


🌸వచ్చిన ఆ బిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది


🌿దానికి తాను నవ్వుతు నేనెవరో తెలుసా అని అడిగాడు . నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టినవాడిని అన్నాడు


🙏జీవితం చాలా నేర్పిస్తుంది🙏


🌸నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరుని అనిచే రోజొకటి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది


🌿అహంకారం అసలు పనికిరాదు

జీవితం తలకిందులు అవడానికి చాలా సమయం అయితే తీసుకోదు


🌸ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోను దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు.


🌿మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవద్దు.


🌸 ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది కచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది కాలం..స్వస్తీ..🚩🌞🙏🌹🎻


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

వృద్దాప్యంలో జాగ్రత్త

 వృద్దాప్యంలో జాగ్రత్త

*కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లుచూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు.ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు.  జానకమ్మ బెంగ పెట్టుకుంది, కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని.*


*ఒక రోజు Builder వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి.  ప్రతి గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా టేపు తో కొలిచాడు.భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు.చివరికి పెదవి విప్పాడు షావుకారు…“మాస్టారుగారూ, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క..ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి.మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?”*


*రాఘవరావు మౌనం వహించాడు.జానకమ్మే అంది.‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే.*

 *అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై లక్షలు, ఇంటికి పదిహేను, మొత్తం ఏభై ఐదు లక్షలు రాదంటారా?” *


*ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు Builder … “చూడండి అమ్మా, మీ లెక్కలు మీకు ఉంటాయి. కొనేవాడి లెక్కలు కోనేవాడికుంటాయి. నేను ఇక్కడ ఒక అపార్ట్ మెంట్ కట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు ఇల్లు తీసెయాలి. అందుకని స్తలం రేట్ కి కొందామని నా ఉద్దేశ్యం. అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను.  ఆలోచించండి “ అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు.*


*అతను వెళ్ళాక భార్యాభర్తలు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.చివరకుజానకమ్మే నిర్ణయం ప్రకటించింది ."మనం ఆలస్యం చేసేకొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారి పోతుంది

నలభై లక్షలకు Builder కే ఇల్లు ఇచ్చేద్దాం. మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు”.ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది, ఇల్లు నలభై లక్షలకు Builder  కి ఇద్దామనుకుంటున్నామని .

రాజేష్ అలాగే చెయ్యమని చెప్పాడు.*


*మర్నాడే రాఘవరావు. BUILDER కి  కబురుచేసి తమ అంగీకారం చెప్పాడు.  వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు BUILDER పరం అయ్యింది.  రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకుని హైదరాబాదు వెళ్ళిపోవడం చాలా స్పీడుగా జరిగిపోయింది.*


*నెలరోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లితండ్రుల్ని హైదరాబాదుకి  తీసుకునివెళ్లాడు. భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు, జానకమ్మ.*


*కొన్నాళ్ళకు మనవల ఆట పాటలతో ఇంటి గురించి మర్చిపోయారిద్దరూ. మరో నెల రోజులకు కొడుకు కొన్న ప్లాట్ లోకి మారారు అందరూ.రెండు పడక గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు. కొడుకుని అడిగితే  ‘మనం ఆలస్యం చేయడంవలన, మూడు పడక గదుల ప్లాట్ చేజారిపోయిందని ‘ చెప్పాడు రాజేష్.  కొడుకు, కోడలు మనవలు ఒక గదిలో, రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునే వారు.మూడు నెలలు ముచ్చటగా గడిచాయి.  ఒకరోజు మనవడు ‘నానమ్మా, నేను నీ దగ్గరే పడుకుంటానని’ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. జానకమ్మ ఎంతో సంతోషంతో వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది.  పది రోజులు తర్వాత మనవరాలు కూడా ‘నానమ్మా, నేనూ నీ దగ్గరే పడుకుంటానని’  జానకమ్మ దగ్గరకు వచ్చేసింది.  ఆ విధంగా రాఘవరావు పడక హాలులోని దివాను మీదకు మారిపోయింది.

ఆరునెలలు గడిచాయి.  పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు, కోడలు గొడవ పడటం చూసి, తన పెన్షన్ లో దాచుకున్న ఏభై వేలు పట్టుకొచ్చి కొడుకుకి ఇచ్చాడు

రాఘవరావు. మరో ఆరునెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్ లోంచి ఐదువేలు తన దగ్గర ఉంచుకుని మిగతా ఇరవైవేలు కొడుకుకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.  ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని కోడలు సుమిత్ర కాన్వెంట్ లో టీచర్ గా చేరింది.,


*వంట చెయ్యడం, మనవలు ఇద్దరినీ కాన్వెంట్ కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీ గా మారిపోవడం జరిగింది. జానకమ్మకు శ్రమ ఎక్కువ అయ్యింది ఇంటి పనితో.శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు.వంట తక్కువ, పని కూడా తక్కువే .  విశ్రాంతిగా ఉండేది.ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు. పని ..పని ..పని..!

మరో ఆరు నెలలు గడిచాయి. మనవలు ఇద్దరూ పెందరాళే పడుకోకుండా స్కూల్ విషయాలు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాలు లోకి మారింది. రాఘవరావు దివాను మీద, జానకమ్మ నేలమీద చాప వేసుకుని పడుకుంటున్నారు.*


*ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు “ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు?” అని అడిగాడు.*


*మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ ‘మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను’ అంది.*


*మర్నాడు ఉదయం శివపురం హైస్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల సభ చాలా బాగా జరిగింది.*


*ముందుగా తమకు విద్య నేర్పిన గురువులు అందరికీ 

పాదాభివందనం చేసి, ఆ తర్వాత వేదిక మీదకు వెళ్ళారు.రాఘవరావు, మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి, సంస్కారానికి అబ్బురపడ్డారు.అమెరికాలో, ఆస్ట్రేలియా, సింగపూర్ లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు పేరునా పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది.పూర్వ విద్యార్ధుల తరపున వరుణ్ మాట్లాడుతూ “ఈసమావేశానికి మూలకారకులు మిదున్, సాత్విక్.వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నా అందరినీ కాంటాక్ట్  చేసి ఇక్కడికి రప్పించారు.వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.మమ్మల్ని వృద్ధిలోకి తీసుకువచ్చిన మా గురువులు అందరికీ నా నమస్సులు.” అని అన్నాడు.*


*తర్వాత గురువులు అందరికీ ఘనంగా సన్మానంచేసి, వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్ధులు.*


*రాఘవరావు మాట్లాడుతూ,”మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం.అది గురువుగా మా బాధ్యత.మీరు మన ఊరికి, మన స్కూలుకి  పేరు తెచ్చినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి.*


మీరు అందరూ పిల్లా, పాపలతో సుఖంగా ఉండాలి.

మీరు మాకు చేసిన సత్కారం,సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను” అని అన్నాడు. *


*వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.  చివరగా మిదున్ మాట్లాడుతూ… ”మన బాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్ గా తణుకులో ప్రాక్టీసు చేస్తోంది.  ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది.  ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి” అని అన్నాడు.*


*అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు.  రాఘవరావు ఇంటిముందు ఆగాడు మిదున్.*


*రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు.తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి.గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది. మిదున్, రాఘవరావు చేయి పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు.  “మాస్టారు, మీ ఇల్లు మీకు అప్పచెబుతున్నాం. మీరు, అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి.  BUILDER దగ్గరనుండి మేము దీన్ని కొన్నాం. చాలా కాలంక్రితమే పరమేశం గారు నాకు, మీరు ఎంత బెంగగా, దిగులుగా ఉన్నారో చెప్పారు. మేము ఈ రోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలూ, కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి మూలం మీరు పెట్టిన జ్ఞాన భిక్షే. మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే నేనూ, నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం.  మీ స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు.  మీ ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది.  మన వూరి నుండి తణుకు పది నిముషాల ప్రయాణం. మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక.  కాదనకండి.” అని రాఘవరావు రెండు చేతులూ పట్టుకున్నాడు.*


*కళ్ళమ్మట ఆనందభాష్పాలు కారుతుండగా రాఘవరావు, మిదున్ ని దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు.*


*వెంటనే ఇంట్లోకి వెళ్లి, ప్రతిగుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు.దొడ్లోకి వచ్చి,మామిడిచెట్టు కింద ఉన్న చప్టా మీద కూర్చున్నాడు.లేచి ప్రతి చెట్టుని ముట్టుకుని పరవశించి పోయాడు.తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవుదూడ,చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు.ఐదు నిముషాలు గడిచాక పూర్వ విద్యార్ధులు అందరూ రాఘవరావు దగ్గర శెలవు తీసుకుని వెళ్ళిపోయారు.*


*రాఘవరావు, మిత్రబృందం మిగిలారు.  పరమేశం, సుబ్బారావు ల చేతులు పట్టుకుని  ‘మీ ఋణం ఎలా తీర్చుకోను’ అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో.*


*“రోజూ మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే” అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.*


*ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ. ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది.*


*“పైస జారనీకు* *ప్రాణమున్నంతకు*

*పైస పోయెనేని ప్రాణమాగు*

*పైస లోనగలదు* *పరమార్ధమంతయు,*

*పైసె యిలను వెలసె ప్రాణమగుచు!!*


*అదీ కథలోని నీతి!*

*విశ్రాంతజీవులందరూ,తస్మాత్ జాగ్రత....*


*మీ కంటూ చివరి వరకు ఒక ఇల్లు ఉండడానికి ఉంచుకోండి. మీరు మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించవచ్చు... చివరి దశలో మిమ్మల్నీ ఒక పనిమనుషులుగా మీ పిల్లలు వాడు కొంటారు. విదేశాలకు వెళ్లి 6నెలలు పిల్లలకు మనవళ్లు మనవరాళ్లకు ఊడిగం చేసి రావాల్సి వస్తది.... ఎందుకంటే విదేశాల్లో పనిమనుషులు దొరకరు ఒకవేళ దొరికిన వాళ్లు చాలా కాస్ట్లీ..!   ఫ్రీ గా వచ్చేది అమ్మ నాన్నలు, అత్త మామలు..!  ఆర్నెల్ల ముందు ఫ్లైట్ బుక్ చేసుకుంటే చాలా చౌకగా పడతాది.   6 నెలలు వాడుకున్నంత వాడుకోవచ్చు.. ముఖ్యంగా తల్లులకు ఎక్కువ పని. అందరు పిల్లలూ అలా లేరు కొందరు మాత్రమే...!  సీనియర్ సిటిజన్స్ చివరి రోజుల్లో స్వేచ్ఛగా ఆనందంగా హ్యాపీగా బతకండి...*

Friday, April 14, 2023

వడదెబ్బ తగిలితే

 *వడదెబ్బ తగిలిన వెంటనే ఇలా చేయండి లేకపోతే ప్రాణాలు పోతాయ్!* 

 

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. 


 సూర్యుడి వేడి వల్ల వీచే వేడిగాలులే వడగాల్పులు.

సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సేపు ఎండలో, వేడి గాలుల్లో తిరగకూడదు. ఎండ తీవ్రత వల్ల శరీరం డీహైడ్రేషన్‌‌కు గురై ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ విఫలమవుతుంది. 


వడ దెబ్బకు గురైన వారి శరీర ఉష్ణోగ్రత 104 F కంటే ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరంలోని ప్రధాన నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే, వడ దెబ్బ తగిలిన వెంటనే వికారం, మూర్ఛ, గందరగోళం, అయోమయంగా ఉంటుంది. స్పృహ కోల్పోయి, కోమాలోకి వెళ్లిపోతారు. 


 *వడదెబ్బ లక్షణాలివే:* 


☀ శరీర ఉష్ణోగ్రత 104 F కంటే ఎక్కువగా ఉంటుంది.


☀ మూర్ఛపోయే ప్రమాదం ఉంది.


☀ తీవ్రమైన తలనొప్పి లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.


☀ చెమట పట్టడం ఆగిపోతుంది. 


☀ శరీరం పొడిగా లేదా ఎర్రగా మారిపోతుంది.


☀ కండరాలు బలహీనమవుతాయి. తిమ్మిరి ఏర్పడుతుంది.


☀ వికారం, వాంతులు.


☀ గుండె వేగంగా కొట్టుకుంటుంది.


☀ శ్వాస పీల్చుకోడానికి ఇబ్బంది ఏర్పడుతుంది.


☀ గందరగోళం, అయోమయంగా ఉంటుంది. వింతగా ప్రవర్తిస్తారు.


☀ మూర్ఛలు ఏర్పడతాయి. అపస్మారక స్థితికి చేరుకుంటారు. పూర్తి వైద్య సలహాలు కోసం



 *వడదెబ్బ తగిలిన వెంటనే ఇలా చేస్తే ప్రాణాలు దక్కుతాయి:* 


 రోడ్డు పక్కన ఎవరైనా వడ దెబ్బతో పడిపోయినా, లేదా మీకే వడ దెబ్బ తగిలినట్లుగా సందేహం కలిగిన తప్పకుండా ప్రథమ చికిత్స అవసరం. వీలైతే ఇతరుల సాయం తీసుకునైనా ఇక్కడ చెప్పినట్లు చేయండి. 


☀ ఎవరైనా వడదెబ్బకు గురై పడిపోయినట్లయితే అంబులెన్స్‌కు కాల్ చేయాలి. 


☀ అంబులెన్స్ వచ్చేలోపు మీరు బాధితుడిని చల్లగా ఉండే ప్రదేశం లేదా చెట్టు నీడలోకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయాలి.


☀ అవసరమైతే బాధితుడిపై అదనగా ఏమైనా దుస్తులు ఉంటే వాటిని తొలగించి గాలి తగిలేలా చూడండి. 


☀ ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత తగ్గించడం కోసం క్లాత్‌ను చల్లని నీటితో తడిపి శరీరాన్ని తుడవండి.


☀ వడదెబ్బ వల్ల బాధితుడి శరీర ఉష్ణోగ్రత 104 Fకు చేరుకొనే అవకాశం ఉంటుంది. దాన్ని 101 F నుంచి 102 F వరకు తగ్గించాలి.


☀ థర్మామీటర్లు అందుబాటులో లేకపోయినా ప్రథమ చికిత్స చేయడానికి వెనకాడకండి.


☀ వీలైతే బాధితుడిని సమీపంలోని ఏదైనా ఆఫీస్, షాప్, ఇంట్లోకి తీసుకెళ్లి చల్లని వాతావరణంలో ఉంచండి. 


☀ ఐస్ ప్యాక్‌లు అందుబాటులో ఉంటే బాధితుడి చంకలు, గజ్జలు, మెడ, వీపు భాగాల్లో పెట్టండి. 


☀ పైన చెప్పిన శరీర భాగాల్లో రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉంటాయి. అవి చల్లబడితే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.


☀ బాధితుడి షవర్ కిందకు తీసుకెళ్లి స్నానం చేయించినా పర్వాలేదు. లేదా చల్లని నీటి టబ్‌లోనైనా ముంచవచ్చు.


☀ ఆరోగ్యం, యవ్వనంగా ఉండే వ్యక్తి తీవ్ర వ్యాయామం వల్ల వడ దెబ్బకు గురైతే.. ‘ఎక్సర్షనల్ హీట్ స్ట్రోక్’ అని అంటారు. వీరికి ఐస్ బాత్‌ చేయించాలి. 


☀ వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు లేదా వ్యాయామం చేయని వ్యక్తులు, మద్యం తాగేవాళ్లు వడదెబ్బకు గురైనట్లయితే ఐస్ లేదా మంచును అస్సలు ఉపయోగించవద్దు. అలా చేస్తే చేయడం చాలా ప్రమాదకరం. వీలైనంత వరకు సాధారణ నీటితోనే వారి శరీర ఉష్ణోగ్రత తగ్గించే ప్రయత్నం చేయాలి.


 *వడదెబ్బకు గురికాకుడదంటే ఈ జాగ్రత్తలు పాటించాలి:* 


☀ వేసవిలో బయటకు వెళ్లేప్పుడు తప్పకుండా మీ వెంట నీటి బాటిల్ ఉండాలి. వీలైతే ORS లేదా ఎలక్ట్రోలైట్‌, గ్లూకోజ్ వాటర్ మీ వెంట తీసుకెళ్లండి.


☀ శరీరానికి గాలి తగిలే కాటన్, వదులైన దుస్తులు ధరించాలి.


☀ మీరు వేసుకొనే దుస్తులు మీ చెమటను పీల్చగలగాలి. అలా ఉండటం వల్ల మీ దుస్తులు తడిగా ఉండి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.


☀ ఆల్కహాల్ తాగిన తర్వాత ఎండలోకి వెళ్లకూడదు. 


☀ కేవలం ఎండలోకి వెళ్తేనే కాదు, ఇంట్లో ఉన్నా సరే వడ దెబ్బ తగులుతుంది. కాబట్టి, వీలైనంత వరకు మీ ఇంటిని చల్లగా ఉంచుకొనే ప్రయత్నం చేయండి.


☀ సీలింగ్ ఫ్యాన్స్ కంటే టేబుల్ ఫ్యాన్ బెటర్. దానికి కాస్త దూరంలో గానీ, కిటికీ గానీ చల్లని క్లాత్ వేలాడిదీసి టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తే గది చల్లబడుతుంది. 


☀ ఏసీలో ఎక్కువ సేపు ఉండేవారు.. ఒకేసారి ఎండలోకి లేదా వేడి వాతావరణంలోకి వెళ్లినా వడదెబ్బకు గురవ్వుతారు. 


☀ వీలైనంత ఎక్కువ నీటిని తాగడం ద్వారా శరీరానికి చెమట పట్టేలా చూసుకోవాలి. 


☀ 30 లేదా అంతకంటే ఎక్కువ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (SPF) ఉన్న సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి.


☀ రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు, పండ్ల రసం లేదా కూరగాయల రసం త్రాగడానికి సిఫార్సు చేయబడింది. 


 *ఎవరికి ఎక్కువ ప్రమాదం?:* 


☀ శిశువులు, నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 65 ఏళ్లు దాటిన పెద్దలకు ‘వడ గాల్పులు’ అత్యంత ప్రమాదకరం. 


☀ మిగతావారి కంటే వీరి శరీరం త్వరగా వేడెక్కి, నెమ్మదిగా చల్లబడుతుంది. అందుకే, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. 


☀ గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధి, ఊబకాయం, తక్కువ బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, మానసిక అనారోగ్యం, మద్యపానం ఉన్నవారికి కూడా ఈ వేసవి ప్రమాదకరమే. 


☀ చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా రుమాలు కట్టుకోవాలి. బైకు, స్కూటర్లపై వెళ్లేవారు సైతం చెవులు కవరయ్యేలా హెల్మెట్లు ధరించాలి. 


☀ వేడి గాలి వల్ల కళ్లు పొడిబారకుండా ఉండాలంటే సన్ గ్లాసెస్ తప్పకుండా పెట్టుకోవాలి. 


☀ తలకు నేరుగా ఎండ తగలకుండా ఉండేందుకు టోపీ ధరించాలి. 


☀ తెల్లని వస్త్రాలను మాత్రమే వేసుకోండి. బిగువైన దుస్తులు ధరించడం అంత మంచిది కాదు. 


☀ వ్యాయామానికి రెండు గంటల ముందు 24 ఔన్సుల ద్రవాన్ని త్రాగాలని, వ్యాయామానికి ముందు మరో 8 ఔన్సుల నీరు లేదా స్పోర్ట్స్ డ్రింక్‌ని తాగాలని వైద్యుల సిఫార్సు. వ్యాయామం చేసే సమయంలో, మీకు దాహం అనిపించకపోయినా, ప్రతి 20 నిమిషాలకు మరో 8 ఔన్సుల నీటిని తీసుకోవాలి.


☀ సూర్యోదయం సమయంలోనే పనులు చక్కబెట్టుకోండి. మిట్టమధ్యాహ్నం కాకుండా సూర్యస్తమయం సమయంలో ఇంటికి వెళ్లేలా ప్లాన్ చేసుకోండి.

 

☀ కెఫీన్ లేదా ఆల్కహాల్ ఉన్న ద్రవాలను అతిగా తీసుకోవద్దు. పూర్తిగా మానేసినా మంచిదే. ఎందుకంటే అవి మీ శరీరంలోని ద్రవాలను కోల్పోయేలా చేస్తాయి. శరీరాన్ని వేడెక్కిస్తాయి. 


☀ వేసవిలో కాసింత ఉప్పు పానీయం తీసుకోవడం మంచిదేనని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, రక్తపోటు సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకోవాలి.  


☀ రాత్రి వేళలల్లో ఇంటి కిటికీలు తెరిచి ఉంచి చల్లని వాతావరణం నెలకొల్పండి. 


☀ వడ దెబ్బకు గురై కోలుకున్న తర్వాత అలసటగా ఉంటారు. కాబట్టి, కొద్ది రోజులు పెద్ద పెద్ద పనులు, వ్యాయామానికి దూరంగా ఉండాలని నవీన్ రోయ్ వైద్యులు సూచిస్తున్నారు.

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE