NaReN

NaReN

Sunday, April 9, 2023

తల్లితండ్రులకు లేఖ

 తల్లితండ్రులకు లేఖ 



కోయింబత్తూర్ లోని ఒక పాఠశాల వేసవి సెలవులు ప్రకటిస్తూ తల్లితండ్రులకు ఒక లేఖ రాసింది. 


చదివితే అలాంటి మంచి విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలలో చదివించాలి పిల్లల్ని. 


ఆ లేఖ సారాంశం తర్జుమా చేసి ఇస్తున్నాను . నచ్చితే కాపీ పేస్ట్ చేసుకొని మీ వాల్ మీద , వాట్సాప్ లోనూ పంపించండి.

మోదుగు సైదులు


 ప్రియమైన తల్లితండ్రులారా,


గత పదినెలలుగా మీ పిల్లల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దడానికి మా శాయశక్తులా కష్టపడ్డాం.పిల్లలు పాఠశాలకు రావడానికి తహతహలాడేలా చేయడంలో విజయం సాధించాం అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. రాబోయే రెండు నెలలు , మీరు, పిల్లల సహజ సంరక్షకులు వారితో గడుపుతారు. పిల్లల్ని తీర్చిద్దిడానికి కొన్ని ఉపయోగపడే కొన్ని చిట్కాలు మీతో పంచుకుంటున్నాము వారి సెలవులు ఆనందంగా, ఉపయుక్తంగా ఉండడానికి. 


1. రోజూ రెండు పూటలా వారితో కలిసి భోజనం చేయండి. వారికి రైతులు పడే కష్టాలను వివరించండి. ఎంత శ్రమిస్తే పంట చేతికి వస్తుందో తెలియచేయండి. పదార్థాలు వృధా చెయ్యకుండా తర్ఫీదు ఇవ్వండి.


2. వాళ్ళు తిన్న భోజనం ప్లేటు ఎత్తడం, కడుక్కోవడం నేర్పించండి. వాళ్లకు శ్రమ విలువ తెలుస్తుంది. పని విలువ అర్ధమౌతుంది. మన పని మనం చేసుకోవడం నామోషీ కాదని తెలుస్తుంది.


3. పిల్లల్ని వంటింట్లోకి రానివ్వండి. వాళ్ళ సలాడ్స్ వాళ్లనే చేసుకొనివ్వండి. 


4.ప్రతిరోజూ ఐదు కొత్త ఆంగ్ల పదాలు నేర్చుకునేటట్టు చూడండి.


5.  మీ ఇంటి చుట్టుపక్కల వారితో పరిచయం చేసుకోమనండి. వాళ్ళతో ఒక అనుబంధం ఏర్పడనివ్వండి.


6. అమ్మమ్మ, బామ్మ , తాతగార్లతో కొన్నిరోజుల పాటు గడపనివ్వండి. పెద్దవారితో ఒక చక్కటి అనుబంధం ఏర్పడనివ్వండి. పెద్దవారి ప్రేమాభిమానాలు వారికి చాలా ఉపయోగం.


7. మీ పిల్లల్ని మీరు పనిచేసే చోటుకు తీసుకెళ్లండి. మీరెంత కష్టపడి పనిచేయడమే కాదు, వారికి మీ కష్టార్జిత విలువ తెలుస్తుంది.


8. వారం వారం జరిగే సంతకు తీసుకెళ్లండి. జాతర ఉంటే చూపించండి 


9. వాళ్ళకి మొక్కలు నాటడం , మొక్కల సంరక్షణ లాంటి పనులు చేయించండి.

పెరట్లో కానీ కుండీలలో కానీ విత్తనాలు నాటించండి. వాళ్లకు చెట్ల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి తెలియచేయండి. చెట్లు వృక్షాలు వారి జీవితంలో అంతర్భాగం అనే అవగాహన ఏర్పరచండి.


10. మీ చిన్ననాటి ఆనుభవాలను వారికి తెలియచేయండి.మీ కుటుంబ చరిత్ర గురించి అవగాహన కల్పించండి.


11. పిల్లలు సెలవులు పూర్తిగా ఇంట్లో ఉండకూడదు , బయట అడుకోవాలి అని ప్రోత్సహించండి. పిల్లలకు ఆటల్లో గాయపడడం సహజం, అలాగే ఆటలాడితే మురికిగా అవ్వడం కూడా సాధారణం. వాళ్ళకి నొప్పి తెలీనివ్వండి. అస్తమాను సోఫాyలో, కుర్చీల్లో కూర్చుంటే బద్దకస్తులుగా తయారౌతారు. 


12. పెంపుడు జంతువులు పెంచుకొనివ్వండి.


ఆలోచించండి...

మూర్ఖుని మనస్సు

 మూర్ఖుని మనస్సు


*ఓ గాడిద పులితో ఇలా అన్నది...‘గడ్డి నీలం రంగులో భలేగా ఉంది అని’*


పులి విసురుగా బదులిచ్చింది...

‘కాదు, గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంది’


రెండింటి నడుమ వాగ్వాదం పెరిగింది... వాతావరణం వేడెక్కింది... రెండూ కలిసి ఆ అడవికి రాజైన సింహం వద్దకు వెళ్లాయి...రెండూ సింహం కోర్టులో తమ వాదనలు వినిపించాయి...


సింహం తీర్పు చెప్పింది... *‘‘పులిదే తప్పు అని"* ఏడాదిపాటు ఎవరితోనూ మాట్లాడకూడదని

నిశ్శబ్దంగా ఉండే శిక్ష విధిస్తున్నాను...’’


గాడిద ఆనందంతో ఎగిరి గంతేసి, తన మందతో పంచుకోవడానికి, నీలం గడ్డి నీలం గడ్డి అని అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది...


పులి సింహం విధించిన శిక్షను అంగీకరిస్తూనే... భయంభయంగానే సింహాన్ని అడిగింది... ‘‘ఆర్యా, గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉన్నా సరే, నన్నెందుకు శిక్షిస్తున్నారు...’’


సింహం ఇలా బదులిచ్చింది... ‘‘నేను నీకు శిక్ష విధించింది గడ్డి రంగు గురించి కాదు, తెలివైనదానివి, ధైర్యమున్నదానివి...ఆ గాడిదతో పనికిమాలిన వాదన పెట్టుకున్నందుకు..."


వాస్తవమేమిటో పట్టని ఓ మూర్ఖపు గాడిదతో వాదన పెట్టుకోవడం కాల హరణం కాదా..? గాడిదకు దాని నమ్మకాలు, భ్రమలే దాని జీవితం... ఇలా కొన్ని మూర్ఖపు జంతువులు ఉంటాయి, *మనం ఎన్ని ఆధారాలు చూపించినా తమ వాదననే నమ్ముతాయి, ఎవరేం చెప్పినా వినవు... అర్థం చేసుకోవు, అందుకే వాటిని గాడిదలు అంటారు...* 


*అజ్ఞానం అరుస్తున్నప్పుడు, తెలివితేటలు నిశ్శబ్దంగా ఉంటాయి...నీ ప్రస్తుత నిశ్శబ్దం చాలా విలువైనది... ఇకనైనా గాడిదల జోలికి ఎప్పుడూ వెళ్లకు...* 


*తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు -*

*భర్తృహరి సుభాషితం*


తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు

దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు

తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు

చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.


*భావం:-*  ప్రయత్నము చేత ఇసుక నుంచి చమురు తీయవచ్చును. ఎండమావి యందును నీరు త్రాగవచ్చును. తిరిగి తిరిగి కుందేటి కొమ్ము నైనను సాధింపవచ్చును.

 *కాని మూర్ఖుని మనస్సును మాత్రం సమాధాన పెట్టుట సాధ్యము కాదు.*

Saturday, April 8, 2023

కొంచెం రిలాక్స్ కోసం...🤪🤪😂😂🤣🤣

 కొంచెం రిలాక్స్ కోసం...🤪🤪😂😂🤣🤣


'నాన్నా .. అమెరికా లో నా ఉద్యోగం పోయేలా ఉంది '


'ఏం ఫర్లేదు .. వెంటనే ఇక్కడికొచ్చేయి '


'వచ్చి ఏం చెయ్యాలి ?'


'ఓ స్కూలు పెట్టు ?'


'ఏ స్కూలు ? డ్రైవింగ్ స్కూలా ?'


'నీ మొహం .. ఇంటర్నేషనల్ స్కూలు .. స్టార్టెడ్ బై ఫారిన్ రిటర్న్డ్ ఎన్నారై అని టాగ్ లైన్ పెడదాం '


'ఎన్నారై అంటేనే ఫారెన్ కి వెళ్లినవాడు కదా .. మళ్ళీ ఫారిన్ రిటర్న్డ్ ఎందుకు ?'


'నువ్వు తిరిగొస్తున్నావుగా ..అందుకు .. అయినా మన వాళ్ళు ఫారిన్ రిటర్న్డ్ అంటే బొద్దింకనైనా నెత్తినెట్టుకుంటార్రా .. '


'సరే .. స్కూలెక్కడ పెడదాం ? బోల్డు స్థలం, పర్మిషన్లు  గట్రా కావాలి కదా '


'ఏవఖ్ఖర్లేదు .. మన అపార్ట్మెంట్ కాంప్లెక్సులో నువ్వు పంపిన డబ్బుల్తో మూడు ఫ్లాట్లు కొన్నాం కదా .. రెండు ఫ్లాట్లు కలిపి స్కూలెట్టేద్దాం '


'అపార్టుమెంట్లో స్కూలా ?.. జనం వస్తారా ?'


'జనందేముంది ?.. ఏవెట్టినా వస్తారు .. కొంచెం హడావిడి చెయ్యాలంతే .. '


'హడావిడి ఏమిటి ?'


'అంటే .. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అఫ్ కిడ్స్ , మల్టీ-లాంగ్వేజ్ స్కిల్స్ , టాబ్లెట్ బేస్డ్ టీచింగ్, హార్స్ రైడింగ్ , స్విమ్మింగ్  లాంటివి బ్రోచర్ లో పెట్టామంటే .. ఇంక చూస్కో '


'ఏమిటీ ..అవన్నీ నేర్పిస్తామా ?'


'మరదే ..రోజూ చిప్సూ , అడ్డమైన చెత్తా మన స్కూల్లో కొనిపిస్తాం కదా ..గుండ్రం గా పెరుగుతారు.. అదే ఆల్రౌండ్ డెవలప్మెంట్  , ఇంక ఆళ్ళు ఎలాగా ఇంట్లో ఇంగ్లిష్ మాట్లాడతారు , మన స్కూల్లో తెలుగు , హిందీ చెప్పేమనుకో అదే మల్టీ లాంగ్వేజ్ స్కిల్స్ .. టాబ్లెట్ లో గేమ్స్ నేర్పిద్దాం .. టాబ్లెట్ బేస్డ్ టీచింగ్ .. ఆళ్లిచ్చే డొనేషన్ తో వచ్చే ఏడాది కల్లా .. శంషాబాద్ తర్వాత చీపుగా ల్యాండ్ కొనేసి ఇంటర్నేషనల్ క్యాంపస్ అని ఓ బిల్డింగ్ కట్టేసి , పక్కనే ఒక స్విమ్మింగ్ పూలూ , ఓ రెండు గుర్రాలూ కొన్నామంటే సరిపోద్ది '


'బావుంది ..కానీ ఇన్నేసి స్కూళ్ళు ఉండగా మన స్కూలుకే ఎందుకెక్కువగా రావాలి ?'


'ఎందుకంటే .. మన స్కూల్లో ఫీజెక్కువ కాబట్టి .. మన ఎదవ జనానికి రేటెక్కువ అంటే క్వాలిటీ ఎక్కువ కామోసనుకునే వెర్రి ఉందిగా మరి !'


'మరి పర్మిషన్లు ?'


'పర్మిషన్లదేముంది ? గులాబీ రంగు బోర్డెట్టి , గులాబీ రంగు యూనిఫారం పెట్టి , లోకల్ ఎమ్మెల్యే ని ఓపెనింగ్ కి పిలిచేమంటే , మనం స్కూలు రోడ్డు మీదెట్టినా ఎగురుకుంటూ వచ్చి, పర్మిషన్లిచ్చి, ఓపినింగు చేసేస్తాడు '


'బావుంది ..స్కూలుకి పేరేం పెడదాం?.. తాతయ్య పేరెడదామా ?'


'నువ్వింకా ఎదగలేదురా ఎదవా .. జోగారావు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ అని పెడితే ఎవ్వడూ రాడు .. అందుకే ..


'ఆఁ ..అందుకే ?'


'సెయింట్ జోగా ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్, బై ఎన్నారైస్ , ఫర్ ఎన్నారైస్ , ఆఫ్ ఎన్నారైస్  అని పెట్టేమంటే గచ్చిబౌలి నుంచి అమీర్ పేట దాకా ఉన్న వెర్రాళ్లందరూ ఎగబడి మరీ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేసేస్తారు '. 😄😄😄

Friday, April 7, 2023

లంగూడీ అంటే తెలుసా

 ✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️


                   *లంగూడీ* 

                🟰🟰🟰🟰🟰

ఓ రోజున తెలుగు మేష్టారు సెలవు పెడితే ఆ క్లాసుకి నన్ను వెళ్ళమన్నారు   హెడ్మాష్టారు.

నాకు తెలుగులో పాండిత్యం లేదనీ, వ్యాకరణం క్షుణ్ణంగా చదివి ఉండలేదనీ యెట్లా తెలిసిందో మరి; కొందరికి తెల్సింది. తెల్సిందని నేనను కొంటున్నాను. లేకపోతే ఓ కుర్రాడు లేచి నాప్రాణానికి ' లంగూడీ అంటే ఏమిటండీ' అంటూ ఎందుకు అడుగుతాడు? 

లంగూడీ! లంగూడీ ఏమిటి? ఇదెక్కడి మాటరా దేవుడా! ఎప్పుడూ వినలేదే!

నాలో బయలుదేరిన గాభారాని పైకి కనబడనీయకుండా కోపంగా ముఖం పెట్టి 

' సమాసంబులం బ్రాతాదుల తొలియచ్చు' సూత్రం అర్థం అయిందా? అన్నా.

అది అర్థం అయిందండీ లంగూడీ యే అర్థం కాలేదండీ అన్నాడు వాడు.

అతగాడి వరస చూస్తే యుద్ధానికి సిద్ధం అవుతున్న ప్రత్యర్థిలా కనిపించాడు.

ఓటమి నంగీకరంచ కూడదు.  అందుకే బింకంగా వ్యాకరణం క్లాసులో ఇతర విషయాలు అడక్కు అన్నా.

' ఇది వ్యాకరణానికి సంబంధించిన దేనండీ ' వాడెంత సౌమ్యంగా అన్నా నా ప్రాణాలతో ఆడుకుంటున్నట్లు అనిపించింది. 

అప్పటికే పిల్లలు ఒకరి మొఖం ఒకరు చూసుకొంటూ తలలు వంచుకుని ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు. ఇంతలో నా పాలిటి భగవంతుడులా  స్కూలు ప్యూను బెల్లు కొట్టేడు. బ్రతుకు జీవుడా అనుకుని దాని అర్థం వచ్చే క్లాసులో చెప్తా లేవోయ్ అని బయట పడ్డాను.

తర్వాత ఆ మాట కోసం ఎన్ని నిఘంటువుల్ని తిరగేశానో లెఖ్ఖ లేదు!

ఎవర్నైనా అడుగుదామంటే నామోషీ. అసలు అసలలాటి పదం ఉందో  లేదో తెలీదు.

'మేష్టారూ వాడు మిమ్మల్ని ఏడిపించడానికి అన్నట్టున్నాడండీ అని వాళ్ళు నవితే?

అందుకే ఆ సంగతి అంతటితో మరిచి పోయాను.  కనీసం మరిచిపోయినట్లు నటించాను.

కానీ, ఆ గడుగ్గాయి కుర్రా డెందుకు మరిచి పోతాడు?  నన్ను ఏడిపించ డానికే కంకణం కట్టుకొన్నాడు. తర్వాత క్లాసులో అడగనే అడిగేడు.  నేను భయపడి నంతా అయ్యింది.

నేను తెల్లమొహం వెయ్యడం, తబ్బిబ్బు పడడం, వాడు కూర్చోకుండా అర్థం చెప్పవలసిందే అన్నట్లు జండా కొయ్య లాగా నుంచునే ఉండడం, తక్కిన పిల్లల్లో కొందరు చాటుగానూ, కొందరు బాహాటంగానూ నవ్వుతూ ఉండడం - నాకు తెలియదు అని చివరికి ఓటమిని అంగీకరించి ' అయినా ఎక్కడుంది ఆ మాట? ' అని చిరాకు పడ్డాను.

ఇదిగోనండీ ఈ వ్యాకరణ పుస్తకంలో అంటూ ముందుకు వచ్చాడు. నా గుండె గుభిల్లుమంది.  తీరా  వాడిచ్చిన పుస్తకం చూద్దును కదా నాకూ నవ్వు వచ్చింది.  అప్పటికే సముద్రఘోషలా ఉంది క్లాసంతా నవ్వులతో.  

ఇంతకీ అదేంటో తెలుసాండీ?.....చిన్నయ సూరి వ్యాకరణ సూత్రంలో మాట అది. " ఇ, ఈ, ఎ, ఏ లం గూడి " అని. లం అనే అక్షరాన్ని దాని ముందు అక్షరంతో కలపకుండా తర్వాత అక్షరంతో కలిపి చదివి నా ప్రాణమూ పరువూ రెండూ తీశాడు.

తెలియక అలా చేశాడంటారా? ఒక్క నాటికీ నమ్మను.


తొలి శాసనంలో తెలంగాణం!!

 *తొలి శాసనంలోతెలంగాణం!!*


" తెలంగాణ " పదాన్ని తొలిసారిగా ప్రస్తావించిన "శాసనం" రాజదాని హైదరాబాదుకు సమీపంలోనే వుందన్న

విషయం చాలామందికి తెలియదు!!

సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం

BHEL కంపెనీ  లింగంపల్లి దగ్గరలో గల

"తెల్లాపూర్" గ్రామంలో వున్న ఈ శాసనాన్ని

తెల్లాపూరు శాసనంగా తెలంగాణ శాసనంగా

వ్యవహరిస్తారు!!

దీన్ని వేయించింది #విశ్వకర్మ వంశస్థులైన

నాగోజు, అయ్యలోజు, వల్లభోజులు!!


ఈ శాసనాన్ని చెక్కింది ఓజు రుద్రోజు, సిరిగిరోజులు!! క్రీ.శ. 8-1-1418 నాటిది ఇది!!

24 పంక్తులు గల ఈ శాసనం దాదాపు

600 ల సంవత్సరాలనాటిది!! ఇది 1986లో

లభించింది!! ఈ శాసనము 13వ పంక్తిలో

#తెలంగాణపురం అని వున్నది!! అది రాను

రాను తెల్లాపూరు గ్రామంగా మారింది!!


*శాసనసంగ్రహం!!*


#విశ్వకర్మ వంశంలో జన్మించిన మయిలోజు

పుత్రుడు పోచోజు. ఇతని కుమారుడు నాగోజు

ఈయన కుమారుడు మల్లోజు!!

మల్లోజు  పుత్రులైన నాగోజు, అయ్యలోజు,

వల్లభోజులు  తెలంగాణాపురంలో "నడబావి"

ని ఆచంద్రార్కం వుండేలా నిర్మించారు!!

ఈ బావికి  కలు కంబాలు(రాతిస్థంబాలు)

ఏతామును నిర్మించి, నీటిని ఉత్తర కొసన

వన్న మామిడితోటకు పారేవిధంగా ఏర్పాటు

చేశారు!(ఇందులో వున్న "ఉత్తరంపుగొమ్మనం"

పెట్టించిన మామిడివనం)అనే పదప్రయోగం

వున్నది! మేము మామిడివనం పెట్టినం!

మామిండ్లు మా ఇండ్లు అనే ప్రయోగాలు

తెలంగాణాలో వాడుకలో వున్నాయి!!


మరోవ్యక్తి అయ్యలోజు అప్పటి బహమనీ

సుల్తాను తాజుద్దీను ఫిరోజు షా పట్టపురాణికి

బంగారు గాజులు, మెడలో హారాలు చేశారట!

అంటే ఆ వంశస్థులకు ఆనాటి పాలకులతో

మంచి సంభంధాలు వుండేవి అని తెలుస్తుంది!


*ప్రస్తుతం*


చుట్టూ ఇళ్ళమధ్యన కాసింత స్థలంలో

నాలుగున్నర ఎత్తైన పీఠం మీద వేప చెట్టు

కింద ఆలయాల్లో వుండే "నాగినశిల"ను

తలపిస్తూ నిలచి వుంది ఈ శాసనం!!

విశ్వకర్మ వంశస్థులు నిర్మించిన "నడబావి"

ఇప్పుడు లేదు. 


*కొసమెరుపు*


* ఒకప్పటి విశ్వకర్మ వంశస్థుల వైభవం! వారే

శాసనాలు లిఖంప జేశారంటే అక్కడి ప్రాంత

సామంత ప్రభువులైనా వుండాలి!! లేదా గ్రామ

అధికారులైనా అయివుండాలి!!


* శాసనాలు చెక్కడంలో కానీ రాగి రేకులపై

చారిత్రక అంశాలతో పాటు, పురాణగాథలను

కానీ మంత్ర,యంత్ర విషయాలను వ్రాయటం లో గాని విశ్వకర్మీయులది అందె వేసిన చేయి!!


*వారు "ఓజు" లు అని పిలువబడేవారు!!

తాళపత్ర గ్రంథాలు లిఖించటంలో కూడ

వారు నైపుణ్యమును ప్రదర్శించేవారు!!

వారు "వ్రాయసగాండ్లు"గా ప్రసిద్ధినొందారు!!


*దేవాలయ శిల్పంలో కానీ ఆగమశాస్త్రాదుల

యందుగాని వారు బహు ప్రవీణులు!!

చారిత్రక శాసన నిర్మాణకర్తలు!!విశ్వకర్మలు!!

మొత్తము భారతజాతి వారికి ఋణపడివుంది!

దయచేసి నవ్వండి!

 *దయచేసి నవ్వండి!*

 మీరు ఉపాధ్యాయులైతే, మీరు నవ్వుతూ తరగతిలో ప్రవేశిస్తే, పిల్లల ముఖం పైన చిరునవ్వును చూస్తారు!


*దయచేసి నవ్వండి*

మీరు వైద్యులైతే, రోగికి నవ్వుతూ చికిత్స చేస్తే, అప్పుడు రోగి యొక్క విశ్వాసం రెట్టింపు అవుతుంది.


*దయచేసి నవ్వండి*

మీరు గృహిణి అయితే, ఇంటి పనులన్నీ నవ్వుతూ చేయండి, ఆపై చూడండి మొత్తం కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.


*దయచేసి నవ్వండి*

మీరు ఇంటి పెద్ద అయితే, మీరు సాయంత్రం నవ్వుతూ ఇంట్లోకి ప్రవేశిస్తే, మొత్తం కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది.


*దయచేసి నవ్వండి*

మీరు ఒక వ్యాపారవేత్త అయితే మీరు సంతోషంగా కంపెనీలోకి ప్రవేశిస్తే, ఉద్యోగులందరి మనస్సు యొక్క ఒత్తిడి తగ్గుతుంది చూడండి.

 

*దయచేసి నవ్వండి*

మీరు దుకాణదారులైతే, నవ్వుతూ మీ కస్టమర్‌ను గౌరవిస్తే, కస్టమర్ సంతోషంగా ఉంటాడు, మరియు మీ దుకాణం నుండి వస్తువులను తీసుకుంటాడు, మీ బిజినెస్ పెరుగుతూనే వుంటుంది.


*దయచేసి నవ్వండి*

తెలియని వ్యక్తి వీధిలో తారసపడితే  వారిని చూసి చిరునవ్వు నవ్వండి, అతని ముఖం పై కూడా నవ్వు ని చూడవచ్చు, వాతావరణం ప్రశాంతత సంతరించుకుంటుంది.


*దయచేసి నవ్వండి*

ముఖం పై చిరునవ్వు కోసం  ఎలాంటి ఖర్చు అవసరం లేదు, కానీ చిరునవ్వు వల్ల మనతో పాటు మనవారి జీవితాల్లో అనందం చూడవచ్చు.


*దయచేసి నవ్వండి*

ఎందుకంటే మీ చిరునవ్వు చాలా ముఖాల్లో చిరునవ్వు తెస్తుంది.


*దయచేసి నవ్వండి*

ఎందుకంటే మీరు ఈ జీవితాన్ని మళ్ళీ పొందలేరు.


*దయచేసి నవ్వండి*

కోపంలో ఇచ్చిన దీవెనలు కూడా చెడుగా కనిపిస్తాయి, మరియు నవ్వుతూ, ప్రేమతో తిట్టినా కూడా బాధకలగదు, బాగుంటాయి.


*దయచేసి నవ్వండి*

ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి వికసించే పువ్వులు, వికసించే ముఖాలు ఇష్టపడతారు.


*దయచేసి నవ్వండి*

ఎందుకంటే మీ నవ్వు ఎవరికైనా ఆనందాన్ని కలిగిస్తుంది.


*దయచేసి నవ్వండి*

ఎందుకంటే ఒకరినొకరు చూసుకున్న తర్వాత మనం నవ్వుతూనే ఉన్నంతవరకు కుటుంబంలో సంబంధాలు బాగాఉంటాయి.


*దయచేసి నవ్వండి*

ఎందుకంటే ఇది మానవుడి గుర్తింపు. ఒక జంతువు నవ్వలేదు. మానవులు మరియు జంతువుల మధ్య వ్యత్యాసం ఇదే! అందువల్ల, మీ స్వంతంగా చిరునవ్వు నవ్వి ఇతరుల ముఖంలో చిరునవ్వు తెచ్చుకోండి.

 *మొత్తం మీద*

*నవ్వటం ఒక యోగం.!*

*నవ్వించటం ఒక భోగం.!*

*నవ్వక పోవటం ఒక రోగం*!

Thursday, April 6, 2023

తిన్న ఆహారం అరగకపోతే

 *💁🏻‍♂️ తిన్న ఆహారం అరగకపోతే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది.*

〰〰〰〰〰〰〰〰

    *తిన్న ఆహారం అరగకపోతే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. తద్వారా కడుపులోనూ.. ఛాతిలోనూ మంట మొదలవుతుంది. మరి దీని నుంచి బయపడటం ఎలా? ఈ సమస్యకు ఇంట్లో దొరికే వస్తువులతో చెక్ పెట్టేయవచ్చా? లేదంటే దీని కోసం కూడా మెడికల్ షాపునకు పరిగెత్తాలా?*

   *Indigestion: తిన్న ఆహారం అరగకపోవడం వల్ల కడుపులో మంట.. గ్యాస్ సమస్యతో పడలేకపోతుంటే ఈ ఒక్కటి చేయండి చాలు..!*

    *తిన్న ఆహారం అరగకపోతే కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. తద్వారా కడుపులోనూ.. ఛాతిలోనూ మంట మొదలవుతుంది. మరి దీని నుంచి బయపడటం ఎలా? ఈ సమస్యకు ఇంట్లో దొరికే వస్తువులతో చెక్ పెట్టేయవచ్చా? లేదంటే దీని కోసం కూడా మెడికల్ షాపునకు పరిగెత్తాలా? అంటే వంటింటి చిట్కాలు సరిపోతాయి అనడం కన్నా అద్భుతంగా పనిచేస్తాయనడం మేలేమో. ముఖ్యంగా మన ఆహార అలవాట్లు లేదా జీవనశైలి కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి అనేక సమస్యలు వస్తుంటాయి. వీటికి మన వంటింట్లో ఉండే ఇంగువ, వాముతో చెక్ పెట్టేయవచ్చు.*

*🍃ఇంగువతో ఆరోగ్య ప్రయోజనాలు..*

   *జీర్ణక్రియ మెరుగుపడటానికి ఇంగువ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక భారతీయ వంటకాలలో ఇంగువను సర్వసాధారణంగా ఉపయోగిస్తారు. ఇంగువలో ఉండే యాంటీ-వైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొత్తం ఆరోగ్యానికి చాలా సహాయపడతాయి. ఇంగువను నీటిలో కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా, వేగవంతమవుతుంది.*

*🍃వాముతో ఆరోగ్య ప్రయోజనాలు..*

   *వాములో ఉండే థైమోల్ కడుపులో గ్యాస్ట్రిక్ రసాన్ని విడుదల చేయడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంగువ, వాము కలిసి అజీర్ణం, ఆమ్లత్వానికి అద్భుతమైన ఔషధంగా పని చేస్తాయి. అందుకే ఇంగువ, వాము నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.*

*🍃ఇంగువ, వాము కలిపిన వాటర్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు..*

   *ఇంగువ, వాము కలిపి నీటిలో నానబెడితే వాటిలో ఉండే పోషకాలు నీటిలోకి వచ్చేస్తాయి. ఇక ఆ నీటిని తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అజ్వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మీ శరీరాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా దగ్గు, జలుబు మరియు ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి కూడా ఇంగువ, వాము నీరు ఉపయోగపడతాయి. ఈ నీటిని తీసుకోవడం వల్ల ఆహారం చక్కగా జీర్ణమై బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.*

*🍃ఇంగువ, వాము వాటర్ ఎలా తయారు చేసుకుంటే ప్రయోజనం?*

   *ఇంగువ, వాము నీటిని తయారు చేయడం చాలా సులభం. ఒక పాన్‌లో ఒక గ్లాసు నీరు తీసుకుని, వాటిలో ఒక స్పూన్ వాము వేసి బాగా మరిగించాలి. ఇక ఆ నీటిలో నాలుగో వంతు ఇంగువ.. నల్ల ఉప్పు వేసి బాగా కలపి దానిని తీసుకోండి.*

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE