NaReN

NaReN

Saturday, April 1, 2023

స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం..

 స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం..

 

రామునికి       —       సీత

కృష్ణునికి        —       రాధ 

ఈశునకు      —    ఈశ్వరి

మంత్ర పఠనంలో —   గాయత్రి 

గ్రంధ పఠనంలో    —      గీత

దేవుని యెదుట

     వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన

     వీరికి తోడుగా  శ్రద్ధ


మన దినచర్యలో భాగంగా

ఉదయానికే—ఉష, అరుణ

సాయింత్రం     —   సంధ్య

చీకటైతే           —   జ్యోతి, దీప

పడకలో -            మేనక 

పడుకున్నాక    —   స్వప్న


చూచేటప్పుడు— నయన

వినేటప్పుడు  —   శ్రావణి

మాట్లాడునప్పుడు—వాణి

ఓరిమిలో        -వసుధ

వడ్డించేటప్పుడు-అన్నపూర్ణ

నడుస్తున్నప్పుడు—  హంస

నవ్వుచున్నప్పుడు  —  హాసిని, ప్రసన్న

అద్దంలో చూస్తే—  సుందరి

చేసేపనికి  -స్పూర్తి

పని చేయడానికి    —  స్పందన

మంచి పనికి —  పవిత్ర

ఇష్టంగాచేసే పనికి  —  ప్రీతి

నీరు త్రాగునపుడు —  గంగ

ఐస్క్రీమ్ తినేటప్పుడు —  హిమజ

సినిమా చూస్తున్నప్పుడు —  చిత్ర

అబద్ధ మాడునపుడు —  కల్పన

నిజం చెప్పేటపుడు —సత్యవతి, నిర్మల

ఆలోచనలప్పుడు  —  ఊహా, భావన

చదువుచున్నప్పుడు  —  సరస్వతి

వ్యాపారంలో      —   ప్రతిభ , ప్రగతి

సంతోషంలో—   సంతోషి

కోపంలో       —   భైరవి

ఆటలాడునప్పుడు—  ఆనంది 

గెలుపు కోసం— జయ, విజయ

గెలిచిన తర్వాత  —   కీర్తి

     

      సరిగమలు నేర్చునపుడు  —  సంగీత

      పాటలు పాడునపుడు  —  శృతి, కోకిల

      తాళం వేయునపుడు  —   లయ

      

సాహిత్య గోష్టిలో    —   కవిత 

నగరాన్ని కాపాడుతూ  —   ప్రకృతి


జీవిత గమనంలో మనతో

విద్యాభ్యాసంలో  —   విద్య

సంపాదనప్పుడు —   లక్ష్మి

చేసేవృత్తిలో        —   ప్రేరణ,

పని చేసి వచ్చాక —  శాంతి

చిన్నతనంలో — లాలన

మధ్యవయస్సులో -మాధురి

ముసలితనంలో- కరుణ, మమత

జీవితాంతం మనతో  —  “జీవిత”.🙏 


బాగుంది కదా!మన తెలుగుభాష యొక్క గొప్పతనం.


🌹💐🙏🙏

ప్రతి తండ్రి గొప్పగా,గర్వంగా ఉండండి.

 ప్రతి తండ్రి గొప్పగా,గర్వంగా ఉండండి.


ఒక గర్భవతైన భార్య,

*ఆమె భర్త ఇలా*

*మాట్లాడుకుంటున్నారు..*


*భార్య:* 


ఏం అనుకుంటున్నావ్..?

అబ్బాయి పుడతాడనా ?

అమ్మాయనా..??


*భర్త:*


అబ్బాయనుకో...

వాడికి లెక్కలు

నేర్పుతాను...

ఇద్దరం కలిసి గేమ్స్

ఆడుకుంటాం... 

స్విమ్మింగ్

నేర్పుతా... 

చెట్లెక్కడం

నేర్పుతా... 

అమ్మాయిలతో 

ఎలా మాట్లాడాలో

నేర్పుతా... ఇంకా....


*భార్య:*


చాలు చాలు! 

మరి అమ్మాయి పుడితే..!?


*భర్త:* 


అమ్మాయైతే 

ఏం నేర్పనవసరంలేదు...!

అదే నాకు

నేర్పుతుంది... 


నేనేం తినాలి... 

ఏం తినకూడదు...

ఏం మాట్లాడాలి... 

ఏం మాట్లాడకూడదు... 

నేను ఎలాంటి బట్టలు

వేసుకోవాలి... 


ఒక రకంగా 

మా అమ్మ లాగా

అన్నమాట... 


ఇంకా నేను దానికి

ప్రత్యేకంగా ఏం

చేయకపోయినా 

నన్ను హీరోలా చూసుకుంటుంది... 


నన్నెవరైనా

బాధపెట్టారనుకో, 

వాళ్ళని అస్సలు

క్షమించదు... 

ఎదురు తిరుగుంది... 


భర్త దగ్గర కూడా 

నాగురించి గొప్పగా

చెప్తుంది... 

మా నాన్న నాకోసం 

అది చేసాడు... 

ఇది చేసాడు అనీ... 


*భార్య:*


సో..అమ్మాయైతే ఇవన్నీ

చేస్తుంది... 

అబ్బాయైతే 

చేయడంటారు

అంతేగా..??


*భర్త:*


కాదు..

అబ్బాయైతే ఇవన్నీ

మనల్ని చూసి నేర్చుకుని

చేస్తాడు... 


అమ్మాయికి 

బై బర్త్ వచ్చేస్తాయ్... 


*భార్య:*


అదేం 

శాశ్వతంగా మనతోనే 

ఉండిపోదు కదా..!


*భర్త:*


ఉండదు... 

కానీ మనం దాని గుండెల్లో

ఉండిపోతాం... 


అందుకని 

అది ఎక్కడ ఉంది 

అన్నది సమస్య కాదు..!


Daughters 

are Angles... 

Born with

unconditional 

love and care forever...


అందుకని 

ఆడపిల్లల

తల్లిదండ్రులు

అదృష్టవంతులు...


కూతురంటే కూడికల,

తీసివెతల లెక్క కాదు

నీ వాకిట్లో పెరిగే 

'తులసి మొక్క'... 


కూతురంటే 

దించేసుకొవలసిన 

బరువు కాదు..

నీ ఇంట్లో వెలసిన 

'కల్పతరువు'... 


కూతురంటే 

భద్రంగా చూడవలసిన

గాజు బొమ్మ కాదు... 

నీ కడుపున పుట్టిన 

మరో "అమ్మ"... 


కూతురంటే

కష్టాలకు,కన్నీళ్ళకు

వీలునామా కాదు ...

కల్మషం లేని 

'ప్రేమ' కు చిరునామా...


కళ్యాణమవగానే 

నిన్ను విడిచివెళ్ళినా...

పరిగెత్తుకొస్తుంది నీకు 

ఏ కష్టమెచ్చినా... 


తన ఇంటి పేరు

మార్చుకున్నా

కడదాకా వదులుకోదు

పుట్టింటి పైన ప్రేమను...


కొడుకులా

కాటి వరకు

తోడురాకపోయినా... 

అమ్మ అయి 

నీకు ప్రసాదించగలదు 

మరో జన్మ...


కూతురున్న 

ఏ ఇల్లు అయినా

అవుతుంది.. 

దేవతలు 

కొలువున్న కోవెల... 


*కూతురిని కన్న* 

*ఏ తండ్రి అయినా* 

*గర్వపడాలి యువరాణిని*

*కన్న మహారాజు లా..*💐

Thursday, March 30, 2023

1850 లలో ఫేస్ బుక్

 *1850 లలో ఫేస్ బుక్ ఉండి ఉంటే, అప్పట్లో చాటింగ్ ఎలా సాగేదో తెలుసా...!*

*అతడు :- సఖీ…!*

*ఆమె :- ప్రియా…!*

*అతడు :- రాత్రి భోజనము పూర్తి అయినదా ?*

*ఆమె :- అయినది. మరి మీరు భుజింతిరా ?*

*అతడు :- ఎపుడో...!*

*ఆమె :- ఇంకా ?*

*అతడు :- ఇపుడే ముఖ వాచకమును తెరిచితిని. అందు తమరు ఎగుమతి చేసినట్టి “స్వతః చిత్రము” మహత్తరముగానున్నది. వేల ఇష్టములను నొక్కవలెనన్న పరవశము కలిగినది మాకు. కానీ ఒక ఇష్టము మాత్రమే లెక్కకు వచ్చును కదా !*

*ఆమె :- నా యొక్క స్వతః చిత్రము తమకు అంతగా నచ్చినదా ప్రియా ?*

*అతడు :- అవును దేవి. మీ వెనకాల జాలువారుచున్నట్టి జలపాతపు అందాలు తమ అధరహాసపు సౌందర్యము ముందు తేలిపోవుచున్నవి.*

*ఆమె :- పోండి స్వామి. మీరు మరీనూ…*

*అతడు :-ముఖవాచకము నందు ఆ యొక్క చిత్రము కిందనే వ్యాఖ్యను లిఖించితిని కదా సఖి. తమరు దానిని చదవనే లేదా ? ఇతరులు దానిని చదవకనే చదువుచూ లెక్కకు మించి ఇష్టములను నొక్కుచున్నారు.*

*ఆమె :- చదవకనేం...! పలు మార్లు పరిపరి విధములా చదివితిని. మిక్కిలి ఆనందమున మునిగితిని. ఇంకనూ ఆయొక్క మకరందపు మడుగులో నుండి పైకి తేలలేక పోవుచున్నాను.*

*అతడు :- అటులనా ?*

*ఆమె :- అవును స్వామీ…*

*అతడు :- ఇంకా...?*

*ఆమె :- మీరే చెప్పాలి.*

*అతడు :- వర్షము ఎడతెరిపి లేకుండగా కురియుచున్నది. అంతర్జాలమునకు సంకేతములు బహు అల్పముగా అందుచున్నవి. సందేశముల పంపకమునకు అంతరాయము కలుగుచున్నది. ఇక పడుకునెదము. ప్రాతః కాలమున మరలా శుభోదయముతో పలకరించుకొందాము.*

*ఆమె :- అవును స్వామీ... ఇక పవళింపవలెను. మీకు శుభరాత్రి.*

*అతడు :- అటులనే దేవి. మీకును నా తరుపున శుభరాత్రి మరియు మధుర కలలు.💐*

Tuesday, March 28, 2023

ఆడవాళ్లు వేసుకునే జడ ల వల్ల లాభాలు

 ఆడవాళ్లు వేసుకునే జడ ల వల్ల లాభాలు సంప్రదాయాలు...


*చదవండి,ఆడవాళ్లు వేసుకొనే కొప్పు, ఒకజడ ,రెండుజడలవెనుక, ఆంతర్యమేమిటి, దేనికి సంకేతాలు?*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


*🌿మన సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహార  శాస్త్రంలో చెప్పబడినట్టుగా కొన్ని సంకేత రూపముగా... స్త్రీలకు ప్రత్యేక ఆచార కట్టుబాట్లు పెట్టారు.*


*🌸1) అమ్మాయి రెండు జడలు వేసుకుంటుందీ అంటే (చిన్నపిల్లలు ,యుక్తవయసు బాలికలు ) ఇంకా పెళ్లి_కాలేదూ అని అర్ధం  అంటే జీవేశ్వర సంభంధం ఇరువురిగా ఉన్నారు,*


*🌿ఇంకా ఒక్కటిగా కాలేదు, వివాహం కాలేదు అని అర్ధం . స్వేచ్ఛగా విహరిస్తుంది ,ఆనందంగా ఉంది అని చెబుతారు .*


*🌸2) ఏ అమ్మాయైతే ఒక జడ వేసుకుంటుందో ఆమెకు వివాహం_జరిగిపోయింది అని భావం...*


*🌿ఇక్కడ రెండు జడలు ఒక్కటి అవడం ... ఒక్కటి అవడం అంటే రెండు జడలే ఉంటాయా... కాదు, మూడుగా త్రివేణీ సంగమంగా (వేణీ అంటే తమిళపాదం లో జడ ) చెబుతారు ,మూడు పాయలుగా అల్లుకుని ఉంటేనే ఒక జడ అల్లడానికి వీలవుతుంది.*


*🌸మూడూ అంటే 1) నేనూ 2) భర్త 3) సంతానం (కావచ్చు ,కాకపోవచ్చు ) అనేభావం ,అలాగే జీవుడు ,ఈశ్వరుడు ,ప్రకృతీ ,మాయ మొహం అని అర్ధం . సత్వ ,రజో ,తమో గుణాలుగా ఉంటాయని అర్ధం.*


*🌿3) ఒకవేళ జడ ముడిసి కట్టుగా (కొప్పు ) కట్టారో... అంటే వివాహిత స్త్రీ అయ్యి ఉండి,సంతానం కలిగి ఉంది అని అర్ధం. అన్నీ బాధ్యలతో కలిపి గుట్టుగా ముడుచుకుని ఉందనీ అర్ధం.*


*🌸ఇలాగ వారి రూపురేఖలలో ,ఆహార్యంలో ,వేష భూషణలో చూచి మనం తెలుసుకొనవచ్చును.*


*🌿వీళ్ళేమిటీ అని చూడగానే తెలిసిపోతుంది .వేసుకునే జడలను బట్టివారి శారీరక స్థితిని తెలియజేస్తాయి .ఇదంతా కూడా ఆచార ధర్మంలో ఉంది,ఆచారం క్రిందే వస్తాయి .*


*🌸నాగరికత తెలిసినవాళ్ళు జుట్టు తప్పనిసరి సరియైన పద్దతిలో ఎదో ఒక రకముగా అందముగా తీర్చి దిద్దుకుంటారు.*


*🌿కానీ ఇప్పుడు మోడనైజేషన్ ముసుగులో అభివృద్ధి ,ఆధునికత పేరుతో ప్రాశ్చాత్త్యా పోకడలతో విషసంస్కృతిని దిగుమతి చేసుకొని, మన ఆచారాలను మంట గలుపుతున్నారు.* 


*🌸చిన్నపిల్లల నుండి పండు ముదుసలి వరకు కొందరు స్త్రీలు వివిధరకాల ఫాషన్ కట్టింగులు చేయించుకుంటున్నారు.*


*🌿కొందరు మహాతల్లులు చదువులు ఉద్యోగాలవేటలో భాగంగా  ,జుత్తు విరబోసుకొని శక్తి రూపాలుగా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తిరుగుతున్నారు.*


*🌸ఎక్కడ స్త్రీ జుట్టు ముడవకుండా విరబోసుకొని విహరిస్తుందో వారి వెనుకాల భూత, ప్రేత, పిశాచాలు,, పాతకులు లంకిణిలు పూతనలు తిరుగుతాయని.*


*🌿ఇది నిక్కచ్చిగా రాక్షస స్వభావమే ననీ ధర్మ_ప్రభోధం .శాస్త్రం ప్రకారం స్త్రీలు తలంటి బోసుకున్నాక జట్టు ఆరబెట్టుకోవడానికి కూడా కొసరి భాగాన ముడివేసి ఆరబెట్టుకోవాలి.*


*🌸కానీ కొన్ని పురాణగాధల్లోవాళ్ళు చేసిన శబధం మేరకు వారి జుట్టు విరబోసుకున్నట్టు చెబుతారు, రామాయణంలో సీతామాత వల్ల లంకాదహనమే జరిగింది,*


*🌿భారతంలో ద్రౌపదీ కారణంగా మహాభారత యుద్ధమే సంభవించింది,అయినా కూడా అది అనర్ధదాయకమే అయ్యింది.*


*🌸ఇవి నాకు పురాణ శాస్త్రాలు ద్వారా తెలిసిన వివరాలు మాత్రమే తెలుపుతున్న...స్వస్తీ..🙏🌹🎻*

🌸🌿🌸 🌿🌸🌿 🌸🌿🌸

Monday, March 27, 2023

పిల్లలు@24

 "🇮🇳" మీ పిల్లలు మీరు ఏమి చేస్తే అది వాళ్లు అనుసరిస్తారు.

" పిల్లలు ఏ వాతావరణంలో జీవిస్తారో!  అదే నేర్చుకుంటారు.


🌹1)" పిల్లలు "విమర్శించే" వాతావరణంలో పెరిగితే "ఖండించడం" నేర్చుకుంటారు.


🌷"2)" పిల్లలు "భయంతో" పెరిగితే "ఆందోళనతో" జీవిస్తారు.


🌷"3)" పిల్లలు జాలితో పెరిగితే తమపై "తాము జాలి" పడుతుంటారు.


🌸"4)" పిల్లలను గేలి చేస్తే, సిగ్గుతో కుంచించుకు పోవటం నేర్చుకుంటారు.


🌻"5)" పిల్లలు "అసూయతో" పెరిగితే. "ఈర్ష" పడటం నేర్చుకుంటారు.


🔥6")" పిల్లలు "అవమానంతో" పెరిగితే "అపరాధ భావం" తో లోనవుతుంటారు.


⛱️" 7)" పిల్లలను "ప్రోత్సహిస్తే", "ఆత్మవిశ్వాసం"   అలవర్చు కుంటారు.


🌼"8)"పిల్లలను "సహనంతో" పెంచితే" ఓపిక"ను అలవరచు కుంటారు.


🥭"9)" పిల్లలను "ప్రశంసలతో" పెరిగితే, వారు "అభినందించటం" నేర్చుకుంటారు.


🌷"10)" పిల్లలు "'ఒప్పు దల"తో  పెరిగితే, "ప్రేమించటం" నేర్చుకుంటారు.


🏀" 11)" పిల్లలు అంగీకారంతో పెరిగితే, తనను తాను "ఇష్టపడటం" నేర్చుకుంటారు.


⚾"12)" పిల్లలు "గుర్తింపు పొందే" వాతావరణంలో పెరిగితే, "లక్ష్యాలను" ఏర్పరచుకుంటారు


🥎"12)" పిల్లలు పంచుకునే వాతావరణంలో పెరిగితే, "ఉదార స్వభావాన్ని" అలవర్చుకుంటారు


🎾"13)" పిల్లలు "నిజాయితీ" తో పెరిగితే "సత్య వంతంగా" ఉండటాన్ని అలవర్చుకుంటారు.

🏉"14)" పిల్లలు "న్యాయమైన" వాతావరణంలో పెరిగితే "ధర్మం" అలవర్చుకుంటారు.

🥏" 15)" పిల్లలు "దయ కరుణ " తో జీవిస్తే" గౌరవాన్ని" నేర్చుకుంటారు.


🎱"16)" పిల్లలు "భద్రతతో" పెరిగితే "విశ్వాసాన్ని" అలవర్చుకుంటారు.

🍏"17)" పిల్లలు "ప్రేమాభిమానాల మధ్య పెరిగితే, ప్రపంచంలో ప్రేమను కనుగొంటారు.


🍎"18)" పిల్లలు స్నేహపూరిత వాతావరణంలో పెరిగితే, తాను నివసించే ప్రపంచం

"గొప్పదని" భావిస్తారు.


🍍19)" పిల్లలు "స్వతంత్రంగా నిర్ణయాలు" తీసుకున్నట్లు పెంచుతే, వారు "నాయకులులై" రాణించగలరు.


🍅"20)" మీ పిల్లలకు "మొహమాటం లేకుండా" మాట్లాడటం నేర్పండి.  జీవితంలో "సంకోచం లేకుండా" మాట్లాడగలరు.


🍊"21)" పిల్లలకు "బద్ధకం" అలవాటు చేయకండి.  ప్రతి పనిలోనూ "అనాసక్తి" చూపించు తారు.


🍓"22)" పిల్లలకు "నెగిటివ్" ఆలోచనలు రానివ్వకండి.  పెద్ద అయితే "విజయం" దిశగా అడుగులు వేస్తారు.


🍋"23)" పిల్లలకు "అతి నిద్ర" అలవాటు చేయకండి.   సమయపాలన లో తగు శ్రద్ధ వహించి గలరు.


🍎"24)" పిల్లలకు పనులను వాయిదా వేసే పద్ధతి నేర్పకండి,

పెద్ద అయితే అది ఒక జబ్బు  కాగలదు జాగ్రత్త,! వహించండి.

 

ఇంకా చాలా విషయాలు వున్నాయి.  మరోసారి ముచ్చటించి ఆనందంతో ఆచరించండి.

   

 


Saturday, March 25, 2023

ఒత్తిడి నిర్వహణ చిట్కాలు...

 *స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టిప్స్.......ఒత్తిడి నిర్వహణ చిట్కాలు...*


1. *మనసారా నవ్వండి*

మనసారా నవ్వడం అన్ని విధాలా ఆరోగ్యదాయకం. మీరు నవ్వుతూ ఇతరులను నవ్వించడానికి ప్రయత్నిస్తే మీకూ ఆనందం, ఆహ్లాదం కలగడమే కాక ఇతరుల్నీ ఆనందంగా ఉంచుతారు. మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్‌ అవుతారు. నవ్వడం వల్ల ఫేషియల్‌ మజిల్స్‌, చెస్ట్‌, భుజాలు, మెడ, స్కల్‌ మజిల్స్‌ రిలాక్స్‌ అవుతాయి.

2. *నడక - వ్యాయామం*

ఉదయం పూట నడక మంచిది. అలా కుదరని పక్షాన సాయంత్రం పూట కూడా నడవచ్చు. నడుస్తూ ప్రకృతి అందాలను తిలకించండి. మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చండి. అలాగే వ్యాయామం చేయడం వల్ల శరీరం రిలాక్స్‌ అవడమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

3. *చక్కటి నిద్ర*

రోజుకు 6 గంటలు తక్కువ కాకుండా నిద్రపోవాలి. నిద్రవల్ల మంచి రిలాక్సేషన్‌ ఏర్పడుతుంది. మనస్సు, శరీరం చక్కగా ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది. మధ్యమధ్యలో నిద్రాభంగం కలగకుండా చక్కటి గదివాతావరణం మంచి పడక, మంచిగాలి ఉండేటట్లు చూసుకోవాలి.

4. *చల్లటి నీళ్లతో స్నానం*

మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనయినప్పుడు చల్లటి నీళ్లతో స్నానం చేసినట్లయితే శరీరం, మనస్సు హాయిగా ప్రశాంతంగా ఫీల్‌ అవుతారు. అలా కుదరని సందర్భాలలో చల్లటి నీళ్లతో కాళ్లు, చేతులు, ముఖం కడుక్కుని, కావాల్సిన మంచినీరు త్రాగి కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రశాంతంగా ఫీలవుతారు.

5. *వీకెండ్‌ ఎంజాయ్‌ చేయండి*

బయటకు వెళ్లండి. అందుకోసం చక్కటి ప్రణాళికలు వేయండి. అలా కొన్ని కొత్త ప్రదేశాలకు కాని, మీకు ఇష్టమైన ప్రదేశాలకు కుటుంబ సభ్యులతో లేదా ఫ్రెండ్స్‌తో వెళితే బాగా ఎంజాయ్‌ చేస్తారు. అలా చేస్తే మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు.

6. *సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనండి.*

సంగీతం, సాహిత్య కార్యక్రమాలు మరి కొంతమందికి స్పోర్ట్స్‌, గేమ్స్‌, నృత్యం లాంటి ఇష్టమైన కార్యక్రమాలలో పాల్గొనడం లేదా తిలకించడం చేయడం వల్ల ఒత్తిడికి దూరమవుతారు.

7. *వీలుకానప్పుడు నో చెప్పండి.*

మీ పరిమితులు, పరిధులు మీకున్నాయి. ప్రతి ఒక్కరు మీతో ఏదో పని చేయించాలని చూస్తారు. అందరినీ సంతోషపెట్టడం అనేది మీకు అలివి కాని పని అని తెలుసుకోండి. ఎదుటివారికి కోపం వస్తుందనుకుని అందరి సమస్యలు మీ నెత్తిన వేసుకుంటూ ఉంటే మీరు మానసిక ఒత్తిడికి గురి అవుతారని తెలుసుకోండి.

8. *టైమ్‌ మేనేజ్‌మెంట్‌ (సమయ పాలన)*

ఎవరికైనా 24 గంటల సమయమే ఉంటుంది. అయితే కొంతమంది తమకున్న సమయాన్ని వివిధ కార్యక్రమాలకు చక్కగా ఉపయోగించుకుంటారు. అలా కాలాన్ని సద్వినియోగ పరిచే స్కిల్‌ మీలో ఉంటే ఒత్తిడిని అధిగమిస్తారు. అంటే మీరు ఏఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారో ఒక ప్రయారిటీ లిస్ట్‌ ప్రతిరోజూ రాసుకోవాలి. ముందు ఏ పని చేయాలి. రెండో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అనే అంశాలు ముందుగా నిర్ణయించుకోవాలి. దానిప్రకారం మీ పనులు సక్రమంగా నిర్వహించుకుంటే ఒత్తిడి ఏర్పడకుండా ఉంటుంది. కొన్ని పనులు అర్జంట్‌ కానివి ఉంటాయి. మరికొన్ని ముఖ్యమైనవి, ఇంకొన్ని ముఖ్యమైనవి కానివి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాటా ప్రాధాన్యత గుర్తించగలిగితే మీకు ఒత్తిడి లేకుండా ఉంటుంది.

 9. *ప్లానింగ్‌ (ప్రణాళిక)*

మనకు రకరకాల లక్ష్యాలు ఉంటాయి. అయితే వాటిని ఎలా చేరుకోవాలి అనే విషయంలో అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి. మనం ఒక చక్కని ప్రణాళికను ఏర్పరుచుకున్నట్లయితే ఆ ప్రణాళిక ప్రకారం ఈజీగా ముందుకు వెళ్లగలుగుతాం. కాని కొంతమంది ఎటువంటి ప్రణాళిక లేకుండా పనులు తలపెడుతుంటారు. ఇటువంటి వారు ఒత్తిడికి లోనవుతుంటారు. కనుక మీరు ఏది చేయాలన్నా మంచి ప్రణాళిక వేసుకోవడం మరిచిపోవద్దు.

10. *ఎమోషనల్‌ ఇంటెలిజెన్సీ (ఉద్వేగ ప్రఙ్ఞ)*

అంటే మీలోని ఎమోషన్లను బేలెన్స్‌ చేసుకునే ప్రజ్ఞ మీలో ఉండాలి. ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి. అయితే వాటిని సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే ఒత్తిడికి లోనుకాకుండా ఉంటారు. మీరు ఇతరులపై కోపం ప్రదర్శించాలనుకున్నప్పుడు అది మీకు మీతోటి వారికి మధ్య సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా ఉండే విధంగా సున్నితంగా ఉండాలి. అలాకాకుండా అవతలివారిని బాధించే విధంగా ఉన్నా లేదా మీరు అతిగా భావోద్వేగానికి గురి అయినా ఒత్తిడి మిమ్మల్ని వెంబడిస్తుంది.

11. *పాజిటివ్‌ థింకింగ్‌ (సానుకూల ఆలోచన)*

ఆశావహ దృక్పథంతో ఉన్న వ్యక్తులలో సహనం ఎక్కువగా ఉంటూ వారు ఎలాంటి సమస్యలు ఎదురైనా చాలా సున్నితంగా ఆ సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు. వారిలో ప్రొయాక్టివ్‌ బిహేవియర్‌ ఉంటుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి. వారి ఆలోచనలు ఆచరణ ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇలాంటివారిలో ఒత్తిడి ఏర్పడకుండా ఉంటుంది. ఒకవేళ ఒత్తిడి ఏర్పడ్డా దాన్నించి బయటపడగల నేర్పుకూడా వారిలో ఉంటుంది.

12. *స్కిల్‌  నాలెడ్జ్‌*

ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మీరు చేసున్న ఉద్యోగంలో మీకు మంచి నైపుణ్యం ఉండాలి. అలాగే ఆ పనిలో మీకు నాలెడ్జ్‌ కూడా బాగుండాలి. అలా మీలోని నైపుణ్యాలను పెంచుకోకుండా ఉంటే మీరు తరచుగా ఒత్తిడికి గురి అవక తప్పదు. మీరు మీకు ఇచ్చిన పనుల్ని సరిగా చేయలేకపోవడం, సరి అయిన సమయంలో మీరు మీబాస్‌కు ఆ పనిని అప్పగించలేక పోవడం తద్వారా ఒత్తిడికి లోనవడం జరుగుతుంది. కనుక స్కిల్‌`నాలెడ్జ్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి.

13. *ఎసెర్టివ్‌ (దృఢమైన ప్రవర్తన) బిహేవియర్‌*

మీరు ఎగ్జిక్యూటివ్‌ కావచ్చు. లేదా ఆ క్రింది స్థాయి వ్యక్తి కావచ్చు. మీ ప్రవర్తన ఎసెర్టివ్‌గా ఉండాలి. అంటే ప్రతివ్యక్తిలోనూ మూడు రకాలైన ప్రవర్తనలు ఉంటాయి. అంటే పాసివ్‌ బిహేవియర్‌, ఎగ్రెసివ్‌ బిహేవియర్‌ అలాగే ఎసెర్టివ్‌ బిహేవియర్‌, ఎగ్రెసివ్‌ బిహేవియర్‌ వల్ల ఇద్దరి మధ్యా ట్రాన్సాక్షన్స్‌ దెబ్బతింటాయి. అలాగే ఎవరైతే ఎగ్రెసివ్‌గా ఉంటారో వారు మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్‌గా అప్‌సెట్‌ అవుతారు. తొందరగా ఒత్తిడికి గురవుతారు. పాసివ్‌ బిహేవియర్‌ ఆమోదయోగ్యం కాదు. అది ఇతరుల ఆత్మాభిమానాన్ని కించపరుస్తుంది. కనుక ఇతరుల్ని అభిమానించి, గౌరవించేది అంతేకాక వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేది. ఎసెర్టివ్‌ బిహేవియర్‌ను అనుసరించడం వల్ల ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఏర్పడి ఒత్తిడి లేకుండా ఉంటుంది.

అలాగే భార్యాభర్తలు మధ్యకాని స్నేహితుల మధ్యకానీ, ఆఫీసులో మీతోటి ఉద్యోగస్తుల మధ్యకాని ఎసెర్టివ్‌నెస్‌ అనేది ఒత్తిడి లేకుండా చేస్తుంది. ఉదాహరణకు మీ అభిప్రాయం బాగుంది. మీరు చెప్పింది కూడా పరిశీలించాల్సిన అంశమే. నేను ఇలా అనుకుంటున్నాను. మీరు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు... ఇలా సంభాషణ కొనసాగితే ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది.

14. *డెలిగేషన్‌*

అన్ని పనులు మీరు ఒక్కరే చేయాలనుకోవడం సాధ్యం కాదు. ఆఫీసులో కాని, ఇంట్లో కాని కొన్ని పనులను మీరు ఇతరులకు కేటాయించాలి. ఆయా పనుల ప్రాధాన్యతను బట్టి మీ క్రింది ఉద్యోగులకు, అసిస్టెంట్స్‌కు అలాగే ఇంట్లో అయితే కొన్ని పనులు ఇతర కుటుంబ సభ్యులకు కేటాయించడం వల్ల పని పంచబడుతుంది. దీనివల్ల ఒత్తిడి ఏర్పడదు.

15. *సానుభూతి గల*

ఇతరులు ఉన్న పొజిషన్‌లో మీరు ఉంటే ఎలా ఫీల్‌ అవుతారు. అనే కోణంలో ఆలోచిస్తే మీ ఆలోచనా ధోరణి సవ్యంగా ఉంటుంది. అప్పుడు మీరు ఇతర వ్యక్తులతో అనుబంధం సవ్యంగా ఉంటాయి. ఎంపతీ ఫీలింగ్‌ మనిషిని ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది.

16. *డెడ్‌లైన్స్‌*

మీ ఆఫీసులో మీకు ఇచ్చిన జాబ్‌ ఆఖరి క్షణం వరకూ పూర్తి చేయకుండా ఉంటే లెవెన్త్‌ అవర్‌ టెన్షన్‌కు గురి అవుతారు. దాంతో మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే మీరు చేయాల్సిన పనులు డెడ్‌లైన్‌కు ముందే ముగించండి.

17. *కుటుంబ సభ్యులతో సరదాగా*

ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం చాలా ఆరోగ్యకరమైన విషయం. ఇలాంటివారు ఎంతో కాన్ఫిడెంట్‌గా సరదాగా ఉంటారు. అందరితో మంచి కమ్యూనికేషన్‌, సత్సంబంధాలు ఉంటాయి. దాంతో ఒత్తిడి మీ దరికి చేరదు.

18. మీ లైఫ్‌ పార్టనర్‌తో

ఆఫీసులో బిజీ షెడ్యూల్‌తో ఇంటికి లేటుగా వచ్చి హడావుడిగా మీ కార్యక్రమాలు ముగించుకుని మంచం మీద మౌనంగా పడుకుంటే మీ పార్టనర్‌తో మీకు మంచి రిలేషన్స్‌ ఎలా ఉంటాయి? అందుకు మీ లైఫ్‌ పార్టనర్‌కు కొంత టైమ్‌ కేటాయించండి. మాట్లాడండి... అభినందించండి.... ప్రేమించండి, ముద్దూ ముచ్చట్లతో ఆనందంగా గడపండి. ఇక ఒత్తిడి పరార్‌!

19. పిల్లలతో ఎక్కువ ఆనందం

మీకు పిల్లలు ఉన్నారా? అయితే పిల్లలతో ఆఫీసు నుంచి ఇంటికి రాగానే వారితో మాట్లాడండి.... వారి ఎమోషన్స్‌, వారి అభిరుచులు, వారితో కలిసిపోండి. ఆడుకోండి. ఆనందించండి.... వారు చిన్న పిల్లలయితే ఎత్తుకోండి. ముద్దాడండి... టీనేజర్స్‌ అయితే వారితో స్నేహితులుగా మారిపోండి. ఇక ఒత్తిడిని మీరు దూరం అవుతారు.

20. బుక్‌ రీడింగ్‌

పుస్తకాలు చదివే అలవాటు మిమ్మల్ని అనేక విషయాలవైపు ఆలోచింపచేస్తుంది. మీలో విజ్ఞానంతో పాటు క్రియేటివిటీ, ఆనందం కలుగుతాయి. ఇది మీకు ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.

21. ఫోటో ఆల్బమ్‌

మీరు టెన్షన్‌ ఫీల్‌ అవుతున్నారా? మానసికంగా గజిబిజిగా ఉందా? ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే మీ ఇంట్లో ఆల్బమ్‌ ఒకసారి తీయడి. ఎన్నో ఫోటోలు, చిన్నప్పటి మీ అనుభూతులు పరిశీలించండి. హాయిగా ఫీల్‌ అవుతారు.

22. గార్డెనింగ్‌

మీ ఇంట్లో గార్డెన్‌ ఉందా? పూలకుండీలు చక్కగా సర్దండి... వాటికి నీరు పోయండి. అలా మీరు ఒక అరగంట సమయాన్ని పూలమొక్కలతో గడపండి... రిలాక్స్‌గా ఫీల్‌ అవండి.

23. మ్యూజిక్‌ వినడం

మీకు ఇష్టమైన సంగీతాన్ని వింటుంటే మీరు ఎంతో ప్రశాంతతకు లోనవుతారు. ఒంటరిగా ఆలోచించే దాని కన్నా ఓ మంచి సంగీతం వింటే ఎంతో హాయిగా ఉంటుంది.

24.  ఆఫీసు - ఇల్లు పరిశుభ్రత

ఆఫీసు కావచ్చు. ఇల్లు కావచ్చు. చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గోడలకు మంచి రిలాక్స్‌డ్‌గా ఉన్న కలర్స్‌ వాడాలి. వస్తువులు టేబుల్స్‌, పుస్తకాలు, బట్టలు చిందరవందరగా ఉండకూడదు.... ఇల్లూ, ఆఫీసు మంచి వాతావరణం స్ఫురించాలి.

25. టెలిఫోన్‌ కాల్స్‌

మీ సెల్‌ఫోన్‌ కాల్స్‌ను పరిమితం చేసుకోండి. ఎక్కువ సమయం పిచ్చాపాటీ విషయాలతో విపరీతమైన కాల్స్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోవద్దు. కాల్స్‌కు హద్దులు పెట్టండి.

26. ఫైల్‌ - టేబుల్‌ మేనేజ్‌మెంట్‌

ఆఫీసులో మీ టేబుల్‌ మేనేజ్‌మెంట్‌పై శ్రద్ధ వహించండి. ఫైల్స్‌ ఎలా మెయింటైన్‌ చేయలో తెలుసుకుంటే మీ టేబుల్‌పై ఏఏ ఫైల్స్‌ మీ దగ్గరుండాలో, ఏ ఫైల్స్‌ దాచిపెట్టాలో వాట ఆర్డర్‌ నెంబర్‌ ఎలా ఉండాలి. తిరిగి వాటిని తీయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జాగ్రత్త పడండి.

27. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

ఆఫీసులో కాని ఇంట్లో కాని కమ్యూనికేషన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. కమ్యూనికేషన్‌ సరిగా లేకుంటే చాలా టైమ్‌ గ్యాప్‌ ఏర్పడుతుంది. ట్రాన్సాక్షన్స్‌ కూడా దెబ్బతింటాయి. దాంతో ఒత్తిడి ఏర్పడుతుంది... మంచి కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోండి.

28. టైప్‌ ఎ పర్సనాలిటీ నుంచి.... టైప్‌ బి పర్సనాలిటీకి మారండి.

కార్డియాలజిస్టులు వ్యక్తులలో టైప్‌ ఎ అని టైప్‌ బి పర్సనాలిటీ అని రెండు రకాలుగా గుర్తించారు. టైప్‌ ఎ పర్సనాలిటీ గల వ్యక్తులు ఎక్కువ టెన్షన్‌కు గురి అవుతారు. ఎప్పుడూ హర్రీబర్రీగా ఉంటారు. దీంతోవారు స్ట్రెస్‌కు ఈజీగా లోనవుతారు. అలాగే టైప్‌ బి పర్సనాలిటీ వారు నిదానంగా ఆలోచిస్తూ సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ వారివారి పనులు చక్కదిద్దుకుంటారు. వీరిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీరు రిలాక్స్‌డ్‌గా పనులు చేస్తారు. దీనిని గురించి మరింత వివరంగా మీరు - మీ వ్యక్తిత్వంలో చదవండి.

29. ఇంటర్‌ పర్సనల్‌ రిలేషన్స్‌

ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి అనే అంశంపై కూడా మనకు ఏర్పడే ఒత్తిడి ఆధారపడి ఉంటుంది. నిత్యం మనం ఒకరిపై ఒకరం ఆధారపడి ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటే మనం ఇతరులు సంతోషంగా ఉంటారు.

30. ఇంట్రాపర్సనల్‌ రిలేషన్‌

మన మనసుతో మనకు ఉండే సంబంధాన్ని ఇంట్రాపర్సనల్‌ రిలేషన్‌ అంటారు. మన మనసుని మనం ఎలా నియంత్రించుకుంటున్నాం? మనం ఎలా ఆలోచిస్తున్నాం... మనం ఎటువంటి అభిరుచులు కలిగివున్నాం... మన లావాదేవీలన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? నా బాధ్యతలు  నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నానా అనే ఆలోచనల్ని మనం నిరంతరం గమనిస్తుంటాం. ఈ రిలేషన్‌ సక్రమంగా ఉన్నట్లయితే ఒత్తిడి లేకుండా ఉంటుంది.

31. అంతర్మధనం వద్దు.... ఓపెన్‌ అవ్వండి!

ఏదో ఒక సమస్యపై మీలో మీరు తర్కించుకుంటూ బాధపడేదానికన్నా మీ స్నేహితులకు లేదా మీ లైఫ్‌ పార్టనర్‌కు సమస్య వివరించండి. మీకు సొంతంగా పరిష్కారం దొరకని విషయలకు ఇతరుల అనుభవాల నుంచి పరిష్కార మార్గాలు లభిస్తాయి. అందుకే మనలో మనం మానసికంగా కుంగిపోవడం కన్నా మిత్రులతో పంచుకుంటూ ఉంటే చాలా రిలాక్స్‌ అవుతాం.

Tuesday, March 21, 2023

జాతీయ కుటుంబ దినోత్సవం

 *Let's Make ur day Fruitful*

*రేపు 22 మార్చి 2020  జాతీయ కుటుంబ దినోత్సవం*


 *ఇంట్లో రేపు మనం ఏమి చేయవచ్చు ...?*


 *కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడిపే అవకాశం దొరికింది*


 👉 ఉదయం 


5.30 - 6.00:


  మేల్కొలుపు / ఉదయం కార్యకలాపాలు / టీ / కాఫీ


 👉6.00-6.45am:


 ధ్యానం, దైవారాధన మొదలైనవి.


 👉6.45 - 7.30:


  యోగ / వ్యాయామం


 👉7.30-8.30am:


  భార్య మార్గదర్శకత్వంతో  భర్త అల్పాహారం సిద్ధం చేయాలి.

 పిల్లలు ఇంటిని శుభ్రపరచడం.


 👉8.30-9.00am:


  కుటుంబంతో అల్పాహారం.


 👉9.00-10.00am:


  కుటుంబం అంతా కలిసి  వారి విజయాల గురించి మాట్లాడటం, భవిష్యత్ లక్ష్యాలు నిర్ణయించుకోవడం.


 ఉదయం10.00-11.30:


 క్యారం, చెస్, పచ్చీస్, అష్టా చెమ్మ మొదలైన ఇండోర్ గేమ్స్ ...


 👉11.30 - 1.00:

 

 కుటుంబ సభ్యులందరూ  కలసి మధ్యాహ్న భోజనం తయారీ, అవకాశం ఉంటే కొత్త వంటకాలు ప్రయత్నం చేయవచ్చు.


 👉1.00 - 2.00:


 కుటుంబం అంతా కలిసి మధ్యాహ్నం భోజనం చేయటం.


 👉2.00-3.30pm:


 వంటగది  మరియు ఇతర గదులను శుభ్రపరుచుకోవడం.


 👉3.30-4.45pm:


 టీ బిస్కెట్లు.  

పెద్దలు తమ కుటుంబం / పూర్వీకుల నేపథ్యం / చరిత్రను కనీసం 3/4 తరాల పిల్లలకు వివరించాలి.  


కుటుంబ హెచ్చు తగ్గులు / కష్ట సమయాలు, వైఫల్యాలు మరియు విజయం గురించి మాట్లాడుకోవడం.

 

కుటుంబం పాత ఫోటో ఆల్బమ్‌లను చూడొచ్చు.


 👉4.45- సాయంత్రం 5.05:


 బాల్కనీ, టెర్రేస్,

 ప్రాంగణంలలో నిలుచొని

 5 నిమిషాలు చప్పట్లు కొడుతూ నిరంతరం శ్రమిస్తున్న డాక్టర్లకు, వీధులను శుభ్రపరిచే సిబ్బందికి, ఇతర అత్యవసర సేవలు అందించే వ్యక్తులకు కృతజ్ఞతా భావాన్ని చూపిద్దాం.


 👉5.05-6.30 pm:

భగవద్గీత లేదా ఏదైనా పురాణ కథలు చదవడం లేక వినడం


 👉6.30-8.00pm:


 కుటుంబ ఫోటోలు, వివాహ వీడియోలు మరియు సానుకూల విషయాలను పంచుకోవడం.


 👉8.00-9.30pm:

రాత్రి భోజనం సిద్ధం చేసుకోవడం, అందరూ కలిసి భోజనం చేయడం.


 👉9.30-10.30pm:


 


 ప్రతి కుటుంబ సభ్యుడి వ్యక్తిత్వ మెరుగుదలకు మీ కుటుంబ సభ్యుని యొక్క 5 పాజిటివ్‌లు మరియు 5 ప్రతికూలతలను వ్రాసి, ఒకరితో ఒకరు పంచుకోండి.

 


 *రాత్రి 10.30 - శుభ రాత్రి*


పసుపులేటి నరేంద్రస్వామి

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE