NaReN

NaReN

Tuesday, March 21, 2023

ప్రకృతి ద్వారా…మనం నేర్చుకోవలసినవి

 *ప్రకృతి ద్వారా…మనం నేర్చుకోవలసినవి*

             


*ప్రకృతిలో   పరమాత్మ తత్త్వం ప్రతిబింబిస్తుంది. ప్రకృతిలో ప్రతీది సృష్టికర్త నియమానుసారం నడుస్తూ, సృష్టికర్త సందేశాన్ని సకల మానవాళికి అందిస్తుంది. ప్రకృతితో సహజీవనం చేసే పశుపక్షాదులు కూడా భగవంతుడు తమని సృష్టించినప్పుడు ప్రాసాదించిన సహజగుణంలోనే ఉంటూ, సృష్టికర్త సందేశాన్ని తెల్పుతాయి. అవన్నియూ ఎలా జీవించాలో, ఏం నేర్చుకోవాలో మానవునికి తెలియజేస్తునే వుంటాయి.* 


*భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, నీరు, అగ్ని, గాలి, నది, సముద్రం, పక్షులు, చెట్టు, పువ్వు..,    అన్నీ మానవావళి శ్రేయస్సుకీ, మానవజన్మ సార్ధతతకు కావాల్సిన సందేశాలను తమ మనుగడ ద్వారా ఇస్తూనే వుంటాయి. అది ఎలాగో ఓసారి పరిశీలిద్దాం…*


                                                                                                         *1.  భూమి:*

         

*గుండెలో గుచ్చినను భరించి ప్రతిఫలంగా పంటలను, పుష్ప ఫలవృక్షాలను, ప్రాసాదిస్తూ, అలానే, మలమూత్రాలను విసర్జించినను, త్రొక్కివేస్తున్నను, ఎంతో నష్టం కష్టం కల్గిస్తున్నను క్షమత్వంతో సహనంగా ఉండడం ద్వారా - క్షమత్వమును, ఓర్పునూ, భూతదయను కల్గివుండాలన్న సందేశం "భూమి"ది.*


                                                                                          *2.  ఆకాశం:*


*వచ్చి పోయే మేఘాల వలన మలినపడకుండా, సూర్యచంద్రులు, నక్షత్రాలు, వాయువు తనతో ఉన్నా, వాటితో ఎలాంటి సంగత్వం ఏర్పరుచుకోకుండా, నిర్మలంగా ఉండడం ద్వారా - మానవుడు కూడా వచ్చే పోయే ఆలోచనలతో అంతఃకరణమును మలినపరుచుకోకుండా స్వచ్ఛంగా ఉండాలని, ఎన్ని బంధాల మద్య ఉన్నా  వాటితో సంగత్వం కల్గియుండక నిర్మలంగా వుండాలన్న సందేశం "ఆకాశము"ది.*


                                                                                           *3.  సూర్యుడు:*


*ఒక చిన్న మడుగైనా, పిల్ల కాలువైనా, నదైనా, మహాసముద్రమైనా అన్నింటిలో ఒకేలా ప్రతిబింబిస్తూ, అలానే, నీళ్ళ కుండలలో ప్రతిబింబించి అనేక సూర్యులుగా కన్పించడం ద్వారా - మానవుడు సమత్వదృష్టి కల్గియుండాలని, అలానే పరమాత్మ ఒక్కడే అయినా అనేక శరీరములయందు ఆత్మగా గోచరిస్తాడన్న జ్ఞాన సందేశము "సూర్యుడు"ది.*


                                                                             *4.  చంద్రుడు:*


*వెలుగు చీకటి లతో వృద్ధిక్షయాలను పొందడం ద్వారా - జీవితంలో సుఖదుఃఖాలు సహజమనే సందేశం "చంద్రుని"ది.*


                                                                               *5.  నీరు:*


*ఎటువంటి మలినాలైనను వాటిని శుద్ధిచేసి తాజాదనమును, నిగారింపును తీసుకురావడం ద్వారా - మానవుడు కూడా మనోమాలిన్యాలను తొలగించుకొని శుద్ధత్వము కల్గియుండాలన్న సందేశం "నీటి"ది.* 


                                                                                 *6.  అగ్ని:*


 స్థూల మాలిన్యాలని హరింపజేసి, ప్రకాశిస్తూ, కారణ రూపాన్ని విడిచిపెట్టడం ద్వారా - మానవుడు కూడా కర్మపాశాలను హరింపజేసుకొని భక్తిజ్ఞానంలతో ప్రకాశించాలన్న సందేశం "అగ్ని"ది. 


                                                                                       *7.  గాలి:*


*అన్నిచోట్ల తిరిగినను, అన్నింటిని స్పృశించినను అన్నింటిని ఎక్కడికక్కడే విడిచిపెట్టేస్తూ, అంతటా ఉన్ననూ ఏదీ అంటించుకోకుండా స్వచ్ఛంగా ఉంటూ, అలానే తను ఉన్నచోట వాతావరణమును చల్లగా, ఉల్లాసంగా ఆహ్లాదంగా మార్చుతూ, అందరిలో జీవాన్ని నింపడం ద్వారా - మానవుడు కూడా అహంకారరహితంగా ఏదీ అంటించుకోకుండా తామరాకుపై నీటిబొట్టులా నిస్సంగుడై జీవించాలని, అలానే ఉన్నచోట అందరిని ఆనందంగా వుంచుతూ, ఉల్లాసంగా జీవించాలనే సందేశం "గాలి"ది.*


                                                                                 *8.  నది:*


 *తాను ఎక్కడ యున్నదో పట్టించుకోక పర్వతమైన, లోయైనా, వంకలైనా, డొంకలైనా, రాళ్ళరప్పల సందులైనా ఏమాత్రం తేడా లేకుండా ప్రవహిస్తూ, తనకి మూలమైన సముద్రాన్ని చేరేంతవరకు ప్రయాణిస్తూనే వుంటూ, పత్రపుష్పాదులు, చెక్కముక్కలు, చెత్తా చెదారములు, చిరు చిరు ప్రాణులు ప్రవాహంలో తనతోపాటు తీసుకువెళ్తూ, తనలో పాలుపోసినా, చెత్తను పడేసిన సముద్రంలో కలిసేంతవరకు ప్రవహించడమనే తన సహజలక్షణమును వదలకపోవడం ద్వారా - మానవ జీవితం కూడా పరవళ్ళుతో ప్రవహించే తనలాంటిదేనని, ఎన్ని అడ్డులు ఉన్నా వాటిని పట్టించుకోక గమ్యం చేరేంతవరకు గమనమును సాగించాలన్న సందేశం "నది"ది.


                                                                          *9.సముద్రం:*


అలుపు లేకుండా తీరాన్ని తాకాలని ప్రయత్నించే అలలు ద్వారా, మరియు ఎన్ని నదులు తనలో ప్రవేశించుచున్ననూ పొంగిపోర్లిపోకుండా, అలానే నదులు తనలో చేరక ఎండిపోయినను తాను వట్టిపోకుండ ఉండడం ద్వారా - ఎన్ని సంపదలు తనని చేరుతున్న పొంగిపోక, అలానే ఏ సంపదలు చేరకపోయినా కృంగిపోకుండా హెచ్చుతగ్గుల స్థితి యందు స్థితప్రజ్ఞతో గంభీరుడై, అనుకున్నది సాదించాలనే పట్టుదలతో మానవుడు ఉండాలన్నది "సముద్ర" సందేశం.


                                                                                                      *10. పక్షులు:*


కిలకిలారావాలతో ప్రతిక్షణం ఆనందంగా హాయిగా స్వేచ్ఛగా పరిపూర్ణంగా జీవించడం ద్వారా మానవుడు కూడా ప్రకృతి లోనే ఉంటూ, ఆనందంగా పరిపూర్ణంగా జీవించాలన్న సందేశం "పక్షుల"ది.


                                                                                      

*11.  చెట్టు:*


తన చెంతకు ఎవరొచ్చినా తరతమ భేదం లేకుండా, హెచ్చుతగ్గుల భేదం లేకుండా వచ్చింది పశుపక్షాదులా, మానవులా అన్న తారతమ్యం లేకుండా నీడను, పండ్లను ఇవ్వడం ద్వారా మానవుడు నిస్వార్ధ సేవాపరుడై ఎలా ఉండాలన్న సందేశం "చెట్టు"ది.


                                                                                     

 *12.  పువ్వు:*


మొక్కపై అలరారుతూ అందంగా వికసించి, తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పరిమళాన్ని ఇచ్చి ఆనందమును కల్గిస్తూ, వాడిపోయక హాయిగా రాలిపోతూ సరళంగా ఉండడం ద్వారా - మానవుడు కూడా అంత ఆదర్శంగానే సరళంగా జ్ఞానవంతంగా జీవించాలన్న సందేశాన్నిస్తుంది "పువ్వు".


*కానీ, మానవుడు వీటిని ఎంతవరకు గుర్తిస్తున్నాడు?

అన్నీ కాకపోయినా ఇందులో ఒకటైనా జీవితాంతం ఆచరిస్తే చాలని పెద్దల వాక్కు.✍️

మనం కూడా పాటించేద్దాం ...ఏమంటారు..?

.         

మనల్ని నాశనం చేసే 5 విషపూరిత అలవాట్లు

 *మనల్ని నాశనం చేసే 5 విషపూరిత అలవాట్లు*

........................................................


1 . *వాయిదా వేయడం* ( procrastination )


2 . *ఫిర్యాదు చేయడం* ( complaining )


3 . *అతిగా ఆలోచించడం* ( overthing )


4 . *పోల్చుకోవడం* ( comparison )


5 .*(సేఫ్  జోన్లో) ఉండాలనుకోవడం* ( staying comfort zone )


............*వాయిదా వేయడం ..........*


ఏవేవో చేయాలనుకుంటాం . జీవితానికి లక్ష్యాలు పెట్టుకుంటాం . కానీ వాటిని రేపు ,, ఎల్లుండి,,,వారం ,,, సంవత్సరం అని వాయిదా వేసుకుంటూ వుంటాం ..పుణ్యకాలం కాస్తా వెళ్లిపోయాక... చేసేదేముండదు ఇక . 


................*కంప్లైంట్స్ చెయ్యడం..........*


ఇదో దరిద్రపు అలవాటు . మనకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనం 

ఎదుటి వారి మీదనో,,ఇంకేదో మీదనో కంప్లైంట్స్ చేస్తాం ..ఈ భూమ్మీద ఎవ్వరూ కరెక్ట్ కాదు...ఇంకా perfect మనిషి పుట్టలేదు.

మనలోని ఏదైతే లోపమో,, అవలక్షణమో ,,వాసనో ,,, అసమర్థతో వుంటే అది బయటి వాళ్ల మీద కంప్లైంట్స్ గా మారుస్తాం


..........*అతిగా ఆలోచించడం..........*


ఆలోచించేకీ ఏమీ లేనప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నట్టు నాకు బొత్తిగా అర్థం కాదు...ఒక సమస్య అతిగా ఆలోచిస్తే పరిష్కారం అవుతుంది అంటే భూమ్మీద మనుషులందరూ పనీ పాటా వదిలేసి కేవలం ఆలోచిస్తూ కూర్చొని వుండేవాళ్ళు...ఈ భూమ్మీద నువ్వో గెస్టువి మాత్రమే..కాబట్టి నీ బుర్రకి అతిగా పనిపెట్టకు..


......... *పోల్చుకోవడం* ...............


ఇదో పనికిమాలిన అలవాటు . సూది చేసే పని గునపం చెయ్యలేదు..గునపం చేసే పని సూది చెయ్యలేదు...దేని 

ప్రత్యేకత దానిదే...మల్లెపూలు వచ్చే సువాసన గులాబీలు ఇవ్వలేవు . గులాబీలు ఇచ్చే సువాసన మల్లెలు ఇవ్వలేవు..దేని 

ప్రత్యేకత దానిదే...టాయిలెట్లు కడిగే వాని ప్రత్యేకత వానిదే,,విమానం నడిపే వాని ప్రత్యేకత వానిదే..వేశ్య వృత్తి చేసే

ఆమె ప్రత్యేకత ఆమెదే....కాబట్టి మీ జీవితంలో ఎవ్వరితోనూ మిమ్మల్ని పోల్చుకొకండి....ఈ భూమ్మీద మీకు మీరు మాత్రమే ప్రత్యేకం ..అలాగే ఎవరికి వారు ప్రత్యేకమే...


............ *సేఫ్ జోన్లో* ఉండాలనుకోవడం...........


భూమ్మీద చాలా మంది ఇంత డబ్బులు వుంటే సేఫ్ గా ఉంటామనో,,ఇన్ని ఆస్తులు వుంటే సేఫ్ గా ఉంటామనో

లేకపోతే ఫలానా జాగా లో వుంటే సేఫ్ గా వుంటామనో అనుకుంటారు...ముందు మీరు నిద్రలో నుండి మేల్కొవాలి..

అలాంటివేమీ లేవు...సేఫ్ జోన్లో వుండి నేర్చుకునేది ఏమీ వుండదు..

ఆ యుద్ధం చేసే వాడు గెలుస్తాడు... ఆడే వాడు గెలుస్తాడు..

*సేఫ్ గా ఉండాలనుకునే వాడు జీవితంలో ఏ పాఠాన్నీ నేర్చుకోలేడు..*

🙏................................🙏

దేవుడిని నేను అడిగిన కోరిక

 దేవుడిని నేను అడిగిన కోరిక

😊 "దయచేసి నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులందరినీ ఎల్లవేళలా సంతోషంగా ఉంచమని" దేవుడిని అడిగాను.


 ☺ దేవుడు చెప్పాడు: సరే, అయితే కేవలం 4 రోజులు మాత్రమే!  ఇప్పుడు మీరు ఆ 4 రోజులు ఎంచుకోండి!


 😊 నేను "సరే" అన్నాను

 🌞" వేసవి రోజు "

 ❄ "శీతాకాలపు రోజు"

 ☔ "వర్షపు రోజు" మరియు

 🌺 "వసంత దినం"

 __

 😯 దేవుడు కంగారు పడి, కాదు మీరు కేవలం 3 రోజులు మాత్రమే ఎంచుకోవచ్చు.


 😊 నేను "సరే" అన్నాను

 ❌ "నిన్న"

 ✅ "ఈరోజు"

 ❓ "రేపు"

 __

 😯 దేవుడు కంగారు పడి, వద్దు, మీరు కేవలం 2 రోజులు మాత్రమే ఎంచుకోవచ్చు,


 😊 నేను "సరే" అన్నాను

 💖 "ప్రస్తుత రోజు మరియు

 ❓ "మరుసటి రోజు"

 __

 😯దేవుడు మళ్లీ అయోమయంలో పడ్డాడు, NO, NO నువ్వు ఒక్క రోజు మాత్రమే ఎంచుకోవచ్చు!!

 😊 "నేను "సరే" అన్నాను

 🌞"ప్రతిరోజు"

 __

 😀😀దేవుడు నవ్వడం ప్రారంభించి 🆒🙏"సరే, నీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉంటారు" అన్నాడు.  😊😆😛

 👏👏👏👏👏👏


 ☝☝☝💐💐

దేవుడు అడగని ప్రశ్నలు

 🌹 *దేవుడు అడగని ప్రశ్నలు🌹 !*

        

*🌹*మీ ఇంటిగదులు ఎంతవిశాలమైనవి అని దేవుడు అడగడు.*

**నువ్వెంతమందిని విశాల హృదయం తో  నీ ఇంటికి ఆహ్వానించావు అని అడుగుతాడు.*


*🌹*నీది ఎన్ని అంకెల జీతం? అని దేవుడు అడగడు.*

**నీ సంపదలో ఎంత నిజాయితీ వుంది? అని అడుగుతాడు.*


*🌹*నీవు ఎంత గొప్ప పరిసరాలలో నివసిస్తున్నావు? అని అడగడు.*

*నువ్వు నీ ఇరుగుపొరుగు వాళ్లతో ఎలా మెలుగుతున్నావని అడుగుతాడు .*


*🌹*నీవు ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనము చేస్తున్నావని దేవుడు అడగడు .*

*నీవు ఎంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావని అడుగుతాడు .*


*🌹*నీ అలమరాలో ఎన్ని జతల బట్టలు ఉన్నాయని దేవుడు అడగడు .*

*నీవు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలిచ్చి చలి బాధ తీర్చావని అడుగుతాడు .*


*🌹*నువ్వెన్ని అధ్యాత్మిక గ్రంథాలు చదివావు? అని దేవుడు అడగడు .*

*నీవు చదివిన పుస్తకాలలో నువ్వెంత సారాన్ని గ్రహించావు? అని అడుగుతాడు .*


*🌹*నీవు ఎన్ని పుణ్య క్షేత్రాలు దర్శించావని దేవుడు అడగడు .*

*నీవు ఎంత మానవ సేవ చేసావని అడుగుతాడు .*


*🌹*నీవు ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావని దేవుడు అడగడు .*

*ఇంకొకరికి సహాయపడటంలో ఎంత ఆనందముందో అనుభవించి మాటాడు అంటాడు .*


*🌹*ముక్తి పధమునకు ఇంత ఆలశ్యం చేసామేమని దేవుడు అడగడు .*

*నీవు రాగానే నీ చెయ్యి పట్టుకొని స్వర్గ ధామమునకు తానే తీసుకు వెళ్తాడు*🙏

Friday, March 3, 2023

పాఠశాలల్లో నో బ్యాగ్‌ డే

 

పాఠశాలల్లో నో బ్యాగ్‌ డే..


విద్యార్థులకు కృత్యాధార విద్య

సామాజిక అంశాలపై అవగాహన కల్పించేలా అభ్యాసాలు

తరగతుల వారీగా కార్యక్రమాలు

స్కూలు బ్యాగులు లేకుండా పాఠశాలలకు వచ్చిన విద్యార్థులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే కార్యక్రమాలను తరగతుల వారీగా నిర్ణయించారు నో బ్యాగ్‌ డే శనివారం నాలుగు ప్రధాన పిరియడ్లుగా విభజించి కార్యక్రమాలను అమలు చేస్తారు.

1, 2 తరగతుల విద్యార్థులకు

 మొదటి పిరియడ్‌ పాడుకుందాం.. ఇందులో అభినయ, జానపద, దేశ భక్తి గేయాలు, శ్లోకాలు వంటివి పిల్లలతో పాడించాలి.

రెండో పిరియడ్‌ .. మాట్లాడుకుందాం.. 

కథలు చెప్పడం పుస్తకాలలో కఽథలను చదవడం తమ అనుభవాలను తెలియజేయడం, పొదుపు కథలు పజిల్స్‌, సరదా ఆటలు ఆడించడం పిల్లలతో చేయించాలి.

మూడో పిరియడ్‌.. నటిద్దాం.. 

నాటికలు లఘు నాటికలు (స్కిట్స్‌) మూకాభినయాలు, ఏకపాత్రాభినాయాలు, నృత్యాలు వంటివి ప్రదర్శించవలసి ఉంటుంది.

నాలుగో పిరియడ్‌.. సృజన


పిల్లలలో సృజనాత్మక కళలను అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాలను అమలు చేయవలసి ఉంటుంది. బొమ్మలు గీయడం రంగులు వేయడం, బంకమట్టిని ఉపయోగించి బొమ్మలు నమూనాలు తయారు చేసే కార్యక్రమాలను చేపట్టాలి

3,4,5 తరగతుల విద్యార్థులకు


నో బ్యాగ్‌ డే కార్యక్రమాలను మూడు, నాలుగు, అయిదు తరగతులకు వినూత్నంగా చేపట్టేందుకు కార్యక్రమాన్ని నిర్ణయించారు.

మొదటి పిరియడ్‌.. సృజన : 


ఇందులో బొమ్మలు వేయడం, రంగులు దిద్దడం వంటి పనులతో పాటు మూకాభినయాలు వంటివి చేయించాలి. మాస్కులతో నాటికలు వేయించడం, అలంకరణ వస్తువులు తయారు చేయడం, నృత్యాలు చేయించడం వంటి పనులు చేయాలి.

రెండో పిరియడ్‌. తోటకుపోదాం,పరిశుభ్రత చేద్దాం 

ఈ కార్యక్రమంలో బడి తోటలో మొక్కలను సంరక్షించడం, పాదులు, కలుపు మొక్కలు తీయడం, ఎరువులు వేయడం, నీరు పెట్టడం, తరగతి గదలను శుభ్రంగా ఉంచడం వంటి పనులు చేయించాలి.*

మూడో పిరియడ్‌ .. చదువుకుందాం :

ఇందులో పాఠశాల గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను ఎంపిక చేసుకుని పిల్లలు చదవడం అందులో కథలను ఇతర అంశాలను ఇతర పిల్లలతో చర్చించడం చిన్న కథలు రాయడం వంటి పనులు చేయాలి


నాలుగో పిరియడ్‌.. విందాం విందాం : 

ఈ కార్యక్రమంలో ప్రాఽథమిక ఆరోగ్య కార్యకర్త, పంచాయతీ కార్యదర్శి వ్యవసాయాధికారి, పోస్టుమాస్టరు, వ్యాపారి, వ్యవసాయదారులను పాఠశాలకు ఆహ్వానించి వారితో వారికి సంబంధించిన కార్యక్రమాలను పిల్లలకు చెప్పించాలి

Thursday, March 2, 2023

అసలైన ఆరోగ్యానికి సిసలైన అవసరాలు

   అసలైన ఆరోగ్యానికి సిసలైన అవసరాలు


1. వెలుగొచ్చేవరకు పరుండటంమాని, వేకువ జామునే లేవడం మంచిదను!

2. బెడ్ కాఫీలు మాని, పరగడుపున ఎక్కువ మంచినీరు మంచిదను!

3. పేపరు పై మనస్సు మాని, సుఖవిరేచనం పై మనస్సు మంచిదను!

4. నడకే శ్రమ అనడం మాని, ఆసన ప్రాణాయాయాలు మంచిదను!

5. చెమట పట్టకుండా తినడం మాని, చెమట పడితేనే తినడం మంచిదను!

6. వేడి నీరు స్నానం మాని, ఉదయం చన్నీళ్లు తలకు మంచిదను!

7. సబ్బులు, షాంపూలు మాని, గుడ్డతో చర్మం మర్దన మంచిదను!

8. పూరీలు, దోసెలు మాని, మొలకెత్తిన విత్తనాలు మంచిదను!

9. పచ్చి కొబ్బరిని కొవ్వు అనడం మాని, సంపూర్ణాహారం అనడం మంచిదను!

10. తినేటప్పుడు నీరు త్రాగడం మాని తినే అరగంట ముందు లీటరు నీరు త్రాగటం మంచిదను!

11. కష్టంగా జీర్ణమయ్యేవి రాత్రికి మాని, ఉదయం తినడం మంచిదను!

12 . ముత్యాల్లాంటి మర బియ్యం మాని, ముడి బియ్యం మంచిదను!

13. కూరలకు తొక్కలు తీయడం మాని తినడం మంచిదను!

14 . కూరలను వేయించడం మాని, కొద్దిగ ఉడక నివ్వడం మంచిదను!

15. కూరలలోని నీటిని వార్చడం మాని, త్రాగడం మంచిదను!

16. పచ్చికూరలు పడవు అనడం మాని, సహజారోగ్యానికి మంచిదను!

17. భోజనం చేసేటప్పుడు మాటలు మాని, మనస్సు పెట్టి తినడం మంచిదను!

18. అన్నంలో కూర కలపడం మాని, కూరలో అన్నం కలపడం మంచిదను!

19. ఆహారాన్ని నమలకుండా మ్రింగడం మాని, పదేపదే నమలడం మంచిదను!

20. భోజనం అయ్యాక నీరు మాని, భోజనం అరిగాక త్రాగడం మంచిదను!

21. పగటి పూట నిద్దర మాని, రాత్రికి గాఢ నిద్ర మంచిదను!

22. ఖరీదుగల హైబ్రీడు పళ్ళు తినడం మాని, సహజమైన పళ్ళు తినడం మంచిదను!

23. పళ్ళు రొంప అనడం మాని, రోగనిరోధకానికి మంచిదను!

24. పళ్ళలోని పిప్పి ఊసి వేయడం మాని, అది మింగడం మంచిదను!

25. రసాలను త్రాగడం మాని, నమలడం మంచిదను!

26. పనికి రాని కాలక్షేపం మాని, మనస్సుకు దైవ చింతన మంచిదను!

27. గదులలో మగ్గడం మాని, ఎండ తగలడం రోగనిరోధకానికి మంచిదను!

28. ఫ్యాన్లు, ఏ.సి.లు మాని, చెమట పడితే ఆరోగ్యానికి మంచిదను!

29. పలుమార్లు విరేచనం బలహీనమని మాని, 3,4 సార్లు సాఫీగా అవడం మంచిదను!

30. పైకి పౌడర్లు, అత్తరు పూత మాని, రెండు పూటలా స్నానం మంచిదను!

31. పొద్దుపోయాక భోజనం మాని, పొద్దు ఉండగానే భోజనం మంచిదను!

32. ఉన్నదని తినడం మాని, శ్రమకు తగిన తిండి మంచిదను!

33. రాత్రికి పీకల దాకా తినడం మాని, ఫ్రీగా తినడం మంచిదను!

34. రాత్రికి సినిమాలు, షికార్లు మాని, సత్ సాంగత్యము మంచిదను!

35. తిని పడుకోవడం మాని, అరిగాక పడుకోవడం మంచిదను!

36. కృత్రిమమైన ఆహారాలు మాని, సహజ దేహానికి సహజాహారం మంచిదను!

37. ఫ్రిజ్ ల వాడకం మాని పళ్ళు, కూరలకు గాలి, వెలుతురు మంచిదను!

38. రోజూ బీరు, కూల్ డ్రింక్స్ మాని, కనీసం 6 లీటర్ల మంచినీరు మంచిదను!

39. ముప్పు తెచ్చే ఉప్పును తాకటం మాని ఆహారంలో ఉన్న ఉప్పే ఆరోగ్యానికి మంచిదను!

40. కఫాన్ని పెంచే పంచదార, బెల్లాలు మాని, అన్ని విధాలా తేనె వాడటం మంచిదను!

41. చింతపండు వాడకం మాని, పచ్చి చింతకాయ వాడకం మంచిదను!

42. ఎండు మిర్చిని వాడడం మాని, గుణాలు గల పచ్చి మిర్చి మంచిదను!

43. అపకారం చేసే నూనె, నేతులు మాని, నేటి కాలానికి ఇది మంచిదను!

44. మషాలాలు ఆహారంలో మాని, మందుగా వాడటం మంచిదను!

45. చీటికి మాటికి మందులు మాని, అత్యవసరానికి మంచిదను!

46. రుచులతో రోజూ తినడం మాని, పెళ్ళి పండుగులకు మాత్రమే మంచిదను!

47. జీవాలను తినడం మాని, సత్వాన్నిచ్చే సాత్విక భోజనం మంచిదను!

48. "రుచులను తిననివాడు మనిషా" అనడం మాని, మనిషి అదుపులో రుచి మంచిదను!

49. రోగాలు లేవని రుచులను తినడం మాని, రోగాలు రాకుండా ఆహారం తినడం మంచిదను!

50. రోగం వచ్చాక తినడం మాని, ఉపవాసం చెయ్యడం మంచిదను!

51. ఆకలి లేనప్పుడు ఆహారం మాని, నీరు త్రాగడం మరీ మంచిదను!

52. "ఛీ! ఎనిమా" అనడం మాని, రోగానికి ఎనిమా మంచిదను!

53. ప్రకృతి వికృతి చేయడం మాని, ప్రకృతి ఆరోగ్యానికి మంచిదను!

54. రోగం తగ్గే వరకే ప్రకృతి చేయడం మాని, జీవితకాలం ఆచరించడం మంచిదను!

55. బాధ్యతలు తీరే వరకు బ్రతికితే చాలు అనడం మాని, 100 సంవత్సరాలు బ్రతకాలని కోరడం మంచిదను!

56. అసంతృప్తిని మాని, తృప్తి ఆరోగ్యానికి మంచిదను!

57. కోపం, ఈర్ష్య, చిరాకులు మాని, శాంతం ఆరోగ్యానికి మంచిదను!

58. ఎదుటవారితో చేయించుకోవడం మాని, మన పని మనమే చేసుకోవడం మంచిదను!

59. సాటివారిని ద్వేషించడం మాని, ప్రేమించడం ఆరోగ్యానికి మంచిదను!

60. ప్రకృతి విధానాన్ని వైద్యం అనడం మాని, జీవన విధానం అనడం మంచిదను.🙏

బాత్రూంలో వచ్చే మూర్ఛ

     బాత్రూంలో వచ్చే  మూర్ఛ 


  స్నానం చేస్తూ  పడిపోయి  స్ట్రోక్ వచ్చిన  వ్యక్తుల గురుంచి మనం తరచుగా  వింటాము.  

మరెక్కడా పడి పోవడం  గురించి మనం ఎందుకు వినడంలేదు?  


నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రొఫెసర్ ఈ విధంగా చెప్పారు..


మీరు స్నానం చేసే ముందు తల స్నానం చేయవద్దని , మొదట మీ శరీరంలోని ఇతర భాగాలను శుభ్రపరచాలని సలహా ఇచ్చారు.  ఎందుకంటే, తల తడిగా మరియు చల్లగా ఉన్నప్పుడు చల్లబడిన రక్తనాళాలలో ఉష్ణోగ్రత పెంచడానికి , రక్తం తలపై కి  వేగం గా ప్రవహిస్తుంది.  రక్త నాళాలు బలహీనంగా గాని, సన్నగా గాని ఉన్నట్లైతే ,  రక్త నాళాలు చిట్లిపోయే  అవకాశం ఎక్కువగా  ఉంది.  

ఇలా సాధారణంగా స్నానాల గదిలో  జరుగుతుంది కాబట్టి, ఇది మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండటానికి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి. 


  1. పాదం నుండి స్నానం ప్రారంభిచండి 


  2. కాళ్ళు.


  3. తొడ.


  4. ఉదరం.


  5. భుజం.


  6. 5-10 సెకన్ల పాటు ఆగిన  తరువాత 


  👉 మనం శరీరం నుండి ఆవిరి / గాలి పొంగిపొర్లుతున్నట్లు అనిపిస్తుంది, ఆపై యథావిధిగా తల  స్నానం చేయండి. తల స్నానానికి మాత్రం తప్పనిసరిగా గోరువెచ్చని నీరు వాడండి. 


 ✅ వేడి నీటితో నిండిన గాజుపాత్రలో  వేడి నీరు ఖాళీ చేసి వెంటనే  చల్లటి నీటితో నింపండి. 

 ఏం జరుగుతుంది ?

  గాజు పాత్ర పగిలిపోతుంది *


  అదే విధంగా మన శరీర ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉంటుంది మరియు నీరు  చల్లగా ఉంటుంది, మనం స్నానం  తల స్నానంతో మొదలు పెడితే  , రక్త నాళాల  ఉష్ణోగ్రతల మార్పు వలన తలలో రక్తనాళాలు చిట్లే అవకాశం ఎక్కువగా ఉంది. 


   అకస్మాత్తుగా బాత్రూంలో  పడటం మనం తరచుగా చూస్తాము.  కానీ  తప్పుడు స్నాన పద్ధతి కారణంగానే , మనకు స్ట్రోక్ గాని  లేదా మైగ్రేను(తలనొప్పి) రావడానికి  కారణం అని మనలో ఎంత మందికి తెలుసు .


ఈ సమాచారం ప్రతి ఒక్కరికి  అందేలా చూడడం మనఅందరి బాధ్యత 🙏


ఆరోగ్యమే మహా భాగ్యం.


Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE