NaReN

NaReN

Thursday, August 18, 2022

శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం

 *శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం*




1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు

2. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228 (3228 B.C)

3. మాసం : శ్రావణం

4. తిథి: అష్టమి

5 . నక్షత్రం : రోహిణి

6. వారం : బుధవారం

7. సమయం : రాత్రి గం.00.00 ని. 

8  జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు

9. నిర్యాణం: క్రీ పూ 18.02.3102(3102 B.C)

10. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది

11  కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం

12. కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.

13. భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.

14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:

మధురలో కన్నయ్య

ఒడిశాలో జగన్నాధ్

మహారాష్ట్ర లో విఠల (విఠోబ)

రాజస్తాన్ లో శ్రీనాధుడు

గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్

ఉడిపి, కర్ణాటకలో కృష్ణ


15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు

16. జన్మనిచ్చిన తల్లి దేవకీ

17. పెంచిన తండ్రి నందుడు

18. పెంచిన తల్లి యశోద

19. సోదరుడు బలరాముడు

20. సోదరి సుభద్ర

21. జన్మ స్థలం మధుర

22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ

23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు : చాణుర - కుస్తీదారు

కంసుడు - మేనమామ

శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు

24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.  

25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. 

26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 

27.  14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.

28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.

29. కాలయవన అను సింధూ రాజు  నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.

30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.

31. శ్రీకృష్ణుడు  ద్వారకాను పునర్నిర్మించారు.

32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.

33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.

34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.

35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.

36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.

37. రాజ్యము నుండి  వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.

38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.

39  ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.

40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.

41. శ్రీకృష్ణుడు  జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. 

43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.

అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు. 

44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.

(సేకరణ)

స్నేహితుల స్వాతంత్ర్య సంభాషణ

 ఇద్దరి స్నేహితుల స్వాతంత్ర్య సంభాషణ (తప్పక చదవండి):






మీ నుండి మా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 years

అయింది, తెలుసా? అని అన్నాడు రాజేష్ ఒక ఇంగ్లాండ్ పౌరుడితో(పీటర్ తో) 


అప్పుడు ఆ ఇంగ్లాండ్ పౌరుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు.


మీ దేశం పేరేమిటి?


ఇండియా అన్నాడు రాజేష్..


మీ దేశానికి మేము పెట్టిన పేరు అది. మీ దేశం అసలు పేరే నీకు తెలియదు. ఇప్పుడు తెలుసుకో. భారత్ మీ దేశం పేరు.


నువ్వు చదువుకున్న చదువు ఏ మీడియం?


ఇంగ్లీష్ మీడియం..


ఇంగ్లీష్ అనేది మా భాష. నువ్వు చిన్నప్పటి నుండీ మా భాషను నేర్చుకుంటూ పెరిగావు. మా భాషను మాట్లాడుతూ పెరిగావు. మా ఇంగ్లీష్ కల్చర్ ను నేర్చుకుంటూ పెరిగావు. నీ హై స్కూల్,

ఇంటర్మీడియేట్, డిగ్రీ చదువులన్నీ ఇంగ్లీష్ లోనే చదివావు.


చివరికి ఇప్పుడు నువ్వు చేసే Master Degree కూడా మా ఇంగ్లీష్ వాడి దేశంలోనే.


నీ దేశం పేరు మా ఇంగ్లీష్ వాడు పెట్టింది. నువ్వు తినే

తిండీ, వేసుకునే బట్టా మా ఇంగ్లీష్ వాడు పెట్టింది. నువ్వు

చదివిన చదువు మా ఇంగ్లీష్ వాడిది. నువ్వు నేర్చుకున్న కల్చర్ మా ఇంగ్లీష్ వాడిది.


ఇప్పుడు చెప్పు రాజేష్. మీ భారతీయులకు మా ఇంగ్లీష్

వారి నుండి నిజంగా స్వాతంత్ర్యం వచ్చిందా అని సూటిగా అడిగాడు పీటర్..


అంటే మా దేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదా పీటర్ అని బాధపడుతూ అడిగాడు రాజేష్..


ఎప్పుడైతే మీ దేశంలోని విద్యా వ్యవస్థ మీ దేశం యొక్క

సంస్కృతీ సంప్రదాయాలను బోధించడం మొదలు పెడుతుందో, రామాయణం లోని ధర్మ సూక్ష్మాలను, భగవద్గీతలోని జ్ఞాన సూక్ష్మాలను విద్యార్థులకు బోధించడం మొదలు పెడుతుందో, ముఖ్యంగా ఒకప్పటి మీ దేశ భాష అయిన సంస్కృతంలోని నీతి సూక్తులను బోధించడం మొదలు పెడుతుందో, మా దేశం యొక్క బ్రాండెడ్ ఉత్పత్తులను వాడడం మీ దేశం ఎప్పుడైతే తగ్గిస్తుందో, మీ దేశం సొంతంగా, అధికంగా ఉత్పత్తులను ఎప్పుడైతే తయారు చేసుకుంటుందో, అప్పుడే మీ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు రాజేష్ అని భుజం మీద చెయ్యి వేసి చెప్పాడు పీటర్.


మా భారత దేశం యొక్క సంస్కృతి గురించి నాకన్నా

నువ్వే బాగా తెలుసుకున్నావ్, ఎలా పీటర్? 


నీకూ నాకూ ఒకటే తేడా రాజేష్. నువ్వు MS చదవడానికి

ఈ London University కి వచ్చావు. నేను Sanskrit, Hinduism మీద study చేయడానికి వచ్చాను. అంతే తేడా.


ఏది ఏమైనా నీకు 75 th స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు రాజేష్. Happy Independence Day అని చెప్పి

వెళ్ళిపోయాడు పీటర్.

Monday, August 15, 2022

సీతారామం....

 సీతారామం....

కరెక్టుగా 80 ఏళ్లక్రితం హాలివుడ్ లో సిటిజెన్ కేన్ అని సినిమా వచ్చింది. బిలియనీర్, పత్రికాధిపతి అయినా హీరో కేన్ మరణసమయంలో ఒక పదం ఉచ్చరిస్తాడు. ఆ పదం వెనుక కారణాలను అన్వేషించే క్రమంలో కేన్ బాల్యం నుండి అతను జీవితంలో పైకెదగిన క్రమంగురించి చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్ రూపంలో...

ఈ సినిమా విడుదలయ్యాక సంచలన విజయం సాధించింది. ఒక వ్యక్తి జీవితంలో రహస్యాకోణాలు తెలుసుకోవటం వీక్షకులకు ఎప్పటికి ఆసక్తిదాయకమే. అది ప్రముఖులైతే ఇక చెప్పాల్సిన పనిలేదు.

ఈ స్క్రీన్ ప్లే ఫార్ములాను మొదట పట్టుకుంది నాగ్ అశ్విన్ మహానటి సినిమాలో ఉపయోగించాడు. అసలు సావిత్రి బయోగ్రఫీ అంత గొప్పదేం కాదు. తెలిసి తెలిసి ఉమనైజర్, రెండో పెళ్లి వాడిని చేసుకుంది. డబ్బు పట్లక్రమశిక్షణ లేదు. తాగుడుకు బానిసయ్యింది. తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది. మరి ఈ కథ సినిమాగా ఎలా మెటీరియలైజ్ అయ్యింది అంటే సిటీజెన్ కేన్ స్క్రీన్ ప్లే ఫార్ములాయే. ఒక ప్రముఖ వ్యక్తిని అన్వేషిస్తూ ఒక జంట లేదా వ్యక్తులు తాము అన్వేషించే వ్యక్తి యొక్క వివరాలు సేకరించటం ఆ వ్యక్తి జీవితంలోని మలుపులు, ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిలోని టెంపో తగ్గకుండా ఉపయోగపడతాయి. కథకుడు ఇక్కడే సగం విజయం సాధిస్తాడు. మిగతాది సంగీతం, నటినటుల ప్రతిభా విశేషాలమీద ఆధారపడి ఉంటుంది.

ఇక్కడ సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ఇదే టెక్నిక్ ఉపయోగించాడు. ఎత్తుగడ కూడా సీతను వెతకటంతో ప్రారంభించి రామ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటంతో కథ ముగుస్తుంది. రష్మిక, తరుణ్ భాస్కర్ వెదుకులాటలో మధ్యమధ్యలో పెద్దగా ట్విస్టులేం ఉండకపోయినా దుల్కర్ సల్మాన్, మృణల్ ఠాకూర్ ల మధ్య అందమయిన సుందర దృశ్యాకావ్యం లాంటి ప్రేమ సన్నివేశాలు అతి సుందరంగా అనిపిస్తాయి. బహుశా ఈ సినిమా పర్యవేక్షణ నాగ్ అశ్విన్ దే అయ్యుంటుంది. హను రాఘవపూడి మీద మణిరత్నం ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుంది. మొదటి సినిమా అందాలరాక్షషిలోనే అర్ధం అవుతుంది. హీరోహీరోయిన్లు నాలుగడుగుల దూరంలో ఉన్నా ఘాట్టిగ గీతాంజలి సినిమా స్టయిల్ లో మాట్లాడటం వగైరా...

ఇక కథ విషయానికి వస్తే సినిమా కథేమి గొప్పగా అనిపించదు. కానీ దుల్కర్ సల్మాన్ ఉన్నాడే... ఆద్యంతం తన నటనతో కట్టిపడేస్తాడు. క్లీన్ షేవ్ తో అందంగా, హుషారయినా నటనతో ఆకట్టుకుంటాడు.  దుల్కర్ కాక ఇంకో హీరోను ఊహించలేము అన్నంత బాగా చేశాడు. తండ్రిలాగే మంచి కంఠస్వరం చాలామంది తెలుగు హీరోలకన్నా ఉచ్చారణ బాగుంది. నానీ, శర్వానంద్ లు హీరో అయ్యుంటే సినిమా ఇంతబాగా ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పగలను. హీరోయిన్ పెద్ద అందగత్తె కాదు కానీ తన నటనతో మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తో రామ్ గురించి మాట్లాడేటప్పుడు రోజా సినిమాలో మధుబాల గుర్తుకురాక మానదు. చెప్పాను కదా హను మీద మణిరత్నం ప్రభావం ఉందని. ఈ సినిమాకు సంగీతం మైనస్ అనే చెప్పవచ్చు. పాటలు బాగుండి ఉంటే మణిరత్నం రోజా లెవెల్ లో ఉండేది. వెన్నెల కిషోర్, మురళీశర్మ, గౌతమ్ వాసుదేవ్, వారిపరిధిలో బాగా చేశారు. ప్రియదర్శి, సునీల్, రాహుల్ రవీంద్రన్ లవి జస్ట్ గెస్ట్ క్యారెక్టర్స్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ సుమంత్, అటు పాకిస్తానీ సైన్యం మంచిదే ఇటు రామ్ మంచివాడే మధ్యలో విష్ణును అంటే సుమంత్ ను విలన్ ను చేసిపారేశారు. మంటల్లో చిక్కుకున్న అమ్మాయికోసం రామ్ వెళితే అసలు అక్కడ ఉండకుండా సుమంత్ వెళ్ళొపోవచ్చు కానీ రామ్ కోసం ఆగి తను బలి అయ్యాడు. తన కుటుంబం కోసం దేశద్రోహ చర్యకు పాల్పడుతాడు. సగటు మనిషిలాగా ఆలోచించాడు. చివర్లో కోర్టు మార్షల్ కు భయపడి ఆత్మహత్య చేసుకుంటాడు. సుమంత్ హీరో క్యారెక్టర్లకోసం పాకులాడకుండా ఇలాంటి సపోర్టింగ్ క్యారెక్టర్ లతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకోవచ్చు.

సినిమా చూడొచ్చు... బోర్ కొట్టదు. 

తల్లిదండ్రులే అలవాట్లే పిల్లలకు బాటలు

తల్లిదండ్రులే అలవాట్లే  పిల్లలకు బాటలు

*పిల్లలపై అత్యంత ప్రభావం చూపేది కుటుంబం, కుటుంబ వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన, వారి పెంపకం.*


*కానీ ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు, ఆ బాధ్యతను అంగీకరించేందుకు మనం సిద్ధంగా లేము.*


*ఎందుకంటే మన పిల్లలు తప్పుదారి పట్టడానికి మనమే కారణమని అంగీకరించలేము.*

*తల్లిదండ్రులందరూ తప్పు చేశారనను, చేస్తున్నారనను. పెళ్లయ్యాక పిల్లలు పుట్టడం సహజంగా జరిగే చర్య.*


*కానీ పిల్లల పెంపకం అంత సులువుగా, సహజంగా జరిగే చర్య కాదు. అదో సైన్స్, ఆర్ట్. ఏ వయసులో పిల్లలు ఎలా పెరుగుతారో, ఎలా ఆలోచిస్తారో, ఎలా స్పందిస్తారో తెలియకుండానే, తెలుసుకోకుండానే పిల్లల్ని పెంచేస్తున్నాం. ఫలితమే ఇలాంటి సమస్యలు.*

*#మరిఈతప్పులెవరివి?*

*ఉదయం లేచింది మొదలు మొబైల్ లేదా ల్యాబ్ టాప్ పై గడిపే తండ్రి తన కూతురు మొబైల్ ఫోన్ కు అడిక్ట్ అయ్యిందంటూ కౌన్సెలింగ్ కు తీసుకువెళ్లి తున్నారు. ఆ మొబైల్ కొనిచ్చిందెవరు? ఎవర్ని చూసి ఆమె మొబైల్ వాడకం నేర్చుకుంది? నువ్వు చేస్తుంది ఏంటి డాడీ అని ఆ అమ్మాయి అడిగితే ఆ తండ్రి ఏం సమాధానం చెప్తాడు?*


*చదువుకోసం, బంగారు భవిష్యత్తు అందించేందుకు కొడుకుని చిన్నప్పటినుంచీ ఇంటికి దూరంగా రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో చదివించిన తల్లిదండ్రులు ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన కొడుకు తమను పట్టించుకోవడం లేదని బాధపడుతూ కౌన్సెలింగ్ కు వచ్చారు. బంధాలు, అనుబంధాలకు దూరంగా మార్కులు, ర్యాంకులకు దగ్గరగా పెంచి, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం?*


*కెనడాలో స్థిరపడిన ఓ భారతీయ కుటుంబం తమ కూతురు ఆల్కహాల్ కు అడిక్ట్ అయ్యిందంటూ సంప్రదించారు. కానీ తాగడం తమ దగ్గరినుంచే నేర్చుకుందనే విషయం దాచిపెడతారు. ఎవర్ని మోసం చేసేందుకు?*


*విజయవాడకు చెందిన ఓ వ్యాపారకుటుంబం తమ కూతురికి రోజుకు మూడు వేలు, ఎస్, రోజుకు మూడువేలు పాకెట్ మనీ ఇచ్చారు. అంత పాకెట్ మనీ ఇవ్వడం గర్వంగా ఫీలయ్యారు. ఇప్పుడదే సమస్యగా మారింది. కౌన్సెలింగ్ కు వచ్చారు.  దేనికి డబ్బు ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపుగా ఉండాలో తల్లిదండ్రులకే తెలియకపోతే ఆ పిల్లకెలా తెలుస్తుంది?*


*సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఒంటరితనంతో బాధపడుతున్నానంటూ సంప్రదించాడు. తన కుటుంబ సభ్యులు తన సంపాదన కోసమే చూస్తున్నారు తప్ప తనను పట్టించుకోవడంలేదని ఏడ్చేశాడు.*


*తిరుపతికి చెందిన ఓ తండ్రి అమెరికాలో చదువుతున్న కొడుక్కి కారు కొనిపెట్టాడు.  అతను దారితప్పి ఇండియాకు వచ్చేశాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కౌన్సెలింగ్ కు తీసుకొచ్చారు. చదువుకునే కొడుక్కి కారు ఎందుకనే ప్రశ్న తండ్రికి రాలేదు. అవసరానికి (nead ) ఆడంబరానికి (want) మధ్య తేడా తెలీకుండా పెంచి ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం*


*#ఏం_నేర్పిస్తున్నాం?*


*కొడుకు ప్రాజెక్టు వర్క్ కోసం ఆపీసు నుంచి ప్రింట్లు తీసుకొచ్చే తండ్రి పరోక్షంగా అతనికి ఏం నేర్పిస్తున్నాడు?*


*నచ్చిన చీర కొనుక్కుని ఆ విషయం భర్తకు చెప్పొద్దని చెప్పే తల్లి ఆ కూతురుకి ఏం నేర్పిస్తుంది?*


*పిల్లల ఎదురుగా భర్త లేదా భార్యతో గొడవపడటం ద్వారా మీరేం నేర్పిస్తున్నారు?*


*ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించి, వారు వెళ్లిపోగానే విమర్శించే మీనుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారో తెలుసా?*

*లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తల్లిపై బిడ్డలకు ఏం గౌరవం ఉంటుంది?*


*పిల్లలు చదువుతుండగా మీరు tv చూస్తుంటే వారిపట్ల మీకేం శ్రద్ధ ఉన్నట్లు?*


*పిల్లల్ని కూర్చోబెట్టుకుని జబర్దస్త్ లాంటి షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే విలువలు ఎక్కడినుంచి వస్తాయి?*


*మార్కులు, ర్యాంకుల గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీరెప్పుడైనా మాట్లాడారా? వారి ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకున్నారా? అసలు వారికిష్టమైన కోర్సు చదవనిచ్చారా?*


*చదువుల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చుచేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన తీరులో ఆలోచించడం నేర్పిస్తున్నారా? దానికోసం రూపాయైనా ఖర్చు చేస్తున్నారా?*


*అసలు పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలుసా? అందుకోసం కనీసం ఒక్క పుస్తకమైనా కొని చదివారా? ఒక్క వీడియో అయినా చూశారా? ఒక్క క్లాసయినా విన్నారా?*


*అవసరానికి, ఆడంబరానికి మధ్య ఉన్న తేడా మీ పిల్లలకు తెలిసేలా చేశారా?*


*సరదాకు, విచ్చలవిడి తనానికి తేడా ఏమిటో వివరించారా?*


*వారి జీవితానికి వారే బాధ్యులని ఎన్నడైనా చెప్పారా?*


*మీ పిల్లలు చెడిపోవడానికి మీడియా, సోషల్ మీడియా, టెక్నాలజీనే కారణమని తిడుతూ మీరు మీ బాధ్యతనుంచి తప్పించుకుంటున్నారని ఎన్నడైనా గుర్తించారా?*


*మీ పిల్లలు మిమ్మల్ని నిరంతరం గమనిస్తుంటారని, మిమ్మల్నే అనుసరిస్తారని, వారిపై అన్నింటికంటే మీ ప్రభావమే ఎక్కువని తెలుసుకోండి. అన్నిటికీ సమాజాన్ని తిట్టడం మానేసి మార్పు మీనుంచి, మీ ఇంటినుంచి మొదలుపెట్టండి.* 

Saturday, August 13, 2022

7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు."

 🍁 *7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు."* 🍁


🌿*1వ ప్రశ్న:* ప్రపంచంలో ఏది పదునైనది?

*జ:* చాలా మంది కత్తి అని చెప్పారు. 

*గురువు:* కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.


🌿*2వ ప్రశ్న:* మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ?

*జ:* చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ

*గురువు:* మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం.

ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,

ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము.


🌿*3వ ప్రశ్న:* ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది?

*జ:* చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు.

*గురువు:* ప్రపంచంలో పెద్దది మన పాపమే.


🌿*4వ ప్రశ్న:* ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ?

*జ:* చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు.

*గురువు:* కఠినమైనది అనేది *"మాట ఇవ్వడం"*

మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.


🌿*5వ ప్రశ్న:* ప్రపంచంలో తేలికైనది ఏది?

*జ:* దూది,గాలి,ఆకులు అని చెప్పారు 

*గురువు:* ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.


🌿*6వ ప్రశ్న:* మనకు దగ్గరగా వున్నది ఏది?

*జ:* తల్లి తండ్రులు, స్నేహితులు,బంధువులు అని చెప్పారు. 

*గురువు:* మనకు దగ్గరగా ఉండేది మన చావు.

అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం.

అది పుట్టుకతోనే మనవెంట వచ్చింది.


🌿*7వ ప్రశ్న:* ప్రపంచంలో సులువైనది ఏది ?

*జ:*తినడం ,పడుకోవడం, తాగడం,తిరగడం 

*గురువు:* ప్రపంచంలో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం, ఇంతకంటే సులువు ఏదీ లేదు.🍁


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Monday, August 8, 2022

ఉచిత ఆరోగ్య సలహాలు

 ఉచిత ఆరోగ్య  సలహాలు

 

35+ సం. వచ్చేసరికి మహిళల్లో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది.


అందువలన శరీరానికి కాల్షియమ్ ను గ్రహించే శక్తి తగ్గుతుంది.


కాల్షియమ్ శరీరంలో తగ్గితే ఆస్టియోపొరోసిస్ అనే వ్యాధి వస్తుంది.


కాల్షియమ్ ఎక్కువ ఉన్నఆహారం తీసుకోవాలి. శరీరానికి 1200 మిగ్రా కాల్షియమ్ అవసరం.


కాల్షియమ్ ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు బాగా తీసుకోవాలి.


శరీరం కాల్షియమ్ ను గ్రహించాలంటే విటమిన్ డి3 మరియు వ్యాయామం అవసరము.


విటమిన్ డి3 ప్రొద్దున సూర్యోదయం అప్పుడు వచ్చే సూర్య కిరణాల్లో ఉంటుంది.


కావున ప్రొద్దున పూట సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వ్యాయామం చేస్తే శరీరం కాల్షియమ్ ను గ్రహించుకుంటుంది.


లేకుంటే కాల్షియమ్ ట్యాబ్లేట్లు మ్రింగవలసి ఉంటుంది.


40+ సం. దాటినవారు ఎక్కువ సమయం కూర్చుని ఉంటారు. అందువలన కండరాలు పటుత్వం కోల్పోయి ముసలితనం వస్తుంది.


ఇది అరికట్టడం కొరకు ప్రోటీన్లు ఎక్కువగావున్న ఆహారం తీసుకోవాలి.


ఉదాహరణకు పప్పు, మొలకలు, బాదం గింజలు లాంటివి .


1 కిలో శరీర బరువుకు 1.5 గ్రా.చొప్పున మాంసకృత్తులు తీసుకోవాలి. ఉ. దా 60కేజీ బరువున్నవారు 90 గ్రా ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది.


మరో ముఖ్య విటమిన్ - విటమిన్ బి 12. శరీరానికి రోజుకు 2.4 మైక్రో.గ్రా బి-12 కావాలి.


విటమిన్ బి 12, శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు,ఎర్ర రక్తకణాల వృద్ధికి, మెదడు సరిగా పనిచేయడానికి అవసరం.


బి 12, పాలు,పెరుగు,చీజ్ ,గుడ్లు, చేపలు, చికెను మొదలైన వాటిలో లభిస్తుంది.


ఉప్పు, చక్కర, క్రొవ్వు పదార్ధాలు తగ్గిస్తే మంచిది. అధిక ఉప్పు అధిక రక్తపోటుకు, కీళ్ల నొప్పులకు దారి తీసే అవకాశం ఉంది.


అలాగే చక్కర ఊబకాయానికి, కొంత ఎముకల దృఢత్వం తగ్గడానికి కారణమవుతుంది.


అధిక క్రొవ్వు గుండె పోటుకు కారణం కావచ్చు.


అన్నిటికన్నా ముఖ్యంగా నీరు ఎక్కువ తీసుకోవడం అవసరం.


దాహమైనా కాక పోయిన నీళ్లు త్రాగడం అవసరం.


40+ సం దాటినవారు ఎక్కువగా మతిమరుపు వచ్చిందని అంటూ ఉంటారు. ఒక సర్వే ప్రకారం వీళ్ళు నీళ్లు తక్కువ తీసుకోవడం కూడా మతిమరుపుకు ఉన్న కారణాల్లో ఒకటని తేలింది.


చక్కగా పండ్లు, కూరలు, ఆకుకూరలు, మొలకలు, తృణధాన్యాలతో కూడిన మితాహారాన్ని తీసుకుంటూ,శరీరానికి తగినంత వ్యాయామాన్ని ఇస్తే సరిపోతుంది.

ధన్యవాదములు 🙏


Sunday, August 7, 2022

గొంతులో క‌ఫం పేరుకుపోయిందా?

 గొంతులో క‌ఫం పేరుకుపోయిందా?

 ఈ ఒక్క చిట్కాచాలు


గొంతులో క‌ఫం పేరుకుపోవ‌డం.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా ఎంద‌రినో స‌ర్వ సాధార‌ణంగా వేధించే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.


అందులోనూ ప్ర‌స్తుత చ‌లి కాలంలో ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా ఉంటుంది.గొంతులో క‌ఫం పేరుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, శ్వాస స‌రిగ్గా తీసుకోలేక‌పోవ‌డం, చికాకు, మింగ‌డానికి తీవ్ర‌మైన ఇబ్బంది, ఛాతి నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.


అందుకే క‌ఫాన్ని త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఏవేవో మందులు వాడ‌తారు


 మిరియాలు 

 దాల్చిన చెక్క

,శొంఠి  

పిప్పళ్లు 

కరక్కాయ పెచ్చులు

 తీసుకుని మెత్తటి పొడిలా దంచుకోవాలి.


ఇప్పుడు స్ట‌వ్ మీద గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాట‌ర్ పోసి హీట్ చేయాలి.వాట‌ర్ కాస్త హీట్ అవ్వ‌గానే.దంచి పెట్టుకున్న  పొడి 2 టీ స్పూన్  వేసి ఐదు నిమిషాల పాటు మ‌రిగించాలి.


ఆపై వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని.అందులో స్పూన్ తేనెను మిక్స్ చేసి చప్పరిస్తూ సేవించాలి.


ఇలా ప్ర‌తి రోజు ఉద‌యాన్నే చేస్తే గ‌నుక గొంతులో పేరుకు పోయిన క‌ఫం మొత్తం క్ర‌మంగా క‌రిగిపోతుంది.అంతే కాదు, ఈ పానియాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల‌.అందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్ష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌ను నివారిస్తాయి.శ్వాస కోశ‌లో అడ్డంకులు ఉంటే తొల‌గించి.


ఊపిరి ఫ్రీగా ఆడేలా చేస్తాయి.మ‌రియు ఛాతిలో నొప్పి, మంట వంటి స‌మ‌స్య‌ల‌ను సైతం త‌గ్గిస్తాయి.



Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE