NaReN

NaReN

Saturday, August 6, 2022

అల్సర్‌ ఎందుకొస్తుందో తెలుసా..?


Stomach ulcers: అల్సర్‌ ఎందుకొస్తుందో తెలుసా..?

 గాడితప్పిన ఆహారపు అలవాట్లు.. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలు, పొగ, మద్యం వ్యసనంతో కడుపులో అల్సర్లు ఏర్పడుతాయి. పొట్టలోని మ్యూకోజ్‌ పొరకు చిరుగులు ఏర్పడటంతో తరచూగా తీవ్రమైన మంట, కడుపునొప్పి వస్తుంటుంది. ఆహారం తీసుకున్న తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. పొట్టలో వేధించే అల్సర్లకు చికిత్స, దాని తీరుతెన్నులను  గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ సోమశేఖర్‌రావు వివరించారు.


సమస్యలు ఇలా ఉంటాయి..


* పెద్ద పేగుల్లో అల్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటుంది. చిన్న పేగుల్లోనూ అల్సర్లు వస్తాయి.


* బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో అల్సర్లు ఏర్పడుతున్నాయి. కలుషిత ఆహారం, నీటితో వస్తుంది. అధికంగా పెయిన్‌ కిల్లర్‌ వాడినా రానున్నాయి. 


* అన్నం తినగానే కడుపులో నొప్పి వచ్చినపుడు అల్సర్లు వస్తాయని తెలుసుకోవాలి.  ట్యాబ్లెట్లు వేసుకుంటే తాత్కాలికంగా తగ్గినా తర్వాత ఇబ్బంది పడొచ్చు. ఎండోస్కోపీ చేస్తే వ్యాధి తీవ్రత తెలుస్తుంది.


* మందులతోనే ఎక్కువగా తగ్గిపోతాయి. మళ్లీ అల్సర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 


* బయటి ఆహారం తీసుకోవద్దు. నీరు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కడపడితే అక్కడి నీటిని తాగొద్దు.


* గ్యాస్‌ ట్యాబ్లెట్లను దీర్ఘకాలికంగా వాడొద్దు. కారం, మసాలాలు ఎక్కువగా తినొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే మంచిది.

Friday, August 5, 2022

ఆలస్యం నిదానం*



                *ఆలస్యం నిదానం* 

                 ➖➖➖✍️

   

 *మనిషి తన దైనందిన కృత్యాల్లోను, వివిధ కార్యక్రమ ప్రణాళికా రచనలోను రెండు సూత్రాలను ప్రధానంగా గుర్తుకు తెచ్చుకుంటాడు.*


*‘ఆలస్యం అమృతం విషం’ అని, ‘నిదానమే ప్రధానం’ అని..!*


*నిజానికి ఈ రెండు సూత్రాలూ కార్యసాఫల్యానికి అవసరమైనవే. ఆయా సందర్భాలు, సన్నివేశాలు, పరిస్థితులను బట్టి ఈ సూత్రాలను ఆచరణలోకి తేవాల్సి ఉంటుంది.* 


 *ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తన బుద్ధితోనే గాక, తన హితం కోరేవారు, ఆత్మీయుల బుద్ధిని కూడా ఉపయోగించుకోవడం పురోగతి కోరుకునేవాడి  లక్షణం.* 


*తనకు తోచిందే సరైనదని వెనకా ముందూ ఆలోచించకుండా అనుకున్న వెంటనే పని మొదలెట్టడం వైఫల్యానికి, అవమానానికి కారణభూతమవుతుంది. విపరీత ఫలితాలు ఎదుర్కొన్నాక పశ్చాత్తాపం చెందడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది.*


*ఈ తొందరపాటు ప్రతి మనిషి జీవితంలోనూ కనిపిస్తుంది. అదే శోక కారణమవుతుంది. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను విని విశ్లేషించుకుని అహంకరించక, వివేకంతో ముందడుగేసేవాడు కచ్చితంగా కార్యసాధకుడు కాగలడు.* 


 *తొందరపాటు వల్ల జీవితంలో దిద్దుకోలేని అగచాట్లు ఎదురవుతాయి. నిరంతరం దుఃఖం అనుభవించే సంఘటనలూ జరుగుతుంటాయి.* 

 

 *ప్రధానంగా కామక్రోధ లోభమోహాది అరిషడ్వర్గాల వల్ల, మానసిక ఒత్తిళ్ల వల్ల, భావోద్వేగాలకు బానిస కావడం వల్ల తొందరపాటుతో తప్పులు దొర్లుతుంటాయి. ఈ బలహీనతలను అధిగమించి, వివేకంతో సంయమనంతో సమయజ్ఞతతో వ్యవహరించే వాడెప్పుడూ విజేతే అవుతాడు.* 


*ఏ పని ముందు, ఏ పని తరవాత అని ప్రశ్నించుకుంటూ ప్రవర్తించడమే రాజనీతి లక్షణమని వాల్మీకి మహర్షి            ఓ సందర్భంలో  ప్రబోధించాడు.                            కైక తొందరపడి అనాలోచితంగా, అసందర్భంగా దశరథుణ్ని కోరిన రెండు వరాల వల్ల ఎంత అపఖ్యాతి పొందిందో తెలిసిందే.* 


*శకుని పన్నాగాలకు ప్రభావితుడై దుర్యోధనుడు అనేక తొందరపాటు చర్యల వల్ల ఎంతగా ఎన్నిసార్లు భంగపడ్డాడో తెలియనిదెవరికి?* 


 *ధర్మరాజు రాజసూయ యాగం ప్రారంభించిన సందర్భంలో అగ్రపూజకు వాసుదేవుణ్ని ఆహ్వానించినప్పుడు శిశుపాలుడు ఆవేశంతో, అహంకారంతో, పరమాత్మను దుర్భాషలాడి చావును కొనితెచ్చుకున్నాడు.* 


*తార చెప్పిన హిత వాక్యాలను పెడచెవిన పెట్టి వాలి అహంకారంతో సుగ్రీవుడితో యుద్ధానికి తలపడి ధర్మమూర్తి శ్రీరామచంద్రుడి చేతిలో హతుడయ్యాడు.* 


*అనాలోచితంగా, భవిష్యత్తును గురించి ఆలోచించకుండా వేసే ఏ అడుగైనా తొందరపాటు చర్యే అవుతుంది.* 


 *చిన్న చిన్న కారణాలకే దంపతులు విడాకులు తీసుకోవడం, యువత ఆత్మహత్యలకు పాల్పడటం తొందరపాటు వల్లనే.     కొన్ని క్షణాలు ఆలోచించి ‘ఇలా చేయడం అవసరమా?’ అని మనసులో నిదానంగా విశ్లేషించుకుంటే ఇటువంటి అనర్థాలే జరగవు.* 


*ప్రతిదానికీ విపరీతమైన స్పందన, అసందర్భమైన ఉద్రేకం మనిషిని వివేకహీనుణ్ని చేసి దుశ్చర్యలకు ప్రేరేపిస్తాయి.* 


*ఆధ్యాత్మిక శక్తిగల సాధకుడు  తొందరపడి అనుచిత నిర్ణయాలు తీసుకోడు. ‘ఉరకకు, ఉరకకు మనసా, ఉరికితే దొరకదు హంస’ అన్నారు బుధులు.* 


*ఆలోచన లేని ఆచరణ జీను లేని గుర్రంలాంటిది. ప్రణాళిక లేని కార్యం మొదలుపెట్టడమంటే లోతు తెలియని నీళ్లలో దూకడం లాంటిది.* 


*కొద్దిపాటి తొందరపాటే కొండంత సమస్యకు దారితీస్తుంది. మనిషి వినడంలో తొందరపడవచ్చు. అవగాహన చేసుకోవడంలో తొందరపడకూడదు. తొందరపాటు శత్రువుకంటే ప్రమాదకరం!* ✍️

         

Thursday, August 4, 2022

సమయస్ఫూర్తి

 _*💫  సమయస్ఫూర్తి !  🎊*_

➖➖➖➖➖➖➖✍️


*_ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా భయపడకుండా, కంగారు పడకుండా ప్రశాంతమైన మనసుతో, తెలివిగా ఎదుర్కోవాలి..!!_*


*_ఒక చిన్న గ్రామంలో జరిగిన సంఘటన ఇది..!_*


*_ఒక వ్యాపారి, తన ఊరిలోని ఒక షావుకారి వద్ద, డబ్బు అప్పు చేశాడు. వయసులో షావుకారు ముసలి వాడు. అందంగా కూడా ఉండడు. షావుకారి కన్ను, వ్యాపారి అందమైన కుమార్తె మీద పడింది. అతనికి, ఆమెను వివాహం చేసుకోవాలని కోర్కె కలిగింది. అందుకని షావుకారు, వ్యాపారితో “ఓ వ్యాపారి ! నీవు నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేస్తే, నీ అప్పు విడిచి పెడతాను‘ అని చెప్పాడు._* 


*_ఈ మాట విన్న వ్యాపారి, అతని కుమార్తె ఆశ్చర్యపోయారు._*


*_అంతేకాకుండా షావుకారు వ్యాపారితో ఈ విధంగా బేరమాడాడు. ’నేను ఒక సంచీలో ఒక తెలుపు రాయి, ఒక నలుపు రాయి ఉంచుతాను. మీ అమ్మాయి నలుపు రాయి తీస్తే, తను నన్ను వివాహం చేసుకోవాలి, అప్పుడు నీ అప్పు విడిచి పెడతాను. ఆమె తెలుపు రాయి తీస్తే, నన్ను వివాహం చేసుకోనక్కరలేదు, అప్పుడు కూడా                            నీ అప్పును విడిచి పెడతాను. మీ అమ్మాయి దీనికి ఒప్పుకోక పోతే నిన్ను జైలుకి పంపిస్తాను‘. అని చెప్పాడు._*


*_ఇలా మాట్లాడుతూ షావుకారు, వ్యాపారి తన వద్ద గల రెండు గులక రాళ్ళను ఒక సంచీలో వేశాడు. ఎంతో చురుకైన ఆ వ్యాపారి కూతురు, షావుకారు దుర్బుద్ధితో సంచీలో రెండూ నల్ల రాళ్ళనే వెయ్యటం చూసింది._* 


*_ఆ అమ్మాయి స్థానంలో మీరు గనక ఉంటే తప్పించుకోటానికి మీరు ఏం చేసేవారు ? ఆ అమ్మాయికి ఏమి సలహా ఇచ్చేవారు ?_*


*_జాగ్రత్తగా ఆలోచిస్తే కింద వివరించబడ్డ మూడు అవకాశలు కనిపిస్తాయి._*


*_1. ఆ అమ్మాయి సంచీలోనించి రాయి తీయడానికి ఒప్పుకోకూడదు._*


*_2. సంచీలో రెండూ కూడా నలుపు రంగు రాళ్ళే ఉన్నాయని చూపించి, షావుకారు మోసగాడు అని నిరూపించాలి._*


*_3. తప్పదు గనక సంచీలో నుండి నల్లని రాయినే తీసి, ఆ షావుకారిని పెళ్లి చేసుకుని తన తండ్రిని అప్పు నుంచి, జైలు నుంచి కాపాడాలి. ఈ విధంగా తండ్రిని కాపాడటం కోసం తన జీవితాన్ని త్యాగం చెయ్యాలి._*


*_ఇంతకి ఈకథలోని అమ్మాయి ఏమిచేసిందంటే… సమయస్ఫూర్తిగా వ్యవహరించింది !!_*


*_సంచీ లోనించి ఒక రాయిని తీసి, సరిగ్గా చూడకుండా, జారిపోయినట్టు నటించి, నేల మీద మిగతా రాళ్ళ మధ్యలో పడేసింది._*


*_వ్యాపారి చేసిన మోసం గురించి తెలియనట్లు,” పొరపాటు అయింది, క్షమించమని వ్యాపారిని కోరింది.  సంచీలో ఏ రంగు రాయి మిగిలిందో చూస్తే, నేను ఇంకో రంగు రాయి తీసినట్టు తెలుస్తుంది కదా“ అని అంది._*


*_రెండవ సంచీలో నల్ల రాయి ఉంది కాబట్టి, అమ్మాయి తెల్ల రాయి తీసినట్టు అయింది. ఇది చూసిన షావుకారు తన నిజాయితీని నిరూపించుకోలేక పోయాడు. ఈ విధంగా కథలోని అమ్మాయి కష్టమైన సందర్భాన్ని కూడా, తెలివిగా తనకు అనుకువుగా మార్చుకుంది._*


*_ఈ కథ సమయస్ఫూర్తితో కూడిన ఆలోచనా శక్తికి, సాధారణమైన ఆలోచనా శక్తికి కల బేధాన్ని తెలియచేస్తుంది._*


*_నీతి :_*

*_జీవితంలో చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి, కానీ వాటిని జాగ్రత్తగా, తెలివిగా ఎదురుకోవడం నేర్చుకోవాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా భయపడకుండా, కంగారు పడకుండా ప్రశాంతమైన మనసుతో, తెలివిగా ఎదుర్కోవాలి._*


*_రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్.._*


🙏🇮🇳😷💉🎊🪴🦚🐍

Wednesday, August 3, 2022

జీవితం చినిగిపోయే విస్తరాకు

 *జీవితం చినిగిపోయే విస్తరాకు*


*"విస్తరాకును"* ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని *భోజనానికి* కూర్చుంటాము.

భోజనము తినేవరకు *"ఆకుకు మట్టి"* అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం *'ఆకును' *(విస్తరిని)* మడిచి *'దూరంగా'* పడేస్తాం. 

*"మనిషి జీవితం"* కూడా అంతే ఊపిరి పోగానే *"ఊరి బయట"* పారేసి వస్తాము.

*'విస్తరాకు'* పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే *'పొయేముందు ఒకరి ఆకలిని'* తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న *'తృప్తి'* ఆకుకు ఉంటుంది.

*'విస్తరాకుకు'* ఉన్న ఆలోచన భగవంతుడు *"మనుషులకు"* కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ....*'సేవ'* చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ *'సేవ'* చేయండి. మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని *"వాయిదా"* వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే *'కుండ'* ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు *'విస్తరాకుకు'* ఉన్న *'తృప్తి'* కూడా మనకి ఉండదు. ఎంత *'సంపాదించి'* ఏమి లాభం? *'ఒక్కపైసా'* కూడా తీసుకుపోగలమా?

 కనీసం *'మన ఒంటిమీద బట్ట'* కూడా మిగలనివ్వరు.

అందుకే *'ఊపిరి'* *ఉన్నంత వరకు

 *"నలుగురికి"* ఉపయోగపడే విధంగా *'*జీవించండి'*                                    *ఇదే జీవిత పరమార్ధం*

బంధాలు తెంచేసుకుంటున్నారు

 ఆవేశం

అసహనం

అనర్థం

బంధాలు తెంచేసుకుంటున్నారు


చిన్న, చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుంటున్న దంపతులుఏండ్లుగా సాగిన సంసారానికి బీటలుమానసికంగా కృంగిపోతున్న భార్యాభర్తలుఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇంట్లో మ్యాగీ వంటకం ఆలస్యం కావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగి.. వారు వీడిపోయేందుకు సిద్ధమయ్యారు. వారి 15 ఏండ్లపాటు సాగిన సంసారంలోని తప్పులను తవ్వుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నా వారి మనస్సు మారడం లేదు.జూమ్‌ మీటింగ్‌కు ఆలస్యమవుతున్నది.. కొద్దిగా కూరగాయలను తరిగిపెట్టండని అడిగితే భర్తకు కోపం వచ్చింది. నన్నే కూరగాయలు కొయ్యమంటావా…నాకన్నా జీతం ఎక్కువగా సంపాదిస్తున్నావనే అహంకారంతో నన్ను ఈ పనులను చేయమంటావా… నాకు కూడా ఆఫీసులో మీటింగ్‌ ఉందంటూ భర్త తిట్ల పురాణం అందుకున్నాడు. అంతే 10 ఏండ్లపాటు సజావుగా సాగిన సంసార జీవితంలో అలజడి రేగింది. పిల్లలున్నా ఆ దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.


సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): పై విధంగా విపరీతమైన కోపతాపాలతో కొన్ని వర్గాల్లోని కుటుంబాలు సతమతమవుతున్నాయి. ఒకరిపై మరొకరు ద్వేషాన్ని పెంచుకుని ఏండ్ల తరబడిగా సజావుగా సాగుతున్న సంసార జీవితాన్ని తెంపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ పోలీస్‌స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. చిన్న, చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుని అనాలోచిత కోపాన్ని చూపుతు న్నారు. ఎవరు చెప్పినా వినడం లేదు. సర్దుకుపోవాలనే ఆలోచనే లేదు. దీంతో మానసికంగా కృంగిపోతున్నారు


నెలల తరబడి ఇంట్లోనే..

కరోనా, లాక్‌డౌన్‌ సందర్భంలో నెలల తరబడి ఇంట్లోనే ఉండటం, ఆ తర్వాత వర్క్‌ఫ్రం హోం పద్ధతి రావడంతో చాలా మంది ఉద్యోగులైన భార్యాభర్తలు 24 గంటల పాటు ఇండ్లల్లోనే ఉన్నారు. అంతకుముందు ఇరువురు ఉద్యోగాలకు వెళ్లడంతో చాలా తక్కువ సమయమే ఇద్దరూ కలిసి గడిపేవారు. ఈ క్రమం లో వారి మధ్య అన్యోన్యత బాగానే ఉండేది. కానీ.. తాజాగా అధిక సమయం పాటు ఇండ్లల్లో ఉండటం.. ఇంట్లోని పనిని షేర్‌ చేసుకోమనడం, వాట్సాప్‌ చాటింగ్‌లు, తదితర అంశాలకు సం బంధించిన వ్యవహారాలను కొత్తగా చూస్తుండటంతో విభేదాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు కరోనా దెబ్బతో ఒకరి ఉద్యోగం పోవడం, మరొకరి వేతనంలో కోత పడటం, అప్పటివరకు అనుభవించిన విలాసాలు తగ్గడంతో చాలామంది ఉద్యోగులు, వ్యా పారులు, కూలీలు ఇంకా అనేక వర్గాల ప్రజల్లో అసహనం పెరిగిపోయి ఓపిక తగ్గిపోయింది. దీంతో ఈ కష్టాలు, సందర్భాలను అధిగమించలేక ప్రేమానురాగాలతో కొన్నేండ్లుగా సజావుగా సంసారం చేసుకున్న అనేక మంది దంపతులు కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇరువురిలో సమన్వయం కొరవడి.. దానిని అధిగమిద్దామని ఆలోచించకుండా నువ్వెంతంటే నువ్వెంత అంటూ దూరమయ్యేందుకు రెడీ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ అసహనం వారిని మద్యానికి బానిసలుగా మారుస్తుండగా, మరికొందరు అనవసరమైన గొడవలకు దిగుతూ వారి పరిస్థితిని మరింతగా దిగజార్చుకుంటున్నారు. వాహనం నడిపే సమయంలో తెలియకుండా కోపానికి గురై ఇతర వాహనదారులతో గొడవలకు దిగుతున్నారు.


యాంగ్రీ మేనేజ్‌మెంట్‌ కౌన్సెలింగ్‌తో ఫలితం..

కరోనా తగ్గిన తర్వాత తన వద్దకు వచ్చిన 1000 కేసుల్లో భార్యాభర్తల మధ్య అసహనం పెరిగిపోయిన విషయాన్ని గమనించా. ఈ కాలంలో వారికి కలిగిన ఆర్థిక నష్టం, 24/7 కలిసి ఉండటంతో వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులపై.. అనవసర అపోహలను పెంచుకుని ముఖ్యంగా ఉద్యోగులైన భార్యాభర్తల్లో కొట్లాటలు చాలా పెరిగాయి. ఆన్‌లైన్‌ క్లాసులు, చదువులంటూ పిల్లలు ఫోన్లకు అత్తుకుపోవడం వారిలో కోపాన్ని విపరీతంగా పెంచేసేంది. ఈ అసహనానికి ఆన్‌లైన్‌లో జూదం, అశ్లీలం, మద్యం తోడు కావడంతో మనస్సు కృంగిపోయి వారికి నెగెటివ్‌ ఆలోచనలను వస్తున్నాయి. దీంతో వారు మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. వారికి ఐదు నుంచి ఎనిమిది రౌండ్ల వరకు కౌన్సెలింగ్‌ ఇచ్చినా మార్పు కనిపించడంలేదు. ఇక్కడ ఇచ్చిన కౌన్సెలింగ్‌తో కేవలం 25 శాతం ఫలితాలను మాత్రమే సాధించా. ఇంకా ప్రయత్నిస్తున్నా.



యాంగ్రీ మేనేజ్‌మెంట్‌ అంటే..


తన కోపమే తన శత్రువని గుర్తుపెట్టుకోవడం.ఎందుకు కోపాన్ని వ్యక్తం చేస్తున్నామో గమనించడం.అనవసర విషయాల్లో ఇంట్లో వారిని ఎందుకు దూషిస్తున్నామో ఆలోచించడంఎండ్ల తరబడిగా సంసార జీవితంలో రాని గొడవలు ఇప్పు డు ఎందుకొస్తున్నాయో గుర్తించడం.నాలో ఎందుకు అసహనం పెరుగుతున్నది.. దానికి గల కారణాలను తెలుసుకోవడం.


ఇలా అసహనం, కోపం తలెత్తినప్పుడు మీకు మీరే ప్రశ్నించుకోవాలి.. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరే సరిగా అర్థం చేసుకుంటారు. కావున బయటి వారితో సంబంధం లేదు. మీ నిర్ణయాన్ని మీరే పాటించాలి. ఈ విధంగా కౌన్సెలింగ్‌లో భార్యాభర్తలకు వివరిస్తూ ఇతర అంశాలు .. ఉదాహరణలను వివరిస్తూ వారిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నా. వారిలో మార్పు కచ్చితంగా వస్తుంది.


ఉడుకుతున్న సాంబారులో పడిన వ్యక్తి..

 ఉడుకుతున్న సాంబారులో పడిన వ్యక్తి.. 

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు




మద్యం మత్తులో ఓ వ్యక్తి ఒళ్లు తెలియకుండా ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గ్రామదేవత ఉత్సవాల సందర్భంగా ఫుల్‌గా మద్యం తాగి..


మద్యం మత్తులో ఓ వ్యక్తి ఒళ్లు తెలియకుండా ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గ్రామదేవత ఉత్సవాల సందర్భంగా  ఊరంతా పండుగ చేసుకుంటుంగా.. ఆ వ్యక్తి   మాత్రం ఫుల్‌గా మద్యం తాగి.. ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపాడు. ఉడుకుతున్న సాంబారులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది.





మధురైలోని పలంగానట్టిలో గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలను గ్రామస్తులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేసేందుకు వంటలు చేస్తుండగా గ్రామానికి చెందిన ముత్తుకుమార్ అనే వ్యక్తి ఫుల్‌గా మద్యం తాగి తూలుతూ అక్కడి వచ్చాడు. అన్నదానానికి భారీ పాత్రలో సాంబారు చేస్తుండగా.. గోడ అనుకుని దానిపై కూర్చోబోయి అందులో పడిపోయాడు. వెంటనే గమనించిన గ్రామస్తులు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ముత్తుకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ముత్తు కుమార్‌ను రక్షించే క్రమంలో పలువురు గ్రామస్తులు సైతం సాంబారు మీదపడి గాయాలపాలయ్యారు. దీంతో పండుగ రోజు పలంగానట్టి గ్రామంలో విషాదం నెలకొంది.



Tuesday, August 2, 2022

పాము కరిచినా ప్రాణాలు కాపాడండి!*

 

ఎంతటి విషపు పాము కరిచినా ఇలా చేయండి ప్రాణాలు కాపాడండి!




వ‌ర్షాకాలం…పాములు బ‌య‌ట సంచ‌రించే స‌మ‌యం. ఇలాంటి టైమ్ లోనే మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న పాముల్లో 15 % పాములే విషాన్ని క‌లిగి ఉంటాయి. మ‌న ఇండియాలో 5 జాతుల పాములు మాత్రం అత్యంత విష‌పూరిత‌మైన‌వి. అవి కాటేస్తే 3 గంట‌ల్లో మ‌ర‌ణం సంభ‌వించే అవ‌కాశ‌ముంది. కాబ‌ట్టి ఆ గ్యాప్ లోనే మ‌నం ఏదైనా చేసి పాము కాటేసిన వ్య‌క్తిని కాపాడాలి.

కాటేసిన పాము…విష స‌ర్ప‌మా? కాదా? :
మొద‌ట నిర్థార‌ణ చేసుకోవాల్సిన అంశ‌మిదే.. విష స‌ర్పం కాటేస్తే… కాటేసిన ప్రాంతంలో 2 గాట్లు ప‌డ‌తాయి. అదే విషంలేని పాము కాటేస్తే…మూడు కంటే ఎక్కువ గాట్లు ప‌డ‌తాయి.



విష స‌ర్పం కాటేస్తే ఏం అవుతుంది?:

విషపు పాము కరిస్తే….కరిచిన చోట నుండి విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు చేరుతుంది….ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. దీంతో బాడీ అంతా పాయిజ‌న్ అయ్యి మ‌నిషి మ‌ర‌ణిస్తాడు.

ఏం చేయాలి?

పాము కాటేసిన ప్రాంతానికి కాస్త ‌పైన గుండె వైపు ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌ర‌గ‌కుండా తాడుతో బలంగా క‌ట్టాలి.!

పాము క‌రిచిన గాట్ల వ‌ద్ద సూదిలేని సిరంజీని పెట్టి రక్తాన్ని బ‌య‌ట‌కు గుంజాలి….ఇలా రెండు మూడు సార్లు చేయాలి. మొద‌ట‌గా న‌ల్ల‌ని చెడు ర‌క్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది!

హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేయాలి. ఇలా చేస్తే పాము క‌రిచిన వ్య‌క్తి త్వ‌ర‌గా కోలుకుంటాడు.!

NAJA-200 5ML బాటిల్ ధ‌ర‌ 10 రూపాయ‌లు ఉంటుంది. ఈ సీజ‌న్ లో ప్ర‌తి ఒక్క‌రి దీన్ని కొనుక్కొని ద‌గ్గ‌ర పెట్టుకుంటే మంచిది!(అందిన సమాచారం ప్రకారం)



Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE