NaReN

NaReN

Thursday, July 21, 2022

జీవిత ఋణం

 🔴జీవిత ఋణం🔴



*“# అప్పు “ అనగానే చప్పున గుర్తొచ్చేది అప్పారావు.*

*అప్పారావంటే మరెవరో కాదండీ…*

*సాక్షాత్తు మన ముళ్ళపూడి వెంకటరమణ గారే.*


♦️మిత్రుడు ‘బాపు ‘ దగ్గర అప్పులు చేసీ,చేసీ అప్పారావు పాత్రను సృష్టించాడు.

అన్నట్టు 💰 డబ్బులు మాత్రమే కాదండోయ్...జీవితానికి సరిపడ 'స్నేహాన్ని ‘

కూడా బాపు నుంచి అప్పుగా తీసుకున్నాడు.అందుకేనేమో?అప్పుల అప్పారావు

పాత్రను అంత సజీవంగా చిత్రీకరించాడు ముళ్ళపూడి.


♦️నవ్వడం భోగం,నవ్వక పోవడం రోగం ‘ ,అన్నారు జంథ్యాల.నవ్వడం,నవ్వించడం మరిచి నవ్వుల

పాలవుతున్న తెలుగోడికి మళ్ళీ నవ్వడం ఎలాగో నేర్పించాడు మన ముళ్ళపూడి.పిల్లల కోసం

♦️బుడుగు “ ను,పెద్దవాళ్ళ కోసం “అప్పారావును “ సృష్టించితెలుగువాళ్ళ రుణం తీర్చుకున్నాడు

.ఆకలేస్తే కేకలేశాడు “ శ్రీ శ్రీ ,

ఆకలేస్తే జోకులేశాడు

ముళ్ళపూడి.వీళ్ళిద్దరిదీ 'ఫుడ్డు ‘ ప్రాబ్లమే.’ ఆకలి ‘ ఇద్దరిలోనూ కామన్.అయితే …స్వభావాల్ని బట్టి

♦️ ఒకరిది ‘ కేక ‘ అయితే..ఇంకొకరిది ‘ జోక్ ‘ అయింది.


♦️తెలుగు సాహిత్యంలో అప్పుల ప్రస్తావన వస్తే ‘ నక్షత్రకుడు ‘ గుర్తొస్తాడు.అయితే నక్షత్రకుడికి

మన రవణ గారికి మౌలికమైన భేదం వుంది.

నక్షత్రకుడు అప్పుల వసూలుకు హరిశ్చంద్రుడి

వెంట తిరిగితే..,..మన అప్పారావు మాత్రం

అప్పులు చేయడానికి జనాన్ని వెంబడిస్తాడు.

♦️అసలీ అప్పారావు పాత్ర సృష్టి హఠాత్తుగా

జరిగింది కాదు!స్వానుభవాన్ని,సమాజాను

భవాన్నీ రోట్లో వేసి రుబ్బి మరీ సృష్టించాడు ముళ్ళపూడి.నవ్వనని భీష్మించుకున్న వాళ్ళను సైతం..

“కొంచెం నవ్వవయ్యా బాబూ,నవ్వితే నీ సొమ్మేం పోదంటూ “ చెప్పి

మరీ మరీ నవ్వించాడు. అందుకే అప్పారావు మనలో

ఒకడై పోయాడు.మనవాడయ్యాడు.


♦️అప్పారావు బలహీనతల్లా అప్పుచేయడమే.

’డబ్బుచేసినోడ్నే’ కాదు,డబ్బులేనోడ్నికూడా

అప్పుతోకొడతాడు.ఆమాటకొస్తే...ఈ సృష్టి లో అప్పుచేయని వాడెవడంటూ ఎదురు ప్రశ్నిస్తాడు.

♦️సూర్యుడి నుండి చంద్రుడు వెలుగును అప్పుగా తీసుకోవడం లేదా?

♦️ కలువపూలు వెన్నెలను అప్పుగా తీసుకోవడం లేదా?

♦️సముద్రం నుంచి నీటిని అప్పుగా తీసుకొని ఆకాశం మేఘాల్ని కూడబెట్టుకోవడంలేదా?

♦️ఆ మేఘాలనుంచి భూదేవి వర్షాన్ని అప్పుగా తీసుకోవడం లేదా?

♦️ ఎండను అప్పుగా తీసుకొని చెట్లు పత్రహరితం తయారు

చేసుకోవడం లేదా?

♦️హిమాలయాలనుంచి నీటినిఅప్పుగా తీసుకొని గంగానది ప్రవహించడం లేదా?

♦️చెట్ల నుంచి మనుషులు ఆక్సిజన్ ను అప్పుగా

తీసుకొని బతకడం లేదా?

♦️ప్రపంచంలోనిదేశాలు అప్పుకోసం ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లడం

లేదా?

♦️ఆమాటకొస్తే....అమ్మా నాన్నల అనురాగాన్ని అప్పుగా తీసుకొని

బిడ్డ పుడుతుంది...ఇలా

చెప్పుకుంటూ పోతే ఈ భూ ప్రపంచంలో అస్సలు అప్పు చేయని వారే లేరంటాడు మన అప్పారావు.


♦️“అప్పు” అంటే చాలామందికి ‘ తప్పు ‘ గా కనిపి

స్తుంది కానీ,అప్పారావుకు మాత్రం అప్పు అన్న

మాట“డప్పు “ గా వినబడుతుంది.

♦️అసలు 'పొగతాగని వాడు గాడిదై పుట్టున్ 'అంటారు

గానీ..అది చాలాతప్పంటాడు అప్పారావు.

♦️”అప్పు చేయని వాడు గాడిదై పుట్టున్ “ ,అంటూ అర్జంటుగా

సవరణ తేవాలంటాడు.అన్నన్నా ! ‘

అప్పుకున్న వెయిట్ ఇంతింత కాదయా !’ అంటూ తత్వం అందుకుంటాడు.

అసలుఈ రుణ భ్రమణం వుంది చూశారూ...


♦️అది దా…’రుణం ‘ గా సాగిపోతోందం

టాడు. “ రుణ దాశరథీ….కరుణా పయోనిథి “

అంటూ సొంత పద్య శతకాన్ని అందుకుంటాడు.


“#ఎవ్వనిచే జనించు రుణ /మెవ్వనిచే భ్రమియించు లోకమం

దెవ్వని బుద్ధి యే రుణ / మెవ్వడు నవ్వుచు నప్పులిచ్చు దా

నివ్వగా జాలనం చనక / నివ్వగ జాలక దిప్పనట్టి వా

డెవ్వడు..? ఆ రుణాత్ము రుణదేశ్వరు/ నేను రుణంబు వేడెదన్ “!!❤


అప్పులు చేసే “ట్రిక్కులు “ తెలుసుకోవాలంటే ‘#రుణానంద లహరిని ‘ చదవమంటాడు


అప్పారావు.అయితే చదివారంతా అప్పారావు

కు ఓ “ఫైవ్ “ అప్పుగా చదివించుకోవడం

మాత్రం మరవొద్దంటాడు.నిద్ర లేస్తూనే


♦️“అప్పు “ డే తెల్లారిందా? అంటూ ఆవులిస్తాడు.

మొఖం కడక్కుండానే పాసి నోటితో అప్పు

కోసం జనం వెంటబడతాడు.అప్పు ఇచ్చారా!

సరే...లేకుంటే‌ మరో మాట మాట్లాడకుండా

మౌనంగా వెళ్ళిపోయే సంస్కారి అప్పారావు.


అయితే ఇక్కడే అసలు ప్రమాదం పొంచివుందన్న సంగతి అప్పడిగించుకున్నోళ్ళకు తెలీదు.

మన అప్పారావు మౌనంగా వెళ్ళిపోయాడంటే పాపం !

వాళ్ళకా సంతోషం ఎంతో సేపునిలువదు

.అప్పారావు మౌనంలో ప్రమాద

ఘంటికలు మోగుతాయన్న సంగతి వాళ్ళకు

ఆతర్వాతగానీ తెలీదు.


అప్పారావు రూపురేఖలు….!!


♦️మన అప్పారావు కొత్త రూపాయి నోటులా

ఫెళ ఫెళ లాడుతూ వుంటాడు.కాలదోషం పట్టిన

పాత దస్తావేజు లాంటి మాసిన గుడ్డలు,బడి

పంతులు గారి చేబదుళ్ళులా చిందరవందరగా

వుండే జుత్తు, అప్పు తెచ్చిన విచ్చు రూపాయిలా మెరిసే పత్తికాయ

లాంటి కళ్ళూ,అప్పులివ్వగల వాళ్ళందరినీ చేపల్లా ఆకర్షించగల ఎ

ర లాంటి చురుకైన చూపులూ...అతను బాకీల

వాళ్ళకి కోపిష్టి వాడి జవాబులా పొట్టిగా టూకీగా వుంటాడు.

మొత్తం మీద అతని మొహం

ముప్పావులా అర్థణాలా వుంటుంది.


♦️(దా ) రుణ స్వభావాలు…!!


*అప్పారావుకు అప్పులు చేయడం ఉగ్గుపాలతో అబ్బిన విద్య.అతని పుటకలోనే వాళ్ళ నాన్న*

*♦️ ఉగ్గు ‘ పొరిగింట నుంచి అప్పు తెచ్చి పట్టించాడట.*

*ఏడేళ్ళొచ్చేసరికి వాళ్ళ నాన్న బళ్ళో వేస్తూ..‘* పలకలు ,’ యెక్కాల బుక్కులూ

సంచి పెట్టబోయేసరికి “ఎందుకయ్యా ఇంత ఖర్చు? “ అన్నాడట.

“నేను గబగబా బడి చదివేసి పెద్ద పోలీసు వాణ్ణయి పోయాకానేమో

బోల్డు రూపాయలు అప్పుసంపాయించి *అప్పు తీర్చేస్తానుగా “ అన్నాడట.*


*“పువ్వు పుట్టగానే పరిమళించింది”.అంటూ తెగ మురిసిపోయారు

*అప్పారావు జనకుడు,అతని*

*మిత్రులు.ఏతావాతా చెప్పేదేమంటే..!*


*♦️అప్పారావు మీకెదురుపడితే ముఖం తిప్పుకొని వెళ్ళొద్దు సుమా..మీకిష్టమున్నా,లేకున్నా…..*

*అప్పారావును “అప్పు”* *తోనేకొట్టండి.కష్టమైనా,*

*నష్టమైనా మీకదే మంచిది.*

♦️

“రుణ రుగ్వేదికి వాదికి / రుణ కారణ జన్ముడైన రుణ భాదికి దా..

రుణ బుద్ధికి రుణ సిద్ధికి / రుణ భ్రమా భ్రమరునకున్ రుణకిన్ ఘృణికిన్ “


*అంటూ ..ఎంత ‘జేబుకు ‘ అంత ‘ అప్పు ‘ అని సరిపెట్టుకోండి.*


*♦️తెలుగు వాళ్ళంతా పదికాలాల పాటు గుర్తుంచుకునేలా*

*“అప్పారావు” ను సృష్టించి ,*

*మన మధ్యవదిలెళ్ళారు ముళ్ళపూడి సారు వారు.*


*(నిజ జీవితంలో ముళ్ళపూడి* *వారికి,అప్పారావు పాత్రకు మధ్య*

*ఎంతో సాన్నిహిత్యం వుంది.ఇది* *యాదృచ్ఛికం కావచ్చు గానీ నిజం.* *ముళ్ళపూడి వారు అప్పులు తీర్చడానికి* *చివరకువున్న ఇంటిని*

కూడా *అమ్మేశారు.అప్పుడు ‘ బాపు ‘ గారు తన ఇంటిపైనే ఓ అంతస్తు వేయించి రవణ గారిని వుండమన్నారు.*

*ఆ రకంగా బాపు నుంచి స్నేహాన్నే కాక,ఇంటిని కూడా*

*రుణంగా పొందారు ముళ్ళపూడి వారు.*


❤❤❣️❣️❣️❤❤

Tuesday, July 19, 2022

యాచకుడి నుండి యాచనా?

 యాచకుడి నుండి యాచనా?


ఒకప్పుడు ఒక మహారాజు అడవికి పోయి అక్కడ ఒకయోగిని కలుసుకున్నాడు. ఆ యోగితో రాజు కొంతసేపు మాట్లాడాక ఆయనలోని పవిత్రత, జ్ఞానానికి ముచ్చటపడ్డాడు. అప్పుడా మహారాజు తన మీద దయ ఉంచి ఏదైనా బహుమతిని స్వీకరించవలసిందిగా ఆ యోగిని ప్రార్ధించాడు.


ఆ యోగి అందుకు నిరాకరిస్తూ, "ఈ అడవిలో లభించే ఫలాలు నాకు సరిపడా ఆహారాన్నిస్తున్నాయి. పర్వత సానువుల నుండి ప్రవహించే సెలయేరు నాకు తగినంత నీటిని సమకూరు స్తుంది. ఇక్కడి చెట్ల బెరళ్ళు నా శరీరాచ్ఛాదనకు సరిపోతున్నాయి. ఈ కొండ గుహలు నా నివాసానికి అనువుగా ఉన్నాయి. ఇంకా నేను నీ నుండి గాని, ఇతరుల నుండి గాని బహుమతులు పొందాల్సిన అవసరం ఏముంది చెప్పు?" అని అన్నాడు.అందుకు ఆ మహారాజు "స్వామీ! అలా అనకండి. నా సంతృప్తి కొరకు నాతో మా భవనానికి వచ్చి నా నుండి ఏదో ఇఒకటి తమరు స్వీకరించాలి. నా ప్రార్థనను మన్నించండి” అన్నాడు. రాజు చాలా ఒత్తిడి చేశాక ఇక తప్పదన్నట్లు అంగీకరించి ఆ యోగి రాజప్రాసాదానికి వెళ్ళాడు. రాజు ఆ యోగిని ఒక గదిలో కూర్చోబెట్టి దైవప్రార్ధన ఇలా చేయసాగాడు."భగవాన్! నాకు మంచి సంతానాన్నివ్వు. ఇంకా అధికంగా సంపద నివ్వు. నా రాజ్యాన్ని విస్తరించు. నాకు తగిన ఆరోగ్యాన్నివ్వు". అతడు ప్రార్థన ముగించేలోపే యోగి దిగ్గున లేచి మౌనంగా గది బయటకు నడవసాగాడు. ఆ చర్యకు రాజు దిగ్భ్రాంతుడై యోగిని అనుసరిస్తూ, బిగ్గరగా "స్వామీ! తమరు వెళ్ళిపోతున్నారేమిటి? నా బహుమానం తమరు స్వీకరించనే లేదు" అంటూ అడిగాడు.అప్పుడా యోగి, రాజు వంక తిరిగి, “నేను యాచకుల నుండి యాచించే వాడిని కాను. నీకు నువ్వే ఒక యాచకుడివి. ఇక, నాకు నువ్వేమి ఇవ్వగలవు? యాచించే వారి నుండి దేన్నైనా స్వీకరించేటంతటి మూర్ఖుణ్ణి కాను నేను" అన్నాడు. రాజు ముఖం జేవురించింది.

పలుకే ..బంగారమాయెరా...

 పలుకే బంగారమాయెరా….🙏

పలకరింపు మనిషి మంచి తనానికి ఆనవాలు !!!



మనుషులకు మాత్రమే వున్న వరమిది. ..


మానవీయ సంబంధాల వారధి. 


మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది.


పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. 


ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. 


పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.


నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. 


ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. 


ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. 


కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.


ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. 


ఒక బాధని తొలగించవచ్చు. 


ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. 


ఒక ఆశను చిగురింపచేయొచ్చు. 


మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !


పలకరింపుకు అంత శక్తి వుంది. 


పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. 


తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు. 


వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ అని మరిచి పోతున్నారు. 


అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి.


ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో వాళ్ళను కదిపి చూడండి. 


బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు. 


ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీల్లా పని చేస్తాయి.


పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది. 


పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి. 


దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ వుంటుంది. 


ఇవి కేవలం మనుషులు సాధించేవి.


ప్రముఖ కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవిగారు *"తీయని పలకరింపు"* అని ఒక కథను రాశారు. అందులో ఒక రిటైర్డు పెద్దాయన, పలకరింపులు లేక పడుతున్న బాధను చక్కగా చిత్రించారు. ''నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోగం చేస్తున్నపుడు నన్ను చాలా మంది పలకరించేవాళ్ళు. ఉద్యోగ విరమణ చేసి, ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమం చేరాను'' అని ఆ పాత్రలో వివరిస్తుంది.


డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమై పోయి ఈ పరిస్థితులు దాపురించాయి. 


ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం. 


దీన్ని మార్చకపోతే మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం.


లాక్‌డౌన్‌ మూలానా ఇంట్లోనే అందరూ ఉంటున్నప్పటికీ వారి మధ్య దూరాలేవీ తగ్గలేదు. మరింత పెరుగుతూనే వున్నాయి. ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్‌ఫోన్‌లతో యియర్‌ ఫోన్లతో తమలో తామే, తమకు తామే గడిపేస్తున్నారు. 


కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి.


మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి. 


అలా తెలిసినపుడే వాటిని సరిచేయడమో, చర్చించి మనం వాటిని సరిచేయడమో చేయవచ్చు. అలా కొన్ని అపోహలూ తొలిగిపోనూవచ్చు. 


కుటుంబం లోనే కాదు ఇంటి పక్కన వాళ్ళను, దూరానవున్న మిత్రులను కూడా ఖాళీ సమయం దొరకగానే ఒకసారి పలకరించండి.


పది మందితో గల సంబంధమే జీవితం.


నాకు తెలిసిన ఒక పెద్దాయన అన్ని హంగులు ఉండి కూడా, తాను, తన భార్యాబిడ్డలు, సన్నిహితులతో ఏసి లాంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ, వృద్ధురాలు తన తల్లిని మాత్రం “ఔట్ హౌస్ కొట్టుగది” లో ఉంచాడు. తనని (అతని తల్లి ని పలకరించితేనే భార్య అనుగ్రహానికి దూరమైపోతానేమో అని భావించి, దూరంగానే ఉంచాడా ప్రబుద్ధుడు.


“నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమీ అడగటమూ లేదు. రోజు ఏం చేస్తున్నావమ్మా, ఏం తిన్నావు, బాగున్నావా'' అని నన్ను అడిగితే చాలు అంటూ ఆ ఎనభై యేండ్ల తల్లి  వాపోతూ దు:ఖిస్తూన్నది…


అంటే పలకరింపుల విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. 


చివరికి ఆమె పోయిన తరువాత అతను కార్చిన మొసలికన్నీరు’కి ఏ అవార్డు ఇవ్వొచ్చో అర్థం కాలేదు !


అందుకే.. పలకరించండి. పలుకులేమీ బంగారం కాదు. 


పలకరింపు మనిషి మంచి తనానికి ఆనవాళ్ళు !


 కుటుంబ సభ్యులందరికీ విన్నవిస్తున్నాను

Monday, July 18, 2022

జీవిత గణితం


జీవిత గణితం

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️



భారతదేశానికి చెందిన ఒక IT వ్యక్తి యుఎస్‌ వెళ్లాడు. చాలా మంది స్నేహితుల వలె, అతను ఒక మంచి రెస్టారెంట్‌ లో పిజ్జాను ఆస్వాదించాలనుకున్నాడు.


అతను 9 అంగుళాల పిజ్జాను ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటికి వెయిటర్ 5 అంగుళాల రెండు పిజ్జాలతో వచ్చి రెస్టారెంట్‌ లో 9 అంగుళాల పిజ్జా అందుబాటులో లేదని, అందుకే  5 అంగుళాలవి, రెండు పిజ్జాలు ఇస్తున్నానని చెప్పాడు. అందువలన, 1 అంగుళం పిజ్జాను అతను ఉచితంగా పొందుతున్నట్లు చెప్పాడు.


ఆ వ్యక్తి వెయిటర్‌ తో  రెస్టారెంట్ యజమానిని పంపమని మర్యాదపూర్వకంగా అభ్యర్థించాడు.


ఒక వృత్తం యొక్క వైశాల్యాన్ని లెక్కించడానికి ఒక భారతీయుడు అతనికి గణిత సూత్రాన్ని ఇచ్చాడు.


ఒక వృత్తం యొక్క వైశాల్యం = πr²

ఇక్కడ π = 3.1415926,

r అనేది వృత్తం యొక్క వ్యాసార్థం.


కాబట్టి, 9-అంగుళాల వృత్తం యొక్క వైశాల్యం = 63.62 చ.అం.

 కానీ, 5-అంగుళాల వృత్తం యొక్క వైశాల్యం 19.63 చ.అం.


రెండు 5-అంగుళాల వృత్తపు వైశాల్యాలు కలిపి 39.26 చ.అం. 


ఆ వ్యక్తి తనకు మూడు పిజ్జాలు ఇచ్చినా అది తాను ఆర్డర్ చేసిన 9 అంగుళాల పిజ్జాతో సమానం కాదని తేల్చి చెప్పాడు. అలాంటప్పుడు  1 అంగుళం పిజ్జా ఉచితంగా ఇస్తున్నానని ఎలా చెప్పగలవు అన్నాడు.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


ఆ వ్యక్తి వేసిన లెక్కలు చూసి రెస్టారెంట్ యజమాని కంగుతిన్నాడు. చివరికి రెస్టారెంట్ అతనికి 5 అంగుళాలవి, 4 పిజ్జాలు ఇవ్వాల్సి వచ్చింది.


పసుపులేటి నరేంద్రస్వామి

పిల్లల పేర్లా తమాషా నా.....

పిల్లల పేర్లా తమాషా నా.....

ట్రెండ్ ఎలావుందో చూడండి......



నాదగ్గరకి ఆతృతగా పరుగెత్తుకుంటూ వచ్చాడు నాకు తెలిసిన వాడొకడు.

 "మీరే ఎలాగైనా సాయం చేయాలి. ఎంతోమందిని అడిగాను. ఎవరూ నా బాధ అర్థంచేసుకోలేకపోయారు."


 "ఏమిటో నీ కష్టం?"


 "పిల్ల పుట్టి మూడేళ్ళైంది. రేపు స్కూల్లో పడేయాలి, ఇంతవరకూ పేరు పెట్టలేకపోయాం. నెట్‌ సెర్చ్‌ చేశాం, పుస్తకాలు వెతికాం. సరైన పేరు దొరకలేదు. ఎవరో మీ పేరు చెప్పి మీ దగ్గరకెళ్ళమన్నారు. మీరు తెలుసు కనక మీదగ్గరకొచ్చాను."


 "ఎలాంటి పేరు కావాలి?"


 "ఆ పేరు మా పిల్లకు మాత్రమే ఉండాలి. ఇంకెవరూ పెట్టుకోకూడదు."


 "సూర్యకాంతం పెట్టు. అదైతే నాకు తెలిసి ఎవరూ పెట్టుకోరు."


 "కానీ, పేరు విచిత్రంగా ఉండాలి. మా బావ, కూతుళ్ళిద్దరికీ ‘పండు వెన్నెల’, ‘నిండు పున్నమి’ అని పెట్టాడు. అట్లాంటి పేర్లు ఎవరికీ లేవని పొగరుతో విర్రవీగుతున్నాడు. వాటిని తలదన్నే పేరు పెట్టాలి."


 "మీ బావగాడి చెంప మీద కొట్టినట్టుండే పేర్లు చెప్తా రాసుకో. పట్టపగలు, చిమ్మచీకటి, మిట్ట మధ్యాహ్నం."


 "మా పిల్ల పేరు ఫైనలైజ్‌ అయ్యేవరకూ ఈ పేర్లు ఎక్కడా లీక్‌ చేయొద్దు సార్‌, ప్లీజ్‌!"


 "సర్లే, ఎవరికీ చెప్పనులే. అయినా ఎందుకోయ్‌ అంత టెన్షన్‌?"


 "పిల్లకు పేరుపెట్టే ఉద్దేశమేమైనా ఉందా... అసలేమైనా ప్రయత్నం చేస్తున్నావా? - అని రోజూ మా ఆవిడ తిడుతోంది సార్‌!"


 "నీ మాటల్లోనే రెండు పేర్లు దొరికాయి. ‘ఉద్దేశ’, ‘ప్రయత్న’ ఇంతకూ మీ ఆవిడ ఏమని తిడుతోంది నిన్ను?"


 "వేస్టుగాడివంది."


 "వేస్టు అంటే వ్యర్థం. ‘వ్యర్థ’- సూపర్‌ పేరు!"


 "ఇప్పుడు చాలామంది శాన్వి అనీ శ్రాగ్వి అనీ పెడుతున్నారు కదా... వాటికి అర్థం ఏవిటండీ?"


 "మీ ఆవిడ అందని కాదుగానీ, నిజంగానే వేస్టుగాడివోయ్‌. పేరుకు అర్థమేంటీ... పేరుకు అర్థం ఉండకపోవడమే ఇప్పటి ట్రెండ్‌. మా బాబాయి మనవరాళ్ళ పేర్లేవిటనుకున్నావు? పెద్దదాని పేరు ‘శ్మశాన’, చిన్నదాని పేరు ‘వాటిక’. ఎలా ఉన్నాయి?"


 "బ్రహ్మాండంగా ఉన్నాయి సార్‌. కాదేదీ పేరు కనర్హం అన్నమాట!"


 "మరే... ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాంట్లో కూడా రెండు పేర్లున్నాయి... బ్రహ్మాండ, అనర్హ."


 "మీరు శూన్యంలో నుండి కూడా పేర్లు తీస్తున్నారు సార్‌!"


 "శూన్య - ఇదేదో బాగుందయ్యా! బుర్రలో ఆ తెలివి ఉండాలి. ఏది చూసినా పేరు తట్టాలి. మా తమ్ముడు ఓ రోజొచ్చి ‘అన్నయ్యా, పిల్లల పేర్లు పెట్టడం విషమ సమస్యైంది’ అన్నాడు. అంతే, పిల్ల పేరు ‘విషమ’, పిల్లాడి పేరు ‘సమస్య్‌’. ఎలా ఉన్నాయి?"


 "బాగున్నాయి సార్‌. మా అమ్మ శివుడి పేరు మీద శివకుమారి అని పెడతానంటోంది."


 "అలా రొటీన్‌ పేరు పెట్టావో, నువ్వూ మీ ఆవిడా కలిసి ఒకే తాడుకు ఉరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది."


 "కోప్పడకండి సార్‌!"


 "రొటీన్‌కు భిన్నంగా ఆలోచించవయ్యా. శివకుమారి కామనే గదా... ‘శవకుమారి’ అని పెట్టు. లేకపోతే 'కళేబరి' "


 "గురువుగారూ, ఇంతకూ మీ పిల్లల పేర్లు ఏవిటండీ?"


 "ఎవరికీ లేని పేర్లు పెట్టాలని అమ్మాయి పేరు ‘సామూహిక’, అబ్బాయి పేరు ‘అత్యాచార్‌’ పెట్టాను. తీరా ఇప్పుడేమో పొద్దున్న లేస్తే పేపర్‌ నిండా అవే. ఆ పేర్లు ఇంకెవరైనా పెట్టుకుంటారేమోనని కంటినిండా నిద్రపోయింది లేదు. అంతా నా ఖర్మ... అరె, ఇదేదో బాగుందే, ‘ఖర్మ’ ఎలా ఉంది?"


 "చాలా బాగుంది గురువుగారూ. కాకపోతే మా వంశానికి నాగదేవత పేరుతో కలిపి పెట్టుకోవాలి. ‘నాగఖర్మ’ అని పెట్టుకోమంటారా?"


 "మళ్ళీ ఇదొకటా?"


 "అవును సార్‌. మా కజిన్ల పేర్లు ‘నాగ బీభత్స్‌’, ‘నాగ డింభక్‌’, ‘నాగ హిడింబ్‌’. మా అన్నయ్య తన పిల్లలకు ‘సర్ప జగదేక్‌’, ‘నాగ అతిలోక్‌’ అని పెట్టాడు. 


 "మళ్ళీ ఇదొక దరిద్రమా? ఒక్క నిమిషం... దరిద్ర... నాగ దరిద్ర అని పెట్టు."


 "కానీ మా ఆవిడ మూడక్షరాల పేరే పెడదామంటోంది."


 "‘కుబుస’ అని పెట్టు, సరికొత్త పేరు. నాగదేవతకు సంబంధించినదే. అక్షరాలూ మూడే."


 "అద్భుతం సార్‌. ఇదే ఫైనల్‌.

 ‘కుబుస’ అని పెట్టేస్తా."

...

చూశారా? 

పిల్లల పేర్ల ఉత్పత్తి ప్రకరణం!...


ఆలోచించండి ఇకనైనా .....

ఒకప్పుడు  చక్కగా తాతల పేర్లు అమ్మమ్మల పేర్లు పెట్టే ఉద్దేశ్యం పూర్వీకులను గుర్తు చేసుకోవడం వారు చూపించిన ప్రేమానురాగాలు వీరిపై చూపించడం మరియు పూర్వీకుల సంప్రదాయాలను ముందు తరానికి అందించడం.



Sunday, July 17, 2022

స్త్రీ....

 *స్త్రీ..........!!*

*మగాడితోసహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు.*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


ఒక రోజూ రెండు రోజులూ కాదు. 

ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు..స్త్రీ సృష్టికోసం. 

మిగిలిన పనులన్నీ మానుకుని..తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది...

"స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?". 


ఆప్పుడు దేవుడు.. "ఏం చెయ్యను మరి...

ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా...

ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ..

సృష్టి. వివక్ష తగదు. 

మొండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. 


చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా...

ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...

ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. 

అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు...

రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. 

ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.


"ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది. 

"ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది. 


ఆప్పుడు దేవుడు.."ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. 

కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. 

అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, 

ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. 


ఇష్టం,  కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. 

అవసరమైతే దిగమింగాలి. 

కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. 

తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. 

ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.


"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది.


అప్పుడు దేవుడు.. "ఎందుకాలోచించదు? 

అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.


దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.


అప్పుడు దేవుడు.. "అదా...కన్నీరది. 

ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. 


ఆ కన్నీటికున్న  శక్తి అనంతం....

పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు. 


దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది. 


అయితే దేవుడు.. "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా..వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. 

అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..." 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*అవసరమైనప్పుడు..ఆ శక్తి ముందూ.. ఎవరూ నిలబడలేరు.. అని చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని...!!*

Dream

 Dream 

👌👌worth reading 

👌👌worthy sharing 


I woke up today , having dreamt early morning at 4 AM . ⏰ 


🏢

I was in the biggest Mall of  India looking to buy a pair of socks 🧦 and a neck tie. 👔


🚶🏻‍♂️As I walked in, I noticed a sweater with a price tag of RS 25,000 .


Next to the sweater were a pair of Jeans 👖for Rs.1,00,000 .


The socks 🧦 were Rs.15,000 ! 

And Tie 👔 for astonishing 20,000 /-_


👉I went looking for a salesperson and found one in the watch Dept.


 He was showing a man a Rs. 225/- Rolex watch. 🥸


I looked in the glass case and there was a 4 carat diamond ring 💍 also on sales for Rs.95/-🧐


Shocked I asked the salesperson "How could a Rolex watch sell for Rs.225/- ? ,and a cheap pair of socks sell for Rs. 15,000/-"?🤔


He said "Someone slid into the store last night and changed the price tag on everything ".🤪


👉👉"Everyone is confused , people are acting like they have lost their sense of value". 


💰 "They are willing to pay lots of money for things of little value ,and very little money for things of great value " 💵 


🤭"Its like they don't know what is really valuable and what's not " .


😥I hope we get the price tags back-on right soon ,I really pity , seeing people paying way too much for things of little value "


🥺I woke up startled & confused and thinking since then ...


👉👉Maybe our life is like this dream.


👉👉Maybe someone slid into our lives and the changed the price on everything.


 👉👉Maybe  they *marked up* the value of  competition, position, titles,  fame , promotion,  show-off , money and power !🤔


👉👉...And put a huge discount on the value of *Happiness , Family , Relationships, Peace of mind , Contentment , Love , Knowledge , Kindness  , Friendships*...🤔🤔


 👉Maybe We are all living this dream...


🥺*I hope...... this message will be a wake up call and we wake up,*

well in-time.


Have a great life ahead 🤝

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE