NaReN

NaReN

Tuesday, August 24, 2021

24.08.2021 words per day

 🆂🆄🅲🅲🅴🆂🆂 

🅻🅸🅵🅴


Words for a

Positive day ❣️


🔐 *A* is for Appreciation


🔐 *B* is for Blessed


🔐 *C* is for Curiosity


🔐  *D* is for Dream


🔐 *E* is for Experience


🔐 *F* is for Fabulous


🔐 *G* is for Goodwill


🔐 *H* is for Hello


🔐 *I* is for Idea


🔐 *J* is for Joy


🔐 *K*  is for Kind


🔐 *L* is for Laugh


🔐 *M*  is for Motivation


🔐 *N* is for Now


🔐 *O* is for Oomph


🔐 *P* is for Possible


🔐 *Q* is for Quiet


🔐 *R* is for Ready


🔐 *S* is for Self-Care


🔐 *T* is for Thankful


🔐 *U* is for Uplift


🔐 *V* is for Visualise


🔐 *W* is for Worth


🔐 *X* is for X-FactorY is for Yes


🔐 *Z*  is for Zest

Monday, August 23, 2021

గురువుగా ఉండటం మీరు ఎందుకు "గర్వంగా ఫీలవుతారు" ? ? ?

 👉 *ఒక ఉపాధ్యాయుడిని ఎవరో అడిగారు.*


*గురువుగా ఉండటం మీరు ఎందుకు "గర్వంగా ఫీలవుతారు" ? ? ?*


*అందుకా ఉపాధ్యాయుడు నవ్వుతూ....*


*ఒక న్యాయవాది యొక్క ఆదాయం సమాజంలో నేరాలు మరియు వ్యాజ్యాల పెరుగుదలతో పెరుగుతుంది.*


*ఒక వైద్యుని యొక్క ఆదాయం ప్రజల వ్యాధి /అనారోగ్యం పెరుగుదలతో పెరుగుతుంది.*


*కానీ... మా ( గురువు ) ఆదాయం మాత్రం...*


*ప్రజల యొక్క జ్ఞానం, శ్రేయస్సు మరియు దేశ అభివృద్ధి పెరుగుదలతో పెరుగుతుంది...!!!*


*Yes,* 

*అందుకే మేము ఉపాధ్యాయులుగా గర్విస్తాం !*

👍👍👍👍👍👍👍👍


*పంతుళ్ళం కాదు...*


*మేం "తరాల" తయారీదారులం...*

*(Teachers : Makers of Generations).*


**************

*ఏముంది పంతుళ్ళు...*

*ఏదో వస్తరు.... పోతరు...*

*నాలుగు మాటలు తోచింది చెప్తరు...*

*లేకుంటే సెలవులు....ఇదీ సమాజంలో ఉపాధ్యాయులపై చిన్న చూపు.*

😢 😢 😢 😢 😢


*కానీ దానికి భిన్నం... మా వృత్తి.*


*ఇంట్లో ఇద్దరు పిల్లలను ఒక్క 4, 5 గంటలు భరించలేని తల్లిదండ్రులు...*

*పిల్లల బళ్లకు పంపితే ( వెల్లగొడితే )...*

🙊 🙊 🙊 🙊 🙊


*ఉదయస్తమానం 10 గంటలు ప్రతి పిల్లవాడిలో మా పిల్లల చూసుకుంటూ వారి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ, మా మెదళ్లను పీల్చి పిప్పి చేసినా, వాళ్ళ మెదళ్లను బాగు చేసి మేధావులను, డాక్టర్లను, యాక్టర్లను, ఇంజినియర్ లను, పోలీసులను, కలెక్టర్లను, లాయర్లను, టీచర్లను, నాయకులను, అధికారులను...*


*ఆఖరికి సమాజానికి కీడు చేయని ఒక మంచి మనిషిలా నిలిచేలా "తరాలు", "తరాలు" తయారుచేసే నిత్య విద్యార్థులం మేము.*


*మా పనులు శారీరకంగా అలసినట్టు కనిపించేవి కావు.*

*చెమటను సాక్ష్యం గా చూపడానికి...*


*మా పనులు బురదలోనో, ఖార్ఖానా లో చేసేవి కావు. బట్టలకంటిన మురికిని చూపడానికి....*


*మా పనులు మూసలు కావు,*

*మోసాలూ కావు.*

*ఏ రోజుకారోజు కొత్తే...*


*పిల్లాడు పిల్లాడికి కొత్తే...*

*ఏ రోజుకారోజు సమస్యలూ కొత్తే...*


*మా వనరులు పిల్లలు మాత్రమే...*

*మా పని చదువొక్కటే కాదు, జీవితాలు తీర్చిదిద్దుడు కూడా...*

*ఏ రోజుకు ఆ రోజో, నెలకో, ఏడాదికో ఫలితాన్ని చూపే కూలీలమో, రైతులమో,  అధికారులమో కాదు సుమా ! ?*

👏 👏 👏 👏 👏


*"తరాన్ని" తయారు చేస్తూపోతాం...*

*ఆ యజ్ఞం లో సమిదలవుతం...*

 *ఎలాంటి ఫలితాన్ని ఆశించని నిత్య కార్మికులం...*

*మా చేతుల్లో నుండి ఒక్క పనికొచ్చే మనిషి  తయారైన అదే మాకు లక్షలు, కోట్లు...*


*పుణ్యానికి చేస్తారా అని అంటారా ?*

*మీ ఇంట్లో ఉన్న మీ స్వంత ఇద్దరు పిల్లలనే బడికి పంపకుండా ఇంట్లోనే ఉంచండి... పెంచండి... విద్య నేర్పండి... బుద్ధులు నేర్పండి... విలువలు నేర్పండి... గొప్ప మేధావిని చేయండి... గొప్ప అధికారిని కనీసం ఒక సమాజానికి పనికొచ్చే వ్యక్తినో, ఆఖరికి సమాజాన్ని గాడిలో పెట్టే సాధువునో, సన్యాసినో చేయండి...*


*అప్పుడు ఒక గురువు గుర్తుకొస్తాడు...*

*అప్పుడే ఒక ఉపాధ్యాయుడు గుర్తుకొస్తాడు...*


*అప్పుడే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆథ్యాత్మికంగా, ఉద్వేగాల, భావాల పరంగా, అన్ని విధాలా శిక్షణ ఇచ్చే ఒక బడి గుర్తుకొస్తుంది...*


*ఎందుకండి...?*

*కూర్చున్న కొమ్మను నరుకుతరు ? !*

👏 👏 👏 👏 👏


*అనంత సాగరమైన విద్యను, విజ్ఞానాన్ని మధించి...*

*అక్షర సేద్యంలో నిరంతరం మానసికంగా అలసిపోయి, అర్థాంతరంగా తనువు చాలిస్తూ, పదిమందికి బయటకు కనిపించే సాక్ష్యాలు చూపలేని నిస్సహాయులం...*

😢 😢 😢 😢 😢


*మమ్మల్ని గౌరవించకున్నా ఫర్వాలేదు...*


*కించపరచకండి...*

😢 😢 😢 😢 😢


*మమ్మల్ని పొగడకున్నా ఫర్వాలేదు...*

*తూలనాడకండి...*

😢 😢 😢 😢 😢


*మాతోనో, మా సంతకంతోనో పని ఉంటే కదా ! అంటారా ?*


*అయితే సమాజంలో మిగిలేది మేధావులో, విలువలున్న మంచి మనుషులో కాదు...*


*మానవత్వం లేని మృగాలో, విలువల్లేని రోబోలో తయారవుతాయి...*


*ఒకవేళ మీలా ఆలోచించి పంతుళ్ళు కూడా పక్క దోవ పట్టితే...*


*మాకు విలువివ్వండి...*


*విలువులన్న మనుషులను తయారుచేసే పనిలో తోడు రండి...*

👏 👏 👏 👏 👏


*విలువులు తప్పిన ఒకరిద్దరు పంతుళ్ళను ఓ కంట కనిపెట్టండి...*


*వారిని మందలించండి...*


*విద్య బళ్లోనే, అదీ గురువు సమక్షంలోనే  దొరుకుంతుందని గుర్తుంచుకోండి...*

🙏 🙏 🙏 🙏 🙏

మీ జీవితం ఒక అద్భుతం

  మీ జీవితం ఒక అద్భుతం


ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారు? అద్భుతంగానా, 

డిజప్పాయింటెడ్‌ గానా, 

బోర్‌గానా, 

చిరాకుగానా…? 

ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్‌ని డిసైడ్ చేసే అతి పెద్ద ఫేక్టర్ ఇది.


బ్రెయిన్‌కి పంపించబడాల్సిన instructions చాలాసార్లు తప్పుగా హైజాక్ అవుతుంటాయి. అందుకే మనం ఫెయిల్యూర్డ్ పీపుల్‌గా మిగిలిపోతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే *“నెగిటివ్ ప్రోగ్రామింగ్”* చేయబడుతోంది బ్రెయిన్.


*బ్రెయిన్‌కి మంచీ చెడూకి మధ్య తేడా తెలీదు. మనం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేస్తుంది.*


చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీరు *“ఈ మధ్య జనాల పేర్లు మర్చిపోతున్నాం” అని రిపీటెడ్‌గా అనుకుంటూ ఉన్నారనుకోండి.. బ్రెయిన్ అలాగే ప్రోగ్రామింగ్ చెయ్యబడుతుంది.* మీరు గుర్తుంచుకోవాలని ట్రై చేసిన ప్రతీసారీ గుర్తుంచుకోవలసిన పేరుని డెఫినెట్‌గా మర్చిపోయి… మన నెగిటివ్ ప్రోగ్రామింగ్‌ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పారేస్తుంది బ్రెయిన్.


మీకు హెల్త్ బాలేదని అనుకుంటూ ఉండండి…. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. *“బాలేదు బాలేదు” అనుకుంటున్న క్షణం నుండి బ్రెయిన్ వివిధ organsకి ఆదేశాలు జారీచేసి, బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేసి ఏదో ఒక discomfort తలెత్తేలా చేసి తీరుతుంది.*


 దానికి మనం అప్పజెప్పిన task ఏదైతే ఉందో… “మన హెల్త్ బాలేదని” దాన్ని కంప్లీట్ చెయ్యడమే దాని లక్ష్యం.

————

చాలామంది ఉద్యోగాలు రావట్లేదనో, లైఫ్‌లో తాము ఎందుకూ పనికిరామనో, సంతోషం అంటే ఏమిటో తెలీదనో.. *రకరకాల మెంటల్ ట్రాప్‌లలో ఇరుక్కుపోతుంటారు.* ఇవి రిపీటెడ్ సజెషన్లని బ్రెయిన్‌కి పంపిస్తుంటాయి. దాంతో ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతీప్రయత్నంలోనూ  ఏదో ఒక లోపం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది, సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా చిరాకుగానే ఉండిపోతుంటాం.

————–

ప్రతీ క్షణం మన ఆలోచనల ద్వారానో, నోటితో మాటల ద్వారానో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఆ ఆలోచనలు ప్రోగ్రామింగ్ లాంటివి. *ఈ ప్రోగ్రామింగ్‌లో పాజిటివ్ ఏటిట్యూడ్ సాధించగలిగితే ఖచ్చితంగా ప్రతీ క్షణం చాలా అద్భుతంగా ఉంటుంది.*


అంటే *మనల్ని మనం blame చేసుకోవడం తగ్గించాలి, ఇతరులు మనల్ని చులకన చేస్తూ మాట్లాడే వాటిని బ్రెయిన్‌కి తీసుకుని కుంగిపోవడం తగ్గించాలి.*  


*ఎంత నెగిటివ్ ఎనర్జీ మనం లోపలకు పంప్ చేస్తే అంత నెగిటివ్ output వస్తుంది. సరిగ్గా అలాగే  ఎంత పాజిటివ్ ఎనర్జీ పంప్ చేస్తే అంత పాజిటివ్ output వస్తుంది.*


ఇక్కడా మరో చిన్న ఉదాహరణ తీసుకుంటే… ఓ పబ్లిక్ గేదరింగ్‌లో అందరితో కలవలేక ఓ మూలన ఇరుక్కుంటే అందరూ సంతోషంగా ఉన్నట్లు కన్పిస్తారు. మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అరమరికలు మర్చిపోయి మనుషుల మధ్య దూసుకుపోతే మన సంతోషం ముందూ, కలివిడితనం ముందూ అందరూ సరెండర్ అయిపోతారు.


సో *లైఫ్‌లో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్‌ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది.*


*ప్రోగ్రామింగ్ ట్రాప్ అని మరొకటి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన పాత జ్ఞాపకాలూ, అనుభవాలూ ఏమైనా మన బ్రెయిన్ డేటాబేస్‌లో ఉన్నాయేమో బ్రెయిన్ చకాచకా స్కాన్ చేస్తుంది.*


ఉదా.కు.. రోజూ మీకు టీ తాగే అలవాటు ఉంటే గతంలో ఎప్పుడో ఓరోజు సాయంత్రం టీ తాగలేదనుకుందాం. బాగా తలనొప్పి వచ్చి ఉంటుంది.


సో ఈరోజు మీరు మళ్లీ టీ తాగలేదనుకుందాం. వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకపోయినా.. *బ్రెయిన్ ఒక కండిషన్‌కి ఓ రిజల్ట్‌ని match చేసుకుని ఆ outcome ఎలాగైనా సాధించి పెడుతుంది.*


ఇక్కడ కండిషన్ ఏంటంటే.. టీ తాగలేదు.


రిజల్ట్స్ ఏమిటంటే తలనొప్పి రావాలి. 


సో తలనొప్పి వచ్చే ఛాన్స్ లేకపోయినా డేటాబేస్‌లోని పాత రికార్డుల ప్రకారం శరీరంలో బయలాజికల్ మార్పులను సృష్టించి మొత్తానికి తలనొప్పి తెప్పించేస్తుంది.

————

*సో ప్రతీ కండిషన్‌నీ, ప్రతీ అనుభవాన్నీ, ప్రతీ రోజునీ, ప్రతీ క్షణాన్నీ కొత్తగా చూస్తే, కొత్తగా రెస్పాండ్ అవుతూ పోతే బ్రెయిన్ డేటాబేస్‌లోని పాత రికార్డులూ, పనికిమాలిన చేదు జ్ఞాపకాలూ అన్నీ కొట్టుకుపోతాయి. లైఫ్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.. ఇప్పుడే లైఫ్ మొదలెట్టినంత తాజాగా ఉంటాం.*


జీవితం అందమైనది...అనంతమైంది

ఆనందంగా జీవించుదాం....

Thursday, August 19, 2021

పాలకులు -ప్రజలు

 పాలకులు -ప్రజలు

పంచ పాండవులలో మొదటివాడైన ధర్మరాజు ఎక్కువ ధర్మాలు చేసాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజుని వేరే రాజ్యానికి తీసుకు వెళ్ళాడు.*

*ఆ రాజ్యం మహాబల చక్రవర్తి గారి పాలనలో ఉండేది.*

*అక్కడ ఒకరి ఇంట్లోకి వెళ్లి నీళ్లు అడిగారు. ఆ ఇంటిలోని ఆమె వారికి బంగారు గ్లాసులో నీళ్లు ఇచ్చింది. వారు తాగేసాక ఆమె ఆ గ్లాస్ ను బయట విసిరేసింది.*

*ధర్మరాజు ఆమెతో.. ఏంటమ్మా బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా.? అని చెప్పడంతో..*

*ఆమె, మా రాజ్యంలో ఒక్కసారి వాడిన వస్తువును మళ్ళీ వాడము అని బదులు చెప్పి లోనికి వెళ్ళిపోయింది.*

*ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు.*

*ఇక రాజును కలవడానికి ఇద్దరు వెళ్లారు. కృష్ణుడు మహాబలరాజుతో ధర్మరాజును ఈ విధంగా పరిచయం చేసాడు.*

*రాజా.! ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని చెప్పాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా చూడలేదు సరికదా కృష్ణుడితో ఇలా అన్నాడు.*

*కృష్ణా.! మీరు చెప్పిన విషయం సరే కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉన్నది, అందరి దగ్గరా సంపద బాగా ఉన్నది, నా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేయడం ఇష్టం, ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు, అందువల్ల దానధర్మాలకు ఇక్కడ తావులేదు, ఇక్కడ ఎవరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈయన రాజ్యంలో బీదవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నారు. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో. ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అన్నారు.*

*తన రాజ్యస్థితిని తలచి సిగ్గుపడి తల దించుకున్నాడు ధర్మరాజు.*

*సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినేలా మార్చడం. ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తల దించుకోవాల్సిందే అని చక్కగా వివరించారు. మరి మన పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో.? ప్రజలు ఎప్పుడు మారుతారో.?*


**చిన్న విన్నపము🙏🙏* 


*విధిగా సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ సందేశం పంపండి.* *ఎందుకంటే కనీసం కొంతమందినైన మార్చాలని ఆశిస్తూ.🙏🙏*

వరలక్ష్మి వ్రతం : (పూజా విధానం )

 వరలక్ష్మి వ్రతం : (పూజా విధానం )


శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :-

పసుపు ................. 100 grms

కుంకుమ ................100 grms

గంధం .................... 1box

విడిపూలు................ 1/2 kg

పూల మాలలు ........... 6

తమలపాకులు............ 30

వక్కలు..................... 100 grms

ఖర్జూరములు..............50 grms

అగర్బత్తి ....................1 pack

కర్పూరము.................50 grms

చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins )

తెల్ల టవల్ .................1

బ్లౌస్ పీసులు .............. 2

మామిడి ఆకులు............

అరటిపండ్లు ................ 1 dazans

ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు

అమ్మవారి ఫోటోల ......................

కలశము .................... 1

కొబ్బరి కాయలు ............ 3

తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............

స్వీట్లు ..............................

బియ్యం 2 kg

కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML


పూజా సామాగ్రి :-

 

దీపాలు ....

గంట

హారతి ప్లేటు

స్పూన్స్

ట్రేలు

నూనె

వత్తులు

అగ్గిపెట్టె

గ్లాసులు

బౌల్స్


శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే

శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి *

ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు *


వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు, 

లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి.


వ్రత విధానం :-

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.


కావలసినవి :-

పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.


తోరం ఎలా తయారుచేసుకోవాలి :-

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటేఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.


గణపతి పూజ:-

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥

ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన

పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥

గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.

ఓం సుముఖాయ నమః,

ఓం ఏకదంతాయ నమః,

ఓం కపిలాయ నమః,

ఓం గజకర్ణికాయ నమః,

ఓంలంబోదరాయ నమః,

ఓం వికటాయ నమః,

ఓం విఘ్నరాజాయ నమః,

ఓం గణాధిపాయ నమః,

ఓంధూమకేతవే నమః,

ఓం వక్రతుండాయ నమః,

ఓం గణాధ్యక్షాయ నమః,

ఓం ఫాలచంద్రాయ నమః,

ఓం గజాననాయ నమః,

ఓం శూర్పకర్ణాయ నమః,

ఓం హేరంబాయ నమః,

ఓం స్కందపూర్వజాయనమః,

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.

స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.


ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,

భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!


నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామినీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!


వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.


కలశపూజ :-

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః

మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః

కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః

అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః


ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాఃగంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥


అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యాలపైన, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.


అధాంగపూజ:-

పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.


చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి. 


(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)


శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-

ఓం ప్రకృత్యై నమః

ఓం వికృతై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూత హితప్రదాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓంపరమాత్మికాయై నమః

ఓం వాచ్యై నమః

ఓం పద్మాలయాయై నమః

ఓం శుచయే నమః

ఓంస్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓంహిరణ్మయై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యైనమః

ఓం ఆదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం రమాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓంకామాక్ష్యై నమః

ఓం క్రోధ సంభవాయై నమః

ఓం అనుగ్రహ ప్రదాయై నమః

ఓంబుద్ధ్యె నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓంఅమృతాయై నమః

ఓం దీపాయై నమః

ఓం తుష్టయే నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓంలోకశోకవినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓంలోకమాత్రే నమః

ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓంపద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓంపద్మముఖియై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓంపద్మమాలాధరాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం పద్మిన్యై నమః

ఓం పద్మ గంధిన్యైనమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాదాభిముఖీయైనమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓంచంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్ర రూపాయై నమః

ఓంఇందిరాయై నమః

ఓం ఇందుశీతలాయై నమః

ఓం ఆహ్లాదజనన్యై నమః

ఓం పుష్ట్యెనమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః

ఓం దారిద్ర నాశిన్యై నమః

ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః

ఓం శాంత్యై నమః

ఓం శుక్లమాలాంబరాయై నమః

ఓం శ్రీయై నమః

ఓంభాస్కర్యై నమః

ఓం బిల్వ నిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యైనమః

ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాంగాయై నమః

ఓం హరిణ్యై నమః

ఓంహేమమాలిన్యై నమః

ఓం ధనధాన్యకర్యై నమః

ఓం సిద్ధ్యై నమః

ఓం త్రైణసౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశగతానందాయై నమః

ఓంవరలక్ష్మ్యై నమః

ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓంహిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్రతనయాయై నమః

ఓం జయాయై నమః

ఓంమంగళాదేవ్యై నమః

ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః

ఓం ప్రసన్నాక్ష్యైనమః

ఓం నారాయణసీమాశ్రితాయై నమః

ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః

ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః

ఓంభువనేశ్వర్యై నమః


తోరపూజ :-

తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.


కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,

రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,

లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,

విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,

మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,

క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,

విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,

చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,

శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.

ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి

బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం

పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే


వ్రత కథా ప్రారంభం :-

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా!స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.

శ్రద్ధగా వినండి.


పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి.ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలుసర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.


వరలక్ష్మీ సాక్షాత్కారం :-

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికిముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. “హే జననీ!నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగామన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’’ అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.


అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతితన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవినిసంకల్ప విధులతో


సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించిప్రతిష్టించింది.


అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలుఘల్లుఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచితకంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకువరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతోతమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.


వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడాసకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయనిసూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపైవేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీతీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి.రాత్రి ఉపవాసం ఉండాలి.


భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడంతప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది....


సర్వేజనాసుఖినోభవతు *

Sunday, August 15, 2021

Independence Day Maths

 ⭕TMF

Telangana Maths Forum


Independence Day Special Mathematics

Specialty of Today's date: 15821



▪︎15=8×2–1=(8÷2¹)!–(8+2–1)=[(8÷2)!+1]–(8+2¹)

▪︎1+5=8–2¹, 1×5=8–2–1=8÷2+1

▪︎1+5+8+2+1, 15+8²×1, 15²×8+1, 158×2+1, 15×82+1, 15×82–1, 15(8+2)+1, 15(8+2)–1, (15×8)²+1 are primes

▪︎15821, Mirror no.12851, 1+5+8+21, 15+8+2+1, 158+2+1, 15+8+2¹, 15+8–2¹, 15+8–1², 1×58²+1, 15×8²+1, 15×8²–1, 15×8+2+1, 15×8+21, 15×8–1², 15×8+2¹, 15×8–2¹, 15×2+8¹, 15²×8–1, 1²+5²+8²+2²+1², (15+8)²×1 are semiprimes

▪︎1+5+82+1 is *(15+8+2–1)th Prime*

▪︎1+58+2+1 is *(15+8–2+1)nd Semiprime*

▪︎158+21 is *15th Good, Long prime*

▪︎158–21 is *15th Pythagorean & (1+5+8+2+1)th Left-truncatable prime*

▪︎1582+1 is *(158+2–1)th Chen prime*

▪︎15×8×2+1 is *[(1+5+8)2+1]th Solinas prime*

▪︎15×8×2–1 is *15th Right-truncatable & (1+5+8+2+1)th Sophie Germain prime*


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

భార్యాభర్తల వాస్తవం....

భార్యాభర్తల వాస్తవం....

 (పెళ్లి అయిన వాళ్ళు తప్పకుండా చదవండి)




భార్య విహీనులైన భర్తలు జీవిత చరమాంకంలో పలు బాధలు పడినవారు చాలా మంది ఉన్నారు..వారికి రోజులు గడవడం కష్టం..........


ఆమె లేని అతడు.. వట్టి మోడు!                                                                                                                                                                                                            భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు. అలుగుతారు. తిడతారు. కొందరు ప్రబుద్ధులైతే పురుషాహంకారంతో కొడతారు కూడా! అన్నింటినీ భరించే భార్యను ‘టేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌’గా తీసుకుంటారు!! ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం.. తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు! ‘ఆమె’ లేని మగాడి జీవితం.. మోడువారిన చెట్టుతో సమానం!! అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మగానుభావులు.. ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక.. అందరితో కలవలేక.. మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపో..తా..రు!!                                                                                                                                                                                      


“నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే.. పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. ‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు. ఆ తర్వాత నా సంగతి చూడు’ అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని. ‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా?’ అనుకోకు. వుంటారు. నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా కోరిక తీరకపోయినా నా ప్రాణం కొట్టుకుపోయేది. చీకటంటే భయం. ఉరిమితే భయం. మెరుపంటే భయం. నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు? అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు?’’...ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది!                                                    


నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు.                                                                                                                                                  


ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం.. భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిపోయిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు.                                                                                                                                                                                                                               


దాంపత్యం అంటే.:- రెండు మనసుల కలయిక. మరణం ఆ బంధాన్ని వేరు చేస్తే.. ఓ భాగస్వామి దూరమైతే.. మిగిలి ఉన్నవారి మనసు కకావికలమవుతుంది. స్ర్తీ, పురుషులెవరికైనా ఆ బాధ ఒకటే. కానీ శేషజీవితాన్ని గడపడంలో మాత్రం తేడాలు కనపడతాయి. భర్త దూరమైనా భార్య తట్టుకుని జీవించగలదు. కానీ.. పురుషులు కుటుంబసభ్యులతో కలిసిపోలేరు. మానసికంగా ఒంటరులైపోతారు. ఒక్క మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి.                                                                                                                                                                                   కావాల్సింది సహకారం.. 


వ్యాపకం:- కొన్ని కుటుంబాలను పరిశీలిస్తే భార్య గతించి ఏళ్లు గడిచినా ఉత్సాహంగా ఉన్నవారు ఉన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నిస్తే.. ‘నా వయసు 90 ఏళ్లు. నా భార్య ఎన్నో ఏళ్ల క్రితమే మరణించింది. కొడుకు, కూతురు రమ్మన్నారు. కానీ, వెళ్లాలని అనిపించలేదు. అందుకే మా వూరిలో ఉన్న ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నా. ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతున్నాను. ఇప్పుడు ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండటంతో అమ్మాయి ఇంటికి వచ్చేశా. ఆ భగవంతుడి పిలుపుకోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ ఓ పెద్దాయన చెప్పుకొచ్చారు. ‘నా వయసు 92 ఏళ్లు. భార్య పాతికేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి నా కోడలు నన్ను కన్న తండ్రిలా సాకుతోంది. సాయంత్రంపూట గుడికి వెళ్లి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇస్తాను. ఖాళీగా ఉండకుండా పుస్తకాలు చదవుతుంటాను, రాస్తుంటాను’ అని చెప్పుకొచ్చారు రఘురామ్‌ అనే మరో వృద్ధుడు.                             


అధ్యయనంలోనూ అదే తేలింది:- దాదాపు ఆరేళ్లక్రితం.. అంటే 2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. అదేంటంటే.. భర్తను కోల్పోయిన మహిళలతో పోలిస్తే, భార్యను కోల్పోయిన పురుషులు త్వరగా చనిపోయే అవకాశం 30 శాతం ఎక్కువని! భర్త చనిపోతే బాధ ఉంటుందిగానీ.. దాన్ని తట్టుకోగలిగే మానసిక స్థైర్యం మహిళలకు ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనంలో తేలింది. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు.                                                                                                  


ఇలా చేస్తే కొంత బెటర్‌:-


1.  చిన్నపిల్లలతో ఎక్కువ సమయం గడపటానికి ప్రయత్నించటం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు. వారి ఆటపాటలు.. చిలిపి చేష్టలు వయసు మళ్లిన వారికి ఆనందాన్ని కలిగించటమే కాదు.. తమ చిన్న తనం నాటి సంఘటనలను జ్ఞప్తికి తెచ్చి మరింత హుషారుగా మార్చేస్తాయి. 


2. వయసు పెరుగుతున్న కొద్దీ తమకంటూ ఒక ప్రపంచం ఉండాలి. ఎందుకంటే ఓ వయసు వచ్చిన తరువాత బయట సంబంధాలు తగ్గిపోతాయి. కుటుంబంలో కూడా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఆఖరికి మనవళ్లు మనవరాళ్లు కూడా వారి ప్రపంచంలో వారుంటున్నారు. అందుకే తమ దైన ప్రపంచం సృష్టించుకోవాలి. అది తమ అభిరుచులకు తగినట్లుగా ఉండాలి. ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన హాబీ ఉండి ఉంటుంది. ఉద్యోగ బాధ్యతలు, ఇతర కారణాల వల్ల ఆ హాబీని మూలన పడేసి ఉండొచ్చు. దాన్ని పైకి తీస్తే కాలక్షేపం అవుతుంది. 


3. లాఫింగ్‌ క్లబ్‌ లాంటి వాటిలో చేరటం లేదా సమాజసేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల ఫలితం ఉంటుంది. 


4. స్నేహితులు, బంధువులతో తరచూ మాట్లాడటానికి ప్రయత్నించాలి. కొత్త స్నేహాలకు చేయిచాచాలి. ఇలాంటి వాటివల్ల కాస్తంత ఉపశమనం కలిగి బాధ నుంచి తేరుకునే శక్తి వస్తుంది.                                                                                                                                                                          


ఆధారపడడమే కారణం:- సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని.. తాను తప్ప ఆమెకు దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు. భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికి బాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. భార్య దగ్గర ఉన్న స్వతంత్రం కొడుకు, కోడళ్ల వద్ద ఉండదు. దానికి తోడు వయోభారం. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అన్నీ కలిసి కుంగుబాటుకు దారితీస్తాయి. నాణేనికి మరోవైపు చూస్తే.. భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తగ్గించుకోవడం కారణంగా ఆరోగ్యంగా పూర్తి జీవితాన్ని గడపగలుగుతారని విశాఖ జీజీహెచ్‌ మానసిక వైద్యులు మురళీ కృష్ణ విశ్లేషించారు.                                                                


మహిళలే స్వతంత్రులు:- స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురుచూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే... భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.- ప్రొఫెసర్‌ రాజు, ఏయూ, సైకాలజీ                                                                                                                                                                                                                                


భావోద్వేగ బలం ఆమెదే:- పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది. సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే.. ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది.


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE