NaReN

NaReN

Saturday, August 14, 2021

జెండా ఎగరవేయడానికి, జెండా ఆవిష్కరించడానికి మధ్య ఉన్న తేడా ఏంటి ?

 జెండా ఎగరవేయడానికి, జెండా ఆవిష్కరించడానికి మధ్య ఉన్న తేడా ఏంటి ?


అనేకమంది చేసిన త్యాగాల వల్ల ఆగస్టు 15, 1947న భారతదేశం స్వాతంత్య్రం పొందింది. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 1950 జనవరి 26న దేశంలో ర అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య ఉన్న ఒక చిన్న తేడా ఉంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు.


స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు.. గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.రాజ్యాంగం అమలులోకి వచ్చాక జనవరి 26 న రాష్ట్రపతి జెండా ఎగుర వేస్తారు.


ప్రతి ఏటా ఆగస్ట్ 15 న వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, జనవరి 26న అధికారులు జెండా వందన కార్యక్రమానికి నాయకత్వం వహిస్తుంటారు.వివిధ సందర్భాల్లో జెండా నియమ నిబంధనలని తప్పనిసరిగా పాటించాలి.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

        పసుపులేటి నరేంద్రస్వామి

Wednesday, August 11, 2021

రిటైర్ అయిన మగాడికి పనికి ఆహార పథకం నిబంధనలు ::

 

~~~~~~~~~~~~~~~

 రిటైర్ అయిన మగాడికి  పనికి ఆహార పథకం నిబంధనలు ::


1)  డోర్ బెల్ కి టక్కున అటెండ్ అవ్వడం.


2) సీరియల్స్ సా....గేటప్పుడు ఫోన్లు మాట్లాడకుండా  నిశ్శబ్దముగ ఉండి....సీరియల్స్ ఐపొయ్యాకే నీ న్యూస్ అదీ చిన్న వాల్యూమ్ లో చూడటం.


3) డోర్  దగ్గర పడి ఉన్న న్యూస్ పేపర్ ను వెంటనే  చదివేయాలి...లేదంటే," పేపర్ మానేద్దాం, చదవరు పెట్టరు డబ్బు వేస్ట్ " అని వినపడుతోంది.


4) భార్య చెపితే (ఆమె కి కోపము వచ్చినప్పుడు మాత్రమే) పిల్లలను తిట్టి కంట్రోల్ చేయడం.


5) అటక పైన పెట్టిన సామాను  కిందికి దించడం.


6) స్టవ్ మీద పెట్టిన పాలు పొంగబోయే ముందే ఎంతో  తెలివిగా స్టవ్ ఆఫ్ చేసి పొంగిపోవటం...కానీ పాలు 

పొంగిపోతే.....!!


7) గట్టిగా మూత బిగుసుకు పోయిన సాస్,జామ్, తేనె  బాటిల్స్ మూతలు ఓపెన్ చేసివ్వడం.


8) స్టవ్ మీదున్న కుక్కర్ వేసే  విజిల్స్ లెక్కబెట్టి 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేయడం.


 9) ఇంట్లో  బల్లి, బొద్దింకల వంటి భయంకరమైన  జీవులను "ఒక్క మాగాడిలా"  కొట్టి బయట పడేయడం.


 10) సిలెండర్ ఖాళీ అయిన వెంటనే మార్చడం.


11)  షాపింగ్ చేసేటప్పుడు భూదేవి కున్న ఓర్పు తో భార్య వెంట ఏ షాప్ అంటే ఆ షాపులోకి ఎన్ని గంటలైనా వెళ్లి కొన్నదానికి నోర్ముసుకొని బిల్ పే చేయడం.


12)  ఇంట్లో చిన్న చిన్న ఎల్కట్రిక్, ప్లంబింగ్ పనులు నేర్చుకుంటూ....చేయడం. సరిగ్గా చేయలేకపోతే....!!


13) తనని "ఇంకా" అందంగా ఉన్నావని మధ్య మధ్య లో  పొగుడుతూ ఉండటం.


14)సెల్ ఫోన్, ఇంటర్నెట్, సిటీ కేబుల్ బిల్లులు సరిఅయిన టైం లోపల కట్టి....తనకు కోపము రాకుండా చూసుకోవడం.


15) కొబ్బరికాయల పీచు తీసి ఇవ్వటం.


16) అయిదు వందలు, రెండు వేలు నోట్లకు క్షణాల్లో చిల్లర తెచ్చి పెట్టటం.


17) మళ్ళీ ఒక్కో సారి, తనకు పర్సు లో తేలిగ్గా ఉండటానికి వందనోట్లన్నీటి బదులు పెద్ద నోట్లు ఏర్పాటు చేసి పెట్టటం. 


*ఈ 17 పనులు చక్కగా నిర్వహించడం రిటైర్ అయిన భర్త కనీస కర్తవ్యం.*


😂😜😂

ఆనందం అంటే ఏమిటి?

 ఆనందం అంటే ఏమిటి?

ఆనందం అంటే ఏమిటి మరియు దానిలో ఏమి ఉంటుంది?

ప్రస్తుత ఆధునిక ప్రపంచం యొక్క అభివృద్ధితో ఉన్న చాలా అసంతృప్తి కారణంగా, ఆనందాన్ని అధ్యయనం చేసే శాస్త్రం గొప్ప ప్రాముఖ్యతను పొందింది ఎందుకంటే ఎవరు సంతోషంగా ఉండటానికి ఇష్టపడరు?

సృష్టి ప్రారంభమైనప్పటి నుండి, తత్వవేత్తలు, మత పెద్దలు, రచయితలు మరియు అరిస్టాటిల్ వంటి ప్రసిద్ధ ఆలోచనాపరులు ఈ ప్రశ్నను తమను తాము అడిగారు, వారు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. 

సమకాలీన మనస్తత్వశాస్త్రంలోఈ భావన మరింత విస్తృతంగా పరిశీలిస్తే ఒక వ్యక్తి  అతని కోసం, ఆనందాన్ని ఆహ్లాదకరమైన, అర్ధవంతమైన మరియు నిబద్ధత గల జీవితంగా అర్థం చేసుకోవడంతో పాటు, ఒక వ్యక్తి కలిగి ఉన్న నాణ్యమైన సంబంధాలతో పాటు తన  విజయాలు మరియు ఆనందాన్ని నిలబెట్టుకుంటాయనే ఆలోచనలను కూడా పొందుపరుస్తాడు.

మన జన్యువులు 50% మన ఆనందాన్ని నిర్ణయిస్తాయి.

మరోవైపు, 10% మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా నిర్ణయించబడుతుంది.

మరియు మిగిలిన 40% మనం  రోజువారీ చేసే కార్యకలాపాల ద్వారా ప్రేరేపించబడతాయి  ఆనందం మన జీవితం మన అవసరాలను పూర్తిగా తీర్చినప్పుడు. అంటే, మనకు సంతృప్తిగా, నెరవేరినప్పుడు అది వస్తుంది. ఇది సంతృప్తి యొక్క అనుభూతి, దీనిలో జీవితం ఎలా ఉండాలో అనిపిస్తుంది. మన అవసరాలన్నీ పూర్తిగా నెరవేరినప్పుడు పరిపూర్ణ ఆనందం, జ్ఞానోదయం వస్తుంది.

మీరు చాలా ఉన్నతిలొ ఉన్నా, అన్ని సదుపాయాలు ఉన్నా, ఏది కావాలంటే అది చేయగలిగినా, ఏది కొరుకుంటే అది పొందగలిగిన వాళ్లని అడిగి చూడండి. నూటికి 95 % మంది ఆనందంగా ఉండటం లేదు.అదే కనీస సదుపాయాలు కూడా లేని వాళ్లు నూటికి 35 % ఆనందంగా ఉన్నామని చెపుతున్నారు. ఆంటే సుఖం ఆనందాన్ని ఇవ్వడం లేదా ? దానికి ప్రధాన కారణం కోరికలని నేననుకుంటున్నాను. కోరికలు మనకి ఆనందం లేకుండా చేస్తున్నాయా?... ఆలోచించండి. ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. మనలో చాలామంది సుఖాల కోసం ఆనందాన్ని వదిలేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం.

సంతోషం/ఆనందం అనేది 50 శాతం జన్యుపరంగా ఉంటుంది. 40 శాతం మనిషి అంతర్గత ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. మిగిలిన 10 శాతం అతడి జీవన పరిస్థితుల ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. జన్యుపరమైన సమస్యపై చేయగలిగిందేమీ లేదు. మంచి ఆరోగ్యం, ఇతరులతో సత్సంబంధాలు, మూల ఆదాయం, అర్థవంతమైన పని, నేర్పరితనం, ప్రకృతితో మమేకం కావడం, ఆర్థిక, సామాజిక సమానత, దాతృత్వం వంటి అంశాలపై ఆధారపడి ఆనందాన్ని నిర్వచించాలి. ఒక వ్యక్తికి ఇంట్లో ఉండే ఆనందం పని ప్రదేశానికి వెళ్లాక.. నిమిష నిమిషానికి తగ్గిపోతోంది. అందువల్ల ఆదాయం కంటే మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి.  మన జన్యుశాస్త్రం, మనం పెరిగిన విధానం మరియు మన జీవిత అనుభవాల ఆధారంగా మన వ్యక్తిగత అవసరాలు మారుతూ ఉంటాయి. ఈ సంక్లిష్ట కలయిక మనలో ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైనదిగా చేస్తుంది, మన ఖచ్చితమైన అవసరాలలో మరియు ఈ రోజు మనం ఉన్న వ్యక్తిని తయారుచేసే అన్ని ఇతర అంశాలలోమనలో ప్రతి ఒక్కరూ చాలా సంక్లిష్టంగా మారవచ్చు, కాని మనమందరం మనుషులం మరియు ఇది మన అవసరమైన మానవ అవసరాలను కనుగొనగల పునాదిని అందిస్తుంది.

సమస్య ఏమిటంటే, మన చుట్టూ ఉన్న అన్ని వస్తువులు మరియు ప్రజలు, సాధించిన విజయాలు మనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు. ఇవన్నీ మన ఇంద్రియాలను తాత్కాలికంగా ఆహ్లాదపరుస్తాయి, మన అహాన్ని రంజింపజేస్తాయి, మన స్థితిని పెంచుతాయి. ప్రతిదీ తాత్కాలికం. నిజమైన ఆనందం ఈ బాహ్య కారకాలపై ఆధారపడి ఉండదు.

ఆనందం అనేది మనస్సు యొక్క స్థితి. ఒక వ్యక్తి సంతోషంగా ఎలా ఉండాలో తెలియకపోతే, అతనికి ఏమీ సహాయం చేయదు (డబ్బు, లేదా ఒకరి దృష్టి, లేదా కీర్తి కాదు). మీరు ఎన్నడూ సంతోషంగా లేకుంటే లేదా ఈ భావన ఏమిటో ఇప్పటికే మరచిపోకపోతే, మీరు మళ్ళీ సంతోషంగా ఉండటానికి నేర్చుకోవాలి. అన్నింటిలో మొదటిది, ఆనందం యొక్క మార్గంలో, మన పాత్రను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా వ్యక్తిత్వ లక్షణాలు సంతోషంగా ఉండగల సామర్థ్యాన్ని అడ్డుకుంటాయి. అసూయ, కోపం, చిరాకు, ఆగ్రహం, దురదృష్టం, పనిలేకుండా మాట్లాడటం, వెన్నుపోటు నుండి బయటపడటం అవసరం. చెడు నుండి మన  ఆలోచనలు మరియు మాటలను బయట పడేయాలి. మీ స్వంత చర్యలపై దృష్టి పెట్టండి, ఇతరులు కాదు. విమర్శలను వదిలించుకోండి. సంతోషంగా ఉన్న వ్యక్తిగతంతో భాధ పడడు, వర్తమానం గురించి ఆందోళన చెందడు, భవిష్యత్తు గురించి భయపడడు. దీని అర్థం బాధాకరమైన, కష్టమైన జ్ఞాపకాలు ఉంటే, అవి ఇకపై అతుక్కుపోకుండా ఉండటానికి మానసికంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఆనందం అనేది మనస్సు యొక్క స్థితి. ఇది నాస్తికులకు సంబంధించినది కాదని దీని అర్థం. ఒక వ్యక్తికి ఖచ్చితంగా కాంతి, శక్తివంతమైన వాటిపై నమ్మకం ఉండాలి: దేవుడిలో, అధిక శక్తులు, శక్తులు, ప్రకృతి, విధి. విశ్వాసం మరియు ఉన్నతమైన వాటిపై నమ్మకం ద్వారా మాత్రమే మనం వర్తమానంలో శాంతిని, భవిష్యత్తులో విశ్వాసాన్ని పొందగలం. ఒక వ్యక్తి పంచుకున్నది అతనికి మూడుసార్లు తిరిగి ఇవ్వబడుతుంది. అంటే, ఆనందం, మంచి మానసిక స్థితి, అభినందనలు, సహాయం పంచుకోవడం ప్రారంభించండి మరియు మీ దృక్పథం ఎలా మారుతుందో మీరు గమనించవచ్చు.

 మరి ఆనందం ఎందులో ఉంటుంది ?

కోట్లకు కోట్లు డబ్బు సంపాదిస్తే ఆనందం వస్తుందా......కాదనే చెప్పాలి. పెద్ద ఇల్లు, కీర్తి, చుట్టాలు, స్నేహితులు ఉంటే వస్తుందా.......కాదనే చెప్పాలి. 2018 లో ప్రపంచ వ్యాప్తంగా జరిపిన ఆనంద నగరాల సర్వేలో వెల్లడైన విషయాలు

25 % మంది తెలియదు.. చెప్పలేం అన్నారు.

40 % మంది సుఖంగా ఉండటమే ఆనందం అన్నారు.

25% మంది ఏది తలుచుకుంటే అది చేయగలగడమే ఆనందం అన్నారు.

10 % మంది కళలు, దేవుడు... వీటికి దగ్గరగా ఉండటమే ఆనందం అన్నారు.

మరి మీ దృష్టిలో ఆనందం అంటే ఎమిటో అలోచించండి...

మీరు ఆనందంగా ఉన్నారా ? ఉంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆనందంగా ఉన్నారో లెక్కపెట్టగలరా ?

ఒకవేళ మీరు ఆనందంగా ఉన్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులు. ఆదే ఆనందంగా లేకపొతే ... ఎందుకు ఆనందాన్ని మిస్ అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. జీవితం ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది కాదు.. ఎంత ఆనందంగా జీవించామన్నది ముఖ్యం. మనం బ్రతికి ఉండే ప్రతి నిమిషాన్నీ ఆనందించగలిగితే ఎంత బాగుంటుంది. అది మీ చేతిలోనే ఉంది. సమయాన్ని జారవిడుచుకోకండి. ఆనందంగా ఉన్నారా.. ఉంటే ఎంత % ఆనందంగా ఉన్నారు.. ఏం చేస్తే మీ ఆనందం 100 % అవుతుంది...

ఆనందంగా ఉన్న వారికి ఆయుర్ధాయం పెరుగుతుందని మీకు తెలుసా ? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆనందం గురించి అలోచిస్తే కొన్ని ప్రశ్నలు వచ్చాయి. పోటీ చదువులు, కంప్యూటర్లు , వీడియో గేంలు ఇవన్నీ పిల్లల్లో సహజమైన ఆనందాన్ని దూరం చేస్తున్నాయి. ఈ కార్పొరేట్ ప్రపంచం వచ్చాక, 24 గంటలు పనిచేసే ఆఫీసులు , ప్రతి నెలా మారే షిఫ్టులు, ఒక మొక్క కూడా పెంచుకోలేని అపార్టుమెంటులు, దేవుడితో బిజినెస్ చేసే మనుషులు....... ఇవన్నీ ఆనందాన్ని ఇస్తున్నాయా ? ఇక్కడ మీకొక విషయం చెప్పాలి. దైవత్వం, మానవత్వం, పశుతత్వం... మూడు గుణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఏది ఎంత % మీలో ఉంది అనేదాన్ని బట్టి మీ అనందం ఉంటుంది అని చెప్పుకోవచ్చు.

గమనిక: నాకు ఆనందం అంటే ఏదో తెలుసని ఈ పొస్ట్ రాయలేదు. నా లాగే ఇంక ఎవరైనా తెలియని వాళ్లు ఉంటే వాళ్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారెమో అని.


Tuesday, August 10, 2021

ఐఐటీలో సీటు.. కానీ బీఎస్సీ మ్యాథ్స్ మాత్ర‌మే చ‌దువుతా..

 🔊 ఐఐటీలో సీటు.. కానీ బీఎస్సీ మ్యాథ్స్ మాత్ర‌మే చ‌దువుతా...


న్యూఢిల్లీ : ఐఐటీలో సీటు పొందిన ఓ విద్యార్థి విలేక‌రుల ప్ర‌శ్న‌కు వింత స‌మాధానం చెప్పాడు. త‌న‌కు ఐఐటీలో సీటు వ‌చ్చిన‌ప్ప‌టికీ బీఎస్సీ మ్యాథ్స్ మాత్ర‌మే చ‌దువుతాన‌ని తేల్చిచెప్పాడు. హ‌ర్యాన‌కు చెందిన అన్మూల్ అరిచ్‌వాల్ శుక్ర‌వారం విడుద‌లైన జేఈఈ మెయిన్స్ ఫ‌లితాల్లో 100 శాతం ప‌ర్సంటైల్ సాధించాడు. ఈ సంద‌ర్భంగా అన్మూల్‌ను విలేక‌రులు సంప్ర‌దించారు. మీ భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు ఏంటి? ఐఐటీలో 100 శాతం ప‌ర్సంటైల్ సాధించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అని అన్మూల్‌ను ప్ర‌శ్నించారు.


అయితే అత‌ను చెప్పిన స‌మాధానం విని విలేక‌రులు షాక్ అయ్యారు. త‌న‌కు ఐఐటీలో సీటు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ప్ర‌వేశం తీసుకోను అని తేల్చిచెప్పాడు. IISc Bangalore లో బీఎస్సీ మ్యాథ‌మేటిక్స్ మాత్ర‌మే చ‌దువుతాన‌ని, ఆ స‌బ్జెక్టులో రీసెర్చ్ చేయాల‌నే ఆస‌క్తి ఉంద‌ని అన్మూల్ పేర్కొన్నాడు.

Monday, August 9, 2021

విజయం అంటే ఏమిటి ?

 విజయం అంటే ఏమిటి?


మన దేశం నుండీ ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీలో విద్యార్థులతో మాట్లాడుతూ *''విజయం అంటే ఏమిటి?''* అని అడిగితే ఒక యువతి *''విజయం అంటే ఎక్కువ ధనం సంపాదించడం''* అనింది. 


అపుడు ఆ ప్రొఫెసర్ ''అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవుంతుడు ఎవరో చెప్పండి? ''అంటే ఎవరూ చెప్పలేదు. (ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి) *బ్రతకడానికి కొంత ధనం కావాలి కానీ, ధనమే బ్రతుకు కాదు. అంటే విజయమంటే ధన సంపాదన కాదు* అన్నమాట.   


మరో యువకుడు లేచి *''విజయం అంటే బలం/శక్తి''* అన్నాడు. అలా అయితే అలెగ్జాండర్, నెపోలియన్, ముస్సొలిని, హిట్లర్, స్టాలిన్, బిన్ లాడెన్ వీళ్ళంతా బలవంతులు, ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా, వీళ్ళు జీవితంలో సంతోషంగా వుండగలిగారా?  వీళ్ళ జీవితాలు ఎలా గడిచి, ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా!


తన బలంతో, తన ముష్టిఘాతాలతో మహా బలవంతులను మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్, తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల  కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు.


అయితే విజయమంటే బలం/శక్తి సంపాదన కాదు అన్నమాట. 

మరో యువతి *''విజయమంటే ప్రఖ్యాతి, అందం''* అంది. అయితే కేట్ మోస్, జీన్ ష్రింప్టన్, సోఫియాలారెన్, మార్లిన్ మన్రో లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు. 


భారత్ విషయానికొస్తే, పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే, అమితాబ్ బచ్చన్ తో సహా, ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకోని హిందీ సినిమా హీరోనే లేడు. డానీ, కబీర్ బేడీ, మహేష్ భట్ లతో ఆమె ప్రేమ, పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే.


కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి, నమ్మిన వాళ్ళు మోసం చేస్తే, తాగుడుకు బానిస అయ్యి, ఒక దశలో కాలికి కురుపు లేచి, అది ఒళ్ళంతా ప్రాకి, ఏ శరీరం కోసం అయితే అంతమంది మగవాళ్ళు పిచ్చిక్కెపోయారో, అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే, ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని, జనం ఆమెను తాళ్ళతో కట్టి, ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే, ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని ఫిర్యాదు చేస్తే, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు.


మన తెలుగు చలన చిత్ర కథానాయిక సావిత్రి గారి అందం సంపద అన్నీ కరిగిపోయి చివరకు అవసాన దశలో ఆమెకు భయంకరమైన మరణం సంభవించింది.


అయితే అందం, ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట.   


మరోసారి మరొకరు *''విజయమంటే అధికారం''* అని అన్నారు. అయితే ''కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి'' అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు.


అనంతపురంలో  ఒకప్పుడు రాష్ట్రపతిగా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి, పందులు దొర్లుతున్నాయి. విజయం అంటే అధికారం కాదు అన్న మాట. 


చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీలో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు *''విజయం అంటే ఏమిటి?''* అని, అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు, ''మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా?'' అందరూ ''తెలుసు'' అన్నారు. ''వాళ్ళ అవ్వ, తాతల పేర్లు తెలుసా?'' అని అడిగితే అయిదారుమంది ''తెలుసు'' అన్నారు. ''వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా?'' అని అడిగితే "తెలియదు'' అన్నారు. 

అపుడు ప్రొఫెసర్ గారు'' శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఆదిశంకరుడు, అందరూ '' ఓ, తెలుసు'' అని ముక్తకంఠంతో బదులిచ్చారు. 


''మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు?'' 

అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి, ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అనింది, 


''సార్, మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం రాముడు, కృష్ణుడు, బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం, 

*తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది, ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే!''*


*''నా గురించి నేను దుఃఖించకపోవడమే నా ఆనందానికి కారణం''* అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట,


*''ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు, అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క'' (Only they live who live for others , the others are more dead than alive)*  

అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే కదా.


పసుపులేటి నరేంద్ర స్వామి

Update

 *సమయానుకూలంగా వెళ్లితీరాలి..  లేకపోతే మనుగడే ప్రశ్నార్థకంగా మారవచ్చు.!?*

```1998 లో, 1,70,000 మంది ఉద్యోగులు కోడాక్‌ లో పనిచేశారు మరియు వారు ప్రపంచంలోని 85% ఫోటో పేపర్‌ను అమ్మారు. ఐనప్పటికీ కొన్ని సంవత్సరాలలో, డిజిటల్ ఫోటోగ్రఫీ వాటిని మార్కెట్ నుండి తరిమివేసింది..```

కోడాక్ దివాళా తీసింది, మరియు ఉద్యోగులందరూ రోడ్డుపై పడ్డారు.


 HMT (watch)

 బజాజ్ (స్కూటర్)

 డయనోరా (టీవీ)

 మర్ఫీ (రేడియో)

 నోకియా (మొబైల్)

 రాజ్‌డూత్ (బైక్)

 అంబాసిడర్ (కార్)

Etc., Etc..

చెప్తుపోతుంటే, List చాలదు..


 మిత్రులారా,

 వీటన్నిటి నాణ్యతలో కొరత లేదు, అయినప్పటికీ అవి మార్కెట్‌కు దూరంగా ఉన్నాయి !!

*కారణం ???*

ఓకేఒక్కటి UPDATE.

```they DIDN'T UPGRADE```

 *కాలక్రమేణా అవి మారలేదు. !!*


 రాబోయే పదేళ్లలో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని, నేడు నడుస్తున్న 70 నుంచి 90% పరిశ్రమలు మూతపడతాయని మీకు తెలుసా..?

గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను ఒకసారి నిశితంగా పరిశీలించి చూడండి. అవి మీకు

*నాల్గవ పారిశ్రామిక విప్లవానికి స్వాగతం…* పలుకుతుంటాయి.


 🔥ఉబెర్ కేవలం ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే.  సొంతంగా ఒక్క కారు కూడా లేనప్పటికీ, అది ప్రపంచంలోనే అతిపెద్ద టాక్సీ సంస్థ.


 🔥సొంతంగా హోటల్ లేనప్పటికీ, ఎయిర్‌బిఎన్బి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ సంస్థ.


*Zomato, swiggy, Paytm, ola cabs, oyo rooms వంటి అనేక ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నాయి.*


🔥యుఎస్‌లో యువ న్యాయవాదుల కోసం ఇప్పుడు ఎటువంటి పని లేదు. ఎందుకంటే ఐబిఎం వాట్సన్ సాఫ్ట్‌వేర్ క్షణంలో మంచి న్యాయ సలహాలను ఇస్తుంది.  రాబోయే పదేళ్లలో, 90% యుఎస్ న్యాయవాదులు నిరుద్యోగులు అవుతారు.. 


🔥వాట్సన్ అనే సాఫ్ట్‌వేర్ క్యాన్సర్ నిర్ధారణను మానవులకన్నా 4 రెట్లు కచ్చితంగా అంచనా వేస్తుంది. దీని వల్ల మెడికల్ రంగంలో ఎన్నో మార్పులు రావచ్చు. ఎన్నో లక్షలాది మంది నిరుద్యోగులు కావచ్చు.


*2030 నాటికి కంప్యూటర్లు మనుషులకన్నా చాలా తెలివైనవిగా ఉంటాయి.*


రాబోయే పదేళ్లలో, 60% కార్లు (ప్రపంచంలో) రోడ్ల పై ఎలక్ట్రిక్ కార్లు లేదా హైబ్రిడ్ కార్లు. Driverless కార్లదే రాజ్యం..


🔥 ఎలక్ట్రిక్ వినియోగం పెరగడంతో, పెట్రోల్ వినియోగం 60% తగ్గుతుంది. అన్ని అరబ్ దేశాలు దివాళావైపు పరుగులుతీస్తాయి.


*మీరు ఉబెర్ వంటి సాఫ్ట్‌వేర్ నుండి కారును పొందుతారు, మరియు కొద్ది క్షణాల్లో డ్రైవర్‌లేని కారు మీ తలుపు వద్ద నిలబడుతుంది. మీరు దానిని ఎవరితోనైనా పంచుకుంటే, ఆ రైడ్ మీ బైక్ కంటే చౌకగా ఉంటుంది.*


 🔥కార్లు డ్రైవర్ లేని కారణంగా 90% ప్రమాదాలు ఆగిపోతాయి.. ఇది కార్ ఇన్సూరెన్స్ అనే వ్యాపారాన్ని మూసివేస్తుంది.


🔥 డ్రైవర్ వంటి ఉపాధి భూమిపై క్రమేపీ తగ్గిపోతుంది. నగరాలు మరియు రోడ్ల నుండి 90% కార్లు అదృశ్యమైనప్పుడు, ట్రాఫిక్ మరియు పార్కింగ్ వంటి సమస్యలు అదృశ్యమవుతాయి ...


20 సంవత్సరాల క్రితం పిసిఓ లేని చోటు లేదు.  మొబైల్ ఫోన్ శకం మొదలవగానే పిసిఓ లు, కాయిన్ బాక్స్ లు మూసివేయడం ప్రారంభమైంది.. అప్పుడు ఆ పిసిఓ లలో ఫోన్ రీఛార్జ్ అమ్మడం ప్రారంభించారు. 


🔥 ఇప్పుడు రీఛార్జ్ కూడా ఆన్‌లైన్‌లో ప్రారంభమైంది. 


*మీరు ఎప్పుడైనా గమనించారా ..?*


ఈ రోజుల్లో, మార్కెట్లో ప్రతి మూడవ దుకాణం మొబైల్ ఫోన్లదే..

 అమ్మకం, సేవ, రీఛార్జ్, ఉపకరణాలు, మరమ్మత్తు, నిర్వహణ.. జరుగుతోంది


ఇప్పుడు అంతా పేటీఎమ్‌ జమానా..

ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే.. etc

ఇప్పుడు ప్రజలు తమ ఫోన్‌ల నుంచి రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ప్రారంభించారు.. ఇప్పుడు డబ్బు లావాదేవీలు కూడా మారుతున్నాయి .. కరెన్సీ నోట్‌.. ప్లాస్టిక్ మనీగా (డెబిట్) కార్డుగా మార్పుచెందింది.. ఇప్పుడు అది డిజిటల్‌గా మారింది.  


🔥 ప్రపంచం చాలా వేగంగా మారుతోంది .. కళ్ళు, చెవులు మాత్రమే కాదు, మీ మెదడు/మనస్సు కూడా తెరిచి ఉంచండి. లేకపోతే మీరు తప్పక వెనుకబడిపోతారు..


 *కాలక్రమేణా మార్పు సహజం*

 అందువల్ల ...

 ఒక వ్యక్తి తన వ్యాపారాన్ని మరియు అతని స్వభావాన్ని కాలక్రమేణా మారుస్తూ ఉండాలి.

 

*"టైమ్ టు టైమ్ అప్‌డేట్ & అప్‌గ్రేడ్"*


 సమయంతో కదిలితే విజయం సాధించడమ్, లేకపోతే కనుమరుగైపోవడం.

సో..అప్ గ్రేడ్ అవ్వండి.

పసుపులేటి నరేంద్ర స్వామి

      

Tuesday, August 3, 2021

కామిక ఏకాదశి

 *కామిక ఏకాదశి*

రేపు (4-08-2021) బుధవారం

🕉️🍁🍁🍁🍁🔯✡️🌻🌻🌻🌻🕉️


🕉️ *తులసి ఆకులతో కామిక ఏకాదశి చేసి తరిద్దాం...* 🕉️

 

💫🍁 ఆషాఢ మాసములో కృష్ణ పక్ష ఏకాదశిని  కామిక ఏకాదశిగా జరుపుకుంటారు.   ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు. 


💫🍁 శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించటం, తులసీ దళాలతో పూజ చేయటం, వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి.

 

🕉️ *కామిక ఏకాదశి మహత్యం - వ్రత కథ* 🕉️


🍁💫 ధర్మవర్తనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి,  "ఆషాఢ మాసములో కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని" కోరగా, దానికి ఆ వాసుదేవుడు సంతోషించినవాడై, 

 


💫🍁 "ఓ రాజా! ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్య కార్యమే, ఒకసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మ దేవుడిని ఇలా అడిగాడు.... 


🍁💫 "ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు అధిదేవత ఎవరు, వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయయుంచి తెలపండి" అని కోరాడు. 

 

🍁💫 దానికి బ్రహ్మ బదులిస్తూ...  "నా ప్రియమైన కుమారుడా! మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించెదను. 


💫🍁 ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి  మహిమ విన్నంతనే అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. శంఖ, చక్ర గదాధరుడు, తామర పాదములు కలిగి ఉన్నవాడు, శ్రీధరుడు, హరి, విష్ణు, మాధవుడు మరియు మధుసూధనుడు అనే పేర్లతో పిలవబడేవాడు అయిన శ్రీమహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు. 

 

🍁💫 కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గురు గ్రహం సింహ రాశిలో ఉన్న పౌర్ణమి రోజు - సోమవారం, గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. 

 

🍁💫 కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడ మరియు గ్రాసములతో  కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతములో చేసిన పాపములకు భయపడేవారు, పాపమయమైన జీవితంలో కూరుకపోయినవారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. ఏకాదశి రోజులు స్వచ్చమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి. 

 

🍁💫 నారదా! ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు.  


🕉️💫 "కామిక ఏకాదశి రోజు ఉపవసించినవారు,సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారి కన్నా గొప్పవారు.  "ఈ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు. కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. 


🍁💫 కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు, అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. 


🍁💫 ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము, బంగారం, వెండి దానం చేస్తే వచ్చే దాని కన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి, ముత్యాలు, కెంపులు, పుష్పరాగములు , వజ్రాలు, నీలం మరియు గోమేధికములతో పూజించినదానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు.  లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించివేస్తుంది. 


💫🍁 కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ల పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు. ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో, వారు శాశ్వతముగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామిక ఏకాదశికి బ్రహ్మ హత్యా పాతకాన్ని, భ్రూణ హత్యా పాపమును కూడా తొలగించే శక్తి ఉంది."  అని బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా... శ్రీకృష్ణుడు ధర్మరాజు తో చెప్పెను.



*ఓం నమో నారాయణాయ*

.

🕉️🍁🍁🍁🍁✡️🔯🌻🌻🌻🌻🕉️

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE