NaReN

NaReN

Tuesday, March 30, 2021

31.03.2021 పంచాంగం

 *卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐* 

🌟 *బుధవారం, మార్చి 31, 2021* 🌟

    *_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*

  *ఉత్తరాయణం*   *శిశిర ఋతువు* 

    *ఫాల్గుణ మాసం*  *బహుళ పక్షం* 

తిధి : *తదియ*  సా6.24

           తదుపరి తదియ  

వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)

నక్షత్రం : *స్వాతి* మ1.44  

               తదుపరి విశాఖ      

యోగం : *హర్షణ* మ1.50

                తదుపరి వజ్రం 

కరణం  :  *వణిజ* ఉ7.36

                 తదుపరి *భద్ర/విష్ఠి* సా6.24

             ఆ తదుపరి *బవ* తె5.10  

వర్జ్యం   :    *సా6.55 - 8.23* 

దుర్ముహూర్తం : *ఉ11.40 - 12.28*

అమృతకాలం:  *ఉ7.01వరకు* &

                        *తె3.48 - 5.17*

రాహుకాలం   :  *మ12.00 - 1.30* 

యమగండం/కేతుకాలం: *ఉ7.30 - 9.00*

సూర్యరాశి: *మీనం*  ||  చంద్రరాశి: *తుల*

సూర్యోదయం: *6.00* || సూర్యాస్తమయం: *6.09*

 👉 *సంకష్టహర చతుర్థీ వ్రతము*

 *_సర్వే జనా సుఖినోభవంతు_*

              శుభమస్తు🙏

____________________________________   

           *_గోమాతను పూజించండి_* 

           *_గోమాతను సంరక్షించండి_*

జీవితం

 💐జీవితం 💐


అనగా అనగా గొప్ప తాపీ మేస్త్రీ ఒకడు ఉండేవాడు. అతని నైపుణ్యం అద్భుతం! అతని పనితనం అసామాన్యం; అనితర సాధ్యం! ముప్ఫై సంవత్సరాలుగా అతను ఒక కాంట్రాక్టరు క్రింద పని చేస్తూ వచ్చాడు. ఆ కాంట్రాక్టరుకు కూడా మేస్త్రీ అంటే చాలా గౌరవం అభిమానం- అందువల్లనే వాళ్ళ సంబంధం అన్ని సంవత్సరాలపాటు కొనసాగింది. చివరికి ఒక రోజున మేస్త్రీ కాంట్రాక్టరుతో చెప్పేశాడు- "అయ్యా! ప్రస్తుతం మనం చేస్తున్న ఈ పనేదో అయిపోగానే, నేను ఇక రిటైరు అయిపోతాను. బాగా పెద్దవాడిని అయిపోయాను, కొంచెం బలహీనంగా కూడా అవుతున్నట్లుంది. ఇప్పుడిక పనిని చాలించాలి. మిగిలిన కొద్దిపాటి జీవితాన్ని విశ్రాంతిగా గడుపుదామని ఉన్నది. ఈ సంగతిని కొంచెం ముందుగానే తెలియజేస్తున్నాను మీకు- ఏమంటే పనిలో కష్టం కలగకూడదు గద, అందుకని" అన్నాడు. కాంట్రాక్టర్ సన్నగా నవ్వాడు. సరేనన్నట్లు తల ఊపాడు.


చేస్తున్న పనేదో ముగింపుకు వచ్చింది. పని ఆరోజుతో అయిపోతుందనగా కాంట్రాక్టరు మేస్త్రీని పిలిచి- "ఈ పని అయిపోగానే రిటైరు అయిపోతానన్నావు. నేను అందుకు ఒప్పుకున్నాను కూడాను. ఇదంతా నాకు గుర్తులేక కాదు- కానీ నాదొక చిన్న అభ్యర్థన- కాదనకు. నాకోసం మరొక్క చక్కని ఇల్లు- ఒక్కటంటే ఒక్కటి- కట్టి ఇచ్చి వెళ్ళు. ఆ తర్వాత నేను ఇక నిన్ను ఆపను. మరొక్క ఇల్లు- అంతే- ఏమంటావు?" అన్నాడు.


మేస్త్రీకి ఈ మార్పు అస్సలు నచ్చలేదు. అయినా ఏం చేస్తాడు, చాలా కాలంపాటు పని చేసి ఉన్నాడు- కాదనటానికి లేదు- అందుకని అయిష్టంగానే ఒప్పుకున్నాడు.


ఒప్పుకున్నాడన్నమాటే గాని, నిజంగా కొత్త ఇంటి పని మొదలయ్యేసరికి, మేస్త్రీకి ఆ పని పెద్ద బరువులాగా తోచింది. ఏమాత్రం ఇష్టం కాలేదు. పనిలో అస్సలు మనసు నిలవలేదు. 

దాంతో ఆ పని అరకొర వేగంతో, దాని ఇష్టం వచ్చినట్లు అది సాగింది. నిర్మాణపు క్వాలిటీకూడా బాగా రాలేదు. మేస్త్రీ ఆ మార్పును గమనించాడు- అయినా సర్దుకు పోయాడు. "ఏంచేస్తాం, ఇంతే!" అనుకున్నాడు. మధ్య మధ్యలో కాంట్రాక్టరు వచ్చి సలహాలూ, సూచనలూ ఇస్తూనే వచ్చాడు. అయినా మేస్త్రీ వాటిని అన్నిటినీ పెడచెవిన పెట్టాడు. "ఎలాగో ఒకలాగా అయిపోనీ, పని గడిస్తే చాలు" అనుకున్నాడు. 


కొత్త ఇంట్లో పని పూర్తయ్యే సమయానికి కాంట్రాక్టరు వచ్చి చివరి ఇన్స్పెక్షను చేశాడు. నిర్మాణపు పనితనం బాగాలేదు: చాలా లోపాలు కనబడ్డాయి. ఆయనేమీ ఆశ్చర్యపోలేదు- ముందునుండీ చూస్తూనే ఉన్నాడు గద! నిట్టూర్చాడు. ఆపైన మెల్లగా జేబులోంచి తాళాల గుత్తి తీసి, మేస్త్రీ చేతికి ఇస్తూ అన్నాడు- "మిత్రమా! ఇదిగో, ఈ ఇల్లు ఇక నీదే. ఇంటి తాళాలివిగో- అందుకో. మన స్నేహానికి గుర్తుగా నేను నీకు ఇవ్వదలచిన బహుమతి ఇది" అని. మేస్త్రీ నిర్ఘాంతపోయాడు. "ఎంత ఘోరం జరిగిపోయింది! ఈ సంగతి ముందుగానే తెలిసిఉంటే ఎంత బాగుండేది?! తను ఆ ఇంటి నిర్మాణంలో జీవం పోసి ఉండేవాడే! ఇప్పుడు ఇక చేయగలిగింది ఏమీ లేదు. లోపభూయిష్టమైన ఈ ఇంట్లో తన శేష జీవితాన్ని గడపాల్సిందే; తన తప్పుల్ని తను ప్రతిరోజూ చూస్తూ, ప్రతిరోజూ సిగ్గుపడుతూ గడపాలి! అయ్యో! ముందుగానే తెలిసి ఉంటే ఎంత బాగుండేదో! ఇప్పుడేమీ చెయ్యలేమే!" అని కుమిలిపోయాడు.


మన ఈ శరీరాల్ని నిర్మించుకునే మేస్త్రీలం మనమే. మనదే ఈ ఇల్లు. ఇందులో ఉండాల్సిందీ మనమే. మనం మన యీ శరీరాన్ని ప్రేమ, ఆప్యాయతలతో శ్రద్ధగా నిర్మించుకుంటే, అది మనకు అనుకూలంగాను, వసతిగాను ఉంటుంది. బాగా పని చేస్తుంది. అట్లా కాక, మనం దాని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, అది పాడౌతుంది- అప్పుడు ఇక మనం బాధగా, పశ్చాత్తాపంతో బ్రతకాల్సిందే.


మన ఆరోగ్యం నిజంగా మన చేతుల్లోనే ఉంది.

పసుపులేటి నరేంద్రస్వామి - 9848696955 

కవిత ఖరీదు ఎంత...

 *కవిత ఖరీదు ఎంత...*


కవి అంటే అస్తమించని రవి అని...

కవి అంటే రవి చూడని చోట చూడగలడని అంటారే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

చప్పట్ల చప్పుడేనా...


కవి అంటే సమాజానికి మేల్కోపని

కవి అంటే మంచితనపు మెరుపని అంటారే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

ప్రశంసాపత్రం కోసం పాకులాడే స్వభావమేనా...


కవి అంటే భావ తరంగమని

కవి అంటే హృదయాన్ని కదిలించునావని అంటా‌రే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

రసశ్వాదనలేని రాగద్వేష రోగపు ఊబిలో నిండా మునుగుడేనా...



కవి అంటే చైతన్య ప్రవాహమని 

కవి అంటే కాంతి కెరటమని అంటారే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

క్షణకాలం మైకు ముందు మోగి మూగబోయే స్వరమేనా...


కవి అంటే స్వేచ్ఛ పావురమని 

కవి అంటే మనసు దోచే నెమలి నాట్యమని అంటారే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

కాపీ కుక్కల చేతిలో చించిన విస్తరేనా...


కవి అంటే కల్మషం లేని మనిషని

కవి ఆంటే కరుణాసాగర విశాల హృదయమని అంటారే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

గాలికి కొట్టుకుపోయే కాగితమేనా...


కవి అంటే హృదయం నింపే భావ అన్నపూర్ణని

కవి అంటే జీవన గమనం చూపే దిక్సూచి అని అంటారే...

ఆ కవి విలువెంత...

ఆ కవి కన్న కవిత ఖరీదెంత...

కాలే కడుపుతో.. కదిలే కన్నీటితో..

సమాజాన్ని కదిలిస్తూ కదలని కట్టై మిగిలిపోవడమేనా...


కడుపు మండే అడుగుతున్నా...

కళ్ళు చెమ‌ర్చే అడుగుతున్నా...

ఈ కుళ్ళు సమాజాన్ని... అందులోని లొసగులను...

*ఎవరు చెబుతారు సమాధానం...*

*ఎన్నో కవితలను చదివిన పాఠకులా...?*

ఎన్నో కవితలను అచ్చేసుకుని తమ పబ్బం గడుపుకున్న పాత్రికేయులా...?*

అన్ని కళలకు విలువుందాయే

కపిత్వం మధ్యన కవితే చిక్కిపాయే

కవే అన్నింటికీ... అందరికీ లోకువాయే...


ఔనులే...కవితలు కాలక్షేపపు బఠాణీలైనాయి..

ఔనులే...కాసులున్నోళ్ళు కాటికి కాళ్ళుచాసుకున్న నసుగుడును కవిత్వం అనిరి మరి...

ఇంకొందరు ప్రక్రియల పేరుతో కవితను వర్గాలుగా విభజించి వేలాడదీసిరి...


కుటిల కవుల పబ్లిసిటీ జోరీగ చప్పుడులో 

నికార్సైన కవి కనుమరుగైపోతున్నాడు...

ఆ కవిని కాపాడుకోవాల్సిన కర్తవ్యం ఎవరికి ఉందో మరి....



★★★★★★★★★★★★★★★★

శివలింగం-విశిష్టత

 శివలింగం-విశిష్టత

లింగాకారం పైన మూడు తిలకాలను దిద్దుతారు వాటి యొక్క రహస్యము.


1. మొదటిది బ్రహ్మ కి గుర్తు

2. రెండవది విష్ణువు కి గుర్తు

3. మూడవది శంకరుడు కి గుర్తు🌹


మద్యలో గంధాన్ని బిందువుగా పెడతారు, అది పరమాత్మని యొక్క స్మృతి చిహ్నమునకు గుర్తు అదే పరమాత్మని యొక్క యథార్థ స్వరూపం.


1. పరమాత్ముని నామం సదా శివ,


2. సదా శివ అంటే

సదా - ఎల్లప్పుడూ , శివ అనగా కళ్యాణకారి "🌹 మంగళకారి " మరియు "శుభకారి"


3. పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడైన చైతన్య మూర్తి ఇతనికి స్థూల సూక్ష్మ స్వరూపములు రెండూ లేవు.


4. పరమాత్మ బ్రహ్మా-విష్ణు-శంకరుల సూక్ష్మలోకాలకు పైన బ్రహ్మలోకంలో (ముక్తిధామంలో) ఉంటారు.


5. పరమాత్మ -  త్రిమూర్తి, అనగా బ్రహ్మా, విష్ణు,,🌹 శంకరులను కూడ సృష్టించినవాడు.


6. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సృష్టి స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుని ద్వారా మహావినాశనము,

ఈ ముగ్గురు చేత మూడు కర్తవ్యాలను🌹 చేయించువాడు పరమాత్మడు 


7. లింగం శబ్ధము లీనము అనగా వస్తువును తెలియపరచు చిహ్నమని మరియు లక్షణములు చూపించేది అని

అర్థము. పరమాత్మ లక్షణములు చూపించేది కావున🌹 శివలింగం అని అంటారు .


8. ఓం నమః శివాయ అంటే

ఓం - నేను ఆత్మను

నమః - నమస్కారం

శివాయ -పరమాత్మడు

ఆత్మనైనా నేను పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను అని అర్ధం.

ఇష్టం కష్టం కాదు

 ఇష్టం కష్టం కాదు


A beautiful  girl suddenly came closer to the boy and said:

_hi... I am Anushka 1st year student and you?_


The boy said (beaming with pride): 

_I have come to pay my son’s fee!_ 

(*_It is not only the mother who baths with Santoor, sometimes the father also does with the remaining soap_*)😎

*ఇష్టంతో చేసే పని, ఎంత కష్టమైనా కష్టమనిపించదు అనడానికి ఈ కథ ఉదాహరణ*


ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి రాజ్యం చేరడం  ఆలస్యం  అవడంతో  దారిలో  ఒక చీరలు  నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి  సేద తీరుతాడు  .


వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి  మర్యాదలు  చేసారు.

అలసిపోయిన  రాజు ఉదయం లేవడం  కాస్త ఆలస్యం  అవడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో  వారు ఉన్నారు .


రాజు లేవగానే చీర నేసే అతన్ని చూసాడు  .

అతడి  *చేతికి ఒక తాడు  కట్టి ఉండడం గమనించాడు* రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా  ఆ వ్యక్తి రాజు అడిగే  ప్రశ్నలన్నిటికీ సమాధానం పని చేస్తూనే  ఇవ్వడం మొదలు పెట్టాడు 


ఉయ్యాలలో బాబు నిదుర పోతున్నాడు  బాబు కదిలినప్పుడల్లా  ఈ తాడు లాగితే  బాబు నిదుర పోతాడు  అని చెప్పాడు .


అతనికి దగ్గరలో  *ఒక కట్టె కనిపించింది రాజుకి.*

 అదేందుకు  అని అడిగాడు రాజు 

బయట నా భార్య ధాన్యాలను  ఎండబెట్టి  వెళ్ళింది పక్షులేవైనా  వస్తే  ఈ కట్టె కు కట్టిన  నల్లగుడ్డ  ఊపితే  అవి వెళ్లిపోతాయి  అని బదులిచ్చాడు  ఆ వ్యక్తి .


*ఆ వ్యక్తి నడుముకి గంటలు కట్టుకుని  ఉండడం గమనించాడు రాజు* అదెందుకు అని అడిగాడు.అందుకు ఆ వ్యక్తి

 ఇంట్లో ఎలుకలు  బెడద  ఎక్కువగా ఉంది. అవి  వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్లిపోతాయి అన్నాడు 


*ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు  వ్యక్తులు  కనిపించారు రాజుకి.*

వాళ్ళు ఎవరు అని అడిగారు  ??


పని చేస్తున్నది నా చేతులే కదండి  నా నోరు ఏ పని చేయట్లేదు  అందుకు నాకు వచ్చిన  కొన్ని పాటలు  వాళ్లకు నేర్పిస్తాను  వాళ్ళు నేర్చుకుంటారు  అని చెప్పాడు .

*రాజు మళ్ళీ సందేహంగా  ఆలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోటం  ఎందుకు ఇంటి లోపలకు రావొచ్చుగా  అని అడిగారు* అందుకు ఆ వ్యక్తి 


నేర్చుకుంటున్నది నోటితోనే...  కాళ్ళు ఊరకనే  ఉంటాయి కదండి!  పాట  నేర్చుకుంటూ  వాళ్ళు కుండలు  తయారు  చేయడానికి మట్టిని  తొక్కుతుంటారు  అని బదులిచ్చాడు .


*రాజుకి  చాల ఆశ్చర్యం  వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు  చేయగలడా  అని !!*


అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు.ఇంతే కాదండి నా భార్య కాస్త చదువుకున్నది  తాను బయట పనులకు వెళ్లి వస్తుంది వెళ్లే ముందు పలకలో  ఓ పది పదాలు  రాసిపెట్టి  వెళ్తుంది. అన్ని అయ్యాక  అవి నేర్చుకుంటుంటాను  అని బదులిచ్చాడు .


*రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం  వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని.*


సోమరిగా తిరిగేస్తున్న  వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి  అనే పట్టుదల రావటానికి.


ఇష్టంగా చేస్తే కొండను  సైతం పిండిని  చేసేస్తామేమో  కదండీ???

*కష్టే ఫలి...* 🙏🏻🙏🏻



*"సేకరణ"*

పాప పుణ్యాలు

 🌸❄️  పాప పుణ్యాలు ❄️🌸


 మనం చేసే పాప పుణ్యాలు మూడు విభాగాలుగా ఉంటాయి.


ఒకటి. అతిసామాన్య పుణ్యము అతిసామాన్య పాపము.


రెండు. సామాన్య పుణ్యము. సామాన్య పాపము.


మూడు. అనన్య సామాన్య పుణ్యము. అతి ఘోర పాపము.


దైవము అతిసామాన్య పుణ్యములను, అతి సామాన్య పాపములను, కలలో అనుభవించే విధముగా చేస్తుంది.


ఉదాహరణకు మనం బిక్షాటనకు వచ్చే వానికి దానం చేయలనుకుని జేబులో చెయ్యిపెట్టుకుంటే,

మనం అనుకున్న పైకం, జేబులో సమయానికి లేకపోతుంది. మనం మనస్సులో నొచ్చుకుంటాము.


ఈలోపల మన ఎక్కవలసిన బస్సు వచ్చేస్తుంది. మనం దానం చేయకుండానే ఇంటికి వెళ్ళిపోతాము. దానం చేయాలనే భావన రావడం కూడా ఒకరకమైన పుణ్యమే. కాని దానం చేయలేదు కాబట్టి ఇది అతిసామాన్య పుణ్యఖాతాలోనికి వెళుతుందన్నమాట.


ఇలాంటి అతిసామాన్య పుణ్యాలను మనము కలలో " ఏదో పదోన్నతి పొందినట్లో" అనుభవింపచేస్తుంది. అలాగే అతిసామాన్య పాపములు.


ఇక అనన్య సామాన్య పుణ్యములను, అతి ఘోరపాపములను ఈ జన్మలోనే అనుభవించేటట్లు చేస్తుంది.


మనం ఎదో పెద్ద యాగము చేశామనుకోండి, దైవము ఆ ఫలితము ఈజన్మలోనే అనుభవింపచేస్తుంది. అలాగే అతి ఘోరపాపములు చేసేవారు కూడా ఈ జన్మలోనే దాని ఫలితము అనుభవించేటట్లు చేస్తుంది. సంఘములో అవినీతికి పాల్పడినవారిని ప్రభుత్వము, శాసనము శిక్షించడము ఈ కోవలోనికే వస్తుంది.


ఇక సామాన్య పుణ్యపాపములను దైవము ముందు జన్మలలో అనుభవింపచేస్తుంది.

ఈ సామాన్య పుణ్యఫలితము దైవం ప్రకృతి భీభస్తమములలో మీ పుణ్యఫలితమును ఉపయోగించి సృష్టిని కాపాడి మీ పుణ్యమును అనేక రెట్లు పెంచి మీకు కావలసిన సమయములో ఆ పుణ్య ఫలితమును అందిస్తుంది.


అదేవిధముగ మనము చేసే పాపములను అనుభవించటానికి వలసిన ఓర్పును నేర్పును మనకు కాలక్రమేణా అందేటట్లు చేస్తుంది.

కాబట్టి దైవలీలలను మనము ఓర్పుతో అర్ధము చేసుకుని, సహనము వహించి, దైవభక్తితో ఉండటము అలవాటు చేసుకోవాలి. దైవమును దూషించరాదు.


శ్రీ రామాయణములో రాముని పట్టాభిషేకము రేపు అనగా, రాత్రికి రాత్రి ఘట్టములు సంభవించి శ్రీరాముడు అడవులకు వెళ్ళే పరిస్థితి దాపురిస్తే, లక్ష్మణ స్వామి చలించిపోయి "అన్నయ్యా! నాకు అనుమతినిస్తే తండ్రిని ఎదిరించి, నీకు పట్టాభిషేకము చేస్తా! ఏమిటి! దైవము, దైవము అంటావు?" అని దైవదూషణకు దిగుతాడు.


 అప్పుడు శ్రీరాముడు ఎంతో ఓర్పుతో "లక్ష్మణా! దైవము నీకు కనబడితేకదా? నువ్వు దైవాన్ని ఎమైనా చేశేది?" అని వారించి లక్ష్మణస్వామిని దైవదూషణా పాపాన్నించి తప్పించి అడవులకు పయనమవుతాడు.


ఇక్కడ గమనించాల్సింది," కనపడని దైవాన్ని నిందించి ప్రయోజనము లేదు, దైవశాసనాన్ని పాలించడమే మానవకర్తవ్యం" అనే శ్రీరామవాక్యాన్ని.


కాబట్టి మనమందరం సదా మన మనస్సనే రాగి చెంబును మలినం కాకుండా భక్తి అనే చింతపండుతో ఎల్లప్పుడూ తోముతూ, నిరంతరము దైవచింతనతో ఉంటే మనస్సు నిర్మలంగా ఉండి, జీవితంలో కలిగే ఆటుపోటులకు కృంగిపోకుండా సాగిపోయేటట్లు,

చేసుకోవాలి.


 దానికి పూర్తిశరణాగతి ఒక్కటే మార్గము. భగవంతుని పాదములు మనస్సులో తలచుకుని, ఆయన పాదములు పట్టుకుని, " నేను నీ శరణాగతుడను, నీ పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను. జన్మజన్మలలో నేను చేసిన పాపములు మన్నించి, నన్నురక్షించు, తండ్రీ , మనసా,వాచా, కర్మణా, ఎటువంటి తప్పులు నాతో చేయించకుండా, నా మనసు నీ పాదపద్మములలో లగ్మమయేలా చేసి, నన్ను మంచి మార్గములో నడిపించు తండ్రి!" అని ఆర్తితో ప్రార్ధించండి.


ఆ ప్రార్ధనకు భగవంతుడు కరిగిపోయి, మీకు వెంటనే కావలిసినవన్నీ సమకూరుస్తాడు.


స్వస్తి.


🌼 🌼 🌼 🌼 🌼 🌼 🌼 🌼 🌼

భగవంతుడు అంటే ఏమిటి?

 🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹                         🙏రోజూ భగవంతునికి పూజ చేసే వారు కూడా... 

భగవంతుడు అంటే ఏమిటి? 

అంటే.....

ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు. 


కాబట్టి ఓపిక చేసుకుని... 

ఈ చిన్న కథను చదవండి. 


ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో... ముఖ్యంగా మూడు అర్దంకాని ప్రశ్నలు మెదడును తోలుస్తూ ఉన్నాయి. 

అవి... 


1.దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 

2.దేవుడు ఎక్కడ ఉంటాడు? 

3.దేవుడు ఏం చేస్తాడు? 


ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు ఎంత యోచించినా  సరైన సమాధానం దొరకలేదు.


తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై... పండితులను, 

శాస్త్రకారులను, 

మేధావులను ఆహ్వానించాడు.

తాను మూడు ప్రశ్నలు వేస్తానని, 

వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. 

సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. 

దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.


ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.

రాజాస్థానం చేరుకొన్నాడు. 

రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు.


పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు.... రాజుకో విషయం నిర్దేశం చేసాడు.

‘చెప్పేవాడు గురువు, 

వినేవాడు శిష్యుడు. 

గురువు పైన ఉండాలి, 

శిష్యుడు క్రింద ఉండాలి’ 

అని కండీషన్ పెట్టాడు . 


దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగాడు. 

పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. 


‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు పశువుల కాపరి. 


మొదటి ప్రశ్న

దేవుడు ఏ వైపు చూస్తుఉంటాడు? 

దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.


వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.


మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.

‘అన్నివైపులకు చూస్తుంది’ అని జవాబిచ్చాడు రాజు.


ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు.... పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మే.


మరి ఇక రెండవ ప్రశ్న.... 


దేవుడు ఎక్కడ ఉంటాడు? 

అన్నాడు రాజు.


‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’ అన్నాడు పశువుల కాపరి. 

పాలు తెచ్చారు.

‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’ అని అడిగాడు.


‘పాలను బాగా మరుగబెట్టాలి. 

వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. 

పెరుగు సిద్ధం అవుతుంది. 

దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’ అన్నాడు రాజు.


‘సరిగ్గా చెప్పారు మహారాజా! 

అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, 

మనస్సు అనే తోడు వేసి, 

స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును, 

సాధన అనే కవ్వంతో చిలికితే 

జ్ఞానం అనే వెన్న వస్తుంది.

ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’అన్నాడు కాపరి.

సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.


ఇక చివరి ప్రశ్న. 

దేవుడు ఏం చేస్తాడు? అని.


నేను పశువుల కాపరిని, మీరు మహారాజు.

క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు. 

పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల.

సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, 

దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.


సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. 

పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు.  


శుభం భూయాత్! 🙏


*మంచిని ఎక్కడ ఉన్నా గ్రహిద్దాము..*

*మంచిని నేర్చుకుందాము..  *

*మంచిని ఆచరించుదాము... *

*మంచిని అందరికి పంచుదాము *


🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE