SSC Lakshya
@ TELUGU
@ HINDI
@ ENGLISH
*_"వైద్యో నారాయణ చంద్ర"_*
🙏🙏🙏🙏🙏🙏🙏
*ఒకరోజు ఒక డాక్టర్.. హాస్పిటల్ డ్యూటీ నుంచి పొద్దుపోయాక ఇంటికి చేరాడు. అర్థరాత్రి సమయంలో పడకమీదికి చేరాడు. అలా పడుకుని పది నిమిషాలు కూడా కాలేదు, ఒక యువకుడు వచ్చి తలుపుతట్టాడు.*
*_"సార్, ఒక గర్భిణి ప్రసవవేదనపడుతోంది,దయచేసి రండి, ఆమెను మీరే కాపాడాలి."_ అన్నాడు. డాక్టరు వెంటనే రెడీ అయ్యి హాస్పిటల్ కి వెళ్ళాడు.*
*70 ఏళ్ళక్రిందటి రోజుల్లో మహారాష్ట్రలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన యువతి. ఆమెకి 19 లేదా 20 ఏళ్ళుంటాయంతే..! ప్రసవం చాలా కష్టమయ్యింది.*
*ఆ రాత్రి కొన్ని గంటలపాటు ఆయన వైద్యంచేశాడు. తెలవారుతుండగా, ఆమె డాక్టరు చేతులు పట్టుకొని దీనంగా ఇలా అనింది..*
*_"డాక్టరు సారూ నన్ను బ్రతికించవద్దయ్యా! నన్ను చంపేయండి. ఎందుకంటే, నేను కటిక పేదరాలిని, నా భర్త నన్ను వదిలేశారు, నాకే దిక్కులేదు. ఇప్పుడు పుట్టబోయే బిడ్డను సాకలేను."_ అంది ఏడుస్తూ...*
*ఆమె దీనస్థితికి ఆయన కదిలిపోయాడు.*
*_"అమ్మా, మేమున్నది బ్రతికించడానికే గానీ, చంపటానికి కాదు, నువ్వేం భయపడకు"_ అని ధైర్యం చెప్పాడు.*
*ఎలాగో ప్రసవం జరిగింది, ఆడపిల్ల పుట్టింది. ఆనందించాలో, బాధపడాలో ఆ యువతికి అర్థం కాలేదు.*
*అప్పుడు ఆయన.. _"అమ్మా! నువ్వేం భయపడవద్దు. నేను నీదగ్గర ఫీజు ఏమీ తీసుకోను, నేనే నీకు వంద రూపాయలిస్తున్నాను. దగ్గర్లో ఉన్న పూణేకి వెళ్ళి అక్కడ nursing college లో ఒక గుమాస్తాను కలువు. నేను పంపానని చెప్పు."_ అన్నాడు.*
*ఆమె అక్కడికి వెళ్ళింది. ఫలనా డాక్టరు గారు పంపారు అని చెప్పగానే, వాళ్ళు ఆమెను అక్కడ చేర్చుకుని training ఇప్పించి, 8 నెలల తరువాత ఉద్యోగం కూడా ఇచ్చారు.*
*25 ఏళ్ళు గడచిపోయాయి. ఆ డాక్టరు senior professor అయ్యాడు. ఒక university వాళ్ళు విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేసే కార్యక్రమానికి ఆ డాక్టరు గారిని ఆహ్వానించారు. అది పూర్తి అయ్యింది.*
*'చంద్రా' అనే ఒక యువతి వచ్చి డాక్టరును కలిసి తన ఇంటికి రావాల్సిందేనని పట్టుబట్టింది. స్వతహాగా సున్నితమైన మనసున్న ఆయన కాదనలేక వాళ్ళింటికి వెళ్ళాడు.*
*అక్కడ నడివయసులో ఉన్న ఒకామె.. డాక్టరు గారికి 'టీ' ఇచ్చింది... ఆయన టీ తాగుతూ వారి గురించి అడిగాడు.. ఆమె, తమది ఒక పల్లెటూరు అని.. తమ కుటుంబానికి సంబంధిన వివరాలు చెపుతుండగా, ఆయన ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి.*
*ఇంతలో హఠాత్తుగా ఆమె, మరియు ఆ యువతి వంగి ఆ డాక్టరు కాళ్ళకు నమస్కారం చేశారు. _"ఏమిటమ్మా ఇది ?"_ అని ఆయన అడిగితే...*
*ఆమె కన్నీళ్ళు కారుతుండగా.. ఆయనతో ఇలా చెప్పింది, _"25 ఏళ్ళక్రితం ఓ అర్థరాత్రి మీరే నన్ను కాపాడారు సార్, దిక్కు లేని నా పేదజీవితానికి ఒక దారి చూపారు. ఆ అర్థరాత్రి పుట్టిన ఆడపిల్లే ఈ అమ్మాయి, మీరే మాకు దేవుడు. మీ పేరునే ఈ పాపకు పెట్టాను 'చంద్ర' అని చెప్పి, అంతేకాదు సార్.. మీదయవల్ల ఇప్పుడు మేము ఆర్థికంగా స్థిరపడ్డాము. త్వరలో మేము పేదలకోసమని ఓ ఉచిత ఆసుపత్రిని ప్రారంభించబోతున్నాం. దానికి కూడా మీ పేరునే పెడుతున్నాం."_ అని చెప్పింది, అది విన్నాక, ఈ సారి కన్నీరు పెట్టడం ఆ డాక్టరు వంతు అయ్యింది.*
*ఇంతకూ ఆ డాక్టరు ఎవరో తెలుసా...? Infosys అనే సాఫ్ట్ వేర్ కంపెనీ ఛైర్మెన్ శ్రీమతి సుధామూర్తి గారి తండ్రి అయిన _"డాక్టర్. రామచంద్ర కులకర్ణి"_ గారే...!!!*
*(ఈ సుధామూర్తి.. Infosys అనే సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యవస్థాపకుడైన.. ఎన్. ఆర్. నారాయణమూర్తి గారి సతీమణి. వీరి పెద్ద కుమార్తె.. 'అక్షతామూర్తి.' ఈమె ఎవరోకాదు, 2022 నుంచి 2024 వరకు బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేసిన రిషిసునాక్ భార్య.)*
==================
*_{మంచి స్ఫూర్తిదాయకమైన వాస్తవగాథ.. నన్ను చాలా కదిలించింది. ఎంతెంత చదువులు చదివామన్నది కాదు, ఎంత సంస్కారవంతంగా, సాటి మనుషుల పట్ల.. సమాజం పట్ల మానవతా దృక్పథంతో ఉంటూ మనవంతుగా ఎంతో కొంతైనా సేవాతత్పరత చూపించాలి.: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
👉👉విజయవాడలో ఓ హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు మరణించడంతో నెల్లూరు జిల్లాకు చెందిన 19 సంవత్సరాల యువతి మానసిక వేదనతో బాధపడుతున్న ఆ యువతి, ఒంటరిగా నెల్లూరు నుంచి బస్సులో ప్రయాణించి విజయవాడ బస్టాండ్‌కు వచ్చింది
👉 దారి మధ్యలో ఆమె ఫోన్, పర్సు పోగొట్టుకోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఆకలితో, ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఎవరూ లేని బాధతో ఆమె సమీపంలో ఉన్న ఆటో డ్రైవర్ల వద్దకు వెళ్లి సహాయం కోరింది.
👉నాకు ఎవరు లేరు… కొంచెం టిఫిన్ పెట్టండి… పని చేసుకుంటూ నేనే హాస్టల్‌లో ఉంటాను… దయచేసి నన్ను అక్కడికి చేర్చండి" అని ఆ యువతి కన్నీళ్లు పెట్టుకుంది.
👉యువతి పరిస్థితి చూసి ఆటో డ్రైవర్లు ముందుగా ఆమెకు టిఫిన్ ఏర్పాటు చేశారు. తరువాత విషయాన్ని అర్థం చేసుకున్న వారు తెలివిగా ఆలోచించి ఆ యువతిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
👉అక్కడ పోలీసులు ఆమె మాటలు విన్న వెంటనే విషయం సీఐ గారికి పోలీస్ సిబ్బంది తెలియజేశారు. సీఐ గారు తక్షణమే స్పందించి వాసవ్య మహిళా మండలికి ఫోన్ చేసి, ఆ యువతి పూర్తిగా సురక్షితంగా ఉండేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
👉ఆమె బంధువులు వచ్చే వరకు ఆమెను వాసవ్య సంరక్షణలో ఉంచి, అన్ని విధాలుగా సహాయం అందించాలని పోలీసుల సూచన మేరకు చర్యలు వేగంగా తీసుకున్నారు.
👉కాలుష్యంతో నిండిన ఈ కాలంలో ఇలాంటి మానవత్వం చూపిన ఆటో డ్రైవర్లపై, అలాగే వెంటనే స్పందించి రక్షణ కల్పించిన కృష్ణలంక పోలీసులపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మానవత్వం చూపిన ఆటో డ్రైవర్ అందరమూ మేచుకోక తప్పదు
అప్పటి కాలం.... ఇప్పటి వేగం.....
1980 - 90లలో జీవనం ఎలా వుండేది?
తెలియాలంటే మాత్రం తప్పని సరిగా చదవాలి మరి.
డబ్బుకు ప్రాధాన్యం ఇప్పటి తో పోల్చితే, అపుడు బాగా తక్కువ.
2000 కు ముందు వరుసగా 3, 4 ఏళ్లు కరువు వచ్చినా, బియ్యం, తదితర నిత్యావసరాల ధరలు పెరగలేదు.
విశాలమయిన ఇళ్ళు. అపార్ట్మెంట్స్ దాదాపుగా లేవు.
రోజూ ఇంటికి భిక్షానికి వచ్చి, పెట్టిన అన్నం, కూరా సంతోషంగా తీసుకుని వెళ్ళే వారు.
సంక్రాంతి వస్తుందంటే, పోటీలు పడి అమ్మాయిలు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులేశే వారు.
కేటరింగ్లు లేవు. ఏ శుభకార్యం జరిగినా, బంధువులు పది రోజులు ఉండి, తలా చెయ్యి వేసి, వంటల నుంచీ బట్టలు ఉతికే వరకు అన్నీ చేసే వారు.
పిల్లలకు స్వీట్స్, కారప్పూస అన్నీ ఇంటిలోనే తయారు చేసి, అత్తయ్యలు తెచ్చేవారు.
ఎందరో పిల్లలు బంధువుల ఇళ్ళల్లో ఉంటూ చదువుకునే వారు.
బంధువులు వస్తే రెండు మూడు వారాలు ఉండి వెళ్ళే వారు. వాళ్ళు వెళ్లి పోతుంటే పిల్లలు, వెంటపడి అపుడే వెళ్ళవద్దు అని ఏడిచేవారు. ఇపుడు బంధువులు వస్తున్నారంటే ఏడుస్తున్నారు.
ఎంత దూరమైనా ఊళ్ళో నడిచి లేక సైకిల్ పైనే వెళ్లే వాళ్ళం. ఇపుడు ఇంటి పక్క షాప్ కైనా, బండి తీయాల్సిందే.
సైకిల్ కు హెడ్ లైట్ లేక పొతే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసే వారు. సైకిళ్లకు లైసెన్స్ లు కూడా ఉండేవట.
రిక్షా వాడు బాడుగకు పావలా తక్కువకు బేరమాడితే, ఇంకో పది పైసలు ఇప్పించండి బాబు అని బతిమాలే వాడు. ఇపుడు ఆటో వాడు, చెప్పిన రేట్ కు తక్కువ అడిగాం అనుకో, పడ తిట్టి పోకుండా ఉంటే మన అదృష్టం.
స్కూటర్, లునా, మోఫా ఉండేవి. స్కూటర్ అంటే బజాజ్ చేతక్. బుకింగ్ చేస్కుంటే, 1– 2 years తరువాత వచ్చేది.
ట్రైన్ రావడానికి కొంత ముందు స్టేషన్ కు వెళ్లి, రిజర్వేషన్ అప్పటికి అపుడే చేయించుకునే వారు, దొరుకుతుందో లేదో అని ఆందోళన లేకుండా!
సాయంత్రం ట్రైన్ లో వెళ్తుంటే, స్టేషన్ ల మధ్య గూళ్లకు చేరుకుంటున్న వేల కొద్దీ పక్షుల సందడి కనబడేది, వినబడేది. ఇపుడు ఏమీ లేదు. నిశ్శబ్ధం.
ట్రైన్, బస్ ల లో మనుషులు మాట కలిపి, తెలియని వారయినా కష్ట సుఖాలు చెప్పుకునే వారు. ఇపుడు తెలియని వారితో మాట్లాడితే, ప్రమాదమే!
కుటుంబంకి ఫ్యామిలీ డాక్టర్ ఉండే వారు. ఇన్ని కొత్త రోగాలు, స్పెషలిస్ట్ లు లేరు.
టెన్త్ లో 60% ఫస్ట్ క్లాస్ వచ్చినదంటే చాల గొప్ప.
ఇంటిలో నాయనమ్మ, తాతయ్యలు తప్పక ఉండే వారు.
కూల్ డ్రింక్ అంటే Gold Spot యే!
ప్రతి వేసవి సెలవులు తప్పక అమ్మమ్మ, తాతయ్య ల ఇంటికే. మధ్యాహ్నం చెట్లు ఎక్కడం, కాయలు కోయడం తప్పనిసరి.
నీళ్లు ఎక్కడ ఏ pump క్రిందనైనా త్రాగేసే వారు. వాటర్ ఫిల్టర్ లు లేవు.
వేసవిలో రోజూ సాయంత్రం 7 కు కరెంట్ పోయేది. కిరోసిన్ తో పని చేసే లాంతర్లు, ముగ్గు తో తోమి సిధ్ధం చేసే వారు.
గ్రామాల్లో ఎద్దుల బండ్లు పై సరదా సవారీ.
కోడి కూత తో నే నిద్ర లేవటం. అలారం లు లేవు.
అందరి ఇళ్ళలో నీటి బావులు, వేడి నీటికి బాయిలర్ లు లేక బొగ్గుల కుంపటి ఉండేవి.
ఏడు పెంకులాట, గిల్లీ దండా, దాగుడు మూతలు, గాలి పటాలు, గోళీకాయల ఆటలు, గల్లీ క్రికెట్, కోతి కొమ్మచ్చి, సైకిల్ పందేలు, ఇవే మన ఆటలు.
ఉత్తరాలు కార్డ్, ఇన్లాండ్ లెటర్స్ ప్రధాన సమాచార వారధి. అపుడపుడు ట్రంక్ కాల్ . Telegram వచ్చింది అంటే దడే…అర్ధరాత్రి అయినా వచ్చి తలుపు కొట్టి ఇచ్చే వారు.
Telephone, fridge, TV లు ఉన్నవారు గొప్ప ధనవంతుల కిందే లెక్క.
బంగారం 10 గ్రాములు సుమారు 4000, సాగర్ నగర్ లో MIG flat సుమారు 80,000. షేర్స్ 1992 జనవరి లో సెన్సెక్స్ 1001.
కాలేజీల్లో చదివే పిల్లలకు డబ్బులు పంపాలంటే, money ఆర్డర్ యే గతి. అది తెచ్చిన పోస్ట్ మాన్ కు 2 రూపాయలు బహుమానం!
ఇంటికి పిల్లలు ఉత్తరం రాసి పంపిస్తే, దానిని పోస్ట్ మాన్ యే చదివి, వారికి వినిపించే వారు.
సినిమాకు వెళ్ళడమే గొప్ప ఆటవిడుపు. సినిమా ప్రచారం గూడు రిక్షా, పాంఫ్లెట్లు, పోస్టర్లు.
ప్రసాద్ పెన్, అశోక్ పెన్, హీరో ఫౌంటైన్ పెన్ లు చాలా పేరు గాంచినవి. Reynolds ball పాయింట్ పెన్ అంటే క్రేజ్!
స్కూళ్లకు పిల్లల కోసం గూళ్ళ రిక్షాలు ఉండేవి. 5,6 తరగతులు కు వచ్చారంటే పిల్లలే నడిచి స్కూల్ కి వెళ్లి పోయేవారు. పికప్ డ్రాప్ లు లేవు.
దీపావళి కు పది నుంచి నెల రోజుల ముందే టపాసులు పేలుతుండేవి. తారాజువ్వలు, సిసిండ్రీలు పిల్లలే తయారు చేసుకునే వారు.
గుడులలో హరికథా కాలక్షేపం సర్వ సాధారణం.
Theater కు వెళ్తే, నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ టికెట్లు. Theater లోపల సిగరెట్లు బీడీలు కాల్చుతు సినిమాలు చూసే వారు. అలానే ట్రైన్స్, హోటల్స్, బస్ ల లో కూడా యధేచ్చగా…
సినిమా పాటలకు లిరిక్స్ పుస్తకాలు పావలకు అమ్మేవారు.
పౌరాణిక, కుటుంబ, సామాజిక, భక్తిరస చిత్రాలదే రాజ్యం.
పెద్దలకు వార్తా పత్రిక లు ఈనాడు, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ, ఉదయం, వార్త, ప్రజా శక్తి. పిల్లలకు: చందమామ, బొమ్మరిల్లు, బాల జ్యోతి. గృహిణులకు: ఆంధ్ర భూమి, స్వాతి వారపత్రిక లు. యువకులకు: యువ, స్వాతి మాస పత్రికలు. పెద్దవారికి Readers Digest. ప్రభుత్వ ఉద్యోగార్థులకు Employment News Weekly.ఇలా!
వార్తలంటే రేడియో, సినిమా పాటలంటే శుక్రవారం సాయంత్రం 7 గంటలకు, అరగంట చిత్ర లహరి .సినిమా అంటే నెల కో, రెండు నెలలకో DD National లో వచ్చే తెలుగు సినిమా వచ్చేది.
దసరా, సంక్రాంతి పండక్కి ఫ్రెండ్స్ తో కలసి సరికొత్త సినిమాలు చూడటం అదోక గమ్మత్తైన సరదా.
ఎవరైన ఫ్రెండ్స్ తను చూడని సినిమా చూసివుంటే వారితొ ఆ సినీమా కథ అడిగి మరీ చెప్పించు కోవడం మహా సరదా.
👆ఇలా గమ్మత్తైన విషయాలు ఎన్నో, ఎన్నేనో..అప్పటి రోజులు గడిపిన వారికి మరుపురాని మధురానుభూతులు.ఆ పాత మధురాలు...తిరిగి రాని అమృత్సోవాలు.
కాదంటారా ఫ్రెండ్స్!అవునంటారని నా భావన.
సమయం పెట్టి చదివిన మీకు అభినందనలతో..
ఇంకా ఏమైనా మరచిపోయి ఉంటే నాకు మెసేజ్ చేయండి.
పసుపులేటి నరేంద్రస్వామి - 9848696955
నెలలో కేవలం 28 రోజులు మాత్రమే
*హైద్రాబాద్లో ఓ మహిళ తన పాత పూర్వీకుల ఇంటిని PG గా మార్చింది. ఆ ఇంట్లో 10-12 గదులు ఉన్నాయి, ఒక్కో గదిలో 3 బెడ్లు ఉంటాయి. చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు అక్కడ ఉంటున్నారు*
ఆమె వాళ్లు టిఫిన్, రాత్రి భోజనం, అవసరమైనవారికి ప్యాక్డ్ లంచ్ కూడా ఇస్తారు. భోజనం ఎంతో రుచిగా ఉండటం వల్ల అందరికీ ఇష్టం.
కానీ అక్కడ ఓ ప్రత్యేకమైన నిబంధన ఉంది – నెలలో కేవలం 28 రోజులు మాత్రమే వంట చేస్తారు. మిగతా 2-3 రోజులు అందరూ బయట తినాలి. ఆ రోజుల్లో కిచెన్ కూడా మూసివేస్తారు.
ఒకసారి ఆమెని అడిగాను – “ఇలాంటీ రూల్ ఎందుకు పెట్టారు?”
ఆమె నవ్వుతూ ఇలా అన్నది: “మేము కేవలం 28 రోజులకే ఫుడ్ ఛార్జ్ చేస్తాం. అందుకే వంట కూడా 28 రోజులు మాత్రమే.”
మళ్లీ అడిగాను – “ఇలా ఎందుకు చేస్తారు?”
ఆమె అప్పుడు గట్టిగా చెప్పింది: “మొదట్లో ప్రేమతో వండేదాన్ని. కానీ ఎప్పుడూ ఫిర్యాదులే – ఒక్కోసారి ఉప్పు ఎక్కువ, ఇంకోసారి తక్కువ. ఎప్పుడూ అసంతృప్తి. అప్పుడు కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నాను.
ఈ 2-3 రోజుల్లో వాళ్లు బయట తినాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ వంట భోజనం విలువ అర్థమవుతుంది. తర్వాత మిగిలిన రోజుల్లో ఎలాంటి ఫిర్యాదులూ ఉండవు.
ఎక్కువ సౌకర్యం మనిషిని అసంతృప్తిగా, అలసుగా మారుస్తుంది.
మన దేశంలో కూడా కొంతమంది ఇలా ఉంటారు – ఎప్పుడూ లోపాలే చూస్తారు. అటువంటి వాళ్లు ఓసారి పాకిస్థాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల్లో కొద్దిరోజులు గడిపితే మన దేశం విలువ తెలుస్తుంది.
*ఒక సాధారణ మహిళ చెప్పిన గొప్ప జీవన సత్యమిది*
😌
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఇది ఒక భార్య తన భర్త అకాల మరణం తరువాత రాసిన భావోద్వేగభరితమైన, భావప్రధమైన మరియు జీవితాన్ని నేర్పే ఉత్తరం. దయచేసి దీన్ని పూర్తిగా చదవండి మరియు అవసరమైనవారికి షేర్ చేయండి.
ఒక భార్య రాసిన ఉత్తరం –
భర్త యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత
(నిజమైన సంఘటన ఆధారంగా)
"నా భర్త మరణించిన తర్వాత నేర్చుకున్న పాఠాలు"
మనం ఎప్పుడూ అనుకుంటుంటాం – మేము ఎప్పటికీ బతుకుతాము.
చెడు సంఘటనలు ఎప్పుడూ ఇతరులకే జరుగుతాయి అనుకుంటాం.
కాని అదే విషాదం మన మీదకు వచ్చినప్పుడు, జీవితం ఎంత అస్థిరంగా ఉందో అప్పుడు మాత్రమే తెలుస్తుంది.
నా భర్త ఒక ఐటీ ప్రొఫెషనల్ – టెక్నికల్ పనుల్లో చాలా శ్రద్ధ.
నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్.
మీరు ఊహించవచ్చు – పర్ఫెక్ట్ కపుల్ అనిపించేవాళ్లం.
నా భర్త టెక్నికల్ కావడంతో తన జీవితం అంతా ల్యాప్‌టాప్‌లోనే ఉండేది –
తన “to-do list”, ఇ-బిల్లులు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇమ్పార్టెంట్ పాస్‌వర్డ్స్ కోసం "IMPWDS" అనే ఫోల్డర్ కూడా ఉండేది.
ల్యాప్‌టాప్‌కే పాస్‌వర్డ్ ఉండేది.
అన్నీ ఆల్ఫాన్యూమరిక్ మరియు స్పెషల్ క్యారెక్టర్స్ తో ఉండే పాస్‌వర్డ్లు – కనుక గెస్ చేయడం అసాధ్యం.
ఆఫీస్ పాలసీ ప్రకారం ప్రతి 30 రోజులకు పాస్‌వర్డ్ మార్చాలి.
ప్రతి సారి నేనడిగేవాడిని – "ఈ సారి పాస్‌వర్డ్ ఏమిటి?" – కానీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసేదాన్ని కాదు.
మీకు అనిపించవచ్చు – నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి అన్ని విషయాలు సక్రమంగా డాక్యుమెంటెడ్‌గా ఉంటాయని.
కానీ నమ్మండి – ఆఫీస్ పేపర్లలో ఎంత క్రమంగా ఉన్నా, హౌస్‌హోల్డ్ విషయాల్లో అంతే నిర్లక్ష్యం చేస్తాము.
ఇంటి పనులు ఎప్పుడూ రేపటికి వాయిదా వేస్తూ ఉంటాము.
ఒక రోజు నా భర్త ఆఫీసు నుంచి తిరిగి వస్తూ రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అతని వయస్సు కేవలం 33 ఏళ్ళు.
ల్యాప్‌టాప్ క్రాష్ అయిపోయింది – అందులోని సమాచారం అంతా పోయింది.
ఫోన్ పూర్తిగా ధ్వంసమైంది.
కాని ఇది కేవలం ఆరంభం మాత్రమే…
9 ఏళ్ల పెళ్లి జీవితం – పిల్లలు లేరు – మేమిద్దరం మాత్రమే. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను.
నా ప్రొఫెషనల్ నాలెడ్జ్ కొంతవరకు ఉపయోగపడింది – కాని పూర్తిగా కాదు.
ఆయన బ్యాంక్ అకౌంట్స్‌లో నామినేషన్ లేదు.
ఇన్సూరెన్స్‌లో నామినీ ఆయన తల్లి – ఆమె రెండు సంవత్సరాల క్రితమే మరణించారు.
ఇమెయిల్ పాస్‌వర్డ్ నాకు తెలియదు.
ఏ బిల్లులు స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్‌తో పేమెంట్ అవుతున్నాయో కూడా తెలియదు.
ఆఫీస్ సంబంధిత పనులు మరింత క్లిష్టంగా మారాయి —
ఇటీవలే ఆయన విభాగం మారింది, ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారో కూడా నాకు తెలియదు.
ఫోన్ అలవెన్స్ క్లెయిమ్ చివరిసారి ఎప్పుడు చేసారో కూడా తెలుసుకోవడమే ఓ టాస్క్ అయింది.
ఇఎంఐ మీద కొనుకున్న ఇల్లు ఇప్పుడు భారంగా మారింది.
ఇన్సూరెన్స్ తీసుకోకుండా, అదే డబ్బుతో ప్రీపేమెంట్ చేద్దాం అనుకున్నాం —
ఒకరు సంపాదన ఆపితే ఏమవుతుందో అప్పుడే తెలిసింది!
ఇప్పుడు ప్రతిదీ ఓ ప్రశ్న —
డెత్ సర్టిఫికెట్, ఎఫ్ఐఆర్, పోస్ట్‌మార్టం రిపోర్ట్ —
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఫారాలు, ఇండెమ్నిటీ బాండ్, నోటరీ, సాక్షులు, ఒప్పంద పత్రాలు…
బైక్, కారు, భూమి, ఇల్లు — ఇవన్నీ వేర్వేరు ఆస్తులు అని అప్పుడు తెలిసింది.
బైక్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే లీగల్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
సక్సెషన్ సర్టిఫికెట్ పొందడం వేరే సమస్య.
తర్వాత మొదలైంది పేరు మార్పు ప్రక్రియ — గ్యాస్ కనెక్షన్, కరెంట్ మీటర్, ఇల్లు, వాహనం, ఇన్వెస్ట్‌మెంట్లు, నామినేషన్…
నేను పూర్తిగా చిదురుముడిగా అయ్యాను.
విలాపించేందుకు కూడా సమయం లేకపోయింది —
పత్రాల కోసం జరుగుతున్న పోరాటమే జీవితాన్ని మింగేసింది.
జీవితం అంటే ఎంత తేలికగా తీసుకున్నానో అప్పుడు అర్థమైంది.
“నేను ఒక CA అయినా ఇన్ని కష్టాలు పడుతున్నానంటే, ఓ సాధారణ గృహిణి పరిస్థితి ఏమవుతుందో!” అనిపించింది.
అప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పారు –
“ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు. నీ పేర మీద విల్ లేకపోతే, ఇతర బంధువులకూ ఆస్తులపై హక్కు ఉంటుంది...”
అప్పుడు తెలిసింది – విల్ (ఇచ్చాపత్రిక) ఎంత ముఖ్యమో!
కొన్ని నెలల క్రితం ఎవరో ఇలా చెప్పేవాళ్లు అంటే నవ్వేదాన్ని.
కాని ఇప్పుడు జీవితం పూర్తిగా మలుపు తిరిగింది.
జీవితం నన్ను నేర్పిన పాఠాలు మీతో పంచుకుంటున్నాను
ఎందుకంటే మన తర్వాత మన కుటుంబానికి తలనొప్పులు కాకుండా చేయడం మన బాధ్యత.
1. నామినేషన్‌లు చెక్ చేయండి
• బ్యాంక్ ఖాతాలు
• ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు, ఎన్ఎస్‌సీలు
• లాకర్‌లు
• డీమాట్ అకౌంట్‌లు
• లైఫ్/వాహన/ఆస్తి ఇన్సూరెన్స్
• ఇన్వెస్ట్‌మెంట్లు
• పీఎఫ్ మరియు పెన్షన్ ఫారాలు
పాత నామినేషన్‌లను మార్చడం మర్చిపోతాం — తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి, వారు అప్పటికే చనిపోయినపుడు కూడా.
2. పాస్‌వర్డ్లు
ప్రతి విషయానికీ పాస్‌వర్డ్ అవసరం –
ఇమెయిల్, బ్యాంకింగ్, ల్యాప్‌టాప్...
మీరు లేరు అంటే, మీ సిస్టమ్ యాక్సెస్ చేయడం ఎవరి వల్ల అవుతుంది?
పాస్‌వర్డ్లు ఎక్కడైనా సురక్షితంగా రాసి ఉంచండి.
3. ఇన్వెస్ట్‌మెంట్లు
ప్రతి సంవత్సరం ట్యాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్ చేస్తాం —
మీ వద్ద వాటి లిస్ట్ ఉందా?
అది కూడా ఎవరూ యాక్సెస్ చేయలేని ల్యాప్‌టాప్‌లోనే ఉందా?
4. విల్
ఒక సాదా విల్ కూడా కుటుంబానికి పెద్ద సాయంగా ఉంటుంది.
ఇండెమ్నిటీ బాండ్, నోటరీ, ఎన్‌ఓసీ, సాక్షులు — ఇవన్నీ నుంచి విముక్తి.
5. లోన్లు మరియు బాధ్యతలు
కారు లేదా ఇల్లు కొనే సమయంలో ఇలా ఆలోచించండి –
“నేను లేకపోతే, నా కుటుంబం ఈ లోన్‌ని భరిస్తుందా?”
కావడం కుదరకపోతే, లోన్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి.
6. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించండి
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్లు మొదలైన అన్నింటికీ ఆన్‌లైన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
వాటిని వినియోగించి సమయం మరియు శక్తిని ఆదా చేయండి.
నా పోరాటం ఇప్పుడే మొదలైంది.
కాని మనమందరం ఈ చిన్న విషయాలను నేర్చుకుంటే, మన ప్రేమించినవారు మనం లేని తర్వాత తక్కువ బాధపడతారు.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు —
కాని స్కౌట్స్ మోటో చెబుతుంది:
"ఎప్పుడూ సిద్ధంగా ఉండండి!"
దయచేసి ఈ లేఖను 3 సార్లు చదవండి.
ఎంతోమందికి పంపండి.
సినిమాలు, టీవీలు చూస్తూ గంటలుగా గడుపుతాం —
కాని మన కుటుంబ భద్రత కోసం 15 నిమిషాలు కేటాయించలేమా?
*ఇల్లు నడపడం అనేది కేవలం వంట చేయడం, శుభ్రపరిచే పని మాత్రమే కాదు*—
*ఆర్థిక విషయాలు, నిర్ణయాలను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమైన పని.*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
డాక్టర్ మినిస్టర్
మంచి పేరు ఉన్న ఓ మంత్రి వర్యులు గారికి హఠాత్తు గా గుండె నొప్పి వచ్చింది, ఆపరేషన్ కోసం అమెరికా కు తీసుకెళ్లారు...!
ఆసుపత్రిలో డాక్టర్లు మంత్రి గారికి విజయవంతం గా శస్త్రచికిత్స చేసారు,
మంత్రి గారు కోలుకున్నాక డాక్టర్ గారు వచ్చి మంత్రి గారిని పలకరించారు..!
ఎలా ఉన్నారు మంత్రి గారు? ఇప్పుడేం ఛాతీ లో నోప్పి లాంటిది ఏం లేదుకదా?
అందుకు మంత్రి గారు "భలే వారే డాక్టర్ గారు, అమెరికా లో అందులో తమంతటి వారు స్వయానా ఆపరేషన్ చేసాక ఇంకెందుకు వస్తుందండి ఆ నొప్పి..
అదే మా ఇండియా లో ఐతే ఈపాటికి టపా కట్టేసే వాన్ని, ఎంతైనా అమెరికా, అమెరికానేనండి మా ఇండియా లో గుండెకు ఆపరేషన్ అంటే లివర్ కు చేసేవారు, అమెరికా కాబట్టి బతికి బ ట్ట కట్టగలిగాను, మా ఇండియా డాక్టర్ లు శుద్ధ వేస్ట్ అండీ..అంటూ ఇంకా ఏదో చెప్పబోయారు....!
ఇక చాలు ఆపండి మీ సోది, అంటూ డాక్టర్ గారు విసురు గా లేచారు, ఆయన కళ్ళు చింతనిప్పుల వలె ఎర్రబడ్డాయి.
ఆపరేషన్ అయ్యింది కదా, దయచేసి ఇక వెళ్ళి పోండి, ఇంకోక్క మాట మీరు ఇండియా గురించి చెడుగా మాట్లాడితే సహించేది లేదు అని మంత్రి గారి మెుహం కూడా చూడకుండా వెళ్ళి పోయారు..
బిక్కచచ్చిన మెుహంతో మంత్రి గారు ప్రక్కనున్న అసిస్టెంట్ డాక్టర్ గారితో ఎవరు ఈయన ?ఎందుకలా నా మీద సీరియస్ అయ్యారు? అని అడిగారు
అందుకు ఆ అసిస్టెంట్ డాక్టర్ మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ విల్సన్ గారు ఆయనే.. ఆయన డాక్టర్ కోర్సు మీ ఇండియా లోనే చేసారు అని చెప్పాడు..
మంత్రి గారికి డాక్టర్ గారు ఎందుకలా మండి పడ్డాడో అర్ధమైంది..
డిస్చార్జ్ అవబోతూ ఆ డాక్టర్ గారితో నన్ను క్షమించండి డాక్టర్ గారు, ఏదో మాట తూలాను, మనసులో పెట్టుకోబాకండి అన్నారు,
అందుకు డాక్టర్ విల్సన్ గారు ఛ. ఛ. అలాంటిదేమి లేదండి..
ఇండియా గురించి తక్కువ చేసి ఓ ఇండియనే అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాను, నేను ఇండియా లోనే డాక్టర్ కోర్సు పూర్తి చేసాను, నాకంటే మేధావులు మీ ఇండియా లో సరైన ప్రోత్సాహం, గుర్తింపు లేక మరుగున పడుతున్నారు, మీ రాజకీయాలు, డబ్బు , కుల వివక్షలతో కోంతమంది మేధావులు అక్కడ ఇమడ లేక ఇలా విదేశాలకు వలస వస్తున్నారు, వారి మేధాశక్తి కి ఇక్కడి వారు నెత్తిన పెట్టుకున్నారు, అంత ఎందుకండీ ఇప్పుడు మీకు ఆపరేషన్ చేసిన ఈ హాస్పిటల్ చీఫ్ మీ భారతీయుడే తెలుసా?
ప్రజల సొమ్ము తో ఆపరేషన్ చేయుంచుకునేందుకు వచ్చిన మీరు ఆ ప్రజలనే తిడుతుంటే చూస్తూ ఉండలేక పోయాను, ఇకపోతే మీకు జరిగిన ఆపరేషన్ ను మీ ఇండియా లో డాక్టర్ కోర్స్ చదివే ఓ పీ జీ స్టూడెంట్ చూయింగ్ గమ్ నమిలినంత ఈజీగా చేయగలడు, కానీ మీరు చేయించుకోరు, ఎందుకంటే వారు డాక్టర్ కోర్స్ చదివారో, లేదో? లేక మీరు వేలంపాట పెట్టి అమ్మిన డాక్టర్ సీటును డబ్బు పెట్టి కోన్నవాడేమో అని మీ డౌట్?!
అందుకే ప్రతిభకే పట్టం కట్టే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతున్నారు మీ భారతీయులు,
కష్టం మీ వాళ్ళది, పేరు మాత్రం మా దేశాలది,
.
నేడుఅభివృద్ధి చెందిన పెద్ద, పెద్ద దేశాలు కానీయండి, కంపెనీలు కానీయండి వారి అభివృద్ధి వెనక ఖచ్చితంగా మీ భారతీయుల కృషి ఉందనేది ముమ్మాటికీ నిజం.. మీరు వాడుకోలేరు, మేము వాడుకుంటున్నాం..టాపర్స్ అంతా మాదగ్గర ఉన్నారు, మిగిలిన వారు మాత్రం మీ దగ్గర ఉన్నారు....
తన దేశాన్ని తప్పు పట్టిన వాడు రేపు తన కన్న తల్లిని కూడ తప్పు పడతాడు..
మీకు ఇంతకంటే నేను చెప్పలేను..
సెలవ్.. గెట్ వెల్ సూన్..
మంత్రి గారికి నోరు పెగల్లేదు..
డాక్టర్ గారు అన్న చివరి మాటలు
"Get well soon" అన్నది
తన శరీరానికా? తన మనసు కా?
*🧘🏻♂️SKY Life Foundation*
*365 Learning*
*పెద్ధలకు పాదాభివందనం చేయటము వలన ప్రయోజనం ఏమిటి ?*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
*శుభకార్యాలలో పెద్దల, ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు.*
*కేవలం శుభకార్యాల లోనే కాక పెద్దవారు, కనిపించనప్పుడు, కూడా వారి పాదాలను, తాకుతారు చిన్నవారు.*
*అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి?*
*భారతీయ సంప్రదాయంలో, పెద్దవారి పాదాలను, తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న, పురాతనపద్దతి. అయితే, కొందరు అడుగులను అపరిశుభ్రంగా భావిస్తారు.*
*పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత, ప్రయోజనాలు, అర్ధవంతమైన సూచనలున్నాయి.*
*పెద్దవారి పాదాలను తాకాలంటే మన అహంకారం వదిలి తల వంచాలి. అది పెద్దవారి వయసు, జ్ఞానం, విజయాలు, అనుభవాలను గౌరవించడంతో సమానం.*
*సాధారణంగా పెద్దవారి, పాదాలు తాకినప్పుడు, వారి,ఆలోచనలు, స్పందనలు వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా ఉంటం వల్ల చిన్నవారికి లాభం చేకూరుతాయి.*
*పెద్దవారి పాదాలను తాకడానికి నడుము వంచి కుడిచేతిని వారి, ఎడమ కాలిమీద పెట్టాలి. అలాగే ఎడమచేతిని వారి, కుడి కాలి మీద ఉంచాలి. అప్పుడు పెద్దవారి చేతులు, మన మీదఉంటాయి. ఇలా, చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది. ఆ సమయంలో వారి, శక్తి, జ్ఞానం మనకు బదిలీ అవ్వుతాయి.*
*ఫలితంగా మంచి మనసుతో వారిచ్చే దీవెనలు ఫలిస్తాయి.*
*పెద్దవారు ఈ భూమి మీద, నడిచి ఎంతో జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించడం, వల్ల వారి పాద ధూళిలో, కూడా, ఎంతో జ్ఞానం దాగి, ఉంటుంది. ‘మేము కూడా, మీ మార్గంలో నడిచి అనుభవాన్ని,జ్ఞానాన్ని, సంపాదించడానికి, ఆశీర్వదించండి అని, చెప్పే సంప్రదాయానికి, ప్రతీకగా వారి పాదాలను, తాకుతాము.*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
*టీనేజ్ హోమ్స్*
ఓల్డేజ్ హోమ్స్ తో పాటు ఇప్పుడు కొత్తగా టీనేజ్ హోమ్స్ రాబోతున్నాయ్.
షాకవుతున్నారా ? అప్పట్లో ఓల్డేజ్ హోమ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగే షాకయ్యారు. కాని, ఇప్పుడు అవి నార్మల్. ఇంతకూ ఈ టీనేజ్ హోమ్స్ కథా కమామీషు ఏంటనేగా!
ఈ సంభాషణ వినండి..
P: Parent,
TH: Teenage Home Manager :
P: "నమస్తే సార్ ".
TH: నమస్తే –రండి కూర్చోండి.
P: "మీరు ప్రారంభించిన హోమ్ ఫర్ ది టీనేజ్డ్ గురించి తెలుసుకోటానికి వచ్చాను సార్".
TH: వెల్కం. అబ్బాయా అమ్మాయా?
P: "ఇద్దర్నీ జాయిన్ చేస్తా..."
TH: ఇద్దరికీ నెలకు యాభై వేలు కట్టాలి.
P: "ఓకే సార్ .కట్టేస్తాం".
TH: ఇంతకూ వాళ్ళ ప్రాబ్లెం ఏమిటి?
P: "మామూలే .. ఘర్ ఘర్ కీ కహానీ..."
TH: అంటే?
P: "ఇద్దరూ సెల్ ఫోన్ వదలటం లేదు".
TH: అంటే......? ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి వరకూ ఫోన్ వాడుతూనే ఉంటారా?
P: "అలా చేస్తే మాకు ప్రాబ్లెం ఏముంది? అసలు నిద్రే పోవటం లేదు".
TH: అంటే.......? రాత్రుళ్ళు ఎన్నింటి వరకూ మేలుకుoటున్నారు?
P: "ఎన్నింటి వరకూ ఏమిటి నా శ్రాద్ధం. అసలు నిద్ర పోతేగా?".
TH: ఓహో......అర్ధమయింది. అసలు నిద్రపోకుండా 24 గంటలూ ఫోన్ వాడుతూనే ఉంటారన్న మాట.
P: "అవును".
TH: మధ్యలో ఫోన్ చార్జింగ్ కోసమైనా దూరంగా ఉండరా?
P: "అందుకు రెండు ఫోన్లు వాడుతున్నారు".
TH: ఫోన్లు లాక్కో పోయారా?
P: "బావుంది, మొన్న మావాడి ఫోన్ లాక్కుంటే నామీద కత్తితో ఎటాక్ చేసాడు".
TH: ఓహో వయొలెన్స్ సిండ్రోమ్ అన్నమాట, మాదగ్గర దానికి ట్రీట్మెంట్ వుంది.
P: "అలాగే ఫోన్ వాడద్దని వాళ్ళమ్మ మందలించేసరికి మా అమ్మాయ్ ఇల్లు వదలి వెళ్ళిపోయింది. వారం రోజుల పాటు వెతికాక వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దొరికింది. బలవంతంగా ఇంటికి తీసుకొస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది నా తల్లి దండ్రులు నన్ను ఆత్మహత్యకు పురిగొల్పుతున్నారు అని. పోలీసులు కేస్ రిజిస్టర్ చేసారు. వాళ్ళను వదిలించుకోటానికి రెండు లక్షలు ఖర్చయింది. అప్పటినుంచీ ఎందుకైనా మంచిదని మా ఇంట్లో మా రక్షణ కోసం ఒక బౌన్సర్ ని పెట్టుకున్నాం. బౌన్సర్ కీ ముప్పై వేలు జీతం".
TH: మరి అదే కంటిన్యూ చేయక పోయారా?
P: "ఇప్పటికే ఆ బౌన్సర్ కోసం,పోలీసుల కోసం, ఇద్దరు పిల్లల ఫోన్ల కోసం, రీచార్జ్ కోసం మా ఇంట్లో సగం పోర్షన్ అమ్మేసాం. మిగతాది కూడా అమ్మితే మేము రోడ్ న పడతాం".
TH: ఓకే, అర్ధమయింది. కాని మా ఫీజ్ ఎలా కడతారు మరి?
P: "మీకు కట్టటానికి మా ఇంటి మీద బాంక్ లోన్ తీసుకున్నాం..".
TH: గుడ్...... రేపే మీ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసేయండి.
P: "మేమెలా తీసుకొస్తాం? ఇక్కడికి తీసుకొస్తామని తెలుస్తే వాళ్ళు అన్నంలో పురుగుల మందు పెట్టి మమ్మల్ని చంపేస్తారు".
TH: ఓకే.... .అయితే మా సెక్యూరిటీ వాళ్ళను పంపిస్తాం. వాళ్ళు తాళ్ళతో కట్టేసి తీసుకొస్తారు. అలా రిస్క్ తీసుకుంటున్నందుకు ఇంకో పాతిక వేలు కట్టాలి.
P: "అంత సీన్ అవసరం లేదు. మా పిల్లలు రాత్రి పన్నెండు నుంచి తెల్లారు జామున నాలుగింటివరకూ వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్ తో చాటింగ్ చేస్తూంటారు. ఆ టైములో వాళ్లకు సృహ వుండదు. ఈజీగా ఎత్తుకొచ్చి మీ వాన్ లో పడేయవచ్చు".
TH: అలా అయితే పదివేలు కట్టండి చాలు.
P: "ఇంతకూ మీరు వాళ్ళను మళ్ళీ ఆ మెషిన్ లైఫ్ నుంచి మనిషి లైఫ్ లోకి ఎలా తీసుకొస్తారు?".
TH: ముందు వాళ్ళను సెల్ ఫోన్ డి–ఎడిక్షన్ హాస్టల్ లో పెడతాం. అక్కడ రకరకాల ట్రీట్మెంట్ ఇస్తాం. మా సైఖియాట్రిస్ట్ వాళ్లకు మైల్డ్ షాక్స్ ఇస్తాడు. తరువాత, వాళ్లoదర్నీ ఒక హాల్లో కూర్చోబెట్టి ఫోన్ లేకుండా ఎలా మాట్లాడు కోవాలో నేర్పిస్తాం. ఆ తరువాత, ఆటలు, పాటలు నేర్పిస్తాం. జంతువులు ఫోన్లు లేకుండా ఎంత హాపీగా ఉంటున్నాయో డాక్యుమెంటరీలు చూపిస్తాం. పాత కాలంలో ఫోన్లు లేనప్పుడు ప్రజలు ఎంత హాపీగా కలసి మెలసి వుండేవారో మూవీస్ ద్వారా చూపిస్తాం. తల్లిదండ్రుల్ని బంధువులను ఎలా గుర్తు పట్టాలో ట్రైనింగ్ ఇస్తాం. డమ్మీ తల్లిదండ్రుల్ని ఎరేంజ్ చేసి వాళ్ళు ఎంతగా పిల్లల్ని ప్రేమిస్తారో ట్రయల్ రన్స్ ఇస్తాం. ఫోన్ లేకపోయినా మనం బతకవచ్చు అనే ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చూపిస్తాం...
P: "ఒక డౌట్ సార్".
TH: ఏంటది?
P: "ఒకవేళ అప్పటికీ పిల్లలు మారక పోతే?".
TH: అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను వేరే హోమ్ లో చేర్చుకుంటాం.
P: "ఎందుకు?".
TH: అలాంటి రిపేర్ కి పనికిరాని పిల్లలతో ఎలా శేష జీవితం గడపాలో తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇస్తామన్న మాట. దానికి ఫీజ్ తీసుకోము. ఫ్రీ.
ఎందుకంటే, అప్పటికే వాళ్ళు, పొలాలు, స్థలాలు, ఇల్లు అమ్ముకొని ఆరిపోయి వుంటారు గనక...
భవిష్యత్తి లో జరిగే పరిణామాలు తెలియజేయాలి అన్న సదుద్దేశం తో ఈ చిన్న వ్యంగ్య గా విషయం తెలియచేయడం జరిగింది.
*జీవితానికి ఉపయోగపడే 15 మంచి matalu
(Life-Useful Quotations)*
*ముందుమాట (Introduction)*
జీవితం అనేది అనుభవాల సమాహారం. మనకు దిశానిర్దేశం ఇచ్చేది సద్బోధన, సూక్తులు. ఇవి మనసుకు వెలుగునిస్తూ, ఆచరణలో మార్గదర్శకత్వం ఇస్తాయి.
**1. Truth – సత్యం**
సత్యం ఎప్పటికీ ఓడిపోదు. అది కొన్నిసార్లు ఆలస్యంగా గెలుస్తుంది కానీ శాశ్వతంగా నిలుస్తుంది. సత్యం మనసుకు ధైర్యం ఇస్తుంది. అబద్ధం తాత్కాలిక సౌకర్యమే ఇస్తుంది. సత్యవంతుల జీవితం అందరికీ ఆదర్శం. సత్యం అనుసరించే వారు భయపడరు. సత్యం ద్వారా నమ్మకం పెరుగుతుంది. సత్యం మనిషిని నిజమైన మహానుభావుడిగా మారుస్తుంది.
**2. Patience – సహనం**
సహనం కలవారు కష్టాలను జయిస్తారు. ఆత్రం ఎప్పుడూ తప్పులకు దారి తీస్తుంది. సహనం ఉన్నవారికి బుద్ధి నిలుస్తుంది. సహనంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. కోపం క్షణికం, సహనం శాశ్వతం. సహనం కలవారు ఇతరులకు శాంతిని పంచుతారు. సహనం ఉన్నవారికి విజయం దగ్గరలోనే ఉంటుంది. సహనం ఒక గొప్ప ఆయుధం.
**3. Discipline – క్రమశిక్షణ**
క్రమశిక్షణ లేని జీవితం అసంపూర్ణం. స్వీయ నియంత్రణతోనే విజయాలు వస్తాయి. క్రమశిక్షణతో సమయం వృథా కాదు. సమాజం క్రమశిక్షణతోనే సజావుగా నడుస్తుంది. క్రమశిక్షణ ఉన్నవారిని అందరూ గౌరవిస్తారు. విజయానికి క్రమశిక్షణ మూలస్థంభం. క్రమశిక్షణ ఉన్నవారికి క్రమబద్ధత పెరుగుతుంది. క్రమశిక్షణ జీవన ప్రమాణాన్ని పెంచుతుంది.
**4. Hard Work – కష్టపడి పనిచేయడం**
కష్టం లేకుండా ఫలితం రాదు. కష్టం చేసినవారే నిజమైన విజయాన్ని అందుకుంటారు. కష్టపడి పనిచేయడం శ్రమ కాదు సదుపాయం. కష్టాన్ని దాటితేనే గెలుపు ఉంటుంది. కష్టపడే మనసు ఎప్పటికీ వెనుకబడదు. కష్టపడితేనే ప్రతిభ వెలుగుతుంది. కష్టానికి గౌరవం ఎల్లప్పుడూ ఉంటుంది. కష్టపడి సాధించినదే శాశ్వతం.
**5. Knowledge – జ్ఞానం**
జ్ఞానం కంటే గొప్ప సంపద లేదు. జ్ఞానం ఉన్నవారిని ఎవ్వరూ దోచుకోలేరు. జ్ఞానం చీకటిలో వెలుగులాంటిది. జ్ఞానం పెరుగుతున్న కొద్దీ వినయం పెరుగుతుంది. జ్ఞానం మనిషిని వినయశీలిగా మారుస్తుంది. జ్ఞానం ఉన్నవారు ఇతరులను వెలిగిస్తారు. జ్ఞానం మనిషి జీవితాన్ని ఉన్నతంగా మార్చుతుంది. జ్ఞానం సమాజానికి దారి చూపుతుంది.
**6. Honesty – నిజాయితీ**
నిజాయితీ గలవారికి అందరూ నమ్మకం పెడతారు. నిజాయితీ గల వ్యక్తి ఎప్పుడూ భయపడడు. నిజాయితీ మనిషికి నైతిక శక్తినిస్తుంది. నిజాయితీ ఉన్నవారిని సమాజం గౌరవిస్తుంది. నిజాయితీ వల్ల నమ్మకం నిలుస్తుంది. నిజాయితీ జీవనంలో ఆనందం ఇస్తుంది. నిజాయితీతోనే మంచి సంబంధాలు ఏర్పడతాయి. నిజాయితీ శాంతికి మూలం.
**7. Time – సమయం**
సమయం అనేది అమూల్యమైనది. దానిని వృథా చేస్తే తిరిగి రావడం లేదు. సమయాన్ని కాపాడినవారే విజయాన్ని అందుకుంటారు. సమయం మనిషిని ముందుకు నడిపిస్తుంది. సమయం విలువ తెలుసుకున్నవారికి గౌరవం లభిస్తుంది. సమయం శ్రద్ధగా వినియోగించాలి. సమయాన్ని వృథా చేస్తే జీవితం వెనుకబడుతుంది. సమయం సక్రమంగా వాడితే ఫలితాలు గొప్పవిగా వస్తాయి.
**8. Friendship – స్నేహం**
స్నేహం జీవనంలో ఆనందాన్ని ఇస్తుంది. నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ తోడుంటాడు. స్నేహం నమ్మకంపై నిలుస్తుంది. స్నేహితుడు మన లోపాలను సరిచేస్తాడు. స్నేహం మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. స్నేహితుడు బాధల్లో తోడ్పడతాడు. స్నేహం నిజాయితీతో బలపడుతుంది. స్నేహం జీవన పథంలో వెలుగును నింపుతుంది.
**9. Love – ప్రేమ**
ప్రేమ జీవనానికి శక్తినిస్తుంది. ప్రేమతో సంబంధాలు నిలుస్తాయి. ప్రేమ మనసును మృదువుగా చేస్తుంది. ప్రేమ ద్వేషాన్ని దూరం చేస్తుంది. ప్రేమలో నిజాయితీ ఉంటే బంధం బలపడుతుంది. ప్రేమతోనే శాంతి పెరుగుతుంది. ప్రేమ మనిషిని దయగలవాడిగా మారుస్తుంది. ప్రేమ ప్రపంచానికి మానవత్వాన్ని ఇస్తుంది.
**10. Health – ఆరోగ్యం**
ఆరోగ్యం లేకపోతే ధనం ఉపయోగం లేదు. ఆరోగ్యం ఉంటే శ్రమించగలం. ఆరోగ్యం మనిషి జీవనానికి పునాది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కర్తవ్యం. ఆరోగ్యం శాంతిని ఇస్తుంది. ఆరోగ్యం ఉన్నవారు ఆనందంగా ఉంటారు. ఆరోగ్యం విజయం సాధించడానికి తోడ్పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.
**11. Charity – దానం**
దానం మనిషిని మహోన్నతుడిగా చేస్తుంది. దానం సమాజంలో సానుభూతిని పెంచుతుంది. దానం చేసే హృదయం పవిత్రం. దానం వల్ల సమానత్వం పెరుగుతుంది. దానం ఇతరుల కష్టాలను తగ్గిస్తుంది. దానం మనసుకు శాంతినిస్తుంది. దానం మానవత్వాన్ని నిలుపుతుంది. దానం మనిషి విలువను పెంచుతుంది.
**12. Courage – ధైర్యం**
ధైర్యం లేని జీవితం బలహీనత. ధైర్యం కలవారే సమస్యలను ఎదుర్కొంటారు. ధైర్యం మనిషికి ఆత్మవిశ్వాసం ఇస్తుంది. ధైర్యంతో విజయాలు సాధ్యమవుతాయి. ధైర్యం లేకపోతే భయమే మిగులుతుంది. ధైర్యం జీవితం ముందుకు నడిపిస్తుంది. ధైర్యం ఉన్నవారికి గౌరవం వస్తుంది. ధైర్యం మానవత్వానికి శక్తి.
**13. Simplicity – సరళత**
సరళత కలవారు అందరినీ ఆకట్టుకుంటారు. సరళత మనసుకు ప్రశాంతి ఇస్తుంది. సరళతలోనే గొప్పదనం ఉంటుంది. సరళత గలవారు ఎవరినీ కించపరచరు. సరళతతో జీవితం సులభమవుతుంది. సరళత మనిషిని వినయశీలిగా మారుస్తుంది. సరళతతో బంధాలు బలపడతాయి. సరళత అనేది సహజమైన అందం.
**14. Gratitude – కృతజ్ఞత**
కృతజ్ఞత గలవారు నిజమైన మహానుభావులు. కృతజ్ఞత మనిషిని వినయవంతుడిగా ఉంచుతుంది. కృతజ్ఞత చూపించడం ఒక గొప్ప గుణం. కృతజ్ఞత బంధాలను బలపరుస్తుంది. కృతజ్ఞత గల మనసు అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కృతజ్ఞత గలవారికి మరింత సహాయం లభిస్తుంది. కృతజ్ఞత మనసు పవిత్రతను చూపిస్తుంది. కృతజ్ఞత మానవత్వానికి మూలం.
**15. Self-Confidence – ఆత్మవిశ్వాసం**
ఆత్మవిశ్వాసం కలవారు ఏదైనా సాధిస్తారు. ఆత్మవిశ్వాసం మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం విజయానికి దారి చూపిస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్నవారు వెనుకడుగు వేయరు. ఆత్మవిశ్వాసం మనసును బలంగా ఉంచుతుంది. ఆత్మవిశ్వాసం లేనివారు ఎప్పుడూ భయపడతారు. ఆత్మవిశ్వాసం గలవారికి అవకాశాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం జీవితం ఉన్నతంగా మార్చుతుంది.
*ముగింపు (Conclusion)*
ఈ సూక్తులు జీవనంలో మార్గదర్శకత్వం ఇస్తాయి. వీటిని పాటిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, సమాజం సౌఖ్యంగా ఉంటుంది. జీవితం సార్థకంగా గడుస్తుంది.
శుభం భూయాత్🙏🏻
సదా మీ సేవలో🙏🏻
పసుపులేటి నరేంద్రస్వామి
గద్వాల రాణి
*నిజాం నవాబును ఎదురించిన వీరవనిత. గద్వాల సంస్థానాన్ని స్వతంత్ర సంస్థానంగా ప్రకటించి పాలించిన మహారాణి. నిజాం ప్రభువుల నుంచి పతనమైన తన రాజ్యాన్ని పునరుద్ధరించుకున్న వీరవనిత మహారాణి ఆది లక్ష్మిదేవమ్మ గారి వర్ధంతి జ్ఞాపకం* !
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
గద్వాల సంస్థానంలో సాహితి పోషకులలో చెప్పకోదగ్గ రాజు శ్రీ మహారాజా సీతారామభూపాలుడు 1924లో స్వర్గస్తు లైనారు. తరువాత పాలన బాధ్యతలు శ్రీ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ 1929లో చేపట్టారు. 1949లో జాగీరుల రద్దుతో రాణి పాలన ముగిసంది. ఆమె చేసిన 25సంవత్సరాల పాలనలో ఎ న్నో విజయాలు. మన్ననలను, ప్రశంసలను రాణి అందు కున్నారు. 25సంవత్సరాల రాణి పాలనను గద్వాల చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గదిగా ఇప్పటికీ చెప్పుకుంటారు.
.......
పూడూరును చాళుక్యులు పరిపాలించగా, చాళుక్యులకు, పల్లవులకు మధ్య జరిగిన యుద్ధంలో పెదసోమభూపాలుడు గదను, వాలమును ప్రయోగించడం వలన ఈ కోటకు "గదవాల (గద్వాల)" అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ విధంగా 1663 నుండి 1950 వరకు గద్వాల సంస్థానాధీశులచే పరిపాలింపబడింది. రాజాభరణాల రద్దు తరువాత ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని,
......
గద్వాల, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలానికి చెందిన పట్టణం. ఇది జోగులాంబ గద్వాల జిల్లాకు పరిపాలనా కేంద్రం. మండలానికి, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంగా కూడా ఉంది
.....
గద్వాల సంస్థానం తుంగభద్ర, కృష్ణానదుల మధ్య ప్రాంతంలో నడిగడ్డగా పిలిచే ప్రాంతంలో 800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. 14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత గద్వాల సంస్థానాధీశులు బహుమనీ సామ్రాజ్యం సామంతులుగా ఉన్నారు. 1663లో రాజా పెదసోమభూపాలుడితో ప్రారంభమైన గద్వాల సంస్థాన పాలన విలీనమయ్యే వరకు కొనసాగింది. 1704లో నాడగౌడుగా ఉన్న సోమన్న కృష్ణానది తీరన గద్వాల కోటను నిర్మించారు. రాజ్యాన్ని బనగానపల్లె, ఆదోని, సిరివెల్ల, నంద్యాల, ఆత్మకూరు, అహోబిలం ప్రాంతాలకు విస్తరించారు. 1909 వరకు గద్వాల సంస్థానాధీశులు సొంత నాణేలను ముద్రించుకున్నారు. ఈ సంస్థానంలో 11 మంది రాజులు, 9 మంది రాణులు పాలించారు. చివరగా మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ గారు 1924 నుంచి సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యే వరకు మహారాణిగా కొనసాగారు. గద్వాల సంస్థాన వారసుడైన కృష్ణ రాంభూపాల్‌రెడ్డి 1962లో రాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
......
గద్వాల్ కోట ఒక అద్భుతమైన కట్టడం, దీని చుట్టూ పాత పట్టణం విస్తరించి ఉంది. కోటలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనది శ్రీ చెన్నకేశవ స్వామి. జమ్ములమ్మ అనే మరొక ప్రసిద్ధ దేవాలయం పట్టణానికి పశ్చిమాన ఉంది.
.....
మహారాణి ఆది లక్ష్మి దేవమ్మ మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి గద్వాల సంస్థానాన్ని పాలించిన మహారాణి. రాజా చిన సీతారామభూపాలుని భార్య. ఆయన అనంతరం పాలనచేశారు. 1946 నుండి 1949 వరకు పాలించారు. ఆమె ఈ సంస్థానపు చివరి పాలకురాలు కూడా. నిజాం నవాబును ఎదురించిన వీరవనిత. గద్వాల సంస్థానాన్ని స్వతంత్ర సంస్థానంగా ప్రకటించి పాలించించారు. సీతారామభూపాలునికి సంతానం లేకపోవడంచే నిజాం నవాబు మిర్ ఉస్మాన్ అలీఖాన్ తమ రాజ్యంలో గద్వాల సంస్థానాన్ని కలుపుకుంటే, రాణి న్యాయపోరాటం చేసి సంస్థానాన్ని తిరిగి చేజిక్కించుకున్నారు.
▪️ సాహితి సేవా.....
శ్రీ మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ పాలనలో చేసినా సాహితిసేవను గద్వాల చరిత్రలో సువర్ణక్షరాలతో లి ఖించదగినది. రాణి పాలనలో వెలుగులోకి వచ్చిన సాహితి సేవలు ఎవరి పాలనలో వెలుగులోకి రాలేదు. ప్ర తి సంవత్సరం కార్తీక మాఘ శుద్ధ పౌర్ణమి నాడు కవి పం డితులను ఆదరించి వారిని సన్మానించి వారి పాదదూళిని సింధూరంగా భావించి నుదుటన పెట్టుకునే వారట. అలాగే ప్రతి మాఘపౌర్ణమి నాడు చెన్నకేశవ స్వామి రథో త్సవం సందర్భంగా దక్షిణ భారత దేశము నుంచి కళా కారులను ఆహ్వానించి సన్మానించేవారు. నాడు సన్మానం పొందిన వారిలో తిరుపతి వెంకటకవులు కూడా ఉన్నారు. ఆంధ్రదేశంలో గద్వాలలో సన్మానం పొందుట తమ విద్య కు పరిపూర్ణత లభించినట్లేనని కవులు భావించేవారు. అందుకే రాణి పాలనలో గద్వాలను విద్వద్గద్వాలగా కీర్తి సంతరిం చుకుంది.
.......
సంస్థానంలో సంప్రదాయంగా వస్తున్న సాహిత్య పోషణను కొనసాగిస్తూ, ఎందరో కవులను ఆదరించి గద్వాలకు విద్వద్గద్వాలగా కీర్తి రావడానికి కారకులయ్యారు. ఎంతోమంది కవుల పుస్తకాలను ముద్రింపజేశారు. 1949 లో సంస్థానాల, జాగీర్ధారుల పాలనలు రద్దు కావటంతో రాణి సంస్థానపు ఆస్తులను, చారిత్రాత్మక గద్వాల కోటను ప్రభుత్వ పరం చేశారు. 1663లో రాజా పెద సోమభూపాలుడి పాలనతో ప్రారంభమైన గద్వాల సంస్థానపు పాలన 1949లో మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ పాలనతో ముగిసింది. ఆమె పేరు మీదుగా గద్వాల కోటలో మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటైన మొదటి డిగ్రీ కళాశాల.
.....
స్వాత్రంత్యానికి పూర్వం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 16 సంస్థానాలు ఉండేవి. అందులో ముఖ్యమైనవి వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, అమరచింత సంస్థానాలు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ.. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం కాలేదు. కేంద్రప్రభుత్వం ‘ఆపరేషన పోలో’తో సైనిక చర్యకు దిగడంతో 1948 సెప్టెంబర్ 17న విలీనం కావడంతో ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం సిద్ధించింది. దీంతో సంస్థానాలన్నీ పోయి ప్రజాస్వామ్య పాలన ఏర్పడింది. అప్పటి వరకు సంస్థానాధీశులుగా కొనసాగిన వారిలో కొంతమంది ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ నిలబడి గెలిచారు. ప్రస్తుతం రాజవంశాలకు చెందిర వారు క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
• గద్వాల సంస్థానంను పాలించిన రాజులు....
బుడ్డారెడ్డి గద్వాల సంస్థానానికు మూలపురుషుడు. మొత్తం 11 రాజులు, 9 రాణులు ఈ సంస్థానాన్ని పాలించారు. వీరిలో ముఖ్యులు.
1) రాజ శోభనాద్రి
2) రాణి లింగమ్మ (1712 - 1723)
3) రాణి అమ్మక్కమ్మ (1723 - 1724 )
4) రాణి లింగమ్మ ( 1724 - 1738 )
5) రాజా తిరుమలరావు
6) రాణి మంగమ్మ ( 1742 - 1743)
7) రాణి చొక్కమ్మ ( 1743 - 1747 )
8) రాజా రామారావు
9) రాజా చిన్నసోమభూపాలుడు
10) రాజా చిన్నరామభూపాలుడు
11) రాజా సీతారాం భూపాలుడు
12) రాణి లింగమ్మ (1840 - 1841 )
13) రాజా సోమభూపాలుడు
14) రాణి వెంకటలక్ష్మమ్మ
15) రాజారాంభూపాలుడు
16) రాణి లక్ష్మీదేవమ్మ
17) మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ ( 1924 - 1949 )
• సంస్థానం గుండా యూనియన్ దళాలకు ప్రవేశం...
మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ గారు 1947లో భారత స్వాతంత్ర్యానంతరం నిజాం నవాబును ఎదిరించిన సాహసి. 1948లో భారత యూనియన్ దళాలు హైదరాబాదుపై పోలీస్ చర్య తీసుకొనే సమయంలో కర్నూలు మీదుగా హైదరాబాదుకు వెళ్ళడానికి తన సంస్థానం గుండా యూనియన్ దళాలకు ప్రవేశం కల్పించింది తన దేశభక్తిని చాటుకున్నారు.
......
1948 సెప్టెంబరులో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన పిదప తన సంస్థాన ఆస్తులను, తెలంగాణలోనే ప్రఖ్యాతి గాంచిన గద్వాల మట్టికోటను ప్రభుత్వానికి ధారాదత్తం చేసింది. ప్రస్తుతం ఈ కోటలోనే జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, పిజి సెంటర్, దేవాలయం ఉన్నాయి. డిగ్రీ కళాశాలకు ఈమె పేరిట మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ (మాల్డ్) డిగ్రీ కళాశాలగా పిలుస్తున్నారు.
• గద్వాల చీరలకు పునాదివేసారు మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ గారు.
గద్వాలనుండి కొన్ని కుటుంబాలను బెనారస్ పంపించి అక్కడ నేతపని శిక్షణ ఇప్పించి దానిలో కూడా గద్వాల ప్రత్యేక అంచుని తయారుచేయడానికి బాటవేసింది రాణీ గారు.గద్వాల చీరకు అంత సొగసు పాపులారిటి ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు రాణి గారికి వచ్చిన అలోచన కొత్తగా పట్టు+కాటన్ కలగలిపి చీరలు నేస్తే ఎలాగుంటుందన్న అదే విషయాన్ని కంచి, బెనారస్ లోశిక్షణ తీసుకొచ్చిన 12 మంది చేనేతలతో మాట్లాడారు.కోటగుమ్మం డిజైన్ గద్వాలకు చిహ్నంగా కనిపిస్తుంది.ఈ ఆలోచన ఆదిలక్ష్మిదేవమ్మ గారిదే.
• గద్వాల చీరల్లో మాత్రమే ఎందుకుంది ?
చీరలు ఎందుకింత పాపులరైంది ? ఎందుకంటే రెండు రకాల వస్త్రాలను మిశ్రమంచేసి గద్వాలలో చీరలను నేస్తారు కాబట్టే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రతిచీరకు బార్డర్ తో పాటు పల్లు అంటే కొంగు ఉంటుందని అందరికీ తెలిసిందే. మామూలుగా ఏ ప్రాంతంలో చీరలు నేసినా పూర్తి కాటన్ లేదా పట్టు లేదా ఏదో ఒకరకమైన బట్టతో మాత్రమే తయారవుతాయి.కాని గద్వాలలో మాత్రం బార్డర్, కొంగును పట్టుతోను మధ్యలోని చీరమొత్తాన్ని కాటన్ తో నేస్తారు.పట్టు+కాటన్ మిశ్రమంతో చీరలు నేస్తారు కాబట్టే దేశం మొత్తంమీద గద్వాల చీరలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కాటన్+పట్టుతో కలిపి చీరను నేసే ప్రక్రియ దేశంలో గద్వాలలో తప్ప ఇంకెక్కడాకనబడదు. అందుకనే గద్వాల పట్టుచీరలు ఎంతో ప్రత్యేకం.1946 ప్రాంతంలో హైదరాబాద్ లోని అబిడ్స్ లో గద్వాల చీరల కోసమే మహారాణి ప్రత్యేకంగా షోరూమ్ ను ఏర్పాటు చేసారు. భర్త సీతారాంభూపాలుడి ద్వారానే అప్పటిదాకా అన్ని విద్యలలో ముందున్న గద్వాల "విద్వద్ గద్వాల"గా విద్యావంతులకు పండితులకు నిలయంగా మారాయి.ఆ విద్యలలో చేనేతలను పుట్టించి,ప్రోత్సహించిన గొప్ప కళా పోషకురాలు గద్వాల మహారాణి గారు.
.......
1663లో మహారాజా పెద్దసోమభూపాలుని పాలనతో ప్రారంభమైన గద్వాల సంస్థానం 1949లో శ్రీ మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ పాలనతో అంతమైంది. 1949లో జాగీరుల రద్దు తో రాజుల పాలనకు తెరపడింది. మూడు సంవత్సరాలు ప్రభు త్వ పాలనను చూసిన ఆమె 18-8-1953న దివంగతులైనారు. 25సంవత్సరాలు సాగిన రాణిగారి పాలనను ఇప్పటికీ ఎవ రు మరచిపోలేదు. కాని రాణి సేవలు, త్యాగాలు, గొప్పతనం ఎంతమందికి గుర్తుకు ఉందన్నది ప్రశ్నార్థకం.
• శ్రీవారికి ఏరువాడ జోడు పంచెలు....
బహుమానంగా పంపటం కూడా మహారాణి హయాంలోనే మొదలైందన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు వెంకటేశ్వరస్వామికి గద్వాల నుండి పట్టుతో నేసిన జోడు పంచెలు బహుమానంగా వెళ్ళటం దశాబ్దాలుగా ఆనవాయితీగా ఉన్నది. జోడు పంచెలను తయారుచేసే చేనేతలు ప్రత్యేకంగా దీక్ష తీసుకుని 41 రోజుల పాటు ప్రత్యేకమైన మగ్గంలోనే నేస్థారు. శ్రీవారికి నేసే జోడు పంచెల మగ్గాన్ని ఏడాది మొత్తం మీద దేనికీ వాడ కుండా ఉంచుతారు.మహారాణి వారసులు కొడుకు, కోడలు లతా భూపాల్ నేటికీ ప్రతి ఏడాది గద్వాల నుండి జోడు పంచెలను నేయించి ప్రత్యేకంగా తిరుమలకు పంపుతూ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
ఉడిపి హోటల్ తెలుసా...
ఉడుపి హోటల్ ఎందుకంత పేరు గాంచాయో తెలుసా....
ఇంట్లో మనం నలుగురికి లేదా 5గురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతం లో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరు? ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోండి.
మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి,,రెండవది బలరాముడు.ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి.
దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది.ఉడిపిరాజైన నరేషుడు
సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు.
అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు.అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు.
మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.
అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది,
నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు.
అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము.వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు చెపుతాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది,50 లక్షల మందికి భోజనం వండటం
అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుంది,అందరికీ భోజనాలు తయారుచేయమని చెపుతాడు.
50 లక్షల మందికి భోజనాలు వండాలంటే
భీముడు మరియు అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం
భీముడు కు ముఖ్యం.అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు.అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు.
నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేష్ ఎలా
వండేవాడు అంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా,వృధాకాకుండా వండేవాడు.
రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది.
అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా
వండేవాడు నరేశుడు.
ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు.
ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు,అది కూడా ఒక్క మెతుకు కూడా
మిగలకుండా ఎలా వండుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు.
అసలు నరేశునికి ఎలా తెలుస్తుంది?
ఈ రోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని,మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..
ఇలా18 రోజులు గడిచిపోయాయి.పాండవులు గెలిచారు.పట్టాభిషేకం జరుగుతుంది.అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు.కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు.ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.
అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు.
అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు.
అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం.కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణుని కే చెందుతుంది అని చెప్తాడు.
ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు.
ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా
కారణం అని నరేషుడుని అడుగుతారు.
అప్పుడునరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు...
శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు.నేను లెక్క పెట్టి పెట్టే వాడిని.
శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని...
శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలుఅయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే
శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు.
దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు.
ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు.
ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు.
ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.
"హరిసర్వోత్తమ"
"వాయు ఉత్తమ*"
🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఎవ్వరు లేకపోయినా ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకటం ఆపేద్దాం …
ఒక సిస్టమ్, ఆర్గనైజేషన్, రిలేషన్‌షిప్ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్ చేయొచ్చు.
‘నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్.. ఈ సంస్థ, ఈ ఇల్లు.. ఈ రాష్ట్రం.. ఈ దేశం.. ఏమైపోతుందో’ అని చాలామంది అనుకుంటూ ఉంటారు!
ఏం కాదు! అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి.
ఇంకా బాగా నడవవచ్చు కూడా !
కొత్తవారు కొత్త ఆలోచనతో రావచ్చు!
మనలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు.
మనకున్న అనుభవం, మనం ఆలోచించే విధానం, మన ఎనర్జీ - ఇలా ఎన్నో మంచి లక్షణాలు మన లో ఉండవచ్చు.
ఆ విషయంలో మన స్థానాన్నితాత్కాలికంగా ఎవరూ భర్తీ చేయలేకపోవచ్చు ! అంతమాత్రాన ఏమీ ఆగిపోదు!
అయినా, మన టైమ్ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ ఠక్కున పక్కన పెడతారు! అప్పటిదాకా మన పక్కన ఉన్న వాళ్లే, పక్క దారి పడతారు!
ఎన్నో ఏళ్లు పనిచేసిన కంపెనీలో, సంస్థలో మన రిటర్మైంట్ రోజున బాగా భావోద్వేగానికి గురయి మాట్లాడుతూ ఉంటామ్! అప్పటివరకూ సాధించిన వాటి గురించి గొప్పలు (గప్పాలు) చెబుతూ ఉంటాం!
కానీ, ఇటు మన స్పీచ్ నడుస్తుంటే, మన యాక్సిస్ కార్డును, ఐడి కార్డును, ఇంకొకడు అప్పటికే డి-యాక్టివేట్ చేసేసి ఉంటాడు.
మరొకడు మన అఫీషియల్ మెయిల్ ఐడీ పాస్‌వర్డ్ మార్చేస్తాడు.
బ్యాంకు అకౌంట్ ఆథరైజ్డ్ సిగ్నేచర్ మార్చేసి బ్యాంకు కి అప్పటికే లెటర్పంపించేసి ఉంటారు!
మన టేబుల్ మీద మనం పెట్టుకున్న దేవుడి ఫోటో తీసేసి వాళ్ళది పెట్టేసుకుంటారు! ఇవన్నీ సహజం!
మనకు కాఫీ ఇచ్చే బాయో, బంట్రోతో అప్పటికే మన డెస్క్ ఖాళీ చేసి, అన్నీ మన కారులో పెట్టేసుంటాడు.
మన తరువాత మన పోస్టులోకి వచ్చే వ్యక్తి, మన నేమ్ ప్లేట్ తీసేసి మన బ్యాగ్లో వేసేసి- “సార్ మీ నేమ్ ప్లేట్ తీయించి మీకు ఇస్తున్నాము సార్ ! గుర్తు గా వుంచుకోండి”అంటూ, అప్పటికే రెడీ అయిన తన నేమ్ ప్లేట్ ఫిక్స్ చేయించే ప్రయత్నంలో వుంటాడు!
మన సహచర ఉద్యోగులు మనల్ని ఎంతో మిస్ అవుతున్నామని తెచ్చిపెట్టుకున్న కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు.
అదే సమయంలో మన తర్వాత ఆ కుర్చీలో కూర్చొనేవాడు మన పక్కనే బాధగా నిలబడి, మన స్పీచ్ అయిపోగానే, ఆ సీట్లో కూర్చుందామని చూస్తుంటాడు.
వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మనల్ని మర్చిపోతారు. అంతెందుకు, వీడ్కోలు మీటింగ్ మధ్యలోనే కొంత మంది శాలువా కప్పి చల్లగా జారుకుంటారు, అప్పటిదాకా ఉండవలసి వచ్చినందుకు బాధ పడుతూ!
ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే!
ఆఫీస్ నుంచి ఎవరూ ఫోన్ చేసి మన సలహాలు, సూచనలు అడగరు! వాటి కోసం ఎదురు చూడొద్దు. ఎవడూ రాడు.
ఏదైనా సలహా కావాలంటే చాట్- జీపీటీని అడుగుతారు . ప్రపంచం ఎంతో వేగంతో పరుగెడుతోంది.
కళ్లు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి.
పెద్ద పోస్టులో రిటైర్ అయిన వ్యక్తుల PA లు కూడా, ఆ సదరు రిటైర్ అయిన వ్యక్తి రిటైర్మెంట్ అయిన మరునాడు ఫోన్ చేసి ఏదైనా పాత విషయం అడగబోతే, ఆ సదరు “నిన్నటి సారు “ చెప్పే లోపే, “సార్! పెద్ద సార్, కొత్త సార్ పిలుస్తున్నారు intercom లో! మళ్లీ పది నిమిషాలు ఆగి ఖాళీ అయ్యాక ఫోన్ చేస్తాను “ అని , ఇటు రెస్పాండ్ అయ్యేలోపే ఫోన్ కట్ చేస్తాడు! అది ఉద్యోగధర్మం!
మనం తప్పు పట్టకూడదు!
నిన్నటితో అతనిది ముగిసింది!
ఈరోజు నుండి“పెద్దసార్“
మారాడు! ఇది కొంతవరకు జీర్ణించుకోవచ్చు!
అదే పాత ప్రభుత్వంలో పదవి వెలగబెట్టిన ఏ ప్రజా నాయకుడో, ఏ సంస్థ కార్య నిర్వాహక సభ్యుడో అయితే ఈ అవకాశం కూడా లేదు! ప్రభుత్వం మారినా వెంటనే, మూటా ముల్లి సర్దుకోవాలి! పాత రికార్డ్స్ మనకు ఇబ్బంది కలిగించే డాక్యుమెంట్స్ ముందే సర్దుకోవాలి!
మనం అందరం మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా?
మన టైం అయిపోయింది!
మనం మంచి పొజిషన్.. సక్సెస్‌లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం.
తర్వాత అందరూ మర్చిపోతారు.
‘నేనే లేకపోతే’
అని ప్రతి అత్తగారు అనుకుంటుంది.
కానీ, కొత్త కోడలు వస్తుంది.
ఆమెకంటే ఇల్లు బాగా చూసుకుంటుంది! ఇది 95% నిజం కూడా!
కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే
”ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు.
మనం చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకాలి! ద్వేషాలు, వైషమ్యాలు విడవాలి!
కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి . కొత్త సవాళ్లను ఎదుర్కోవాలి . పాత అలవాట్లని కొంతవరకు మార్చుకోవాలి! సర్దుకు పోటం నేర్చుకోవాలి!
మనల్ని మనమే గౌరవించుకోవాలి! తప్పదు మరి!
ఇంకా ఆఫీస్, పోస్ట్ నెత్తి మీద పెట్టుకుని మోయరాదు. పిల్లా, పాపలతో సరదాగా గడపటం నేర్చుకోవాలి!
పవర్.. మనీ.. సక్సెస్.. జీవితాంతం ఉండవు. అవి వున్నప్పుడే, అవి లేనప్పుడు ఎలా బతకాలి నేర్చుకోవాలి.
‘నేనే లేకపోతే..’ అనే ఆలోచన వస్తే, ఒక్కటే గుర్తు పెట్టుకోండి.
“నేనే” లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది…
ఏదీ ఆగదు…
పాత నీరు పోతూనే ఉంటుంది…
కొత్త నీరు భర్తీ చేస్తూనే ఉంటుంది…
ఎవరైనా వచ్చి మనల్ని పొగిడి “సార్! మీరు లేకపోతే “ అంటే, మనం వెంటనే అర్థం చేసుకోవాలి, వాడు మనల్ని మోసం చేస్తున్నాడని, వాడిని కూడా మోసం చేసుకుంటున్నాడని!
ఇంత వయసు వచ్చి రిటైర్ అయ్యాక, ఈ మాత్రం maturity రాకపోతే, మనం ఇన్నాళ్లు బతికింది వృధా అన్న మాట!
కొన్ని విషయాల్లో, కొంత సమయం తర్వాత, వదిలేయడంలో ఉన్నఆనందం పట్టుకొని వేళ్ళాడటంలో వుండదు!
మనం పట్టు వదలకపోతే, వాళ్లే వదిలిస్తారు!
ఈ విషయంలో, నేటి తరంలో, మన పిల్లలే మన మాట వినరు!
“మీ టైం అయిపోయింది, మీకేమి తెలియదు!
మీరు ఊరుకోండి, అన్నిట్లోనూ వేళ్లు పెట్టకండి! మాకు తెలుసు, మేము చూసుకుంటాము! మేమూ పెద్ద వాళ్ళమయ్యాముగా “ అంటారు!
వాళ్ళు ‘మేమూ పెద్దవాళ్లమయ్యాముగా’అనగానే, మనం మన పెద్దరికాన్ని పక్కన పెట్టి, పద్ధతిగా, పెద్దరికాన్ని కాపాడుకుంటూ పక్కకు తప్పుకోవాలి!
లేదంటే మనల్ని మనమే చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది!
ఇది ఉద్యోగంలో నైనా, వ్యాపారంలో నైనా, వేరే దేనిలోనైనా, ఇంట్లో నైనా తెలుసుకొని మసలటం విజ్ఞుల లక్షణం!
లేకపోతే అభాసుపాలవటం తధ్యం! ఇది మనకు చరిత్ర చెబుతున్న సత్యం!