ఉమ్మడి కుటుంబాలు
ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో... అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది...!!
అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు...!!
ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా బ్రతకడానికి కావలసిన నీతి, నైతికత నేర్పించేవారు...!!
అప్పట్లో డబ్బు కొంచెం సమస్యగా ఉన్నా కూడా ఉన్నదంతా పంచుకుంటూ, అందరూ కలిసి సంతోషంగా ఉండేవారు...!!
అమ్మమ్మ - తాతయ్య
నానమ్మ - తాతయ్య
పెద్దనాన్న - పెద్దమ్మ
చిన్నాన్న - చిన్నమ్మ
అత్త - మామ
అక్క - బావ
మరదలు - తమ్ముడు
వదిన - అన్నయ్య
చెల్లి - బావ గారు
మేనమామ - మేనత్త
మేనకోడలు - మేనల్లుడు
అని ఓ బంధాల అల్లికలు ఉండేవి...!!
పిల్లలు తప్పు చేస్తే కుటుంబమే వారిని సారీ చెప్పేంతగా, మారేంతగా తీసుకునేది...
పిల్లలకు ప్రతి ఒక్కరిలోనూ భయం, భక్తి, ప్రేమ, అభిమానం ఉండేవి...!!
కొత్తగా వచ్చే అల్లుడు కానీ, కోడలు కానీ
ఆ ఉమ్మడి కుటుంబంతో సరదాగా కలసి పోయేవారు...
అల్లుడికి తగిన మర్యాద
కోడలికి తగిన బాధ్యత
ఇలా ప్రతి దానికీ ఒక పద్ధతి ఉండేది...!!
ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు బాధ్యతగా మెలగడం, ఆదరించడం...
అదే కారణంగా ఆ కుటుంబ పరువు మర్యాదలతో వర్ధిల్లేది...!!
అలాంటి ఉమ్మడి కుటుంబాలు పెద్దల చేత నడిచే ఒక గొప్ప రథాల్లా ఉండేవి...!!
ఇంటిని దేవాలయంలా చేస్తూ, పెద్దలు ఆలయ శిఖరాల్లా వెలిగేవారు...!!
ఇప్పుడు వాటిని పక్కన పెట్టేశారు...
పెద్దలను భారంగా భావిస్తూ దూరం చేస్తూ, వాళ్ళను ఒంటరిగా విడిచిపెడుతున్నారు...
వాళ్లకేమీ లేదు... హాయిగా దేవతామూర్తుల్లా కాలం వెళ్లదీస్తున్నారు...!!
ఈ నాడు స్వేచ్ఛగా బ్రతకాలని పల్లెటూర్ల నుంచి పట్టణాలకు వచ్చిన జంటలు...
వాళ్లు కట్టుకున్న ఇరుకుగదులే సుఖం అనుకుంటున్నారు...!!
కానీ...
డబ్బు కోసం పరుగులు తీయే భర్త
బాధ్యతలు మరిచిపోయిన భార్య
తల్లిదండ్రులను గౌరవించలేని పిల్లలు
బాగుపడితే ఒర్చుకోలేని అన్నదమ్ములు
దుమ్మెత్తి పొసే బంధువులు
సెల్ ఫోన్ లో పలకరించే దిక్కుమాలిన బతుకులు
ఇప్పుడు మంచి చెప్పేవారు లేరు, వినేవారు లేరు...!!
భయం లేదు
భక్తి లేదు
ప్రేమ ఒక నాటకం
అభిమానం ఒక భూటకం
నవ్వునీ నటిస్తూ బ్రతుకుతున్నారు...
అవసరంలేని బంధాలని పట్టుకుని,
అవసరమైన బంధాలని విడిచి,
బంధీలుగా బ్రతుకుతున్నారు...!!
ప్రతి రోజు వార్తల్లో కొన్ని సంఘటనలు చూస్తే బాధగానే ఉంటుంది...
చాలావరకు కుటుంబాలు రోడ్డున పడిపోవడానికి కారణం...
మంచి చెడు చెప్పే పెద్దలు మనతో లేకపోవడం...
బలమైన ఉమ్మడి కుటుంబాలను వదిలేసి,
మనమే మన పునాదుల్ని బలహీనపరచుకుంటున్నాం...!
ఉమ్మడి కుటుంబాలని తిరిగి స్వాగతిద్దాం
మన పెద్దలను గౌరవిద్దాం
తల్లిదండ్రులను ప్రేమిద్దాం
మన పిల్లలకు సంస్కారం నేర్పుదాం
మనం మన సమాజానికి మంచి పంచుదాం
ఒక్కటిగా జీవిద్దాం - ఆనందంగా బ్రందాం
బంధాలు బలంగా నిలిపిద్దాం!!