NaReN

NaReN

Thursday, January 30, 2025

ప్రేమ హత్య

 ప్రేమ హత్య




నాయనమ్మ చేయించిన పరువు హత్య ఇది..ఇవాళో రేపూ..కాటికి చేరే వయసులో ఉన్న ఆ పెద్దావిడ పచ్చని జంటను విడగొట్టింది..

వేరే కులానికి చెందిన వాడిని తన మనవరాలి .. పెళ్లి చేసుకోవడాన్ని.. పైగా తమ కళ్లెదుట ఊర్లోనే కాపురం పెట్టడాన్ని ఆ పెద్దావిడ తట్టుకోలేకపోయింది.కృష్ణా-రామా అనాల్సిన వయసులో పరువు..పరువు అంటూ రాత్రి పగలు కలవరించిన ఆ ముసలావిడ...తన మనవరాలిని పెళ్లి చేసుకున్న ఆ కుర్రాడ్ని హత్య చేయాలని మనవళ్లని ఆదేశించింది...అతన్ని చంపడానికి నాలుగు సార్లు ఆమెనే మనవళ్ల సాయంతో స్కెచ్ వేసింది.. మూడుసార్లు ఫెయిలైన స్కెచ్ నాలుగోసారి వర్కవుట్ అయింది..తన మనవరాలిని కులాంతర వివాహం చేసుకున్నఆ  కుర్రాడిని తన కళ్లముందే చంపాలనేది ఆ పెద్దావిడ కోరిక..నాయనమ్మ కోరిక తీర్చేందుకు నాయనమ్మ కళ్లల్లో ఆనందం చూడాలని ఆ మనవళ్లు ఇద్దరూ బావని అత్యంత క్రూరంగా చంపి నాయనమ్మకు డెడ్ బాడీని చూపించారు...నల్గొండ జిల్లాలో జరిగిందీ దారుణం.. 


తన చేతుల మీద ఆడించి పాడించిన మనవరాలు..వేరే కులానికి చెందినవాడిని ప్రేమించిందనే కారణంతో బంటీ అనే కుర్రాడిని అత్యంత దారుణంగా చంపించింది.. 

 ఇదిగో.. చంపాం చూడు’ అంటూ కార్లో మృతదేహాన్ని ఇంటికి తెచ్చి మరీ ఆ వృద్ధురాలికి చూపించారు ఆమె మనవళ్లు.. మృతదేహాన్ని చూశాక. శభాష్‌ రా...మనవళ్లూ అంటూ ఆ వృద్ధురాలు వారిని మెచ్చుకుంది.నా పరువు కాపాడారు మీరిద్దరూ అంటూ రక్తంతో తడిసిన తన మనవళ్ల చేతులు చూసి ఆ చేతుల్లో ఉన్న బంటీ రక్తాన్ని చూసి ఆనందంతో..నాట్యం చేసింది ..తన ఆఖరి కోరిక తీర్చినందుకు మనవళ్లని ముద్దాడింది..


తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్‌ మాల బంటి ... సూర్యాపేట మునిసిపల్‌ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన భార్గవి ప్రేమించుకున్నారు..మూడేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు కులాలు వేరు కావడంతో భార్గవి ఇంట్లోవారు వీరి ప్రేమను అంగీకరించలేదు.ఇంట్లోవారు పెళ్లికి అంగీకరించకపోవడంతో.. గతేడాది ఆగస్టు 7న నార్కెట్‌పల్లి మండలం గోపాలాయిపల్లి గుట్ట వద్ద లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో బంటి-భార్గవి కులాంతర వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన భార్గవి అన్న నవీన్, నాయనమ్మ బుచ్చమ్మ పగతో రగిలిపోయారు.. తమ మాట  కాదని వేరే కులానికి చెందిన వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావని భార్గవితో గొడవకు దిగారు.వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది.అయితే తాను మేజర్ ని అని..తన ఇష్టపూర్వకంగానే నవీన్ ను పెళ్లి చేసుకున్నాని భార్గవి చెప్పడంతో పోలీసులు ఆమె కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు..తర్వాత సూర్యాపేటలోని మామిళ్లగడ్డలోని తన అమ్మమ్మ పెరుమాళ్ల సాలమ్మ ఇంట్లో భార్గవితో కలిసి బంటి కాపురం పెట్టాడు.. అయితే తమ కళ్లముందే వేరు కాపురం పెట్టిన మనవరాలిని ఆమె భర్త బంటిని చూసి బుచ్చమ్మ పగతో రగిలిపోయింది.ఎలాగైనా సరే వాడిని చంపాలని మనవడు నవీన్ ని ఆదేశించింది.తన చివరి కోరిక తీర్చాలని కోరింది.. 

 

బంటీని హత్య చేయడానికి తన స్నేహితులు బైరు మహేశ్‌,వంశీ సాయాన్ని తీసుకున్ననవీన్ నాయనమ్మ బుచ్చమ్మతో కలిసి నవీన్ ను చంపడానికి స్కెచ్ వేశాడు... బంటి హత్యకు పథకం వేసిన నవీన్‌ మూడుసార్లు యత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో 26వ తేదీ సాయంత్రం ఐదింటికి బంటికి మహేశ్‌ ఫోన్‌చేసి పిలిపించుకున్నాడు. బంటి స్కూటీపైనే ఇద్దరూ కలిసి మహేశ్‌ పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే నవీన్‌ తన సోదరుడు వంశీతో కలిసి అక్కడి పరిసరాల్లో మాటు వేశారు. తిరిగి వెళ్దామంటూ బంటి స్కూటీ స్టాట్‌ చేయగా వెంటనే మహేశ్‌, నవీన్‌, వంశీ దాడికి పాల్పడ్డారు.ఐరన్ రాడ్లతో తీవ్రంగా కొట్టడంతో తీవ్ర గాయాలతో బపంటి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. నవీన్‌, మహేశ్‌, వంశీ కలిసి కారు డిక్కీలో మృతదేహాన్ని వేసుకున్నారు. నేరుగా.. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం పాతసూర్యాపేట గ్రామానికి వెళ్లి.. బంధువుల ఇంట్లో ఉన్న నవీన్‌ నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు. మృతదేహాన్ని చూసిన బుచ్చమ్మ శభాష్‌ అంటూ మనుమళ్లను అభినందించింది. చివరకు పిల్లలమర్రి శివారులో బంటి శవాన్ని పడేశారు. ఈ కేసుకు సంబంధించి భార్గవి సోదరులు నవీన్‌, వంశీ, తండ్రి సైదులు, నానమ్మ బుచ్చమ్మ, స్నేహితులు చరణ్‌, వంశీని అరెస్ట్ చేశారు


హత్య చేయించి..తర్వాత 65ఏళ్ల వయసులో అరెస్టైన తర్వాత కూడా బుచ్చమ్మ లో ఎలాంటి ప్రాశ్చాత్తాపం లేదు..భర్తని కోల్పోయి మనవరాలు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నప్పటికీ ఆమె మనసు కరగలేదు.. కులాంతర వివాహం చేసుకున్న తన మనవరాలికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అంటోంది...

Tuesday, January 28, 2025

Sunday, January 26, 2025

Saturday, January 11, 2025

Inspiration women

 Inspiration women


సామర్లకోటకు చెందిన శ్యామల హైదరాబాదులో స్థిరపడ్డారు. వ్యాపారంలో నష్టాలు రావటంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన సమయంలో బయటపడేందుకు ఈత నేర్చుకున్నారు. ఏదైనా సాధించాలంటే వయసుతో పనిలేదని నిరూపించారు గోలి శ్యామల.


ఆ ఈతే సాహసంగా మార్ఛుకున్నారు. గతంలో 47 ఏళ్ల వయసులో శ్రీలంక నుంచి రామసేతు వరకు..  గతేడాది మార్చిలో పాక్‌ జలసంధి 30 కి.మీ దూరాన్ని. లక్షద్వీప్ చానల్ లో ఈతకొట్టి  రికార్డులు సాధించారు. తాజాగా 52 ఏళ్ల వయసులో విశాఖ నుంచి కాకినాడకు 150 కిలోమీటర్లు సముద్రంలో ఈది రికార్డులకు ఎక్కారు.


విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు సముద్రాన్ని ఈదుతూ మొత్తం 150 కిలోమీటర్ల దూరాన్ని సముద్రంలో ఈదుతూ వచ్చారు శ్యామల. గతేడాది డిసెంబర్‌ 28న విశాఖపట్నం ఆర్కే బీచ్లో  మొదలు పెట్టిన ఈత 2025 జనవరి మూడో తేదీతో పూర్తైంది. రోజుకు 30 కిలోమీటర్లు లక్ష్యంగా పెట్టుకుని గోలీ శ్యామల ఈ రికార్డును పూర్తి చేశారు. యువత ఎంతో నేర్చుకోవాలి శ్యామల (52)గారి నుండి ..

Wednesday, January 8, 2025

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE